క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

విద్యార్థి బలవన్మరణం వేడుకగా మేరీమాత ఊరేగింపు ఆర్‌పీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం కంటైనర్‌ ఢీకొని.. ●ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్‌ మృతి శ్రీవారి దర్శనానికి 8 గంటలు

అన్నానగర్‌: తిరువారూర్‌ జిల్లా తిరుతురైపూండిలోని రాయనల్లూర్‌ గ్రామానికి చెందిన నందకుమార్‌ (48) విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని కుమారుడు హరికిషోర్‌ (17) తిరుత్తురైపూండిలోని బన్ని అనే ఒక ప్రైవేట్‌ మెట్రిక్యులేషన్‌ పాఠశాలలో ప్లస్‌–2 తరగతి చదువుతున్నాడు. ఈ స్థితిలో, ఆదివారం అతను తన ఇంట్లోని పడకగదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను చూసిన కుటుంబ సభ్యులు తిరుత్తురైపూండి పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని హరికిషోర్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తిరుత్తురైపూండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి లత ఫిర్యాదు మేరకు తిరుత్తురైపూండి పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో, హరికిషోర్‌ ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది.పాఠశాల ప్రిన్సిపల్‌, కొంతమంది ఉపాధ్యాయులే తన ఆత్మహత్యకు కారణమని, తన తల్లిదండ్రులు తనను క్షమించాలని కోరుతూ అతను ఒక లేఖ రాశాడు. ఆ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

తిరువళ్లూరు: తిరువూరులోని మేరీమాత వేలాంగన్ని అమ్మవారి రథయాత్ర ఆదివారం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా తిరువూరులో వేలాంగన్నీ మాత ఆలయం వుంది. ఈ ఆలయంలో ఏటా రథోత్సవం నిర్వహ స్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది రధోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. రథోత్సవాన్ని పూందమల్లి ఎమ్మెల్యే కుట్టి ప్రకాఽశం, తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యా యుల సంఘం వ్యవస్తాపక అద్యక్షుడు అరుణన్‌ తదితరులు ప్రారంభించారు. స్తానిక చర్చి నుంచి ప్రారంభమైన రధోత్సవం దాదాపు 6 కి.మీ మేరకు సాగింది. వేడుకల్లో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకుడు హేమనాథ్‌ పర్యవేక్షించారు.

తిరువళ్లూరు: ఆర్‌పీఎఫ్‌ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌లో సహాకాయల పంపణీతో ఇతర కార్యక్రమాలను రైల్వే పోలీసులు నిర్వహించారు. ఆర్‌పీఎఫ్‌ ఏర్పాటు చేసి 41 ఏళ్లు పూర్తయిన క్రమంలో తిరువళ్లూరు ఆర్‌ఫీఎప్‌ ఆధ్వర్యంలో వేర్వేరు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం ఉదయం రైల్వేపోలీసుస్టేషన్‌లో పారిశుధ్య పనులు, సురక్ష సమ్మేళనం, సహపంక్తి భోజనంతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం బర్డ్స్‌ నెస్ట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నివాసితులకు ఆల్పాహారంతో పాటు మెడికల్‌ కిట్‌లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఇన్పెక్టర్‌ చిత్రదేవి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలసుబ్రమణ్యం, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్పెక్టర్‌ కమలనాఽథన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

అన్నానగర్‌: చైన్నెలోని మధురవోయల్‌ సమీపంలోని అలపాక్కం ప్రాంతానికి చెందిన వేదగిరి. ఇతని కుమారుడు దిలీప్‌ (32) డెలివరీ వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఇతను శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వానగరం సమీపంలోని పూందమల్లి హైవేపై మోటార్‌ సైకిల్‌ పై ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో, అటుగా వస్తున్న కంటైనర్‌ ట్రక్కు అనుకోకుండా అతివేగంగా దిలీప్‌ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్‌ మరణించాడు. ప్రమాదం జరిగిన తర్వాత ఆగకుండా పారిపోయిన కంటైనర్‌ డ్రైవర్‌ను పట్టుకోవడానికి, మధురవోయల్‌ ట్రాఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయకుమార్‌, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 83,589 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,828 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement