అతడు లేకపోవడం టీమిండియాకు లోటు: శ్రీలంక మాజీ స్టార్‌ | His Absence A Massive Miss For India: Sri Lanka Great Names Spin Combo | Sakshi
Sakshi News home page

అతడు లేకపోవడం టీమిండియాకు లోటు: శ్రీలంక మాజీ స్టార్‌

Aug 11 2026 8:43 PM | Updated on Aug 11 2026 8:49 PM

His Absence A Massive Miss For India: Sri Lanka Great Names Spin Combo

PC: BCCI X

శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. కాగా భారత జట్టు శ్రీలంక గడ్డపై 2017 తర్వాత టెస్టు సిరీస్‌ ఆడటం ఇదే మొదటిసారి.

ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్‌ ఫర్వేజ్‌ మహరూఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌ లేనిలోటు టీమిండియాకు తప్పక కనిపిస్తుందన్నాడు. IANSతో మాట్లాడుతూ..

అశూ లేకపోవడం అతిపెద్ద లోటు
‘‘ఈసారి టీమిండియా అశ్విన్‌ను బాగా మిస్సవుతుంది. శ్రీలంక గడ్డ మీద అతడు గతంలో అద్భుతంగా రాణించాడు. ఇక్కడి టర్నింగ్‌ పిచ్‌లు అతడికి స్వర్గధామం. శ్రీలంక పిచ్‌ పరిస్థితులకు అశూ సరైన బౌలర్‌’’ అని ఫర్వేజ్‌ మహరూఫ్‌ పేర్కొన్నాడు.

కాగా 2015, 2017లో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్‌లలో టీమిండియా గెలుపులో అశ్విన్‌దే కీలక పాత్ర. ఆరు మ్యాచ్‌లలో కలిపి అతడు 38 వికెట్లు కూల్చాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేకాదు బ్యాట్‌తోనూ అశూ దుమ్ములేపాడు. రెండు అర్థ శతకాలతో సత్తా చాటాడు.

అదరగొడుతున్న సుతార్‌ 
ఇదిలా ఉంటే.. శ్రీలంక పర్యటనకు వెళ్లిన తాజా భారత జట్టులో ప్రస్తుతం నలుగురు స్పిన్నర్లు ఉన్నారు.  రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లతో పాటు యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌, వెటరన్‌ ఆటగాడు సారాంశ్‌ జైన్‌ కూడా ఉన్నారు. మానవ్‌ ఇప్పటికే అరంగేట్రం చేయగా.. సారాంశ్‌ టీమిండియాకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.

నాకు అవకాశం ఉంటే గనుక..
ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి కూడా ఫర్వేజ్‌ మహరూఫ్‌ స్పందించాడు. ‘‘కొన్ని నెలల క్రితం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా మానవ్‌ సుతార్‌ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే రాణించాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్‌ జట్టుతో వార్మప్‌ మ్యాచ్‌లోనూ బంతి, బ్యాట్‌తో సత్తా చాటాడు.

అయితే, తుదిజట్టులో రవీంద్ర జడేజాతో పాటు మానవ్‌ సుతార్‌కు కూడా చోటిస్తారా? అనేదే ప్రస్తుత ప్రశ్న. కుల్దీప్‌ యాదవ్‌ ఎలాగో తుదిజట్టులో ఉంటాడు. ఇక సారాంశ్‌ జైన్‌ ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే, అతడు డీసెంట్‌ బౌలర్‌. నాకే గనుక అవకాశం ఉంటే.. గాలె టెస్టుకు రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మానవ్‌ సుతార్‌లను ఎంపిక చేస్తాను’’ అని ఫర్వేజ్‌ మహరూఫ్‌ చెప్పుకొచ్చాడు. 

కాగా శ్రీలంకతో సిరీస్‌ టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్లో ఫైనల్‌ రేసులో ఉండాలంటే లంకను భారత్‌ 2-0తో వైట్‌వాష్‌ చేయాల్సిందే.

చదవండి: T20 WC 2028: పోర్చుగల్‌ కెప్టెన్‌గా SRH మాజీ ప్లేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement