PC: Instagram
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇంట వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైలోని సచిన్ నివాసంలో అందమైన అలంకరణలో బుజ్జి గణేశుడు కొలువుదీరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘‘మోదకాలు, హారతి, నైవేద్యాలు, కుటుంబం, స్నేహితులు.. ఇంట్లో గణపతి బప్పా.. ఇంతకంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. అందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు’’ అంటూ సారా తాజాగా ఫొటోలు పంచుకుంది.

PC: Instagram
అంబానీ ఇంట పూజ
ఇదిలా ఉంటే... భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతుల ఇంట గణేశ్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముంబైలోని అంబానీల నివాసం యాంటిలియాలో కొలువుదీరిన గణనాథుని పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భార్య అంజలి, కుమార్తె సారా, కుమారుడు అర్జున్, కోడలు సానియాతో కలిసి సచిన్ అంబానీ నివాసానికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.

PC: Instagram
ఇక అంబానీ ఇంట పూజకు అంజలి, సారా, సానియా సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ముగ్గురూ చీరలు కట్టుకుని ముచ్చటగా కనిపించారు. కాగా అక్క సారా కంటే అర్జున్ ముందుగా పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ముంబైలోని ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సానియా చందోక్‌ను ఈ ఏడాది మార్చి 5న అర్జున్ వివాహమాడాడు. కాగా సానియా- సారా ప్రాణ స్నేహితులు.
ఇక సచిన్‌తో పాటు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ సతీమణులతో కలిసి అంబానీ ఇంట పూజకు విచ్చేశారు.
చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్... ఆస్తి విలువ ఎంతంటే?


