breaking news
Belfast
-
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకో తెలుసా?
ఐర్లాండ్ పర్యటన ఆరంభంలోనే టీమిండియాకు చుక్కెదురైంది. టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్స్ నిలిచిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆతిథ్య ఐరిష్ జట్టు వరల్డ్‌కప్ విజేతను ఓ ఆట ఆడుకుంది.బెల్ఫాస్ట్ వేదికగా సమిష్టి కృషితో రాణించి టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా అన్ని ఫార్మాట్లలోనూ ఐర్లాండ్ తొలిసారిగా భారత్‌పై గెలుపు రుచిచూసింది. ఇక ఈ సిరీస్‌తో టీమిండియా టీ20 కెప్టెన్‌గా ప్రయాణం ఆరంభించిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా ఇది కోలుకోలేని దెబ్బే!పెవిలియన్‌కు క్యూఇదిలా ఉంటే.. ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆదిలోనే టపటపా వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్ సంజూ శాంసన్ (5) జై ముంద్రా పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (3)ను మ్యాట్ హోలార్డ్ అవుట్ చేశాడు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3)ను కూడా హోలార్డ్ సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశాడు. తిలక్ వర్మ (19)ను మాథ్యూ హాంఫ్రేస్, వాషింగ్టన్ సుందర్ (9)ను హోలార్డ్ వెనక్కి పంపగా.. ఒంటరి పోరాటం చేసి శివం దూబే (14 బంతుల్లో 25) వికెట్‌ను జై ముంద్రా దక్కించుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నామిగిలిన వారిలో అక్షర్ పటేల్ (15), హర్షిత్ రాణా (8), అర్ష్‌దీప్ సింగ్ (2) సైతం ఇలా వచ్చి అలా వెళ్లారు. అయితే, ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఏకైక భారత ఆటగాడు అభిషేక్ శర్మ మాత్రమే. ఓవైపు వికెట్లు పడుతున్నా ఈ ఓపెనింగ్ బ్యాటర్ మాత్రం దూకుడుగానే ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు జమ చేశాడు.ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఇందుకు సంబంధించిన బీసీసీఐ ట్వీట్ కూడా చేసింది. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సైతం తన కెరీర్‌లోని మరో ‘ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ’ని సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, ఆ వెంటనే లియామ్ మెకర్తీ బౌలింగ్‌లో బెంజమిన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్‌కు చేరాడు.కథలో అసలు మలుపు అప్పుడే కథలో అసలు మలుపు వచ్చింది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీని రద్దు చేసినట్లు స్కోరు బోర్డులో రివైజ్డ్ స్కోరు వచ్చింది. ఇందుకు కారణం జై ముంద్రా బౌలింగ్ (భారత్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్)లో అభిషేక్ శర్మ సింగిల్ తీశాడు. అయితే, ఆ తర్వాత అది లెగ్‌బైగా తేలింది. దీంతో అభిషేక్ ఖాతా నుంచి ఆ పరుగు మైనస్ అయింది. ఫలితంగా 20 బంతుల్లో అభిషేక్ శర్మ 49 పరుగులు చేసినట్లు తేలింది.నిబంధనలు ఏం చెబుతున్నాయి?వైడ్ల మాదిరే లెగ్‌బై కూడా అదనపు పరుగుల్లో భాగం. బంతి బ్యాట్‌కు కాకుండా బ్యాటర్ శరీరానికి (బ్యాట్ పట్టుకున్న చేయి, గ్లోవ్స్ మినహా) తాకినా.. ఆ సమయంలో బ్యాటర్‌కు పరుగులు తీసే అవకాశం వచ్చినా.. లేదంటే బంతి బౌండరీని తాకినా జట్టు ఖాతాలో పరుగులు జమ అవుతాయి.కానీ బ్యాటర్ వ్యక్తిగత ఖాతాలో మాత్రం ఈ పరుగులు కౌంట్ అవ్వవు. అభిషేక్ శర్మ విషయంలో ఇదే జరిగింది. ముంద్రా బౌలింగ్‌లో వచ్చిన లెగ్‌బై టీమిండియా ఖాతాలో చేరి.. అతడి ఖాతా నుంచి మైనస్ అయింది. అయితే, ఇక్కడ అభిషేక్ అవుటైన తర్వాత అంపైర్లు ఈ విషయాన్ని గుర్తించడం వివాదానికి, గందరగోళానికి కారణమైంది. Same old story when Abhishek Sharma gets going. 🔥Watch #IREvIND LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/4SMkYA5LT6— Sony Sports Network (@SonySportsNetwk) June 26, 2026ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 49 పరుగులతో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా... మిగిలిన బ్యాటర్ల వైఫల్యం కారణంగా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 34 పరుగుల తేడాతో ఓటమి పాలై 0-1తో వెనుబడింది.చదవండి: కెప్టెన్‌గా నాకిది గొప్ప ఆరంభం -
ఐర్లాండ్ చేతిలో ఓటమి.. కెప్టెన్‌గా నాకు గొప్ప ఆరంభం
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. పసికూనలా భావించే ఐర్లాండ్ చేతిలో భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ సేన 34 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో పరాజయం పాలైంది.టక్కర్ అర్ధ శతకం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాపార్డర్‌ను కుదేలు చేసి శుభారంభం అందుకున్నా.. తర్వాత దానిని కొనసాగించలేకపోయింది. ఐరిష్ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన లోర్కాన్ టక్కర్ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 50)తో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. గెరాత్ డెలనీ (50) కూడా రాణించాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు.. శివం దూబే ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమింఇయా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అభిషేక్ ఒక్కడే..ఓపెనర్ అభిషేక్ శర్మ (49) చెలరేగినా మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. లోయర్ ఆర్డర్లో శివం దూబే (14 బంతుల్లో 25) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఐర్లాండ్ చేతిలో టీమిండియా తొలిసారి టీ20 మ్యాచ్‌లో పరాజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఇదొక గొప్ప ఆరంభం అని పేర్కొనడం గమనార్హం. ‘‘ఏదీ సులువుగా దొరకదు. కఠినంగా శ్రమిస్తేనే విజయం వరిస్తుంది. గతంలో ఏం జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా.. వర్తమానంలో జీవించడం ముఖ్యం.The perfect start for the Men in Blue.💙Harshit Rana strikes early, and Sanju Samson does the rest behind the stumps.👏Watch #IREvIND LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/esK99zoUwA— Sony Sports Network (@SonySportsNetwk) June 26, 2026కెప్టెన్‌గా గొప్ప ఆరంభంప్రత్యర్థిని కట్టడి చేసే అవకాశం లభిస్తే.. ఆ క్షణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేజారనీయకూడదు. నిజానికి ఆరంభంలో మా బౌలర్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. వరుసగా వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. కానీ ఆ తర్వాత మేము మొమెంటమ్ కోల్పోయాము.ఇక్కడ వాళ్లు 140 పరుగులు చేయడం గొప్పే అనిపించింది. కానీ వారిని మేము కట్టడి చేయలేకపోయాము. ఏదేమైనా ఇక్కడ గొప్ప అనుభవం లభించింది. ఇలాంటి పిచ్‌లపై మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే వికెట్‌పై మాకు ఓ అవగాహన వస్తుంది. ఏదేమైనా కెప్టెన్‌గా నాకిది గొప్ప ఆరంభమే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.చదవండి: అందుకే వైభవ్‌ను ఆడించలేదు: శ్రేయస్The moment history was made! 💚#BackingGreen | #IREvIND | #FáilteSolar pic.twitter.com/irDjNkEbK9— Cricket Ireland (@cricketireland) June 26, 2026 -
వైభవ్‌ను ఆడించకపోవడంపై శ్రేయస్ వివరణ!
ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. ట్రై సిరీస్‌లో ఇండియా- ఏ తరఫున ఫైనల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిసిన వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్‌తో తొలి టీ20లో ఆడిస్తారనుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. అయితే వైభవ్‌ను ఆడించకపోవడంపై టాస్ సమయంలో శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. అయ్యర్ మాట్లాడుతూ.. ‘బెల్ఫాస్ట్ మైదానం వాతావరణం, కండిషన్స్ మాకు పూర్తిగా కొత్తవి.. అందుకే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే.. దురదృష్టవశాత్తూ అతను ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు.. మా జట్టులో అద్భుతమైన ప్లేయర్స్ ఉండడంతో ఎవరిని తీసేయలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే గతంలో (టీ20 ప్రపంచకప్ 2026) మంచి ప్రదర్శన చేసిన సీనియర్ ప్లేయర్ల వైపే మేము మొగ్గు చూపుతున్నాం. ఖచ్చితంగా టైమ్ వచ్చినప్పుడు వైభవ్‌కు అవకాశం దక్కుతుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా టీమిండియా మేనేజ్మెంట్ పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతుంది’ అని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇక తొలి టీ20 కోసం కోసం భారత్ సెలక్ట్ చేసుకున్న కాంబినేషన్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక ఆల్‌రౌండర్, మరో ఇద్దరు స్పిన్నర్లని తుది జట్టులోకి తీసుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్‌పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
షాకిచ్చిన ఐర్లాండ్.. తొలి టీ20లో టీమిండియా ఓటమి
బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఐర్లాండ్ తొలి టీ20లో 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.👉 ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. అక్షర్ పటేల్ (15) గెరాత్ డెలానీ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా గెలవాలంటే 18 బంతుల్లో 45 పరుగులు అవసరం. 👉 25 పరుగులు చేసిన శివమ్ దూబే జై మూండ్రా బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరగడంతో టీమిండియా 135 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.👉ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుందర్ (9) రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అంతకముందు ఆదుకుంటాడునుకున్న తిలక్ వర్మ (19) వెనుదిరగడంతో టీమిండియా 90 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.అభిషేక్ (50) ఔట్టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (50) అర్ధశతకం సాధించిన వెంటనే వెనుదిరిగాడు. మెక్‌కార్తీ బౌలింగ్‌లో మాథ్యూ హంపెరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అభిషేక్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.అయ్యర్ విఫలం.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తడబడుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) మాట్ హాలండ్ బౌలింగ్‌లో జార్జ్ డాక్రెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 60 పరుగుల వ ద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1) విఫలమయ్యారు.టీమిండియా టార్గెట్ 183 పరుగులుబెల్ఫాస్ట్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు టీమిండియా ముందు మంచి టార్గెట్‌నే నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్‌పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు జార్జ్ డాక్రెల్ (19) రూపంలో ఐర్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డాక్రెల్ వెనుదిరిగాడు.లోర్కాన్ టక్కర్ (50) ఔట్అర్ధసెంచరీ సాధించిన వెంటనే కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) హర్షిత్ రానా బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా హర్షిత్ రానాకు ఇది మూడో వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. లోర్కాన్ టక్కర్ ఫిఫ్టీఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ ఫిఫ్టీ సాధించడంతో ఆ జట్టు కాస్త కోలుకుంది. 14 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 4 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. టక్కర్ 35 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. గారెత్ డెలానీ (13) అతడికి సహకరిస్తున్నాడు.👉13 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. లోర్కాన్ టక్కర్ (43), గారెత్ డెలానీ (12) క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్8 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (10), గరెత్ డిలేని (1) పరుగుతో ఆడుతున్నారు. శివమ్ దూబే బౌలింగ్‌లో 15 పరుగులు చేసిన బెంజమిన్ కాలిట్జ్ ప్రసిధ్ క్రిష్ణకు క్యాచ్ ఇచ్చి వెదనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది.మూడో వికెట్ డౌన్30 పరుగుల వద్ద ఐర్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రానా బౌలింగ్‌లో 17 పరుగులు చేసిన టిమ్ టెక్టర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండు వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు టీమిండియా బౌలర్లు చుక్కులు చూపిస్తున్నారు. 25 పరుగుల వద్ద ఐర్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హారీ టెక్టర్ డకౌట్ అయ్యాడు. అంతకముందు హర్షిత్ రానా బౌలింగ్‌లో ఓపెనర్ రాస్ అడైర్ (12) కీపర్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బెల్ఫాస్ట్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్, ఐర్లాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్‌లు జరిగితే అన్నింటిలోనూ టీమిండియానే విజయం సాధించడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. టైం వచ్చినప్పుడు వైభవ్ జట్టులోకి వస్తాడని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.తుది జట్లుటీమిండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణఐర్లాండ్: టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(వి/సి), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్టీ20 ప్రపంచకప్‌లో రెండోసారి విజేతగా నిలిచిన తర్వాత భారత జట్టు తమ తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు సిద్ధమైంది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనే లేని శ్రేయస్ అయ్యర్... ఐపీఎల్లో కనబర్చిన నాయకత్వ ప్రదర్శనతో ఇప్పుడు తొలిసారి భారత టి20 జట్టుకు సారథిగా బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు గతంలో రెండు మ్యాచ్‌లలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన లోర్కాన్ టకర్ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐర్లాండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్ అంటే ఫలితం గురించి ఆలోచించాల్సిన అసవరం కూడా లేదు. సంజూ సామ్సన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ల విధ్వంసకర ఆటపై కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఐర్లాండ్‌తో తొలి టి20 మ్యాచ్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దానికి ఒకే ఒక్కడు కారణం. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తాడా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. -
IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం వాయిదా?
ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో హింసాత్మక అల్లర్లు కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించారు. బుధవారం సాయంత్రం నగరంలోని పలు వీధుల్లో ముసుగులు ధరించిన కొంతమంది ఇళ్లు, వ్యాపార సముదాయాలు, కార్లు సిటీ బస్సులకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి వాటర్ క్యానన్లను ప్రయోగించారు.జూన్ 8వ తేదీ రాత్రి బెల్ఫాస్ట్లో ఒక వ్యక్తిపై జరిగిన దారుణమైన కత్తిపోట్ల దాడి ఈ హింసకు దారితీసింది. ఈ దాడికి పాల్పడిన నిందితుడు వేరే దేశానికి చెందిన వలసదారుడు అనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో స్థానికంగా వలసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలై, అవి కాస్తా హింసాత్మక అల్లర్లుగా మారాయి.భారత్-ఐర్లాండ్ సిరీస్ డౌటే!కాగా నెలఖారులో భారత క్రికెట్ జట్టుకు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సింది. ఈ రెండు మ్యాచ్‌లు (జూన్ 26, 28) కూడా బెల్ఫాస్ట్ వేదికగానే జరగాల్సి ఉంది. ఇప్పుడు అక్కడ నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఈ టీ20 సిరీస్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.తాజాగా ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ స్పందించింది. భారత్‌తో జరగాల్సిన రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిర్వహణపై రాబోయే 48 గంటల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ఐరీష్ క్రికెట్ బోర్డు తెలిపింది.బెల్ఫాస్ట్ నెలకొన్న పరిస్థితులను 'క్రికెట్ ఐర్లాండ్' నిశితంగా గమనిస్తోంది. భారత్‌తో టీ20 సిరీస్‌తో పాటు, ఈ ఆదివారం జరగాల్సిన 'ఐరిష్ సీనియర్ కప్', 'నేషనల్ కప్' మ్యాచ్‌ల నిర్వహణపై కూడా రాబోయే రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ అధికారులు, అభిమానుల భద్రతే మాకు అత్యంత ముఖ్యమని" ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన పేర్కొంది. వైభవ్ డెబ్యూ వాయిదా?కాగా ఈ టూర్ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ నుంచి తప్పించి అయ్యర్‌కు జట్టు బాధ్యతలను అప్పగించారు. కాగా ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. భారత జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ రికార్డును వైభవ్(15) బ్రేక్ చేశాడు. ఒకవేళ ఈ సిరీస్ వాయిదా పడితే సూర్యవంశీ అరంగేట్రం కోసం ఇంగ్లండ్ టూర్ వరకు వేచిచూడాల్సిందే. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా అతడు ఎంపికయ్యాడు.చదవండి: FIFA World Cup 2026: ఆరంభంలోనే ఆల్‌టైమ్ రికార్డు.. ఫిఫా హిస్టరీలోనే మొదటిసారి -
ఐర్లాండ్‌లో చెలరేగిన అల్లర్లు: కత్తిపోట్ల ఘటనతో..
బెల్ఫాస్ట్: ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఒక స్థానిక వ్యక్తిపై సుడాన్ దేశానికి చెందిన శరణార్థి జరిపిన కత్తిపోట్ల దాడి.. నగరంలో భారీ ఎత్తున వలస వ్యతిరేక అల్లర్లకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు వీధుల్లోకి వచ్చి, వలసదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగి, దీనిని ఒక ‘తీవ్రమైన సంక్షోభ పరిస్థితి’గా ప్రకటించారు.అర్ధరాత్రి ఘోరం.. కత్తితో విచక్షణారహితంగా దాడిబెల్ఫాస్ట్లోని కిన్నైర్డ్ ఎవెన్యూలో సోమవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. స్టీఫెన్ ఓగిల్వీ (44) అనే స్థానిక వ్యక్తిపై 30 ఏళ్ల సుడాన్ శరణార్థి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఓగిల్వీ ముఖం, మెడ, వీపు, కళ్ల భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.సోషల్ మీడియాలో వైరల్ వీడియోతో..నడిరోడ్డుపై జరిగిన ఈ భీభత్సానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం కావడంతో ప్రపంచవ్యాప్త రైట్-వింగ్ నేతలు తీవ్రంగా స్పందించారు. బ్రిటీష్ నేత జేమ్స్ రాబిన్సన్ ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ నిరసనలకు పిలుపునిచ్చారు. ఎలాన్ మస్క్ సైతం ఈ వీడియోను రీపోస్ట్ చేస్తూ, నిరసనలు జరగబోయే ప్రాంతాల వివరాలను పంచుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ముసుగులు ధరించిన నిరసనకారులు శరణార్థుల ఇళ్లపై రాళ్లు, ఇటుకలతో దాడులు చేస్తూ ‘స్థానిక ఇళ్లు స్థానికులకే’ అంటూ గోడలపై నినాదాలు రాశారు.తగలబడుతున్న వీధులు.. ఈ వలస వ్యతిరేక ప్రదర్శనలు కాస్తా హింసాత్మకంగా మారడంతో బెల్ఫాస్ట్ వీధులు రణరంగాన్ని తలపించాయి. నిరసనకారులు వలసదారుల ఇళ్లను, వాహనాలను తగులబెట్టారు. ఒక మిడిల్ ఈస్టర్న్ సూపర్‌మార్కెట్‌కు కూడా నిప్పు పెట్టారు. ప్రాణభయంతో వలసదారులు తమ ఇళ్లను వదిలి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ న్యాయశాఖ మంత్రి లాంగ్ ఈ హింసాకాండను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజలంతా సంయమనంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: అఫ్గాన్‌పై పాక్ భీకర వైమానిక దాడులు.. 13 మంది దుర్మరణం -
అందరూ చస్తారు: ప్రయాణికురాలి హల్చల్
లండన్: కరోనా కాలంలో మాస్కు ధరించడం తప్పనిసరిగా మారింది. పొరపాటున మాస్కు లేకుండా బస్సెక్కామనుకోండి. ఎన్నడూ చూడని కళ్లు మనల్ని శత్రవులా కన్నెర్ర చేసి చూస్తాయి. దీంతో ముఖాన్ని కవర్ చేసుకోలేక పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇక్కడో మహిళ మాత్రం మాస్కు లేకుండానే విమానమెక్కేసింది. అంతేనా.. కావాలని గట్టిగా అరుస్తూ దగ్గుతూ అందరూ చస్తారు అంటూ శాపనార్థాలు పెట్టింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నుంచి స్కాట్లాండ్లోని ఈడిన్‌బర్గ్ వెళ్లడానికి సిద్ధమైన ఈజీజెట్ విమానంలో చోటు చేసుకుంది. ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఓ మహిళ మాస్కు లేకుండానే ఎక్కగా సిబ్బంది ఆమెను దిగిపోవాలని సూచించినట్లున్నారు. దీంతో కోపం నషాళానికంటిన సదరు మహిళ తోటి ప్రయాణికులపై తన ప్రతాపాన్ని చూపించింది. వాళ్ల ముఖాల్లోకి తొంగి చూస్తూ కావాలని దగ్గింది. (చదవండి: నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో) "అందరూ చస్తారు, అది కరోనానే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రతిఒక్కరూ చచ్చిపోతారు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది" అని పదే పదే అరిచింది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను విమానం దిగిపోవాలని సూచించగా మళ్లీ మళ్లీ అదే శాపనార్థాలు పెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'ఎంతో కష్టపడి టికెట్ రిజర్వేషన్ చేయించుకుని, విమానాశ్రయంలో చాలాసేపు పడిగాపులు కాసి, తర్వాత లైనులో నిలబడి, లగేజ్ అంతా ఎక్కించేసి, చివరాఖరకు లోపలకు వెళ్లి కూర్చుంటే కేవలం మాస్కు లేదన్న కారణంతో ఆమెను గెంటేస్తారా?' అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వాళ్లను కేవలం విమానంలో నుంచి వెళ్లగొడితే సరిపోదు, అరెస్టు చేయాలని కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: సెకన్లలో ప్లేట్ ఖాళీ.. రికార్డుకెక్కింది..) A rare, Shakespearean tragedy Karen, coughing and yelling “everybody dies!” pic.twitter.com/uICdy0z2QJ — Sarah Cooper (@sarahcpr) October 19, 2020 -
భారత్‌లో స్కోర్‌తో యూకే వర్సిటీలో సీటు
న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం జరిగే పరీక్షల నాణ్యతా ప్రమాణాల్ని బ్రిటన్‌కు చెందిన బెల్ఫాస్ట్ యూనివర్సిటీ పరిశీలిస్తోంది. తమ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రమాణాలకు లోబడి భారత్‌లో ఏయే యూనివర్సిటీల ఎంట్రన్స్ పరీక్ష స్కోర్లు ఉంటాయో అన్వేషిస్తున్నామని బెల్ఫాస్ట్ వైస్ చాన్స్‌లర్ ఇయాన్ గ్రీర్ చెప్పారు. భారత్‌లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ)లో విద్యార్థులు సాధించిన స్కోర్లనే తమ వర్సిటీలో ప్రవేశ పరీక్షకు అర్హతగా పరిగణిస్తామని గతంలో యూనివర్సిటీ ప్రకటించింది. ఇతర ఎంట్రన్స్ పరీక్షల నాణ్యతను పరిశీలించడానికి ఇప్పుడు సిద్ధమైంది. ‘ప్రతిభగల విద్యార్థుల్ని ఆకర్షించడం కోసం భారత్‌లో విశ్వసనీయత కలిగిన ఎంట్రన్స్ పరీక్షల్లో వచ్చే స్కోర్లు తమ వర్సిటీకి ఎంతవరకు పనికి వస్తాయో పరీక్షించి చూస్తున్నాం. అలాగని మేము ఏ యూనివర్సిటీని తగ్గించి చూడటం లేదు. మా యూనివర్సిటీ ప్రమాణాలకు సరితూగే ఎంట్రన్స్ పరీక్షల స్కోర్ల కోసం చూస్తున్నాం’’అని చెప్పారు. యూకే ప్రభుత్వం భారత్ విద్యార్థులకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనల్ని సరళీకృతం చేయడంవల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులకు, యూకేకి మంచే జరుగుతుందని వీసీ చెప్పారు. భారత్‌లో నాణ్యతా ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలను గుర్తించడానికి ఇక్కడ కొన్ని సంస్థల్ని భాగస్వాములుగా చేసుకొని అన్వేషణ కొనసాగిస్తున్నట్టు గ్రీర్ వెల్లడించారు. -
బెల్ఫాస్ట్లో నిటా ఉగాది సంబరాలు
నార్తర్న్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్(నిటా) ఆధ్వర్యంలో ఈ నెల 21న బెల్ఫాస్ట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని బెల్ఫాస్ట్ లార్డ్ మేయర్ నికోలా మల్లోన్, లార్డ్ దాల్జిత్ రానా ప్రారంబించారు. ప్రముఖ గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి తమ గాన మధుర్యుం తో అలరించారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది హాజరయ్యారు. నిటా అసోసియేషన్ వాలంటీర్స్ కుమార్ జల్లూరి, డాక్టర్ రఘు రెడ్డి, రమేష్ గుమ్మడవెల్లి, సురేష్ గోపిడి, శ్రీ వెంకట చౌడల, సతీష్ దారం, శ్రీకాంత్ గుండం, శ్రీనివాస్ కోటప్రోలు, రజినికర్, శశాంక్, గోపి, నాగార్జున, నగేష్, కళ్యాణ్, శర్మ, ఉష పేరి, సుమ, కోమల,పూర్ణిమ, మౌనిక, జయశ్రీ, శ్రీ పద్మ, నిహారిక, సౌజన్య, జ్యోతి కోటప్రోలు, పవిత్ర, సుష్మిత, సత్య జల్లూరి తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
మూర్ఛను గుర్తించేందుకు, పక్షవాత చికిత్సకూ మొబైల్ ఆప్స్!
న్యూయార్క్: మూర్ఛ వ్యాధి వల్ల వచ్చే సీజర్స్‌ను గుర్తించేందుకు, పక్షవాత రోగులకు మెరుగైన చికిత్స చేసేందుకు ఉపయోగపడే రెండు వినూత్న మొబైల్ అప్లికేషన్లను బ్రిటన్‌లోని ‘బెల్ఫాస్ట్’కు చెందిన పరిశోధకులు రూపొందించారు. వీటిలో ‘ఎపిలెప్సీ ఆప్’తో వైద్య పరిజ్ఞానం లేనివారు సైతం ఒక వ్యక్తికి మూర్ఛవ్యాధి వల్ల సీజర్స్ (కంపించిపోతూ కూలిపోవడం) వస్తున్నాయా? లేదా వేరే కారణమా? అనేది గుర్తించవచ్చు. మూర్ఛవ్యాధి ఉన్నవారిలో నాడీవ్యవస్థ అసాధారణంగా స్పందించడం వల్ల ఒక్కసారిగా ప్రకంపనలతో బిగుసుకుపోయి కుప్పకూలుతుంటారు. ఇతర సమస్యల వల్లా సీజర్స్ వచ్చే అవకాశముంటుంది కాబట్టి.. మూర్ఛ వల్లే ఆ సీజర్స్ వచ్చాయా అన్నది తెలుసుకోవడం కష్టం. అందుకే వైద్యులు అందుబాటులో లేనప్పుడు సీజర్స్‌ను గుర్తించేలా ఈ ఆప్‌ను రూపొందించారు. మూర్ఛరోగులపై అధ్యయనం చేసి.. రూపొందించిన ఈ ఆప్‌ను భారత్, నేపాల్‌లో 132 మందిపై పరీక్షించగా.. 96 శాతం మందిలో కచ్చితమైన ఫలితాలు వచ్చాయట. అలాగే మరో అప్లికేషన్ ‘స్ట్రోక్ ఆప్’ కూడా పక్షవాత రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు, పర్యవేక్షించేందుకు బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఆప్‌ను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వైద్యులు ఉపయోగిస్తున్నారు.


