
ఢిల్లీ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య శుక్రవారం (అక్టోబరు 10) రెండో టెస్టు (IND vs WI 2nd Test) మొదలైంది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన భారత జట్టు సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ టీమిండియాకు శుభారంభం అందించారు.
ఈసారి నిరాశపరిచిన కేఎల్ రాహుల్
అయితే, గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రాహుల్ ఈసారి మాత్రం కాస్త నిరాశపరిచాడు. 54 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 38 పరుగులు చేసి నిష్క్రమించాడు. విండీస్ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ జొమెల్ వారికన్ తన తొలి ఓవర్లోనే అద్భుతమైన బంతితో రాహుల్‌ను బోల్తా కొట్టించాడు.
Shifting gears! ⚙
After a steady start, @klrahul unwinds with an elegant punch down the ground. ⚡
Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/CpSkK3IJXi— Star Sports (@StarSportsIndia) October 10, 2025
స్టంపౌట్‌గా
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో పద్దెనిమిదవ ఓవర్ మూడో బంతికి వారికన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో వెంటనే బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ బెయిల్స్‌కు గిరాటేశాడు.
— crictalk (@crictalk7) October 10, 2025
దీంతో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే దురదృష్టవశాత్తూ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 58 పరుగుల స్కోరు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?
ఇక తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో టెస్టులో ఓపికగా ఆడుతున్నాడు. తొలిరోజు నాటి భోజన విరామ సమయానికి జైసూ 78 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ 36 బంతుల్లో మూడు ఫోర్లు బాది 16 పరుగులతో జైసూతో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా శుక్రవారం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 28 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది.
ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో టీమిండియా విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో త్తుగా ఓడించి.. రెండుమ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
తుది జట్లు..
టీమిండియా
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మొహహ్మద్ సిరాజ్
వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, తగ్‌నరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్‌కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్
చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్