నేర్చుకోవాలన్న జిజ్ఞాస ముందు వయసు అడ్డంకి కాదు పలువురు నిరూపించారు. ఎంతో మంది వయసు మళ్లాక చదివి చూపించారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే బామ్మ అత్యంత విభిన్నం. ఎందుకంటే ఆమె ఘనతకు యావత్తు ప్రపంచమే ఆశ్చర్యపోతూ..ఆ బామ్మను ఓ అద్భుతంగా కీర్తిస్తుంది.
ఆ బామ్మే అమెరికాకు చెందిన నోలా ఓక్స్ . ఆమె తన మనవరాల అలెగ్జాండ్రాతో కలసి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె మహామాంద్య సమయంలో కళాశాలలో చేరి డిగ్రిని ప్రారంభించి మధ్యలోనే వదిలేసింది. ఆ తర్వాత దశాబ్దాల కాలంపాటు బోధన, వ్యవసాయం, కుటుంబం వంటి బాధ్యతలతో మగ్గిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు తరగతి గదులకు వచ్చి..మధ్యలో వదిలేసిన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. అది కూడా 95 ఏళ వయసులో తిరిగి కశాలకు వెళ్లడం విశేషం.
ఆమె ఏప్రిల్ 19, 1930న ఫోర్ట్ హేస్ స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్లకు అదే కాలేజ్‌లో చేరి డిగ్రీని పూర్తి చేయాలని భావించడం విశేషం. ఆమె వెర్నన్ ఓక్స్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కాన్వాస్‌లోని గ్రామీణ పాఠశాల్లో బోధిస్తూ..ఓ పక్క కుటుంబం, వ్యవసాయాన్ని చూసుకుంటూ ఉండేది. ఆ నేపథ్యంలోనే చదువుకి విరామం ఇచ్చేసింది. అలా దశాబ్దాలు గడిచిపోయాయి.
భర్త మరణంతో ఓక్స్ తిరిగి చదవాలనుకుంది. అసంపూర్తిగా వదిలేని డిగ్రీని పూర్తి చేయాలని అదే కాలేజ్‌కి వచ్చింది. అయితే తరగతి గదులకు వెళ్తున్నప్పుడూ.. తన చుట్టూ ఉన్నవాళ్లంతా మనవళ్లు, మనవరాళ్ల వయసు ఉన్న వాళ్లే అయినా..దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదని అంటోంది. కేవలం డిగ్రిని పూర్తి చేయాలన్న లక్ష్యానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. అలా ఓక్స్ బామ్మ తన మనవరాలైన 21 ఏళ్ల అలెగ్జాండ్రాతో కలిసి ఒకేసారి బ్యాచిలర్ డిగ్రీని అందుకుందామె.
అంతేగాదు ఈ బామ్మ ఓక్స్‌నే ప్రపంచంలోనే అత్యంత వయసు పైబడిన కళాశాల గ్రాడ్యుయేట్‌గా నిలవడం విశేషం. అక్కడితో ఆమె నేర్చుకునే ప్రయాణం ముగిసిపోలేదు. 98 ఏళ్ల వయసులో ఫోర్ట్ హేస్ స్టేట్ యూనివర్సిటీ నుంచి లిబరల్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీని కూడాపూర్తి చేసింది. అలా ఆమె వందేళ్లు వచ్చే వరకు తరగతి గదులకు హాజరవుతూనే ఉంది. సుమారు ఏడేళ్లపాటు చదువుని కొనసాగిస్తూనే ఉంది.
ఆ తర్వాత తన వ్యవసాయ పనులకు తిరిగి వచ్చేసింది. అంతేగాదు కాలేజ్ హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికే ఇష్టపడింది. అలాగే వయసు రీత్యా పెద్దదాన్ని అని ప్రత్యేక సౌకర్యాలను కూడా కోరకుండా..కాలేజ్ నియమ నిబంధనలకు లోబడే చదువు సాగించడం విశేషం. ఇక ఓక్స్ 2016లో 105 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచింది. అంతేగాదు ఆమె పేరు అమెరికన్ ఉన్నత విద్యలోని అత్యంత అసాధారణ పట్టభ్రద్రుల జాబితాల్లో చోటు దక్కించుకుంది. నిజానికి 77 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని చవిచూసిన అనంతరం మధ్యలో వదిలేసిన డిగ్రీని తిరిగి పూర్తి చేసిన ఓ బామ్మ కథ ఇది.
ఇదీ చదవండి: కనుల కంటే ఎక్కువ విజన్..! ఎవరీ రజనీ గోపాలకృష్ణ)


