ముంబై: ముంబైలోని కోస్టల్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి వంతెన పైనుంచి కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముంబై పోలీసుల సమాచారం మేరకు.. మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వైపు కోస్టల్ రోడ్డు మీదుగా బీఎండబ్ల్యూ కారు అత్యంత వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో లాలా కాలేజీ ఎదురుగా, లోటస్ జెట్టీ సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి వంతెన పైనుంచి ఒక్కసారిగా కిందకు దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 5:20 గంటల ప్రాంతంలో కోస్టల్ రోడ్డు కంట్రోల్ రూమ్‌కు ఈ ప్రమాదంపై సమాచారం అందింది.
ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జవగా, ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించారు. మృతుల్లో 21 ఏళ్ల షనాయ్ గజ్జల్, 17 ఏళ్ల ధిర్యా సేఠ్‌తో పాటు 25 ఏళ్ల గుర్తుతెలియని యువకుడు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో 20 ఏళ్ల గుర్తుతెలియని యువకుడిని సమీపంలోని ఆసుపత్రిలోని ట్రామా వార్డుకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
VIDEO | Maharashtra: Early Sunday, two individuals including an eight-year-old girl—lost their lives and several others sustained injuries after being electrocuted near a Ganapati pandal in Mumbai's Lalbaug area.
Morning Visuals from Spot.
(Full video available on PTI Videos -… pic.twitter.com/sOe36jnlVl— Press Trust of India (@PTI_News) September 20, 2026
మరో ఘటనలో విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
ముంబైలోని కాలాచౌకీ ప్రాంతంలో ఆదివారం వేకువజామున మరో విషాదం చోటుచేసుకుంది. దత్తారామ్ లాడ్ మార్గ్‌లోని మహాగణపతి ఉత్సవ మండపం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక తాగునీటి స్టాల్‌లో విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలిక రాగిణి ఘనశ్యామ్ యాదవ్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ఇదీ చదవండి: వైష్ణోదేవి హెలిపాడ్‌లో మంటలు.. తప్పిన ముప్పు


