షమీతో కైఫ్ (PC: CAB X)
టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్ మహ్మద్ కైఫ్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని తనను మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...
దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. క్రికెటర్ షమీ సోదరుడు కైఫ్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న సదరు మహిళకు కైఫ్ మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
హోటల్‌కు రప్పించి
బలవంతం మీద ఆమెను సెప్టెంబరు 9, 2023న కోల్‌కతాలోని ఓ హోటల్‌కు రప్పించి శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని కోరగా.. ఆమెతో స్నేహాన్ని తెంచుకున్నాడు. ఈ మేరకు సదరు మహిళ ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని అర్షియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కైఫ్‌పై కేసు నమోదైందని రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
అన్న మాదిరే బెంగాల్‌కు ఆడుతూ..
కాగా అన్న షమీ మాదిరే కైఫ్ కూడా క్రికెటర్. ఉత్తరప్రదేశ్ వీరి సొంత రాష్ట్రం అయినప్పటికీ అన్న బాటలోనే దేశవాళీ క్రికెట్‌లో కైఫ్ బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్మద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీ టోర్నమెంట్లలో ఆడుతున్నాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటికి 40కి పైగా వికెట్లు తీశాడు.
ఇదిలా ఉంటే.. ఇంతకుముందు కూడా ఓ మహిళ కైఫ్‌పై ఇదే తరహాలో ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఆరోపించింది. అయితే, అధికారికంగా కేసు మాత్రం పెట్టలేదని సమాచారం. కాగా షమీపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
షమీపై కూడా గతంలో ఆరోపణలు
షమీ భార్య హసీన్ జహాన్ స్వయంగా తీవ్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కింది. అతడికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించడంతో పాటు ఫిక్సింగ్ చేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటి నుంచి విడిగా ఉంటున్న వీరు.. భరణానికి సంబంధించి తరచూ ఏదో ఒక అప్‌డేట్‌తో వార్తల్లో నిలుస్తున్నారు.
కాగా హసీన్ జహాన్ ఐపీఎల్‌లో చీర్ గర్ల్‌గా ఉన్న సమయంలో ఆమె ప్రేమలో పడ్డ షమీ.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అయితే, అప్పటికే హసీన్‌కు వివాహమై కూతురు కూడా ఉన్నట్లు సమాచారం. షమీ- హసీన్‌కు కూడా ఓ కుమార్తె జన్మించింది.
చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?


