రుణాల పంపిణీ సజావుగా సాగాలి | - | Sakshi
Sakshi News home page

రుణాల పంపిణీ సజావుగా సాగాలి

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

తిరువళ్లూరు: రైతులు సహా ఇతర ఖాతాదారులకు మంజూరు చేసే దీర్ఘకాలిక రుణాల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ప్రాథమిక సహకార వ్యవసాయ, గ్రామీణబివృద్ధి బ్యాంకు అదనపు రిజిస్ట్రార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కరన్‌ సూచించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి పరిదిలోని వ్యవసాయ సహకార బ్యాంకు, గ్రామీణభివృద్ధి బ్యాంకులను ఆయన అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో స్వయం ఉపాధి సంఘాలకు మంజూరు చేసిన రుణలు, రోడ్డుసైడ్‌ వ్యాపారులకు ఇచ్చిన రుణాలు, పొదుపు వివరాలను సేకరించడంతో పాటు బ్యాంకులోని రికార్డులను పరిశీలించారు. అనంతరం తిరువళ్లూరులోని జాయింట్‌ రిజిస్ట్రార్‌తో పాటు ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా భాస్కరన్‌ మాట్లాడుతూ ధీర్ఘకాలిక రుణాల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మంజూరు చేయాలని సూచించారు. తిరువళ్లూరు జాయింట్‌ రిజిస్ట్రార్‌ జయశ్రీ, డిప్యూటి రిజిస్టర్‌లు అముధ, ధనశేఖరన్‌, శివప్రకాశం ప్రత్యేక అధికారి మంగళదాస్‌ శాఖకు చెందిన అధికారులు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement