ముంబై: మహారాష్ట్రలోని ముంబైలోని అత్యంత ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా గణేష్ మండలికి ఉత్సవాలు ప్రారంభమైన మొదటి మూడు రోజుల్లోనే భక్తుల నుంచి నగదు, బంగారం, వెండి రూపంలో మొత్తం రూ.3.18 కోట్ల విలువైన విరాళాలు అందాయి. ట్రస్ట్ నిర్వాహకుల లెక్కల ప్రకారం, భక్తులు హుండీలో రూ.1.9 కోట్ల నగదుతో పాటు యూఎస్ డాలర్ల వంటి విదేశీ కరెన్సీని కూడా సమర్పించారు.
వీటితో పాటు రూ.98.9 లక్షల విలువైన 647.47 గ్రాముల బంగారం, రూ.30.35 లక్షల విలువైన 12,389 గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయి. విరాళాల్లో బంగారు గాజులు, గొలుసులు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా చెక్కిన వెండి పెన్నులు, వెండి క్రికెట్ బ్యాట్‌లు కూడా ఉన్నాయి. రోజువారీ సేకరణను పరిశీలిస్తే మొదటి రోజున రూ.48.5 లక్షల నగదు, 66.77 గ్రాముల బంగారం, 2,806 గ్రాముల వెండి లభించగా, రెండో రోజైన సెప్టెంబర్ 16న అత్యధికంగా రూ.88.9 లక్షల నగదు, 226.12 గ్రాముల బంగారం, 5,516 గ్రాముల వెండి సమకూరాయి.
In the first three days of Ganeshotsav, Mumbai’s iconic Lalbaugcha Raja Ganesh Mandal has received donations worth Rs 3.18 crore in cash, including US dollars, gold, and silver jewellery. 🔗https://t.co/cdXdGhEfS2 https://t.co/wCNQHvBzPy
— The Indian Express (@IndianExpress) September 18, 2026
ఇక మూడో రోజున రూ.53 లక్షల నగదు, 354.58 గ్రాముల బంగారం, 4,067 గ్రాముల వెండిని లెక్కించారు. రోజూ పూజాదికాలు ముగిసిన అనంతరం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విరాళాల మొత్తాన్ని బ్యాంకులో భద్రపరిచి, ట్రస్ట్ ద్వారా ఏడాది పొడవునా నిర్వహించే వివిధ సామాజిక సేవా, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
ఇదీ చదవండి: హైతీల గుప్పిట్లో ‘బాబ్ అల్ మందబ్’.. చిక్కుల్లో భారత్, చైనా!


