అంద‌రూ చ‌స్తారు: ప్రయాణికురాలి హ‌ల్‌చ‌ల్‌ | Maskless Woman Yells Everybody Die And Coughs On Passengers | Sakshi
Sakshi News home page

వైర‌ల్‌: తోటి ప్ర‌యాణికుల‌పై ద‌గ్గుతూ హ‌డ‌లెత్తించింది

Oct 20 2020 9:33 PM | Updated on Oct 20 2020 10:12 PM

Maskless Woman Yells Everybody Die And Coughs On Passengers - Sakshi

లండ‌న్‌: క‌రోనా కాలంలో మాస్కు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రిగా మారింది. పొర‌పాటున మాస్కు లేకుండా బ‌స్సెక్కామ‌నుకోండి. ఎన్న‌డూ చూడ‌ని క‌ళ్లు మ‌నల్ని శ‌త్ర‌వులా క‌న్నెర్ర చేసి చూస్తాయి. దీంతో ముఖాన్ని క‌వ‌ర్ చేసుకోలేక ప‌డే తంటాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇక్క‌డో మ‌హిళ మాత్రం మాస్కు లేకుండానే విమాన‌మెక్కేసింది. అంతేనా.. కావాల‌ని గ‌ట్టిగా అరుస్తూ ద‌గ్గుతూ అంద‌రూ చ‌స్తారు అంటూ శాప‌నార్థాలు పెట్టింది. ఈ విచిత్ర ఘ‌ట‌న ఉత్త‌ర ఐర్‌లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నుంచి స్కాట్‌లాండ్‌లోని ఈడిన్‌బ‌ర్గ్ వెళ్ల‌డానికి సిద్ధ‌మైన‌ ఈజీజెట్ విమానంలో చోటు చేసుకుంది. ఎగ‌ర‌డానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఓ మ‌హిళ మాస్కు లేకుండానే ఎక్కగా సిబ్బంది ఆమెను దిగిపోవాల‌ని సూచించిన‌ట్లున్నారు. దీంతో కోపం న‌షాళానికంటిన స‌ద‌రు మ‌హిళ తోటి ప్ర‌యాణికుల‌పై త‌న ప్ర‌తాపాన్ని చూపించింది. వాళ్ల ముఖాల్లోకి తొంగి చూస్తూ కావాల‌ని ద‌గ్గింది. (చ‌ద‌వండి: నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన‌ వీడియో)

"అంద‌రూ చ‌స్తారు, అది క‌రోనానే కావ‌చ్చు, ఇంకేదైనా కావ‌చ్చు. ప్ర‌తిఒక్క‌రూ చ‌చ్చిపోతారు. ఇది త‌ప్ప‌కుండా జ‌రిగి తీరుతుంది" అని ప‌దే ప‌దే అరిచింది. వెంట‌నే అక్క‌డున్న‌ సిబ్బంది ఆమెను విమానం దిగిపోవాల‌ని సూచించ‌గా మ‌ళ్లీ మ‌ళ్లీ అదే శాప‌నార్థాలు పెడుతూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు భిన్న‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. 'ఎంతో క‌ష్ట‌ప‌డి టికెట్ రిజ‌ర్వేష‌న్ చేయించుకుని, విమానాశ్ర‌యంలో చాలాసేపు ప‌డిగాపులు కాసి, త‌ర్వాత లైనులో నిల‌బ‌డి, ల‌గేజ్ అంతా ఎక్కించేసి, చివ‌రాఖ‌ర‌కు లోప‌లకు వెళ్లి కూర్చుంటే కేవ‌లం మాస్కు లేద‌న్న కార‌ణంతో ఆమెను గెంటేస్తారా?' అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఇలాంటి వాళ్ల‌ను కేవ‌లం విమానంలో నుంచి వెళ్ల‌గొడితే స‌రిపోదు, అరెస్టు చేయాలని కామెంట్లు చేస్తున్నారు. (చ‌ద‌వండి: సెకన్లలో ప్లేట్‌ ఖాళీ.. రికార్డుకెక్కింది..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement