వైభవ్‌ను ఆడించకపోవడంపై శ్రేయస్‌ వివరణ! | Shreyas Iyer Clarity Why-Sooryavanshi Not-Playing XI Vs Ireland 1st T20I | Sakshi
Sakshi News home page

వైభవ్‌ను ఆడించకపోవడంపై శ్రేయస్‌ వివరణ!

Jun 26 2026 8:44 PM | Updated on Jun 26 2026 9:07 PM

Shreyas Iyer Clarity Why-Sooryavanshi Not-Playing XI Vs Ireland 1st T20I

ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. ట్రై సిరీస్‌లో ఇండియా- ఏ తరఫున ఫైనల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిసిన వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్‌తో తొలి టీ20లో ఆడిస్తారనుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. అయితే వైభవ్‌ను ఆడించకపోవడంపై టాస్ సమయంలో శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. 

అయ్యర్ మాట్లాడుతూ.. ‘బెల్‌ఫాస్ట్‌ మైదానం వాతావరణం, కండిషన్స్ మాకు పూర్తిగా కొత్తవి.. అందుకే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే.. దురదృష్టవశాత్తూ అతను ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు.. మా జ‌ట్టులో అద్భుతమైన ప్లేయర్స్ ఉండ‌డంతో ఎవ‌రిని తీసేయ‌లేని ప‌రిస్థితి. 

ప్రస్తుతానికైతే గతంలో (టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026) మంచి ప్రదర్శన చేసిన సీనియర్ ప్లేయర్ల వైపే మేము మొగ్గు చూపుతున్నాం. ఖచ్చితంగా టైమ్ వచ్చినప్పుడు వైభవ్‌కు అవకాశం దక్కుతుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా టీమిండియా మేనేజ్‌మెంట్‌ పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతుంది’ అని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 

ఇక తొలి టీ20 కోసం కోసం భారత్ సెలక్ట్ చేసుకున్న కాంబినేషన్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక ఆల్రౌండర్, మరో ఇద్దరు స్పిన్నర్లని తుది జట్టులోకి తీసుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్‌పటేల్‌, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement