న్యూఢిల్లీ: ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు కిషోర్ కుమార్ ఆలపించిన సూపర్ హిట్ హిందీ సాంగ్ ‘ఖ్వాబ్ హో తుమ్ యా కోయి హఖీకత్’ను మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆలపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన గాన మాధుర్యాన్ని జనం ప్రశంసిస్తున్నారు.
1960వ దశకంలోని తీన్ దేవియా(దేవ్ ఆనంద్ నటించిన చిత్రం)లోని ఈ పాటను పాడుతున్న వీడియోను అన్వర్ ఇబ్రహీం శనివారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. బూడిద రంగు సూట్ ధరించి, మరొకరు వాయిస్తున్న పియానో సంగీతానికి అనుగుణంగా ఆయన ఈ పాటను చక్కగా ఆలపించారు. ఈ వీడియోకు తక్కువ సమయంలోనే పది లక్షలకు పైగా వీక్షణలు లభించాయి. నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోను కచ్చితంగా ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియరాలేదు.
#WATCH | Delhi: Malaysia’s Prime Minister Anwar Ibrahim sings a popular Hindi song “Khwab Ho Tum Ya Koi Haqeeqat” in Delhi.
(Video source: Anwar Ibrahim/X)#BRICSSummit pic.twitter.com/E8RE9erfie— ANI (@ANI) September 12, 2026
భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అన్వర్ ఇబ్రహీం హాజరయ్యారు. ఢిల్లీలోని ఒక హోటల్‌లో ఆయన బస చేసిన సమయంలో ఈ వీడియో చిత్రీకరించబడినట్లు కనిపిస్తోందని జర్నలిస్టులు అంటున్నారు. ప్రఖ్యాత గాయకులు లతా మంగేష్కర్, కిషోర్ కుమార్‌లకు తాను పెద్ద అభిమానినని అన్వర్ ఇబ్రహీం గతంలో చెప్పారు.
ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన


