అరగంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టిన విమానం | Plane Circles in the Air for Over Half an Hour | Sakshi
Sakshi News home page

అరగంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టిన విమానం

Sep 21 2026 5:17 AM | Updated on Sep 21 2026 5:17 AM

Plane Circles in the Air for Over Half an Hour

సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురైలో అరగంటకు పైగా ఓ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌ సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. వంద మందితో ముంబై నుంచి మధురైకు ఆదివారం మధ్యాహ్నం విమానం బయలు దేరింది. ఇది 3.20 గంటలకు మధురై విమానాశ్రయంలో ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. అయితే ఆ సమయంలో హఠాత్తుగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.

 దీంతో విమానం ల్యాండింగ్‌కు పైలట్లు సాహసించలేదు. ఫలితంగా ఆ విమానం మధురై నుంచి విరుదునగర్‌ వైపుగా గాల్లో అరగంటకు పైగా చక్కర్లు కొట్టింది. కాసేపు ఒకే చోట విమానం ఆగినట్టుగా చూసిన ప్రజలు భయపడ్డారు. క్రమంగా గాలి తీవ్రత, వర్షం తగ్గుముఖం పట్టడంతో సాయంత్రం 4 గంటలకు పైలట్లు సురక్షితంగా ఆ విమానాన్ని ల్యాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement