breaking news
test series
-
ఇంగ్లండ్‌దే మూడో టెస్టు.. పాకిస్తాన్ క్లీన్‌స్వీప్
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ వైట్‌వాష్‌కు గురైంది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 24.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లిద్దరు డకౌట్ అయినప్పటికీ, జోర్డాన్ కాక్స్ (59 నాటౌట్), కెప్టెన్ జో రూట్ (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 453 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (75), జేమీ స్మిత్ (69), డాన్ లారెన్స్ (65), ఎమిలో గే (60), ఓలీ రాబిన్సన్ (50) అర్థసెంచరీలు సాధించారు. అయితే ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫాలోఆన్ ఆడిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. షాన్ మసూద్ (95), బాబర్ ఆజం (76), రజాఉల్లాహ్ (81), అజన్ అవైస్ (59) అర్థసెంచరీలు సాధించారు. డాన్ లారెన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.సంక్షిప్త స్కోర్లుపాకిస్తాన్ 133 & 449ఇంగ్లండ్ 453 & 130/2👉టెస్టుల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ వైట్‌వాష్‌కు గురవ్వడం ఇది రెండోసారి. 2022-23లో పాక్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా ఇంగ్లండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఇంగ్లండ్‌కు టెస్టుల్లో ప్రత్యర్థిపై ఇది 15వ క్లీన్‌స్వీప్. అదే సమయంలో పాకిస్తాన్ టెస్టుల్లో వైట్‌వాష్‌కు గురవ్వడం ఇది పదకొండోసారి.👉ఇంగ్లండ్ గడ్డపై ఒక మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క సెంచరీ నమోదు కాకపోవడం ఇది రెండోసారి కాగా, గతంలో 1888 యాషెస్ సిరీస్‌లోనూ ఒక్క సెంచరీ నమోదు కాలేదు. ఇక ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో ఒక టెస్టు సిరీస్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం ఇది ఎనిమిదోసారి.3-0 SERIES SWEEP! 💪 pic.twitter.com/TTCM4ZHvWb— England Cricket (@englandcricket) September 12, 2026ఇదీ చదవండి: #80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్! -
కివీస్ టూర్లో టీమిండియా తురుపుముక్క అతడే!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్, ఆసియా గేమ్స్ అనంతరం టీమిండియా అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్లో టీమిండియా రెండు టెస్టులతో పాటు ఐదు టీ20లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత కివీస్ గడ్డపై సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు రానున్న నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 19 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా తరఫున కేఎల్ రాహుల్ కీలక బ్యాటర్ కానున్నాడని బౌల్ట్ జోస్యం చెప్పాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ కివీస్ పిచ్‌లకు అనుగుణంగా ఉంటుందని, అందుకే కివీస్ టూర్లో భారత్ తురుపుముక్క అతడే అవుతాడని పేర్కొన్నాడు.బౌల్ట్ మాట్లాడుతూ.. "న్యూజిలాండ్‌లో టెస్టు క్రికెట్ ఆడేందుకు భారత్ వచ్చిన ప్రతీసారి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అయితే భారత్ ఎప్పుడూ ఫిబ్రవరి-మార్చి నెలల్లోనే న్యూజిలాండ్ పర్యటనకు వచ్చేది. కానీ ఈసారి భిన్నంగా అక్టోబర్-నవంబర్‌లో మా దేశంలో పర్యటించనుంది. ఆ సమయంలో దేశంలో వాతావరణం చల్లగా ఉండడంతో బ్యాటర్లకు పరిస్థితులు క్లిష్టంగా మారుతాయి. ఇది బ్యాటర్లకు మరింత సవాల్‌గా మారనుంది. నవంబర్‌లో టెస్టు సిరీస్ మొదలుకానుండంతో, అప్పటికే వాతావరణం పూర్తిగా చల్లగా ఉంటుంది. ఇది బౌలర్లకు అనుకూలంగా మారి వికెట్‌కు సహకరించవచ్చు. అయితే గెలుపోటములు పక్కనబెడితే ఈ సిరీస్ మాత్రం అభిమానులకు ఒక మంచి ఫీస్ట్‌ను అందించనుంది అని ఖచ్చితంగా చెప్పగలను" అని చెప్పుకొచ్చాడు.ఇక గతంలో బౌల్ట్, టిమ్ సౌథీ చాలా సంవత్సరాలు న్యూజిలాండ్ తరఫున కొత్త బంతితో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఈసారి కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, విలియం ఓ రూర్కీ రూపంలో కివీస్ బౌలింగ్ లైనప్ బలంగా కనిపిస్తుంది. ఇక న్యూజిలాండ్‌లో భారత పర్యటన అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు, నవంబర్ 4 నుంచి 15 మధ్య ఐదు వన్డేలు, నవంబర్ 19 నుంచి 23 మధ్య తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రెండో టెస్టు జరగనుంది.Read: ‘నిజంగా ఆ క్యాచ్ పట్టి ఉంటే తల పగిలేది’ -
ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్!
టీమిండియా జట్టు అక్టోబర్ చివర్లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య రెండు నెలల పాటు టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆరేళ్ల తర్వాత భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించనుండడంతో ఇప్పటినుంచే టికెట్ల హడావిడి మొదలైంది. గత రెండు వారాల్లోనే 50వేల టికెట్లు అమ్ముడైనట్లు న్యూజిలాండ్ క్రికెట్ పేరేంటింగ్ బాడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.మొదట క్రికెట్ నేషన్ సభ్యులు, స్కై కస్టమర్లు, ఏఎన్జెడ్ కస్టమర్ల కోసం రెండు వారాల ప్రీ సేల్ విండో ఇచ్చారు. ఆగస్టు 24న క్రికెట్ నేషన్ ప్రీ సేల్ మొదలైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. తర్వాత అభిమానుల కోసం కూడా టికెట్లను ఓపెన్ చేశారు. ముందుగానే సభ్యత్వం తీసుకున్న వారికి 15 శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. భారత్ సిరీస్ కోసం టికెట్లపై డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన బోర్డు, ఆగస్టులోనే అభిమానులను ప్రీ రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. పబ్లిక్ టికెట్ సేల్స్ మొదలైన తర్వాత కూడా బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయి.క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో అక్టోబర్ 24న జరిగే రెండో టీ20కు ఇప్పటికే 75 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ మైదానంలో భారత్ రెండు టీ20లు ఆడనుంది. అక్టోబర్ 22, 24 తేదీల్లో ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి. హాగ్లీ ఓవల్‌లో మ్యాచ్‌లకు ఎప్పుడూ కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులు వస్తారని న్యూజిలాండ్ క్రికెట్ మార్కెటింగ్ హెడ్ టిమ్ ఎల్లిస్ చెప్పారు. కానీ ఒక మ్యాచ్‌కు ఇంత ముందుగానే మూడు వంతులకుపైగా టికెట్లు అమ్ముడవడం చాలా స్పెషల్ అని అన్నారు. సుమారు 9 వేల మంది సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో నవంబర్ చివర్లో రెండో టెస్ట్ కూడా జరగనుంది.Photo Credit: Twitterరోహిత్, కోహ్లి క్రేజ్..కివీస్ గడ్డపై టీమిండియాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం మాత్రం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో, తమ అభిమాన క్రికెటర్లను చివరిసారి చూసుకోవాలని అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. 🚨 50,000+ tickets already sold for New Zealand’s home summer of cricket 🇳🇿🏏The India series is driving the madness Christchurch’s 2nd T20I is already 75% sold, while Eden Park has opened its 6th tier for the first time since India’s 2019 tour.The demand for India in NZ is… pic.twitter.com/1i1xu2VHCp— Mid Wicket (@Thinkerr_11) September 9, 2026 Read: ఈస్ట్‌జోన్‌దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్! -
ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్‌ప్లాప్ ప్లేయర్‌కు చోటు
సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమవుతున్న మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 2023 నుంచి కనీసం ఒక్కసారి కూడా మూడంకెల స్కోర్‌ను సాధించలేదు. అయినప్పటికి క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్టర్లు మాత్రం అతడిపై నమ్మకం ఉంచుతున్నారు. ప్రోటీస్ సిరీస్‌లో కూడా విఫలమైతే అతడిని పూర్తిగా జట్టు నుంచి పక్కన పెట్టే అవకాశముంది. ఇక సౌతాఫ్రికా కండీషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ బౌలర్లకు సెలక్టర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు దూరమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా యువ ఆటగాళ్లు కూపర్ కానలీ, మాథ్యూ కుహ్నెమాన్లు కూడా ప్రోటీస్ టూర్‌కు ఎంపికయ్యారు. కాగా 2018లో జరిగిన వివాదాస్పద సిరీస్ తర్వాత ఆసీస్ టెస్టు మ్యాచ్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. గతంలో కేవలం ఐదుగురు ఆటగాళ్లు కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, స్మిత్ మరియు రెన్షా - మాత్రమే పర్యటన జట్టులో చోటు దక్కించుకున్నారు.2018 నాటి బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత ఆసీస్ జట్టు టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లడం ఇదే తొలిసారి. అప్పటి పర్యటనలో ఉన్న పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్, స్మిత్, రెన్షా మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు. ఈ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నెసర్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, వెబ్స్టర్చదవండి: 'టీమిండియాపై విజయం.. పాక్ క్రికెట్‌కు శాపంగా మారింది' -
ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన పడిక్కల్, అతడికి కెరీర్ బెస్ట్!
శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టిన భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో పడిక్కల్ ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానంలో నిలిచాడు. నిజానికి ఇదేమి గొప్ప ర్యాంక్ కాకపోయినప్పటికీ, పడిక్కల్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకోవడమే గాక, భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా (328 పరుగులు) నిలిచాడు. టెస్టు సిరీస్‌ను 1-0తో భారత్ గెలవడం వెనుక పడిక్కల్ కీలకపాత్ర పోషించాడు. గిల్, పంత్ మినహామిగతా బ్యాటర్ల విషయానికొస్తే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ లంక సిరీస్‌లో ఒక అర్థసెంచరీ మాత్రమే సాధించాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో భారత్ నుంచి గిల్, పంత్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. రెండుకు ఎగబాకిన స్మిత్ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన లంక బ్యాటర్ సోనల్ దినూష ఏకంగా 29 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 25వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక టాప్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (856 పాయింట్లు) కొనసాగుతుండగా, ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకోగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మూడో స్థానానికి పడిపోయాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. మోకాలి గాయంతో లంక టూర్‌కు దూరమైన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోగా, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత స్టార్ రవీంద్ర జడేజా తన నెంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. భారత్ నుంచి జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ (ఏడో స్థానం) టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.Read: తిలక్ వర్మ వన్‌మ్యాన్ షో.. ఫైనల్లో సౌత్‌జోన్ -
అతడు అందగాడు, మంచివాడు: ఇంగ్లండ్ దిగ్గజం
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జాఫ్రీ బాయ్‌కాట్ ప్రశంసలు కురిపించాడు. జడ్డూ అందగాడు.. అదే విధంగా మంచివాడు అంటూ కొనియాడాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో జడ్డూకు తప్పక స్థానం ఉంటుందని పేర్కొన్నాడు.రవీంద్ర జడేజా ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడాడు. మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టి.. భారత్ 1-0తో సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, జడ్డూ బౌలింగ్‌లో పస తగ్గిందనే విమర్శలు వచ్చాయి.నా అభిమాన క్రికెట్ నువ్వేఈ నేపథ్యంలో జడ్డూ గురించి ప్రస్తావన రాగా.. జాఫ్రీ బాయ్‌కాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టిక్ టు క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘జడేజా కళాత్మకంగా బౌలింగ్ చేస్తాడు. అత్యద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. బ్యాటింగ్ కూడా చేయగలడు.అతడు అందగాడు. అతడి గురించి ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పవచ్చు. ఇటీవలే తొలిసారిగా అతడిని ప్రత్యక్షంగా కలిశాను. గతేడాది ఇండియాకు వెళ్లినప్పుడు అతడితో మాట్లాడాను.‘నా అభిమాన క్రికెట్ నువ్వే’ అని చెప్పాను. అందుకు అతడు.. ‘అసలు ఆ అవకాశమే లేదు’ అని నవ్వేశాడు. నేను మాత్రం నువ్వే నా ఫేవరెట్ అని మరోసారి చెప్పాను. అతడు ఎంతో అందగాడు. మంచివాడు. కేవలం క్రికెటర్ కాదు.. అత్యుత్తమ ఆల్‌రౌండ్ క్రికెటర్’’ అని బాయ్‌కాట్ జడ్డూను ఆకాశానికెత్తాడు. పోటీతత్వం ఎక్కువఅదే విధంగా.. ‘‘అతడు ఎల్లప్పుడూ ఎనర్జీతో కనిపిస్తాడు. ఒత్తిడిలోనూ నవ్వులు చిందించగలడు. కఠిన సమయాల్లో జట్టును ఒడ్డుకు చేరుస్తాడు. అతడిలో పోటీతత్వం ఎక్కువ’’ అని జడ్డూను బాయ్‌కాట్ ప్రశంసించాడు. కాగా 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జడేజా ఇప్పటికి 91 టెస్టులు, 210 వన్డేలు, 74 టీ20లు ఆడాడు.ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఖాతాలో టెస్టుల్లో 4160, వన్డేల్లో 2905, టీ20లలో 515 పరుగులు ఉన్నాయి. అదే విధంగా.. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ టెస్టుల్లో 356, వన్డేల్లో 232, టీ20లలో 54 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.చదవండి: ‘రిటైర్మెంట్ వరకు అతడే టీమిండియా కెప్టెన్’ -
ఆస్పత్రి పాలైన బాబర్ ఆజం!.. అసలేం జరుగుతోంది?
పాకిస్తాన్ క్రికెట్లో సంక్షోభం రోజురోజుకీ ముదిరిపోతోంది. ఇంగ్లండ్ గడ్డ మీద ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓటమిపాలైన పాక్.. మూడో టెస్టుకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సెప్టెంబరు 9న ఈ మ్యాచ్ మొదలుకానుండగా.. ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది.ఏడుగురిపై వేటుసీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, తొలి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్లను స్వదేశానికి పంపింది పాక్ బోర్డు. అదే విధంగా టెస్టు జట్టు హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను తప్పించింది.ఇక రిలీజ్ చేసిన ఆటగాళ్ల స్థానాల్లో సయీమ్ ఆయుబ్, అబ్దుల్లా ఫజల్‌తో పాటు పెద్దగా అనుభవం లేని అరాఫత్ మిన్హాస్, మహ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహ్మద్ ఇమ్రాన్ రాంధావా, రజావుల్లాలను ఇంగ్లండ్‌కు పిలిపించింది. ఇక పాక్- ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబరు 9న మూడో టెస్టు మొదలుకానుంది.బాబర్‌కు అస్వస్థతఈ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. తీవ్రమైన జ్వరం, కఫం, గొంతునొప్పితో అతడు ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల పాటు బాబర్‌కు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు సమాచారం.ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ జట్టుకు బాబర్ అస్వస్థతకు గురికావడం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. అయితే, బాబర్ కోలుకుంటున్నాడని.. అతడు మూడో టెస్టు ఆడతాడని పాక్ టీమ్ మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా జియో న్యూస్‌కు తెలిపాడు. మరోవైపు బాబర్ సైతం తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పినట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది.అలా తొలి టెస్టుకు దూరంకాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడి బాబర్ తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 8, 6 పరుగులు చేశాడు.లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఇన్నింగ్స్, 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో మట్టికరిచింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించే దుస్థితి తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సందర్భంగా బ్యాటింగ్ నుంచి తప్పించుకునేందుకు ఇమామ్ ఉల్ హక్ గాయం పేరుతో నాటకాలు ఆడాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించగా.. అతడు తన న్యాయవాది ద్వారా ముందుకు వెళ్లనున్నాడనే వార్తలు వస్తున్నాయి. చదవండి: IND vs AFG: తుదిజట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్! -
పాక్ క్రికెట్లో సంక్షోభం; మనస్తాపానికి గురై పదవికి రాజీనామా!
పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం నెలకొంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు వరుస ఓటములు ఆ జట్టులో ముసలం పుట్టించింది. టెస్టు సిరీస్‌లో పాక్ వరుస ఓటముల కారణంగా పీసీబీ (PCB) జట్టులో భారీ మార్పులు చేసింది. అయితే సెలెక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్లేయర్లను తొలగించడం, కోచింగ్ స్టాప్‌ను మార్చడం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన పాకిస్తాన్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతేకాదు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మిస్బా ప్రకటించాడు. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదు.అసలేం జరిగింది?లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్థాన్ జట్టులో పీసీబీ భారీ మార్పులు చేసింది. సెలక్టర్లను సంప్రదించకుండానే టెస్టు జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. టెస్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను కూడా వారి పదవుల నుంచి తొలగించినట్లు సమాచారం. మూడో టెస్టుకు ముందు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హసన్, బౌలింగ్ కోచ్ ఆష్లే నాఫ్కే టెస్టు కోచింగ్ సిబ్బందిలో చేరారు.పాక్ జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్లలో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్ ఉన్నారు. వీరి స్థానంలో సయీమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్‌తో పాటు కేవలం 10 మ్యాచ్‌ల ఉమ్మడి అనుభవం ఉన్న ఐదుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చింది.జట్టులోకి వచ్చిన ఐదుగురు కొత్త ఆటగాళ్లు: అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లా.2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ పదవిపాకిస్తాన్ అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా పేరు పొందిన మిస్బా ఉల్ హక్ వీడ్కోలు అనంతరం పీసీబీలో పలు కీలక పదవులు నిర్వహించాడు. 2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ సహా చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపికయ్యాడు. అయితే కోచింగ్ బాధ్యతలపై దృష్టి పెట్టడానికి 2020 అక్టోబర్‌లో చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 2021లో హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు.2023లో, మిస్బా అప్పటి తాత్కాలిక నిర్వహణ కమిటీ అధిపతి జకా అష్రఫ్ ఆధ్వర్యంలో సలహాదారుగా పీసీబీకి తిరిగొచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ఆకిబ్ జావేద్, సర్ఫరాజ్ అహ్మద్, అసద్ షఫిక్లతో పాటు మిస్బా నలుగురు సభ్యుల జాతీయ ఎంపిక కమిటీలో చేరాడు. దీంతోపాటు సంవత్సరానికి 180 రోజులు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తానని పీసీబీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్ తమ చివరి టెస్టును సెప్టెంబర్ 9 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆడనుంది.Misbah-ul-Haq has offered his resignation from the Pakistan men's national selection committee a day after the PCB made wholesale changes to the Test squad and team management https://t.co/Yc5oSoUL0S pic.twitter.com/oApQR5kzRj— Cricinfo (@cricinfo) September 1, 2026చదవండి: గెలిపించిన షమీ, ఇషాన్ కిషన్.. ఫైనల్లో ఈస్ట్‌జోన్ -
సిరీస్ ఓటమి; పాక్ జట్టులో మార్పులు.. కోచ్ పదవి ఊస్ట్!
ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 0-2తో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు ముందు జట్టులో కీలకమార్పులతో పాటు ప్రధానంగా రెడ్‌బాల్ కోచ్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ పదవి ఊస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో వైట్‌బాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మైక్ హసన్‌కే టెస్టు కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తోంది. ఇదే గనుక జరిగితే మైక్ హసన్ మూడు ఫార్మాట్లకు హెడ్ కోచ్‌గా ఉండనున్నాడు.వరుస పరాజయాల నేపథ్యంలో టెస్ట్ జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పీసీబీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం లండన్‌లోనే ఉన్న మైక్ హెసన్, ఆకిబ్ జావేద్‌తో కలిసి ప్రిన్స్ చార్లెస్ ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ పర్యటనలోనే ఆయనకు టెస్ట్ జట్టు బాధ్యతలను కూడా అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది.సెప్టెంబర్ 9 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మైక్ హెసన్ పాకిస్తాన్ జట్టుతో కలవనున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మూడో టెస్ట్ సమయంలో హెసన్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది సర్ఫరాజ్ అహ్మద్ పదవికి ముగింపు కార్డు పడినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ 18న బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌కు ముందు సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు. అయితే ఆయన ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. మొదటి అసైన్‌మెంట్‌లోనే బంగ్లాదేశ్ చేతిలో సొంత గడ్డపై వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో 2 టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో మరో వైట్‌వాష్ దిశగా ప్రయాణిస్తుండటంతో పీసీబీ వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొంది.ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ముగిసిన అనంతరం ఇమామ్ ఉల్ హక్‌తో పాటు సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. తాజాగా బాబర్ గైర్హాజరీలో మొదటి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘాను కూడా పీసీబీ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో సల్మాన్ అఘా స్వదేశానికి తిరిగి రానున్నాడు.🚨SARFARAZ AHMED SACKED FROM TEST COACH 🚨 - Pakistan current Test coach Sarfaraz Ahmed & bowling coach Umar Gul sidelined from test team. - Mike Hesson asked for take charge of Pakistan test team. pic.twitter.com/fDY7iF8fkv— Cricket Central (@CricketCentrl) August 31, 2026చదవండి: సచిన్‌ను వెంటాడిన ఫోబియా వైభవ్‌కు అంటుకుందా? -
గాయం పేరుతో నాటకమా? నిజమని తేలితే నిషేధమే!
పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ గాయం విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రత్యేక అధికారుల బృందం సీరియస్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. పిక్క కండరాల గాయంతో ఇమామ్-ఉల్-హక్ మూడో టెస్టు ఆడకుండానే స్వదేశానికి తిరుగుపయనమ య్యాడు. లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో తొలి రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇమామ్ పిక్క కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే స్కానింగ్‌లో ఇమామ్‌కు స్వల్ప గాయం మాత్రమే అయినట్లు నిర్థరాణ అయింది. నిజానికి ఇమామ్ ఉల్ హక్కు పెద్దగా గాయం కాలేదని, కానీ కఠిన పరిస్థితుల్లో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడానికి భయపడి గాయం పేరుతో ఇలా నాటకాలు ఆడినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఇంగ్లండ్ గడ్డపై ఆడేందుకు భయపడే ఇమామ్-ఉల్-హక్ నకిలీ గాయం పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేశాడని మాజీ పాక్ క్రికెటర్లు ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పీసీబీ ఇమామ్ గాయం నిజామా? కాదా? అన్నది తేల్చేందుకు అధికార యంత్రాంగంతో విచారణ ప్రారంభించనుంది.గతంలోనూ ఇలాగే..ఇమామ్ ఉల్ హక్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ కొత్త కాదు. 2025లో న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా నేపియర్ వేదికగా తొలి వన్డేకు ముందు తన కాలి కుడి బొటనవేలిలో తీవ్రమైన నొప్పి ఉందని పీసీబీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఎక్స్-రేల్లో మాత్రం బొటనవేలులో ఎలాంటి చీలిక లేదా స్థానభ్రంశం జరిగినట్లు ఆధారాలు కనిపించలేదు. పాక్ క్రికెట్ వైద్య బృందం ప్రకారం, ఇమామ్ కాలి బొటనవేలు నుంచి వచ్చింది రక్తం కాదని, అది సిరా గుర్తు అని తమ నివేదికలో తేలినట్లు అప్పట్లో పేర్కొంది. కేవలం న్యూజిలాండ్‌లోని పేస్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడాన్ని తప్పించుకోవడానికే ఇమామ్ ఉల్ హక్ గాయమైనట్లు నటించాడని వార్తలు వచ్చాయి. అవసరమైతే నిషేధం..పీసీబీ విచారణ సమయంలో వారి వద్దకు వచ్చినప్పుడు ఇమామ్ కుంటుతూ నడిచాడని, వాళ్లు వెళ్లిపోయాక బయటకు మాత్రం యథావిధిగా నడుచుకుంటూ వచ్చాడని సమాచారం అందింది. అందుకే ఈసారి పీసీబీ దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ఇమామ్‌కు గాయం నిజమైతే పర్వాలేదు కానీ, ఒకవేళ గాయం తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికీ, నటించినట్లు తేలితే మాత్రం ఈసారి అతడిపై కఠిన చర్యలకు ఆస్కారం ఉంటుంది. అవసరమైతే జట్టు నుంచి సస్పెండ్ చేసే యోచనలో ఉన్నాం’’ అని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇక ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ముగిసిన అనంతరం ఇమామ్ ఉల్ హక్‌తో పాటు సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఇక మూడో టెస్టు కోసం పాకిస్తాన్ జట్టులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే చివరి టెస్టు కోసం సయీమ్ అయూబ్, అరాఫత్ మిన్హాస్ సహా ఆరుగురు ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పిలిపించింది. సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు!ఇక ప్రస్తుతం రెడ్‌బాల్ క్రికెట్ కోచ్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పటే అవకాశాలున్నాయి. సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో ప్రస్తుతం వైట్‌బాల్ క్రికెట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మైక్ హసన్‌కే బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్‌కు 2-0తో సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ మూడో టెస్టును ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆడనుంది.Read: యూరోపియన్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ విధ్వంసం -
వాళ్లతో పోటీ ఏంటి?: పాక్ పరువు తీసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్!
పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ నాసిర్ హుసేన్ ఘాటు విమర్శలు చేశాడు. అసలు ఇలాంటి జట్టుపై గెలవడం పెద్ద కష్టమేమీ కాదని.. ఇప్పటికైనా సంబరాలు మానుకోవాలని జో రూట్ బృందానికి సూచించాడు. స్థాయికి తగ్గ జట్లపై విజయాలు సాధించడం మాత్రమే ముఖ్యమంటూ పాక్ పరువు తీశాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ మీద 103 పరుగుల తేడాతో గెలిచి ఇంగ్లండ్ పాక్‌ను మట్టికరిపించింది. ఇక లార్డ్స్ వేదికగా రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టు బాబర్ ఆజం బృందాన్ని 194 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 ఫైనల్ రేసు నుంచి పాక్ దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ బాబర్ ఆజం బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.పోస్ట్ మ్యాచ్ ఎక్స్పర్ట్ కామెంట్రీ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ జట్టు పాకిస్తానీ బ్యాటింగ్ లైనపై విజయం ద్వారా తమ ప్రతిభను అంచనా వేయొద్దు. నేను ప్రతీసారి చెబుతున్న మాటే ఇది. పాకిస్తాన్ చాలా చాలా బలహీనమైన జట్టు.ఆస్ట్రేలియా, సౌతాఫ్రియా, ఇండియా వంటి జట్లతో మ్యాచ్‌ల ఫలితాలను బట్టి మాత్రమే ఇంగ్లండ్ జట్టు తమను తాము అంచనా వేసుకోవాల్సి ఉంటుంది’’ అని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. ఇక ఓటమి అనంతరం తాము తిరిగి పుంజుకుంటామని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై నాసిర్ హుసేన్ స్పందిస్తూ.. పాకిస్తాన్ ఎప్పటికీ తిరిగి పోరాడలేదని కుండబద్దలు కొట్టేశాడు. పాక్ జట్టు మునుపటిలా లేదని.. అయినా సరే వారికి కొంతమంది అనవసరంగా ‘హైప్’ ఇస్తున్నారని పేర్కొన్నాడు. కనీసం మూడో టెస్టులోనైనా కాస్త మెరుగ్గా ఆడాలని బాబర్ బృందానికి సూచించాడు. కాగా ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు.. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అదంతా నాటకం: పాక్ ఓపెనర్‌పై ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్
పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ తీరుపై ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజంగా గాయపడి ఉంటే నాటకాలు ఆడాల్సిన అవసరం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఇందులో భాగంగా.. ఆతిథ్య జట్టు చేతిలో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాక్.. రెండో టెస్టులోనూ 194 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఈ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోగా.. పాక్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.నొప్పితో విలవిల్లాడుతూఇదిలా ఉంటే.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ గాయపడ్డాడు. మోకాలి నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. మిగిలిన నాలుగు రోజుల ఆటకు అతడు దూరం కావడంతో.. పాక్ పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ కొనసాగించింది.నాటకం ఆడాడుఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ మహ్మద్ వసీం ఇమామ్ తన గాయాన్ని ఎక్కువచేసి చూపించాడని.. బ్యాటింగ్ తప్పించుకునేందుకే ఇలా నాటకం ఆడాడని నిందించాడు. మరోవైపు.. నాలుగో రోజు ఆటకు ముందు ఇమామ్ ఉల్ హక్ మోకాలికి పెద్ద బ్యాండేజ్ కట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు. అవసరమైతే ఆఖరి రోజు బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నానట్లు సంకేతాలు ఇచ్చాడు.బిల్డప్ మాత్రమేఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇమామ్ ఉల్ తీరుపై ఘాటుగా స్పందించాడు. స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అదంతా షో ఆఫ్. కేవలం నాటకం మాత్రమే. తన సహచర ఆటగాళ్లు, మీడియా ముందు తానేదో కష్టపడుతున్నానని చూపే ప్రయత్నం.ఇలాంటివి లోపల చేయొచ్చు. కానీ అందరిముందు ఇలా చేయడం బిల్డప్ మాత్రమే. షార్ట్స్ వేసుకుని మోకాలికి టేప్ చుట్టుకుని చుట్టూ తిరగాల్సిన అవసరంలేదు. నాకైతే ఇది ఎంతమాత్రం నచ్చలేదు. సారీ’’ అంటూ స్టువర్ట్ బ్రాడ్ మండిపడ్డాడు. కాగా రెండో టెస్టులో ఇమామ్ బ్యాటింగ్‌కే రాలేదు. మరోవైపు.. మూడో రోజు ఆట తర్వాత మీడియాతో మాట్లాడిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అలీ.. ‘నాకు ఇమామ్ పరిస్థితి గురించి తెలుసు. కానీ నేనేమీ మాట్లాడకూడదు. వైద్య బృందమే మీకు సరిగ్గా వివరించగలదు’ అని చెప్పాడు. దీనిని బట్టి స్టువర్ట్ బ్రాడ్ అన్న మాటలు నిజమేనేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం“He could have practiced comfortably and alone in the indoor facility, but he is coming out suddenly with half-shots and heavy tapping. It’s more like showing to the media and fans, and sorry, I am not impressed at all.”~ Stuart Broad tears into Imam-ul-Haq, accuses Pakistan…— Cricketopia (@CricketopiaCom) August 31, 2026 -
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు స్టార్ ప్లేయర్ దూరం.. షాక్‌లో సౌతాఫ్రికా!
టెస్టు చాంపియన్ సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ కగిసో రబాడ తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆసీస్‌తో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా రబాడ అందుబాటులో ఉండడం అనుమానంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డబ్ల్యూటీ సీ పట్టికలో సౌతాఫ్రికా 75 పీసీటీతో రెండో స్థానంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుండడంతో ఈ సిరీస్‌కు సౌతాఫ్రికాకు కీలకం కానుంది. ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉన్నప్పటికీ, తమ నంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకోవాలంటే సౌతాఫ్రికా సిరీస్ ముఖ్యమే. డబ్ల్యూటీసీ పట్టికలో ఆస్ట్రేలియా 80 పీసీటీతో తొలి స్థానంలో ఉండగా, సౌతాఫ్రికా (75 పీసీటీ), న్యూజిలాండ్ (72.22 పీసీటీ)తో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ ఆసీస్‌కు సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌ను కోల్పోతే పాయింట్లు పడిపోవడంతో పాటు మూడో స్థానానికి పడిపోయే అవకాశముంది. అప్పుడు మాజీ చాంపియన్ న్యూజిలాండ్‌కు ఫైనల్ ఆడే అవకాశం లభించవచ్చు. స్వదేశంలో టీమిండియాతో న్యూజిలాండ్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై ఆడనుండడం కివీస్‌కు సానుకూలాంశం కానుంది.రబాడకు ఏమైంది?ఆస్ట్రేలియాతో వన్డే, టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు సన్నాహకాలు ప్రారంభించింది. ప్రాక్టీస్ సందర్భంగా రబాడ తొడ కండరాల్లో చీలిక వచ్చింది. స్కానింగ్‌లో రబాడ గ్రేడ్-3 టియర్తో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో రబాడ కనీసం 9 నుంచి 10 వారాలు ఆటకు దూరమయ్యే అవకాశముంది. అయితే వచ్చే నెల సెప్టెంబర్ 24 నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. రబాడ కోలుకోవడానికి తొమ్మిది వారాలు సమయం పట్టనుండడంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత అక్టోబర్ 9 నుంచి 27 మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. 9-10 వారాలు రెస్ట్ కావడంతో ఈ లెక్కన రబాడ టెస్టు సిరీస్‌కు కూడా దూరమైనట్లేనని సౌతాఫ్రికా క్రికెట్ మెడికల్ టీమ్ ధృవీకరించింది.Read: గాయంతో కీలక బ్యాటర్ ఔట్.. పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ! -
ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం.. పాక్‌కు ఓటమి తప్పదా?
లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ ఇంగ్లండ్ 350 పరుగుల లీడ్‌కు చేరువలో ఉంది. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులతో ఆడుతోంది. డాన్ లారెన్స్ (37), గస్ అకిన్సన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 342 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆటకు మరో రెండు రోజులు సమయం ఉండడంతో పాక్‌కు మరో ఓటమి తప్పేలా లేదనిపిస్తోంది. నాసిరకం బ్యాటింగ్‌తో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ లార్డ్స్ పిచ్‌పై రెండో బ్యాటింగ్ చేసి 350కి పైగా పరుగుల టార్గెట్‌ను ఛేదించడం కష్టం, ఆ జట్టు బ్యాటర్లు ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా అసాధ్యమని చెప్పొచ్చు. మూడో రోజు ఆటకు వరుణుడు పదే పదే అడ్డు తగలడంతో ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌కు పెద్దగా అవకాశం రాలేదు. ఓవర్‌నైట్ స్కోరు 81-3తో మూడోరోజు ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్ రూట్ (24) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుణుడు దంచికొట్టడంతో ఆట నిలిచిపోయింది. వర్షం విరామం అనంతరం ఆట మొదలవ్వగా, హ్యారీ బ్రూక్ (34), డాన్ లారెన్స్ (37 బ్యాటింగ్) ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జేమీ స్మిత్ (7) తొందరగానే ఔటయ్యాడు. మరోసారి వర్షం దంచికొట్టడంతో ఇంగ్లండ్ టీ విరామానికి వెళ్లింది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 3 వికెట్లు తీయగా, కుర్రమ్ షెహజాద్ 2 వికెట్లు పడగొట్టాడు.🚨 BIG WICKET FOR PAKISTAN! 🇵🇰- Mohammad Abbas dismisses Harry Brook.A brilliant catch by Mohammad Rizwan! England were 84/4, and Pakistan got their 5th wicket at 128 runs..A HUGE WICKET FOR PAKISTAN! pic.twitter.com/2ODRcq6SZj— Talha Nawaz (@TalhaDigital007) August 29, 2026Read: డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం -
పాఠాలు నేర్వని పాక్.. ఇంగ్లండ్ దెబ్బకు 110 రన్స్‌కే ఆలౌట్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ తమ దారుణ ఆటతీరును కంటిన్యూ చేస్తోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో పాఠాలు నేర్వలేదు. లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో పాకిస్తాన్ 37.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు వణికిపోయారు. ఓపెనర్ అజాన్ అవైస్ (46), సాద్ షకీల్ (16) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 4 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ 3, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్‌కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (61), జోర్డాన్ కాక్స్ (55) అర్ధసెంచరీలు సాధించగా, గస్ అకిన్సన్ (45), జోష్ టంగ్ (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు తీయగా, మొహమ్మద్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా ఇమామ్-ఉల్-హక్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో పాకిస్తాన్ 9 మంది బ్యాటర్లతోనే ఆటను కొనసాగించింది. దీంతో తొమ్మిదో వికెట్ పడిన తర్వాత పాక్ ఆలౌటైనట్లు అంపైర్లు ప్రకటించారు.Another humiliating defeat confirmed for Pakistan. 💔- Bowled out for 110 runs, with England leading by 180 runs. Congratulations to England in advance. pic.twitter.com/aAZplAxS9h— Abdullah (@Abdullahhhh_56) August 28, 2026చదవండి: టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన పసికూన -
బాబర్ ఆజం విఫలం.. నడిచినంత సేపు పట్టలేదు!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. లార్డ్స్‌లో అభిమానుల అంచనాల నడుమ బరిలోకి దిగిన అతడు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా బాబర్ ఆజంపై విమర్శల వర్షం కురుస్తోంది.వార్మప్ మ్యాచ్.. గాయపడ్డ బాబర్కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ముందుగా ప్రొఫెషనల్ కౌంటీ క్లబ్ సెలెక్ట్ ఎలెవన్‌తో పాక్ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడి గెలిచింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజం వేలికి గాయమైంది.లార్డ్స్ టెస్టుతో రీఎంట్రీఫలితంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టుకు బాబర్ దూరమయ్యాడు. ఈ క్రమంలో గురువారం లార్డ్స్‌లో మొదలైన రెండో టెస్టుతో అతడు పునరాగమనం చేశాడు. టాస్ గెలిచిన బాబర్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆటలో భాగంగా 290 పరుగులకే ఆలౌట్ అయింది. జోర్డాన్ కాక్స్ (55), జేమీ స్మిత్ (61) అర్ధ శతకాలు బాదగా.. గస్ అట్కిన్సన్ 45 పరుగులతో రాణించాడు.పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ అలీకి మూడు వికెట్లు దక్కాయి. ఖుర్రం షెజాద్, అలీ ఉస్మాన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షాన్ మసూద్ ఒక్క పరుగు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.సింగిల్ డిజిట్ స్కోరువన్డౌన్లో వచ్చిన అబ్దుల్లా షఫీక్ (5)ను జోష్ టంగ్ వెనక్కి పంపగా.. నాలుగో స్థానంలో బాబర్ వచ్చాడు. మొత్తంగా పది బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం ఎనిమిది పరుగులు చేసి టంగ్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడి ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ బాబర్ ఆజం మైదానంలోకి ఎంట్రీ ఇస్తున్న వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. ఇందులో బాబర్‌ను ఆహ్వానిస్తూ పలువురు అతిథులు అతడిని చీర్ చేశారు. అయితే, కాసేటికే అతడు పెవిలియన్‌కు చేరాడు. నడిచినంత సేపు పట్టలేదుఈ నేపథ్యంలో.. ‘అతిథులు కుర్చీల్లో సెటిల్ అయ్యేలోపే బాబర్ వెనక్కి వచ్చేశాడు. మనోడితో అట్లా ఉంటది మరి!.. నడిచినంత సేపు పట్టలేదు వెనక్కి రావడానికి’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.ఇక బాబర్ ఇటీవలే టెస్టు కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, సారథిగా రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే అతడు పూర్తిగా నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య రెండో రోజు ఆటకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. వాన పడే సమయానికి పాకిస్తాన్ 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఓపెనర్ అజాన్ అవైస్ 43, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఒక పరుగుతో ఉన్నారు.చదవండి: IND vs NZ: టీమిండియా మాస్టర్ ప్లాన్!Babar Azam walks out to bat at Lord’s 🇵🇰 pic.twitter.com/zinQC2atc7— Lord's Cricket Ground (@HomeOfCricket) August 28, 2026 -
IND vs NZ: వాళ్లిద్దరి కోసం.. టీమిండియా మాస్టర్ ప్లాన్!
శ్రీలంకపై టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు.. రెడ్‌బాల్ క్రికెట్లో తదుపరి న్యూజిలాండ్ రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. ఐదు టీ20 మ్యాచ్‌లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్టోబరు 22 నుంచి డిసెంబరు 1 వరకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.వాళ్లిద్దరిపై ప్రత్యేక దృష్టిఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. పేసర్లు గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపాయి. కాగా వీళ్లిద్దరు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పటికీ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. స్పిన్నర్లు ప్రభావం చూపే లంక పిచ్‌లపై.. వీరికి బదులు సీనియర్ పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణల సేవల్ని మేనేజ్మెంట్ ఉపయోగించుకుంది.అయితే, కివీస్ గడ్డ మీద పరిస్థితులు వేరుగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడి పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి. కాబట్టి గుర్నూర్‌తో పాటు ఆకిబ్ కోసం యాజమాన్యం ప్రత్యేక ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..ప్లాన్ ఇదే‘‘గుర్నూర్ బ్రార్‌ను దులిప్ ట్రోఫీ ఆడమని సెలక్షన్ కమిటీ చెప్పింది. నార్త్ జోన్ జట్టులో ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ ఆడుతున్నారు. సునిల్ కుమార్ స్థానంలో గుర్నూర్ బ్రార్ తుదిజట్టులోకి వెళ్తాడు. ఇక ఆకిబ్ నబీని ఇంగ్లండ్‌లో కనీసం రెండు- మూడు మ్యాచ్‌లు ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది.న్యూజిలాండ్‌లో పిచ్ పరిస్థితులు కాస్త భిన్నంగానే ఉంటాయి. అయితే, జట్టు ప్రణాళికల్లో ఆకిబ్ ఉన్నాడు. యూకే వీసా రాగానే అతడిని ఇంగ్లండ్‌కు పంపి కౌంటీల్లో ఆడించాలనే ప్లాన్ ఉంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఇంగ్లండ్‌లో సర్రే తరఫున ఆకిబ్ నబీ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో గెలిచినప్పటికీ భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఇంకా వెనుకబడే ఉంది.ఈ సైకిల్లో న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం ఐదు గెలిస్తేనే భారత్ ముందుకు వెళ్తుంది. కాబట్టి కివీస్ పర్యటనలో సాధ్యమైనంత వరకు మెరుగ్గా ఆడేందుకు టీమిండియాను మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: రాఖీ పండుగ: విరాట్ కోహ్లి అక్క పోస్ట్ వైరల్ -
అలాంటి ప్లేయర్ ఉండడం టీమిండియా అదృష్టం: పీటర్సన్
శ్రీలంకతో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సాయి సుదర్శన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన పడిక్కల్.. తన సంచలన బ్యాటింగ్‌తో సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలు సాధించి మూడో నంబర్‌కు తానే సరైనోడని నిరూపించుకున్నాడు. ఈ కర్ణాటక బ్యాటర్ మొత్తంగా 328 పరుగులు చేసి ప్లేయర్‌గా ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పడిక్కల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు."పడిక్కల్ ఒక అద్భుతమైన ఆటగాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ శైలి చూడటానికి ఎంతో బాగుంది. పడిక్కల్ లాంటి ఆటగాడు ఆటగాడు జట్టులో ఉండడం భారత్ అదృష్టం. మూడో స్ధానానికి అతడే సరైన ప్లేయర్" అని పీటర్సన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. మరోవైపు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా పడిక్కల్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.‘‘పడిక్కల్ లాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు స్పిన్ బాగా ఆడుతున్నాడు. పేస్ బౌలర్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో అతడు భారత్‌కు కీలకంగా మారనున్నాడు" అని జడేజా సోనీ స్పోర్ట్స్ డిబేట్లో పేర్కొన్నాడు. కాగా ఈ భారత్ తమ తదుపరి టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అనంతరం డిసెంబర్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.చదవండి: ఒక్క తప్పు కూడా చేయలేదు.. అతడొక అద్భుతం: అశ్విన్ -
250 ఓవర్లు ఫీల్డింగ్ చేశాం.. వారు నిజంగా అద్భుతం: గిల్
కొలంబో వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక జట్టు అద్భుతం చేసింది. ఓటమి ఖాయమనుకున్న వేళ లంక బ్యాటర్లు విరోచితంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా ముగించారు. ముఖ్యంగా శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన దినుష.. దాదాపు 100 ఓవర్ల పాటు క్రీజులో ఉండి తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతడు సెంచరీలతో సత్తాచాటాడు. ఇక ఈ కీలక మ్యాచ్ డ్రా కావడంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. "ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మేము మా శాయశక్తులా ప్రయత్నించాము. వరుసగా మూడు రోజుల పాటు దాదాపు 250 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాము. అయినప్పటికి వారు అద్భుతంగా ఆడారు. కచ్చితంగా శ్రీలంక బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా వారికి కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చింది. మేము అక్కడ ఇంకా కొత్త ప్రయోగించాల్సింది ఏమి లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. ఈ సిరీస్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యర్ధి జట్టు నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒత్తిడిలో శ్రీలంక పుంజుకున్న తీరు నిజంగా ఒక అద్భుతం. లంచ్, టీ విరామ సమయంలో కూడా మేము దీని గురించే చర్చించాం. ఇక దేవ్‌దత్త్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడు.కేఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్ చూపించాడు. మరోవైపు మానవ్ సుతార్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటర్ల మైండ్‌సెట్‌ను ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నాడు. అతడు కచ్చితంగా సుదీర్ఘ కాలం పాటు భారత జట్టులో కొనసాగుతాడు. ఈ మ్యాచ్‌లో మా పేస్ బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారు" అని గిల్ పేర్కొన్నాడు.అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు గురుంచి గిల్ మాట్లడుతూ.. "మేము నవంబర్‌లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తున్నాం. అక్కడ మ్యాచ్‌లను గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్నాం. ఈ రెండు సిరీస్‌లలోనూ గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంటామన్న నమ్మకం ఉందని" చెప్పుకొచ్చాడు.చదవండి: WTC 2025-27: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు బిగ్ షాక్ -
వరుస సెంచరీలు!.. చరిత్ర సృష్టించిన సొనాల్ దినుష
శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఆరోజు ఆటలో లంకను త్వరగా అవుట్ చేయాలన్న భారత జట్టు ఆశలపై సొనాల్ దినుష నీళ్లు చల్లాడు. వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో శతక్కొట్టి శ్రీలంకకు ఊపిరిలూదాడు.ఈ క్రమంలోనే సొనాల్ దినుష సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియాపై ఇంత వరకు ఏ ఆసియా క్రికెటర్‌కూ సాధ్యంకాని ఓ అరుదైన ఘనత సాధించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-26లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది.శతక్కొట్టిన దినుషగాలె వేదికగా తొలి టెస్టులో టీమిండియా ఆతిథ్య లంకను 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో లంక ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ ఆల్‌రౌండర్ దినుష మాత్రం అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా శతకం సాధించిన ఈ 25 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేశాడు.ఇక కొలంబో వేదికగా రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో భారత్‌కు 213 పరుగుల ఆధిక్యం లభించగా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడమని చెప్పింది.వరుసగా రెండో సెంచరీఇదిలా ఉంటే.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల స్కోరు చేయడంలో సొనాల్ దినుషదే కీలక పాత్ర. ఏడో స్థానంలో వచ్చిన అతడు 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. ఇక ఫాలో ఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో లంక తేలిగ్గానే తలవొంచుతుందని భావించిన టీమిండియా దినుష ఊహించని షాకిచ్చాడు.తొలి ఆసియా బ్యాటర్‌గా..ఆఖరిదైన గురువారం రోజు ఆటలో ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మొదలుపెట్టిన దినుష.. అనూహ్య రీతిలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే రెండు పరుగులు తీసి వంద పరుగుల మార్కు అందుకున్న అతడు.. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.ఇక ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన సొనాల్ దినుష.. టీమిండియాతో టెస్టుల్లో ఆడిన తొలి నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. గాలె టెస్టులో 100, 84.. కొలంబోలో 103, 100* స్కోర్లు సాధించి ఈ అరుదైన ఘనత అందుకున్నాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్ కుమారుడికి చోటు -
సచిన్ మాదిరే: శ్రీలంక ప్లేయర్‌పై బీసీసీఐ ఉపాధ్యక్షుడి ప్రశంసలు
శ్రీలంక ఆటగాడు సొనాల్ దినుషపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా ప్రశంసలు కురిపించాడు. సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడని.. అతడి ఆట టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను గుర్తుకుతెస్తోందని కొనియాడాడు.కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ లంకను 165 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.దినుష అద్భుత ప్రదర్శనఅయితే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ ఆల్‌రౌండర్ సొనాల్ దినుష మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా సెంచరీ (100) చేసి అవుటైన ఈ 25 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక కొలంబో వేదికగా ఆదివారం మొదలైన రెండో టెస్టులోనూ సొనాల్ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న సొనాల్ దినుష.. 103 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. పసిందు సూరియబండారా (80)తో కలిసి దినుష జట్టును ఆదుకున్నాడు.పసిందుతో కలిసి..అయితే, మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత్‌కు 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో టీమిండియా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడేందుకు ఆహ్వానించింది. ఈ క్రమంలో పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) పట్టుదలగా నిలబడ్డారు. దీంతో బుధవారం నాటి నాలుగోరోజు ఆటలో లంక 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.ఇక నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి దినుష ఏడు పరుగులు చేశాడు. అయితే, కీలకమైన గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో మాత్రం దినుష భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి భోజన విరామ సమయానికి ముందే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ పరిణామాల క్రమంలో రాజీవ్ శుక్లా సొనాల్ దినుషపై ప్రశంసలు కురిపించాడు.సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడు‘‘శ్రీలంకకు చెందిన సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడు. టెండుల్కర్లా అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో గొప్ప ఆటగాడిగా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా కొనియాడాడు. అయితే, నెటిజన్ల నుంచి ఇందుకు మిశ్రమ స్పందన వస్తోంది. దిగ్గజ సచిన్‌తో అప్‌కమింగ్ ప్లేయర్‌ను ఎలా పోలుస్తారని పలువురు రాజీవ్ శుక్లాను విమర్శిస్తున్నారు.కాగా గతేడాది దినుష బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లలో కలిపి 500కు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. సచిన్ టెండుల్కర్ తన రెండున్నర దశాబ్దాల కెరీర్లో 200 టెస్టులు ఆడి.. 15,921 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా చెక్కు చెదరని రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యధికంగా 51 టెస్టు సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులకు చోటు -
IND vs SL: భారత్-శ్రీలంక రెండో టెస్టు డ్రా
IND vs SL 2nd Test Day 5: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. 229/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో టీమిండియాకు గెలుపును దూరం చేశాడు. శ్రీలంక తొమ్మిదో వికెట్ డౌన్ఎట్టకేలకు శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 90 బంతులు ఆడి 12 పరుగులు చేసిన కుమార.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. శ్రీలంక ప్రస్తుతం 190 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.శతక్కొట్టిన దినుష133.1: సిరాజ్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న దినుష. 196 బంతుల్లో వంద మార్కుల అందుకున్న ఆల్‌రౌండర్. ఈ సిరీస్‌లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్న 25 ఏళ్ల దినుష. లంక స్కోరు: 385-8. 172 పరుగుల ఆధిక్యం.పోరాడుతున్న శ్రీలంక.. సెంచరీకి చేరువలో దినుషకొలంబో టెస్టులో శ్రీలంక డ్రా దిశగా పోరాడుతోంది. ఆఖరి రోజు టీ బ్రేక్ సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం 170 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సోనల్ దినుష(195 బంతుల్లో 6 ఫోర్లుతో 98) సెంచరీకి చేరువలో ఉన్నాడు.150 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకలాహిరు కుమార 1, దినుష 83 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 363-8.ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక116.3 వ ఓవర్: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన ప్రబాత్ జయసూరియ. లాహిరు కుమార క్రీజులోకి వచ్చాడు. లంక స్కోరు: 355-8 (117). దినుష 76 పరుగులతో ఉన్నాడు. శ్రీలంక ఆధిక్యం 142 పరుగులు.140 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకదినుష 76, ప్రబాత్ సున్నా పరుగులతో ఉన్నారు. స్కోరు: 353/7 (115).శ్రీలంక స్కోరు: 341-7 (110)దినుష 65, ప్రబాత్ సున్నా పరుగులతో ఉన్నారు. ఆధిక్యం 128 పరుగులు.ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంకటీమిండియా రెండో సెషన్‌ను ఘనంగా ఆరంభించింది. భోజన విరామం తర్వాత మానవ్ సుతార్ అటాకింగ్‌కు వచ్చి.. నాలుగో బంతికే కేశారా నువాంతను పెవిలియన్‌కు పంపాడు. జురెల్‌కు క్యాచ్ ఇచ్చి 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నువాంత వెనుదిరిగాడు. దీంతో లంక ఏడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 330-7 (105). ప్రబాత్ జయసూరియ క్రీజులోకి రాగా.. దినుష 56 పరుగులతో ఉన్నాడు. లంక ఆధిక్యం 118 పరుగులు.తొలి సెషన్లో శ్రీలంక ఆధిపత్యంకీలకమైన ఐదో రోజు ఆటలో తొలి సెషన్లో భారత బౌలర్లు తేలిపోయారు. సొనాల్ దినుష, కేశారా నువాంత జోడీని విడదీసేందకు ఆపసోపాలు పడ్డారు. ఈ క్రమంలో దినుష అర్ధ శతకం (55*) పూర్తి చేసుకోగా.. నువాంత (46*) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.భోజన విరామ సమయానికి శ్రీలంక 104 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు సాధించింది. తద్వారా 116 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.నొప్పితో విలవిల్లాడిన నువాంత103.2వ ఓవర్: రవీంద్ర జడేజా వేసిన బంతి నువాంత కాలికి తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయితే, వెంటనే నువాంత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టాడు. జడ్డూ ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేయగా.. అంపైర్ నుంచి ప్రతికూల ఫలితమే వచ్చింది.115 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకవికెట్లు తీయలైక భారత బౌలర్ల పాట్లు.. శ్రీలంక స్కోరు: 328-6. నువాంత 46, దినుష 54 పరుగులతో ఉన్నారు.శ్రీలంక స్కోరు: 320-6 (99)దినుష 52, నువాంత 41 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 107 పరుగులు.దినుష హాఫ్ సెంచరీ99 బంతులలో యాభై పరుగులు పూర్తి చేసుకున్న దినుష. నువాంత 39 పరుగులతో ఉండగా.. లంకస్కోరు: 315-6. 102 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక.శ్రీలంక స్కోరు: 306-6 (94)93 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక. దినుష 42, నువాంత 37 పరుగులతో ఉన్నారు.89 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకదినుష 39, నువాంత 37 పరుగులతో ఉన్నారు. స్కోరు: 302-6 (91).డ్రింక్స్ బ్రేక్ సమయానికి శ్రీలంక స్కోరు: 284-6దినుష 34, నువాంత 28 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 71 పరుగులకు చేరుకుంది. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి.శ్రీలంక స్కోరు: 276-6 (86)50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దినుష, నువాంత. దినుష 29, నువాంత 27 పరుగులతో ఉన్నారు. 63 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకనిలకడగా ఆడుతున్న దినుష, నువాంతదినుష 22, నువాంత 20 పరుగులతో ఉన్నారు. స్కోరు: 262-6 (84). 49 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక. Ravindra Jadeja gets one to turn sharply as #TeamIndia hunt for wickets. 😮💨 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/cMB2L0A3Ro— Sony Sports Network (@SonySportsNetwk) August 27, 202644 పరుగుల ఆధిక్యంలో లంకదినుష 21, నువాంత 17 పరుగులతో ఉన్నారు.35 పరుగుల ఆధిక్యంలో లంకసొనాల్ దినుష 13, నువాంత 16 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 248/6 (78)శ్రీలంక ఓవర్‌నైట్ స్కోరు: 229-6సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.స్వల్ప ఆధిక్యంలో లంకఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక బుధవారం ఆట పూర్తయ్యేసరికి 72.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) రాణించడంతో ఎట్టకేలకు లంక ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది.సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503-9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఆతిథ్య లంకను ఫాలో ఆన్ ఆడమని చెప్పింది. కాగా వర్షం వల్ల బుధవారం నాటి నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించాల్సి వచ్చింది. క్లీన్‌స్వీప్‌పై గురిఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా శ్రీలంకను 165 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇదే జోరులో రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసేందుకు భారత్ సిద్ధమైంది.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సారాంశ్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణశ్రీలంకలాహిరు ఉదార, కమిల్ మిశారా, పసిందు సూరియబండారా, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వ (కెప్టెన్), సొనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశారా నువాంత, ప్రబాత్ జయసూరియ, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
జడేజా ఖాతాలో ఊహకు కూడా అందని చెత్త రికార్డు!
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో ఊహకు అందని విధంగా అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. డీఆర్ఎస్ కోరడంలో 22 సార్లు విఫలమై చెత్త రికార్డు మూటగట్టుకున్న జడేజా ఖాతాలో ఇప్పుడు నోబాల్స్ రికార్డు కూడా వచ్చి చేరడం గమనార్హం. 2021 నుంచి ఐదేళ్ల కాలంలో జడేజా అత్యధిక నోబాల్స్ వేసిన స్పిన్నర్‌గా నిలిచాడు. అతని ఖాతాలో ఏకంగా 88 నో-బాల్స్ నమోదయ్యాయి. ఫాస్ట్ బౌలర్లు నోబాల్స్ వేయడం సర్వ సాధారణం. ఎందుకంటే రనప్‌లో తేడా వచ్చిన ప్రతీసారి వాళ్లు నోబాల్స్ వేయడం కనిపిస్తుంది. కానీ స్పిన్నర్లు మాత్రం వీలైనంత తక్కువగానే నోబాల్స్ వేయడం చూస్తుంటాం.కానీ జడేజా విషయంలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. 2021 నుంచి ఇప్పటివరకు జడేజా 88 నో బాల్స్ వేయడం గణాంకాల పరంగా ఆందోళన కలిగించే అంశం. తాజాగా కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో జడేజా నో-బాల్ వేయడం మరోసారి చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇదే టెస్టులో భారత స్పిన్నర్లు ఇప్పటివరకు మొత్తం 10 నో-బాల్స్ వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.నో-బాల్స్ జాబితాలో జడేజా టాప్2021 నుంచి టెస్టు క్రికెట్ లో స్పిన్నర్లు వేసిన నో-బాల్స్ గణాంకాలను పరిశీలిస్తే జడేజా అందరికంటే ముందున్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ 40 నోబాల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా వేసిన నో-బాల్స్ సంఖ్య తన తర్వాతి స్థానంలో ఉన్న బౌలర్‌కు రెట్టింపు సంఖ్యలో ఉండడం గమనార్హం.2021 నుంచి టెస్టుల్లో స్పిన్నర్లు వేసిన నో-బాల్స్:👉రవీంద్ర జడేజా (భారత్): 88👉నోమన్ అలీ (పాకిస్థాన్): 40👉లసిత్ ఎంబల్దేనియా (శ్రీలంక): 33👉జాక్ లీచ్ (ఇంగ్లాండ్): 19👉జోమెల్ వార్రికాన్ (వెస్టిండీస్): 17👉జహిర్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్): 17ఇక మ్యాచ్ విషయానికొస్తే కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి శ్రీలంక 229/6 స్కోరుతో ఉండగా, ఆతిథ్య జట్టు కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది.Most no-balls by spinners in Tests since 2021: 88* - Ravindra Jadeja. 40 - Noman Ali. 33 - Lasith Embuldeniya. pic.twitter.com/y9EsOgImCP— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2026Read: 21 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ -
అలా జరగొద్దు.. టీమిండియాకు పొంచి ఉన్న గండం!
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి శ్రీలంక 229/6 స్కోరుతో ఉండగా, ఆతిథ్య జట్టు కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో, భారత్ గెలుపు లాంచనమే అయినప్పటికీ, వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. ఒకవేళ వర్షంతో ఐదో రోజు ఆటలో ఒక్క బంతి కూడా సాధ్యపడకపోతే అప్పుడు మ్యాచ్ డ్రా అవుతుంది. మరి మ్యాచ్ డ్రా అయితే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంలో భారత్‌కు ఎదురయ్యే అడ్డంకులు ఏంటనేవి ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 53.33 శాతం పాయింట్లతో (PCT) ఐదవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, శ్రీలంకపై గెలిస్తే భారత్ నాలుగో స్థానానికి చేరుకుంటుంది. అయితే, మ్యాచ్ డ్రా అయితే మాత్రం, భారత్ 51.52 శాతం పాయింట్ల తేడాతో ఐదవ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్‌కు మరో ఏడు టెస్టులు మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 10 టెస్టుల్లో ఇప్పటికే నాలుగింటిలో ఓడిపోయిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టుకు, ఇక నుంచి ప్రతీ టెస్టు నాకౌట్ లాంటిదే. ఈ ఏడాది నవంబరులో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్ న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టును బంగ్లాదేశ్ నెగ్గడంతో, భారత్ తమకు మిగిలిన 8 టెస్టుల్లో ఏడు గెలవాల్సి ఉంటుంది. అయితే ఇప్పడు లంకతో రెండో టెస్టు వర్షం వల్ల డ్రా అయితే మాత్రం భారత్ కచ్చితంగా ఏడింటికి ఏడు టెస్టులు గెలవాల్సి ఉంటుంది. అప్పుడే టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్లు 68.52గా ఉండడంతో పాటు ఫైనల్ ఆడేందుకు చాన్స్ ఉంటుంది. అంతేకాదు భారత్‌కు రాబోయే ఏడు టెస్టుల్లో ఎలాంటి పెనాల్టీ పాయింట్లు లభించకపోతేనే ఈ పరిస్థితులు సాధ్యమవుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.చదవండి: మాస్టర్ ప్లాన్ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్! -
మాస్టర్ ప్లాన్ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో మాత్రమే ఉంది. సోనల్ దినూష (7), కెషారా నువంత (3) క్రీజులో ఉన్నారు. సోనల్ దినూష మాత్రమే బ్యాటర్ కావడం, మిగతావాళ్లంతా టెయిలెండర్లు కావడంతో చివరి రోజు టీమిండియా బౌలర్లకు మిగతా నాలుగు వికెట్లు తీయడం కష్టమేమీ కాదు. అయితే లంక రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్ పసిందు సూరియబండార ఆయువు పట్టుగా నిలిచాడు. 21 పరుగుల వద్ద లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత 90 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక నాలుగో రోజు ఆటను పూర్తి చేయగలిగిందంటే అదంతా పసిందు చలవే. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన పసిందును ఔట్ చేసేందుకు టీమిండియా మాస్టర్‌ప్లాన్ వేసింది.ఆ మాస్టర్‌ప్లాన్‌లో పంత్, మానవ్ సుతార్లు కీలకపాత్ర పోషించారు. ఇన్నింగ్స్ 61వ ఓవర్ మానవ్ సుతార్ వేశాడు. ఆఫ్ స్టంప్ అవతల వేసిన స్లో బంతిని పసిందు ఆడే ప్రయత్నంలో క్రీజులైన్ దాటి బయటికి వచ్చాడు. ఇది గమనించిన పంత్ కేవలం 0.3 సెకన్ల వ్యవధిలో బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. రిప్లేలో పంత్ చేసిన డిస్మిసల్ చూస్తే వారెవ్వా అనకుండా ఉండలేం. ఈ ఒక్క స్టంపౌట్ విషయంలో మాత్రం భారత మాజీ కీపర్ ఎంఎస్ ధోనిని కూడా మించిపోయాడనంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా మానవ్ సుతార్ తెలివైన బంతితో పసిందును బోల్తా కొట్టించినప్పటికీ, ఇక్కడ పంత్‌ను కూడా మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకముందు బంతికే పసిందు ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. ఈ సమయంలో పంత్.. ‘బ్యాటర్ అలసిపోయాడు.. రెడీగా ఉండండి’ అన్న మాటలు మైక్ స్టంప్‌లో రికార్డయ్యాయి.Rishabh Pant stumped Sri Lanka’s Sooriyabandara in just 0.3 seconds 🥶🔥What a quick stumping 🔥 pic.twitter.com/lztPjNcEMf— Harshit (@I_am_Harshit_17) August 26, 2026Read: దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్.. ఏం జరిగిదంటే? -
దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్.. ఏం జరిగిదంటే?
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసకందాయంలో పడింది. ఆటకు మరో రోజు మిగిలి ఉన్న సమయంలో టీమిండియా మరో విజయం దిశగా అడుగులు వేస్తోంది. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత రెండో సెషన్లో జడేజా, సిరాజ్‌ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. లంక రెండో ఇన్నింగ్స్ 31వ ఓవర్లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జడేజా బౌలింగ్‌లో పసిందు సూరియబండార డీప్ ఫార్వర్డ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. బంతి బౌండరీకి వెళ్లనప్పటికీ, అక్కడే ఉన్న సిరాజ్ వెనక్కి పరిగెత్తి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడికి చాలా దూరంలో పడింది. క్యాచ్ పట్టడం కష్టమని తెలిసినా కూడా జడేజా మాత్రం సిరాజ్ చర్యపట్ల అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగా అరిచాడు. దీంతో సిరాజ్‌కు చిర్రెత్తుకొచ్చి.. ‘అరె జడ్డూ బాయ్.. నువ్వు నా ఏరియాలో నిలబడి ఫీల్డింగ్ చెయ్యు.. అప్పుడు నీకే క్లారిటీ వస్తుంది’ అని నవ్వుతూనే కౌంటర్ ఇచ్చాడు. దీనికి ప్రతిచర్యగా జడేజా మాత్రం ‘సరే వదిలెయ్’ అన్నట్లుగా తలూపాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాటలు అరుచుకున్నప్పటికీ కాసేపటికే ఇద్దరూ కూల్ అయ్యారు. మ్యాచ్ విషయానికొస్తే.. బుధవారం నాలుగో రోజు ఆటలో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. డెబ్యూ ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే లంకను ఫాలో ఆన్ ఆడించేందుకు టీమిండియా మొగ్గు చూపింది. లంక తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రోజు ముగిసేసరికి 5 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న లంక 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.pic.twitter.com/jFfDPp6M6B— crictalk (@crictalk7) August 26, 2026Read: 27 ఏళ్లకే కెరీర్ క్లోజ్; ప్రతీకార చర్యకు మాజీ క్రికెటర్ సిద్ధం! -
IND vs SL: ఎట్టకేలకు ఆధిక్యంలోకి శ్రీలంక!
టీమిండియాతో రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక ఎట్టకేలకు ఆధిక్యంలోకి వచ్చింది. పసిందు సూరియబండారా అద్భుత ఆట తీరుతో లంక పరువును కాపాడాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే.సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) శతకాల వల్ల భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.290 రుగులకే ఆలౌట్అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 290 రుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. దీంతో లంక దాదాపు మూడు వందల పరుగులకు చేరువకాగలిగింది.ఫాలో ఆన్భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. అరంగేట్ర ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లంకను 290 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఫాలో ఆన్‌లో భాగంగా వెంటనే శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.రాణించిన పసిందు, కమిందుఈ క్రమంలో బుధవారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే శ్రీలంక తమ ఓపెనర్ లాహిరు ఉదార (3) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ కమిల్ మిశార (32)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ పసిందు రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆ తర్వాత కమిందు మెండిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించాడు.ఈ క్రమంలో కమిందు అర్ధ శతకం (55) పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కాగా.. పసిందు సెంచరీ దిశగా పయనించాడు. అయితే, మానవ్ సుతార్ స్పిన్ మాయలో చిక్కుకుని.. 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. మిగతా వారిలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (6) విఫలమయ్యాడు.ఎట్టకేలకు ఆధిక్యంలోకి లంకఅయితే, వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేశారు. మొత్తానికి నాలుగో రోజు ఆట పూర్తయ్యే సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. సెంచరీ వీరుడు సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.భారత బౌలర్లలో మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, సారాంశ్ జైన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆటకు గురువారమే చివరి రోజు. అయితే, బుధవారం వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేసిన క్రమంలో గురువారం ఉదయం 9.45 నిమిషాలకే మ్యాచ్ ఆరంభమవుతుంది. ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే గాలెలో టీమిండియా గెలుపొందింది. కొలంబోలోనూ భారత్ గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే, వర్షం ముప్పు కారణంగా గురువారం వీలైనంత త్వరగా లంకను ఆలౌట్ చేసి.. విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
వైభవ్, జైస్వాల్‌పై కఠిన చర్యలు తీసుకోండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీళ్లిద్దరు హద్దు మీరుతున్నారన్నాడు. కాబట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.కాగా ఇటీవల భారత్-‘ఎ’ జట్టు శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-‘ఎ’తో కీలక మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ క్రీజును వీడుతుండగా.. లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. ‘మ్యాచ్ అయిపోయింది. ఇంటికి వెళ్లు’ అని కవ్వించినట్లు తెలిసింది.ఇందుకు వైభవ్ ధీటుగా బదులిచ్చాడు. సహనం కోల్పోయిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు లంక ప్లేయర్‌పైకి దూసుకువెళ్లి విశేన్‌ను వెనక్కి నెట్టాడు. అతడూ వైభవ్‌నూ తోసేయగా.. మిగతా లంక ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకోలేదని సమాచారం.ఇక తాజాగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా అసితా ఫెర్నాండోతో గొడవపడ్డాడు. జైసూను అవుట్ చేసిన తర్వాత అసితా ఏదో అనడంతో.. అతడిపైకి దూసుకెళ్లి హెల్మెట్‌తో డ్యాష్ ఇచ్చాడు. అతడూ జైసూ పైపైకి వెళ్లాడు. దీంతో ఐసీసీ జైస్వాల్, అసితాలకు జరిమానా వేయడంతో పాటు వారి ఖాతాలో డీమెరిట్ పాయింట్ జత చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘ప్రియమైన ఐసీసీ, బీసీసీఐ.. ఇటీవల ఇండియా-ఎ టూర్ సందర్భంగా వైభవ్.. ఇప్పుడు జైస్వాల్.. వీళ్లిద్దరు హద్దు మీరి ప్రవర్తించారు. వీరిని ఇలాగే కొనసాగిస్తే కష్టం. మళ్లీ అవే తప్పులు పునరావృతం చేస్తారు.క్రీడా స్ఫూర్తికి ముఖ్యంగా వాళ్లిద్దరి భవిష్యత్తుకు ఇది ఎంత మాత్రం మంచి కాదు’’ అని ఎక్స్ వేదికగా మంజ్రేకర్ ఐసీసీ, బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అయితే, నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది మంజ్రేకర్‌కు మద్దతు పలుకుతూ ఉంటే.. మరికొందరు మాత్రం ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లే రెచ్చగొట్టారని.. అందుకు వైభవ్, జైసూ కేవలం స్పందించారంటూ వారిని సమర్థిస్తున్నారు.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
టీమిండియా కొంపముంచిన ప్రసిధ్.. గంభీర్, జడేజా ఆగ్రహం!
కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫాలో ఆన్‌లో మాత్రం లంక జాగ్రత్తగా ఆడుతోంది. భారత్‌కు విజయం దక్కనివ్వొద్దనే కాంక్షతో లంక బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు టీమిండియా ఫీల్డర్లు పలు క్యాచ్‌లు జారవిడవడం కూడా లంకకు కలిసొచ్చింది. ముఖ్యంగా పసిందు సూరియబండారా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ప్రస్తుతం 90 పరుగులతో ఆడుతున్న సూరియబండారా 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడు ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిధ్ క్రిష్ణ వదిలేయడం భారత్ కొంపముంచింది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జడేజా వేసిన ఫ్లైటెడ్ డెలివరీని పసిందు బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిధ్ క్యాచ్ అందుకోవడం కష్టతరమైనప్పటికీ, కాస్త ముందుకు డైవ్ చేసి ఉంటే సులువుగా క్యాచ్ తీసుకునేవాడే. కానీ అతడు ప్రయత్నం చేయకపోవడంతో బంతి అతని చేతి వేళ్లను తాకుతూ పక్కకు వెళ్లిపోయింది. ఇది చూసిన జడేజా..‘ అరె బాయ్.. ఏ క్యా హై?’ అంటూ ప్రసిధ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఇదే సమయంలో డ్రెసింగ్ రూమ్ నుంచి గమనిస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ప్రసిధ్ క్యాచ్ జారవిడవడంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఫొటోలు కెమెరా కంటికి చిక్కాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా క్యాచ్ డ్రాప్‌తో బతికిపోయిన పసిందు సూరియబండారా ఇప్పుడు సెంచరీకి చేరువలో ఉన్నాడు. తనకు వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత ఫిఫ్టీ సాధించడంతో పాటు తన జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఒకవేళ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పసిందు ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిధ్ అందుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.pic.twitter.com/YHn9sJJyfU— crictalk (@crictalk7) August 26, 2026Read: నంబర్‌వన్ బౌలర్‌గా స్టార్క్.. 16 ఏళ్ల కెరీర్లో తొలిసారి -
IND vs SL: ‘ఫాలో ఆన్’ ఆడి గెలిచిన జట్లు ఇవే!
కొలంబోలో టీమిండియాతో రెండో టెస్టులో శ్రీలంక గెలవాలంటే అద్భుతం జరగాలి. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో పూర్తిగా వెనుకబడ్డ ఆతిథ్య జట్టు.. ఫాలో ఆన్ ఆడుతోంది. శ్రీలంక ఆశలన్నీ పసిందు సూరియబండారా, సొనాల్ దినుషలపైనే ఉన్నాయి.అయితే, భారత బౌలర్లు విజృంభిస్తే మాత్రం శ్రీలంకకు భారీ ఓటమి తప్పదు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక మెరుగైన ఆరంభం అందుకున్నప్పటికీ టీమిండియానే శాసించే స్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గిల్ సేన గెలవడం దాదాపు లాంఛనమే!.. ఇదిలా ఉంటే.. టెస్టు మ్యాచ్‌లో ఫాలో ఆడి మరీ గెలిచిన జట్లు ఏవో తెలుసా? ఈ జాబితాలో టీమిండియా కూడా ఉందండోయ్!! (శ్రీలంకను ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా)ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపుహేమాహేమీలు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య 1894లో తొలిసారి టెస్టు మ్యాచ్ జరిగింది. సిడ్నీలో జరిగిన ఈ పోరులో ఆసీస్ 586 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. జార్జ్ జిఫేన్ సెంచరీ, సిడ్ గ్రెగరీ డబుల్ సెంచరీ కారణంగా ఈ స్కోరు సాధ్యమైంది.ఇందుకు ప్రతిగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులే చేయడంతో.. కంగారూలు ఇంగ్లిష్ జట్టును ఫాలో ఆన్ ఆడించారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. 437 పరుగులు సాధించింది. తద్వారా ఆసీస్‌కు 177 పరుగుల లక్ష్యం విధించగా.. ఆతిథ్య జట్టు చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లండ్ జయభేరి మోగించింది.మరోసారి అదే ఫలితంలీడ్స్ వేదికగా 1981లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక ఆసీస్ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 401-9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జాన్ డైసన్ సెంచరీతో అలరించాడు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఇంగ్లండ్‌ను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో దిగ్గజ ఇయాన్ బోతమ్ సంచలన రీతిలో శతక్కొట్టడంతో ఇంగ్లండ్ 356 పరుగులు సాధించింది.ఈ క్రమంలో 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ఛేదనలో తడబడింది. ఫలితంగా ఇంగ్లండ్ 18 పరుగుల తేడాతో కంగారూలపై విజయం సాధించింది.ఈసారీ బాధిత జట్టు ఆస్ట్రేలియానే.. గెలుపు మనదేకోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 2001లో జరిగిన ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 445 పరుగులు సాధించింది.అయితే, బ్యాటర్ల వైఫల్యం కారణంగా టీమిండియా 171 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారీ ఆధిక్యం సంపాదించిన ఆసీస్.. టీమిండియాను తక్కువగా అంచనా వేసి ఫాలో ఆన్ ఆడించింది.రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారత్ తడబడలేదు. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ కలిసి అద్భుతం చేశారు. ద్రవిడ్ భారీ శతకం (180) సాధించగా.. లక్ష్మణ్ (281) తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా ఆసీస్‌కు 384 పరుగుల లక్ష్యం విధించింది.అయితే, ఈసారి భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ 212 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 171 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఇంగ్లండ్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జో రూట్ (153 నాటౌట్), హ్యారీ బ్రూక్ (186) శతకాలతో చెలరేగారు.అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ 209 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కివీస్‌ను ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులు సాధించింది. కేన్ విలియమ్సన్ సెంచరీ (132)తో ఆకట్టుకోగా.. టామ్ లాథమ్ (83), డెవాన్ కాన్వే (61), డారిల్ మిచెల్ (54), టామ్ బ్లండెల్ (90) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో గెలిచిన కివీస్.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రా చేసింది. చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్ -
గాయపడ్డ సిరాజ్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. శ్రీలంకతో రెండో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా క్యాచ్ అందుకునే క్రమంలో ఈ హైదరాబాదీ అదుపుతప్పి కిందపడ్డాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 503-9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా శ్రీలంకను 290 పరుగులకు ఆలౌట్ చేసిన.. టీమిండియా ఫాలో ఆన్ ఆడిస్తోంది.పసిందు క్యాచ్ అందుకునేందుకు..ఈ క్రమంలో లంక రెండో ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో శ్రీలంక వన్‌డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా షాట్ ఆడగా.. క్యాచ్ పట్టేందుకు సిరాజ్ డీప్ మిడ్ వికెట్ పొజిషన్ నుంచి పరిగెత్తుకు వచ్చి డైవ్ కొట్టాడు.మైదానం వీడి.. ఈ క్రమంలో బంతిని అందుకున్నప్పటికీ.. అది సిరాజ్ చేజారింది. అదుపు తప్పి కిందపడ్డ సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కటెముకల వద్ద చేయి పెట్టుకుని నొప్పితో విలవిల్లాడాడు. హుటాహుటిన ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయితే, నొప్పి తగ్గకపోవడంతో సిరాజ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. తిరిగి వచ్చిన సిరాజ్భోజన విరామం తర్వాత కూడా సిరాజ్ ఫీల్డ్‌కు రాలేదు. దీంతో సిరాజ్ గాయంపై అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. అయితే, కాసేపటి తర్వాత అతడు మైదానానికి వచ్చి చురుకుగా ఫీల్డింగ్ చేయడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్! -
IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్
టీమిండియాతో టెస్టుల్లో శ్రీలంక ప్రదర్శన ఎలా ఉన్నా.. ఆ జట్టు ఆల్‌రౌండర్ సొనాల్ దినుష మాత్రం అదరగొడుతున్నాడు. గాలె వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట సొనాల్ దినుష సెంచరీ (100)తో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.భారత్ భారీ స్కోరుఅదే విధంగా.. భారత్‌తో రెండో టెస్టులోనూ సొనాల్ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కొలంబో వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి... 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక టాపార్డర్‌ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఓపెనర్లు లాహిరు ఉదార (1), కమిల్ మిశారా (19)లను ప్రసిద్ కృష్ణ పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రభాత్ జయసూరియ (2)ను మానవ్ సుతార్ అవుట్ చేశాడు.పసిందు పోరాటంఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోగా పసిందు సూరియబండారా (80), కమిందు మెండిస్ (32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీళ్లిద్దరు అవుటైన తర్వాత శ్రీలంక నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ అవుతుందని భావించగా.. సొనాల్ దినుష నేనున్నానంటూ మరోసారి ఆపన్నహస్తం అందించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ ఆల్‌రౌండర్ శతక్కొట్టాడు.సెంచరీ చేశాడు.. కానీమొత్తంగా 162 బంతులు ఎదుర్కొన్న సొనాల్ దినుష.. 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. పసిందుతో కలిసి 34, కేశారా నువాంతతో కలిసి 57, లాహిరు కుమారతో కలిసి 58 పరుగులు జోడించి.. జట్టు పరువును కాపాడగలిగాడు. అయితే, ఫాలో ఆన్ గండం నుంచి మాత్రం తప్పించలేకపోయాడు. కొలంబోలో నాలుగో రోజు ఆటలో భాగంగా భారత స్పిన్నర్ సారాంశ్ జైన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి సొనాల్ దినుష పదో వికెట్‌గా వెనుదిరిగాడు.సరికొత్త చరిత్ర అయితే, తన అద్భుతమైన ఆట తీరుతో 25 ఏళ్ల సొనాల్ దినుష శ్రీలంక తరఫున సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టుల్లో బ్యాటింగ్ ఆర్డర్లో ఆరు లేదంటే అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన తొలి లంక ఆటగాడిగా రికార్డు సాధించాడు. గాలె, కొలంబో టెస్టుల్లో శతకాలు బాది ఈ ఘనత సాధించాడు. కాగా దినుష గతేడాది జూన్‌లో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. లంకను 290 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో లంకను ఫాలో ఆన్ ఆడిస్తోంది. కాగా గాలె టెస్టులో శ్రీలంక టీమిండియా చేతిలో 165 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.టీమిండియాతో టెస్టుల్లో ఆరు లేదంటే అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన శ్రీలంక క్రికెటర్లుసొనాల్ దినుష- 2 శతకాలుదినేశ్ చండిమాల్-1 శతకంతిలక్రత్నె దిల్షాన్-1 శతకంప్రసన్న జయవర్దనె-1 శతకంఅర్జున రణతుంగ-1 శతకంతిలాన్ సమరవీర-1 శతకంహషాన్ తిలకరత్నె-1 శతకం.A STAR IN THE MAKING! ⭐ Against all odds, Sonal Dinusha stood tall with a brilliant century to keep Sri Lanka’s hopes alive. 💪 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/YoMY8T0h3I— Sony Sports Network (@SonySportsNetwk) August 26, 2026చదవండి: టెస్టు క్రికెట్లో ఫాలో ఆన్ అంటే? -
శ్రీలంక ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా
టీమిండియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకు ఆలౌట్ అయింది. పసిందు సూరియబండారా భారీ అర్ధ శతకం (80)తో రాణించగా.. సొనాల్ దినుష శతక్కొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన దినుష 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. అయితే, మిగతా వారంతా విఫలం కావడంతో శ్రీలంకకు ఫాలో ఆన్ గండం తప్పలేదు.కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దేవదత్ పడిక్కల్ (117) శతక్కొట్టగా.. ధ్రువ్ జురెల్ అజేయ శతకం (115) సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (63), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (50) హాఫ్ సెంచరీలతో అలరించగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 45 పరుగులతో రాణించాడు.ఫలితంగా సోమవారం నాటి రెండో రోజు ఆటలో భారత్ 503-9 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్ జయసూరియ, కేశారా నువాంత చెరో రెండు వికెట్లు తీశారు. లాహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక రెండో ఆటలో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఎనిమిది పరుగులే చేసింది. ఈ క్రమంలో 8/2 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంకకు పసిందు ఊపిరిలూదాడు. మొత్తంగా 133 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.మిగతా వారిలో కమిందు మెండిస్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8), వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (0) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డాడు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేయగలిగింది.ఇక బుధవారం నాటి నాలుగో రోజు ఆటను 265/8తో మొదలుపెట్టగా.. సారాంశ్ జైన్ లాహిరు కుమార (12)ను వెనక్కి పంపాడు. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న దినుషను సైతం సారాంశ్ పెవిలియన్‌కు పంపడంతో లంక ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. సారాంశ్ జైన్‌కు రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలకు తలా ఒక వికెట్ దక్కాయి. ఫాలో ఆన్ అంటే?టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 200 లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే.. ఫాలో ఆన్ ఆడిస్తుంది. అంటే.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఆలౌట్ కాగానే మళ్లీ బ్యాటింగ్ చేయమని కోరుతుంది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)లోని 14.1.1 నిబంధన ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టుకు ఈ హక్కు లభిస్తుంది. భారత్- శ్రీలంక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. లంకను 290 పరుగులకు ఆలౌట్ చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సాధించింది. కాబట్టి ఫాలో ఆన్ ఆడిస్తోంది. అసలే ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ఉంది. మరోవైపు ఆట ఇప్పటికే నాలుగో రోజుకు చేరుకుంది. దీంతో టీమిండియా ఫాలో ఆన్‌కు మొగ్గుచూపింది. కాగా తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: భువీ విజృంభణ -
22లో 18 వృథా.. జడేజా చెత్త రికార్డు; గిల్ జాగ్రత్త!
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. అశ్విన్‌తో కలిసి బౌలింగ్‌ను పంచుకున్న జడేజా టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో భాగమయ్యాడు. వేగంగా ఓవర్లు పూర్తి చేయడంలో జడేజా సిద్ధహస్తుడు. ఇక వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం జడ్డూ శైలి కావడంతో బ్యాటర్లు ఎక్కువగా ఎల్బీడబ్ల్యూగానే వికెట్ ఇచ్చుకుంటారు. కానీ ఇప్పుడు అదే ఎల్బీడబ్ల్యూలకు సంబంధించి డీఆర్ఎస్ తీసుకునే విషయంలో జడేజా చెత్త రికార్డు నెలకొల్పాడు. సుదీర్ఘ ఫార్మాట్లో గణాంకాల పరంగా మెరుగ్గానే ఉన్నప్పటికీ.. డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించడం)లో మాత్రం జడ్డూ వరుసగా ఫెయిలవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకూ అతడు వరుసగా 22 రివ్యూలను కోల్పోయాడు. వీటిలో నాలుగు దఫాలు మాత్రమే అంపైర్ కాల్‌గా వెళ్లాయి. గత మూడేళ్ల కాలంలో జడేజా 22 సార్లు డీఆర్ఎస్లు తీసుకోగా.. అందులో 18 రివ్యూలు వృథా అయ్యాయి.దీంతో ఇన్ని రివ్యూలు కోల్పోయిన తొలి ఆల్‌రౌండర్‌గా జడేజా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. చివరిసారిగా 2023లో జడేజా తీసుకున్న రివ్యూ విజయవంతమైంది. ఆ ఏడాది జూలైలో డొమినికా టెస్టులో వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో రివ్యూతో కీమర్ రోచ్ వికెట్‌ను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి జడేజా మళ్లీ రివ్యూల్లో సక్సెస్ కాలేదు. అందుకే కెప్టెన్‌గా గిల్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో ఆటగాళ్లు పట్టుబట్టినా రివ్యూలు తీసుకోని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి గిల్ నేర్చుకోవాల్సిన అవసరముంది. ఇక జడేజా ఇప్పటివరకు 90 టెస్టుల్లో 4,117 పరుగులు చేయడంతో పాటు 352 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 15సార్లు ఐదు వికెట్లు, మూడు దఫాలు పది వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.Ravindra Jadeja has had his last 22 DRS reviews struck down as a bowler in Tests. Only four of them have turned out to be umpire's call 🤯His last successful review as a bowler came in the West Indies' first innings in the Dominica Test in July 2023, with the dismissal of Kemar… pic.twitter.com/H6uqCc0OCR— Cricinfo (@cricinfo) August 25, 2026చదవండి: జిడ్డులా తగులుకున్నాడు.. లంక బ్యాటర్ అరుదైన రికార్డు! -
జిడ్డులా తగులుకున్నాడు.. లంక బ్యాటర్ అరుదైన రికార్డు!
కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినూష ఒంటరిపోరాటం చేస్తున్నాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయినప్పటికీ దినూష వికెట్ తీయడంలో మాత్రం భారత బౌలర్లు విఫలమయ్యారు. ప్రస్తుతం దినూష 85 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు.తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన దినూష రెండో టెస్టులోనూ లంక పాలిట ఆపద్బాంధవుడయ్యాడు. ఒకపక్క వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ, దినూష మాత్రం తన బ్యాటింగ్‌తో భారత్‌కు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోనల్ దినూష టెస్టుల్లో ఒక అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.భారత్‌తో జరిగిన టెస్టుల్లో తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో 80 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా దినూష నిలిచాడు. తొలి టెస్టులో దినూష మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు, తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. గతంలో జహీర్ అబ్బాస్ (176, 96, 235 నాటౌట్), ఎవర్టన్ వీక్స్ (128, 194, 162) భారత్‌పై ఈ ఫీట్ అందుకున్నారు. అయితే భారత్‌పై టెస్టుల్లో తొలి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా ఎవర్టన్ వీక్స్ నిలిచాడు.స్వీప్ షాట్లతో మరో రికార్డుపనిలో పనిగా దినూష మరో రికార్డు కూడా అందుకున్నాడు. అదేంటంటే, ఒక టెస్టు సిరీస్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడుతూ ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దినూష (106 పరుగులు) ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానం కూడా జో రూట్‌దే.2021లో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో రూట్ స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడి 160 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత మరో ఇంగండ్ బ్యాటర్ బెన్ డకెట్ 2022లో పాకిస్తాన్ తో టెస్టు సిరీస్‌లో స్వీప్ షాట్ల రూపంలో 112 పరుగులు సాధించాడు. దినూష తర్వాత యూనిస్ ఖాన్ (103 పరుగులు), మిస్బా ఉల్ హక్ (103 పరుగులు) సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.లంక తరఫున రెండో బ్యాటర్గాశ్రీలంక తరఫున భారత్‌పై తొలి మూడు టెస్టు ఇన్నింగ్స్‌లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గానూ సోనల్ దినూష నిలిచాడు. గతంలో 1982లో దులీప్ మెండిస్ భారత్‌పై వరుసగా 105, 105, 51 పరుగులు సాధించాడు. సోనల్ దినూష స్పిన్ బౌలింగ్‌లో సాధించిన 284 పరుగుల్లో 122 రన్స్ (42.95 శాతం) స్వీప్, స్లాగ్, రివర్స్ షాట్ల ద్వారా సాధించడం విశేషం. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. సోనల్ దినూష (85), లాహిరు కుమారా (8) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో 3 వికెట్లు తీశారు. లంక మరో 238 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో చెలరేగారు.Sonal Dinusha keeps Sri Lanka’s hopes alive against India in Colombo 👊#WTC27 📝: https://t.co/8NP3Qr1pnQ pic.twitter.com/3HMx47B3av— ICC (@ICC) August 25, 2026Sonal Dinusha is only the second Sri Lankan batter to score three consecutive 50+ scores in his first three Test innings against India! 🇱🇰🤍🌟#SLvIND #Tests #WTC #Sportskeeda pic.twitter.com/DlAq45rejU— Sportskeeda (@Sportskeeda) August 25, 2026Read: ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె! -
అతడు తీవ్రంగా గాయపడ్డాడు: టీమిండియా కోచ్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గురించి భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక అప్డేట్ అందించాడు. పంత్ భుజానికి తీవ్రమైన గాయమైందని తెలిపాడు. అందుకే మూడో రోజు ఆటలో అతడు మైదానంలో దిగలేదని తెలిపాడు.కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో ఆదివారం ఇరుజట్ల మధ్య కొలంబోలో రెండో టెస్టు మొదలైంది. తొలిరోజు ఆట సందర్భంగా మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాయపడ్డ పంత్.. మధ్యలోనే మైదానం వీడాడు. లాహిరు కుమార వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. పంత్ మణికట్టుకు గాయమైంది.అయితే, సోమవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా పునరాగమనం చేసి అర్ధ శతకం (63)తో మెరిశాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు (503-9 డిక్లేర్డ్) సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, మంగళవారం నాటి మూడో రోజు ఆటలో మాత్రం పంత్ కనిపించలేదు.పంత్‌కు బదులు ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో ఆట పూర్తైన అనంతరం మీడియాతో మాట్లాడిన మోర్నీ మోర్కెల్ పంత్ గురించి అప్డేట్ ఇచ్చాడు. ‘‘పంత్ భుజానికి తీవ్రమైన గాయమైంది. ఈరోజు రాత్రంతా అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడు.నిజానికి పంత్ జట్టుకు ఎంతో అవసరం. వికెట్ కీపర్‌గా అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. వికెట్ల వెనుక నుంచి అతడు ఆటను బాగా అర్థం చేసుకుంటాడు’’ అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు. తద్వారా నాలుగో రోజు కూడా పంత్ అందుబాటులో ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. మంగళవారం ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. పసిందు సూరియబండారా అర్ధ శతకం(80)తో రాణించగా.. సొనాల్ దినుష (85 నాటౌట్) సెంచరీపై కన్నేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ మూడేసి వికెట్లు కూల్చగా.. మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు. -
మెరిసిన పసిందు, దినుష.. ఇంకా వెనుకబడే ఉన్న శ్రీలంక
టీమిండియాతో రెండో టెస్టు మూడో రోజు ఆటలో శ్రీలంక పోరాట పటిమ కనబరిచింది. కొలంబోలో 8/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట మొదలుపెట్టింది ఆతిథ్య జట్టు. కాసేటికే ఓపెనర్ కమిల్ మిశారా (19) వెనుదిరిగినప్పటికీ.. నాలుగో నంబర్ బ్యాటర్ పసిందు సూరియబండారా పట్టుదలగా నిలబడ్డాడు.మెరిసిన పసిందుభారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. కమిందు మెండిస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 133 బంతులు ఎదుర్కొన్న పసిందు తొమ్మిది ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ రవీంద్ర జడేజా అద్భుత బంతితో పసిందును బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియాకు మంచి బ్రేక్ లభించింది.మిగిలిన వారిలో కమిందు మెండిస్ (32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8) విఫలమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా డకౌట్ అయి నిరాశపరచగా.. ఈసారి సొనాల్ దినుష బాధ్యత తీసుకున్నాడు. అతడికి తోడుగా కేశారా నువాంత (74 బంతుల్లో 18) నిలబడ్డాడు.దినుష పోరాటంమంగళవారం ఆట ముగిసే సమయానికి దినుష 137 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా లాహిరు కుమార (8*) నిలిచాడు. వర్షం వల్ల భోజన విరామం తర్వాత ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత చాలా సేపు ఆట కొనసాగగా.. మూడో సెషన్‌ను మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 5.45 నిమిషాల వరకు నిర్వహించాలని భావించారు. అయితే, మరోసారి వర్షం వల్ల అంతరాయం కలగడంతో దాదాపు ఇరవై ఎనిమిది నిమిషాలకు ముందుగానే ఆటను నిలిపివేశారు. అప్పటికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కంటే.. ఇంకా 238 పరుగులు వెనుబడి ఉంది. ఓవరాల్‌గా భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆటలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.చదవండి: టెక్నిక్ లేకుండా ఆడతాడు.. పంత్‌కు అదొక్కటే ప్లస్! -
అంపైర్లతో గొడవ.. లంక ఆటగాడికి షాకిచ్చిన ఐసీసీ
కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతు రెండో టెస్టు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇప్పటికే జైస్వాల్, అసితా ఫెర్నాండో వివాదంపై సీరియస్ అయిన ఐసీసీ వారిద్దరికి జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. తాజాగా ఈ జాబితాలో శ్రీలంక బౌలర్ ప్రబాత్ జయసూరియా కూడా చేరిపోయాడు. రెండో రోజు ఆట చివర్లో వెలుతురు మందగించడంతో తాము ఆడలేమంటూ జయసూరియా అంపైర్లతో వాదనకు దిగాడు. కానీ అంపైర్లు ఆటను కొనసాగించడానికే మొగ్గు చూపారు. అంపైర్లతో వాదన జరిగిన మరుక్షణమే ప్రబాత్ ఔటయ్యాడు. దీంతో పెవిలియన్ వెళుతూ బౌండరీ లైన్ వద్ద కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొడుతూ, గ్లౌజులను విసిరేశాడు. ప్రబాత్ జయసూరియా చర్యలు ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో చర్యలకు ఉపక్రమించింది.‘‘అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, మైదాన పరికరాలు ఇతర వస్తువులను దుర్వినియోగం చేయడం ఐసీసీ నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రబాత్ జయసూరియా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినట్లు తేలింది. అందుకే క్రమశిక్షణా చర్య కింద ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నాం. గత రెండేళ్లలో అతడికి ఇదే మొదటి ఉల్లంఘన కావడంతో ప్రస్తుతం డీమెరిట్ పాయింట్‌తో సరిపెడుతున్నాం’’ అని చెప్పుకొచ్చింది. అనంతరం ప్రబాత్ జయసూరియ తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే?భారత్ తొలి ఇన్నింగ్స్‌ను రెండో రోజు 503/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆటకు కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా.. కొలంబోలో వెలుతురు మందగించింది. లంక తొలి వికెట్ కోల్పోవడంతో నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన ప్రబాత్ జయసూరియా వెలుతురు సరిగా లేదని, ఆడడంలో ఇబ్బంది ఎదురవుతుందని అంపైర్లకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అంపైర్లు లైట్ మీటర్‌తో వెలుతురును పరిశీలించారు. అయితే ఆటను నిలిపివేయకుండా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై శ్రీలంక బ్యాటర్లు జయసూర్య, కమీల్ మిశ్రా ఇద్దరూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ అంపైర్లు తమ నిర్ణయం ప్రకారమే ఆటను కొనసాగించారు. ఈ క్రమంలో ఔటైన తర్వాత మైదానం వీడుతున్న సమయంలో ప్రభాత్ జయసూర్య పలుమార్లు అంపైర్ల వైపు కోపంగా చూస్తూ వెళ్లాడు. పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత కోపంతో తన గ్లౌజులను విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.Nightwatchman sent packing! 🚶➡️ Manav Suthar strikes to pick up the wicket of Prabath Jayasuriya and wrap up the day on a high! 💥 Watch #SLvIND, 2nd Test, Day 3, Tomorrow, 9 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/pAKsoOncyK— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026🚨Prabath Jayasuriya has been sanctioned by the ICC for breaching the Code of Conduct during the 2nd Test vs India.• Breached Article 2.2 pic.twitter.com/R6d4b8qPsD— TheWicketReport (@WicketReport) August 25, 2026Read: లంక కెప్టెన్‌ను ట్రాప్ చేసిన సర్ఫరాజ్; ఏం జరిగిందంటే? -
లంక కెప్టెన్‌ను ట్రాప్ చేసిన సర్ఫరాజ్; ఏం జరిగిందంటే?
కొలంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఎదురీదుతోంది. ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసిన లంక మరో 299 పరుగులు వెనుకబడి ఉంది. ఈ విషయం పక్కనబెడితే శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా వికెట్ తీయడంలో సర్ఫరాజ్ ఖాన్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మానవ్ సుతార్ బౌలింగ్‌లో ధనంజయ వెనుదిరగడానికి ముందు షార్ట్ లెగ్, సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన మాటలతో లంక కెప్టెన్‌ను కన్ఫ్యూజన్కు గురి చేశాడు."బ్రో ఇక్కడేం లేదు బ్రో, స్ట్రెయిట్‌గా చూడు. ఎందుకు ప్రతీసారి లెఫ్ట్, రైట్ (లాంగాన్, లాంగాఫ్) చూస్తున్నావు. నువ్వు టైం మొత్తం వృథా చేస్తున్నావు. భయపడకుండా ఆడు బ్రో. నువ్వు ఒక జట్టుకు కెప్టెన్ అన్న విషయం గుర్తుంచుకో. నువ్వు ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నావు" అని చెప్పడం మైక్స్టంప్లో రికార్డయింది. ఆ వెంటనే సుతార్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో, ఎడ్జ్ అవ్వడంతో రాహుల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 8 పరుగులు మాత్రమే చేసిన ధనంజయ డిసిల్వా పెవిలియన్ బాట పట్టాడు. ఇక తొలి టెస్టులో జైస్వాల్ కూడా లంక బ్యాటర్‌ను ఇలాగే కన్ఫూజన్‌కు గురి చేసి అతడు ఔటవ్వడంలో కీలకపాత్ర పోషించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్‌లు శతకాలతో విరుచుకుపడ్డారు. గిల్, పంత్ అర్ధసెంచరీలు సాధించారు. ఇక లంక రెండో రోజు ఆటలో టీ విరామ సమయానికి 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సోనాల్ దినూష (52), కెషారా నువంతా (13) బ్యాటింగ్ చేస్తున్నారు.pic.twitter.com/7F5qE7iWGR— crictalk (@crictalk7) August 25, 2026 “You are wasting time bro, don’t be scared… YOU ARE THE CAPTAIN!”— Sarfaraz Khan to De Silva.Two balls later… DE SILVA DEPARTS!😭💀🔥Sarfaraz’s words aged like fine wine! 😂🏏. 📷: SonyLiv. #SrilankaVsIndia #2ndTestMatch #SarfarazKhan #DeSilva #Wickets #Cricket… pic.twitter.com/Clhw6ArMe5— Cricket Gyan (@cricketgyann) August 25, 2026చదవండి: అన్మోల్ సిక్సర్ల వర్షం..సెమీస్‌కు సౌత్ ఢిల్లీ -
IND vs SL: ‘టెక్నిక్ లేకుండా ఆడతాడు.. అదొక్కటే ప్లస్’
శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మంచి ప్రదర్శన కనబరిచాడు. గాయంతో తొలి రోజు ఆట మధ్యలోనే వెనుదిరిగినప్పటికీ.. రెండో రోజు రీఎంట్రీ ఇచ్చి అనూహ్య రీతిలో రాణించాడు.హాఫ్ సెంచరీకొలంబోలో సోమవారం నాటి ఆట సందర్భంగా 89 బంతులు ఎదుర్కొన్న పంత్.. 63 పరుగులు సాధించాడు. అతడి హాఫ్ సెంచరీలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, భోజన విరామం తర్వాత లంక స్పిన్నర్ కేశారా నువాంత వేసిన తొలి బంతికే.. లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి పంత్ వెనుదిరిగాడు. కానీ పంత్ కాస్త డిఫెన్సివ్‌గా ఆడి ఉంటే అవుటయ్యేవాడు కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.టెక్నిక్ లేకుండా ఆడతాడు.. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ పంత్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ దగ్గర పెద్దగా టెక్నిక్ లేదని.. కేవలం భయం లేకుండా దూకుడుగా ఆడటం వల్లే అతడికి గుర్తింపు వస్తోందన్నాడు. అయినా టెక్నిక్‌తో ఎవరికీ పనిలేదని.. అతడి ఖాతాలో జమైన పరుగులు మాత్రమే అందరూ చూస్తారని పేర్కొన్నాడు.ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘పంత్ ఫియర్లెస్ ఆటగాడు. తను ఆడే విధానానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాడు. అతడికి టెక్నిక్‌తో సంబంధం లేదు. సాధారణంగా.. చాలా మంది బ్యాటర్లు కొన్ని షాట్లను తప్పకుండా మిస్ చేస్తారు. అలాంటి షాట్లను కూడా పంత్ ఆడతాడు.ఎందుకంటే అతడు ఎల్లవేళలా అందరికీ భిన్నంగా ఉంటాడు. గాలెలో జరిగిన తొలి టెస్టులో.. తాజాగా కొలంబోలో అతడు అవుటైన తీరును చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఈసారి అతడు కవర్ మీదుగా బంతిని తరలించే ప్రయత్నం చేశాడు.అదొక్కటే ప్లస్నిజానికి బంతికి అతడు దూరంగా ఉన్నాడు. కానీ ప్రయత్నం మాత్రం మానలేదు. కాబట్టి టెక్నికల్‌గా పంత్ గొప్ప ఆటగాడేమీ కాదు. అయినా ఎవరికీ ఇక్కడ టెక్నిక్‌తో పనిలేదు. అతడు మ్యాచ్‌లో ప్రభావం చూపుతున్నాడా? లేదా?.. పరుగులు రాబడుతున్నాడా లేదా? అనేదే ముఖ్యం’’ అని భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.పంత్‌లా ఇంకెవరూ ఉండరుఅయితే, టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం మాత్రం పంత్ ఆట తీరును ప్రశంసించాడు. ‘టెస్టుల్లో షాట్లు ఆడే విషయంలో అతడిని ఓ బాధ్యతారహిత ప్లేయర్‌గా చూస్తారు. అయినా సరే అతడు తగ్గడు. యాజమాన్యం కూడా అతడిని దూకుడుగానే ఆడమని ప్రోత్సహిస్తూ ఉందనిపిస్తోంది.అయితే, కఠిన పరిస్థితుల్లో.. జట్టు కష్టాల్లో ఉన్న వేళ మాత్రం అతడు పట్టుదలగా నిలబడతాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా అతడికి ఉంది. పంత్ ఒక అరుదైన బ్యాటర్. అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఆటగాడు కూడా అతడి దరిదాపుల్లోకి కూడా రాలేడు’’ అని సబా కరీం పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో తొలి టెస్టులోనూ పంత్ హాఫ్ సెంచరీ (66) సాధించాడు.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లింది. గాలెలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. కొలంబో వేదికగా రెండో టెస్టులో తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా.చదవండి: టీమిండియా తప్పుల్ని పడిక్కల్ ఎత్తి చూపాడు! -
IND vs SL: టీమిండియా తప్పుల్ని పడిక్కల్ ఎత్తి చూపాడు!
శ్రీలంక గడ్డ మీద టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ సత్తా చాటుతున్నాడు. తొలి టెస్టులో భారీ శతకం (167)తో అలరించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టెస్టులోనూ సెంచరీ (117)తో కదం తొక్కాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.NRIలా మారిపోయారుఅదే సమయంలో పెద్ద పెద్ద స్టార్లుగా పేరు తెచ్చుకున్న భారత బ్యాటర్లు మాత్రం ప్రస్తుతం ‘ప్రవాస భారతీయుల్లా’ మారిపోయారని మంజ్రేకర్ చురకలు అంటించాడు. దేశీయ పిచ్‌లపై ఆడటమే వారు మర్చిపోయారని.. అలాంటి వారికి పడిక్కల్ కనువిప్పు కలిగించాడని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఎవరైనా మంచి ఫలితాలు రాబట్టగలరని చెప్పుకొచ్చాడు.టీమిండియా తప్పుల్ని ఎత్తి చూపాడుఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత కొన్నేళ్లుగా టీమిండియా యాజమాన్యం చేస్తున్న తప్పులను పడిక్కల్ తన ఆట తీరుతో ఎత్తి చూపాడు. కొంతమంది మన బిగ్ స్టార్లు ఇప్పుడు NRIలుగా మారిపోయారు. భారత పిచ్‌లపై కంటే కూడా వాళ్లు విదేశాల్లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నారు.ఎక్కడైతే తాము పుట్టి పెరిగామో.. ఎక్కడ ఆట నేర్చుకుని.. ఈ స్థాయికి ఎదిగామో వారు మర్చిపోయారు. దేశవాళీ క్రికెట్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. ఐదారేళ్లుగా విదేశాల్లోనే ఎక్కువగా ఆడుతూ.. ఉపఖండ పిచ్‌లపై ఎలా ఆడాలో మనోళ్లు మర్చిపోయారు’’ అని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు.కివీస్‌తో సిరీస్‌లో ఆడి ఉంటే..కాగా పడిక్కల్ దేశీ క్రికెట్లో కర్ణాటక తరఫున ఆడుతూ రోజురోజుకీ తన ప్రదర్శన మెరుగుపరుచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో కూడా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై అతడు అదరగొడుతున్నాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. సీనియర్లు మాత్రం స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నారని చురకలు అంటించాడు.అదే విధంగా.. గతేడాది టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్ అవడాన్ని మంజ్రేకర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఒకవేళ నాటి జట్టుకు పడిక్కల్‌ను ఎంపిక చేసి ఉంటే భారత జట్టుకు ఈ దుస్థితి పట్టేదికాదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా టెస్టుల్లో మూడో స్థానానికి పడిక్కల్ సరిగ్గా సరిపోతాడని పేర్కొన్నాడు.న్యూజిలాండ్ గడ్డ మీద ఎలా ఆడతాడో!అయితే, శ్రీలంకలో రాణిస్తున్నప్పటికీ న్యూజిలాండ్ గడ్డ మీద పడిక్కల్ ఆడే విధానాన్ని బట్టే.. జట్టులో అతడి స్థానం ఏమిటనేది తేలుతుందని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంక పర్యటనలో పడిక్కల్ ఇప్పటికే 328 పరుగులు సాధించి.. ఈ సిరీస్‌లో ఇరుజట్లలో కలిపి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా టీమిండియా స్వదేశంలో కివీస్‌తో పాటు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లోనూ 0-2తో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. శ్రీలంకను వైట్‌వాష్ చేయడంతో పాటు తదుపరి న్యూజిలాండ్ పర్యటనలో రాణిస్తేనే టీమిండియా ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. చదవండి: ఆసియా కప్ కోసం పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్! -
హద్దుమీరిన జైస్వాల్; ఇది రెండోసారి.. నిషేధం తప్పదా?
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి లంక ఆటగాళ్లను రెచ్చగొట్టే చర్యతో వివాదంలో చిక్కుకున్నాడు. లంక ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు వికెట్ పడిన సందర్భంలో జైస్వాల్ శ్రుతిమించిపోయాడు. ప్రసిధ్ క్రిష్ణ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో లాహిరు ఉదారా ఔటయ్యాడు. ఇన్‌స్వింగర్ అయిన బంతిని లాహిరు ఉదారా డిఫెన్స్ చేసే ప్రయత్నంలో అతడి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలింది. మూడో స్లిప్‌లో ఉన్న జైస్వాల్ వైపు బంతి దూసుకెళ్లింది. అంతే వేగంగా స్పందించిన జైస్వాల్ కుడివైపుకు పూర్తిగా డైవ్ చేసి అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, అసలు కథ ఇక్కడే మొదలైంది. లాహిరు ఉదారా క్యాచ్ పట్టిన జైస్వాల్ గట్టిగా అరుస్తూ బంతిని గాల్లోకి విసిరాడు. అంతటితో ఆగకుండా లంక బ్యాటర్‌ను ఉద్దేశించి మాటల తూటాలు వదిలి మరోసారి ఐసీసీ క్రమశిక్షణా నిబంధనలను ఉల్లఘించాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఆట స్ఫూర్తికి విరుద్ధంగా, దూకుడుగా లేదా అనుచితంగా సంబరాలు చేసుకునే ఆటగాళ్లు హద్దులు దాటి, అవుటైన బ్యాటర్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే సదరు ఆటగాళ్లను ఐసీసీ శిక్షిస్తుంది.ఆర్టికల్ 2.5 ప్రకారం, బ్యాటర్ అవుటైన తర్వాత అతని నుంచి తీవ్రమైన ప్రతిచర్యను రేకెత్తించే విధంగా ఆటగాళ్లు భాష, చర్యలు లేదా సంజ్ఞలను ఉపయోగించడాన్ని ఐసీసీ ఉపేక్షించదు. బ్యాటర్‌కు దగ్గరగా అతి ఉద్వేగభరితంగా లేదా దూకుడుగా సెండ్-ఆఫ్ చేయడం, లేదా ఆటగాడి ముఖం వద్దకు పరుగెత్తుకు వెళ్లడం వంటివి లెవెల్ 1 ఉల్లంఘన కిందకు వస్తోంది. దీని ఫలితంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 15 నుంచి 50 శాతం వరకు జరిమానాతో పాటు అదనపు డీమెరిట్ పాయింట్లు కూడా విధించబడవచ్చు.ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ సమయంలో అసితా ఫెర్నాండో కారణంగా ఐసీసీ నుంచి జరిమానా ఎదుర్కొన్న జైస్వాల్‌ను తాజా వివాదం ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూడాలి. ఒకవేళ జైస్వాల్ చర్యను ఐసీసీ పరిగణలోకి తీసుకుంటే మాత్రం జైస్వాల్‌కు ఈసారి భారీ జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు.Looks like Yashasvi Jaiswal has found his favourite opponent! 👀Just look at his reaction after taking that catch 😤#Cricket #SLvIND #yashasvijaiswalpic.twitter.com/9gRxm3SXNv— CREX (@Crex_live) August 24, 2026 🔴 PEAK AGGRESSION FROM YASHASVI JAISWAL 🤯- Looks like he still hasn’t forgotten the sledging from the Sri Lankan players 😭 pic.twitter.com/HBgvEmKvRN— Sam (@cricsam02) August 24, 2026Read: దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ బౌలర్ సంచలనం -
‘టీమిండియా నుంచి వాళ్లను కూరలో కరివేపాకులా తీసేసారు’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో విఫలమైనప్పటికీ.. వైట్‌బాల్ క్రికెట్లో మాత్రం గంభీర్‌ను పెద్దగా తప్పుపట్టాల్సిన పనిలేదన్నాడు. అయితే, వైట్‌బాల్ క్రికెట్లో కొంతమంది పేరు మోసిన ఆటగాళ్లను కూడా కూరలో కరివేపాకులా తీసేసారంటూ.. గంభీర్ బృందం తీరును విమర్శించాడు.కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే లంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో వైట్వాషష్ చేయాల్సిందే. ఈ క్రమంలో తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ విజయంపై కన్నేసింది.ఇదిలా ఉంటే.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0, సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్‌వాష్ కావడం వల్లే టీమిండియా డబ్ల్యూటీసీ ప్రయాణం కఠినంగా మారింది. ఈ నేపథ్యంలో గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. టెస్టు కోచ్‌గా అతడిని తొలగించాలనే అప్పట్లోనే డిమాండ్లు పెరిగాయి.ఇక ఇటీవల టీమిండియా అనూహ్య రీతిలో ఐర్లాండ్ గడ్డ మీద ఆతిథ్య జట్టు చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 2-0తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్ అయిన భారత జట్టు.. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. దీంతో వైట్‌బాల్ కోచ్‌గానూ గంభీర్ పనికిరాడనే విమర్శలు వచ్చాయి.కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై యాజమాన్యం వేటువేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ తర్వాత టీమిండియా తొలిసారిగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లగా.. సూర్యను కెప్టెన్‌గా తప్పించడమే కాకుండా జట్టులోనే స్థానం లేకుండా చేశారు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించారు.మరోవైపు.. మహ్మద్ షమీ కూడా చాన్నాళ్లుగా పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నా సెలక్టర్లు కరుణించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..‘‘కొంతమంది ఆటగాళ్లను మరీ కూరలో కరివేపాకులా తీసేసారు. వాళ్లను ఇంకాస్త మంచిగా చూసుకోవాల్సింది. సూర్య విషయంలో ఇదే జరిగింది. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటువేశారు.ఇక సూర్య మాదిరే మరో ప్లేయర్ షమీ కూడా ఉన్నాడు. వీరి విషయంలో మేనేజ్మెంట్ వ్యవహారశైలి ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. ఇవి తప్ప వైట్‌బాల్ క్రికెట్లో గంభీర్‌ను తప్పుబట్టడానికి పెద్దగా ఏమీ లేదు’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు.అదే విధంగా.. ‘‘టెస్టుల్లో మాత్రం సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్‌వాష్ కావడం సాధారణ విషయం కాదు. ఈ మచ్చ గంభీర్ కెరీర్‌పై ఎప్పటికీ ఉండిపోతుంది. అతడితో పాటు కెప్టెన్, ఆటగాళ్లు కూడా ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది.విదేశీ జట్లకు టీమిండియాను వారి స్వదేశంలో ఓడించడం అంత సులువు కాదు. అలాంటిది ఏకంగా రెండు వైట్‌వాష్‌లు. ఒకవేళ మనం ఆ సిరీస్ గెలిచి ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉండేవాళ్లము. టెస్టు కోచ్‌గా గంభీర్ ఇంకా మెరుగుపడాలి. అతడొక్కడే కాదు.. జట్టు కూడా మారాలి. అయితే, కొన్నిసార్లు సెలక్షన్ విషయంలో తప్పిదాల వల్ల కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు మాత్రం చేరలేకపోయింది. -
మీకేం తెలుసు?.. హద్దు మీరితే బాగోదు: జైస్వాల్ ఫైర్
ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేకు టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు. ఎవరైనా సరే హద్దులు మీరితే.. వారికి తాను తప్పకుండా బుద్ధి చెప్తానని స్పష్టం చేశాడు. అసలు జరిగింది ఏమిటంటే..కాగా టీమిండియా- శ్రీలంక మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా జైస్వాల్- అసిత ఫెర్నాండో మధ్య ఆదివారం వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్‌లో అసిత.. 17వ ఓవర్ వేయగా.. రెండు, నాలుగు, ఐదో బంతులకు జైస్వాల్ ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి బంతికి క్లీన్‌బౌల్డ్ అయిపోయాడు.కొట్టుకోవడమే మిగిలిందిఈ క్రమంలో జైస్వాల్ మైదానం వీడుతుండగా.. ప్రతీకారం తీర్చుకున్నా అన్నట్లుగా అసిత ఏదో అన్నాడు. ఇందుకు ఘాటుగా బదులిచ్చిన జైసూ.. అతడి మీదకు వెళ్లాడు. అసిత కళ్లల్లోకి కళ్లు పెట్టి కోపంగా చూసిన జైస్వాల్.. హెల్మెట్‌తో అతడిని నెట్టివేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి సీరియస్‌గా మారుతోందని గ్రహించిన లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వ వచ్చి ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశాడు.ఆటలో సహజమేఈ ఘటనపై ఇరుజట్ల కోచ్‌లు స్పందిస్తూ.. టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య ఇలాంటి ఘటనలు సహజమేనని.. గేమ్‌ప్లాన్‌లో భాగంగానే కొన్నిసార్లు బౌలర్లు ఇలా రెచ్చగొడతారంటూ తేలికగా తీసిపడేశారు. ఇక ఈ విషయంపై హర్షా భోగ్లే క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘అవుటైన తర్వాత జైస్వాల్ వెళ్లిపోతున్న సమయంలో అతడిని ఎవరో ఏదో అన్నారు.జైస్వాల్ ఏమీ అనకుండా వెళ్లాల్సిందినిజానికి బౌలర్లు సెండాఫ్ ఇవ్వడం నా దృష్టిలో అంత గొప్పేమీ కాదు. బౌలర్‌గా బ్యాటర్‌ను అవుట్ చేశామంటే అక్కడితో మీ పని పూర్తైనట్లు. అంతేగానీ.. ఇలాంటి చర్యలు అవసరం లేదు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితిలో బ్యాటర్ ఎదుటివాళ్ల మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడమే మంచిది. కానీ జైస్వాల్ తిరిగి వచ్చాడు.వాళ్లు ఏమన్నారో జైస్వాల్‌కు మాత్రమే తెలుసు. బౌలర్ అలా అనకుండా ఉండాల్సింది. కానీ జైస్వాల్ నేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిక్‌బజ్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. జైస్వాల్ స్పందించాడు.మీకేం తెలుసు?.. తెలియకుండానే జడ్జిమెంట్లా?‘‘సదరు ఆటగాడు ఏమన్నాడో మీకు తెలియకుంటే.. ఇలాంటి తీర్పులు ఇవ్వడం ఆపండి. ఎవరైనా హద్దులు మీరి ప్రవర్తిస్తే.. భారత్ తిరిగి పోరాడుతుందని.. వాళ్లకు గట్టిగానే బదులు ఇస్తుందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని జైస్వాల్ కామెంట్ సెక్షన్లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. హర్షా భోగ్లేకు కౌంటర్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. సోమవారం నాటి రెండో రోజు ఆటలో భోజన విరామ సమయానికి 112 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 419 పరుగులు సాధించింది. రిషభ్ పంత్ 63, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో ఉన్నారు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్ -
IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విదేశీ, తటస్థ వేదికలపై భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.విజయంతో మొదలుకాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడుతోంది. తొలి టెస్టులో లంకపై 165 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్.. కొలంబో వేదికగా ఆదివారం రెండో టెస్టు మొదలుపెట్టింది.గాయపడిన పంత్సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి ఐదు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అయితే, ఆదివారం ఆట సందర్భంగా పంత్ గాయపడి.. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడాడు.రీఎంట్రీ ఇచ్చి.. సరికొత్త చరిత్రఈ క్రమంలో సోమవారం నాటి రెండో ఆట మొదలైన కాసేపటికే నైట్‌వాచ్‌మన్ సారాంశ్ జైన్ (6) అవుట్ కాగా.. పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. ధ్రువ్ జురెల్‌తో కలిసి నిలకడగా ఆడిన పంత్.. డ్రింక్స్ బ్రేక్ సమయానికి 50 బంతుల్లో 30 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విదేశీ, తటస్థ వేదికలపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు.ఇదిలా ఉంటే.. సోమవారం నాటి రెండో రోజు ఆటలో భోజన విరామ సమయానికి.. టీమిండియా 112 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 419 పరుగులు సాధించింది. రిషభ్ పంత్ 63, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో ఉన్నారు.And just like that, Rishabh Pant is back to his old tricks! 😏🔥Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/JLfk3vXwg0— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026విదేశీ, తటస్థ వేదికలపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్లు వీరే1. రిషభ్ పంత్- 2501 పరుగులు (సగటు 41.68)2. మహేంద్ర సింగ్ ధోని- 2496 పరుగులు (సగటు 32.84)3. ఫారూఖ్ ఇంజనీర్- 1209 పరుగులు (సగటు 32.67)4. సయ్యద్ కీర్మాణి- 1109 పరుగులు (సగటు 21.74)5. కిరణ్ మోరే- 901 పరుగులు (సగటు 29.06).చదవండి: ఇమ్రాన్ ఖాన్ కోసం మాజీ సారథులు! -
IND vs SL: ‘అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు’
శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ముందుగా ఊహించినట్లుగానే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో యాజమాన్యం అతడితో అరంగేట్రం చేయించింది. ఈ నేపథ్యంలో కుల్దీప్ను ఉద్దేశపూర్వకంగానే తప్పించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఘాటుగా స్పందించాడు.అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుకొలంబో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన సితాన్షు కొటక్.. కుల్దీప్ యాదవ్ విషయంలో తమకు అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదన్నాడు. అతడు అనారోగ్యంతో ఉన్నాడని.. అందుకే శ్రీలంకతో రెండో టెస్టు ఆడటం లేదని స్పష్టం చేశాడు. ఈ మేరకు.. ‘‘కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ గురించి మీరు అడిగిన ప్రశ్న అసంబద్ధమైనది.నిజంగానే జ్వరం వచ్చిందిగాలె నుంచి బయల్దేరినపుడే అతడు వైరల్ ఫీవర్‌తో ఉన్నాడు. నిజంగానే అతడికి జ్వరం వచ్చింది. జట్టుకు స్పిన్నర్ అవసరమైన వేళ.. అతడు ఆడలేని పరిస్థితిలో ఉంటే.. యాజమాన్యానికి అతడి గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే అతడు ఆడగలిగే పరిస్థితిలో లేకుంటే.. సెలక్షన్‌కు ఎలా అందుబాటులో ఉండగలడు?పొద్దున బాలేడు.. సాయంత్రానికి కోలుకున్నాడుకుల్దీప్ విషయంలో మీరిలా ఆలోచించడం ఎంతమాత్రం సరికాదు. ఏదేమైనా అతడు త్వరగానే కోలుకున్నాడు. ఈరోజు సాయంత్రం (ఆదివారం) అతడిని నేరుగా కలిశాను. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. ఉదయం మాత్రం మ్యాచ్ ఆడే పరిస్థితిలో లేడు.మరో విషయం.. తుదిజట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు లేదంటే ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలనుకుంటే.. శ్రీలంక టాపార్డర్‌లో దాదాపు నలుగురు లెఫ్టాండర్లే ఉన్నారు. అలాంటపుడు ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించడం సరైందే కదా’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. తద్వారా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా కుల్దీప్ను తప్పించి.. సారాంశ్ జైన్‌ను ఆడిస్తున్నామని చెప్పకనే చెప్పాడు. ప్రయాణ బడలిక వల్లేఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్ గురించి బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మాట్లాడుతూ.. ప్రయాణంలో అలసిపోయిన కారణంగానే అతడు రెండు రోజుల పాటు నెట్ సెషన్‌కు రాలేకపోయాడని తెలిపాడు. సితాన్షు కొటక్ మాత్రం వైరల్ ఫీవర్ అని చెప్పడం గమనార్హం. కాగా.. గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ శ్రీలంకపై 165 పరుగుల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు కొలంబోలో ఆదివారం మొదలైంది. ఇక తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్ల బౌలింగ్‌లో 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ తీశాడు.చదవండి: ఇమ్రాన్ ఖాన్ కోసం మాజీ కెప్టెన్లు! -
WTC : కీలక మలుపు.. బంగ్లా ఓటమితో భారత్‌కు లక్కీ చాన్స్!
ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో భారీ విజయం సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకున్న బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పట్టికలో స్థానం మారనప్పటికీ, పాయింట్లు భారీగా కోల్పోయింది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం రెండో టెస్టులో విజయంతో 80 పాయింట్లు సాధించి డబ్ల్యూటీసీ పట్టికలో తన తొలి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇక రెండో స్థానంలో సౌతాఫ్రికా (75 పాయింట్లు) ఉండగా, 72.22 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఓటమి తర్వాత భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు అవకాశాలు ఎంత ఉన్నాయి? ఏ లెక్కన భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుందనేది మరోసారి తెలుసుకుందాం.పాయింట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ఆసీస్తో టెస్టు సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ 66.6 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతూ వస్తోంది. అయితే రెండో టెస్టులో ఓటమి తర్వాత బంగ్లాదేశ్ 11.1 పాయింట్లు కోల్పోయి 55.5 పాయింట్లకు పరిమితమైంది. అదే సమయంలో తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా ఐదో స్థానంలో కొనసాగుతుండగా, భారత్ ఖాతాలో 53.3 పాయింట్లు ఉన్నాయి.ఒకవేళ లంకతో రెండో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంటుంది. లంకతో టెస్టు సిరీస్ తర్వాత 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో మరో ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే పది టెస్టులాడిన భారత్ నాలుగింట ఓడిపోయింది. లంకతో సిరీస్ అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. ఎనిమిదిలో ఏడు గెలిస్తేనే..ఆ తర్వాత ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు కఠినమైన సిరీస్‌లు కావడం భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశం. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే భారత్ తమకు మిగిలిన 8 టెస్టుల్లో కనీసం ఏడింటిలో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే డబ్ల్యూటీసీ పట్టికలో 68.52 పర్సంటైల్‌తో ఉంటుంది. ఒకవేళ ఆరు విజయాలు, రెండు ఓటములు ఎదురైతే అప్పుడు 62.96 పాయింట్లకు పరిమితమవుతుంది. భారత్‌కు రెండే దారులు..ఈ రెండు దారులు తప్ప టీమిండియా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం లేదు. అయితే రాబోయే 8 టెస్టుల్లో ఒక పెనాల్టీ పాయింట్ వచ్చినా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్తంతయినట్లే. కాబట్టి గిల్ సేన ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలనుకుంటే మాత్రం ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిన అవసరముంది.Read: జైస్వాల్, లంక బౌలర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి! -
జైస్వాల్, లంక బౌలర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి!
కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ ఔటైన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన జైస్వాల్ పెవిలియన్ వెళుతున్న సమయంలో లంక బౌలర్ తన మాటలతో రెచ్చగొట్టాడు. దీంతో పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న జైస్వాల్ ఒక్కసారిగా వెనక్కితిరిగి అసిత ఫెర్నాండోవైపు దూసుకొచ్చాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకోగా, కోపంతో జైస్వాల్.. ఫెర్నాండో కళ్లలోకి చూస్తూ తన హెల్మెట్‌తో అతడిని నెట్టివేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి సీరియస్‌గా మారుతుందని గ్రహించిన లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా జైస్వాల్‌ను పక్కకు తీసుకెళ్లి అక్కడి నుంచి పంపించేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జైస్వాల్ ఔటవ్వడానికి ముందు ఫెర్నాండో బౌలింగ్‌లోనే వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే ఫెర్నాండో తన మరుసటి బంతికే జైస్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో లంక బౌలర్ కోపంతో పరిధి దాటి కామ్‌గా వెళుతున్న జైస్వాల్‌ను గెలికి మరి కయ్యం పెట్టుకున్నాడు. ఇక మ్యాచ్‌లో జైస్వాల్ వన్డే తరహా ఆటతీరును ప్రదర్శించాడు. 53 బంతుల్లో 45 పరుగులు చేసిన జైస్వాల్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉండడం విశేషం. Body contact between Jaiswal and Asitha Fernando.. #SLVIND pic.twitter.com/w3Q905WUIf— Nibraz Ramzan (@nibraz88cricket) August 23, 2026 HEATED MOMENT BETWEEN JAISWAL & ASITHA 🤯 pic.twitter.com/SzgcNjYDUN— Johns. (@CricCrazyJohns) August 23, 2026Read: 95 రన్స్‌కే బంగ్లా ఆలౌట్.. రెండో టెస్టులో ఆసీస్ ఘన విజయం -
95 రన్స్‌కే బంగ్లా ఆలౌట్.. రెండో టెస్టులో ఆసీస్ ఘన విజయం
బంగ్లాదేశ్‌తో మొదలైన రెండో టెస్టును ఆస్ట్రేలియా రోజున్నర వ్యవధిలోనే ముగించింది. మాకే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన మిచెల్ స్టార్క్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టాడు. 4 వికెట్లు తీసిన స్టార్క్ ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్ల హాల్ నమోదు చేసి బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు. 146 పరుగుల వెనుకంజతో తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ 95 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (31) టాప్ స్కోరర్‌గా నిలవగా, ముష్ఫికర్ రహీమ్ (29 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4, కమిన్స్, నాథన్ లియోన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ గెలవగా, రెండో టెస్టులో మాత్రం ఆసీస్ నంబర్‌వన్ ఆటను ప్రదర్శించి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ పట్టికలో తమ తొలి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.అంతకముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్ షోరిఫుల్ ఇస్లామ్ ఏడు వికెట్లతో చెలరేగగా, కామెరాన్ గ్రీన్ అర్ధసెంచరీతో రాణించాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. ఇక రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లు తీసిన స్టార్క్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా లబించింది.సంక్షిప్త స్కోర్లు:బంగ్లాదేశ్: 64&95 ఆలౌట్ఆస్ట్రేలియా: 210 ఆలౌట్ 🚨 2nd Test AUSTRALIA vs BANGLADESH 🚨Bangladesh 🇧🇩 : 6️⃣4️⃣&9️⃣5️⃣Australia 🇦🇺 : 2️⃣1️⃣0️⃣Australia 🇦🇺 Won by an Innings & 5️⃣1️⃣ Runs#AUSvBAN #BANvAUS #Cricketpic.twitter.com/x2tMdzP3Ol https://t.co/x2tMdzP3Ol https://t.co/7R4xh4Fo88— Cricket Lover 🏏 (@Crick97924Lover) August 23, 2026Australia dominate in Mackay to level the #WTC27 series against Bangladesh 🙌📝: https://t.co/PQuffFjsha pic.twitter.com/009daojhOI— ICC (@ICC) August 23, 2026Read: అరంగేట్రంతోనే అరుదైన రికార్డు.. ఎవరీ సారాంశ్? -
అరంగేట్రంతోనే అరుదైన రికార్డు.. ఎవరీ సారాంశ్?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా టీమిండియా తరఫున సారాంశ్ జైన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కాగా 21వ శతాబ్దంలో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతిపెద్ద వయస్కుడిగా సారాంశ్ జైన్ నిలిచాడు. సారాంశ్ ప్రస్తుత వయస్సు 33 ఏళ్ల 145 రోజులు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో ఢాకాలో బంగ్లాదేశ్‌పై 32 ఏళ్ల 362 రోజుల వయస్సులో అరంగేట్రం చేసిన సబా కరీం రికార్డును సారాంశ్ అధిగమించాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడ ఆటతీరును ప్రదర్శిస్తున్న సారాంశ్ జైన్‌కు ఎట్టకేలకు టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. ఇన్ఫెక్షన్ కారణంగా టెస్టుకు దూరమైనట్లు పేర్కొన్నప్పటికీ, తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే అతడి స్థానంలో సారాంశ్ జైన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. జడేజా చేతుల మీదుగా సారాంశ్ జైన్ టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ ఆడకుండానే డెబ్యూసారాంశ్ జైన్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఐపీఎల్లో ఆడకుండానే జాతీయ జట్టుకు ఎంపికైన మూడో ఆటగాడిగా సారాంశ్ నిలిచాడు. గతంలో మురళీ విజయ్ (2008 నాగ్‌పూర్ టెస్టు వర్సెస్ ఆస్ట్రేలియా), మొహమ్మద్ షమీ (2013 ఢిల్లీ వన్డే వర్సెస్ పాకిస్తాన్) ఈ ఫీట్ సాధించారు.Photo Credit: BCCI Twitterఎవరీ సారాంశ్ జైన్?తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టగల సారాంశ్ జైన్ బ్యాటింగ్ చేయడంలోనూ సమర్ధుడు. దేశవాళీ క్రికెట్లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్.. రెండు విభాగాల్లోను తాను ఆడిన జట్లకు విలువైన సహకారం అందిస్తూ వచ్చాడు. అయితే గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో బీసీసీఐ సెలెక్లర్ట బృందం సుందర్ స్థానంలో సారాంశ్ జైన్‌ను టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. లంకతో టెస్టు సిరీస్‌కు ముందే లంక-ఏ జట్టుతో ఆడిన తొలి అనధికారిక టెస్టులోనే సారాంశ్ జైన్ తన ప్రతిభను చాటాడు. రెండో టెస్టులో ఆరు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో అజేయంగా 70 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. Photo Credit: BCCI Twitterఇక 2025-26 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో సారాంశ్ జైన్ ఒకడు. ఆ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున ఏడు మ్యాచ్‌లాడిన సారాంశ్ 57.55 సగటుతో 518 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ సారాంశ్ 20.43 సగటుతో 30 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు.A new chapter begins. 🧢 Saransh Jain receives his maiden Test cap from Ravindra Jadeja in the #TeamIndia huddle ✨ Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/sXTILXMIOg— Sony Sports Network (@SonySportsNetwk) August 23, 2026 The feeling of making your Test Debut ✨#TeamIndia all-rounder Ravindra Jadeja presents the Test cap to Saransh Jain 👏👏Updates ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/6H6KrUdSkU— BCCI (@BCCI) August 23, 2026చదవండి: టాస్ గెలిచిన టీమిండియా.. సారాంశ్ జైన్ అరంగేట్రం -
బంగ్లా బౌలర్ సరికొత్త చరిత్ర.. ఆస్ట్రేలియా 210 ఆలౌట్
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ బౌలర్ షోరిఫుల్ ఇస్లామ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మాకే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో షోరిఫుల్ 7 వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (67) కీలక అర్ధసెంచరీతో రాణించగా, స్టీవ్ స్మిత్ (42) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో నాథన్ లియోన్ (32 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్ 7 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లామ్, మెహదీ హసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 19 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ నజ్ముల్ 12, తంజిద్ హసన్ (8) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన స్టార్క్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కనబరుస్తూ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ 125 పరుగులు వెనుకబడి ఉంది.రెండో బౌలర్‌గా రికార్డుఇక ఏడు వికెట్లతో మెరిసిన షోరిఫుల్ ఇస్లామ్‌కు ఇదే తొలి ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన రెండో బౌలర్‌గా షోరిఫుల్ నిలిచాడు. ఆసీస్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా హసన్ మహ్ముద్ నిలిచాడు. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనే హసన్ మహ్ముద్ (6/55) ఈ ఫీట్‌ను అందుకున్నాడు.టెస్టుల్లో బంగ్లాదేశ్ పేసర్ల అత్యుత్తమ గణాంకాలు👉షోరిఫుల్ ఇస్లామ్ (7/48) 2026లో ఆస్ట్రేలియాపై👉షాహదత్ హొసెన్ (6/27) 2008లో సౌతాఫ్రికాపై👉ఎబాదత్ హొసెన్ (6/46) 2022లో న్యూజిలాండ్‌పై👉హసన్ మహ్ముద్ (6/55) 2026లో ఆస్ట్రేలియాపై👉తస్కిన్ అహ్మద్ (6/64) 2024లో వెస్టిండీస్‌పైSEVEN-FOR SHORIFUL! 🔥🔥🇧🇩 What a performance! Shoriful Islam is tearing through the Australian batting lineup with a sensational 7-wicket haul! 🎯💥Take a bow, Shoriful! 👏🏏Australia 🆚 Bangladesh | 2nd Test#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/4EYAIt25Fd— Bangladesh Cricket (@BCBtigers) August 23, 2026 Shoriful Islam went bang to claim his first Test five-wicket haul, before topping it with an even better sixth! #MilestoneMoment | @NRMAInsurance | #AUSvBAN pic.twitter.com/kmK6ZOZupX— cricket.com.au (@cricketcomau) August 22, 2026Read: ‘బాధపడలేదు.. పేరు లేనందుకు నవ్వుకున్నా’ -
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
కొలంబో వేదికగా శ్రీలంకతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి టెస్టులో ఓటమి పాలైన ఆతిథ్య శ్రీలంక.. కొలంబోలో గెలిచి సిరీస్ సమం చేయాలని వ్యూహాలు రచిస్తోంది.అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. తొలి రోజు కొలంబోలో వర్షం కురిసేందుకు 60 శాతం అస్కారముంది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురవనున్నట్లు పలు వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా తొలి టెస్టు జరిగిన గాలేలో కూడా ఆటకు వర్షం ఆటంకం కలిగించింది.పిచ్ రిపోర్ట్(అంచనా)ఇక కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ పిచ్ మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే ఛాన్స్ ఉంది. మ్యాచ్ గడుస్తున్న కొద్దీ పిచ్ క్రమంగా పొడిగా మారి, మూడో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుంది.దీంతో నాలుగో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లను ఎదుర్కోవడం కాస్త కష్టమవుతోంది. అయితే కొలంబోలో వాతావరణ పరిస్థితుల కారణంగా ఫస్ట్ సెషన్లో కొత్త బంతితో పేసర్లు కొంతవరకు పట్టు సాధించవచ్చు.కాగా చారిత్రాత్మక సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో టీమిండియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ వేదికలో తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్.. మూడింట విజయం, రెండింట ఓటమి పాలైంది. మరో నాలుగు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది.తుది జట్లు(అంచనా)భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, సరాంశ్ జైన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంక: లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూరియబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, సోనాల్ దినుషా, కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, లహిరు కుమార. -
‘కుల్దీప్ను హెచ్చరించా.. అది మేనేజ్మెంట్ ఇష్టం’
శ్రీలంకతో తొలి టెస్టులో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సేవలను సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. గాలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కుల్దీప్ మొత్తంగా 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.సారాంశ్ జైన్ అరంగేట్రం!మొత్తంగా 103 పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొలంబోలో జరిగే నిర్ణయాత్మక రెండో టెస్టు నుంచి అతడిని తప్పిస్తాడనే ప్రచారం జరుగుతోంది. కుల్దీప్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ అరంగేట్రం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కుల్దీప్ గురించి స్పందించాడు. ‘‘టెస్టు మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లను ఆడించినపుడు ఎవరో ఒకరికి తక్కువ ఓవర్లు వస్తాయి. దీనర్థం ఆ బౌలర్ సరిగ్గా ఆడటం లేదని కాదు.కుల్దీప్ను హెచ్చరించానుఎవరిని ఎప్పుడు పంపాలనేది కెప్టెన్, మేనేజ్మెంట్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక సమయంలో ఈ బౌలర్ వద్దు అని అనుకుంటే.. అతడిని పక్కనపెట్టి వేరే వాళ్లతో బౌలింగ్ చేయిస్తారు. నేను కుల్దీప్తో మాట్లాడాను. వికెట్లు తీయాలనే తొందరతో కాకుండా.. పొదుపుగా బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టమని, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వమని చెప్పాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.ఐదుగురు ఉంటే మంచిదేఅదే విధంగా.. ఐదుగురు బౌలర్లను ఆడించడంపై స్పందిస్తూ.. ‘‘టస్టు మ్యాచ్‌లో వెయ్యి పరుగులు చేసినా.. ఆ స్కోరుతో గెలుస్తామనే గ్యారెంటీ ఉండదు. అయితే, అదే మ్యాచ్‌లో మనం 20 వికెట్లు కూల్చినట్లయితే గెలుస్తామనే నమ్మకమైనా వస్తుంది.ఫ్లాట్ పిచ్‌లపై మాత్రం బౌలర్లు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మా జట్టులో ఐదుగురు ప్రాపర్ బౌలర్లు ఉండటం సానుకూలాంశం. కాబట్టి పిచ్ పరిస్థితిని బట్టి పేసర్లు, స్పిన్నర్లను మారుస్తూ ఉంటాము. ఐదుగురు బౌలర్లు ఉన్నపుడు రక్షణాత్మక ధోరణిలో కాకుండా.. ప్రభావం చూపే విధంగా ఆడటం సాధ్యమవుతుంది’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబో వేదిక.చదవండి: స్మిత్ తొండాట.. అంపైర్ వార్నింగ్! -
నేను ట్రోఫీలు గెలుస్తాను.. టెస్టుల్లో ఏం తక్కువైంది?: గంభీర్
టెస్టు ఫార్మాట్లో వైఫల్యాల నేపథ్యంలో వస్తున్న విమర్శలపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్పందించాడు. తాను ట్రోఫీలు గెలిచేందుకు మాత్రమే పని చేస్తానని స్పష్టం చేశాడు. తనకు ర్యాంకులు ముఖ్యం కాదని.. జట్టు సంధి దశలో ఉన్నపుడు ఒక్కోసారి ఆశించిన ఫలితాలు రావని పేర్కొన్నాడు.ఘోర పరాభవాలుకాగా గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా వైట్‌బాల్ క్రికెట్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఇప్పటికే ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో తొట్టతొలిసారి 3-0తో వైట్‌వాష్ కావడం, పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ కావడం ఇందులో ముఖ్యమైనవి.అయితే, ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఏదేమైనా గంభీర్‌పై మాత్రం విమర్శలు ఆగటం లేదు. ఇక ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ గెలిచిన టీమిండియా.. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో గెలిచింది.ఫైనల్ రేసులో ఉండాలంటే.. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో ఫైనల్ రేసులో ఉండాలంటే.. శ్రీలంకపై రెండో టెస్టు కూడా గెలవడంతో పాటు.. తర్వాత న్యూజిలాండ్ గడ్డమీదా సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో భారత్ రెండో టెస్టుకు ముందు రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్.. తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు.ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం‘‘ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం. వ్యూస్, లైక్స్ కోసం నేను పనిచేయను. నా అభిప్రాయంలో ర్యాంకింగ్స్ కూడా పెద్ద విశేషమేమీ కాదు. ప్రస్తుతం మా జట్టు సంధి దశలో ఉంది. యువ ఆటగాళ్లు వస్తున్నారు. ఈ విషయం కామెంట్రీ బాక్స్, మీడియా బాక్స్‌లో కూర్చున్న వాళ్లకు కూడా తెలుసు.ఆటలో గెలుపుఓటములు, ఎత్తుపళ్లాలు సహజం. ఇంగ్లండ్‌లో గతేడాది మేము మెరుగ్గా ఆడినాము. మా ఆటలో నిలకడ ఉంది. మేము సరైన దిశలోనే వెళ్తున్నాము’’ అని గంభీర్ అన్నాడు. అదే విధంగా.. టెస్టు సిరీస్‌లో కనీసం మూడు మ్యాచ్‌లు ఉంటే బాగుంటుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. తద్వారా తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు.. మిగిలిన రెండింటిలో ఒక్కటి గెలిచి, ఒకటి డ్రా చేసుకున్నా బాగుంటుందన్నాడు. కాగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక. ఇదిలా ఉంటే.. గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. కానీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్‌కు మాత్రం చేరలేకపోయింది.చదవండి: స్టార్క్ సరికొత్త చరిత్ర -
పడిక్కల్‌ను తప్పిస్తారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. శ్రీలంకలో గంభీర్‌కు పనీపాటా లేకుండా పోయిందని.. అతడు అక్కడ ఉండటం దండగేనన్నాడు. కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ శ్రీలంకను 165 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో మరో ముందుడుగు వేసింది.బారీ శతకంతో విజయానికి పునాదిఇక టీమిండియా విజయంలో దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం (167) సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 44 విలువైన పరుగులు జతచేశాడు. కాగా సాయి సుదర్శన్ గాయపడటం వల్లే పడిక్కల్‌కు తుదిజట్టులో చోటు సాధ్యమైంది.ఇక సాయి సుదర్శన్‌కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మద్దతు ఉందన్న సంగతి తెలిసిందే. గతంలో వరుస మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ సుదీర్ఘకాలం పాటు.. టెస్టుల్లో వన్‌డౌన్‌లో వచ్చేది సుదర్శన్ మాత్రమేనని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పడిక్కల్ తాజా ప్రదర్శనను ఉదాహరిస్తూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్‌పై విరుచుకుపడ్డాడు.పడిక్కల్‌ను రీప్లేస్ చేస్తారా?.. గంభీర్‌కు పనీపాటా లేదు!తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘మొదటి టెస్టులో పడిక్కల్ 200కు పైగా పరుగులు స్కోరు చేశాడు. అయినా సరే పడిక్కల్ స్థానంలో సుదర్శన్‌ను ఆడిస్తావా గంభీర్?.. అయినా గంభీర్‌కు శ్రీలంకలో పనేమీ లేదు.శ్రీలంక జట్టు అస్సలు బాలేదు. వాళ్లపై టీమిండియా తప్పకుండా గెలుస్తుంది. ఇక ఆ తర్వాత గంభీర్ ఎగిరి గంతేస్తాడు. శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లపై విజయానికే అతడు సంతోషిస్తాడు. నేను గంభీర్‌ను ఘాటుగా విమర్శించాలనుకోవడం లేదు.గంభీర్ మంచి ప్లేయర్.. కానీనిజానికి అతడు మంచి క్రికెటర్. ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. కానీ ఇతరులతో మాట్లాడేటపుడే కాస్త ఇబ్బంది. అందుకే ఆటగాడిగా ఆకట్టుకున్నా.. కోచ్‌గా మాత్రం అతడు ఇబ్బందిపడుతున్నట్లు అనిపిస్తుంది’’ అని చిక్కా అన్నాడు. కాగా ఇటీవల స్వదేశంలో అఫ్గాన్‌తో ఒక టెస్టు మ్యాచ్ ఆడిన టీమిండియా గెలుపుజెండా ఎగురవేసింది. అయితే, అంతకు ముందు సౌతాఫ్రికా చేతిలో సొంతడ్డపై 0-2తో భారత్ వైట్‌వాష్‌కు గురైంది. పాతికేళ్ల తర్వాత ఇంతటి ఘోర పరాభవం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలుకానుండగా.. కొలంబో ఇందుకు వేదిక.చదవండి: ఆసీస్‌ను గడగడలాడించిన షోరిఫుల్ ఇస్లాం! -
కావాలనే చేశాడు!.. హాజిల్‌వుడ్, కమిన్స్ ఆగ్రహం.. చివరికి!
ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బంగ్లా ఆటగాడు టస్కిన్ అహ్మద్ ఆసీస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో హాజిల్‌వుడ్ అందుకోవాల్సిన క్యాచ్ నేలపాలైంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్ల వ్యవహారశైలిపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది.తొలి టెస్టులో ఘన విజయంకాగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో డార్విన్ వేదికగా తొలి టెస్టులో బంగ్లా.. ఆసీస్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత కంగారూల గడ్డపై ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఈ మేరకు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.స్టార్క్ దెబ్బ.. పెవిలియన్‌కు బ్యాటర్ల క్యూఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం రెండో టెస్టు మొదలైంది. మెకె వేదికగా టాస్ గెలిచిన ఆసీస్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ కేవలం 64 పరుగులు చేసి కుప్పకూలింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు టాప్, మిడిలార్డర్లో కలిపి ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కాగా.. మిగిలిన వారు సింగిల్ డిజిట్ స్కోర్లు చేశారు.హాజిల్‌వుడ్‌ను ఢీకొట్టిన టస్కిన్లోయర్ ఆర్డర్లో మెహిదీ హసన్ మిరాజ్ (10), తైజుల్ ఇస్లాం (11*), షోరిఫుల్ ఇస్లాం (14) కాసేపు నిలబడటంతో బంగ్లా ఈ మేరకు 60 పరుగుల మార్కు దాటింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్లో హాజిల్‌వుడ్ బంతితో రంగంలోకి దిగాడు. గంటకు 134 కిలో మీటర్ల వేగంతో మిడిల్ స్టంప్ టార్గెట్‌గా షార్ట్ డెలివరి (మూడో బంతి) సంధించగా.. టస్కిన్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా.. హాజిల్‌వుడ్ ముందుకు వచ్చి దానిని అందుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో టస్కిన్ సింగిల్ కోసం వస్తున్నట్లుగా వచ్చి బలంగా హాజిల్‌వుడ్‌ను ఢీకొట్టాడు. దీంతో క్యాచ్ నేలపాలైంది. ఈ నేపథ్యంలో టస్కిన్ అహ్మద్ కావాలనే తనను ఢీకొట్టాడని హాజిల్‌వుడ్ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కాడు.కావాలనే చేశాడు.. హాజిల్‌వుడ్, కమిన్స్ ఫైర్ఇంతలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ దగ్గరికి వచ్చి ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. టస్కిన్ ఉద్దేశపూర్వకంగానే హాజిల్‌వుడ్ క్యాచ్ అందుకోకుండా చేశాడని.. అతడిని అవుట్‌గా ప్రకటించాలని అప్పీలు చేశాడు. అయితే, అంపైర్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. టస్కిన్ అనుకోకుండా హాజిల్‌వుడ్‌ను ఢీకొట్టాడని పేర్కొంటూ.. కమిన్స్ అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.వీళ్లు మారరుకాగా ఐసీసీ నిబంధనల ప్రకారం ఉద్దేశపూర్వకంగానే ఆటగాడు క్యాచ్‌ను అడ్డుకున్నట్లు తేలితే గనుక అతడిని అవుట్‌గా ప్రకటిస్తారు. అయితే, ఇక్కడ టస్కిన్ బంతిని బాదిన వెంటనే పరుగుకు రావడం.. ఇంతలో హాజిల్‌వుడ్ క్యాచ్ కోసం వెళ్లడం రెప్పపాటులో జరిగిపోయిందని.. అందుకే టస్కిన్ సేఫ్ అయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. నెటిజన్లు మాత్రం.. ‘‘వీళ్లు మారరు. టస్కిన్ కావాలనే హాజిల్‌వుడ్‌ను ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో ముందుంటారు. గతంలో ధోనితో కూడా ఇలాగే ప్రవర్తించారు. ఆసీస్ జట్టు వీళ్లకు తగిన గుణపాఠం చెబుతుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బంగ్లాపై 101 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కామెరాన్ గ్రీన్ అర్ధ శతకం (51) పూర్తి చేసుకోగా.. అతడితో పాటు నాథన్ లియోన్ (10) క్రీజులో నిలిచాడు.చదవండి: పెళ్లి తర్వాత పిల్లలను దత్తత ఇచ్చిన రొనాల్డో? -
గిల్, జైస్వాల్ ఫామ్‌పై నజర్.. ఒక్క ఇన్నింగ్స్ చాలు!
కొలంబో వేదికగా ఆదివారం నుంచి భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విక్టరీ అందుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ అదే జోరు ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే తొలి టెస్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లు రాణించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరముంది. అయితే గిల్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు సాధించిన గిల్ తిరిగి ట్రాక్ ఎక్కేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఇప్పటికే కెప్టెన్‌గా గిల్ 10 టెస్టుల్లో 1100 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్‌గా 32 టెస్టుల్లో 1893 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్‌గా విదేశీ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఇటీవలే స్వదేశంలో ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను గిల్ సారథ్యంలోనే టీమిండియా నెగ్గింది. ఇక జైస్వాల్ ఫామ్ మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. గత 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక్క అర్ధసెంచరీ మాత్రమే సాధించాడు. ఆ ఒక్కటి కూడా గతేడాది న్యూఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌పై సాధించాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో సమన్వయలోపంతో రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.కేఎల్ రాహుల్, కుల్దీప్ గైర్హాజరు తొలి టెస్టులో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుక్రవారం ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కండరాలు పట్టేసి ఇబ్బంది పడిన రాహుల్... రెండో టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. లంకతో మొదటి టెస్టులో అతడు వరుసగా 82, 35 పరుగులు చేశాడు. గతంలోనే శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో సభ్యుడైన రాహుల్... తన అనుభవాన్నంతా రంగరించి స్పిన్ ఉచ్చును చేధించడంతోనే భారత్ తొలి మ్యాచ్‌లో సులువుగా గెలుపొందింది. అతడితో పాటు తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కుల్దీప్... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండానే మైదానాన్ని వీడాడు. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడి బౌలింగ్‌లో పంత్, గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘రాహుల్, కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నారు’ అని బహుతులే పేర్కొన్నాడు. Read: లైవ్ మ్యాచ్.. ప్రత్యర్థి గూబ గుయ్‌మనిపించిన మెస్సీ! -
IND vs SL: ప్రాక్టీస్ కూడా చేయలేదు.. రెండో టెస్టుకు డౌటే!
శ్రీలంకతో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ జరుగుతోంది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో సారాంశ్ జైన్‌ను ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు యాజమాన్యానికి సూచిస్తున్నారు. మ్యాచ్ వేదికైన కొలంబోలో ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉంటుంది గనుక సారాంశ్‌ను ఆడించడమే ఉత్తమమని మహ్మద్ కైఫ్ వంటి మాజీ ప్లేయర్లు అభిప్రాయపడుతున్నారు.అతడొక మ్యాచ్ విన్నర్ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మాత్రం కుల్దీప్ యాదవ్‌కు అండగా నిలిచాడు. ‘అతడు చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. గాలేలోని పరిస్థితుల నేపథ్యంలో అతడి బాధ్యతలు వేరేవి. నా దృష్టిలో అతడొక మ్యాచ్ విన్నర్. మా ప్రణాళికల్లో అతడు కీలకం. ఒక్క మ్యాచ్ ద్వారానే అతడి ప్రతిభను అంచనా వేయడం సరైంది కాదు’ అని పేర్కొన్నాడు. కాగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 25 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్... 103 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.అదరగొట్టిన మానవ్మరోవైపు.. కెరీర్లో రెండో టెస్టు మ్యాచ్ ఆడిన మానవ్ సుతార్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టగా... సీనియర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు తీశాడు. నిజానికి శ్రీలంక స్పిన్నర్లు కూడా బంతిని గింగిరాలు తిప్పిన చోట కుల్దీప్ యాదవ్ ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. ఫలితంగా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.ప్రాక్టీస్ కూడా చేయలేదు.. రెండో టెస్టుకు డౌటే!ఇదిలా ఉంటే.. రెండో టెస్టు కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుల్దీప్ యాదవ్ మైదానానికి వచ్చినప్పటికీ.. ప్రాక్టీస్ చేయకుండానే వెనుదిరిగాడు. అటు బౌలింగ్ కానీ.. ఇటు బ్యాటింగ్ కానీ ప్రాక్టీస్ చేయలేదు. మరోవైపు.. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేవాడు. ఈ నేథ్యంలో బహుతులే మాత్రం.. కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే ప్రాక్టీస్ చేయలేదని తెలపడం విశేషం. ఏదైమైనా కుల్దీప్‌నకు కోచ్ అండగా నిలిచినప్పటికీ.. కొలంబో పిచ్ పరిస్థితుల కారణంగా అతడిపై వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది.అతడి ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయిఇదిలా ఉంటే.. గాలె టస్టులో ఇక తొలి టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్న యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌పై బహుతులే ప్రశంసలు కురిపించాడు. ‘దేశవాళీల నుంచి సుతార్‌ను గమనిస్తున్నా. అతడు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. విభిన్న పరిస్థితుల్లో ఎలా రాణించాలో సుతార్‌కు బాగా తెలుసు. ఎలాంటి పిచ్‌పై ఎలాంటి బంతులు వేసి ఫలితం రాబట్టాలి... ఏ బ్యాటర్‌కు ఎలాంటి ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌తో బౌలింగ్ చేయాలి... ఇలా అతడి ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి. దీంతో అతడు జట్టుకు అదనపు బలంగా మారాడు’ సాయిరాజ్ బహుతులే వెల్లడించాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ఆదివారం (ఆగష్టు 23) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక. చదవండి: కెరీర్ విషయంలో అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయం! -
ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బ; భారత్‌కు కలిసొచ్చిన పాక్ ఓటమి!
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన పాకిస్తాన్ జట్టు ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పాకిస్తాన్ సున్నా పరుగు వద్దే తొలి వికెట్‌ను కోల్పోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో ఓలి రాబిన్సన్ బౌలింగ్‌లో అజన్ అవైస్ డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో ఇమామ్-ఉల్-హక్ సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నా పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోవడం పాక్‌కు ఇది ఏడోసారి. ఈ నేపథ్యంలో అత్యధిక సార్లు సున్నా పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన చెత్త జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. పాక్ తర్వాత ఇంగ్లండ్ (5 సార్లు), ఆస్ట్రేలియా (4 సార్లు), భారత్ (రెండు సార్లు), న్యూజిలాండ్ ఒకసారి ఈ ఫీట్‌ను నమోదు చేశాయి.ఇక ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమి వల్ల డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ, భారత్‌కు మాత్రం కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో డబ్ల్యూటీసీ సైకిల్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది ఐదో ఓటమి. కేవలం 19.05 శాతం పాయింట్లతో పాక్ 9వ స్థానానికి దిగజారింది. దీంతో వెస్టిండీస్ (20.83 శాతం పాయింట్లు) 8వ స్థానంలో నిలవగా, పాక్‌పై విజయంతో ఇంగ్లాండ్ 29.76 శాతం పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇరు జట్లు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు ఆస్ట్రేలియా 77.78 శాతం పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా (75 శాతం), న్యూజిలాండ్ (72.22 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 53.33 శాతం పాయింట్లతో 5వ స్థానంలో, బంగ్లాదేశ్ 66.67 శాతం పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి. శ్రీలంకపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రెండో మ్యాచ్‌లోనూ గెలిచి, అటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఓడిపోతే, భారత్ 57.57 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోవడంతో ఫైనల్ రేసుకు మరింత దగ్గరయినట్లవుతుంది.ఇక హెడ్డింగే వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 171 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌట్ కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 135 పరుగులకే కుప్పకూలింది.జోఫ్రా ఆర్చర్, ఒల్లీ రాబిన్సన్, జోష్ టంగ్, గుస్ అట్కిన్సన్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు. రాబిన్సన్, టంగ్‌లు చెరో 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తద్వారా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 27నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది.Read: స్టార్క్ దెబ్బకు బంగ్లాదేశ్ విలవిల.. 149 ఏళ్లలో ఇదే తొలిసారి -
ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర తిరగరాసిన పాక్ స్పిన్నర్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్ అలీ ఉస్మాన్ చరిత్రను తిరగరాశాడు. హెడ్డింగే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 33 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 23 ఓవర్లు వేసి 92 పరుగులిచ్చి 5 వికెట్ల హాల్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఆడుతున్న అలీ ఉస్మాన్ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా నిలిచాడు. గతంలో ఇంగ్లండ్ గడ్డపై పర్వేజ్ సాజద్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్లు పడగొట్టగా, ఇక్బాల్ ఖాసిమ్, షుజాహుద్దీన్లు చెరో మూడు ఇన్నింగ్స్‌ల్లో నాలుగేసి వికెట్లు, ఫవద్ ఆలం ఒక ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. అంతేకాదు ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ఇంగ్లండ్ గడ్డపై తక్కువ ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్‌గా అలీ ఉస్మాన్ బెస్ట్ ఫిగర్స్ కూడా నమోదు చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లండ్ ఇప్పటికైతే పైచేయిలోనే ఉంది. జో రూట్ సహా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు సాధించింది. రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోర్డాన్ కాక్స్ (73), జో రూట్ (66), డాన్ లారెన్స్ (51) ఫిఫ్టీలు సాధించారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్ 5 వికెట్లు తీయగా, మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది.Only Positive From Pakistan Side Today> ALI USMAN ✨23 Overs • 92 Runs • 5 Wickets pic.twitter.com/kIV1m2vcdB— Usman (@UsmanOffical56) August 20, 2026 A maiden five-wicket haul in Tests for Ali Usman ✨#WTC27 📝: https://t.co/bmrVSU3KD6 pic.twitter.com/N1q4BiyWHg— ICC (@ICC) August 20, 2026చదవండి: 22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా విడుదలైన భారత మాజీ క్రికెటర్ -
రూట్ ప్రపంచ రికార్డు.. పాక్‌తో టెస్టులో భారీ ఆధిక్యం
పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రపంచ రికార్డుతో మెరిశాడు. మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (66 పరుగులు) సాధించిన రూట్ టెస్టు క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన జాబితాలో సచిన్‌తో (200 టెస్టుల్లో 68 అర్ధశతకాలు) కలిసి రూట్ (167 టెస్టుల్లోనే) సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. మరో అర్ధసెంచరీ సాధిస్తే రూట్ టెస్టుల్లో అత్యధిక ఫిఫ్టీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలోనూ రూట్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా, సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతు న్నాడు. ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా రూట్‌కు సచిన్ రికార్డును బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఈతరం ఫ్యాబ్-4లో (కోహ్లి, స్మిత్, రూట్, కేన్ విలియమ్సన్) ఇద్దరు ఇప్పటికే రిటైరవ్వగా.. రూట్, స్మిత్ మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు.టెస్టు కెప్టెన్‌గా మరో రికార్డుదీంతో పాటు రూట్ టెస్టుల్లో మరో రికార్డు కూడా అందుకున్నాడు. టెస్టు కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రూట్ (42 ఫిఫ్టీలు) ఐదో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్ (61), ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్ (54), అలెన్ బోర్డర్ (51) రెండు, మూడు స్థానాల్లో ఉండగా, పాక్ మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ (43 ఫిఫ్టీలు) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక రూట్ సహా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు అర్ధశతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు సాధించింది. రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోర్డాన్ కాక్స్ (73), జో రూట్ (66), డాన్ లారెన్స్ (51) ఫిఫ్టీలు సాధించారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్ 5 వికెట్లు తీయగా, మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది.Joe Root 66(112) Vs Pakistan | 1st Test, 2026 - Leeds | Ball By Ball Highlights pic.twitter.com/gbkZ20BOwC— PctMedia (@PctMediaa) August 20, 2026Most fifties in Test cricket:Joe Root - 68*. Sachin Tendulkar- 68. pic.twitter.com/dScWCVxvSn— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2026 -
పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేశాడు.. అతడిపై వేటు తప్పదు!
శ్రీలంక పర్యటనను టీమిండియా ఘనంగా ఆరంభించింది. గాలె వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఇరుజట్ల మధ్య ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక.అతడి గురించే నా ఆందోళనఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘నేను ఓ ఆటగాడి గురించి బాగా ఆందోళన చెందుతున్నా. అతడు మరెవరో కాదు కుల్దీప్ యాదవ్.పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేశాడు?శ్రీలంకతో రెండో టెస్టులో అతడు ఆడకపోవచ్చు. తన చేతికి బంతిని ఇస్తున్నారు. కానీ లాంగ్ స్పెల్స్‌కు అవకాశం ఇవ్వడం లేదు. నిజానికి తొలి టెస్టులో బ్యాటర్, పార్ట్ టైమ్ స్పిన్నర్ దేవదత్ పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేయాల్సి వచ్చింది?ఎందుకంటే.. జట్టులో సరైన ఆఫ్ స్పిన్నర్ లేడు. కాబట్టి రెండో టెస్టులో టీమిండియా.. కుల్దీప్ యాదవ్‌ను తప్పించి ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌కు పిలుపునివ్వవచ్చు. ఇద్దరు లెఫ్టాండర్ బ్యాటర్లు క్రీజులో ఉన్నపుడు ఆఫ్ స్పిన్నర్‌ను రంగంలోకి దింపితే ప్రయోజనకరంగా ఉంటుంది.సారాంశ్ అరంగేట్రం పక్కాకాబట్టి కుల్దీప్ యాదవ్‌ను కాదని యాజమాన్యం సారాంశ్ జైన్ వైపు మొగ్గుచూపుతుందనిపిస్తోంది. కొలంబోలో సారాంశ్ అరంగేట్రం దాదాపు ఖాయమైపోయినట్లే’’ అని పేర్కొన్నాడు. ఈ ఒక్కటి తప్ప తుదిజట్టులో మార్పులు ఉండబోవని కైఫ్ అభిప్రాయపడ్డాడు.కాగా గాలెలో జరిగిన తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో 14 ఓవర్ల బౌలింగ్‌లో 65 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు.. పడిక్కల్ లంక రెండో ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ వేసి.. ఐదు పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్‌కే రహానే మద్దతుఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే మాత్రం కైఫ్‌తో విభేదించాడు. ‘‘కొలంబోలో కూడా గాలె మాదిరి పిచ్ ఉంటే.. నేను కుల్దీప్ యాదవ్‌నే ఆడించాలని చెప్తాను. అతడు అత్యద్భుతమైన నైపుణ్యాలున్న బౌలర్. మ్యాచ్ విన్నర్ కూడా. సరైన సమయంలో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. చాన్నాళ్ల తర్వాత అతడిని తుదిజట్టులోకి తీసుకున్నారు. మరొక్క అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రహానే పేర్కొన్నాడు. కాగా గాలె టెస్టులో టీమిండియా ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వీరిలో కుల్దీప్ స్పెషలిస్టు స్పిన్నర్ కాగా.. జడేజా, మానవ్ ఆల్‌రౌండర్లు.గాలె టెస్టులో ఆడిన భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: ‘జడేజా పనైపోయింది.. అతడితో పోల్చవద్దు’ -
పాక్ డ్రెసింగ్‌రూమ్‌కి వెళ్లు: నాసిర్ హుసేన్‌కు డీకే కౌంటర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్‌కు భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాకిస్తాన్ ఆటగాడి అవుట్ విషయంలో అంతగా బాధనిపిస్తే.. వారి డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లి సూచనలు ఇవ్వొచ్చుగా అని చురకలు అంటించాడు. అసలేం జరిగిందంటే.. మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.171 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో బుధవారం లీడ్స్ వేదికగా ఇంగ్లండ్- పాక్ మధ్య తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. పాక్ బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులే చేసి ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటింగ్ మొదలుపెట్టగా.. మహ్మద్ అబ్బాస్ పాక్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు.అయితే, మూడో బంతికే ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు భావించిన అబ్బాస్... కెప్టెన్‌ను ఒప్పించి రివ్యూకు వెళ్లాడు. కానీ.. అల్ట్రాఎడ్జ్‌లో బ్యాట్ ఇన్వాల్మెంట్ లేదని వచ్చింది. దీంతో అంపైర్ కాల్ ప్రకారం డకెట్ నాటౌట్‌గా తేలాడు. అయితే, తొమ్మిదో ఓవర్లో అబ్బాస్ బౌలింగ్‌లోనే డకెట్ (15) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడం విశేషం.పాక్ ఆటగాడి మాదరే కామెంటేటర్ కూడాకాగా తొలి ప్రయత్నంలో డకెట్ తప్పించుకోవడంతో అబ్బాస్ నిరాశ వ్యక్తం చేశాడు. అదే సమయంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న నాసిర్ హుసేన్.. అబ్బాస్ మాదిరే అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ నిర్ణయం పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉండాల్సిందని.. అంపైర్స్ కాల్ వల్లే అబ్బాస్‌కు నిరాశ ఎదురైందన్నట్లుగా మాట్లాడాడు.పాకిస్తాన్ డ్రెసింగ్‌రూమ్‌కి వెళ్లుఇందుకు ప్రతిగా.. పక్కనే ఉన్న దినేశ్ కార్తిక్.. ‘పాకిస్తాన్ డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లి.. DRS (డెసిషన్ రివ్యూ సిస్టమ్) ఎలా పనిచేస్తుందో వాళ్లకు కాస్త నేర్పించండి’ అని చురక వేశాడు. అంపైర్స్ కాల్ విషయంలో నాసిర్ హుసేన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు.కాగా ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూకు వెళ్లినపుడు థర్డ్ అంపైర్ పరిశీలనలో బంతి స్టంప్స్‌ను తాకినట్లు తేలినా.. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ అంతకుముందు నాటౌట్ ఇచ్చి ఉంటే.. బ్యాటర్ సేఫ్ అవుతాడు. ఒకవేళ బంతికి తాకపోయినట్లు తేలి.. అంతకుముందు అవుట్‌గా ఇచ్చి ఉంటే బ్యాటర్ అవుట్ అవుతాడు.గతంలో అలా.. ఇపుడు ఇలాఈ నేపథ్యంలో అంపైర్స్ కాల్ నిబంధనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గతంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు నాసిర్ హుసేన్ వీళ్లిద్దరిని విమర్శించి.. అంపైర్స్ కాల్‌కు మద్దతు పలికాడు. ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ ఆటగాడి తరఫున వకాల్తా తీసుకుని అంపైర్స్ కాల్‌ను తప్పుబట్టడంతో డీకే కౌంటర్ ఇచ్చాడు. కాగా నాసిర్ హుసేన్ వీలు చిక్కినప్పుడల్లా పాక్ జట్టుకు మద్దతుగా నిలుస్తాడన్న సంగతి తెలిసిందే.చదవండి: టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 118 పరుగుల తేడాతో భారత్ గెలుపు -
ఓటమి బాధలో ఉన్న శ్రీలంకకు మరో భారీ షాక్
గాలే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమిపాలైన శ్రీలంకకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ చండీమాల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాలే టెస్టు నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా చండీమాల్ గాయపడ్డాడు. లెగ్-సైడ్ బౌండరీ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో అతడి తలకు, భుజానికి గాయమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో దినేష్ బ్యాటింగ్‌కు రాలేదు. అతడి స్ధానంలో పసిందు సూరియబండార కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. అయితే ఐసీసీ రూల్ ప్రకారం.. కంకషన్‌కు గురైన ఆటగాడు ఖచ్చితంగా 7 రోజుల పాటు మైదానానికి దూరంగా ఉండాలి. ఈ నిబంధన కారణంగానే కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు చండీమాల్ అందుబాటులో లేడు. ఈ విషయాన్ని గ్యారీ కిర్‌స్టన్ ధ్రువీకరించాడు. "కొలంబో టెస్టుకు దినేష్ చండీమాల్ అందుబాటులో ఉండటం లేదు. కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టుకు ఎదురు దెబ్బగానే చెప్పాలి. అయితే ఇది యంగ్ ప్లేయర్లకు మంచి అవకాశం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వారిలో ఎవరో ఒకరికి తుది జట్టులో ఛాన్స్ ఇస్తామని" కిర్‌స్టన్ పేర్కొన్నాడు. మరోవైపు తొలి టెస్టుకు దూరమైన యువ ఓపెనర్ పాథుమ్ నిస్సాంక.. కొలంబో టెస్టులో కూడా ఆడేది అనుమానమే -
1-600: టీమిండియా టెస్టు ప్రయాణంలో విజయాలు ఎన్ని?
భారత టెస్టు క్రికెట్లో చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో ఏకంగా 165 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా తమ 600వ టెస్టును భారత్ భారీ గెలుపుతో చిరస్మరణీయం చేసుకుంది.బౌలర్ల విజృంభణకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మొదలైన తొలి టెస్టు.. బుధవారం ఆఖరి రోజు ఆటతో ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విధించిన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక లంక చతికిలపడింది.భారత బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్య ఛేదనలో కేవలం 206 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మొత్తంగా పది వికెట్లు కూల్చి లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.సెంచరీ హీరో పడిక్కల్భారత తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ శతకం (167) బాదాడు. ఫలితంగా టీమిండియా 462 పరుగులు చేయగలిగింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చాపచుట్టేసినా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని లంకకు 372 పరుగుల మేర భారీ టార్గెట్ నిర్దేశించగలిగింది.ఇదిలా ఉంటే.. 1932లో టీమిండియా తన టెస్టు ప్రయాణం మొదలుపెట్టింది. మొట్టమొదట ఇంగ్లండ్‌తో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మ్యాచ్ ఆడింది. ప్రస్తుతం 600 మైలురాయికి చేరుకుంది. మరి ఈ టీమిండియా ప్రయాణంలో వర్షం లేదా ఇతర కారణాల వల్ల రద్దైన మ్యాచ్‌లు పోనూ మొత్తం గెలుపులు, ఓటములు ఎన్నో తెలుసా?.. ప్రతి వంద మ్యాచ్‌ల మధ్య భారత జట్టు జర్నీ ఎలా సాగిందంటే..1-600 జర్నీ సాగిందిలా..1-100: 10 విజయాలు, 40 ఓటములు, 50 డ్రా101-200: 25 విజయాలు, 32 ఓటములు, 43 డ్రా201-300: 21 విజయాలు, 26 ఓటములు, ఒకటి టై, 52 డ్రా301-400: 32 విజయాలు, 31 ఓటములు, 37 డ్రా401-500: 42 విజయాలు, 28 ఓటములు. 30 డ్రా501-600: 57 విజయాలు, 31 ఓటములు, 2 డ్రా.మొత్తం: 187 విజయాలు, 188 ఓటములు, 1 టై, 214 డ్రా.చదవండి: నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా: జైస్వాల్ -
నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.. సిక్సర్లు కొట్టు: జైస్వాల్
శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన చర్యతో వార్తల్లో నిలిచాడు. లంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాను స్లెడ్జ్ చేసి.. అతడి ఏకాగ్రతను దెబ్బతీయడంలో జైసూ సఫలమయ్యాడు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నపుడు డిక్వెల్లా స్టెడ్జింగ్‌కు పాల్పడగా.. ఐదో రోజు ఆటలో జైస్వాల్ ఈ మేరకు ప్రతీకారం తీర్చుకున్నాడు.అసలేం జరిగిందంటే.. గాలె టెస్టులో టీమిండియా విధించిన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆది నుంచే తడబడింది. ఈ క్రమంలో మంగళవారం నాటి నాలుగు రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 84 పరుగులే చేసింది.ధనంజయ, దినుష పోరాటంఅయితే, కెప్టెన్ ధనంజయ డి సిల్వ (59), సొనాల్ దినుష (84) కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బుధవారం లంచ్‌కు ముందు రవీంద్ర జడేజా ధనంజయను అవుట్ చేయగా.. అతడి స్థానంలో నిరోషన్ డిక్వెల్లా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో జైస్వాల్ అతడిని స్లెడ్జ్ చేశాడు.లంక రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ ప్రసిద్ కృష్ణ 60వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగగా.. ఐదో బాల్‌కు డిక్వెల్లా రెండు పరుగులు తీశాడు. అప్పుడు స్వ్కేర్ లెగ్ ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్న జైస్వాల్.. డిక్వెల్లాను మాటల్లో పెట్టాడు. వారి మధ్య సంభాషణ సాగిందిలా..The art of on-field sledging, decoded! 🗣️🔥Ajay Jadeja breaks down Yashasvi Jaiswal’s hilarious yet effective mind games that led directly to a crucial breakthrough! 🎯Watch #SLvIND 2nd Test, starting 23rd August 9 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony… pic.twitter.com/dpTjsar1Qz— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.. సిక్సర్లు కొట్టుజైస్వాల్: కమాన్ యార్.. తొలి ఇన్నింగ్స్‌లో బాగానే షాట్లు కొట్టావు కదా.. ఇప్పుడు కూడా అలాంటిదేదో కావాలి. కమాన్..డిక్వెల్లా: అవునా?జైస్వాల్: అవును. నువ్వు షాట్లు కొడుతుంటే చూడాలనుకుంటున్నాను. చేసి చూపించు మరి. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదు.డిక్వెల్లా: ఆ అవసరం ఇప్పుడు లేదు. నన్ను ఐపీఎల్‌కు తీసుకువెళ్లు. అక్కడ సిక్సర్లు బాదుతా.జైస్వాల్: కచ్చితంగా వంద శాతం తీసుకెళ్తా. ఇప్పుడైతే సిక్సర్ కొట్టు. నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.డిక్వెల్లా: ధన్యవాదాలు.ఇలా డిక్వెల్లా (10)ను జైస్వాల్ స్లెడ్జ్ చేయగా.. మరుసటి బంతికే అతడు వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 165 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా శ్రీలంకతో తొలి టెస్టులో జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.చదవండి: శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా -
లంకపై విజయం.. గంభీర్ ప్లాన్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి సెషన్లో 20 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా పడకపోగా, లంక బ్యాటర్లు జిడ్డు ఆటను ప్రదర్శించారు. ముఖ్యంగా కెప్టెన్ ధనంజయ డిసిల్వా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూషలు మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి టీమిండియా ఆటను గమనిస్తూ వచ్చిన గంభీర్ బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 30 ఓవర్ల పాటు భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంపై గంభీర్ ఆగ్రహించాడు. దీంతో లంక 112 పరుగుల వద్ద ఉన్నప్పుడు డ్రింక్స్ బ్రేక్ రాగా, ఆ సమయంలో గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి డగౌట్‌కు వచ్చి మాస్టర్ ప్లాన్ వివరించాడు. గంభీర్ ఇచ్చిన ప్లాన్ ఆటను పూర్తిగా మార్చేయడంతో ఆటకు అదే టర్నింగ్ పాయింట్ అయింది.సిరాజ్‌ను పిలిచిన గంభీర్ బౌలింగ్ ప్లాన్‌ను వివరించాడు. పేస్ అటాకింగ్‌ను పక్కనబెట్టి, పూర్తిగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించమని సిరాజ్‌కు వివరించాడు. ఈ విషయాన్ని వెంటనే కెప్టెన్ గిల్‌కు చేరవేయాలని తెలిపాడు. గంభీర్ సలహాను పాటించిన మరుక్షణమే టీమిండియాకు ఫలితం రావడం విశేషం. 94 పరుగుల జోడించి బలపడుతున్న ధనంజయ, దినూష జోడిని జడేజా విడదీశాడు. అలా టీమిండియా మళ్లీ విజయం ట్రాక్ ఎక్కినట్లయింది. మరో ఎండ్ నుంచి మానవ్ సుతార్ కూడా తన బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టడంతో లంక కష్టాలు రెట్టింపు అయ్యాయి. చివరకు 206 పరుగుల వద్ద లంక తమ ఇన్నింగ్స్‌ను ముగించడంతో 165 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.🚨Gautam Gambhir Gives Mohammed Siraj a Bowling Plan to Break Sri Lanka’s Partnership🚨Indian bowlers are struggling to take wickets on the morning of Day 5, as Sri Lankan batters Dhananjaya de Silva and Sonal Dinusha are batting strongly and building a solid partnership.… pic.twitter.com/Bu6YQa8DXD— Central Cricket (@arshdeep3444) August 19, 2026చదవండి: పాక్ జట్టును అవమానించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్! -
శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా.. ఘన విజయం
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. గాలెలో 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 206 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు భారీ విజయం సాధ్యమైంది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆరు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో టీమిండియా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్ రేసులో కీలక ముందడుగు వేసింది. కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గాలె స్టేడియంలో శనివారం తొలి టెస్టు మొదలైంది.పడిక్కల్ సెంచరీతో..టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167)తో చెలరేగగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది.అయితే, రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ (66)తో రాణించగా.. భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.ధనంజయ, దినుష పోరాటంఈ నేపథ్యంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్లు నిశాన్ మధుష్క (6), లాహిరు ఉదార (16)తో పాటు.. అనూహ్య రీతిలో అరంగేట్రం చేసిన వన్‌డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా (0) పూర్తిగా విఫలమయ్యాడు.సీనియర్ బ్యాటర్ కమిందు మెండిస్ (2) కూడా చేతులెత్తేశాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డారు. బుధవారం నాటి ఐదో రోజు ఆటలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని భారత బౌలర్ల సహనాన్ని వీరిద్దరు పరీక్షించారు.జడ్డూ మ్యాజిక్ఈ క్రమంలో రవీంద్ర జడేజా ధనంజయ డి సిల్వ (59)ను అవుట్ చేసి బ్రేక్ ఇవ్వగా.. ప్రసిద్ కృష్ణ నిరోషన్ డిక్వెల్లా (10)ను అవుట్ చేశాడు. దీంతో భోజన విరామ సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.India needed a way through, and Ravindra Jadeja found it. 🤩 Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/tCm8qzqmBb— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026ఆరేసిన మానవ్ సుతార్అయితే, లంచ్ తర్వాత కూడా సొనాల్ దినుష పట్టువీడకుండా క్రీజులో పాతుకుపోయాడు. సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ మానవ్ సుతార్ అతడికి ఊహించని షాకిచ్చాడు. 76వ ఓవర్లో తొలి బంతిని లెగ్ స్టంప్ అవుట్‌సైడ్ దిశగా సంధించగా.. షాట్ ఆడే క్రమంలో దినుష (84) విఫలమయ్యాడు. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకోగా.. టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి.Manav Suthar cleaned up the tail in a flash! ⚡Three wickets in one over to put the finishing touches on a sensational bowling effort. Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/LwSc4NGRW2— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026ఇక ఆ తర్వాత మరుసటి బంతికే మానవ్ సుతార్ ప్రభాత్ జయసూర్య (0)ను బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లో లాహిరు కుమార (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఇక 78వ ఓవర్లో నాలుగో బంతికి కేశారా నువాంత (20)ను కూడా బౌల్డ్ చేసిన మానవ్ సుతార్ తన ఆరో వికెట్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ మ్యాచ్‌లో మొత్తంగా పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇదిలా ఉంటే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా టెస్టుక్రికెట్లో భారత్‌కు ఇది 600వ మ్యాచ్ కావడం విశేషం.శ్రీలంక వర్సెస్ భారత్ తొలి టెస్టు👉వేదిక: గాలె ఇంటర్నేషనల్ స్టేడియం, గాలె.👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్సంక్షిప్త స్కోర్లు👉భారత్: 462 &193👉శ్రీలంక: 284 &206👉ఫలితం: శ్రీలంకపై 165 పరుగుల తేడాతో భారత్ జయభేరి👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దేవదత్ పడిక్కల్ (167 & 44).చదవండి: వివాదంలో రింకూ సింగ్! -
జిడ్డులా పాతుకుపోయాడు.. జడ్డూ సెలబ్రేషన్ వైరల్!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా గెలుపు దిశగా మరింత పట్టు బిగించింది. గాలెలో బుధవారం నాటి ఆఖరి రోజు ఆటలో భోజన విరామ సమయానికి విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. కాగా ఓవర్‌నైట్ స్కోరు 84/4తో బుధవారం ఆట మొదలుపెట్టిన శ్రీలంకకు.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష జోడీ ఊపిరిలూదింది. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ ధనంజయ, సొనాల్ దినుష అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి జోడీని విడదీసేందుకు టీమిండియా బౌలర్లు మంగళవారం నుంచి విఫలయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.జిడ్డులా క్రీజులో పాతుకపోగా..ఈ క్రమంలో సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఎట్టకేలకు ఈ పని పూర్తి చేశాడు. ధనంజయ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కూడా జిడ్డులా క్రీజులో పాతుకపోగా.. జడ్డూ 56వ ఓవర్లో రెండో బంతిని షాట్ ఆడేలా అతడిని ఊరించాడు. ఈ క్రమంలో బ్యాట్ టాప్ ఎడ్జ్‌ను తాకిన బంతి గాల్లోకి లేవగా.. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మానవ్ సుతార్ క్యాచ్ పట్టాడు.జడ్డూ వైల్డ్ సెలబ్రేషన్దీంతో ధనంజయ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 151 బంతులు ఎదుర్కొన్న అతడు 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. కాగా ధనంజయ, దినుష కలిసి ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించగా.. జడ్డూ ఎట్టకేలకు ఈ జంటను విడదీసి భారీ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. దీంతో టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి. జడ్డూ సైతం వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదిలా ఉంటే.. లంచ్ బ్రేక్ సమయానికి దినుష 65, కేశారా నువాంత 8 పరుగులతో ఉన్నారు. లంక విజయానికి ఇంకా 197 పరుగులు కావాలి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం సంపాదించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా శ్రీలంకకు 372 పరుగుల మేర భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.చదవండి: ఇదేం గేమ్‌ప్లాన్?: టీమిండియాపై విమర్శలుIndia needed a way through, and Ravindra Jadeja found it. 🤩 Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/tCm8qzqmBb— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026 -
పాక్ జట్టును అవమానించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్!
ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు బలహీనంగా ఉందని, ఇంగ్లండ్ గడ్డపై ఆ జట్టుకు టెస్టు సిరీస్‌లో మరోసారి వైట్‌వాష్‌కు తప్పదనిపిస్తుందని బ్రాడ్ అంచనా వేశాడు. ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బ్రాడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. హెడ్డింగే వేదికగా ఇవాళ్టి నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.‘కెరీర్ చివరి దశలో ఉన్న 36 ఏళ్ల మహ్మద్ అబ్బాస్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. దీన్నిబట్టే పాక్ జట్టు ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతుంది. గత పర్యటనల్లో ఎదురైన అనుభవమే ఈసారి కూడా పాకిస్తాన్‌కు ఎదురయ్యే అవకాశముంది. ఈసారి మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో పాక్‌ను వైట్‌వాష్ చేస్తుందని భావిస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు.ఆరింటిలో నాలుగు ఓటమిఅయితే బంగ్లాదేశ్ పర్యటనకు ముందే మహ్మద్ అబ్బాస్‌ను టెస్టు జట్టులోకి తిరిగి తీసుకొచ్చారు. అయితే పాక్ జట్టు ఓటములు చవిచూసినప్పటికీ, మహ్మద్ అబ్బాస్ మాత్రం అసాధారణ ప్రదర్శన చేశాడు. తాను ఆడిన మూడు టెస్టుల్లో 18 వికెట్లు తీశాడు. కానీ బ్రాడ్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్తాన్ ఆశించినంత మేర రాణించలేకపోతుంది. బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురవ్వడంతో పాటు ఆరు టెస్టుల్లో నాలుగింట పరాజయం చవిచూసింది.హెడ్డింగే వేదికగా ఇవాళ్టి నుంచే తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ తమ సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజం లేకుండానే బరిలోకి దిగుతోంది. విండీస్ పర్యటనలో తన ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్న బాబర్ ఆజం.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బెకెన్హమ్లో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కుడి చేతికి గాయమైంది. తొలి టెస్టుకు బాబర్ దూరంగాయం తీవ్రత ఎక్కువగా లేనప్పటికీ, పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ దూరమయ్యాడు. దీంతో బాబర్ ఆజం గైర్హాజరీ పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను బలహీనం చేసినట్లయింది. బంగ్లాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టులో చాలా మార్పులు చేసింది. షాన్ మసూద్ స్థానంలో బాబర్ ఆజమ్‌కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే గాయంతో బాబర్ ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దూరం కావడంతో సల్మాన్ అగా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో విండీస్‌తో టెస్టు సిరీస్‌కు షహీన్ అఫ్రిది, హసన్ అలీ, నసీమ్ షాలకు బదులు మహ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహజాద్‌లను ఆడించి మంచి ఫలితాన్ని అందుకుంది. తొలి టెస్టులో ఓడినప్పటికీ, రెండో టెస్టులో బాబర్ ఆజం సేన అద్భుత విజయాన్ని అందుకొని సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇక బెకెన్హమ్ వేదికగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సౌద్ షకీల్, అబ్దులా షఫీక్, ఉస్మాన్ అలీ, మహమ్మద్ అలీ రాణించడం పాకిస్తాన్‌కు సానుకూలాంశమని చెప్పొచ్చు. ఇక 2024లో చివరిసారి పాక్ గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది.చదవండి: సంజయ్ బంగర్ కూతురు సంచలన ప్రకటన -
ఇదేం గేమ్ ప్లాన్?: టీమిండియాపై విమర్శలు
టీమిండియా- శ్రీలంక మధ్య తొలి టెస్టు తుది అంకానికి చేరుకుంది. వర్షం వల్ల గనుక అంతరాయం కలగకుంటే.. ఆటకు చివరి రోజైన బుధవారం ఫలితం తేలే అవకాశం ఉంది. కాగా భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆఖరి రోజు వీలైనంత త్వరగా ఆరు వికెట్లు తీయాల్సి ఉంది.టార్గెట్ 372గాలె వేదికగా శనివారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయిన గిల్ సేన.. శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది.తద్వారా 178 పరుగుల భారీ ఆధిక్యంతో మంగళవారం నాడు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 193 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా శ్రీలంకకు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో మంగళవారం ఆట ముగిసే సరికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఆరంభంలో లంక త్వరత్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.వాన వల్ల అంతరాయం కలిగితే?ఈ నేపథ్యంలో మంగళవారం ఆట సందర్భంగా టీమిండియా నాయకత్వ బృందం అనుసరించిన వ్యూహాన్ని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. వర్షం ముప్పు ఉన్న ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆఖరి రోజు లంకను ఆలౌట్ చేసే అవకాశాలు తక్కువని పేర్కొన్నాడు. టీమిండియాపై విమర్శలునిజానికి రెండో ఇన్నింగ్స్‌లో కాస్త వేగంగా ఆడటం లేదంటే.. ఇన్నింగ్స్ కాస్త ముందుగానే డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదని హర్ష అభిప్రాయపడ్డాడు. ‘‘నాలుగో రోజు ఆటలో ఆఖరి నలభై నిమిషాల్లో టీమిండియా వైఖరి నాకెందుకో అంతుపట్టలేదు. బ్యాటర్లు చాలా సమయం తీసుకున్నారు. కానీ స్కోరు బోర్డు మీద కావాల్సినన్ని పరుగులు జమచేయలేకపోయారు.వాతావరణం అసలే బాగాలేదు. అలాంటపుడు ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు కప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా టీమిండియా మాత్రం నెమ్మదిగా ఆడింది’’ అని హర్షా భోగ్లే భారత జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. కాగా బుధవారం నాటి ఆటలో ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి శ్రీలంక విజయానికి 234 పరుగుల దూరంలో నిలిచింది.చదవండి: శుభవార్త చెప్పిన గ్లెన్ మాక్స్వెల్ -
జడ్డూ చర్యపై గంభీర్ అసహనం!
గాలే వేదికగా లంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ, భారత్ విజయానికి 6 వికెట్లు అవసరం. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వా 31 పరుగులు, సోనాల్ దినూష 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదోరోజు గాలేలో గంటల తరబడి భారీ వర్షం పడితే తప్ప ఆట రద్దుకు ఆస్కారం లేకపోవడంతో, లంక ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తుండడంతో స్పిన్ త్రయం జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్లు వికెట్ల వేటలో పడిపోయారు. ఇదిలా ఉంటే రవీంద్ర జడేజా చర్య పట్ల హెడ్‌కోచ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. నాలుగో రోజు ఆటలో జడేజా బౌలింగ్‌లో లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జడేజా వేసిన చివరి బంతి అద్భుతంగా టర్న్ తీసుకోవడంతో ఏడు పరుగులతో ఆడుతున్న ధనంజయ ఫస్ట్ స్లిప్‌లో సులభమైన క్యాచ్ ఇచ్చాడు. అయితే కీలక వికెట్ పడిందన్న ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు. కొంపముంచిన నో బాల్ఎందుకంటే జడేజా బంతిని వేసేటప్పుడు క్రీజు దాటి ముందుకు వెళ్లడంతో అంపైర్ దానిని నో బాల్‌గా ప్రకటించడంతో సంబరాలు ఆగిపోయాయి. అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధనంజయ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గంభీర్ ముఖ కవళికల్లో మార్పులు కనిపించాయి. కీలక వికెట్ పడిందన్న సంతోషం క్షణమైనా లేకుండా పోయిందే అన్న తరహాలో గంభీర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. పనిలో పనిగా వికెట్ పడిందనుకున్న చోట జడేజా నో బాల్ కావడంతో అతడిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంభీర్ అసహనం వ్యక్తం చేయడం వెనుక బలమైన కారణం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఇలాంటి తప్పులే మ్యాచ్‌ను లాగేసుకునేందుకు ఆస్కారముంటుందన్నారు.ఆ భయంతోనే..ఏడు పరుగుల వద్ద లైఫ్ లభించిన ధనంజయ రోజు ముగిసేరికి అజేయంగా నిలిచాడు. అతడికి అండగా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూష కూడా ఉండడంతో భారత్ విజయంపై చిన్న అనుమానం నెలకొని ఉంది. ఒకవేళ ధనంజయ భారత్ గెలుపుకు అడ్డుపుల్లగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది. అవకాశం వచ్చినప్పుడే దానిని ఉపయోగించుకోవాలి.. లేదంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుందేమో. అందుకే గంభీర్ జడేజా చర్యపై అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. అయితే స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న గాలే పిచ్‌పై చివరి రోజు బ్యాటింగ్ చేయడం అసాధ్యం. మరి ధనంజయ, దినూషలు భారత్ విజయానికి అడ్డుకట్ట వేస్తారా లేక టీమిండియా స్పిన్నర్ల ధాటికి వెనుదిరుగుతారా అన్నది చూడాలి.🚨Ravindra Jadeja’s No-Ball Turns Gambhir’s Celebration Into Heartbreak🚨Ravindra Jadeja thought he had dismissed Dhananjaya de Silva after KL Rahul completed the catch, and Gautam Gambhir was visibly delighted. But then came the heartbreak Jadeja had overstepped, and it was… pic.twitter.com/FbSG0mGhZq— Central Cricket (@arshdeep3444) August 18, 2026A costly overstep from Ravindra Jadeja.Dhananjaya de Silva gets another life.📸: Sony LIV pic.twitter.com/8GH6rQkf7g— CricTracker (@Cricketracker) August 18, 2026చదవండి: హాకీ ప్రపంచకప్: పాక్‌తో పోరు.. భారత్‌కు ‘డూ ఆర్ డై’ -
లంకతో తొలి టెస్టు.. మంజ్రేకర్, మురళీ కార్తిక్ మధ్య వాగ్వాదం!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉన్న భారత్ ఐదోరోజు ఆటను వీలైనంత తొందరగా ముగించాలని చూస్తోంది. ఆన్‌ఫీల్డ్‌లో ఇలాంటి డ్రామా నడుస్తుంటే.. ఆఫ్ ఫీల్డ్ మాత్రం మరో డ్రామాకు వేదికైంది. తొలి టెస్టుకు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేక్, మురళీ కార్తిక్‌ల మధ్య కామెంటరీ బాక్స్‌లో బాడీ షేమింగ్ గురించి చిన్నపాటి యుద్ధం జరిగింది. ఇద్దరు మాట మాట అనుకోవడంతో ఫన్నీగా మొదలైన కామెంటరీ చివరకు మాటల యుద్ధానికి దారి తీసింది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. విషయంలోకి వెళితే.. టెస్టు మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయంలో, స్టూడియోలో ఉన్న మురళీ కార్తిక్ మైదానం వద్ద నుంచి మాట్లాడుతున్న సంజయ్ మంజ్రేకర్ ముఖకవళికలపై కామెంట్ చేశారు. "మీరు పెట్టే ఎక్స్ ప్రెషన్స్ వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక్కోసారి సరిగా అర్థం కావడం లేదు, అది కొంచెం తగ్గించండి" అంటూ కార్తిక్ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అసహనానికి గురైన సంజయ్ మంజ్రేకర్ వెంటనే స్పందిస్తూ.. "కెమెరాను నా నుంచి స్ప్లిట్ స్క్రీన్ చేసి పక్కనే ఉన్న అజింక్య రహానే వైపు తిప్పండి, ఆయన ముఖం చూడటానికి చాలా బాగుంటుంది, మాట్లాడటానికి కూడా మంచి వ్యక్తి" అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా మురళీ కార్తిక్ అద్దంలో చూసుకుంటూ తనను తాను చూసి మురిసిపోతుంటారని ఎద్దేవా చేశారు. దానికి కార్తిక్ "నేను అద్దంలో చూసుకోను, అది మీ అలవాటే" అని రీకౌంటర్ ఇచ్చారు.అయితే, పరిస్థితి మరింత చేయి దాటిపోయే సమయంలో ఇద్దరూ సంయమనం పాటించాడు. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరుగుతుందని గ్రహించిన మంజ్రేకర్.. 'సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ట్రోల్స్ వస్తాయి, ఫ్యాన్స్‌కు పండగే' అంటూ సరదగా వ్యాఖ్యానిస్తూ ఆ వివాదానికి తెరదించాడు.తొలి టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. శ్రీలంక విజయానికి మరో 288 పరుగులు అవసరం కాగా, భారత్ గెలుపుకు ఆరు వికెట్లు అవసరం.Read: పెళ్లి చేసుకోనున్న సానియా మీర్జా? -
IND vs SL: చివరి రోజు.. ఆరు వికెట్లు తీయాలి!
శ్రీలంకతో గాలె టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత బౌలర్ల విజృంభణతో లంక బ్యాటర్లు ఆరంభంలోనే పెవిలియన్‌కు వరుస కట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడం బ్యాటర్ల వైఫల్యానికి నిదర్శనం.తొలి ఇన్నింగ్స్ ఇలాప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె స్టేడియంలో శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది.టాపార్డర్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (82) సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 230 బంతులు ఎదుర్కొని 167 పరుగులు సాధించాడు. వీరితో పాటు ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ (51)తో రాణించాడు.లంకను కట్టడి చేసిన భారత బౌలర్లులంక బౌలర్లలో స్పిన్నర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లతో విజృంభించగా.. కేశారా నువాంత మూడు వికెట్లు పడగొట్టాడు. పేసర్ అసిత ఫెర్నాండో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగి 284 పరుగులకు ఆలౌట్ అయింది.భారత స్పిన్నర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్ కూల్చారు. దీనిని బట్టి ఓవరాల్‌గా ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ల హవా కొనసాగిందని చెప్పవచ్చు.అయితే, రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి కథ మారిపోయింది. ఈసారి పిచ్ కాస్త పేస్ బౌలర్లకు అనుకూలించగా.. లంక పేసర్లు అసిత ఫెర్నాండో, లాహిరు కుమార టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. అసిత నాలుగు వికెట్లు తీయగా.. కుమార రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ప్రభాత్ జయసూర్యకు మూడు వికెట్లు దక్కగా.. కేశారా ఒక వికెట్ తీశాడు.ఈసారి 193 పరుగులకే ఆలౌట్లంక బౌలర్ల విజృంభణ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే కుప్పకూలింది. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 178 పరుగులు కలుపుకొని.. శ్రీలంకకు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.పేసర్ సిరాజ్ నిశాన్ మధుష్క (6)ను అవుట్ చేయగా భారత్ వికెట్ల ఖాతా తెరిచింది. స్పిన్నర్ మానవ్ సుతార్ పసిందు సూరియబండారా (0), లాహిరు ఉదార (16)లను పెవిలియన్‌కు పంపగా.. మరో పేసర్ ప్రసిద్ కృష్ణ కమిందు మెండిస్ (2)ను అవుట్ చేశాడు.పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఇలా లంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ కెప్టెన్ ధనంజయ డి సిల్వతో కలిసి సొనాల్ దినుష ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ధనంజయ 31, దినుష 25 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా లంక ఆట పూర్తయ్యేసరికి 34 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేయగలిగింది. ఇక బుధవారం ఆటకు చివరి రోజు కాగా.. లంక విజయానికి 288 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా బుధవారం వీలైనంత త్వరగా భారత బౌలర్లు ధనంజయ, దినుష జోడీని విడదీయాల్సి ఉంటుంది. దినుష తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (100) చేసిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియాకు చేదువార్త! -
టీమిండియాకు బ్యాడ్‌న్యూస్!
శ్రీలంకతో తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌కు వచ్చాడు.ఆరంభంలోనే చెలరేగిన బౌలర్లుకాగా గాలె వేదికగా మొదటి టెస్టులో టీమిండియా శ్రీలంకకు 372 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు.. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ నిశాన్ మధుష్క (6)ను అవుట్ చేసి సిరాజ్ వికెట్ల వేటను ఆరంభించాడు.అనంతరం స్పిన్నర్ మానవ్ సుతార్ వన్‌డౌన్‌లో వచ్చిన పసిందు సూరియబండారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో అతడు గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ప్రసిద్ కృష్ణ కమిందు మెండిస్ (2)ను అవుట్ చేయగా.. సుతార్ బౌలింగ్‌లో లాహిరు ఉదార (16) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.నిలకడగా ధనంజయ, దినుషఈ క్రమంలో కెప్టెన్ ధనంజయ డి సిల్వకు తోడైన సొనాల్ దినుష నిలకడగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. అయితే, లంక రెండో ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్లో మానవ్ సుతార్ బంతితో రంగంలోకి దిగి.. ఫ్లైటెడ్ డెలివరీని సంధించాడు. బంతి బలంగా తాకడంతోదీంతో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో దినుష బంతిని బలంగా బాదగా.. ఫీల్డర్ జురెల్ కాళ్లకు తాకింది. అతడు నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. నొప్పి తగ్గకపోవడంతో ఫిజియో సాయంతో జురెల్ మైదానాన్ని వీడగా.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సర్ఫరాజ్ ఖాన్ మైదానంలోకి వచ్చాడు. కాగా గాలె వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జురెల్ హాఫ్ సెంచరీ (51) చేశాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ధనంజయ 31, దినుష 25 పరుగులతో క్రీజులో నిలిచారు. లంక గెలవాలంటే ఆటకు చివరి రోజైన బుధవారం లంకకు 288 పరుగులు అవసరం. ఇక టీమిండియా గెలవాలంటే వీలైనంత త్వరగా ఆఖరి రోజు ఆరు వికెట్లు తీయాలి.చదవండి: IND vs SL: గాలెలో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
IND vs SL: గాలెలో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆతిథ్య జట్టుకు 372 పరుగుల మేర మంచి లక్ష్యాన్ని విధించింది. కాగా గాలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య శనివారం తొలి టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.లంకకు సులువేనా?టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా టీమిండియాకు 178 పరుగుల మేర భారీ ఆధిక్యం లభించింది.అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా 193 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ 44, రిషభ్ పంత్ 66 పరుగులతో రాణించడంతో ఈ మేర టార్గెట్ సాధ్యమైంది. మరి టెస్టుల్లో శ్రీలంక అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?టెస్టుల్లో శ్రీలంక ఛేదించిన అత్యధిక లక్ష్యం ఎంతంటే?కొలంబో వేదికగా 2017లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో శ్రీలంక 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు 2006లో కొలంబోలోనే సౌతాఫ్రికా విధించిన 352 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసింది.గాలెలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాలేదుఅయితే, గాలెలో మాత్రం ఇప్పటి వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించకపోవడం గమనార్హం. చివరగా 2022లో పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఒకవేళ శ్రీలంక గనుక ఇప్పుడు టీమిండియా విధించిన టార్గెట్ పూర్తి చేస్తే గాలెలో అదే రికార్డు ఛేజింగ్ అవుతుంది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 21 పరుగులకే మూడు వికెట్లు ల్పోయింది. దీనిని బట్టి ఛేజింగ్ దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. కాగా టీమిండియా- శ్రీలంక మధ్య తొలి టెస్టుకు బుధవారం (ఆగష్టు 19) ఆటకు చివరి రోజు.చదవండి: చరిత్ర సృష్టించిన పంత్ -
IND vs SL: భారత్ ఆలౌట్.. శ్రీలంక లక్ష్యం ఎంతంటే?
శ్రీలంకతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నామమాత్రంగా రాణించారు. ఫలితంగా టీమిండియా 193 పరుగులకే ఆలౌట్ అయింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 44 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అర్ధ శతకం (66)తో ఆకట్టుకున్నాడు.శ్రీలంక లక్ష్యం ఎంతంటే?మిగిలిన వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా.. శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది.తొలి ఇన్నింగ్స్ ఇలాఈ క్రమంలో గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167) సాధించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీలతో అలరించారు. మిగిలిన వారిలో యశస్వి జైస్వాల్ 32, రిషభ్ పంత్ 39 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేసింది.భారీ ఆధిక్యంతో..అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక.. 284 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలా ఒక వికెట్ కూల్చారు.భారత బౌలర్లు లంకను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేయడంతో.. భారత్‌కు 178 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 193 పరుగులకు ఆలౌట్ అయింది.హాఫ్ సెంచరీతో అదరగొట్టిన పంత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ 35 పరుగులు చేయగలిగాడు. పడిక్కల్ (44), పంత్ (66)రాణించగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (8), ధ్రువ్ జురెల్ (7), రవీంద్ర జడేజా (9), మానవ్ సుతార్ (9), కుల్దీప్ యాదవ్ (5), ప్రసిద్ కృష్ణ (2) సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశారు.Rishabh Pant walks back after a typically flamboyant half-century. 🚶➡️ Watch #SLvIND, 1st Test | Day 4, LIVE NOW on Sony Sports Network channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/uBBiHTvsS8— Sony Sports Network (@SonySportsNetwk) August 18, 2026శ్రీలంక బౌలర్లలో పేసర్ అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు దక్కించుకున్నాడు. లాహిరు కుమార రెండు, కేశార నువాంత ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. అతడిపై వేటు వేసిన సీఏ -
నీకసలు ఏమైంది?.. బలహీనత మరోసారి బయటపడింది!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 16 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది.ఆ ముగ్గురూ రాణించారుఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (51) అర్ధ శతకాలతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీ (167)తో ఆకట్టుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో గిల్.. 28 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులు చేశాడు.రెండుసార్లూ అతడి చేతిలోనే అవుట్లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 20 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేయగలిగాడు. ఈసారి కూడా ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. వికెట్ల ముందు దొరికిపోయి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఇలా అయితే కష్టమేఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ బౌలింగ్‌లోనే రెండుసార్లు అతడు విఫలమయ్యాడని.. గిల్ బలహీనత మరోసారి బయటపడిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గిల్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టకపోతే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా గిల్ చివరగా జూన్‌లో స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ (126) బాదాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియాకు మంచి ఆధిక్యం లభించింది. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా లంచ్ బ్రేక్ సమయానికి భారత్.. నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. -
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. అతడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా
బంగ్లాదేశ్ చేతిలో దారుణ ఓటమి తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ జేక్ వెదర్లాండ్పై వేటు వేసింది. అతడి స్థానంలో రెండో టెస్టుకు మ్యాట్ రెన్షాను ఎంపిక చేసింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్ వేదికగా తొలి టెస్టు జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా చారిత్రక విజయం సాధించింది. తిథ్య ఆసీస్‌ను ఊహించని రీతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా 23 ఏళ్ల తర్వాత తొలిసారి కంగారూ గడ్డపై ఆడిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లా జయభేరి మోగించింది. ఆ ఇద్దరూ విఫలంఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన వెదర్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండుసార్లు బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లోనే వెదర్లాండ్ అవుటయ్యాడు.ఇక ఇప్పటికి మొత్తంగా ఆరు టెస్టులు ఆడిన వెదర్లాండ్.. కేవలం 224 పరుగులే చేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సగటు కేవలం 20. ఈ నేపథ్యంలో వెదర్లాండ్ను జట్టు నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రెండో టెస్టుకు మ్యాట్ రెన్షాను ఎంపిక చేసింది. 30 ఏళ్ల రెన్షా ఇప్పటికి ఆడిన 14 టెస్టుల్లో కలిపి 645 పరుగులు చేశాడు.లబుషేన్‌కు మరో అవకాశంకాగా 2023లో చివరిగా ఆసీస్ తరఫున టెస్టు ఆడిన రెన్షా.. వెదర్లాండ్ వైఫల్యం కారణంగా మరో అవకాశం దక్కించుకున్నాడు. ట్రవిస్ హెడ్‌తో కలిసి ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. మార్నస్ లబుషేన్ సైతం బంగ్లాతో తొలి టెస్టులో విఫలమయ్యాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 1, 31 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో లబుషేన్‌ను కూడా తప్పించాలనే డిమాండ్లు రాగా.. యాజమాన్యం మాత్రం అతడికి మరో అవకాశం ఇచ్చింది. ఇక ఆసీస్- బంగ్లా మధ్య ఆగష్టు 22- 26 మధ్య రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు మెకాయ్ వేదిక.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మ్యాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: వర్షం ముప్పు.. భారత్ గెలవాలంటే అదొక్కటే దారి -
లంకకు ఎదురుదెబ్బ.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ క్రికెటర్!
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆ జట్టు ఆటగాడు దినేశ్ చందిమల్ గాయానికి గురయ్యాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో కేఎల్ రాహుల్ ఆడిన స్వీప్షాట్ను అడ్డుకునే ప్రయత్నంలో బౌండరీ లైన వద్ద ఉన్న రోప్ అడ్డుతగలడంతో అతడి మెడ బాగానికి గాయమైంది. దీంతో ఫిజియో వచ్చి చందిమల్‌ను పరీక్షించారు. నొప్పితో బాధపడుతున్న చందిమల్‌ను తదుపరి స్కానింగ్‌ల కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో పసిందు సూరియబండారా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్గాఆ వచ్చాడు. తాజా గాయంతో లంక రెండో ఇన్నింగ్స్ సమయంలో చందిమల్ బ్యాటింగ్‌కు వస్తాడా రాడా అనేది అనుమానంగా మారింది. ‘‘నాలుగో రోజు తొలి సెషన్లో ఫీల్డింగ్ చేస్తుండగా బౌండరీని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు దినేష్ చండిమాల్ కుడి భుజానికి, మెడకు గాయమైంది. మైదానంలోనే జట్టు ఫిజియోథెరపిస్ట్, వైద్యులు అతడిని పరీక్షించారు. ముందుజాగ్రత్తగా స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సి) తెలిపింది.నాలుగో ఇన్నింగ్స్ సమయానికి చందిమల్ కోలుకోకపోతే మాత్రం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే చందిమల్ దూరమైతే అప్పుడు లంక జట్టు 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. మరోవైపు లంక సీనియర్ బ్యాటర్ అయిన చందిమల్కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. టీమిండియాపై 9 టెస్టులాడిన చందిమల్ 754 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, మూడు అర్ధసెంచరీలున్నాయి.ఇక టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించడంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వేగంగా ఆడి లంక ఎదుట భారీ టార్గెట్‌ను నిర్దేశించాలని భావిస్తోంది. ఆటకు మరో రోజు సమయం మిగిలి ఉంది.Sri Lanka batter Dinesh Chandimal has been taken to the hospital for a precautionary scan after injuring his right shoulder and neck while diving to save a boundary on day four of the first Test against India at the Galle International Stadium on Tuesday."Dinesh Chandimal… pic.twitter.com/30cqMwPpcY— IANS (@ians_india) August 18, 2026Read: రాహుల్‌ను కాపాడిన పడిక్కల్.. ముద్దు పెట్టే ప్రయత్నం! -
రాహుల్‌ను కాపాడిన పడిక్కల్.. ముద్దు పెట్టే ప్రయత్నం!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ తెలివైన నిర్ణయంతో కాపాడాడు. విషయంలోకి వెళితే.. భారత్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 11వ ఓవర్ ప్రబాత్ జయసూరియా వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని 25 పరుగులతో ఆడుతున్న రాహుల్ భారీ సిక్సర్‌గా మలిచాడు. అయితే మరుసటి బంతిని రాహుల్ మిస్ చేయడంతో బంతి ప్యాడ్లను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీంతో లంక ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అయితే మొదట కేఎల్ రాహుల్ తాను ఔటయ్యానని భావించి రివ్యూ తీసుకోవడానికి ఆలోచించాడు. అదే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న పడిక్కల్ మాత్రం రివ్యూకు వెళ్లాలని రాహుల్‌కు సైగ చేశాడు. దీంతో రాహుల్ రివ్యూ కోరాడు. ఇక రివ్యూలో బంతి బ్యాట్‌కు ఎక్కడా తగల్లేదు, కానీ లైన్లోనే వెళ్లడంతో మొదట ఔట్ అనిపించినప్పటికీ, బంతి స్టంప్స్ పైనుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో లంక ఆటగాళ్లు నిరాశలో మునిగిపోగా, కేఎల్ రాహుల్ మాత్రం పడిక్కల్ వద్దకు వచ్చి అతన్ని హగ్ చేసుకున్నాడు. రివ్యూ తీసుకోమని చెప్పినందుకు థాంక్స్ అన్నట్లుగా రాహుల్ అతడికి ముద్దు పెడుతున్నట్లుగా బ్రొమాన్స్ చేయడం కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ పడిక్కల్ రివ్యూ తీసుకోవాలని చెప్పకపోయుంటే రాహుల్ పెవిలియన్ బాట పట్టేవాడే. అయితే తనకు లభించిన అవకాశాన్ని రాహుల్ వినియోగించు కోలేకపోయాడు. మళ్లీ అదే ప్రబాత్ జయసూరియా బౌలింగ్‌లో భారీ షషాట్కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు.ఇక టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించడంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వేగంగా ఆడి లంక ఎదుట భారీ టార్గెట్‌ను నిర్దేశించాలని భావిస్తోంది. ఆటకు మరో రోజు సమయం మిగిలి ఉంది.KL Rahul hugged Devdutt Padikkal for asking Him to go upstairs to review the decision which was given out on-field. A beautiful moment. #SLVIND pic.twitter.com/ZhtI0jBzb2— Nibraz Ramzan (@nibraz88cricket) August 18, 2026KL Rahul hugging Devdutt Paddikal after a successful DRS suggested by him 😂 #SLvIND pic.twitter.com/vLEys0Vgk3— Prateek (@prateek_295) August 18, 2026 -
జైస్వాల్ ఏంటా పిచ్చి షాట్లు? రిపీటయితే అడ్రస్ గల్లంతే!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనకు అచ్చిరాని షాట్ ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. టెస్టుల్లో జైస్వాల్ డకౌట్ కావడం ఇది ఏడోసారి. అశితా ఫెర్నాండో బంతిని స్టంప్ అవతల వేయగా, అనవసరంగా కట్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే స్పందించిన కీపర్ డిక్వెల్లా ఎలాంటి తప్పు చేయకుండా ఎడ్జ్ తీసుకొని బంతిని అందుకున్నాడు. పేస్ బౌలింగ్‌లో కట్‌షాట్ ఆడే ప్రయత్నంలో జైస్వాల్ తరచూ విఫలమవుతున్నాడు. అయితే ఇదే జైస్వాల్ తన డెబ్యూ టూర్ ఇంగ్లండ్ సిరీస్‌లో 293 పరుగులు చేసి నాలుగుసార్లు మాత్రమే ఔటయ్యాడు. 2025 నుంచి చూసుకుంటే మాత్రం కట్‌షాట్ ఆడే ప్రయత్నంలో కేవలం 47 పరుగులు మాత్రమే చేసిన జైస్వాల్ నాలుగుసార్లు ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో తప్పుడు షాట్ల రేటు 31 శాతం నుంచి 48 శాతానికి పెరగడం గమనార్హం. అసలే టీమిండియా ఓపెనింగ్ స్లాట్‌కు పోటీ పెరిగిపోతున్న వేళ జైస్వాల్ విఫలమవ్వడం అతడి స్థానానికి ఎసరు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే వన్డే, టీ20 జట్టులో తీవ్ర పోటీ కారణంగా జైస్వాల్‌కు జట్టులో చోటు లభించడం లేదు. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తే త్వరలో ఇక్కడ కూడా చోటు కోల్పోవడం ఖాయం. పైగా సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి క్రికెటర్ల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోవడంతో సాయి సుదర్శన్ రెండో టెస్టు ఆడే అవకాశముంది. దీంతో రెండో టెస్టుకు జట్టు నుంచి సాయికి అవకాశమివ్వాలనుకుంటే జైస్వాల్‌ను తప్పించే చాన్స్ ఎక్కువగా ఉంటుంది."Yashasvi jaiswal Got out on 0 runs 😢He is good batsmen but he needs to be consistent.#SLvIND pic.twitter.com/q7cQeFsMch— Indian Cricket Team (@criclover451807) August 18, 2026Read: సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం! -
IND vs SL: విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్
SL Vs IND 1st Test Day-4 Updates: గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైన టీమిండియా.. శ్రీలంకకు 372 పరుగుల టార్గెట్ విధించింది.గెలుపునకు 6 వికెట్ల దూరంలో భారత్శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ గెలుపునకు 6 వికెట్ల దూరంలో ఉంది. 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే చివరి రోజు 288 పరుగులు చేయాలి. ఇది అంతా సులువుగా జరిగే పని కాదు. భారత్ మాత్రం మరో 6 వికెట్లు తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. అయితే చివరి రోజు భారత గెలుపుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనల్ దినుష (25), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (31) క్రీజ్‌లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక21.4 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన లాహిరు ఉదార (16). శ్రీలంక స్కోరు: 47-4. సొనాల్ దినుష క్రీజులోకి రాగా.. ధనంజయ 19 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 33-3ఉదార 15, ధనంజయ 7 పరుగులతో ఉన్నారు. విజయానికి 339 పరుగుల దూరంలో శ్రీలంక.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక10.4 ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించిన కమిందు మెండిస్. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన కమిందు. లంక స్కోరు: 21-3. ఉదార 11 పరుగులతో ఉండగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ క్రీజులోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక7.2 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్ చేరిన పసిందు. అరంగేట్రంలోనే డకౌట్‌గా పసిందు. లంక స్కోరు 14-2. ఉదార 6 పరుగులతో ఉండగా.. కమిందు మెండిస్ క్రీజులోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక6.6: సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన నిశాన్ మధుష్క (6). లంక స్కోరు 13-1 (7). విజయానికి ఇంకా 359 పరుగులు కావాలి. ఉదార 5 పరుగులతో ఉండగా.. పసిందు సూరియబండారా క్రీజులోకి వచ్చాడు.లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకఆరు ఓవర్లలో స్కోరు: 12-0ఉదార 4, నిశాన్ 6 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 360 పరుగులు కావాలి.వర్షం వల్ల అంతరాయంశ్రీలంక లక్ష్య ఛేదనకు దిగాల్సి ఉండగా.. వాన వల్ల అంతరాయం కలిగింది193 పరుగులకు ఆలౌటైన టీమిండియాభారత్ రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. తద్వారా శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్190 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (5) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్188 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్‌లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి మానవ్ సుతార్ (9) ఔటయ్యాడు.9 పరుగులు చేసిన జడేజాను లాహిరు కుమారా పెవిలియన్ చేర్చడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 357 పరుగులుగా ఉంది.పంత్ (66) ఔట్66 పరుగులు చేసిన పంత్ కుమారా బౌలింగ్‌లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో టీమిండియా 174 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 352 పరుగులుగా ఉంది.సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పంత్లాహిరు కుమారా బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న పంత్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యం 336 పరుగులు.36 ఓవర్లలో టీమిండియా స్కోరు 151-5పంత్ 47, జడేజా 4 పరుగులతో ఉన్నారు. భారత్ ఆధిక్యం 329 పరుగులు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియాఅసితా ఫెర్నాండో బౌలింగ్‌లో నిరోషన్ డిక్విల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధ్రువ్ జురెల్ (7). క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా. టీమిండియా స్కోరు 120-5 (31). పంత్ 23 పరుగులతో ఉన్నాడు.లంచ్ తర్వాత మొదలైన ఆటలంచ్ విరామంగాలే టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (21), ధ్రువ్ జురెల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 294 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన పడిక్కల్ (44) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ (35) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 2 వికెట్లు తీయగా, కెషారా, అశితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.పడిక్కల్ ఔట్.. నాలుగో వికెట్ డౌన్టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకుంటుంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో పడిక్కల్ 44 పరుగుల వద్ద కెషారా నువంతా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాఇన్నింగ్స్ 21వ ఓవర్లో శుబ్‌మన్ గిల్ (8) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. పడిక్కల్ (35), పంత్ (1) పరుగుతో ఆడుతున్నారు.రెండో వికెట్ డౌన్65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (35) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రబాత్ జయసూరియా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రాహుల్ మిలన్ రత్ననాయకేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 243 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఫిఫ్టీ మార్క్ దాటిన టీమిండియారెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 30, పడిక్కల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు భారత్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది.తొలి వికెట్ డౌన్గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 178 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. అశితా ఫెర్నాండో బౌలింగ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (1), పడిక్కల్ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దినూష (100) శతకంతో రాణించగా, నిరోషన్ డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్‌కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్‌కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం!
గాలే వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, లంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా మధ్య జరిగిన మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, లంక బ్యాటర్లు డిక్వెల్లా, దినూషలు తమ జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లను ఇబ్బందిపెట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిరాజ్.. డిక్వెల్లాతో వాగ్వాదానికి దిగాడు. లంక ఇన్నింగ్స్ 54వ ఓవర్లో ఇది చోటచేసుకుంది. 54వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్ డిక్వెల్లా బ్యాట్‌ను టార్గెట్‌గా చేసుకొని అదే పనిగా బంతులను విసిరాడు. పదే పదే తనను రెచ్చగొట్టేలా బంతులు వేయడంతో సహనం కోల్పోయిన డిక్వెల్లా సిరాజ్‌తో మాటల యుద్ధానికి దిగాడు. 'బంతులను సరిగ్గా వెయ్యు' అని డిక్వెల్లా అనగా.. సిరాజ్ 'సరే ఈసారి ఇంకా ఇబ్బంది పెడుతానులే' అని ఘాటుగా ప్రతిస్పందించాడు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరిని పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.ఇక టీమిండియాతో టెస్టు మ్యాచ్ ద్వారా మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నిరోషన్ డిక్వెల్లా మంచి ప్రదర్శనే చేశాడు. 115 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించిన అనంతరం ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. డిక్వెల్లా కెరీర్లో ఇది 23వ అర్ధశతకం. అయితే 55 టెస్టులాడినప్పటికీ డిక్వెల్లా ఖాతాలో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అతడి అత్యధిక టెస్టు స్కోరు 96గా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం లభించింది. సోనాల్ దినూష (100) సెంచరీ చేయగా, డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు తీయగా, జడేజా మూడు, కుల్దీప్, ప్రసిధ్, సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. పడిక్కల్ సెంచరీతో చెలరేగగా, కేఎల్ రాహుల్, జురెల్ అర్ధశతకాలు సాధించారు.🚨 Heated exchange between Mohammed Siraj & Niroshan Dickwella during the live match 🚨Mohammed Siraj was continuously beating Dickwella’s bat with his deliveries and kept troubling the Sri Lankan batter.After Dickwella appeared to lose his cool, the two players were involved… pic.twitter.com/kvGVWVo1sK— Central Cricket (@arshdeep3444) August 17, 2026 -
‘వర్షం ముప్పు.. భారత్ గెలవాలంటే అదొక్కటే దారి’
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పట్టు బిగించింది. కానీ ఆటకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడం, వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో టీమిండియా మ్యాచ్ గెలుస్తుందా లేక డ్రాగా ముగుస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. అయితే భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే నాలుగో రోజు ఆటలో వీలైనంత వేగంగా ఆడాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. గాలేలో వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో భారత్ 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి లంక ఎదుట సుమారు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే బాగుంటుందని తెలిపాడు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. "తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 178 పరుగులకు మరో 172 పరుగులు జోడిస్తే 350 పరుగుల దాకా వస్తాయి. మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఉంటుంది కాబట్టి 40 ఓవర్లలో సాధ్యమైనంత ఎక్కువ పరుగులు ఓవర్‌కు ఐదు రన్స్ చొప్పున (దాదాపు 200 పరుగులు) చేస్తే బాగుంటుంది. ఆడుతున్నది టెస్టు మ్యాచ్ అయినప్పటికీ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మన బ్యాటర్లు ఆటను టెస్టు నుంచి వన్డే గేర్‌కు మార్చుకోవాలి. ఓపెనర్లుగా వచ్చే జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో దూకుడు ప్రదర్శించాలి. టీ20 క్రికెట్ కాకపోయినా, కనీసం వన్డే తరహాలో కాస్త ఫాస్ట్‌గా ఆడేందుకు ప్రయత్నించాలి. నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించకపోతే సమస్య లేదు. కానీ వర్షం పడితే మాత్రం భారత్‌కు దెబ్బ పడుతుంది. కాబట్టి వీలైనంత మేర ఫాస్ట్‌గా ఆడేందుకు యత్నించాలి. వర్షం పడే అవకాశం ఉండడంతో నేనైతే భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లు ఇస్తాను. 150 నుంచి 175 పరుగులు చేశాకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలి. ఒకవేళ వర్షం పడకపోతే నాలుగో రోజు మిగిలిన 50 ఓవర్లు, చివరి రోజు 90 ఓవర్ల ఆట ఉంటుంది కాబట్టి టీమిండియా ఫలితం అనుకూలంగా లేదా ప్రతికూలంగా వచ్చేందుకు కూడా అవకాశముంది." అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.Read: Virat Kohli: 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలు -
IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి
టీమిండియాతో తొలి టెస్టులో శ్రీలంక తిరిగి పుంజుకుంది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు.. 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండో డకౌట్ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేయగలిగాడు. వన్‌డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్ (4), కమిందు మెండిస్ (14) విఫలం కాగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో 99 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను ఆరో నంబర్ బ్యాటర్ సొనాల్ దినుష, వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ పట్టుదలగా నిలబడి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు.అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో డిక్విల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 115 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. సొనాల్ దినుషతో కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.ఈ క్రమంలో సొంతగడ్డ మీద టీమిండియాతో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. దినుష సెంచరీ చేసి అవుటయ్యాడు.స్వదేశంలో భారత్‌తో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన శ్రీలంక జోడీలు1. సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా- 146 పరుగులు2. ఏంజెలో మాథ్యూస్- కుశాల్ పెరీరా- 135 పరుగులు3. దినేశ్ చండిమాల్- లాహిరు తిరిమన్నె- 125 పరుగులు4. మహేళ జయవర్దనె- హషాన్ తిలకరత్నె- 95 పరుగులు5. టీఎల్ దిల్షాన్- ప్రసన్న జయవర్దనె- 91 పరుగులు. -
IND vs SL: రెండంటే రెండే పరుగులు.. ఇదేం వ్యూహం?
గాలె వేదికగా శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఆట మొదలైన తొలి రోజు నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగలిగింది.పడిక్కల్ భారీ శతకంఇందులో వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ది కీలక పాత్ర. ఈ కర్ణాటక స్టార్ మొత్తంగా 230 బంతులు ఎదుర్కొని 167 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక పడిక్కల్ భారీ శతకానికి తోడు.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ (51)లతో ఆకట్టుకున్నారు.వాన వల్ల అంతరాయంమిగిలిన వారిలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 32, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 39, ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ 24 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి రెండో రోజు ఆటకు పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది.ఇక సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం మరో రెండు పరుగులు జతచేసి.. 462 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ టీమిండియా నాయకత్వ బృందం నిర్ణయాన్ని తప్పుబట్టాడు.ఎందుకిలా చేశారు?‘‘మూడో రోజు ఉదయం ఇద్దరు టెయిలెండర్లను బ్యాటింగ్‌కు పంపాల్సిన అవసరం ఏముంది? మీరు ఎందుకిలా చేశారు?’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్లను ఎక్స్ వేదికగా దొడ్డ గణేశ్ ప్రశ్నించాడు. కాగా రెండో రోజు పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా ఆట ముగిసే సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తుందని అంతా భావించారు.అయితే, మూడోరోజు ఆట ఆరంభంలో భారత టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ బ్యాటింగ్‌కు వచ్చి.. తమ ఓవర్‌నైట్ స్కోరుకు తలా ఒక పరుగు చేశారు. కుల్దీప్ 13 పరుగులతో అజేయంగా నిలవగా.. ప్రసిద్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్‌గా వెనుదిరిగాడు.బౌలర్లకు మరింత ఉపయోగకరంగా ఉండేదినిజానికి రెండో రోజే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఉంటే.. సోమవారం ఉదయమే లంక బ్యాటింగ్‌కు దిగేది. అప్పుడు పిచ్ పరిస్థితులను భారత బౌలర్లు మరింత సద్వినియోగం చేసుకునే వారని.. దొడ్డ గణేశ్ అభిప్రాయపడ్డాడు. టెయిలెండర్లతో సమయం వృథా చేయకుండా.. ముందుగానే డిక్లేర్ చేసి బాగుండేదని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. భోజన విరామ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది. భారత బౌలర్లలో సిరాజ్ ఒకటి.. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ చేశాడు.. సంతోషం -
'నమ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే'
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ తనకు అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు. మ్యాచ్‌లో ఇప్పటికే మానవ్ సుతార్ రెండు కీలక వికెట్లు తీశాడు. 27 పరుగులతో నిలకడగా ఆడుతున్న లాహిరు ఉడారాను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్ ఆ వెంటనే ఇన్ఫామ్ బ్యాటర్ దినేశ్ చందిమల్‌ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ‘బిగ్ స్పిన్నర్ అవుతాడు’ఈ నేపథ్యంలో మానవ్ సుతార్‌పై టీమిండియా మాజీ క్రికెటర్లు అజయ్ జడేజా, అజింక్య రహానేలు ప్రశంసల జల్లు కురిపించారు. తొలి టెస్టుకు ఈ ఇద్దరు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్నారు. చందిమల్‌ను ఔట్ చేసిన తర్వాత అజయ్ జడేజా మాట్లాడుతూ.. "టీమిండియా బిగ్ స్పిన్నర్ అయ్యేందుకు మానవ్ సుతార్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. బంతిని టర్న్ చేయడంలో అతడి సామర్థ్యం అసాధారణమైనది. దీంతో లంక బ్యాటర్లు అతడిని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. మానవ్ సుతార్‌పై నమ్మకముంచి అతడికి అవకాశం కల్పించిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే" అని చెప్పుకొచ్చాడు. అజయ్ జడేజా వ్యాఖ్యలను రహానే సమర్ధించాడు. ఆ ఇద్దరిని కలగలిపి.."జడేజా భాయ్, నేను మీ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. టెస్టు క్రికెట్లో టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారే సత్తా మానవ్ సుతార్‌కు ఉంది. లంక పిచ్‌లపై అతడు అద్భుతమైన టర్న్‌ను రాబడుతున్నాడు. అతడి బౌలింగ్‌లో జడేజాలో ఉండే కచ్చితత్వం, అశ్విన్ లాగా బంతిని టర్న్ చేయడం లాంటి రెండు సామర్థ్యాలు ఒకేసారి ఉండడం సానుకూలాంశం. భవిష్యత్తులో భారత క్రికెట్లో మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించనున్నాడు" అని రహానే పేర్కొన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.ఇక మూడో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 🚨 Ajay Jadeja & Ajinkya Rahane Praise Manav Suthar During IND vs SL Live Match 🚨Ajay Jadeja 🗣️: Manav Suthar has the potential to become India’s next big Test spinner. His ability to turn the ball is exceptional, and the Sri Lankan batters are struggling against him. Credit… pic.twitter.com/BcZjpmepqy— Central Cricket (@arshdeep3444) August 17, 2026 Manav Suthar gets his second of the innings as Sri Lanka slip to three down on Day 3! 💥 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/FANRuZ6FDO— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤 Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Read: తప్పించాలని డిమాండ్లు; బ్యాట్‌తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే! -
ఒంటిచేత్తో గిల్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన ఫ్యాన్స్!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. గాలె వేదికగా సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా.. ఒంటిచేత్తో గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.462 ఆలౌట్ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య శనివారం తొలి టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. మూడో రోజు 460/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. మరో రెండు పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా.. భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండోను మహ్మద్ సిరాజ్ డకౌట్ చేయగా.. లాహిరు ఉదార (27)నున మానవ్ సుతార్ పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ చండిమాల్ (4) వికెట్‌ను కూడా మానవ్ తన ఖాతాలో వేసుకున్నాడు.Left hand, full stretch, absolute stunner from Shubman Gill! 🥵 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/xe2ldGxkpJ— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ఇక కమిందు మెండిస్ నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా.. గిల్ ఊహించని రీతిలో అతడిని పెవిలియన్‌కు పంపాడు. లంక ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంతితో రంగంలోకి దిగాడు. కుల్దీప్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని మెండిస్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా ఎక్స్ ట్రా కవర్ మీదుగా షాట్ బాదాడు. ఇంతలో తన ఫీల్డింగ్ పొజిషన్ నుంచి ఎడమవైపునకు డైవ్ చేసిన గిల్.. ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు.షాక్‌లో మెండిస్, అభిమానులుఈ క్రమంలో అదుపు తప్పి నేల మీద పడిపోయినప్పటికీ బంతిని మాత్రం చేజారనివ్వలేదు గిల్. దీంతో కమిందు మెండిస్‌తో పాటు..స్టేడియంలో ఉన్న శ్రీలంక అభిమానులు సైతం నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి శ్రీలంక.. 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.లంక ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండో డకౌట్ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేశాడు. దినేశ్ చండిమాల్ (4) నిరాశపరచగా.. కమిందు మెండిస్ 14, కెప్టెన్ ధనంజయ డి సిల్వ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లలో మానవ్ సుతార్ రెండు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ సాధించాడు.. సంతోషంThat was a blinder from Shubman Gill to dismiss Kamindu Mendis.. 👏👏 #SLVIND pic.twitter.com/Dl9BrLSpJQ— Nibraz Ramzan (@nibraz88cricket) August 17, 2026 -
చెలరేగిన భారత బౌలర్లు.. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఫలితంగా భోజన విరామ సమయానికి శ్రీలంక సగం వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులే చేయగలిగింది.కాగా గాలె వేదికగా 460/9 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. మరో రెండు పరుగులు జోడించి (462) ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా ఆది నుంచే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. Early breakthrough for Team India! 💥Mohammed Siraj strikes with just the second ball.Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #MohammedSiraj #BeautifulGameOfTestCricket pic.twitter.com/zHSQOGD0jj— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026సిరాజ్ మొదలు పెట్టగా..ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండోను పేసర్ మహ్మద్ సిరాజ్ డకౌట్ చేయగా.. లాహిరు ఉదార 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.మానవ్ సుతార్‌కు రెండుఇక వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ చండిమాల్ (4)ను స్వల్ప స్కోరుకే మానవ్ పెవిలియన్‌కు పంపాడు. కమిందు మెండిస్ (14) కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టగా.. లంక నాలుగో వికెట్ కోల్పోయింది.Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤 Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026ఇక కెప్టెన్ ధనంజయ డి సిల్వ (21) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు ఊహించని రీతిలో క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో సోమవారం లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది. సొనాల్ దినుష 14, నిరోషన్ డెక్విల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే లంక ఇంకా 363 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. తొలి సెషన్లో భారత స్పిన్నర్లు మానవ్, కుల్దీప్, జడేజా కలిసి నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ చేశాడు.. సంతోషం -
తప్పించాలని డిమాండ్లు; బ్యాట్‌తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అర్ధశతకంతో మెరిశాడు. అయితే గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ బ్యాట్ నుంచి ఒక్క ఫిఫ్టీ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో లంకతో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశమివ్వాలని డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ జట్టు మేనేజ్మెంట్ మాత్రం జురెల్‌పై నమ్మకాన్ని ఉంచింది. అందుకే జురెల్ హాఫ్ సెంచరీ చేయగానే కోచ్ గంభీర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చప్పట్లు కొడుతూ అభినందించడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తాజాగా జురెల్ లంకతో తొలి టెస్టులో ఫిఫ్టీ మార్క్ సాధించి జట్టుతో పాటు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జురెల్ తన ప్రదర్శనపై స్పందించాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయంగా భావిస్తున్నా. నా ఆట విషయంలో అటు కోచ్.. ఇటు కెప్టెన్ అన్ని వేళలా మద్దతుగా నిలిచారు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ ఆడాలని సలహా ఇచ్చారు. వాళ్లు చెప్పినట్లే పరిస్థితులకు తగినట్లుగా ఆడి ఇవాళ అర్ధశతకంతో మెరిశాను. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. జట్టుకు ఏం కావాలో అది చేయడమే నా పని. ఇండియా-ఏ తరఫున మ్యాచ్ ఆడేందుకు పది రోజుల ముందే శ్రీలంకలో అడుగుపెట్టాము. కొలంబోలో ప్రాక్టీస్ చేయడం సహా గాలేలోనూ మ్యాచ్ ఆడాము. దీంతో రెండు వేదికలపై పూర్తి అవగాహన వచ్చింది, అది ఇవాళ బ్యాటింగ్‌లో రాణించేందుకు ఉపయోగపడుతోంది. అంతేకాదు ఇక్కడి వాతావరణం, పరిస్థితులు అర్థం చేసుకునేందుకు కూడా ఎంతో దోహదపడింది’’ అని చెప్పుకొచ్చాడు. Gautam Gambhir and Ajit Agarkar keeping an eye on Dhruv Jurel’s 50.He will definitely be in consideration for white-ball cricket. pic.twitter.com/72d1IXjZ2h— AS4 (@lostbeyond777) August 16, 2026చదవండి: భారత్ 462 ఆలౌట్.. అరంగేట్రంలోనే లంక బౌలర్ చెత్త రికార్డు -
AUS vs BAN: ఓపెనర్‌గా అతడు ఎందుకు?: ఆసీస్ దిగ్గజం ఫైర్
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో కంగారూ జట్టు.. తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లా ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించగా.. సమిష్టి వైఫల్యంతో కమిన్స్ బృందం విమర్శల పాలైంది.టాప్-3 ప్లేయర్లను మారిస్తేనేఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందన్నాడు. ముఖ్యంగా టాప్-3 ప్లేయర్లను మారిస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలరని పేర్కొన్నాడు. ఈ మేరకు చానెల్ 7తో మాట్లాడుతూ..హెడ్ ఓపెనర్‌గా ఎందుకు?‘‘టెస్టుల్లో ట్రవిస్ హెడ్‌కు ఓపెనింగ్ స్థానం బెస్ట్ పొజిషన్ కానేకాదు. ఇప్పటికీ అతడు ఐదో నంబర్‌లోనే అత్యుత్తమంగా రాణించగలడని నేను నమ్ముతున్నా. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం నాకు ఎంత మాత్రం నచ్చలేదు.ప్రస్తుత తుదిజట్టు కూర్పు వల్లే బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి ఎదురైంది. నిజానికి ఆస్ట్రేలియా క్రికెట్ అత్యంత శక్తిమంతమైనది. కానీ ఇప్పుడు ఆ స్థానం గల్లంతు అయిపోతుందేమోనని భయంగా ఉంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.లబుషేన్ ఇంకా జట్టులో అవసరమా?మార్నస్ లబుషేన్ మూడో స్థానంలో చెత్తగా ఆడుతున్నాడు. గత రెండేళ్లుగా ఇదే తంతు. సామ్ కొన్‌స్టాస్ వంటి వాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు?.. టాపార్డర్‌లో మ్యాట్ రెన్షా వంటి వాళ్లకు అవకాశం ఇచ్చి చూడాలి. జేక్ వెదర్లాండ్, లబుషేన్‌లను జట్టు నుంచి తొలగించినా పర్లేదు. దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న వాళ్లకు ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలి’’ అని మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో కమిన్స్ కెప్టెన్సీ సరిగ్గా లేదని విమర్శించాడు.టాపార్డర్ విఫలండార్విన్ వేదికగా తొలి టెస్టులో ఆసీస్ టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (22), జేక్ వెదర్లాండ్ (23) కాస్త ఫర్వాలేదనిపించినా.. వన్‌డౌన్‌లో వచ్చిన లబుషేన్ ఒక్క పరుగుకే నిష్క్రమించాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ 17, లబుషేన్ 31 పరుగులు చేయగా.. వెదర్లాండ్ డకౌట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. హెడ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో ఒకే విధంగా బౌల్డ్కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడగా.. ఇది రెండో విజయం. అంతకుముందు సొంతగడ్డపై 2017లో మిర్పూర్లో ఆసీస్‌పై బంగ్లా గెలుపొందింది.చదవండి: పంత్ వల్ల కాలేదు.. బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం -
భారత్ 462 ఆలౌట్.. అరంగేట్రంలోనే లంక బౌలర్ చెత్త రికార్డు
గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక డెబ్యూ బౌలర్ కెషారా నువంతా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా కెషారా నిలిచాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లు వేసిన కెషారా నువంతా మూడు వికెట్లు తీసి 175 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక లంక తరఫున అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా సూరజ్ రన్‌దివ్ నిలిచాడు. 2010లో కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 ఓవర్లు వేసిన సూరజ్ రన్‌దివ్ రికార్డు స్థాయిలో 222 పరుగులు సమర్పించుకున్నాడు. 2025లో గాలే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో తరిందు రత్ననాయకే 49.2 ఓవర్లలో 196 పరుగులు సమర్పించుకుని రెండో స్థానంలో ఉన్నాడు. 1999లో ఢాకా వేదికగా పాక్‌తో టెస్టులో ఉపుల్ చందన 47.5 ఓవర్లలో 179 పరుగులిచ్చుకొని మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 2020లో సౌతాఫ్రికాతో టెస్టులో 171 పరుగులు సమర్పించుకున్న వనిందు హసరంగ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.టీమిండియా ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'పంత్ వల్ల కాలేదు బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం' -
SL Vs IND: శ్రీలంక ఆలౌట్.. మూడో రోజు ముగిసిన ఆట
గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. సోమవారం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ అయింది. దినుష సెంచరీ (100), నిరోషన్ డిక్విల్లా 80 పరుగులతో అదరగొట్టారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకు ముందు భారత్ 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక లంక 284 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్‌కు 178 పరుగుల మేర భారీ ఆధిక్యం లభించింది. కాగా ముగిసిన మూడో రోజు ఆటలంక ఇన్నింగ్స్ తర్వాత ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. దీంతోగ్రౌండ్ సిబ్బంది వచ్చి కవర్లతో పిచ్‌ను కప్పివేశారు. భారీ వర్షం పడే సూచనలు ఉండటంతో మూడో రోజు ఆటను అంతటితో ముగించేశారు.UPDATESసొనాల్ దినుష అవుట్సెంచరీ పూర్తి చేసుకున్న సొనాల్ జడ్డూ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోగా.. అసిత ఫెర్నాండో క్రీజులోకి వచ్చాడు. లాహిరు కుమార 0 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 274-9.ఎనిమిదో వికెట్ డౌన్మానవ్ సుతార్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన ప్రభాత్ జయసూర్య (10). లంక స్కోరు 274-8 (78). లాహిరు కుమార క్రీజులోకి రాగా.. దినుష 100 పరుగులతో ఉన్నాడు.శతక్కొట్టిన దినుష167 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్న దినుష. మానవ్ సుతార్ బౌలింగ్‌లో సింగిల్ తీసి టెస్టుల్లో తొలి శతకం నమోదు చేసిన దినుష.ఏడో వికెట్ డౌన్66.4: జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరిన కేశారా (2). లంక స్కోరు: 243-7. ప్రభాత్ జయసూర్య క్రీజులోకి రాగా.. దినుష 79 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంకక్రీజులో పాతుకుపోయిన నిరోషన్ డిక్వెల్లా- సొనాల్ దినుష జోడీని ప్రసిద్ కృష్ణ విడదీశాడు. ప్రసిద్ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చిన డిక్వెల్లా ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అతడి స్థానంలో కేశారా నువాంత క్రీజులోకి రాగా.. దినుష 74 పరుగులతో ఆడుతున్నాడు. లంక స్కోరు: 236-6 (61.5). కాగా దినుషతో కలిసి డిక్విల్లా ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించాడు.టీ విరామానికి శ్రీలంక స్కోర్: 214/5టీ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో సోనల్(62), డిక్వెల్లా(71) ఉన్నారు. లంక ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 248 పరుగులు వెనకబడి ఉంది.సొనాల్ అర్ధ శతకంకుల్దీప్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సొనాల్ దినుష.. 92 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంకస్కోరు: 184-5 (49)ఫిఫ్టీ బాదిన డిక్వెల్లానిరోషన్ డిక్వెల్లా 68 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం లంక 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దినూష (39) అతడికి సహకరిస్తున్నాడు.దినూష, డిక్వెల్లా నిలకడలంచ్ విరామం అనంతరం లంక ఆట తిరిగి గాడిన పడింది. మిడిలార్డర్లో దినూష (34), డిక్వెల్లా (38) నిలకడగా ఆడుతుండడంతో లంక జట్టు 150 పరుగుల మార్క్‌ను దాటింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు లంక మరో 311 పరుగులు వెనుకబడి ఉంది.👉 లంచ్ విరామం అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. 30 ఓవర్లు ముగిసేసరికి లంక ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. దినుష (20), నిరోషన్ డిక్వెల్లా (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.లంచ్ విరామంలంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. లంక కోల్పోయిన ఐదు వికెట్లలో నాలుగు స్పిన్నర్లకే దక్కడం విశేషం. శ్రీలంక మరో 363 పరుగులు వెనుకబడి ఉంది.ఐదో వికెట్ డౌన్26.1: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధనంజయ డి సిల్వ (21). లంక స్కోరు 90-5 (26.1). సొనాల్ 13 పరుగులతో ఉండగా.. నిరోషన్ డెక్విల్లా క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక16.1: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన కమిందు మెండిస్ (14). క్రీజులోకి వచ్చిన సొనాల్ దినుష. 17 ఓవర్లలో లంక స్కోరు: 62-4. మూడో వికెట్ డౌన్53 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. 27 పరుగులు చేసిన లాహిరు ఉదారా మానవ్ సుతార్ బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫిఫ్టీ మార్క్ దాటిన లంకశ్రీలంక 50 పరుగుల మార్క్‌ను దాటింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, లాహిరు ఉదారా (27 బ్యాటింగ్), కమిందు మెండిస్ (12 బ్యాటింగ్) ఆడుతుండడంతో లంక కుదురుకుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్తొలి టెస్టులో శ్రీలంక 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్‌లో 4 పరుగులు చేసిన దినేశ్ చందిమల్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.👉6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. లాహిరు ఉడారా (10), చందిమల్ (4) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లంకతమ ఇన్నింగ్స్ ఆరంభంలోనే శ్రీలంకకు షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ నిశాన్ ఫెర్నాండో డకౌట్ అయ్యాడు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.👉అయితే రెండో రోజు ఆటలో దాదాపు సగం వర్షార్పణమయింది. దీంతో 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే మూడో రోజు మాత్రం ఉదయం నుంచి ఎండ కాస్తుండడం శుభ పరిణామం. అయితే మూడో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే మాత్రం బ్యాటింగ్ కష్టంగా మారనుంది.👉ఇక తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.👉 సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్ కాగా... ధ్రువ్ జురేల్ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్) మరో ఐదు పరుగులే చేశాడు.Innings Break!#TeamIndia post 4⃣6⃣2⃣ in the first innings 👏👏Devdutt Padikkal top-scores with 1⃣6⃣7⃣ 🫡Fifties from KL Rahul & Dhruv Jurel 👌Over to our bowlers 💪Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/cdMA1JyumY— BCCI (@BCCI) August 17, 2026 -
'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే'
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఓటమి పాలవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రిపరేషన్లో ఎలాంటి లోపాలు లేవని.. ఓటమికి సాకులు వెతకనని, బంగ్లాదేశ్ తమకన్నా బాగా ఆడిందన్నాడు. ఈ విజయానికి వారే అర్హులని పేర్కొన్నాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ ఆడేందుకు కోట్ల రూపాయలు ఇచ్చే హండ్రెడ్ లీగ్ కాంట్రాక్టులను వదులుకొని తమ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారని తెలిపాడు. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు పడిన శ్రమను, చేసిన త్యాగాలను కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. 'తమ ఆటగాళ్లలో కొందరు కేవలం 20 రోజుల వ్యవధిలో దాదాపు అర మిలియన్ పౌండ్ల (రూ. 5 కోట్లకు పైగా) ఆదాయాన్ని ఇచ్చే ‘ది హండ్రెడ్’ లీగ్ కాంట్రాక్టులను కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశారు. మా ప్రాక్టీస్ సరైన రీతిలోనే సాగింది. అందులో ఎలాంటి లోపం, నిర్లక్ష్యం లేదు. అలానే ఓటమిపై ఎలాంటి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ జట్టు అద్భుతంగా ఆడింది. తొలి రోజు వికెట్ కాస్త అనుకూలించినప్పటికీ, మేము క్రీజులో ఎక్కువ సమయం నిలదొక్కుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయాం' అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్మద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.🔴BIG REALITY CHECK FOR PAT CUMMINS & AUSTRALIA 🤯Before Bangladesh test series:Cummins🎙️: Some of our guys are saying no to half-a-million pounds for 20 days' work to go and play those two Test matches against Bangladesh.🙄After such a confident statement from Pat,… pic.twitter.com/iS79Cmc6tr— Sam (@cricsam02) August 16, 2026🔴PAT CUMMINS BLAMES THE PITCH FOR AUSTRALIA’S LOSS 🤯Cummins🎙️: The pitch was rock hard with a bit of grass, so we thought the first hour might be tough. But after that, it felt like a pretty good batting track.We expected it to crack up in the heat and spin on Days 4 and 5,… pic.twitter.com/BJmiDYGe2L— Sam (@cricsam02) August 16, 2026Read: బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్ -
బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌లో తంజిద్, నజ్ముల్‌తో పాటు మెహదీ హసన్ కూడా రాణించాడు. బ్యాట్‌తో మెరిసిన మెహదీ హసన్ ఈసారి బంతితో కూడా మ్యాజిక్ చేశాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మెహదీ హసన్ విజయంలో తన వంతు పాత్రను సమర్ధంగా పోషించాడు.ఈ నేపథ్యంలోనే ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో మెహదీ హసన్ వేసిన ఒక అద్భుత బంతికి వెబ్‌స్టర్ బిత్తరపోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. వెబ్‌స్టర్ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, మెహిదీ హసన్ మీరాజ్ తన ఆఫ్ స్పిన్‌తో ఆఫ్ స్టంప్ వద్దకు బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బంతిని విసిరాడు, బంతి పిచ్ అయి వెంటనే నిటారుగా వికెట్ల వైపు దూసుకొచ్చింది.బ్యూ వెబ్‌స్టర్ బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో లైన్ అండ్ లెంగ్త్ ను తప్పుగా అంచనా వేశాడు. దీంతో బంతి నేరుగా స్టంప్స్‌ను తాకడంతో వెబ్‌స్టర్ ఆశ్చర్యపోయాడు. ఇక తన అద్భుత బంతితో వికెట్ పడగొట్టిన సంతోషంలో మెహదీ హసన్ సంబరాలు షురూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మూడో బౌలర్‌గా రికార్డుఇక మ్యాచ్‌లో మెహదీ హసన్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మూడో బంగ్లా బౌలర్‌గా మెహదీ హసన్ నిలిచాడు. 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. హసన్ మహ్ముద్ (6/55), మొహమ్మద్ రఫీఖ్ (5/62) తొలి రెండు స్థానాల్లో నిలిచారు."Hellooooooooooooooooooo" - Kerry O'Keeffe enjoyed that beauty! #AUSvBAN pic.twitter.com/c6lvDgwe2P— cricket.com.au (@cricketcomau) August 16, 2026Read: లైవ్ మ్యాచ్‌లో వాంతి చేసుకున్న జకోవిచ్.. షాక్‌లో ఫ్యాన్స్! -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్ముద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 161 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (104 పరుగులు) శతకంతో మెరవగా, స్మిత్ (44), అలెక్స్ క్యారీ (30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా, హసన్ మహ్ముద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైంది. తంజిద్ సెంచరీతో చెలరేగగా, నజ్ముల్, మెహదీ హసన్‌లు అర్ధశతకాలతో రాణించారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మహ్ముద్ హసన్ 6 వికెట్లతో చెలరేగాడు. 👉23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్లో మట్టికరిపించడం ఇదే తొలిసారి. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాకు ఇది రెండోసారి. గతంలో 2017లో మీర్పూర్లో జరిగిన టెస్టులో ఆసీస్‌ను తొలిసారి ఓడించింది.సంక్షిప్త స్కోర్లు:ఆస్ట్రేలియా: 198 ఆలౌట్ & 284 ఆలౌట్బంగ్లాదేశ్: 426 ఆలౌట్ & 57/1Dominant. Commanding. Controlling.These are all words to describe a proud moment in Bangladesh history, because they have THUMPED Australia in Australia to win a Test by nine wickets! pic.twitter.com/MGUXtIySP9— 7Cricket (@7Cricket) August 16, 2026Read: క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్! -
ముగిసిన రెండో రోజు ఆట.. భారత స్కోరెంతంటే?
Sri Lanka Vs India 1st Test Day-2 Live Updates: గాలే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల చేసింది. క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(167) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్(82), ధ్రువ్ జురెల్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియాటీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 447 పరుగుల వద్ద తొలుత సిరాజ్ (11) ఆతర్వాత సుతార్ (24) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయింది.ఏడో వికెట్ కోల్పోయిన భారత్432 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ధనంజయకు క్యాచ్ ఇచ్చి ధృవ్ జురెల్ (51) ఔటయ్యాడు. మానవ్ సుతార్ (21)కు జతగా సిరాజ్ క్రీజ్‌లోకి వచ్చాడు. టీమిండియా ఆరో వికెట్ డౌన్టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. కేశర నువంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. 101 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది.టీ బ్రేక్‌కు భారత్ స్కోరెంతంటే?రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 364 పరుగుల స్కోర్ సాధించింది. క్రీజులో రవీంద్ర జడేజా(4), ధ్రువ్ జురెల్(19) ఉన్నారు.పడిక్కల్ అవుట్పడిక్కల్ రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 167 పరుగులు చేసిన పడిక్కల్.. ప్రభాత్ జైసూర్య బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. 93 ఓవర్లకు భారత్ స్కోర్: 361/5. క్రీజులో జురెల్(19), జడేజా(1) ఉన్నారుభారత్ నాలుగో వికెట్ డౌన్భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 82 పరుగులు చేసిన రాహుల్.. నువాంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. 87 ఓవర్లకు భారత్ స్కోర్: 335/4భారత్ మూడో వికెట్ డౌన్భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన పంత్.. కేశర నువాంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో గాయపడిన కేఎల్ రాహుల్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. 81 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆట తిరిగి ప్రారంభంఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. దీంతో రెండో రోజు ఆట తిరిగి ప్రారంభమైంది. 75 ఓవర్లకు టీమిండియా స్కోర్: 296/2. క్రీజులో పడిక్కల్(133), రిషబ్ పంత్(32) ఉన్నారు.మళ్లీ మొదలైన వర్షంమధ్యాహ్నం 2:11 గంటలు- రెండు గంటల విరామం తర్వాత వర్షం మళ్లీ మొదలైంది. ఆట దాదాపుగా ప్రారంభం కావాల్సిన సమయంలో వరుణుడు మరోసారి పలకరించాడు. దంచుతున్న వానలంచ్ విరామం అనంతరం కాసేపు ఎండ పలకరించినప్పటికీ, వరుణుడు మరోసారి విజృంభించాడు. దీంతో స్టేడియంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమవుతుందా? లేదా అన్నది ఆసక్తిగా మారిపోయింది.శాంతించిన వరుణుడు..గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదటి సెషన్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. అయితే లంచ్ విరామ సమయానికి వర్షం ఆగిపోయింది. దీంతో లంచ్ బ్రేక్ అనంతరం మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పిచ్‌పై కవర్లను తొలగించిన సిబ్బంది గ్రౌండ్‌ను సాపింగ్ చేశారు.👉గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య మొదలైన తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో పిచ్‌పై కవర్లను కప్పి ఉంచారు. 👉రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (178 బంతుల్లో 131 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి సెంచరీతో అదరగొట్టాడు. పంత్ (36 బంతుల్లో 27 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు.👉 అంతకముందు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (162 బంతుల్లో 77; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా హాఫ్ సెంచరీతో మెరవడంతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అర్ధశతకం అనంతరం రాహుల్ గాయంతో మైదానాన్ని వీడగా... పడిక్కల్‌తో కలిసి యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 32; 5 ఫోర్లు) రనౌట్‌గా వెనుదిరగగా... కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (16) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఏకైక వికెట్ పడగొట్టాడు. -
నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్.. గాయంపై బిగ్ అప్డేట్!
గాలే వేదికగా మొదలైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ కండరాల నొప్పితో మైదానం వీడడం భారత శిబిరంలో ఆందోళన కలిగించింది. అర్ధశతకం సాధించిన రాహుల్ శతకం వైపు పరుగులు తీస్తున్న క్రమంలోనే కండరాల నొప్పితో విలవిల్లాడిపోయాడు. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో టీ బ్రేక్ తర్వాత బ్యాటింగ్‌కు రాలేకపోయాడు.దీంతో లంకతో టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్ దూరమవుతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కేఎల్ రాహుల్ గాయంపై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. రాహుల్ ఫిట్‌నెస్‌పై అందోళన వద్దని అంటున్నాడు. కండరాలు పట్టేశాయని, భారత ఓపెనర్ ఫిట్‌గానే ఉన్నాడని సితాన్షు వెల్లడించాడు.‘కేఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నా దృష్టిలో అతడికి క్రాంప్స్ వచ్చాయంతే. రోజు ముగిసే సరికి అతడు బాగానే ఉన్నాడు. కండరాలు పట్టేయడం మొదలయ్యాక .. తొడ కండరాలు నొప్పి మొదలవుతుంది. ఒక్కోసారి గజ్జల్లోనూ నొప్పి వస్తుంది. కానీ, అతడు బాగానే ఉన్నాడు. రేపు అతడు బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉంటాడు’ అని సితాన్షు పేర్కొన్నాడు.గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టును భారత్ ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు ఆటలో ఆతిథ్య జట్టుపై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పడిక్కల్ 131 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రిషబ్ పంత్ (31) క్రీజులో ఉన్నాడు. A worrying moment in Galle. 😟💔KL Rahul has retired hurt after struggling with an issue in his right-hand finger, along with severe cramps.He was seen receiving treatment before walking back to the dressing room. Hoping it’s nothing serious and KL is back soon. 🙏❤️📸:… pic.twitter.com/Q8w6XdHuwx— CricTracker (@Cricketracker) August 15, 2026Read: ఆఫ్గన్ కెప్టెన్ రికార్డు సెంచరీ.. ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ -
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. టీ విరామం అనంతరం తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. కండరాలు పట్టేయడంతో వెంటనే మైదానాన్ని వీడాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.77 పరుగులుఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (32) రనౌట్ కాగా.. కేఎల్ రాహుల్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీ విరామానికి ముందు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 162 బంతులు ఎదుర్కొని.. తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు సాధించాడు.చేయి నొప్పిఈ క్రమంలో రాహుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ్ల.. టీ బ్రేక్ నుంచి రాగానే ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యాడు. బ్యాటింగ్‌కు వెళ్లే ముందే తన కుడిచేయి నొప్పిగా ఉందని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. డ్రెసింగ్‌రూమ్ నుంచి ఫిజియో వచ్చేలోగా.. మరో ఎండ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్ వచ్చి.. రాహుల్ చేయిని స్ట్రెచ్ చేశాడు. దీంతో అతడికి నొప్పి మరింత ఎక్కువైంది.కుంటుకుంటూఇంతలో ఎడమ చేయి కూడా నొప్పి పుట్టడంతో రాహుల్ విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరిశీలించగా.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వెళ్తున్నపుడు కూడా రాహుల్ కుంటుతూ నడవడం ఆందోళనకరంగా పరిణమించింది. ఫిజియో సాయం లేకుండా అతడు అసలు నిల్చోలేకపోయాడు. ఇక రాహుల్ స్థానంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ క్రీజులోకి రాగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్లో అతడికి ఇదే తొలి సెంచరీ.గాయాల బెడదఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా గాయాల బెడదతో సతమతమవుతోంది. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు. తాజాగా రాహుల్ కూడా గాయపడటం టీమిండియా శిబిరంలో కలకలం రేపుతోంది.చదవండి: జైసూను రనౌట్ చేయనా?.. తప్పేముంది?.. కానివ్వు! -
అదృష్టమంటే నీదే గ్రీన్!.. డబుల్ ధమాకా!
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా పోరాడుతోంది. డార్విన్ వేదికగా శనివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యే సరికి కూడా.. బంగ్లా కంటే వెనుకబడే ఉంది. కాగా రెండు దశాబ్దాల అనంతరం ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.ఆధిక్యంలోనే బంగ్లాదేశ్తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య కంగారూ జట్టును 198 పరుగులకే పరిమితం చేసిన బంగ్లాదేశ్... తమ మొదటి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా 228 పరుగుల మేర భారీ ఆధిక్యం సంపాదించింది బంగ్లాదేశ్.ఈ క్రమంలో తొలి రెండు రోజులు ఆధిపత్యం కొనసాగించిన బంగ్లా.. శనివారం నాటి మూడో రోజు ఆటలోనూ జోరు కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్ హసన్ మహమూద్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్నాడు.క్రీజులో గ్రీన్, క్యారీ మహమూద్ బౌలింగ్‌లో ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (17), జేక్ వెదర్లాండ్ (0) బౌల్డ్ అయ్యారు. మిగతా వారిలో వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 31 పరుగులతో రాణించాడు. అయితే, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఇక స్టీవ్ స్మిత్ 44 పరుగులు చేసి మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.ఈ క్రమంలో మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ క్రీజులో నిలిచారు. గ్రీన్ 86 బంతుల్లో 43 పరుగులు, క్యారీ 50 బంతుల్లో 19 పరుగులతో ఉన్నారు. ఫలితంగా 53 ఓవర్లలో ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్ కంటే ఇంకా 67 పరుగులు వెనుకబడి ఉంది.డబుల్ ధమాకాఇదిలా ఉంటే.. శనివారం నాటి ఆటలో కామెరాన్ గ్రీన్ అదృష్టవశాత్తూ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 31వ ఓవర్లో టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో గ్రీన్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, బంతి స్టంప్స్‌కు తాకింది.. కానీ బెయిల్స్‌ను పడగొట్టలేదు. అంతేకాదు.. బౌండరీ దిశగా దూసుకుపోయింది.దీంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక గ్రీన్ ఆశ్చర్యపోయాడు. మొత్తానికి లక్కీగా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్ శిబిరం ఊహించని ఈ పరిణామానికి బిక్కముఖం వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హెడ్ అతికించాడేమో!ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదేందయ్యా ఇది! ఇది మేము చూడలేదు.. అదృష్టం అంటే నీదే. బహుశా ట్రవిస్ హెడ్ గమ్‌తో బెయిల్స్‌ను అంటించాడేమో! అందుకే అవి పడలేదు’’ అని ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. కాగా హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన తర్వాత హెడ్ బెయిల్స్ సర్ది మెల్లగా క్రీజును వీడాడు. చదవండి: వారెవ్వా హెడ్.. నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్‌క్రిస్ట్ View this post on Instagram A post shared by cricket.com.au (@cricketcomau) -
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్‌క్రిస్ట్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. డార్విన్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ జోరు కొనసాగిస్తూ ఓపెనర్ల వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.మరోసారి ఓపెనర్ల పని పట్టిన హసన్హసన్ మహమూద్ బౌలింగ్‌లో తొలుత జేక్ వెదర్లాండ్ డకౌట్ కాగా.. ట్రవిస్ హెడ్ 35 బంతుల్లో 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. వీళ్లిద్దరిని అద్భుతమైన డెలివరీలతో మహమూద్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ వెదర్లాండ్ (23), ట్రవిస్ హెడ్ (22) హసన్ మహమూద్ బౌలింగ్‌నే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.అదే తీరుగా మరోసారి బౌల్డ్అయితే, యాధృచ్చికంగా తొలి ఇన్నింగ్స్‌లో ఎలాగైతే హెడ్ బౌల్డ్ అయ్యాడో.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే రీతిలో వికెట్ పారేసుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్లో మహమూద్ బంతితో రంగంలోకి దిగాడు. రెండో బంతిని మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో మహమూద్ వేయగా.. స్క్వేర్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హెడ్ బౌల్డ్ అయ్యాడు."I've never seen that in all my cricketing career."Travis Head chopped on for a second time in this match, but his considerate move even caught Adam Gilchrist off guard. #AUSvBAN pic.twitter.com/LEKgbtbshq— cricket.com.au (@cricketcomau) August 15, 2026నా కెరీర్లో ఇలాంటిది చూడలేదుఅయినప్పటికీ ఎంతో సంయమనంగా హెడ్.. బెయిల్స్‌ను తీసి స్టంప్స్ మీద సర్ది నెమ్మదిగా క్రీజును వదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కామెంటెరీ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్.. ‘నా క్రికెటింగ్ కెరీర్లో ఇంత వరకు ఇలాంటిది చూడలేదు’ అని హెడ్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రెండుసార్లు ఒకే బౌలర్ బౌలింగ్‌లో.. ఒకే విధంగా అవుటైనప్పటికీ.. ప్రశాంతంగా ఉండటం అతడికే చెల్లించిందని చెప్పుకొచ్చాడు.బంగ్లాదేశ్ ఆధిపత్యంకాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్- బంగ్లాదేశ్ మధ్య గురువారం మరారా స్టేడియంలో తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్ 426 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లా 228 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 42 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బంగ్లా కంటే ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: జైస్వాల్‌ను రనౌట్ చేయనా? ఇందులో తప్పేముంది?.. కానివ్వు! -
రాహుల్ దెబ్బకు మైదానం వీడిన లంక ప్లేయర్!
గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆటగాడు నిషాన్ మదుష్క గాయంతో మైదానం వీడడం కలకలం రేపింది. టీమిండియా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రబాత్ జయసూరియా వేసిన బంతిని కేఎల్ రాహుల్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో నిషాన్ మదుష్క మెడ భాగంలో బలంగా తగిలింది. దీంతో మైదానంలో కిందపడిపోయిన నిషాన్ వద్దకు ఫిజియో పరిగెత్తుకు వచ్చారు. అయితే నిషాన్ మెడపై బంతి తాకిన ప్రదేశంలో వాపు రావడంతో డాకర్లు వెంటనే అతడిని పెవిలియన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. దీంతో కంకషన్‌కు గురైన నిషాన్ మదుష్క స్థానంలో సూరియాబండారా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. ఒకవేళ నిషాన్ మదుష్క గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం తొలి టెస్టుకు అతడు దూరమయ్యే అవకాశాలున్నాయి. అదే గనుక జరిగితే నిషాన్ స్థానంలో సూరియా బండారా టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఒకవేళ మదుష్క దూరమైతే మాత్రం శ్రీలంకకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఇటీవలే ఇండియా-ఏతో జరిగిన అనధికారిక మ్యాచ్‌లో ఆడిన నిషాన్ 4 ఇన్నింగ్స్‌లు కలిపి 256 పరుగులు సాధించాడు. అంతేకాదు శ్రీలంక తరఫున టెస్టుల్లో 64.50 సగటుతో పరుగులు సాధించిన మదుష్క ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. గాయంతో నిషాన్ మదుష్క దూరమైతే అతడి స్థానంలో రానున్న పసిందు సూరియబండారా కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 54.36 సగటుతో 4,893 పరుగులు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి టీమిండియా 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులు చేశారు. అంతకముందు జైస్వాల్ (32) రాహుల్‌తో సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.😳 NASTY BLOW FOR NISHAN MADUSHKA!KL Rahul’s powerful sweep struck Nishan Madushka on the helmet, forcing the Sri Lankan fielder to leave the field. 🏏Hoping Madushka is absolutely fine and back on the field soon! 🙏🇱🇰#INDvsSL pic.twitter.com/MxtoXiJEuC— CricInformer (@CricInformer) August 15, 2026Read: ఆరు వికెట్లతో ఇరగదీశాడు.. ఆసీస్ బౌలర్ అరుదైన ఫీట్ -
సెంచరీ కొట్టిన టీమిండియా
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన ఆరంభం అందుకుంది. భోజన విరామ సమయానికి వంద పరుగుల మార్కు దాటింది. గాలె వేదికగా శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.జైసూ రనౌట్ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతూ మంచి ఆరంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో సమన్వయ లోపం కారణంగా.. అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు. ఇందుకు లంక బౌలర్ కేశారా నువాంత కూడా ఒక రకంగా కారణమే.ఇక మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. ఐదు ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి.. తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. అనంతరం.. ఆచితూచి ఆడుతున్న రాహుల్‌కు జతైన దేవదత్ పడిక్కల్ దూకుడుగానే మొదలుపెట్టాడు.నిలకడగా..ఈ క్రమంలో భోజన విరామ సమయానికి 27 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 77 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 32 పరుగులు... పడిక్కల్ 49 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది 35 పరుగులతో క్రీజులో నిలిచారు. UPDATEఇదిలా ఉంటే.. వర్షం వల్ల లంచ్ తర్వాత ఆటకు అంతరాయం కలిగింది. మైదానం తడిగా ఉన్నందున దాదాపు గంట సేపు ఆటను నిలిపివేశారు. రెండింటికి మళ్లీ ఆట మొదలైంది.తుది జట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంకలాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.చదవండి: సన్‌రైజర్స్ కొంపముంచిన క్లాసెన్! -
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనూహ్య రీతిలో అవుటయ్యాడు. నిలకడగా ఆడుతున్న అతడు.. తప్పుడు నిర్ణయం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ శ్రీలంకకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా శనివారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కాస్త వేగంగా ఆడగా.. కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేశాడు.Off the Mark! 💥 Yashasvi Jaiswal gets going with a sweetly timed boundary. 👊Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/EYTG3ht7CY— Sony Sports Network (@SonySportsNetwk) August 15, 2026దూకుడుగా జైసూ..ఇక 37 బంతుల్లోనే 32 పరుగులతో జైస్వాల్ జోరు మీదున్న సమయంలో.. దురదృష్టం అతడిని వెంటాడింది. భారత ఇన్నింగ్స్ 11వ ఓవర్లో లంక అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ కేశారా నువాంత బంతితో రంగంలోకి దిగాడు.ఈ క్రమంలో కేశారా వేసిన ఆఖరి బంతిని రాహుల్ మిడాన్ దిశగా బాదాడు. అయితే, కేశారా బంతిని ఆపే క్రమంలో జైసూ కాళ్లకు అడ్డుగా వచ్చాడు. దీంతో అదుపుతప్పిన జైసూ నేలమీద పడిపోయాడు. ఈలోపే కేఎల్ రాహుల్ సింగిల్ కోసం రాగా.. కిందపడి లేచిన తర్వాత కూడా జైసూ పరుగుకు సిద్ధంగా ఉన్నానన్నట్లుగా ముందుకు ఉరికాడు.జైసూను రనౌట్ చేయనా?.. కానీ ఇంతలోనే లంక ఫీల్డర్ బంతిని అందుకుని వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా వైపు విసిరాడు. అప్పటికి రాహుల్, జైస్వాల్.. ఇద్దరూ బౌలర్ ఎండ్‌లోనే ఉన్నారు. వీరిలో ముందుగా రాహుల్ తన బ్యాట్‌ను నేలమీద పెట్టి సేఫ్ అయ్యాడు. అయితే, బంతిని అందుకున్నప్పటికీ డిక్వెల్లా వెంటనే బెయిల్స్‌ను పడగొట్టలేదు.Yashasvi Jaiswal was looking so good and his timing today was brilliant, but this unfortunate run-out spoiled the day for himHe scored 32 at a strike rate of 88, but this run out....... #INDvsSL pic.twitter.com/lUtlbsBXpZ— Ajay Jadeja (@AjayJadeja171) August 15, 2026ఇందులో తప్పేముంది?.. కానివ్వు!రనౌట్ చేయనా అన్నట్లుగా కెప్టెన్ ధనంజయ డి సిల్వను అడిగాడు. ఇందుకు ధనంజయ.. ‘ఇందులో తప్పేముంది? కానివ్వు’ అన్నట్లుగా సైగ చేయడంతో డిక్వెల్లా బెయిల్స్‌ను పడగొట్టాడు. ఫలితంగా జైస్వాల్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఏదేమైనా అటు కేశారా.. ఇటు రాహుల్‌తో పాటు జైసూ తొందరపాటు కారణంగా టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.ఈ దారుణమైన మిక్సప్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కొంతమంది రాహుల్‌ను.. మరికొందను జైస్వాల్‌ను విమర్శిస్తున్నారు. ఇంకొందరు మాత్రం తప్పంతా కేశారాదేనని తిట్టిపోస్తున్నారు. కాగా జైసూ రనౌట్ కాగానే రాహుల్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ఇక జైస్వాల్ 32 పరుగుల వద్ద అవుట్ కాగా.. అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు.చదవండి: లంచ్‌బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరెంతంటే?చదవండి: సన్‌రైజర్స్ కొంపముంచిన క్లాసెన్! -
అగార్కర్ పదవి ఉంటుందా? ఊడుతుందా? డెడ్‌లైన్ అప్పుడే!
శ్రీలంకతో టెస్టు సిరీస్ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌తో అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలోనే అతడిని కొనసాగించాలా లేక వేరేవారికి అవకాశమివ్వాలా అనే దానిపై బీసీసీఐ ఒక నిర్ణయానికి రానుంది. అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకు అగార్కర్‌ను కొనసాగించాలనే అంశం కూడా బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 2023లో అగార్కర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అతడిని వివాదంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తొలగించడంలో అగార్కర్ తెర వెనుక ప్రధాన పాత్ర పోషించాడనే వార్త అప్పట్లో బాగా వైరలయ్యింది. అంతేకాదు ఇంగ్లండ్‌తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్‌ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్‌తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవీకాలం పొడిగింపు సందర్భాలు చాలా తక్కువ. గతంలో శివసుందర్ దాస్, ఎస్. శరత్, సుబ్రోతో బెనర్జీ, అజయ్ రాత్రా సహా మిగిలినవాళ్లంతా తన పదవీ కాలం ముగియగానే బయటికి వెళ్లిపోయారు. కానీ అగర్కార్ సెలెక్టర్‌గా వచ్చిన తర్వాత అతడు మంచి ఫలితాలు సాధించాడు. అతడి సెలెక్షన్ పర్యవేక్షణలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ చేరడంతో పాటు వాటిలో మూడు టైటిల్స్‌ను అందుకుంది. జట్టులో మార్పులు కూడా ఫలితాలు ఇవ్వడంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అగార్కర్‌కు మద్దతు ఇచ్చింది. మధ్యలో రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐతో అభిప్రాయబేధాలు వచ్చినప్పటికీ, ఇవేవీ పట్టించుకోకుండా అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించే యోచనలో ఉంది. అంతకముందు 2022 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న చేతన్ శర్మపై విమర్శలు వచ్చాయి. ఇక 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ భారత్ ఫైనల్ చేరడంలో విఫలం కావడంతో అప్పటి సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌పై అటు బీసీసీఐ, ఇటు అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి అగార్కర్‌పై విశ్వాసముంచి బీసీసీఐ అతడి పదవిని పొడిగిస్తుందా? తొలగిస్తుందా అనేది వచ్చే నెలతో తేలిపోనుంది.Read: సైక్లింగ్‌లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త! -
‘సారథ్యం భారం కాదు.. ఈ టెస్టు మ్యాచ్ నాకు ప్రత్యేకం’
గాలె: భారత క్రికెట్ జట్టు సరైన దిశలోనే ప్రయాణిస్తోందని టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వెల్లడించాడు. సారథ్య బాధ్యతలు తనపై ఎలాంటి అదనపు భారం వేయడం లేదన్న గిల్... భవిష్యత్తులో జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశాడు. గతేడాది కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన గిల్... టీమిండియా 2–2తో సిరీస్ ‘డ్రా’ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు సిరీస్ పరాజయాలు ఎదుర్కొంది. 2027లో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు భారత జట్టు ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో సింహభాగం విజయాలు సాధిస్తేనే తుదిపోరుకు చేరనుంది. ఈ క్రమంలో నేటి నుంచి శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, ప్లేయర్ల దృక్పథం, కీలక ఆటగాళ్ల గాయాలపై గిల్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... అదే ప్రధాన లక్ష్యం... కెప్టెన్సీతో నాకెలాంటి ఇబ్బంది లేదు. గతేడాది కాలంగా నా ప్రదర్శనను గమనిస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. నా దృష్టిలో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం నా ఆటతీరు మరింత మెరుగైందనిపిస్తుంది. ప్రస్తుతం జట్టు సరైన దిశలోనే సాగుతోంది. ఇప్పుడు మా ముందున్న ప్రధాన లక్ష్యం వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడమే. రానున్న ఆరు, ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే అది సాధ్యమవుతుంది. శ్రీలంక పర్యటనతోనే ఆ దిశగా ముందడుగు వేయాలనుకుంటున్నాం. అందుకోసం బాగా సన్నద్ధమయ్యాం. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడంతో పాటు... ప్రాక్టీస్ మ్యాచ్‌లో సైతం మెరుగైన ప్రదర్శన చేశాం. అరుదైన 600వ టెస్టు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప అవకాశం. అందులో సారథ్యం వహించడం మరింత గర్వకారణం. అలాంటిది టీమిండియా మైలురాయి టెస్టు మ్యాచ్‌లో జట్టును నడిపించనుండటం ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. భారత్ ఆడిన 100వ టెస్టు మ్యాచ్‌కు మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యం వహించగా... 500వ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు 600వ మ్యాచ్‌కు నేను కెప్టెన్ కావడం... అది కూడా దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు కావడం మరింత ప్రత్యేకం. శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించడం పరిపాటి కాగా... పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితేనే మెరుగైన ఫలితాలు సాధించగలం. ప్రసిధ్కే మొగ్గు... ఫాస్ట్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. గుర్నూర్ బ్రార్, ఆఖిబ్ నబీలో ఎంతో నైపుణ్యం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గుర్నూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. బంతి పాతబడ్డ తర్వాత అతడు మరింత ప్రమాదకరం. అదనపు బౌన్స్, అదనపు వేగంతో ప్రత్యరి్థని సులువుగా బోల్తా కొట్టించగలడు. అదే సమయంలో ప్రసిధ్ కృష్ణ నిలకడ కనబరుస్తున్నాడు. అతడికి అనుభవం కూడా ఉంది. దీంతో తుది జట్టు ఎంపిక మరింత కష్టమవుతుంది. స్టార్ పేసర్ బుమ్రా గైర్హాజరీలో ఇతర బౌలర్లు సత్తాచాటేందుకు ఇది సరైన సమయం. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి వికెట్లు రాబడితేనే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. నైపుణ్యానికి కొదవలేదు... జట్టులో నైపుణ్యం గల ఆటగాళ్లకు కొదవలేదు. ఏ స్థానానికైనా తగిన రిప్లేస్మెంట్ సిద్ధంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎవరికి అవకాశం ఇచ్చినా వారు సత్తా చాటగలరు. సుదీర్ఘ ఫార్మాట్లో పరుగులు సాధించడం అంత సులువు కాదు. జట్టులోకి వచ్చిన వెంటనే పరుగుల వరద పారించడం ఎవరికీ సాధ్యం కాదు. కొంతమంది ఆటగాళ్లు త్వరగా లయ అందుకుంటారు. మరికొంతమందికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అది ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పడిక్కల్ చాలా మంచి ప్లేయర్. గతంలోనూ అతడు చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఫార్మాట్లో విజయవంతం అయ్యేందుకు అవసరమైన సత్తా అతడిలో పుష్కలంగా ఉంది. 2017లో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడిన రాహుల్, రవీంద్ర జడేజా అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రిస్క్ తీసుకోలేం... ప్లేయర్ల జీవితంలో గాయాలు సహజం. ఈ సిరీస్‌కు మొదట ఎంపిక చేసిన బుమ్రా, సాయి సుదర్శన్ గాయాలతోనే దూరమయ్యారు. దీంతో ఒకింత ఇబ్బందికి గురయ్యాం. అయితే వారితో నిరంతరం టచ్‌లో ఉంటూ పురోగతి తెలుసుకుంటున్నాం. సుదీర్ఘ ఫార్మాట్లో రిస్క్ తీసుకోలేం. ఐదు రోజుల పాటు మైదానంలో గడపాలంటే మెరుగైన ఫిట్నెస్ తప్పనిసరి. టి20, వన్డేలతో పోల్చుకుంటే... ప్లేయర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు టెస్టుల్లో ఎక్కువ అవకాశాలుంటాయి. తొలి రోజు మెరుగ్గా ఆడలేకపోతే... రెండో రోజు దాన్ని మరిపించే ప్రదర్శనతో మన్ననలు అందుకునే చాన్స్ టెస్టుల్లోనే ఉంటుంది. మానవ్ సుతార్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో జట్టులో ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉన్నట్లే. -
ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్‌పై పాంటింగ్ ఫైర్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆట తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త బ్యాటింగ్‌తో తొలిరోజే ప్రత్యర్థి ముందు తలవంచారని మండిపడ్డాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ అనూహ్య ప్రదర్శనతో చెలరేగింది. డార్విన్‌లోని మరారా స్టేడియంలో బలహీన ప్రత్యర్థిపై బరిలోకి దిగిన కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు చెలరేగడంతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. ఒంటరి పోరాటం చేసిన స్టీవ్ స్మిత్ (109 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ (6/55) ఆరు వికెట్లతో కంగారూలను పడగొట్టగా... మరో ఇద్దరు పేసర్లు ఇబాదత్ హుసేన్, తస్కీన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.ఇదేం బ్యాటింగ్?ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియా బ్యాటర్లను విమర్శించాడు. ‘‘తొలి సెషన్లో పిచ్ కాస్త భిన్నంగా ఉందని ఒప్పుకొంటాను. అయినా సరే ఆసీస్ బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు టెక్నికల్‌గా ఎన్నో తప్పులు చేశారు.ఇందుకు వారికి క్షమాపణే లేదు. ఏదేమైనా ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 54 పరుగుల తేడాతో గట్టెక్కిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు.ముందుగా ఆసీస్ బౌలింగ్ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని రిక్కీ పాంటింగ్ విమర్శించాడు.ముసలోళ్ల జట్టుఅదే విధంగా.. ఆసీస్ ప్రస్తుత జట్టుపై స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసి 1928 తర్వాత బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆడిన జట్టే అత్యధిక మంది ‘వృద్ధుల’తో నిండిన జట్టు అనుకుంటా. కామెరాన్ గ్రీన్ (27 ఏళ్లు) తప్ప మిగిలిన వారంతా 30 ఏళ్లు పైబడిన వారే. జట్టు పునర్నిర్మాణంలో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో యువ బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయినా సరే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని పాంటింగ్ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.తేలిపోయిన బ్యాటర్లుకాగా గురువారం నాటి తొలిరోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఆసీస్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. పరిస్థితులు సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్టు ఆడుతున్న జట్టులో ఆ ప్రభావం కనిపించింది. తొలి సెషన్లోనే వెదరాల్డ్ (23), హెడ్ (22), లబుషేన్ (1), గ్రీన్ (13) వెనుదిరిగారు. లంచ్ తర్వాత స్మిత్, కేరీ (19) ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.అయితే తక్కువ వ్యవధిలో కేరీతో పాటు వెబ్‌స్టర్ (12), కమిన్స్ (9), స్టార్క్ (1) అవుటయ్యారు. మరో ఎండ్‌లో 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్ ఆ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో 9వ వికెట్‌గా పెవిలియన్ చేరగా, కొద్ది సేపటికే లయన్ (7) అవుట్‌తో ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే.ఆధిక్యంలో బంగ్లాదేశ్ఇదిలా ఉంటే.. తొలిరోజు వికెట్ నష్టానికి 96 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. రెండోరోజూ జోరు కొనసాగించింది. శుక్రవారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 153 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ముందు బయటకు నడువ్: స్టార్క్ ఆగ్రహం -
కెప్టెన్‌గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం: శుబ్‌మన్ గిల్
శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టును 2-0తో వైట్‌వాష్ చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తొలి టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.కెప్టెన్‌గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం‘‘కెప్టెన్‌గా నా పాత్రలో నేను ఎంతో సౌకర్యవంతంగానే ఉన్నాను. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడమే మా లక్ష్యం. అందుకోసం మేము ఆరు నుంచి ఏడు టెస్టులు గెలవాల్సి ఉంది. కాబట్టి శ్రీలంక నుంచే ఆ పని మొదలుపెడతాము’’ అని గిల్ పేర్కొన్నాడు.నాకు దక్కిన గొప్ప గౌరవంఅదే విధంగా.. ‘‘చారిత్రక 600వ టెస్టులో నాయకుడిగా టీమిండియాను ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అది కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజు కావడం మరింత విశేషం’’ అని గిల్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక.మా జట్టుతో సంతృప్తిగానే ఉన్నాంకాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)పై వస్తున్న విమర్శలపై గిల్ స్పందించాడు.‘‘మేము CoEతో తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్ల గాయాల గురించి అప్డేట్లు తెలుసుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ సాయి సుదర్శన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అతడిని టెస్టు మ్యాచ్‌లో ఆడించి రిస్క్ తీసుకోలేము. మా జట్టులో ఉన్న పదిహేను మంది సభ్యులతో ప్రస్తుతం సంతృప్తిగానే ఉన్నాము’’ అని గిల్ పేర్కొన్నాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..ఇదిలా ఉంటే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. తాజా సీజన్లో మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లలో కనీసం ఆరు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిందే. ఇందులో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కాస్త ఈజీ టార్గెట్. ఆ తర్వాత, న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.వీటిలో కనీసం ఆరు గెలవడంతో పాటు రెండు డ్రా చేసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఏడు టెస్టులు గెలవాలి. ఇక ఈ సీజన్లో ఇప్పటికి టీమిండియా తొమ్మిది టెస్టులు పూర్తి చేసుకుని.. నాలుగు గెలిచి.. నాలుగు ఓడిపోయి.. ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. -
ముందు బయటకు నడువ్: మిరాజ్‌పై స్టార్క్ ఆగ్రహం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తోంది. తొలి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కంగారూలపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బంగ్లా జట్టు తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్‌లో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ కంగారూలకు చుక్కలు చూపించాడు.198 పరుగులకే ఆలౌట్మహమూద్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 71 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన బంగ్లా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితికి చేరుకుంది.తంజిద్ సెంచరీమొత్తంగా 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బంగ్లా 351 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ సెంచరీ (101)తో కదం తొక్కగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో 84 పరుగులతో రాణించాడు. ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ 32, హసన్ మహమూద్ 13 పరుగులతో క్రీజులో నిలిచారు.ముందు బయటకు నడువ్ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సహనం కోల్పోయాడు. మెహదీ హసన్ మిరాజ్‌తో వాగ్వాదానికి దిగాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 105 ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్లో స్టార్క్ వేసిన ఐదో బంతిని మిరాజ్ థర్డ్‌మాన్ దిశగా బాది సింగిల్‌కు వెళ్లాడు.ఈ క్రమంలో మిరాజ్ పిచ్ (డేంజర్ ఏరియా) మధ్య నుంచి పరుగు తీశాడు. దీంతో స్టార్క్ కోపంతో ఊగిపోతూ.. ‘ముందు వికెట్ మీది నుంచి బయటకు నడువు’ అని హెచ్చరించాడు. ఇందుకు మిరాజ్ గట్టిగానే బదులిచ్చాడు. స్టార్క్ అడ్డుగా ఉండటం వల్లే తాను పిచ్ మధ్యలోకి పరుగు తీయాల్సి వచ్చిందని అంపైర్ కుమార్ ధర్మసేనకు చెప్పాడు.అంపైర్ కూడా వార్నింగ్ ఇచ్చాడుదీంతో స్టార్క్, మిరాజ్‌లను విడదీసిన ధర్మసేన.. మిరాజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే రెండుసార్లు పిచ్ డేంజర్ జోన్లోకి వచ్చావని.. మరోసారి గనుక ఇది పునరావృతమైతే జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ పడుతుందని హెచ్చరించాడు. "Get off the wicket!"Mitchell Starc and Mehidy Hassan Miraz had a heated exchange in #AUSvBAN: https://t.co/854LsTds7l pic.twitter.com/fTJtsn4px8— cricket.com.au (@cricketcomau) August 14, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో స్టార్క్ ఇప్పటికి రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం (20), వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (0)లను అవుట్ చేశాడు.చదవండి: స్మిత్ ప్రపంచ రికార్డు -
స్మిత్ ప్రపంచ రికార్డు.. భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్!
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అరుదైన ఫీట్ సాధించాడు. డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. నజ్ముల్, లిటన్ దాస్‌లను తొలి రెండు క్యాచ్‌లుగా తీసుకున్న స్మిత్ 36 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపపట్టాడు. స్మిత్‌కు ఇది 218వ క్యాచ్. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ల జాబితాలో జో రూట్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జో రూట్ 165 టెస్టుల్లో 218 క్యాచ్‌లు తీసుకుంటే స్మిత్ మాత్రం 124 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఇక ఈ జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (210 క్యాచ్‌లు) రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే (205 క్యాచ్‌లు), సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ (200 క్యాచ్‌లు) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక భారత్ నుంచి చూసుకుంటే వీవీఎస్ లక్ష్మణ్ (135 క్యాచ్‌లు), కోహ్లి (121 క్యాచ్‌లు), సచిన్ టెండూల్కర్ (115 క్యాచ్‌లు) టెస్టుల్లో వందకు పైగా క్యాచ్‌లు అందుకున్న జాబితాలో చోటు సంపాదించారు.తంజిద్ శతకం.. పట్టు బిగించిన బంగ్లామ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మెహదీ హసన్ (32 బ్యాటింగ్), హసన్ మహ్ముద్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ (101) మెయిడెన్ శతకంతో మెరవగా, కెప్టెన్ నజ్ముల్ (84) అర్ధశతకంతో ఆకట్టుకోగా, మోమినుల్ హక్ (49) రాణించాడు. Photo Credit: Twitterఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు తీయగా, కమిన్స్, నాథన్ లియోన్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. రెండోరోజు ఆటలోనూ బంగ్లాదేశ్ ఆధిపత్యమే స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియా బౌలర్లో రోజు మొత్తంలో ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. ఇప్పటికైతే ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ మంచి ఆధిక్యంలో నిలిచి టెస్టులో పట్టు బిగించిందని చెప్పొచ్చు. మ్యాచ్‌లో ఎవరిది పైచేయి కానుందనేది మూడోరోజు ఆటలో తేలిపోనుంది.Read: రొనాల్డో, జార్జినా వివాహం వెనుక షాకింగ్ ట్విస్ట్! -
తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లతో.. సర్ఫరాజ్‌కు చాన్స్!
శ్రీలంకతో గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాలే పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాతి మూడు రోజులు స్పిన్నర్లకు ఉపయుక్తంగా ఉంటుందని పిచ్ రిపోర్ట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మ్యాచ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ, తుదిజట్టు ఇంకా ఖరారు కాలేదు. గాలే పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఈ లెక్కన కుల్దీప్ యాదవ్‌తో పాటు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ లేదా సారాంశ్ జైన్‌లో ఒకరు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు దక్కించుకోనున్నారు. ఇక సిరాజ్, గుర్నూర్ బ్రార్ లేదా ప్రసిధ్ క్రిష్ణలు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో తొలి ఐదు స్థానాల్లో (జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, గిల్, పంత్) ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఆరో స్థానంపై తెగ చర్చ నడుస్తోంది. ఆరో స్థానంలో జురెల్ లేదా సర్ఫరాజ్ల్లో ఒకరికే చాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే సీనియార్టీ ప్రకారం జురెల్ కంటే సర్ఫరాజ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్ఫరాజ్ లంకతో తొలి టెస్టులో ఆడడం దాదాపు ఖాయమైనట్లే.టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్/సారాంశ్, సిరాజ్, గుర్నూర్/ప్రసిధ్ క్రిష్ణ.🚨 NOT A TURNER ❌ - Galle pitch is likely to be batting friendly in first 2 days. [Sahil Malhotra from TOI]India likely to field 2 quicks & 3 spinners for depth and balance. pic.twitter.com/vx6k5h5aLy— Johns. (@CricCrazyJohns) August 14, 2026Read: వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అత్యున్నత పదవి? -
‘ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు’.. స్టార్ ప్లేయర్‌కు గంభీర్ వార్నింగ్!
గాలే వేదికగా రేపటి నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇంకా ఖరారు కాలేదు. తుది జట్టుపై ఒక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక్క స్థానం విషయంలో మాత్రం మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. సాయి సుదర్శన్ గాయపడడంతో సర్ఫరాజ్ ఖాన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. దీంతో ధ్రువ్ జురెల్ తుది జట్టులో కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి.జురెల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ ఖాన్‌కు టెస్టుల్లో మంచి రికార్డు ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ధ్రువ్ జురెల్‌కు మేనేజ్మెంట్ నుంచి హెచ్చరికలు వస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ జట్టులో చోటు ఉండాలంటే ధ్రువ్ జురెల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని, లేదంటే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని కోచ్ గంభీర్ అతడికి సున్నితంగానే హెచ్చరించినట్లు సమాచారం. పంత్ రెగ్యులర్ వికెట్ కీపర్‌గా ఉండడంతో ఇంతకాలం జురెల్ అదనపు బ్యాటర్‌గా జట్టులో కొనసాగాడు. తాను ఆడిన 10 టెస్టుల్లో బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక 2025లో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ధ్రువ్ జురెల్ విఫలమయ్యాడు. దీంతో ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు నిలుపుకోవాలంటే జురెల్ తన ప్రదర్శనను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరముందని యాజమాన్యం భావిస్తోంది. ఆఫ్గన్‌తో ఏకైక టెస్టులోనూ జురెల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అయితే లంక-ఏ జట్టుపై సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించి టచ్‌లోకి వచ్చినట్లు అనిపించాడు. కానీ ఇటీవలే లంక ఎలెవెన్‌తో వార్మప్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ వరుసగా 1, 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రావడంతో జురెల్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఆరో స్థానంలో ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనే దానిపై మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతున్న వేళ ధ్రువ్ జురెల్ రాణించకపోవడం అతడికి మైనస్‌గా మారే అవకాశముంది. అంతేకాదు జురెల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ నాలుగు టెస్టులు తక్కువే ఆడినప్పటికీ, ఒక సెంచరీతో పాటు రెండు అర్ధసెంచరీలు ఎక్కువగా సాధించడం విశేషం. దీంతో లంకతో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.Read: లంకతో తొలి టెస్టు.. రికార్డుల వేటకు టీమిండియా సిద్ధం! -
సెంచరీ దిశగా తంజిద్.. బంగ్లా చేతిలో ఆసీస్‌కు చుక్కలు!
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ (20) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, మరో ఓపెనర్ తంజిమ్ హసన్ (71 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతుండగా, అతడికి షాంటో సహకరిస్తున్నాడు. అంతకముందు మోమినుల్ హక్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ పేసర్లు మెరిసిన చోట ఆస్ట్రేలియా పేస్ త్రయం వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. కమిన్స్, హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన బంగ్లా బ్యాటర్లు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించడం విశేషం. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ (71) అర్ధసెంచరీ చేయగా, మిగతావాళ్లు పూర్తిగా తేలిపోయారు. హసన్ మహ్ముద్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా, తస్కిన్ అహ్మద్, ఇబదత్ హొస్సేన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. అనంతరం ఆసీస్ బౌలింగ్‌ను బంగ్లాదేశ్ సమర్థంగా ఎదుర్కొంది. అయితే సున్నా పరుగుల వద్ద లయన్ క్యాచ్ వదిలేయడంతో తంజిద్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుచకున్నాడు.చదవండి: క్రికెట్లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక కోచ్ మృతి -
పిలుపు ఊహించాం
గాలె: నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తే ఏదో ఒక రోజు భారత జట్టు నుంచి పిలుపు వస్తుందని ఆశించినట్లు... జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ పేర్కొన్నాడు. దేశవాళీల్లో దుమ్మురేపిన ఆకిబ్ గత రెండు రంజీ సీజన్లలో ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్లో జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గడంలో నబీ కీలకపాత్ర పోషించాడు. అతడి నిలకడైన పేస్ బౌలింగ్ వల్లే ఆ జట్టు సుదీర్ఘ చరిత్ర గల టోర్నమెంట్లో మొదటిసారి చాంపియన్‌గా అవతరించింది. దీంతో చాన్నాళ్లుగా అతడికి భారత జట్టులో చోటు దక్కుతుందని భావించగా... తాజాగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో ఆకిబ్‌కు జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘దేశవాళీల్లో నిలకడగా రాణించడంతో ఏదో ఒక రోజు టీమిండియాకు ఎంపికవుతానని బలంగా విశ్వసించాను. నా కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నమ్మకంగా ఉన్నా. మొత్తానికి ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. సరైన స్థానంలో బంతులు వేస్తూ వికెట్లు పడగొట్టడమే నా కర్తవ్యం. జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో లేని పని. తొలిసారి భారత జట్టుకు ఎంపికైనట్లు తెలియగానే చాలా సంతోషించా. కుటుంబ సభ్యులు ఎంతో గర్వించారు. దీని కన్నా గొప్పది మరొకటి ఉండదు’ అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఆకిబ్ పేర్కొన్నాడు. శ్రీలంకతో పర్యటనకు తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో నబీకి చోటు దక్కలేదు. దీంతో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రత్యేక శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఆకిబ్‌కు టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఈ సమాచారం అందింది. ‘బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సమయంలో నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావు అని అడిగారు... ప్రాక్టీస్ కోసం బెంగళూరు వెళ్తున్నానని సమాధానమిచ్చా... ఆ అవసరం లేదు నేరుగా శ్రీలంకకు వచ్చేయ్. నువ్వు భారత జట్టుకు ఎంపికయ్యావు’ అని చెప్పారు. దీంతో మొదట నమ్మలేకపోయా. కానీ బుమ్రా స్థానంలో తీసుకున్నారని ఆ తర్వాత తెలిసిందని నబీ వివరించాడు.సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం మరోవైపు 33 ఏళ్ల వయసులో టీమిండియాకు ఎంపికైన స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ కూడా తన ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. 2021–22 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సభ్యుడైన సారాంశ్... దశాబ్దానికి పైగా దేశవాళీల్లో రాణిస్తున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో శ్రీలంకతో తొలి టెస్టుకు దూరం కాగా... అతడి స్థానంలో సారాంశ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ‘టెస్టు క్రికెట్ ఆడాలంటే ఓపిక కావాలి. అందులోనూ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలంటే అది మరింత ఎక్కువ ఉండాలి. నేను 2014–15 సీజన్లో రంజీ ట్రోపీలో అరంగేట్రం చేశాను. ఎన్నో త్యాగాలు, మరెంతో శ్రమతో ఇన్నాళ్లుగా ఆటలో కొనసాగుతున్నా. ఏదో ఒక రోజు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాననే నమ్మకం మాత్రం కోల్పోలేదు. మా నాన్న కూడా రంజీ ఆటగాడే. ఓపికతో ఎదురుచూస్తే తప్పక అవకాశం వస్తుందని చెప్పారు. అదే నిజమైంది. గుడికి వెళ్తున్న సమయంలో భారత జట్టుకు ఎంపికయ్యాననే వార్త తెలిసి చాలా సంతోషించా’ అని సారాంశ్ చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టులోని ఆటగాళ్లతో గతంలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండటంతో అందరితో త్వరగానే కలిసిపోయానని సారాంశ్ వెల్లడించాడు. -
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్‌పై ఫైర్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ‘క్రికెట్ కంటే నువ్వేమీ గొప్పోడివి కాదు’ అంటూ ఓ అభిమాని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆసీస్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది.చెలరేగిన హసన్ మహమూద్ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం డార్విన్‌లో తొలి టెస్టు మొదలైంది. మరారా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ దాటికి కంగారూల బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ రైటార్మ్ పేసర్ ఆరు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు.198 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అర్ధ శతకం (71) బాదడంతో ఈ మేర గౌరవప్రదమైన స్కోరు సాధ్యమైంది. అయితే, మ్యాచ్ మధ్యలో స్మిత్ వ్యవహరించిన తీరు ఓ అభిమానికి చిర్రెత్తించింది.ఆటకు అంతరాయంసెకండ్ సెషన్ వేళ సైట్ స్క్రీన్ (బ్యాటర్ ఎదురుగా ఉండే స్క్రీన్) సరిగ్గా లేదంటూ స్మిత్ పదే పదే ఆటకు అంతరాయం కలిగించాడు. స్క్రీన్‌ను సరిచేయాల్సిందిగా గ్రౌండ్ సహాయక సిబ్బందికి చెప్పాడు. ఈ క్రమంలో ఆట ఆలస్యమైంది.ఓవరాక్షన్ చేయకుఈ నేపథ్యంలో ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఓ అభిమాని.. ‘‘స్మడ్జ్ (స్మిత్ ముద్దుపేరు).. నువ్వు బంతిని బాదడంపై దృష్టి పెట్టు. ప్రత్యేకంగా ఏదో కావాలన్నట్లుగా ఓవరాక్షన్ చేయకు. నువ్వేమీ ఆట కంటే గొప్పోడికి కాదు స్టీవ్. ఆడి చూపించు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.చదవండి: ఆసీస్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్ View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
మాదే పైచేయి: టీమిండియాకు శ్రీలంక కెప్టెన్ వార్నింగ్
టెస్టు సిరీస్ నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. సాధారణంగా లంకలో స్పిన్నింగ్ వికెట్లు ఉంటాయని.. కానీ ఈసారి వర్షాల వల్ల పరిస్థితిలో కాస్త మార్పు ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య రెండు టెస్టులకు షెడ్యూల్ ఖరారైంది.పిచ్‌లు అంత పొడిగా ఉండవుగాలె వేదికగా ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో లంక సారథి ధనంజయ డి సిల్వ మీడియాతో మాట్లాడాడు. ‘‘సాధారణంగా శ్రీలంకలో టర్నింగ్ వికెట్లు ఉంటాయి. అయితే, ప్రస్తుతం వాతావరణం వేరుగా ఉంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిచ్‌లు అంత పొడిగా ఉండవు.ఆట స్వరూపాన్నే మార్చివేయగలరుఇక మా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. పిచ్‌లు కాస్త అనుకూలంగా ఉన్నా.. ఆట మొదలైన 2-3 రోజులు ఉపయోగకరంగా ఉంటాయి. ఆతర్వాత పిచ్ టర్న్ కావడం మొదలవుతుంది. స్పిన్నర్లే మా ప్రధాన ఆయుధం అయినప్పటికీ.. మా జట్టులో కొంతమంది నైపుణ్యాలున్న సీమర్లు కూడా ఉన్నారు.కివీస్, సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్లుఆట స్వరూపాన్నే వారు మార్చివేయగలరు’’ అని ధనంజయ డి సిల్వ గిల్ సేనకు హెచ్చరికలు జారీ చేశాడు. అదే విధంగా.. ‘‘ఇండియాలోనూ టర్నింగ్ వికెట్లు ఉంటాయి. అయితే, స్వదేశంలో టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో వైట్‌వాష్ అయింది.మాదే పైచేయి.. అతడే మా బలంఈ సిరీస్‌లలో వాళ్లు విఫలమైనప్పటికీ పూర్తిగా టర్నింగ్ వికెట్ల మీద పట్టు కోల్పోయారని కాదు. తిరిగి పుంజుకునేందుకు వాళ్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, గణాంకాల పరంగా చూస్తే మాదే పైచేయి. ముఖ్యంగా ఇరుజట్లలోనూ గాలెలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ప్రభాత్ జయసూర్య ఉన్నాడు.అతడి అనుభవం మాకు తప్పక ఉపయోగపడుతుంది. శ్రీలంకలో పర్యటిస్తున్న జట్ల బ్యాటర్లపై చాలా ఏళ్లుగా అతడు ఆధిపత్యం కనబరుస్తున్నాడు. ఈ స్పిన్ బౌలర్ మా ప్రధానం బలం.బుమ్రా లేకున్నా..ఇక టీమిండియా తమ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు కోల్పోయింది. వారికి అది అతిపెద్ద లోటు. అయితే, మిగతా బౌలర్లను ఎదుర్కొనేందుకు కూడా మేము బాగా హోంవర్క్ చేసి.. పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాము.ఏదేమైనా అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడటం అంత తేలిక కాదు. నాలుగు, ఐదో రోజు కూడా ఆట పూర్తిగా మారిపోతుంది. టీమిండియాను ఓడించడానికి గొప్ప అవకాశం మా ముందుంది. మేము ఇది సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది’’ అని ధనంజయ డి సిల్వ పేర్కొన్నాడు. కాగా 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డ మీద టెస్టు సిరీస్ ఆడుతోంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సహా జట్టులోని మెజారిటీ మంది ఆటగాళ్లకు లంకలో టెస్టులు ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. తొలి టెస్టుకు ముందు శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆరంభంలో పేసర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ప్రభావం చూపగలిగారు. కొలంబో వికెట్ పాతబడే కొద్ది బ్యాటర్లకు కాస్త అనుకూలించింది. చదవండి: ఆసీస్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్ -
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్
బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఇంతకు ముందు బంగ్లా బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఆరేసిన మహమూద్రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్- బంగ్లా మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత డార్విన్‌లోని మరారా స్టేడియం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. అనూహ్య రీతిలో 198 పరుగులకే ఆసీస్‌ను ఆలౌట్ చేసింది.ఆది నుంచే ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు బంగ్లా పేసర్ హసన్ మహమూద్. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (22), జేక్ వెదర్లాండ్ (23)లతో పాటు.. స్టీవ్ స్మిత్ (71) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9), మిచెల్ స్టార్క్ (1), నాథన్ లియాన్ (7) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.తొలి బంగ్లా బౌలర్గామొత్తంగా ఆసీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మహమూద్.. 17 ఓవర్లు బౌలింగ్ చేసి 55 పరుగులు ఇచ్చి.. ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డ మీద టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బంగ్లా బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు ఆస్ట్రేలియాలో ఓవరాల్‌గా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గానూ చరిత్రకెక్కాడు.ముఖాముఖి పోరులో హీరోగా..అదే విధంగా.. ఆసీస్- బంగ్లా టెస్టు మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా 26 ఏళ్ల మహమూద్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్ మాజీ పేసర్ జేసన్ గిల్లెస్పి పేరిట ఉండేది. 2003లో గిల్లెస్పి బంగ్లాదేశ్‌తో టెస్టులో 38 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా.. మహమూద్ తాజాగా అతడిని అధిగమించాడు.ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు1. మైకేల్ కాస్ప్రోవిక్ (ఆస్ట్రేలియా)- 2004లో శ్రీలంక మీద 7/392. హసన్ మహమూద్ (బంగ్లాదేశ్)- 2026లో ఆస్ట్రేలియా మీద 6/553. చమిందా వాస్ (శ్రీలంక)- 2004లో ఆస్ట్రేలియా మీద 5/314. గ్లెన్ మెగ్రాత్ (ఆస్ట్రేలియా)- 2004లో శ్రీలంక మీద 5/375. స్టువర్ట్ మెక్‌గిల్ (ఆస్ట్రేలియా)- 2003లో బంగ్లాదేశ్ మీద 5/65. చదవండి: వైభవ్ విషయంలో అది నేను అంగీకరించను: ఆసీస్ దిగ్గజంHasan Mahmud’s 6-Wicket Haul vs Australia | 1st Test 🔥🇧🇩 pic.twitter.com/5qaJN4qTss— Bangladesh Cricket (@BCBtigers) August 13, 2026 -
సర్ఫరాజ్ వద్దు.. అతడినే ఆడించండి: మాజీ క్రికెటర్
శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. ఇరుజట్ల మధ్య శనివారం (ఆగష్టు 15) తొలి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది.సుదీర్ఘ నిరీక్షణ తర్వాతముఖ్యంగా సాయి సుదర్శన్ స్థానంలో అనూహ్య రీతిలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉంటుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాగా దేశీ క్రికెట్లో సత్తా చాటిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.అదే ఏడాది చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్‌ను.. ఆ తర్వాత సెలక్టర్లు పక్కనపెట్టారు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌పై మరింతగా దృష్టి పెట్టిన ఈ ముంబైకర్.. భారీగా బరువు తగ్గాడు. దేశీ క్రికెట్లోనూ రాణించి టీమిండియా నుంచి పిలుపు కోసం ఓపికగా ఎదురుచూశాడు.తుదిజట్టులో కష్టమేసాయి సుదర్శన్ గాయపడటంతో ఎట్టకేలకు సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించి.. శ్రీలంకతో తలపడే జట్టులో సుదర్శన్ స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, తుదిజట్టులో అతడికి చోటు దక్కడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగానే ఉంది. సాయి సుదర్శన్ ఆడే మూడోస్థానానికి దేవదత్ పడిక్కల్ సిద్ధంగా ఉన్నాడు. దీంతో సర్ఫరాజ్ ఆరో స్థానం కోసం చూస్తుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ రూపంలో పోటీ ఉంది.సర్ఫరాజ్ వద్దు.. అతడినే ఆడించండిఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కిరణ్ మోరే కీలక వ్యాఖ్యలు చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్ కంటే ధ్రువ్ జురెల్‌కే తుదిజట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు.జురెల్ మంచి ఫీల్డర్ కూడా!.. సర్ఫరాజ్ రీప్లేస్మెంట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చాడు. కాబట్టి అవకాశాల కోసం అతడు ఎదురుచూడాల్సిందే’’ అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు. పరోక్షంగా సర్ఫరాజ్‌ను కాదని.. జురెల్నే ఆడించాలని సూచించాడు. కాగా జురెల్ కంటే సర్ఫరాజ్ గణాంకాలే మెరుగ్గా ఉన్నాయి. ఆరు మ్యాచ్‌లలో కలిపి సర్ఫరాజ్ 37 సగటుతో పరుగులు రాబట్టగా.. జురెల్ సగటు 34. అంతేకాదు గత ఐదు మ్యాచ్‌లలో జురెల్ బాగా ఇబ్బందిపడ్డాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్‌లోనూ జురెల్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 1, 17 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు.చదవండి: IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ -
తొలి టెస్టుకు వర్షం ముప్పు.. గాలే చేరుకున్న టీమిండియా
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆగస్టు 5న లంక గడ్డపై అడుగుపెట్టింది. ఆగస్టు 7 నుంచి మూడు రోజుల పాటు కొలంబో వేదికగా లంక ఎలెవెన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. వార్మప్ మ్యాచ్ ఇచ్చిన విజయం జోష్‌తో టీమిండియా తొలి టెస్టు ఆడేందుకు గాలేలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గాలే ఎయిర్‌పోర్టు నుంచి టీమిండియా ఆటగాళ్లు బయటికి వస్తున్న ఫొటోలను బీసీసీఐ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకుంది. జడేజా, పంత్, జైస్వాల్, సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్ సహా ఇతర ఆటగాళ్లు, కోచ్ గంభీర్ కనిపించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో గాలే స్టేడియం సమీపంలోని హోటల్‌కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి తీసుకోనున్న గిల్ సేన గురువారం ప్రాక్టీస్ చేయనుంది. శనివారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.దంచికొట్టిన వాన..అయితే గాలేలో వాతావరణం రెండు రోజుల నుంచి చల్లగానే ఉంది. సోమవారం నుంచి మేఘావృతమై ఉన్న గాలేలో మంగళవారం వాన దంచికొట్టింది. రాబోయే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ టెస్టు సిరీస్ రెండు జట్లకు కీలకమే. 2027లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌లో విజయం తప్పనిసరి. ఒక్క మ్యాచ్ రద్దయినా అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.కోహ్లి కెప్టెన్సీలో ఘన విజయంగాలేలో గతంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. 2017లో కోహ్లి కెప్టెన్సీలో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన టెస్టులో ఇన్నింగ్స్ 304 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (190), పుజారా (153) సెంచరీలతో చెలరేగారు. లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీ, అభినవ్ ముకుంద్ 81 పరుగులు చేయడంతో టీమిండియా 241 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో లంక ముంగిట 550 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచగా, భారత బౌలర్ల ధాటికి లంక 245 పరుగులకే కుప్పకూలింది. దీంతో గాలే టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. జడేజా ఒక్కడే..కాగా అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్న జడేజాకు మాత్రమే గాలేలో ఆడిన అనుభవముంది. పడిక్కల్, గుర్నూర్ బ్రార్, సారాంశ్ జైన్, అకిబ్ నబీలు ఇటీవలే ఇదే గాలే వేదికగా లంక-ఏ జట్టుతో అనధికారిక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టు శనివారం నుంచి జరగనుండగా, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనుంది.Colombo 🚌 Galle#TeamIndia have arrived for the #SLvIND Test series opener 🙌 pic.twitter.com/UXoo0gTzCv— BCCI (@BCCI) August 12, 2026Read: బంగ్లాను తేలిగ్గా తీసుకోం.. బలమైన జట్టుతోనే బరిలోకి! -
IND vs SL: టీమిండియా దిగ్గజ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే లంకకు చేరుకున్న టీమిండియాకు.. వార్మప్ మ్యాచ్‌తో కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరంఈ సిరీస్‌లో 2-0తో గెలిస్తేనే డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్ ఫైనల్ రేసులో టీమిండియా నిలవగలుగుతుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌లకు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యారు. గాయాల వల్ల ఈ ముగ్గురూ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయారు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కీలక సూచనలు చేశాడు. ఆటగాళ్లు గాయాల బెడద, టెస్టు క్రికెట్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తప్పక దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. ఈ మేరకు JITO ప్రీమియర్ లీగ్ ఆరంభం సందర్భంగా మాట్లాడుతూ..అదే అత్యంత ముఖ్యం‘‘ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడటం అత్యంత ముఖ్యం. ఇటీవలి కాలంలో భారత జట్లు స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడటం చూస్తున్నాం. ఇందుకు కారణం వారు దేశీ క్రికెట్ ఆడకపోవడమే.బీసీసీఐ ఈ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ప్రతి ఒక్క ఆటగాడు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడేలా చూడాలి. సీనియర్లను చూసి యువ ఆటగాళ్లు కూడా ఎంతో నేర్చుకుంటారు. వారితో కలిసి ఆడటం వల్ల యువ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.మనోళ్లు తేలిపోతున్నారుఇటీవల టీమిండియా ఎన్నో టీ20, వన్డే మ్యాచ్‌లు ఆడింది. అయితే, స్పిన్ బౌలింగ్‌లో మనోళ్లు అత్యుత్తమంగా రాణించలేకపోయారు. ఇక టెస్టు ఫార్మాట్ మరింత భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’’ అని కపిల్ దేవ్ టీమిండియాతో పాటు బీసీసీఐకి సూచించాడు. కాగా శ్రీలంకతో ఆగష్టు 15 నుంచి టీమిండియా తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. చదవండి: IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ -
బంగ్లాను తేలిగ్గా తీసుకోం.. బలమైన జట్టుతోనే బరిలోకి!
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. జట్టులో ప్రధాన బౌలర్లకు రెస్ట్ ఇస్తారని భావించినప్పటికీ, దానిని కొట్టిపారేస్తూ ఆసీస్ జట్టు బలమైన బౌలింగ్ లైనప్‌తో బరిలోకి దిగనుంది. పేస్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్‌లను తొలి టెస్టులో ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. తుది జట్టు ఖరారు కాకపోయినప్పటికీ జట్టులోని ప్రధాన బౌలర్లను కొనసాగించాలని చూస్తోంది. దీంతో డబ్ల్యూటీసీ పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ తమ స్థానాన్ని నిలుపుకోవాలంటే కష్టపడాల్సిందే. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దానిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. వచ్చే ఏడాదిలోగా ఆస్ట్రేలియా మరో 21 టెస్టులు ఆడనున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కమిన్స్, హాజిల్‌వుడ్ లేనప్పటికీ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చెలరేగిందంటే దానికి ప్రధాన కారణం స్కాట్ బోలండ్. ఫామ్‌లో ఉన్నప్పటికీ హాజిల్‌వుడ్ కోసం బోలండ్ను తప్పించాల్సిన పరిస్థితి క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎదురైంది. ఇక జట్టులో ఏకైక స్పిన్నర్‌గా నాథన్ లియోన్ కీలకం కానున్నాడు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న నాథన్ లియోన్ పునరాగమనం ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్‌ను మరింత బలంగా మార్చింది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లుగా జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్ రానుండగా, లబుషేన్, స్మిత్ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ ఆడనున్నారు. కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, బ్యూ వెబస్టర్లతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది.ఇక 2003 తర్వాత బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడనుంది. చివరిసారి తలపడినప్పుడు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. డార్విన్, కెయిర్న్స్ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ విజయాలతో బంగ్లాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, బో వెబ్‌స్టర్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హేజిల్వుడ్సిరీస్ షెడ్యూల్:మొదటి టెస్ట్: ఆగస్టు 13-17, డార్విన్రెండవ టెస్ట్: ఆగస్టు 22-26, మెకేRead: హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం! -
టెస్టుల్లో ఎవరికీ సాధ్యం కాలేదు.. జైస్వాల్ సరికొత్త ఫీట్
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో ఒక అరుదైన ఫీట్ సాధించాడు. బహుశా జైస్వాల్ సాధించిన ఫీట్ ఎవరికీ సాధ్యం కాలేదనుకుంటా. ఇప్పటివరకు జైస్వాల్ తన కెరీర్లో 29 టెస్టు మ్యాచ్‌లు ఆడితే అవన్నీ వివిధ వేదికల్లోనే ఆడడం విశేషం. మాములుగా ఒక ఆటగాడు వేర్వేరు వేదికల్లోనే మ్యాచ్‌లు ఆడినప్పటికీ, కొన్నిసార్లు ఒకే మైదానంలో మ్యాచ్‌లు ఆడడం చూస్తుంటాం.కానీ జైస్వాల్ విషయంలో మాత్రం లెక్క మారింది. అతడు ఆడిన 29 టెస్టులకు సంబంధించిన వేదికలు మళ్లీ రిపీట్ కాకపోవమే ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో జైస్వాల్ ఫీట్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘటనగా నిలిచిపోనుంది. ఇక శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్ ద్వారా అతను తన 30వ టెస్టు మ్యాచ్‌ను గాలే వేదికగా ఆడబోతున్నాడు. గాలేలో జైస్వాల్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడంతో, ఈ 30వ మ్యాచ్ ద్వారా కూడా అతని వేదికల వైవిధ్యం సజీవంగా కొనసాగనుంది. ఇక శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేయడం ద్వారా జైస్వాల్ టచ్‌లోకి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇప్పటివరకు జైస్వాల్ 29 టెస్టుల్లో 48.75 సగటుతో మొత్తం 2,535 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 214 పరుగులు కాగా, కెరీర్లో రెండు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు.2023లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్ అఫ్గానిస్థాన్‌తో చివరి టెస్టు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కూడా అవకాశాలు పొందినప్పటికీ, టెస్టుల్లో మాత్రం భారత జట్టుకు రెగ్యులర్ ఓపెనర్ గా మారాడు. ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి 19 వరకు తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరగనున్నాయి. మొత్తంగా ప్రపంచ క్రికెట్లో వరుసగా 30 మ్యాచ్‌లు వేర్వేరు స్టేడియాల్లో ఆడిన ఏకైక ఆటగాడిగా జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.చదవండి: ‘కెప్టెన్‌గా ఫెయిలైనా ఫిట్‌నెస్‌కు కొత్త అర్ధం చెప్పాడు’ -
గుర్నూర్... గేమ్ చేంజర్!
కోల్‌కతా: స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో... శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత కొత్త పేసర్ గుర్నూర్ బ్రార్ కీలకం అవుతాడని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డాడు. భారత్, శ్రీలంక మధ్య ఈ నెల 15 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దానికి ముందు జరిగిన ప్రాకీస్ట్ మ్యాచ్‌లో గుర్నూర్ తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బ్రార్... బుమ్రా అందుబాటులో లేకపోవడంతో లంకతో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లు ఓడిన టీమిండియా... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే లంకపై సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో మహరూఫ్ మాట్లాడుతూ... ‘బుమ్రా అద్భుతమైన బౌలర్. అతడు బంతిని రివర్స్ స్వింగ్ చేయగలడు. ముఖ్యంగా పాత బంతితో అయితే అతడు మరింత ప్రమాదకరం. కానీ గాయం కారణంగా అతడు ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. అది భారత జట్టుకు అతి పెద్ద లోటు. మొహమ్మద్ సిరాజ్ మంచి బౌలరే... కానీ బుమ్రాతో పోల్చుకుంటే మాత్రం ఇద్దరి మధ్య చాలా అంతరం ఉంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో గుర్నూర్ బ్రార్‌కు తుది జట్టులో చోటు దక్కుతుంది అనుకుంటున్నా. ఈ సిరీస్‌లో బ్రార్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ కావొచ్చు. అతడి బౌలింగ్‌లో మంచి వేగంతో పాటు అదనపు బౌన్స్ ఉంది. దానితో ఫలితాలు రాబట్టవచ్చు. అతడిలో పోరాట పటిమ ఉంది... అవసరమైతే దూకుడు ప్రదర్శించే స్వభావం గుర్నూర్ది’ అని వెల్లడించాడు. పంత్‌కు అరగంట చాలు.. ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకగా... వాషింగ్టన్ సుందర్ గాయంతో అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మానవ్ సుతార్‌ను మూడో స్పిన్నర్‌గా బరిలోకి దింపే అవకాశం ఉందని మహరూఫ్ అన్నాడు. ‘రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో పాటు మూడో స్పిన్నర్‌గా మానవ్ సుతార్‌కు అవకాశం దక్కొచ్చు. గాలె పిచ్ కుల్దీప్కు బాగా అనుకూలిస్తుంది. ఇక్కడి పిచ్‌లు కేవలం స్పిన్ మాత్రమే కావు... కాస్త బౌన్స్ కూడా అవుతాయి. ఈ నేపథ్యంలో మానవ్‌కు ఈ తరహా పిచ్ బాగా ఉపయోగపడుతుంది. రెండు జట్లు కూడా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగొచ్చు. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో లంక జట్టు జాగ్రత్తగా ఉండాలి. అతడు అరగంటలో ఆట స్వరూపాన్ని మార్చేయగలడు. గతంలో అతడి బ్యాట్ నుంచి అలాంటి ఎన్నో ప్రదర్శనలు వచ్చాయి. స్పిన్‌ను మెరుగ్గా ఎదుర్కొన్న వారే సిరీస్‌లో విజేతగా నిలుస్తారు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య నుంచి టీమిండియా బ్యాటర్లకు ఇబ్బందులు ఎదురవొచ్చు. నా అంచనా ప్రకారం రెండు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో ‘డ్రా’ అవుతుంది’ అని మహరూఫ్ వివరించాడు. బాడీలైన్ బౌలింగ్...శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన పేస్‌తో ఆకట్టుకున్న గుర్నూర్... తుది జట్టులో మంచి వైవిధ్యం తీసుకొస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గుర్నూర్ కొన్నిసార్లు బాడీలైన్ బౌలింగ్ కూడా చేశాడని మహరూఫ్ గుర్తు చేశాడు. ‘మీరు ప్రాక్టీస్ మ్యాచ్‌ను సరిగ్గా గమనిస్తే... బ్రార్ విభిన్న బంతులు వేశాడు. అవసరమైన సమయంలో ప్రత్యర్థుల శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని కూడా బంతులు విసిరాడు. నేను భారత జట్టు సహాయక బృందంలో ఉంటే అతడికి తప్పక అవకాశం కల్పించే దిశగా ప్రయత్నించేవాడిని. అతడు కేవలం పరిమిత ఓవర్లలోనే ఆడాడని నాక్కూడా తెలుసు.అయితే సుదీర్ఘ ఫార్మాట్‌కు అవసరమైన నైపుణ్యం బ్రార్‌లో మెండుగా ఉంది. బ్యాటర్ లయను దెబ్బతీయాల్సిన సందర్భాల్లో అతడు వేసే చిన్నపాటి స్పెల్స్ అత్యంత ప్రమాదకర ఆయుధాలుగా మారవచ్చు’ అని మహరూఫ్ అన్నాడు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌పై వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రార్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 6 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్‌కు ఐపీఎల్లో పెద్దగా అనుభవం లేకపోయినా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. గత నెలలో భారత ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక ‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో గుర్నూర్ 10 వికెట్లు పడగొట్టాడు. -
అతడు లేకపోవడం టీమిండియాకు లోటు: శ్రీలంక మాజీ స్టార్
శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. కాగా భారత జట్టు శ్రీలంక గడ్డపై 2017 తర్వాత టెస్టు సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ లేనిలోటు టీమిండియాకు తప్పక కనిపిస్తుందన్నాడు. IANSతో మాట్లాడుతూ..అశూ లేకపోవడం అతిపెద్ద లోటు‘‘ఈసారి టీమిండియా అశ్విన్‌ను బాగా మిస్సవుతుంది. శ్రీలంక గడ్డ మీద అతడు గతంలో అద్భుతంగా రాణించాడు. ఇక్కడి టర్నింగ్ పిచ్‌లు అతడికి స్వర్గధామం. శ్రీలంక పిచ్ పరిస్థితులకు అశూ సరైన బౌలర్’’ అని ఫర్వేజ్ మహరూఫ్ పేర్కొన్నాడు.కాగా 2015, 2017లో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్‌లలో టీమిండియా గెలుపులో అశ్విన్‌దే కీలక పాత్ర. ఆరు మ్యాచ్‌లలో కలిపి అతడు 38 వికెట్లు కూల్చాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేకాదు బ్యాట్‌తోనూ అశూ దుమ్ములేపాడు. రెండు అర్థ శతకాలతో సత్తా చాటాడు.అదరగొడుతున్న సుతార్ ఇదిలా ఉంటే.. శ్రీలంక పర్యటనకు వెళ్లిన తాజా భారత జట్టులో ప్రస్తుతం నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో పాటు యువ స్పిన్నర్ మానవ్ సుతార్, వెటరన్ ఆటగాడు సారాంశ్ జైన్ కూడా ఉన్నారు. మానవ్ ఇప్పటికే అరంగేట్రం చేయగా.. సారాంశ్ టీమిండియాకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.నాకు అవకాశం ఉంటే గనుక..ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి కూడా ఫర్వేజ్ మహరూఫ్ స్పందించాడు. ‘‘కొన్ని నెలల క్రితం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే రాణించాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లోనూ బంతి, బ్యాట్‌తో సత్తా చాటాడు.అయితే, తుదిజట్టులో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్‌కు కూడా చోటిస్తారా? అనేదే ప్రస్తుత ప్రశ్న. కుల్దీప్ యాదవ్ ఎలాగో తుదిజట్టులో ఉంటాడు. ఇక సారాంశ్ జైన్ ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే, అతడు డీసెంట్ బౌలర్. నాకే గనుక అవకాశం ఉంటే.. గాలె టెస్టుకు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్‌లను ఎంపిక చేస్తాను’’ అని ఫర్వేజ్ మహరూఫ్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో సిరీస్ టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో ఫైనల్ రేసులో ఉండాలంటే లంకను భారత్ 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే.చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్‌గా SRH మాజీ ప్లేయర్ -
లంకతో తొలి టెస్టుకు భారత జట్టు.. తెరపైకి ఊహించని పేరు!
భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు కల్పించిన కైఫ్.. ధ్రువ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది కూడా స్పష్టంగా వివరించాడు. ధ్రువ్ జురెల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఆడగలడని, గాలే పిచ్ పరిస్థితులకు సర్ఫరాజ్ బ్యాటింగ్ శైలి సరిగ్గా నప్పుతుందని పేర్కొన్నాడు. "ట్రెండ్‌ను ఫాలో అవుతూ ప్రస్తుతం ఉన్న జట్టులో జురెల్‌కు అవకాశం కల్పిస్తారేమో. అతడు నిలకడ ప్రదర్శన చేయనప్పటికీ, ఇప్పటికే జురెల్ జట్టులో భాగమని భావిస్తే మాత్రం సర్ఫరాజ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే. కానీ నా దృష్టిలో మాత్రం ఐదు లేదా ఆరో స్థానంలో స్పిన్‌ను సమర్థంగా ఆడగల సత్తా సర్ఫరాజ్ ఖాన్‌కు ఉందని అనుకుంటున్నా. సుదీర్ఘంగా సాగే టెస్టు ఫార్మాట్లో పిచ్ పరిస్థితులు అర్ధమయ్యేకొద్దీ సర్ఫరాజ్ రకరకాల షాట్లు ఆడుతూ తన శైలి బ్యాటింగ్ కొనసాగించగలడు. ముఖ్యంగా ఉపఖండపు పిచ్‌ల్లో టెస్టుల్లో నాలుగు లేదా ఐదో రోజు వచ్చేసరికి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. ఈ సమయంలో బ్యాటింగ్ కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు బాగా ఉపయోగపడగలడు. అతనికి స్వీప్‌లు, రివర్స్ స్వీప్‌లు, ఎక్స్ట్రా కవర్స్, బ్యాక్‌ఫుట్ ఇలా ఏ షాటైనా స్పిన్ బౌలింగ్‌లో ఆడగలడు. ఇక జురెల్ ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో జురెల్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 18 పరుగులు మాత్రమే చేశాడు. దీన్నిబట్టి ఇటీవలి అతడి టెస్టు రికార్డు, ఫామ్ అంత గొప్పగా లేవనిపిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.ధ్రువ్ జురెల్ ఇప్పటివరకు 10 టెస్టులాడి 478 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. మరోవైపు 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఆరు టెస్టుల్లో 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలున్నాయి. శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.కైఫ్ ప్లేయింగ్ ఎలెవెన్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్/ సారాంశ్ జైన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. -
‘సంగక్కర బూతులు తిట్టాడు’
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. 2005 నాటి ఢిల్లీ టెస్టు సందర్భంగా సంగక్కర బూతులు తిట్టాడని.. తాను కూడా అందుకు గట్టిగానే బదులిచ్చానని తెలిపాడు.కాగా 2005లో మూడు టెస్టులు ఆడేందుకు శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా చెన్నైలో తొలి మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.సెంచరీ మిస్ఓపెనర్ గౌతం గంభీర్‌కు జోడీగా బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ను పంపింది. అయితే, గంభీర్ మూడు పరుగులకే నిష్క్రమించగా.. ఊహించని రీతిలో ఇర్ఫాన్ పఠాన్ 93 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇర్ఫాన్ ఇన్నింగ్స్ కారణంగా భారత్ మెరుగైన స్కోరు సాధించింది. ఆ తర్వాత లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి జయభేరి మోగించింది.మురళీధరన్ బౌలింగ్‌లో సిక్సర్లునాటి సంగతులను ఇర్ఫాన్ పఠాన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. చీకీ సింగిల్స్‌లో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో టెస్టు మ్యాచ్. రెండో ఇన్నింగ్స్‌లో నేను ఓపెనర్‌గా వచ్చి 93 పరుగులు చేశాను. అపుడు శ్రీలంక ఆటగాళ్లు ఎందుకో అసంతృప్తిగా కనిపించారు.సంగక్కర బూతులు తిట్టాడుముఖ్యంగా సంగక్కర కోపంగా ఉన్నాడు. నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్లినపుడు అసలేం జరిగిందో తెలియలేదు. ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో నేను రెండు సిక్సర్లు బాదాను. కొత్త బంతిని ఎదుర్కొంటూ మురళీధరన్ బౌలింగ్‌లో షాట్లు కొట్టగానే వారి ముఖాలు మారిపోయాయి.దీనర్థం మేము వారి ప్రణాళికలను ఛిన్నాభిన్నం చేశాము. ఆ వెంటనే సంగక్కర.. ‘మీరు మోసగాళ్లు. మీ తల్లిదండ్రులు మీకు ఏం నేర్పారు?’ అంటూ బూతులు అందుకున్నాడు. వ్యక్తిగతంగానూ నన్ను మాటలు అన్నాడు. నేనూ ఊరుకోకుండా.. తిరిగి అతడిని తిట్టాడు. ఏదేమైనా ముందైతే అతడు మొదలుపెట్టాడు.మంచి స్నేహితులమయ్యాముఆ తర్వాత మేము ఐపీఎల్లో పంజాబ్‌కు కలిసి ఆడాల్సి వచ్చింది. ఇద్దరి కుటుంబాలు కలిసి కూర్చుని తినాల్సిన పరిస్థితి. అప్పుడు నేను సంగక్కర దగ్గరికి వెళ్లి సారీ చెప్పాను. అతడు కూడా క్షమాపణ కోరాడు.అప్పటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాము. మ్యాచ్ సమయంలో మా భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆరోజు అలా తిట్టుకున్నాము. మనుషులు పొరపాట్లు చేయడం సహజం. అయితే, పరిణతితో వాటిని ఎలా సరిదిద్దుకున్నామనేదే ముఖ్యం’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. కాగా ఆనాటి మూడో టెస్టులోనూ శ్రీలంకపై గెలిచి టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. చదవండి: చరిత్ర సృష్టించనున్న టీమిండియా -
జట్టుకు దూరమైన సర్ఫరాజ్ ఖాన్
ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మేజర్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2026 సీజన్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ జట్టును వీడాడు.కాగా దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్క్లాస్క్రికెట్లో ఇప్పటికే ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగపెట్టాడు.2024లో చివరిగా టీమిండియా తరఫునఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 371 పరుగులు సాధించాడు. అయితే, అదే ఏడాది చివరగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు తర్వాత అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సర్పరాజ్ ఖాన్.. భారీగా బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు.సాయి సుదర్శన్ స్థానంలోదేశీ క్రికెట్లోనూ మరోసారి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్ల నుంచి సర్ఫరాజ్‌కు పిలుపు రాలేదు. అయితే, శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోకపోవడం అతడి పాలిట వరంగా మారింది. దీంతో తాజాగా సాయి స్థానాన్ని సర్ఫరాజ్‌తో భర్తీ చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియాతో చేరేందుకు సర్ఫరాజ్ ఖాన్ శ్రీలంకకు పయనమయ్యాడు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ జట్టుకు అతడు దూరం కాగా.. సెలక్టర్లు జై గోహిల్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయం గురించి వెస్ట్ జోన్, ముంబై చీఫ్ సెలక్టర్ రాజేశ్ పవార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. జై గోహిల్‌కు అవకాశం‘‘సర్ఫరాజ్ స్థానంలో గోహిల్‌ను ఎంపిక చేశాము. నిజానికి అతడు స్టాండ్ బై ప్లేయర్‌గా ఉండేవాడు. ఇప్పుడు ప్రధాన జట్టులోకి తీసుకున్నాము. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు’’ అని రాజేశ్ పవార్ పేర్కన్నాడు.కాగా వెస్ట్ జోన్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాగా.. షామ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆగష్టు 23 నుంచి సెప్టెంబరు 10 వరకు దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు.. టీమిండియా- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.దులిప్ ట్రోఫీ 2026 సీజన్‌కు వెస్ట్ జోన్ జట్టు (అప్డేటెడ్)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షామ్స్ ములాని (వైస్ కెప్టెన్), హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), జైమీద్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్దార్థ్ దేశాయ్, జై గోహిల్, ముషీర్ ఖాన్, అతీత్ షేత్, ముకుశ్ చౌదరి, తనుశ్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే.చదవండి: నా కాబోయే భర్త అలా ఉండాలి: సారా టెండుల్కర్ -
స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్ యాదవ్‌కు నో ఛాన్స్?!
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ను భారత జట్టు సద్వినియోగం చేసుకుంది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ఈ నేపథ్యంలో గాలె వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో పాల్గొనే భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా శ్రీలంకలోనూ టర్నింగ్ పిచ్‌లు ఉంటాయి.అదరగొట్టిన జడ్డూ, మానవ్ఇక వార్మప్ మ్యాచ్‌లో స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ అద్భుతంగా రాణించారు. లంక తొలి ఇన్నింగ్స్‌లో చెరో రెండు వికెట్లు తీసిన వీరిద్దరు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. మానవ్ 41 పరుగులు సాధించాడు.తేలిపోయిన సారాంశ్ఇక లంక రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ రెండు వికెట్లు తీయగా.. మానవ్ పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయలేకపోయాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జడ్డూ 22 పరుగులు, మానవ్ 4 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. అయితే, ఈ మ్యాచ్‌లో మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ వికెట్లు తీయలేకపోయాడు. పెద్దగా పరుగులు కూడా రాబట్టలేకపోయాడు.మరోవైపు.. లంక తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బౌలింగ్‌కు రాలేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు తుదిజట్టులో ఈ నలుగురిలో ఎవరికి అవకాశం వస్తుందన్న అంశంపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులె స్పందించాడు.కుల్దీప్‌నకు నో ఛాన్స్?!‘‘గాలెకు చేరుకుని పిచ్‌ను పరిశీలించిన తర్వాతే తుదిజట్టుపై నిర్ణయం జరుగుతుంది. అయితే, మా జట్టులోని నలుగురు స్పిన్నర్లు ఎవరికి వారే ప్రత్యేకం. జడ్డూ అనుభవజ్ఞుడు. మానవ్ సుతార్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు.ఇక సారాంశ్ జైన్ దేశీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టుకు ఎల్లప్పుడూ మణికట్టు స్పిన్నర్ అవసరం ఉంటుంది. మా నలుగురు స్పిన్నర్లు వైవిధ్యమైన బౌలర్లు. అయితే, పరిస్థితులకు తగ్గట్లే గాలెలో నిర్ణయం తీసుకుంటాం’’ అని సాయిరాజ్ బహుతులె తెలిపాడు.అందుకే బౌలింగ్ చేయలేదుఅదే విధంగా.. వార్మప్ మ్యాచ్‌లో లంక రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయకపోవడంపై సాయిరాజ్ వివరణ ఇచ్చాడు. ‘‘అతడు మెరుగ్గా ఆడాడు. వికెట్లు తీశాడు. అయితే, తనే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. మిగిలిన వారికి కూడా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భావించాడు. కుల్దీప్ దాదాపు 20 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. కాబట్టి రెస్ట్ తీసుకున్నాడు’’ అని సాయిరాజ్ తెలిపాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానుండగా.. ఇందుకు గాలె వేదిక.శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే! -
బాడీ షేమింగ్ ట్రోల్స్.. కట్‌చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ!
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో అవకాశం కల్పించింది. అయితే రెండేళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ తన ఎంపికపై తొలిసారి స్పందించాడు. తన బాడీషేమింగ్‌పై వచ్చిన ట్రోల్స్‌ను చాలెంజ్‌గా తీసుకున్న సర్ఫరాజ్ ఖాన్ సీరియస్ వర్కౌట్స్ చేసి బరువు తగ్గిన కొత్త ఫొటోలను పంచుకున్నాడు. తొలి ఫోటోలో తనను జట్టులోకి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా షేక్ హ్యాండ్ ఇస్తున్న ఎమోజీతో పాటు లవ్ ఇండియా సింబల్‌ను ట్యాగ్ చేశాడు. ఇక రెండో ఫొటోలో తన తండ్రి నౌషద్ ఖాన్‌తో కలిసి ఉన్న క్లిప్‌ను పంచుకున్నాడు. స్వతహాగా క్రికెట్ కోచ్ అయిన నౌషద్ ఖాన్ భారత్ తరఫున తన కుమారుడి అంతర్జాతీయ అరంగేట్రం కోసం చాలానే కష్టపడ్డాడు. 2024లో తన కుమారుడు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంలో నౌషద్ ఖాన్ హర్షం వ్యక్తం చేసిన ఫొటోలు అప్పట్లో వైరలయ్యాయి. తండ్రి పర్యవేక్షణలో..అంతేకాదు ఫామ్‌లేమి, ఫిట్నెస్ సమస్యలతో జట్టులో చోటు కోల్పోయి ఇబ్బంది పడుతున్న కొడుకుకు అండగా నిలిచి, అతడు బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో గాయపడ్డ సాయి సుదర్శన్ స్థానంలో జట్టుకు ఎంపిక కావడంతో సర్ఫరాజ్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. కాగా తండ్రితో కలిసి దిగిన ఫొటోకు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 13 గంటల్లోనే 169 లక్షల వ్యూస్ రావడం విశేషం.2024లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అనూహ్యంగా చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ ఆ సిరీస్‌లో 371 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. సూపర్ ఫామ్‌తో న్యూజీలాండ్‌తో సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. అయితే తొలి మ్యాచ్‌లో 150 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఆ తర్వాత వరుసగా 11, 9, 0, 1.. విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు.జురెల్, పడిక్కల్‌తో పోటీఇదే సమయంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ ఇవ్వడం, ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ రాణించడంతో సర్ఫరాజ్ ఖాన్ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే తాజాగా సాయి సుదర్శన్ గాయంతో లంకతో సిరీస్‌కు దూరమవ్వడంతో అతడి స్థానంలో సర్ఫరాజ్ జట్టులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్ ఇప్పటికే జట్టులో ఉండడంతో లంకతో తొలి టెస్టుకు సర్ఫరాజ్‌కు అవకాశం రావడం కష్టమే.2024లో టీమిండియాలో చోటు కోల్పోయిన సర్ఫరాజ్ తొలుత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. కఠిన శిక్షణతో బరువు తగ్గిన సర్ఫరాజ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఆ తర్వాత 2025-26 రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఒక డబుల్ సెంచరీ సాయంతో 429 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతోనే సర్ఫరాజ్.. ఆరో స్థానం కోసం ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌తో పోటీ పడుతున్నాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పడిక్కల్ తొలి టెస్టులో ఆడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక లంకతో తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.Sarfaraz Khan in India kit with his Father. Deserved comeback 🤝. pic.twitter.com/asooA1XJxY— CricketGully (@thecricketgully) August 10, 2026SARFARAZ KHAN ON THE WAY TO SRI LANKA 🔥 [Sahil Malhotra] - All the best, Sarfaraz Khan. pic.twitter.com/dBp2cQ2RC7— Johns. (@CricCrazyJohns) August 9, 2026 Sarfaraz Khan’s special words for his son after being picked once again for the Indian Test team.🇮🇳❤️ pic.twitter.com/VogFjGFOZ4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 10, 2026Read: భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్! -
మరోసారి దొరికిపోయిన జైస్వాల్.. లోపం ఎక్కడుంది?
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కొలంబో వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో లంక బౌలర్ విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో.. దిలుమ్ సుదీరకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో జైసూ వైఫల్యం మరోసారి బయటపడింది. తన టెస్టు కెరీర్లో జైస్వాల్ ఇప్పటి వరకు 29 టెస్టులు ఆడి 2535 పరుగులు సాధించి మంచి రికార్డు కలిగి ఉన్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి.కేవలం 200 పరుగులుఅయితే, ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో జైస్వాల్ ముందు నుంచే ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్లో లెఫ్టార్మ్ సీమర్ల బౌలింగ్‌లో జైసూ కేవలం 200 పరుగులు చేసి.. తొమ్మిది సందర్భాల్లో అవుటయ్యాడు. సగటు 22.2గా ఉంది. రైటార్మ్ సీమర్ల బౌలింగ్‌లో మాత్రం జైసూ సగటున 42 పరుగులతో ఏకంగా 1184 పరుగులు రాబట్టాడు.నిజానికి లెఫ్టార్మ్ పేసర్ల యాంగిల్ కారణంగా రైటార్మ్ బ్యాటర్లు ఇబ్బంది పడతారు. కానీ లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూ ఇలా వీరి బౌలింగ్‌లో ఇబ్బంది పడటం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే అని విశ్లేషకులు అంటున్నారు.వారి బౌలింగ్‌లో మరీ కష్టంకాగా లెఫ్టార్మ్ సీమర్లలో ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జైసూ 133 పరుగులు చేసి.. మూడు సార్లు అవుటయ్యాడు. సగటు 44.3. అయితే, సౌతాఫ్రికా స్టార్లు మార్కో యాన్సన్, నండ్రీ బర్గర్ మాత్రం జైసూను మరింత ఇబ్బంది పెట్టారు. యాన్సెన్ బౌలింగ్‌లో జైసూ 42 పరుగులు చేసి మూడుసార్లు అవుట్ కాగా.. బర్గర్ బౌలింగ్‌లో కేవలం 21 పరుగులే చేసి మూడుసార్లు పెవిలియన్ చేరాడు.కేవలం టెస్టుల్లోనే కాదు టీ20 ఫార్మాట్లోనూ జైస్వాల్ లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పటికి వారి బౌలింగ్‌లో 135 పరుగులు చేసి ఐదుసార్లు అవుటయ్యాడు. నెట్స్‌లో గంట ప్రాక్టీస్కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూకు లెఫ్టార్మ్ పేసర్ వేసే బంతి భిన్నమైన కోణంలో వస్తుంది. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన మూమెంట్ మీదే అతడు ఎలాంటి షాట్ ఆడాలన్న నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జైస్వాల్ మరోసారి లెప్టార్మ్ పేసర్ చేతికి దొరికిపోయి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో డకౌట్ అయిన వెంటనే నెట్స్‌లో తిరిగి ప్రాక్టీస్‌కు వెళ్లిన 24 ఏళ్ల జైస్వాల్.. గంటపాటు అక్కడే శ్రమించినట్లు తెలుస్తోంది.చదవండి: పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు -
పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుకు టీమిండియా ధీటుగా బదులిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ, గుర్నూర్ బ్రార్ మెరుపుల కారణంగా మంచి స్కోరు సాధించింది.శ్రీలంక 363 డిక్లేర్డ్శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా.. శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబోలో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ఫలితంగా శ్రీలంక క్రికెట్ ఎలెవన్.. తొలిరోజు ఆటలో ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగులు సాధించింది. ఇక శనివారం నాటి రెండో రోజు ఆటలో ఓవర్‌నైట్ స్కోరు వద్దనే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.జైసూ, పంత్, జురెల్ విఫలం ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) పూర్తిగా విఫలమయ్యారు.ఇలాంటి తరుణంలో నాలుగో స్థానంలో వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు.. మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ తోడయ్యాడు. జడ్డూ 117 బంతుల్లో 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరగా.. మానవ్ 90 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అయితే, అసంక మనోజ్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా మానవ్ వెనుదిరిగాడు.గుర్నూర్ బ్రార్ మెరుపులు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి 15 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ 22 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. గుర్నూర్ బ్రార్ మెరుపులు మెరిపించాడు.వరుస విరామాల్లో ఆటగాళ్లు పెవిలియన్ చేరిన తర్వాత పడిక్కల్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. 103 పరుగులతో తిరిగి బ్యాటింగ్ మొదలుపెట్టిన పడిక్కల్.. ఆట ముగిసేసరికి మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు ఉన్నాయి.ఆరు పరుగుల తేడాఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. పడిక్కల్ 142 పరుగులతో ఉండగా.. బ్రార్ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ కంటే కేవలం ఆరు పరుగులు వెనుకబడి ఉంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఆదివారం చివరి రోజు. చదవండి: ద్రవిడ్ వద్దన్నాడు.. యువీ ఉంటే కథ వేరుగా ఉండేది -
IND vs SL: పంత్, జురెల్ ఫెయిల్.. జడ్డూ ఫిఫ్టీ
శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ విఫలమయ్యారు. ఈ ఇద్దరు వికెట్ కీపర్లు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో పంత్, జురెల్ ఆట తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లలో తలపడేందుకు అక్కడికి వెళ్లింది. గాలె, కొలంబో వేదికలుగా ఆగష్టు 15 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇందుకు సన్నాహకంగా టీమిండియా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది.కొలంబో వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్లు నిశాన్ మధుష్క (66), రవిందు రశాంత (71), కెప్టెన్ సోనాల్ దినుష (52) అర్ధ శతకాలతో రాణించారు.జైసూ డకౌట్.. పడిక్కల్ శతకంఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుత శతకం (121 బంతుల్లో 103) సాధించాడు. ఆ వెంటనే రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.పంత్, జురెల్ విఫలంఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చీ రాగానే వెనుదిరిగాడు. రమేశ్ మెండిస్ బౌలింగ్‌లో అనవసరపు షాట్‌కు ప్రయత్నించి.. నిశాన్ మధుష్కకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఐదు బంతులు ఎదుర్కొన్న పంత్.. కేవలం రెండు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సైతం తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. దీంతో పంత్, జురెల్ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జడేజా అర్ధ శతకం పూర్తిఇదిలా ఉంటే.. తొలి రోజు ఆటలో భాగంగా రెండు వికెట్లు తీసిన స్పిన్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. 88 బంతుల్లో జడ్డూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 55 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఎలెవన్ కంటే మరో 154 పరుగులు వెనుకబడి ఉంది. మానవ్ సుతార్ ఏడు పరుగులతో ఉన్నాడు.చదవండి: విండీస్‌కు భారీ షాక్.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అప్గాన్ అర్హత -
IND vs SL: శ్రీలంక గడ్డపై శతక్కొట్టిన పడిక్కల్
శ్రీలంక ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో మెరిశాడు. కొలంబోలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా 121 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. రెండో రోజు ఆట సందర్భంగా 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జైసూ డకౌట్అనంతరం భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే, కేశారా నువాంత బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.అయితే, వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం సెంచరీతో దుమ్ములేపాడు. 61 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరో 60 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్.. 103 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. ఇక పడిక్కల్ స్థానంలో.. రవీంద్ర జడేజాకు తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. పంత్ విఫలంఅయితే, పంత్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. 42 ఓవర్ల ఆట ముగిసేసరికి జడ్డూ 23 పరుగులతో ఉండగా.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు.చదవండి: మూడేళ్లుగా తిరుగుతున్నా.. సాయం చేయండి సీఎం గారూ: పంత్ -
అతడికి అసలైన పరీక్ష ఇక్కడే: శ్రీలంక మాజీ క్రికెటర్
శ్రీలంక మాజీ క్రికెటర్ హషాన్ తిలకరత్నె టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతమని కొనియాడాడు. అయితే, శ్రీలంక గడ్డపై మాత్రం అతడికి కఠిన సవాలు తప్పదని పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. 2017 తర్వాత లంక గడ్డ మీద భారత్ టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో శుబ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆరు శతకాలుటెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి ఏకంగా ఆరు శతకాలు బాదాడు. సగటు 82కు పైగా ఉండటం విశేషం. ఇంగ్లండ్‌లో అత్యుత్తమంగా రాణించాడు.అయితే, శ్రీలంకలో గిల్ రెడ్‌బాల్ మ్యాచ్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో లంక మాజీ బ్యాటర్ హషాన్ తిలకరత్నె రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘గిల్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడే అసలైన పరీక్షబ్యాటింగ్ పిచ్‌ల మీద అందమైన షాట్లు ఆడటం అతడికే చెల్లింది. అయితే, శ్రీలంకలో టర్నింగ్ పిచ్‌ల మీద అతడు ఎలా ఆడతాడన్నదే ఇప్పుడు ఆసక్తికర విషయం. ఈ సిరీస్ అతడికి నిజమైన పరీక్ష. ఇక్కడ అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది. శ్రీలంక వికెట్ల మీద గిల్ ఎలా ఆడతాడో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి వేలికి గాయమైంది. ఇందుకు సంబందించి బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక గాయం కారణంగా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం మొదలైన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌కు గిల్ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో సీనియర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. కాగా భారత్-శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.చదవండి: భారత్ తోమ్యాచ్.. వన్డే తరహాలో లంక ఓపెనర్ దూకుడు -
అతడి సెలక్షన్ దారుణం.. ఇప్పటికైనా సంతోషమే!
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ విషయంలో సెలక్టర్ల తీరు సరిగా లేదని విమర్శించాడు. కాగా రంజీ ట్రోఫీ టోర్నీలో గత రెండేళ్లుగా ఆకిబ్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.గత రెండు సీజన్లలో ఏకంగా వందకు పైగా వికెట్లు తీసిన ఆకిబ్ నబీ.. జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో ఇటీవల జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు.అపుడు మొండిచేయికానీ టీమిండియా సెలక్టర్లు మాత్రం నబీకి మొండిచేయి చూపారు. సీనియర్ల గైర్హాజరీలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అయితే, వీళ్లిద్దరికి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాకపోయినా.. ఆ తర్వాత ఇద్దరూ వైట్‌బాల్ క్రికెట్లో అరంగేట్రం చేశారు.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోనూ ఆకిబ్ నబీకి తొలుత స్థానం దక్కలేదు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఎట్టకేలకు నబీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీని ఎంపిక చేశారు.అతడి సెలక్షన్ దారుణం.. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ నబీ విషయంలో సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ‘‘నిజంగా ఇదొక గొప్ప విషయం. నాకు చాలా సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడిన తర్వాత ఎట్టకేలకు ఆకిబ్ నబీకి జాతీయ జట్టులో చోటు దక్కింది.ఇప్పటికైనా సంతోషమే!అయితే, అతడు రీప్లేస్మెంట్లా కాకుండా ముందుగానే జట్టులోకి రావాల్సింది. అయినా ఎప్పటికీ ఎంపిక చేయకపోవడం కంటే.. ఆలస్యంగానైనా పిలుపునివ్వడం మంచిదే. ఏదేమైనా శ్రీలంకకు ఎంపిక చేసిన జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉండేందుకు అతడు అర్హుడు. కానీ ఆలస్యమైనా అతడికి మంచే జరిగింది’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు.కాగా నబీ ఇటీవల శ్రీలంక-ఎ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్-ఎ తరఫున ఆరు వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
గిల్‌కు గాయం.. బీసీసీఐ అధికారిక ప్రకటన
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. కాగా గిల్ ఇటీవల తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా కండరాల నొప్పితో గిల్ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న గిల్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యాడు. అతడి సారథ్యంలో టీమిండియా లంకతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.ఫైనల్ రేసులో ఉండాలంటే గాలె, కొలంబో వేదికలుగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకను 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే.గిల్‌కు గాయంకాగా టీమిండియా శ్రీలంక గడ్డ మీద చివరగా 2017లో టెస్టు సిరీస్ ఆడింది. ఈ నేపథ్యంలో స్థానిక పిచ్ పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో టీమిండియా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. అయితే, గురువారం నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి వేలికి గాయమైంది.ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి పరిశీలించి బాండ్‌ఎయిడ్ వేయగా.. గిల్ తిరిగి బ్యాటింగ్ చేశాడు. అయితే, శ్రీలంక ఎలెవన్‌తో టాస్ సందర్భంగా గిల్ మైదానంలోకి రాలేదు. అతడికి బదులు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్కు వచ్చాడు.బీసీసీఐ అధికారిక ప్రకటనఈ నేపథ్యంలో బీసీసీఐ గిల్ గాయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయపడ్డాడు. గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి ఉంగరం వేలుకు గాయమైంది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్‌తో వామప్ మ్యాచ్‌లో తొలిరోజు గిల్ మైదానంలోకి రాడు. బీసీసీఐ వైద్యబృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గిల్ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో కేఎల్ జట్టును ముందుకు నడిపిస్తాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్
టీమిండియా కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సీజన్లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, అంతకంటే ముందు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీలంక ఎలెవన్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా ఆతిథ్య శ్రీలంకను 2-0 తేడాతో వైట్‌వాష్ చేయాల్సిందే. ఇక ఈ సిరీస్ కంటే ముందు డబ్ల్యూటీసీలో భాగంగా సౌతాఫ్రికాతో స్వదేశంలో రెండు టెస్టులు ఆడిన గిల్ సేన.. ప్రొటిస్ జట్టు చేతిలో దాదాపు పాతికేళ్ల తర్వాత 2-0తో క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే.దీంతో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇటీవల గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా వరుస టీ20 సిరీస్‌లలో వైట్‌వాష్‌లు ఎదుర్కొంది. ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్‌కు శ్రీలంక టెస్టు సిరీస్ అగ్నిపరీక్షగా నిలిచింది.ఈ నేపథ్యంలో శ్రీలంక గడ్డపై ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు రోజు గంభీర్ జట్టు సభ్యులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లంతా పూర్తి స్థాయి సామర్థ్యంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని, తమ బాధ్యత ఏమిటో అందరూ గుర్తించాలని వారికి సూచించాడు.‘మన ఎదురుగా ఎలాంటి లక్ష్యం ఉందో, ఎందుకు ఆడుతున్నామో అందరికీ తెలుసు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగల సత్తా మనకు ఉంది. ఆగస్టు 15 ఉదయం ముందుగా బ్యాటింగ్ చేసినా, ముందుగా బౌలింగ్ చేసినా మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. మనపైకి సంధించే ప్రతీ ప్రశ్నకు మన వద్ద సమాధానం ఉండాలి. ఇక కొత్తగా జట్టులోకి వచ్చి న సారాంశ్ జైన్, ఆకిబ్ నబీలకు నా అభినందనలు. ఈ స్థాయి వరకు వచ్చేందుకు ఎంతో శ్రమించిన మీరు మీ కుటుంబ సభ్యులు, దేశం గర్వించేలా ఆడాలి’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా 33 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ శ్రీలంకతో టెస్టుల సందర్భంగా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సారాంశ్, జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ జట్టులోకి వచ్చారు. -
IND vs SL: శుబ్‌మన్ గిల్‌కు గాయం!
శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమచారం. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లింది. గాలె, కొలంబో వేదికలుగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.బలంగా తాకిన బంతిఅయితే, అంతకంటే ముందు భారత్.. శ్రీలంక ఎలెవన్ జట్టుతో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ గాయపడినట్లు రెవ్‌స్పోర్ట్స్ వెల్లడించింది. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి బొటనవేలికి బంతి బలంగా తాకిందని పేర్కొంది.ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి గిల్ గాయాన్ని పరిశీలించాడు. ట్రీట్మెంట్ తీసుకున్న గిల్.. కాసేపటి తర్వాత బ్యాటింగ్ సెషన్ కొనసాగించినట్లు పేర్కొంది. కాగా భారత్- శ్రీలంక ఎలెవన్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్‌కు కొలంబోలోని నోండెస్ప్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC) వేదిక.ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా శ్రీలంకలో సత్తా చాటాల్సిందే. ఆతిథ్య జట్టును 2-0తో వైట్‌వాష్ చేస్తేనే గిల్ సేన అవకాశాలు మెరుగుపడతాయి. చివరగా వైట్వాష్డబ్ల్యూటీసీలో భాగంగా చివరగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా ప్రత్యర్థి చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. అనంతరం.. అఫ్గానిస్తాన్‌తో ఇటీవల నామమాత్రపు టెస్టులో మాత్రం విజయం సాధించింది. అయితే, ఇది డబ్ల్యూటీసీలో భాగం కాదు.ఇక ఇప్పటికే టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంకతో సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో బారాముల్లా ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటన సందర్భంగానే బుమ్రాతో పాటు గాయపడ్డ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సెలక్టర్లు 33 ఏళ్ల సారాంశ్ జైన్‌ను తొలిసారి టీమిండియాకు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గిల్ కండరాల నొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే.శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్నెస్ ఆధారంగా), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: రూ. కోటిన్నర నజరానా!.. అస్మితకు భారీ షాక్! -
IND vs SL: బ్యాటింగ్‌కు అనుకూలమే.. టీమిండియాకు నచ్చలేదు!
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనుండగా.. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. అయితే, తొలి టెస్టు కంటే ముందు భారత్ శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడనుంది.టీమిండియా అసంతృప్తి కొలంబోలోని నోండెస్ప్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC)లో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. కాగా శ్రీలంకలో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం NCC తయారు చేసిన వికెట్ మాత్రం భారత శిబిరానికి అస్సలు నచ్చలేదని సమాచారం. పిచ్ మీద పచ్చిక ఉండటం ఏమిటని భారత బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి NCC అధికారి ఫ్రాంకీ రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘వికెట్ మీద పచ్చిక ఎక్కువగా ఉందని భారత క్రికెట్ జట్టు చెప్పింది. నిజానికి ఇది మూడు రోజుల మ్యాచ్ కాబట్టే మేమిలా గ్రాస్ వదిలేశాము. పచ్చిక లేకుండా వికెట్ ఇవ్వడం సరికాదు. ఇదొక మంచి వికెట్.బ్యాటింగ్‌కు అనుకూలంఏదో ఒక జట్టుకు అనుకూలంగా ఉండేలా మేము ఇది తయారు చేయలేదు. ఆయా జట్ల సత్తాను బట్టే వాళ్లు ముందుకు వెళ్లగలరు. నిజానికి శ్రీలంక క్రికెట్ అభ్యర్థన మేరకే మేము ఇలాంటి పిచ్ తయారు చేశాము. NCC వికెట్లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి.ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయని మేము భావిస్తున్నాము. గాలె మ్యాచ్ కంటే ముందు భారత బ్యాటర్లకు ఇక్కడ మంచి ప్రాక్టీస్ లభిస్తుందని చెప్పగలను. మా వికెట్ రెండు లేదా మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని చెప్పగలము.ఇరుజట్లకూ కీలకంఅయితే, ఇక్కడ టాస్ గెలిచిన వాళ్లు ముందుగా బ్యాటింగ్ చేస్తేనే మంచిది. మేము ఎల్లప్పుడూ మంచి వికెట్లనే రూపొందిస్తాము. పక్షపాతం ఉండదు’’ అని పేర్కొన్నారు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా కచ్చితంగా శ్రీలంకను 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే.మరోవైపు.. శ్రీలంక సైతం సొంతగడ్డపై సత్తా చాటి తామూ పోటీలో నిలవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కాగా.. పిచ్ రూపకల్పన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్? -
విండీస్‌పై పాక్ విజయం.. డబ్ల్యూటీసీ లెక్కలు తారుమారు!
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. అయితే డబ్ల్యూటీసీ పాయింట్ల విషయంలో విండీస్‌పై విజయం పాకిస్తాన్‌కు కాస్త ఉపశమనమిచ్చింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పరంగా మార్పు లేనప్పటికీ పాకిస్తాన్ ఒక స్థానం ఎగబాకి 8వ స్థానానికి చేరుకోగా, విండీస్ 9వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం పాక్ ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి 22.22 పర్సంటేజ్ పాయింట్లు (పీసీటీ) కలిగి ఉంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 87.50 పీసీటీతో టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు అందుకుంది. ఇక ఆ తర్వాత సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వరుసగా 75, 72.22 పీసీటీతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. వీరి తర్వాత బంగ్లాదేశ్ 58.33 పీసీటీతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రా నమోదు చేసింది. టీమిండియా 48.15 పీసీటీతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. అయితే శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే పాయింట్ల పరంగా భారత్ టాప్-3కి దూసుకెళ్లే అవకాశముంది. ఇప్పటివరకు భారత్ 9 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రా చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంక (41.67), ఇంగ్లండ్ (24.36) పర్సంటేజ్ పాయింట్లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2027లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుండడంతో టీమిండియా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 103/6తో బుధవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ చివరకు 46.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హెడ్జ్ (71 బంతుల్లో 34; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తేజ్‌నారాయన్ చందర్‌పాల్ (17), అమిర్ జంగూ (13), కెప్టెన్ రోస్టన్ చేజ్ (17), షై హోప్ (15), సీల్స్ (0), గ్రీవ్స్ (3) విఫలమయ్యారు.పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 75 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. అజాన్ అవైస్ (18), ఇమాముల్ హక్ (9) ఎక్కువసేపు నిలవలేకపోగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అబ్దుల్లా షఫీఖ్ (24 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేయగా... పాకిస్తాన్ జట్టు 387 పరుగులు చేసింది. 2023 తర్వాత విదేశాల్లో పాకిస్తాన్‌కిదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. 📊 The World Test Championship standings have a new look! 🏏The points table has been updated after the West Indies vs Pakistan Test series. West Indies now sit at the bottom, while Pakistan are second-last as the race to the WTC Final continues to heat up. 👀🔥#WTC… pic.twitter.com/OU6eTJj1W6— Sportskeeda (@Sportskeeda) August 5, 2026చదవండి: లైవ్ మ్యాచ్.. హఠాత్తుగా పిడుగు; ఫుట్‌బాలర్ మృత్యువాత! -
తొలి టెస్టులో చోటుకోసం కుల్దీప్ మాస్టర్ ప్లాన్!
శ్రీలంకతో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు కోసం మాస్టర్‌ప్లాన్ వేసినట్లు అనిపిస్తోంది. తొలి టెస్టుకు సంబంధించి తుది జట్టును ప్రకటించినప్పటికీ, కుల్దీప్ తొలి టెస్టులో ఆడుతాడా లేదా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో లంక గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా బృందం ఇప్పటికే కొలంబో మైదానంలో ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈ ప్రాక్టీస్‌లో కుల్దీప్ తన శైలికి భిన్నంగా బంతితో కాకుండా బ్యాట్‌తో ప్రాక్టీస్ చేయడం విశేషం. దాదాపు 40 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగించిన కుల్దీప్ ఒక్కసారి కూడా బౌలింగ్ వేయలేదు. అయితే తొలి టెస్టులో కుల్దీప్కు చోటు దక్కడం అనుమానంగా ఉండడంతో జట్టులో బ్యాటర్‌గానైనా చాన్స్ అందుకోవాలనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.టీమిండియాను వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో దూరమవ్వగా, ఫిట్నెస్ టెస్టు పాసైనప్పటికీ బుమ్రా కూడా చివరి నిమిషంలో లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో లంకతో సిరీస్‌కు కుల్దీప్ ఎంపికైనప్పటికీ, ఆప్షనల్‌గా కనిపించాడు. ఇప్పుడు టీమిండియాను గాయాలు వెంటాడడంతో కుల్దీప్ తొలి టెస్టు ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం జడేజాతో కలిసి కుల్దీప్ బౌలింగ్‌ను పంచుకోనున్నాడు. అంతేకాదు కుల్దీప్ యాదవ్‌కు టెస్టుల్లో బ్యాటింగ్‌లోనూ మంచి రికార్డే ఉంది. ఈ మణికట్టు స్పిన్నర్ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 234 పరుగులు సాధించాడు. 40 పరుగులు అతడి అత్యుత్తమంగా ఉంది. అయితే తొలి టెస్టులో కుల్దీప్ చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది జట్టు ప్రకటన వరకు ఎదురుచూడాల్సిందే. అయితే లంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు కొలంబో వేదికగా మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక తొలి టెస్టు ఆగస్టు 15న గాలే వేదికగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా జరగనున్నాయి.లంకతో టెస్టు సిరీస్ భారత్‌కు కీలకమైంది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే లంకపై సిరీస్ గెలవడం తప్పనిసరి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, లంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: శకం ముగిసింది.. డబ్ల్యూడబ్ల్యూఈకి స్టార్ రెజ్లర్ గుడ్ బై -
AUS vs BAN: ఆస్ట్రేలియాకు భారీ షాక్
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ వెన్ను నొప్పితో బాధపడుతుండగా.. తాజాగా ఈ జాబితాలో ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్ కూడా చేరాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ క్యాంప్‌లో నెసర్ కుడి పిక్క గాయానికి గురయ్యాడు.ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతడికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు నెసర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధ్రువీకరించాడు.కాగా బంగ్లాతో టెస్టుల కోసం ప్రకటించిన 13 మంది సభ్యుల ఆసీస్ ప్రధాన జట్టులో నెసర్ లేడు. కానీ కమిన్స్, హేజిల్‌వుడ్‌లకు బ్యాకప్ బౌలర్‌గా తీసుకోవాలని ఆసీస్ సెలక్టర్లు భావించారు. కానీ ఇప్పుడు అతడు గాయపడడంతో మరో ప్రత్యామ్నాయ బౌలర్‌ను వెతుక్కోవాల్సి వచ్చింది. యాషెస్ సిరీస్‌లో ఆడిన బ్రెండన్ డాగెట్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న జోష్ ఇంగ్లిష్ మాత్రం తొలి టెస్ట్ సమయానికి కోలుకుంటున్నాడని మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశాడు. ఇక ఆగస్టు 13 నుంచి డార్విన్ వేదికగా బంగ్లాదేశ్-ఆసీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మాన్ ఇస్లాం, తంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాడత్ హొస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్, లిట్టన్ దాస్.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్ -
‘ఆర్నెళ్లు లేదంటే ఏడాది బ్రేక్ తీసుకో.. సగం సగం వద్దు’
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల బారిన పడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఈ ఏడాది ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇప్పటికే అతడు ఎన్నో మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు కూడా బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు.ఆర్నెళ్లు లేదంటే ఏడాది బ్రేక్ తీసుకోగతంలో వెన్నునొప్పితో సుదీర్ఘకాలం జట్టుకు దూరమైన బుమ్రా.. ఈసారి మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ కర్సాన్ ఘవ్రీ బుమ్రాను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు. మిడ్-డేతో మాట్లాడుతూ..‘‘బుమ్రా ఐదు నుంచి ఆరు నెలలు.. లేదంటే ఓ సంవత్సరం పాటు విరామం తీసుకోవాలి. వందశాతం ఫిట్నెస్ సాధించిన తర్వాతే తిరిగి మైదానంలో అడుగుపెట్టాలి. అలా కాకుండా ప్రతీసారి హడావుడిగా జట్టుతో చేరి.. మధ్యలోనే గాయం వల్ల నిష్క్రమిస్తే కూర్పు దెబ్బతింటుంది.జట్టు ప్రణాళికలు అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. పనిభారం తగ్గించేందుకు మధ్య మధ్యలో విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ఇదంతా వృథా ప్రయాస. ఏదైనా సిరీస్ లేదంటే.. టోర్నీ మొత్తం పనిభారం అనే ప్రస్తావన లేకుండా జట్టుతో కొనసాగే ఆటగాడికే పెద్దపీట వేయాలి.భువీ, షమీలను పిలిపించండిబుమ్రా కూడా పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే అతడిని జట్టులో చేర్చాలి. నిజానికి భారత వెటరన్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఐపీఎల్లో నిలకడగా ఆడుతున్నారు. గాయాల బెడద లేకుండా వరుస టోర్నీల్లో పాల్గొంటున్నారు. వారిని తిరిగి టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుంది.సెలక్టర్లు షమీ, భువీల పేర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఫాస్ట్ బౌలర్లలకు గాయాలు సహజం. అయితే, బుమ్రా గత రెండు- మూడేళ్ల నుంచి తరచూ గాయపడుతున్నాడు. మెజారిటీ, కీలక మ్యాచ్‌లకు అతడు దూరమవుతున్నాడు. టీమిండియాకు ఇది ఎంతమాత్రమూ శుభసూచకం కాదు’’ అని ఘవ్రీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. బుమ్రా స్థానంలో..కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం కాగా.. అతడి స్థానంలో జమ్మూ కశ్మీర్ పేస్ బౌలర్ ఆఖిబ్ నబీకి మొదటిసారి భారత జట్టు పిలుపు లభించింది.కాగా 29 ఏళ్ల నబీ దేశవాళీ క్రికెట్లో గత రెండేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ రెండు వరుస సీజన్లలో కలిపి అతను ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్లో 60 వికెట్లు తీసిన నబీ... జమ్మూ కశ్మీర్ క్రికెట్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. చదవండి: సన్‌రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం -
పంత్ హవా.. ఆదాయపు పన్ను చెల్లింపులో అగ్రస్థానం!
దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్న జాబితాలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు సంపాదించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉత్తరాఖండ్‌లో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా పంత్ రికార్డులకెక్కాడు. ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వ్యక్తుల జాబితాను విడుదల చేయగా.. అందులో పంత్ అత్యధిక పన్ను చెల్లించి అగ్రస్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. రూర్కీలో జన్మించిన పంత్ బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్లో ప్రస్తుతం లక్నో క్యాపిటల్స్ నుంచి అందుకున్న మొత్తం, మ్యాచ్ ఫీజులు, ఇతర వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు ఇతరత్రా ఆదాయ మార్గాల ద్వారా సంపాదిస్తున్నాడు. అయితే గతేడాదితో పోలిస్తే పంత్ ఈసారి చెల్లించిన పన్ను మొత్తం రెండింతలకు పైనే ఉండడం గమనార్హం. గతేడాది పంత్ సుమారు రూ. 10.5 కోట్ల పన్ను చెల్లించాడు. ఈసారి మాత్రం అతడి పన్ను చెల్లింపు మొత్తం గణీనీయంగా పెరిగింది. రికార్డు స్థాయిలో రూ. 23.84 కోట్లు చెల్లించి రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా పంత్ నిలిచాడు. మరోవైపు జార్ఖండ్-బీహార్ రాష్ట్రాల్లో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వారిలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.ప్రస్తుతం రిషబ్ పంత్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. లంక గడ్డపై రాణించాలనే పట్టుదలతో ఉన్న పంత్ ఇటీవలే తన గురువు ఎంఎస్ ధోని వద్ద ప్రత్యేక సలహాలు, సూచనలు అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో తరఫున పంత్ 14 మ్యాచ్‌లో 312 పరుగులు సాధించాడు. లక్నోను క్వాలిఫయర్ చేర్చడంలో పంత్ విఫలమయ్యాడు. ఇక ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆడిన పంత్ 81 పరుగులతో రాణించాడు. ఇక పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి రెండేళ్లు కావొస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది. PANT BECOMES THE HIGHEST TAXPAYER FROM UTTARAKHAND. 💰 - Rishabh Pant emerged as the highest individual taxpayer in Uttarakhand after paying ₹23.84cr income tax for 2025-26 financial year. (ABP). pic.twitter.com/33xkT1Ev6r— Mufaddal Vohra (@mufaddal_vohra) August 5, 2026చదవండి: నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ -
శ్రీలంక చేరిన భారత బృందం
కొలంబో: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు కొలంబోకు చేరుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టాపార్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ మినహా మిగతా 14 మంది మంగళవారం శ్రీలంకలో అడుగు పెట్టారు. ఈ నెల 15 నుంచి గాలేలో తొలి టెస్టు, 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు నిర్వహిస్తారు. వీటికి ముందు ఈ నెల 7 నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఆడుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగుపడతాయి. చివరిసారిగా 2017లో శ్రీలంకలో మూడు టెస్టుల సిరీస్ కోసం పర్యటించిన భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే గత ఏడాది నవంబర్‌లో సొంతగడ్డపై ఆఖరి టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా... దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో ఓటమి పాలైంది. మరోవైపు సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మరింత స్పష్టతను ఆశిస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో రీహాబిలిటేషన్ తర్వాత కూడా అతను పూర్తిగా కోలుకోలేదు. దాంతో జట్టుతో కలిసి అతను శ్రీలంకకు వెళ్లలేదు. ప్రస్తుతం సుదర్శన్ గాయం పరిస్థితిని బోర్డు వైద్యులు సమీక్షిస్తుండగా... అతను త్వరలోనే పూర్తి ఫిట్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే శుక్రవారం నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే సుదర్శన్ బరిలోకి దిగుతాడు.భారత ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్...శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి భారత జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు చేపడుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్ స్థానంలో బీసీసీఐ శుభదీప్ ఘోష్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. 57 ఏళ్ల శుభదీప్ గతంలో రెండేళ్ల పాటు భారత మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. భారత ‘ఎ’, అస్సాం సీనియర్ టీమ్‌కు కూడా కోచింగ్ ఇచ్చిన అనుభవం అతనికి ఉంది. అస్సాంకు చెందిన శుభదీప్ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 17 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడాడు. భారత ఫీల్డింగ్ కోచ్‌గా 2021–2025 వరకు నాలుగేళ్ల పాటు పని చేసిన దిలీప్ ... ఆ తర్వాత కాంట్రాక్ట్ పొడిగింపుతో మరో ఏడాది పని చేశాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తర్వాత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే కూడా తప్పుకున్నాడు. డస్కటే, దిలీప్‌ల సేవలను ప్రశంసిస్తూ మంగళవారం బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. -
‘జడ్డూతో జాగ్రత్త.. లంక బ్యాటర్లకు ఇదే నా హెచ్చరిక!’
జింబాబ్వేతో సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి ఇరుజట్ల మధ్య గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక ఆయుధంగా మారనున్నాడని మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా జోస్యం చెప్పాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్లో జడేజా గతంలో పరుగులు కట్టడి చేయడంపైనే దృష్టి సారించేవాడని, కానీ కొన్నాళ్లుగా అతడు వికెట్ల కోసమే బంతులు వేస్తున్నట్లుగా అనిపిస్తోందని తెలిపాడు. జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా మాట్లాడాడు. 'కెరీర్ ఆరంభంలో జడేజా తన బౌలింగ్‌లో పరుగులు ఎక్కువగా రాకూడదనే మైండ్‌సెట్‌తో ఉండేవాడు. రెడ్‌బాల్ క్రికెట్లో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. అయితే వికెట్ కొద్దిగా సహకరించినా, అతడు వికెట్లు తీయడానికి ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం జడేజా పూర్తిగా మారిపోయాడు. తనకున్న బలాబలాలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతడు వికెట్లు తీయడంలో నేర్పరి. ఇక జడ్డూ ప్రతి గేమ్‌లోనూ బంతిని స్టంప్ లైన్లో వేసి ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో అతడి ఆలోచన కాస్త రక్షణాత్మక ధోరణిలో ఉండేది. కానీ ఇప్పుడు వికెట్ తీయాలనే ఉద్దేశంతోనే బంతులను విసురుతున్నాడు' అని పుజారా చెప్పుకొచ్చాడు.ఇక జడేజా ఆరు నెలల తర్వాత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. గతేడాది నవంబర్‌లో గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్‌లో జడేజా ఆరు వికెట్లు పడగొట్టడంతో పాటు అర్ధసెంచరీ సాధించాడు. ఇక 37 ఏళ్ల జడేజాకు శ్రీలంకపై అద్భుతమైన రికార్డు ఉంది. గతంలో లంకతో ఆడిన ఏడు టెస్టుల్లో జడేజా 65 సగటుతో 326 పరుగులు చేశాడు. లంకపైనే అతడి కెరీర్ బెస్ట్ (175 నాటౌట్) స్కోరు నమోదు చేశాడు. ఇక బౌలింగ్‌లో 24 సగటుతో 33 వికెట్లు తీశాడు. ఇక లంక గడ్డపై గతంలో ఆడిన రెండు టెస్టులు కలిపి మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్‌గా జడేజా 85 టెస్టుల్లో 348 వికెట్లు తీశాడు. ఇందులో 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలున్నాయి. బ్యాటింగ్‌లో 4,095 పరుగులు సాధించిన జడేజా ఖతాలో ఆరు సెంచరీలు, 28 అర్ధసెంచరీలున్నాయి.Read: ‘రొనాల్డోనే స్ఫూర్తి.. నా తండ్రి కూడా అలానే మరణించాడు’ -
ధోని కనుసన్నల్లో ట్రైనింగ్.. లంకను కుమ్మేస్తాడా?
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌లో తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు వికెట్‌కీపర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలోనే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కనుసన్నల్లో రాంచీలో ప్రత్యేక పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈ సిరీస్ పంత్‌కు చాలా కీలకమని చెప్పొచ్చు. ఒక ఎండ్‌లో ధ్రువ్ జురెల్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వేళ లంక పర్యటనలో పంత్ రాణించాల్సిన అసవరముంది. అంతేకాదు మిడిలార్డర్లో బ్యాటింగ్‌లో పంత్ కీలకం కానున్నాడు. స్పిన్నర్లకు బాగా అనుకూలించే లంక పిచ్‌లపై రాణించాలని పంత్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోని సూచనలు తీసుకునేందుకు పంత్ రాంచీ వెళ్లాడు. తాజాగా ధోని సలహాలు, సూచనలు తీసుకుంటున్న ఫొటోలను పంత్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో ధోని, పంత్‌తో పాటు మాజీ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ కూడా ఉన్నాడు. ట్రెయినింగ్‌లో భాగంగా స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలి, వికెట్‌కీపింగ్ కండిషన్లు ఎలా ఉంటాయన్న దానిపై పంత్ ధోని నుంచి సలహాలు తీసుకున్నాడు. ఇక ధోని స్పిన్ బౌలింగ్‌ను అర్థం చేసుకోవడంలో మంచి నేర్పరి. ఇన్నేళ్ల తన అనుభవంలో ఉపఖండపు పిచ్‌లపై వికెట్ కీపింగ్ కండిషన్‌ను కూడా అంచనా వేయడంలో ధోని దిట్ట. మరి లంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ధోని ఇచ్చిన సలహాలతో పంత్ చెలరేగుతాడేమో చూడాలి. ఇటీవలే వైట్‌బాల్ క్రికెట్లోనూ తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న పంత్ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను కలిసి సలహాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక గడ్డపై టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి 19 వరకు, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనున్నాయి.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్) కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, అకీబ్ నబీ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్. MS Dhoni sharing his experience with Rishabh Pant.💛 pic.twitter.com/uuvEOKfgT7— Cricket Central (@CricketCentrl) July 31, 2026Rishabh Pant taking a ride in Ranchi with Thala 🤩#Cricket #Dhoni pic.twitter.com/YtbFlCawol— CREX (@Crex_live) August 2, 2026 -
గంభీర్‌పై ఫిర్యాదు చేసిన సీనియర్ ప్లేయర్లు!
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వైఖరి పట్ల సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలకు వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వైదొలిగిన సంగతి తెలిసిందే.ఘోర పరాభవాలుఈ క్రమంలో బీసీసీఐ ఏరికోరి గంభీర్‌తో ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసింది. అయితే, అతడి మార్గదర్శనంలో విజయాల మాట పక్కనపెడితే.. టీమిండియా ఇప్పటికే ఎన్నో ఘోర పరాభవాలు చవిచూసింది. ముఖ్యంగా టెస్టుల్లో సొంతగడ్డ మీదే న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో వైట్‌వాష్ అయింది.ఇటీవల టీ20 సిరీస్‌లో పసికూన ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్‌స్వీప్ అయింది. అయితే, భారత జట్టు ఇలా అవమానకర రీతిలో పరాజయాల పాలైనప్పుడు గంభీర్.. ఆ తప్పును ఆటగాళ్లు లేదంటే సహాయక సిబ్బందిపై నెట్టేస్తున్నాడనే భావన జట్టు అంతర్గత సభ్యుల్లో నిండిపోయినట్లు సమాచారం.తప్పంతా మాపైనే నెట్టేస్తారా?ఏ ఒక్క ఓటమికి కూడా గంభీర్ జవాబుదారీగా ఉండకుండా తప్పంతా తమపైనే నెట్టేయడాన్ని కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అపెక్స్ సభ్యులకు వీరు అనధికారికంగా ఫిర్యాదు చేసినట్లు క్రిక్‌బ్లాగర్ పేర్కొంది.ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దల్లో కొంతమంది గంభీర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఇప్పటికీ అతడికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. టీమిండియా నాయకత్వ బృందం నిర్ణయాల్లో తలదూర్చడం సరైన పద్ధతి కాదనే యోచనలో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.అసంతృప్తి, సందేహాలుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు క్రిక్‌బ్లాగర్‌తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్ కోచింగ్ శైలి, అతడి తీరు పట్ల కొంతమంది సీనియర్ క్రికెటర్లు బీసీసీఐ అపెక్స్ మండలి వద్ద అసంతృప్తి, సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, అనధికారికంగానే వారు ఈ ఫిర్యాదు చేశారు. కాబట్టి శ్రీలంక పర్యటన నేపథ్యంలో గంభీర్‌పై పెద్దలు దృష్టి సారించారు’’ అని పేర్కొన్నాయి.లంక టూర్లో రాణిస్తేనే..కాగా ఆగష్టు 15-28 మధ్య టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుండగా.. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా ఫైనల్ రేసులో ఉండాలంటే శ్రీలంకను 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే. ఒకవేళ ఇక్కడ ప్రతికూల ఫలితం వస్తే గనుక గంభీర్ భవితవ్యం (టెస్టు కోచ్‌గా) ప్రశ్నార్థకంగా మారనుంది. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాతే తొలిసారి భారత్ కనీసం డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కూడా చేరకుండా నిష్క్రమించింది.చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే? -
విండీస్‌కు ఆపద్బాంధవుడిలా.. మొన్న బంతితో, ఇవాళ బ్యాట్‌తో!
ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. అయితే ఈసారి బౌలర్‌గా కాకుండా బ్యాటర్‌గా తన విలువను ప్రదర్శించాడు. పాక్‌తో జరిగిన తొలి టెస్టులో వరుస ఐదు ఓవర్లలో ఐదు మెయిడెన్ వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన జస్టిన్ గ్రీవ్స్ ఈసారి బ్యాట్‌తో (125 బంతుల్లో 64 నాటౌట్) రాణించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. గ్రీవ్స్‌తో పాటు కెప్టెన్ రోస్టన్ చేజ్ (36 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నాడు. అంతకముందు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (46) అర్ధశతకం మిస్ చేసుకోగా, అమిర్ జాంగో (26), షెయ్ హోప్ (29) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 2 వికెట్లు తీయగా, ఉబైద్ షా, అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు. ఇదే స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇక తొలి వికెట్‌కు బ్రాండన్ కింగ్, టగ్ నరైన్ చంద్రపాల్ (15) 49 పరుగులు జోడించిన తర్వాత విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో పెద్దగా ఎవరు ఆకట్టుకోలేదు. 120 పరుగుల వద్ద వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోవడంతో జస్టిన్ గ్రీవ్స్ క్రీజులోకి వచ్చాడు. క్రీజులోకి వచ్చిందే మొదలు తనలోని క్లాస్ బ్యాటర్‌ను బయటికి తీసిన గ్రీవ్స్ నింపాదిగా ఆడాడు. వీలైనప్పుడల్లా బంతులను బౌండరీలను తరలించాడు. షెయ్ హోప్ ఔటైన తర్వాత మరింత బాధ్యతగా ఆడిన గ్రీవ్స్ టెస్టుల్లో మూడో అర్థసెంచరీని సాధించాడు. చేజ్‌తో కలిసి ఆరో వికెట్‌కు గ్రీవ్స్ అజేయంగా 66 పరుగులు జోడించడంతో విండీస్ మళ్లీ ట్రాక్‌లో పడింది. రెండో రోజు ఆటలో ఈ ఇద్దరు ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారనే దానిపై విండీస్ స్కోరు ఆధారపడి ఉంది. Justin Greaves Is A Classy Batter. Very Fluent Batter. His Drives Are Awesome pic.twitter.com/QfKDf5rWT0— Aryan Goel 2.0 (@AryanGoelNew) August 2, 2026Read: తీవ్ర అసంతృప్తిలో గిల్, గంభీర్.. వాళ్లపై బీసీసీఐ వేటు!


