చూపు లేదేమో అతడికి కళ్లే చేతులుగా మారి జీవనాధారంగా మారాయి. స్పర్శ జ్ఞానం గొప్పదనాన్ని తెలియజేశాయి. దేవుడు కళ్లు ఇవ్వకపోయినా..ఆ దేవుడినే అందంగా మలచగల అద్భుత నైపుణ్యం అతడి సొంతం. అతడి చేతుల్లో రూపుదిద్దుకున్న శిల్పాల అందానికి ఎవ్వరైన మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఒక్కో ప్రతిమలో అతడిచేతి నైపుణ్యం, అలాగే కళ్లు లేకుండా విగ్రహాలకు మంచి ఆకృతిని అందిస్తున్న తీరు వంటివి చూస్తే..అతడికి అది దేవుడు ఇచ్చిన వరమా? అనిపిస్తుంది.
ఆ మహనీయుడే ఉత్తప్రదేశ్‌కి చెందిన రాంపాల్. 50 ఏళ్ల వ్యక్తి పుట్టుకతో అంధుడు. అయినా అతడి చేతులు అద్భుతం చేస్తాయి. వందల సంఖ్యల విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతాయి. అందుకోసం తన స్పర్శ జ్ఞానంపైనే ఆధారపడతాడు రాంపాల్. నిజానికి ఎంతలా విగ్రహం తయారు చేసినా..కరెక్ట్‌గా వచ్చిందో లేదో సరిచూసుకోవడానికైనా..కళ్లు ఉంటేనా సాధ్యం..కానీ అతడు తన వేళ్ల కొలతల స్పర్శతోనే ఇదంతా గ్రహించి..ఎక్కడ ఎలాంటి తేడా కానరాకుండా విగ్రహాలను మలచడంలో దిట్ట రాంపాల్. అంతేగాదు ఆయన కంటిచూపుతో పనిలేదన్నట్లుగా విగ్రహాలకు ఆకారం ఇచ్చే పనితనం ఎవ్వరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది.
ఎలా నేర్చుకున్నాడంటే..
ఉత్తరప్రదేశ్‌లోని కోల్‌కతాలోని శాంతిపూర్‌లోని నికుంజ్‌నగర్‌లో నివశిస్తుండేవాడు. అతనికి ముగ్గురు సోదరులు. వారంతా పుట్టుకతో అంధులు. తండ్రి వినయ్ కృష్ణపాల్ ఆశను వదులుకోకుండా కుమారులందరికి తమ జీవితాన్ని పోషించుకునేలా శిల్పాలు చెక్కడంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అలా రాంపాల్ నాలుగేల్ల వయసులోనే విగ్రహాలు తయారు చేయడం నేర్చుకున్నాడు.
ముందుగా వెదురుతో ప్రాథమిక చట్రాన్ని రూపొందించడం, మట్టిని పొరలుగా వేయడం, నిర్మాణానికి ఆకారం ఇవ్వడం వంటి క్లిష్టమైన ప్రక్రియను మొత్తం నేర్పించాడు. ఆ క్రమంలో తప్పులు దొర్లితే తండ్రి చేతిలో తిట్లు, దెబ్బులు తిన్నట్లు గుర్తుచేసుకున్నారు. కాలక్రమేణ ఇది సాధ్యమైందని, మొదట్లో తనకు కూడా అసాధ్యమనే అనిపించిందని అన్నారు. నిజానికి చూపు ఉన్న శిల్పికి విగ్రహం సమతుల్యంగా ఉందా లేదా సులభంగా తెలుసకోగలడు.
కానీ రాంపాలల్ అందుకోసం అతడి వేళ్లే కొలత సాధానాలుగా మారాయి. అంటే ఇక్కడ ఆయనకు స్పర్శే చూపుగా మారింది. ఈ కళను నేర్చుకోవడానికి రాంపాల్‌కి పదేళ్లు పట్టిందట. ఆయన మట్టిని తాకి సరైన మట్టిని గుర్తిస్తారట. అలాగే చట్రానికి మేకులు కొట్టేటప్పుడు గాయాలైన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అలా తాను పనిలో పరిపూర్ణత సాధించాక..మెరుగైన ఆదాయ అవకాశాలు లభించాయిన చెప్పారు. ఆ నేపథ్యంలోనే కోల్‌కతా నుంచి బస్తీకి వెళ్లాడు.
అలా ఆయన ఏడాదికి సుమారు 30 నుంచి 40 విగ్రహాలను తయారు చేస్తారట. దాదాపు రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు ఆర్జిస్తుంటారట. తన జీవిత కాలంలో దాదాపు 700కు పైగా విగ్రహాలను తయారు చేసినట్లు వెల్లడించారు. ఆయన భార్య కాంచనపాల్, కుమారుడు సౌరభ్, కోడలు కూడా ఈ పనిలో సహాయపడతారని చెబుతున్నాడు రాంపాల్. ప్రస్తుతం ఆయన పనికి విపరీతమైన డిమాండ్ ఉందని చెబుతున్నారు స్థానికులు.
పండుగకు చాలా నెలల ముందు నుంచే బుకింగ్‌లు వచ్చేస్తుంటాయట. ఈ ఏడాది సుమారు ఎనిమిది గణేశ్ విగ్రహాలను సిద్ధం చేశారట. వాటిలో చాలా వరకు అమ్ముడైపోయాయని అన్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే..ఆయన ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు బదులుగా పొలాల నుంచి సేకరించిన మట్టిని, మొక్కలు, పూలు, ఆకులు, పండ్లు, కూరగాయల నుంచి తయారు చేసిన సహజసిద్ధమైన రంగులనే ఉపయోగిస్తారట. ఇవి సులభంగా నీటిలో కరిగిపోతాయి..అలాగే పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని చెబుతుండటం విశేషం. ఇక్కడ రాంపాల్ తాను తయారు చేసే విగ్రహాలను చూడలేకపోవచ్చు కానీ దశాబ్దాలుగా మట్టితో చేస్తున్న ఆ చేతులకు తాము ఏమి సృష్టించాలో బాగా తెలుసు కదూ..!.
ఇదీ చదవండి: మనవరాలితో కలిసి గ్రాడ్యుయేషన్..! ఆ బామ్మ ఘనతకు ప్రపంచమే ఫిదా)


