flydubai ఘటన : ప్రయాణీకురాలు చెప్పిన షాకింగ్‌ సంగతులు | Flydubai passenger reveals explosive details after midair horror | Sakshi
Sakshi News home page

flydubai ఘటన : ప్రయాణీకురాలు చెప్పిన షాకింగ్‌ సంగతులు

Sep 30 2026 7:23 PM | Updated on Sep 30 2026 7:35 PM

Flydubai passenger reveals explosive details after midair horror

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న 'ఫ్లై దుబాయ్' (flydubai) విమానంలో ఏర్పడిన గందరగోళ  పరిస్థితికి సంబంధించి  ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణీకులు సంచలన విషయాలను వెల్లడించారు.  విమానంలోని ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ,  గాలిలో  ఏర్పడిన సంక్షోభంమధ్య విమానంసురక్షితంగా ‍ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని వివరాలను  వారు అంతర్జాతీయమీడియాతో పంచుకున్నారు.

దుబాయ్ నుండి టెల్ అవీవ్‌ బయలుదేరిన విమానం జోర్డాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో  కాక్‌పిట్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. కో-పైలట్ ప్రధాన పైలట్‌పై దాడి చేసి, విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేయడానికి (సూసైడ్ అటాక్) ప్రయత్నించాడని ప్రయాణికురాలు మిర్యమ్ షిరా ఓహయాన్ ఏజెన్సీ (AFP)కి తెలిపారు. ఆ సమయంలో విమానం దాదాపు అదుపు తప్పిందని, కూలిపోయే ప్రమాదకర స్థితికి చేరుకుందని ఆమె పేర్కొన్నారు. కాక్‌పిట్‌లోకి వెళ్లిన మరో మహిళ అక్కడ విపరీతంగా రక్తపు మరకలు ఉన్నట్లు చూసిందని ఓహయాన్ తల్లి యాస్మిన్ అబుకాసిస్ తెలిపారు. 

తన తల్లి, యాస్మిన్ అబుకాసిస్, తన కుమార్తె 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడిలో మరణించిన తన సోదరుడి స్మారక సేవకు హాజరయ్యేందుకు ప్రయాణిస్తోందని చెప్పారు. ఆ ఘటనలో ప్రయాణికులు చనిపోతారని తన కుమార్తె భావించిందని అబుకాసిస్ తెలిపారు.
 

ఇదీ చదవండి: మీరట్ బ్లూ డ్రమ్ కేసు : కోర్టు సంచలన తీర్పు

కో-పైలట్ అటాక్ చేయడంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే స్పందించి, సాహసంతో అతన్ని కట్టడి చేయగలిగారు. ప్రయాణికుల సకాలంలో జోక్యంతో విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విమానంలో ఉన్న ఒక డాక్టర్, తోటి ప్రయాణికులు గాయపడిన పైలట్లకు, ఇతరులకు ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదు కానీ, విమానం కూలి పోతుందనే భయంతో అందరూ ఆందోళన చెందారు.

చివరికి సురక్షితంగా 
విమానంలో మరో ఇద్దరు పైలట్లు కూడా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘర్షణ నేపథ్యంలో  వారు వెంటనే అప్రమత్తమై విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని తబూక్‌కు సురక్షితంగా మళ్లించారు. దీంతో ప్రయాణికులంతా పైలట్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇదీ చదవండి: గజ గజ వణికిన ప్రయాణీకులు : ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో సంబరాలు, వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement