వికారాబాదు జిల్లా: వినాయక చవితి పండుగ సందర్భంగా మూడ్రోజుల పాటు సెలవులు ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు గొడవ పడ్డారు. ఓ మహిళపై మరో ముగ్గురు మహిళలు దాడి చేశారు. జుట్టు పట్టుకొని లాగి కొట్టారు.
దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పండుగ నేపథ్యంలో రద్దీ ఉంటుందని తెలిసినా ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పరిగి డీఎం ఇసాస్‌ను వివరణ కోరగా గొడవ జరిగింది తమ డిపోకు చెందిన బస్సులో కాదని, ఘటన పరిగి పరిధిలో జరగలేదని తెలిపారు.
ఫ్రీ బస్సులో సీట్ల కోసం లొల్లి
పరిగి నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు pic.twitter.com/hxbzeT19Td— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026
ఇదీ చదవండి: దారుణం.. ఆర్టీసీ బస్సు మీద నుంచి పోవడంతో


