breaking news
Northern Ireland
-
కోరలు చాస్తున్న కొత్త రకం
లండన్/నైరోబీ/బీజింగ్: యునైటెడ్ కింగ్డమ్లో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త రకం(వేరియంట్) క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఉత్తర ఐర్లాండ్, ఇజ్రాయెల్‌లో ఈ కొత్త రకం కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇటీవలే యూకే నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. ఆఫ్రికా దేశమైన నైజీరియాలోనూ కరోనా కొత్త వేరియంట్ (పీ681హెచ్) ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే, దీని ప్రభావం, వ్యాప్తిపై మరింత అధ్యయనం అవసరమని నైజీరియా ప్రభుత్వం తెలిపింది. ఈ వేరియంట్ తొలుత దక్షిణాఫ్రికాలో పుట్టి, యూకేలోకి ప్రవేశించిందన్న వాదన వినిపిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను యూకే రద్దు చేసింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి పెరుగుతుండడంతో దాదాపు 40 దేశాలు యూకే నుంచి ప్రయాణాలను నిలిపివేశాయి. ఈ జాబితాలో తాజాగా చైనా, బ్రెజిల్ కూడా చేరాయి. ఎప్పటి నుంచి విమానాలు రద్దు చేస్తారన్న సమాచారాన్ని చైనా బయటపెట్టలేదు. నాన్–చైనీస్ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నవారు యూకే నుంచి తమ దేశంలోకి రాకుండా చైనా నవంబర్ నుంచే నిషేధం అమలు చేస్తోంది. కొత్త రకమైనా టీకాలు పనిచేస్తాయి కరోనా వైరస్‌లో ఎన్ని మార్పులు జరిగినా.. టb వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటుందని భావిస్తున్నట్లు మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా తమ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని వెల్లడింరాయి. కొత్త వేరియంట్ భయానకం యూకేను బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త రకం వేరియంట్‌తో మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా మారనుందని ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రోపికల్ మెడిసిన్’కు చెందిన సెంటర్ ఫర్ మ్యాథమెటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ కొత్త రకం వల్ల ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య, మరణాల రేటు వచ్చే ఏడాది భారీగా పెరుగుతుందని తెలియజేసింది. ఈ వేరియంట్ 56 శాతం అధిక వేగంతో వ్యాప్తి చెందుతుందని తెలిపింది. దీనిని అరికట్టడానికి కఠిన చర్యలు చేపట్టాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పేర్కొంది. వారానికి కనీసం 20 లక్షల మందికి టీకా అందజేయాలని కోరింది. -
అందరూ చస్తారు: ప్రయాణికురాలి హల్చల్
లండన్: కరోనా కాలంలో మాస్కు ధరించడం తప్పనిసరిగా మారింది. పొరపాటున మాస్కు లేకుండా బస్సెక్కామనుకోండి. ఎన్నడూ చూడని కళ్లు మనల్ని శత్రవులా కన్నెర్ర చేసి చూస్తాయి. దీంతో ముఖాన్ని కవర్ చేసుకోలేక పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇక్కడో మహిళ మాత్రం మాస్కు లేకుండానే విమానమెక్కేసింది. అంతేనా.. కావాలని గట్టిగా అరుస్తూ దగ్గుతూ అందరూ చస్తారు అంటూ శాపనార్థాలు పెట్టింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నుంచి స్కాట్లాండ్లోని ఈడిన్‌బర్గ్ వెళ్లడానికి సిద్ధమైన ఈజీజెట్ విమానంలో చోటు చేసుకుంది. ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఓ మహిళ మాస్కు లేకుండానే ఎక్కగా సిబ్బంది ఆమెను దిగిపోవాలని సూచించినట్లున్నారు. దీంతో కోపం నషాళానికంటిన సదరు మహిళ తోటి ప్రయాణికులపై తన ప్రతాపాన్ని చూపించింది. వాళ్ల ముఖాల్లోకి తొంగి చూస్తూ కావాలని దగ్గింది. (చదవండి: నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో) "అందరూ చస్తారు, అది కరోనానే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రతిఒక్కరూ చచ్చిపోతారు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది" అని పదే పదే అరిచింది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను విమానం దిగిపోవాలని సూచించగా మళ్లీ మళ్లీ అదే శాపనార్థాలు పెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'ఎంతో కష్టపడి టికెట్ రిజర్వేషన్ చేయించుకుని, విమానాశ్రయంలో చాలాసేపు పడిగాపులు కాసి, తర్వాత లైనులో నిలబడి, లగేజ్ అంతా ఎక్కించేసి, చివరాఖరకు లోపలకు వెళ్లి కూర్చుంటే కేవలం మాస్కు లేదన్న కారణంతో ఆమెను గెంటేస్తారా?' అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వాళ్లను కేవలం విమానంలో నుంచి వెళ్లగొడితే సరిపోదు, అరెస్టు చేయాలని కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: సెకన్లలో ప్లేట్ ఖాళీ.. రికార్డుకెక్కింది..) A rare, Shakespearean tragedy Karen, coughing and yelling “everybody dies!” pic.twitter.com/uICdy0z2QJ — Sarah Cooper (@sarahcpr) October 19, 2020 -
యూకే అంటే ఓకే...
చక్కని ప్లానింగ్ ఉంటే విదేశీ విద్య సాధ్యమే యూకేలో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు డిగ్రీ, పీజీల్లో వైవిధ్యకోర్సులు విదేశాలలో ఉన్నత విద్య అంటే.... ప్రమాణాలతో కూడిన ప్రత్యక్ష శిక్షణ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా బోధన.. మధ్యతరగతి విద్యార్థులు సైతం చేరుకునే విధంగా కోర్సుల ఫీజులు. పైగా భారతీయ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్న విదేశీ విశ్వవిద్యాలయాలు. ఇదీ మన విద్యార్థులకు కలసి వస్తున్న అంశాలు. అందుకే చక్కని ప్లానింగ్ ఉంటే తక్కువ ఖర్చుతోనే ఉన్నత విద్యను పూర్తిచేయడం సాధ్యపడుతుందంటున్నారు నిపుణులు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి వచ్చిన పెర్త్ వర్సిటీ బృందం ప్రత్యేకంగా ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించి పలు అంశాలను వివరించింది. యూకేలో ఉన్నత విద్యావకాశాలపై ప్రత్యేక కథనం.... 120 వర్సిటీలు... ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తన్ ఐర్లాండ్ ఈ నాలుగు కంట్రీస్‌ని యునెటైడ్ కింగ్డమ్గా పరిగణిస్తారు. ఇక్కడ మొత్తం 120 వరకు వర్సిటీలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి సెయింట్ ఆండ్రోస్, ఎడిన్బర్గ్, గ్లాగోవ్, అబెడిన్ వర్సిటీలు ప్రధానమైనవి. ప్రభుత్వ పర్యవేక్షణలోనే వర్సిటీలు నిర్వహిస్తారు. ఇంగ్లాండ్ విద్యావిధానం శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. స్కాంట్లాండ్ విద్యావిధానాన్ని ప్రపంచదేశాలు అనుసరించడం జరుగుతోంది. ఇక్కడ కేవలం 17 వర్సిటీలే ఉన్నప్పటికీ ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. రాజకుటుంబ వారసులు స్కాట్లాండ్లోని వర్సిటీలలో విద్యాభ్యాసం చేస్తారు. ఐదారు వందల సంవత్సరాల పూర్వం ఏర్పడిన వర్సిటీలు నేటికీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. కాలానుగుణంగా కోర్సులు... ఇంజినీరింగ్ అనేది అన్ని దేశాల్లో ప్రాధాన్యం కలిగిన కోర్సు. దీనితో పాటు కాలానుగుణంగా కోర్సులలో మార్పులు వస్తున్నాయి. ఆర్ట్స్ సైన్స్‌ల సమ్మేళనంలో సైతం కోర్సులు అందించడం జరుగుతుంది. గోల్ఫ్ మేనేజ్మెంట్, ఎయిర్‌పోర్టుల నిర్వహణకు ఉపకరించే ఎంబీ ఏ ఏవియేషన్ వంటి కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లండ్‌లో గోల్ఫ్ ప్రధాన క్రీడగా ఉంటోంది. దీని నిర్వహణ తది తర అంశాలతో ఈ కోర్సును అందిస్తారు. విద్యార్థి ఆసక్తి, ఉపాధి అవకాశాలు ఆధారంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి కేంద్రంగా బోధన... ఇక్కడి విద్యావిధానం అంతా విద్యార్థి కేంద్రంగా ఉంటుంది. ప్రత్యక్షంగా విద్యార్థులు అనేక విషయాలు అన్వేషించి అధ్యయనం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వర్సిటీ ఆచార్యులు సంబంధిత అంశాలలో ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించి, మార్గదర్శకంగా నిలుస్తారు. విద్యార్థులకు అవసరమైన సలహాలు అందిస్తూ వారిని స్వీయ అభ్యాసకులుగా తీర్చిదిద్దుతారు. వెబ్సైట్లో సీట్ల వివరాలు యూకేలో ప్రతి సంవత్సరం వివిధ సంస్థలలో ఉండే ఖాళీల వివరాలను యూకేబిఏ వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఖాళీలకు అనుగుణంగా విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కోర్సు పూర్తిచేసిన తరువాత విద్యార్థి సంబంధిత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పొందే అవకాశం ఉంది. నేర్చుకోవాలనే తపన ఉండాలి... విద్యార్థులు తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. స్వతంత్రంగా నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి. సహనం ఉండాలి. కేవలం సంపాదన కోసం చదువుతున్నామనే భావన సరికాదు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రపంచం ఎల్లవేళలా అవకాశాలు అందిస్తుంది. గోల్ఫ్ మేనేజ్మెంట్, ఫారెస్ట్రీ, ఎనర్జీ ఇంజినీరింగ్ వంటి కోర్సులు నేడు విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాయి. సరిగ్గా ప్లానింగ్ చేసుకుంటే యూకేలో ఉన్నత విద్య అంత కష్టమైన విషయం కాదు. - హితేంద్ర చీటిరాల, అసిస్టెంట్ డెరైక్టర్ ఇంటర్నేషనల్, యూహెచ్ఐ పెర్త్ కళాశాల ఏయూతో కలసి పనిచేస్తాం ఆంధ్ర విశ్వవిద్యాలయంతో బి.ఏ టూరిజం, హాస్పటాలిటీ మేనేజ్మెంట్ కోర్సుపై చర్చిస్తున్నాం. ఒక ఏడాది భారత్‌లోను. మిగిలిన కోర్సు పెర్త్ కళాశాలలో పూర్తి చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 2014 నుంచి కోర్సును ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. అదే విధంగా ఎంబీఏ ఏవియేషన్‌పై కూడా వర్సిటీ అధికారులతో చర్చిండం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కోర్సులను ప్రారంభించే అవకాశం ఉంది. - డాన్ హాడ్కిన్సన్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఏటా 40 వేల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం యూకేకు భారత్‌నుంచి 40 వేలమంది వరకు విద్యార్థులు వస్తుంటారు. యూనివర్సిటీ ఆఫ్ హైలాండ్స్, ఐలాండ్స్‌లో ప్రస్తుతం 40 వేలమంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. భద్రత పరంగా కూడా యూకే ఎంతో ఉన్నతంగా ఉంటోంది. నాలుగేళ్లలో ఏవియేషన్ ఇంజినీరింగ్ కోర్సుకు వంద మంది విద్యార్థులు వచ్చారు. పనిచేస్తూ... చదువుకోవచ్చు... యూకేలో యూజీ కోర్సులకు ఏడాదికి రూ.15 లక్షల వరకు, పీజీ కోర్సులకు రూ.14 లక్షల వరకు, ఎంబీఏకు రూ.25 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రధాన నగరాల్లో అక్కడి జీవన పరిస్థితులు కారణంగా ఖర్చు అధికంగా ఉంటుంది. పీజీ ఇక్కడ కేవలం ఒక సంవత్సరంలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు అనేక వర్సిటీలు ప్రత్యేక రాయితీతో, సగం ఫీజుతో చదువుకునే అవకాశం కల్పిస్తున్నాయి. వర్సిటీ విద్యార్థులు వారానికి గరిష్టంగా 20 గంటలు పనిచేసి 600 పౌండ్లు సంపాదించే వీలుంది. ఏడాదికి 7 వేల పౌండ్లు అవసరం... ఇక్కడ ఒక్కో విద్యార్థికి ఏడాదికి ఏడు నుంచి తొమ్మిది వేల పౌండ్లు వరకు ఖర్చు అవుతుంది. చిన్న నగరాల్లో 5 వేల పౌండ్లు సరిపోతుంది. దీనిలో విద్యార్థి హాస్టల్ వసతికి మూడు వేల పౌండ్లు, ఇతర ఖర్చులకు రెండు వేల పౌండ్లు సరిపోతాయి. వర్సిటీ హాస్టల్స్‌లో వసతి కోసం ముందుగానే తెలియజేయాలి. లేని పక్షంలో స్నేహితులతో కలసి ఉండే వీలుంటుంది. 20 లక్షల మంది భారతీయులు... మనం ఎంపిక చేసుకున్న వర్సిటీ ద్వారా వీసా పొందే వీలుంటుంది. ప్రభుత్వ వర్సిటీలకు ప్రత్యేకంగా లెసైన్స్ ఉంటుంది. వర్సిటీకి అనుబంధంగా ఉన్న స్థానిక ఏజెంట్లు వీసా పొందడంలో పూర్తి సహకారం అందిస్తారు. దీనికి ఎటువంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. యూకేలో 20 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందువల్ల వేరే దేశంలో ఉన్నామన్న భావనే విద్యార్థికి అంతగా కలగదు. స్కాలర్షిప్లు అందిస్తాయి.... అనేక వర్సిటీలు విదేశీ విద్యార్థులకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. కొన్ని విద్యార్థి చేరగానే అందించగా మరికొన్ని విద్యార్థి ప్రతిభ మార్కుల ఆధారంగా అందిస్తాయి. బ్రిటిష్ కౌన్సిల్ సైతం స్కాలర్షిప్లు అందిస్తుంది. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఫీజు భారం తప్పుతుంది. -
అకాల వర్షంతో అల్లకల్లోలం