గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’! | Woman Biker Hit Air Force Veteran Attacked: The Lawlessness In Gurugram | Sakshi
Sakshi News home page

గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’!

Sep 14 2026 12:38 PM | Updated on Sep 14 2026 2:26 PM

Woman Biker Hit Air Force Veteran Attacked: The Lawlessness In Gurugram

 సాక్షి, న్యూఢిల్లీ:  ఇన్‌ఫ్లుయెన్సర్, మహిళా బైకర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించి,  వెంటాడి, వేధించి కారుతో ఢికొట్టి పరారైన ఘటన కలకలం రేపింది.   గురుగ్రామ్‌  రోడ్లపై తన కెదురైప భయానక అనుభవాన్ని  సోషల్ మీడియా  షేర్‌ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. 'rebelwheels_sia_' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తున్న సియా అనే మహిళ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసి, తన ఆవేదనను వివరించారు.

మరోవైపు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి కావడంతో మండిపడుతున్నారు. జాతీయ రాజధానికి సమీపంలో హర్యానాలోని 'మిలీనియం సిటీ' గురుగ్రామ్ రోడ్లపై, ఇన్‌స్టాగ్రామ్‌లోని మీమ్స్‌లో చెప్పినట్లుగా, కొంతకాలంగా "అయితే నా మాటే లేదంటే థార్ మాటే చెల్లుతుంది" అన్నట్లుగా ఉందీ అంటున్నారు నెటిజన్లు. 

నిన్న పార్కింగ్ సిబ్బంది అనుచితం ప్రవర్తనతో 1999 కార్గిల్ యుద్ధ వీరుడు, రిటైర్డ్  గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తా చేదు అనుభవం ఎదురైంది. పోలీసు ఫిర్యాదు ప్రకారం, ఆకాశహర్మ్యాల మధ్య ఉన్న ఒక రెస్టారెంట్‌కు కుటుంబంతో కలిసి  డిన్నర్‌ వెళ్లారు.  ఈయన సమయంలో భారత వైమానిక దళం యొక్క ఆపరేషన్ సఫేద్ సాగర్ బృందంలో భాగంగా ఉన్నారు.

అతను తన కుటుంబాన్ని దింపి, స్వయంగా కారు పార్క్‌ చేస్తున్న సందర్భంలో వివాదం చోటు చేసుకుంది. పార్కింగ్ సిబ్బంది అతన్ని వాలెట్ స్టాండ్ నుండి ఒక బేస్‌మెంట్‌కు, ఆపై బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలానికి పంపారు. తీరా అక్కడ కారును అసలు పార్క్ చేయడానికి నిరాకరించారు. దీంతో అతను కారును రివర్స్ చే స్తుండగా  అక్కడి సిబ్బంది ఒకడు  విండ్‌షీల్డ్‌ను  పగలగొట్టడంతోపాటు, అతన్ని ఇనుప రాడ్‌తో కొట్టి చంపేస్తానని బెదిరించాడు.

భద్రతా సిబ్బంది ఎవరూ జోక్యం చేసుకోలేదని, పోలీసు బృందం తన వద్దకు చేరుకోవడానికి అరగంటకు పైగా పట్టిందని గుప్తా ఆరోపించారు. పార్కింగ్ ఏర్పాటు చేయడానికి జీతం తీసుకునే భద్రతా సిబ్బంది కాకుండా, ఒక రెస్టారెంట్ చెఫ్ చివరకు జోక్యం చేసుకున్నారని అతను చెప్పాడు. దీంతో మోచేయి విరగడంతో పాటు, ప్రమాదం నుండి బయటపడటానికి  తలకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

ఇక రెండో ఘటనలో 
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో సియా తెలిపిన వివరాల ప్రకారం, గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆమె తన బైకింగ్ గ్రూప్ సభ్యులతో కలిసి అప్రిలియా ఆర్‌ఎస్ 457 (Aprilia RS 457) స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

తన రైడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఒక కారులోని వ్యక్తులు తనను వెంబడించడానికి ప్రయత్నించారు. పలుమార్లు బైక్‌కు దగ్గరగా, అడ్డుగా రావడం వంటి దూకుడు చేష్టలతో  వేధింంచారు.  దీంతో విసుగొచ్చిన ఆమె తన బైక్‌కు డిస్టెన్స్‌పాటించాలని కోరింది.  దీంతో మద్యం సేవించి ఉన్న కారులోని వ్యక్తులు మరింత  రెచ్చిపోయారు.  బైక్‌ ఆపాలని బెదిరింపులు పాల్పడ్డారు.    వెంబడించి తన బైక్‌ను ఢీకొట్టి అక్కడి నుంచి  ఉడాయించరాఉ. ఆ ధాటికి ఆమె బైక్ పైనుంచి ఎగిరిపడింది. దీంతో రోడ్డుపై కొన్ని మీటర్ల దూరం ఆమెను  ఈడ్చుకెళ్లింది..ఈ ఘటన మొత్తం సియా మోటార్‌సైకిల్‌పైఅమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది.

నెటిజన్ల ఆగ్రహం - చర్యలకు డిమాండ్
ఈ రెండు ఘటనలపై సోషల్ మీడియా వినియోగదారులు మండిపడ్డతున్నారు. నగరంలో రోడ్డు భద్రత, ర్యాష్ డ్రైవింగ్ తీరుపై కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ పోలీసులు, గురుగ్రామ్ పోలీసులు, గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు, హర్యానా పోలీసులను ట్యాగ్ చేస్తూ బాధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మహిళా డ్రైవర్‌ ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement