గురుగ్రామ్‌లో ఒక మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి, పారిపోయిన ఘటన, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కారు నంబరుతో సహా బాధితురాలు షేర్ చేయడంతో కారు యజమాని మీడియా ద్వారా స్పందించారు. దీంతో ఆయన ప్రకటన కీలకంగా మారింది.
వాహనాన్నిఎవరు నడిపారనే దానిపై కారు యజమాని మనీష్ స్పష్టత ఇచ్చారు. కారు తనదేనని యజమాని అంగీకరించినప్పటికీ, ఈ ప్రమాద ఘటనలో తన పాత్ర ఏమీ లేదన్నారు. తాను ఆర్మీ ఉద్యోగినని, ప్రస్తుతం తాను విధి నిర్వహణలో భాగంగా అస్సాంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తన స్నేహితుడు కళ్యాణ్ కారు నడిపినట్టు వెల్లడించారు. తన స్నేహితుడు తన కుటుంబం నుండి కారును తీసుకున్నాడని తెలిపారు.
ఇదీ చదవండి: గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’!
సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే తనకు ఈ ఘటన గురించి తెలిసిందని ఆయన చెప్పారు. తన స్నేహితుడు కళ్యాణ్ సింగ్ రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లాలని చెప్పి కారును తీసుకున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే తాను తన స్నేహితుడికి ఫోన్ చేశానని, కానీ అతను ఫోన్ తీయలేదని మనీష్ చెప్పారు.. తన తండ్రిని, ఇతరులను కూడా అతని ఇంటికి పంపించానని, కళ్యాణ్ సింగ్ హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందినవాడని కూడా కూడా చెప్పారు.
కాగా 'మారుతి సుజుకి సియాజ్' (Maruti Suzuki Ciaz), దీని రిజిస్ట్రేషన్ నంబర్ HR30Y4949. ఇది హర్యానాలోని పల్వాల్ నివాసిమనీష్ పేరు మీద నమోదై ఉంది.


