కొరుక్కుపేట: మనసున్న మంచి మనిషి ఆడిటర్ కల్య రఘుకుమార్ అని సంతాప సభలో పాల్గొన్న వక్తలు కొనియాడారు. తెలుగు బ్రాహ్మణ మహాసభ (టీబీఎం) మాజీ అధ్యక్షులు, శర్వాణి సంగీత సభ ట్రస్టీ, ప్రముఖ ఆడిటర్ కల్య రఘుకుమార్ ఇటీవల అకాల మరణం చెందారు. ఈ మేరకు తెలుగు బ్రాహ్మణ మహాసభ (టి బి ఎం), రఘుకుమార్ స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆధ్వర్యంలో చైన్నె జి ఎన్ శెట్టి రోడ్డు లోని ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యాలయంలో సంస్మరణ సభను ఆదివారం సాయంత్రం జరిగింది. కుటుంబ సభ్యుల తో కలిసి రఘుకుమార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముందుగా రఘుకుమార్ తో తనకు, టీబీఎం సంస్థతో ఉన్న అనుబంధంను తెలుగు బ్రాహ్మణ మహాసభ అధ్యక్షులు గోటేటి వెంకటేశ్వరరావు పంచుకుంటూ రఘుకుమార్ మరణం తీవ్రంగా బాధించిందన్నారు. టీబీఎం పూర్వ అధ్యక్షులు శంకరన్ మాట్లాడుతూ మానవతా విలువలు కలిగిన మహోన్నత వ్యక్తి రఘుకుమార్ అని ఆయన చిరస్మరనీయులని అన్నారు.అలాగే సాహితీ వేత్త గురుమూర్తి మాట్లాడుతూ రఘుకుమార్ తన చిన్ననాటి స్నేహితుడని వారితో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఇంకా వెంకట్రామన్, కేసరి మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య, ప్రముఖ ఆర్కిటెక్ట్ బీఎస్ మూర్తి, టీబీఎం సెక్రెటరీ బాలాజీ, ట్రెజరర్ జయరామన్, సభ్యులు అరకోణం బాలు రఘుకుమార్‌తో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలో రఘుకుమార్, సతీమణి లక్ష్మీ, కుమారుడు సుందర్, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


