ఐర్లాండ్‌లు విలీనమైతే అద్భుతమవుతుందని వ్యాఖ్య
జరిగి తీరుతుందన్న అమెరికా అధ్యక్షుడు
ఐర్లాండ్ ప్రధాని, అధ్యక్షులతో వేర్వేరుగా చర్చలు
డబ్లిన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. ఐర్లాండ్, ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో భాగంగా ఉన్న నార్తర్న్ ఐర్లాండ్‌లు విలీనమై ఒక్కటైతే బాగుంటుందని వ్యాఖ్యానించి శతాబ్ధకాలం నాటి వివాదానికి ఆజ్యం పోశారు. ఐర్లాండ్ తీరంలోని డూన్‌బెగ్‌లో ఉన్న తన గోల్ఫ్‌కో ర్సును సందర్శించిన ట్రంప్ శనివారం ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఆ దేశ ప్రధాని మేకేల్ మార్టిన్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ‘‘ఏ రకమైన సమస్య సృష్టించే ఉద్దేశం లేదు కానీ.. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, యూకేకు చెందిన నార్తర్న్ ఐర్లాండ్ కలిసిపోతే చూడాలని ఉంది. ఏదో ఒక రోజు ఇది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు కూడా సాధ్యం కావచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఐర్లాండ్‌ల ఏకత అద్భు తంగా ఉంటుందని, ఈ విషయంపై సహజంగానే యూకే ఏదో ఒకటి చెబుతుంది అని విమర్శించారు.
నార్తర్న్ ఐర్లాండ్‌కు సంబంధించి బ్రిటన్‌లో దశాబ్దాల కాలం ఉద్య మాలు, హింస చెలరేగిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నార్తర్న్ ఐర్లాండ్ యూకేతో కలిసి ఉండాలని ఒక వర్గం, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో కలిసిపోవాలని ఇంకోవర్గం మధ్య జరిగిన ఈ పోరులో సుమారు 3600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగానే అమెరికా పూర్వపు అధ్యక్షులు ఎవరూ సున్ని తమైన ఐర్లాండ్ అంశంపై ఏ రకమై వ్యాఖ్యా చేసే వారు కాదు.
మాజీ అధ్యక్షుడు జో బైడె న్ తల్లివైపు వారు ఐర్లాండ్ వారు అయినప్ప టికీ, ‘ఐరిష్– అమెరికన్’ను నేనని ఆయన స్వయంగా చెప్పుకున్నా ఐ ర్లాండ్‌ల ఏకీకరణ విషయంలో ఆయన పల్లెత్తు మాట అనకపోవడం గమ నా ర్హం. సుమారు వందేళ్ల క్రితం బ్రిటన్ పెత్త నం నుంచి బయటపడుతూ ఐర్లాండ్ రోమ న్ కేథలిక్‌లు ఎక్కువగా ఉన్న స్వతంత్ర దేశంగా అవతరిస్తే... ప్రొటె స్టెంట్లు ఎక్కువగా ఉన్న ఆరు కౌంటీ ప్రాంతాలు యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే ఉండిపోయాయి. నార్తర్న్ ఐర్లాండ్‌లోని రెండు వర్గాల మధ్య 30 ఏళ్లపాటు హింస, సాయుధ పోరు నడిచింది. చివరకు 1998లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం ఒకటి కుదిరింది.
ఐర్లాండ్ అధ్యక్షుడితోనూ మంతనాలు
ట్రంప్ తన గోల్ఫ్ కోర్సు సందర్శన సందర్భంలోనే శని వా రం ఐర్లాండ్ అధ్యక్షులు కేథరీన్ కనోలీతోనూ సమావేశమ య్యా రు. డబ్లిన్‌లోని అమెరికా దౌత్యవేత్త అధికార నివాసంలో ఇరుదే శాల వాణిజ్యవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు కూడా. ఆ తరువాత గోల్ఫ్ కోర్సులో జరగనున్న ఐరిష్ ఓపెన్ టోర్నీ ని వీక్షించనున్నారు. 2019లో ట్రంప్ ఐర్లాండ్‌ను సందర్శించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో కేథరీన్ ఒకరు. ఆ తరువాత అధ్య క్షులుగా ఎన్నికయ్యారు. పాలస్తీనాకు మద్దతుగా నిలిచే వామపక్ష భావాలున్న వ్యక్తి. మధ్యప్రాచ్యంలో అమెరికా వైఖ రిని తప్పు పట్టి.. ట్రంప్ ఒక పెత్తందారీ పోకడలు కలిగిన వ్యక్తి అని కూడా విమర్శించారు.
అటువంటి కేథరీన్ తాజాగా తన అధికార నివా సంలో ట్రంప్‌కు స్వాగతం పలడకం గమనార్హం. వీరిద్దరూ శనివారం కొద్దిసేపు రహస్యంగా మంతనాలు జరిపారు కూడా. ఇదిలా ఉంటే.. ట్రంప్ రాకను డబ్లిన్ వాసులు కొందరు వ్యతిరేకించారు. నగరంలోని ఫీనిక్స్ పార్క్‌లో ట్రంప్, కేథరీన్‌ల సమావేశం సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంపై నగరవా సులు అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచం అతలాకు తలమవుతూంటే ట్రంప్ గోల్ఫ్ అడుతున్నాడు అని క్రిస్టోఫర్ ఫాక్స్ అనే ట్యాక్సీ డ్రైవర్ విమర్శించారు. మహిళలు, వలసదారులు, మైనార్టీలపై ట్రంప్ వైఖరి గర్హనీయమని ఓ విద్యార్థి వ్యాఖ్యానించారు.


