రష్యా డీజిల్‌ వనరులపై దాడులు ఆపండి  | Donald Trump tells Ukraine to stop targeting Russia diesel fuel | Sakshi
Sakshi News home page

రష్యా డీజిల్‌ వనరులపై దాడులు ఆపండి 

Sep 14 2026 5:44 AM | Updated on Sep 14 2026 5:44 AM

Donald Trump tells Ukraine to stop targeting Russia diesel fuel

ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హితవు 

కీవ్‌: రష్యాలోని డీజిల్‌ వనరులపై డ్రోన్‌ దాడులను వెంటనే ఆపాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం వెల్లడించారు. ఉక్రెయిన్‌ దీర్ఘ శ్రేణి డ్రోన్‌ దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్‌ కొరత తీవ్రరూపం దాల్చిందని చెప్పారు. రష్యాలోని డీజిల్‌ ఇంధన మౌలిక వనరులను వదిలేసి, ఇతర లక్ష్యాలపై దాడులు చేసుకోవచ్చని చెప్పానన్నారు. ఈ ఒక్క పని చేయాలని జెలెన్‌స్కీని కోరినట్లు వెల్లడించారు. 

ప్రపంచంలోనే చమురు, గ్యాస్‌ అతిపెద్ద ఎగుమతిదారైన రష్యా, ఇప్పుడు ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడుల కారణంగా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఇంధన రేషనింగ్‌ను అమలు చేస్తోంది. భారత్‌ నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. పశి్చమాసియాలో పరిణామాలతో ఇప్పటికే ఇంధన వనరుల సరఫరాకు తీవ్ర విఘాతం కలగడం, ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఆదివారం ఈ విషయం వెల్లడించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement