ఇథియోపియాలో ముగ్గురు గుజరాతీలు గల్లంతు?  | Three Gujaratis kidnapped in Ethiopia on the way to the US | Sakshi
Sakshi News home page

ఇథియోపియాలో  ముగ్గురు గుజరాతీలు గల్లంతు? 

Oct 1 2026 6:04 AM | Updated on Oct 1 2026 6:04 AM

Three Gujaratis kidnapped in Ethiopia on the way to the US

అక్రమంగా అమెరికా వెళ్లే ప్రయత్నం 

కిడ్నాప్‌ అంటున్న కుటుంబ సభ్యులు 

పోలీస్‌ కేసు నమోదు!

మెహసానా: అక్రమంగానైనా సరే.. అమెరికా వెళ్లాలనుకున్న ఆ ముగ్గురు గుజరాతీలకు ఎదురుదెబ్బ తగిలింది. కుటుంబాలతో కలిసి సెప్టెంబరు 20న గుజరాత్‌లోని మెహసానా నుంచి బయలుదేరిన వీరు రెండు రోజుల తరువాత ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలో గల్లంతయ్యారు. కిడ్నాప్‌నకు గురయ్యారని, విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ.కోటి డిమాండ్‌ చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్కరి కోసం ఏజెంట్లకు ఇప్పటికే రూ.75 లక్షల చొప్పున చెల్లించామని ఇక కిడ్నాపర్లకు ఇచ్చేందుకు మావద్ద చిల్లిగవ్వ కూడా లేదని వాపోతున్నారు. ఎలాగైనా సరే ఆ ముగ్గురిని స్వదేశానికి తిరిగి రప్పించాలని ప్రభుత్వాన్ని అభ్యరి్థస్తున్నారు.  

ఇథియోపియాలో సెప్టెంబరు 22వ తేదీ నుంచి గల్లంతైన వారిని రిత్విక్‌ జన్‌సారీ, మమతా చావ్డా, మయూరీలుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారు. మెహసానాలోని ఓ ఏజెంట్‌ ద్వారా అమెరికా వెళ్లాలని ప్లాన్‌ చేశారు వీరు. ఆ ఏజెంట్‌ వడోదరలో తనకు తెలిసిన మరో మధ్యవర్తికి బాధ్యతలు అప్పగించారు. అమెరికా చేర్చేందుకు ఒకొక్కరికి రూ.75 లక్షలు చెల్లించేట్లు ఒప్పందం కుదిరిందని మమత తండ్రి కిరీట్‌భాయ్‌ చౌహాన్‌ తెలిపారు. అయితే ఇథియోపియాకు చేరుకున్న తర్వాత వీరిని బందీలుగా ఉంచి, విడుదలకు రూ.కోటి డిమాండ్‌ చేశారని ఆరోపించారు. కిడ్నాపర్ల డిమాండ్‌ను రిత్విక్‌ తాత కనూభాయ్‌ జన్‌సారి కూడా ధ్రువీకరించారు. రూ.కోటి ‘విమోచన్‌’ సొమ్ములో రూ.60 లక్షలు చెల్లించామని కూడా చెప్పారు. మరిన్ని వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. 

ఈ ముగ్గురి గురించి పోలీసుల వద్ద మిస్సింగ్‌ కంప్లయింట్‌ నమోదైంది. మమత తండ్రి ఫిర్యాదు చేసినట్లు లాంఘ్‌నజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ.ఎం. గెహ్లోట్‌ తెలిపారు. మమత భర్త చిరాగ్‌ కుమార్‌ విద్యార్థి వీసాపై ఆరు నెలల క్రితం అమెరికాకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మమత వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను అక్రమ మార్గంలో అమెరికాకు పంపేందుకు మధ్యవర్తులను సంప్రదించారని ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. మమత, రుత్విక్, మయూరిలు ముగ్గురు సెపె్టంబర్‌ 20న బయలుదేరారని, సెపె్టంబర్‌ 22న కిరీట్‌భాయ్‌ తన కుమార్తె మమతతో మాట్లాడారని, ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదని ఇన్‌స్పెక్టర్‌ గెహ్లోట్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement