ఉక్రెయిన్‌లో రైలుపై రష్యా డ్రోన్ దాడి జరిగింది. స్టేషన్‌లో రైలు ఇంజిన్‌ను డ్రోన్ ఢీకొట్టింది. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వెళ్లిన కాసేపటికే ఈ దాడి జరిగింది. పోలాండ్ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగింది. జాన్సన్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న జాన్సన్ ప్రత్యేక రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో డ్రోన్ దాడికి రష్యా పాల్పడింది.
వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును ఆపి.. ప్రయాణికులను దించేశారు. జాన్సన్, అగ్రశ్రేణి యూరోపియన్ భద్రతా అధికారులు ఆ మార్గం గుండా వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. యహోదిన్ స్టేషన్ వద్ద జరిగిన ఈ దాడిలో రైలు ఇంజిన్ దెబ్బతిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణీకులందరినీ ముందే సురక్షితంగా బయటకు తరలించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
కీవ్‌లో జరిగిన సదస్సు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో.. బోరిస్ జాన్సన్‌తో పాటు బ్రిటన్‌కు చెందిన జోనాథన్ పావెల్ తదితర యూరోపియన్ జాతీయ భద్రతా సలహాదారులు వేరే రైలులో ఇదే మార్గంలో ప్రయాణించారు. పశ్చిమ ఉక్రెయిన్‌లోని రైల్వే మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు రష్యా ప్రకటించింది.
ఇదీ చదవండి: హర్ముజ్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్.. అనూహ్య పరిణామాలు!


