ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి | Ban on Wood Stoves Lifted Delhi Allows Use of Wood Stoves | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి

Mar 14 2026 5:20 PM | Updated on Mar 14 2026 5:37 PM

Ban on Wood Stoves Lifted Delhi Allows Use of Wood Stoves

న్యూఢిల్లీ: గ్యాస్‌ కొరత వేళ కేంద్ర సర‍్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలు వాడుకోవచ్చని ప్రకటించింది. 

ఢిల్లీలో కాలుష్యం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం మరింత పెరగకుండా ప్రభుత్వం ఎన్నో నిబంధనలను తీసుకొచ్చింది. అయినప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్‌ కొరత నెలకొనడంతో ఇప్పుడు కట్టెల పొయ్యి వాడక తప్పడం లేదు. దీంతో దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. 

కమర్షియల్‌ సిలిండర్ల కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా  కొన్ని రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో జిల్లాలోనూ గ్యాస్‌ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని గ్యాస్‌ ఏజెన్సీలు హోటళ్లకు కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా నిలుపుదల చేశాయి. కొందరికి మాత్రం పాత స్టాక్‌ ఉండడంతో ఎలాగోలా రెండు రోజులు నెట్టుకొచ్చారు. స్టాక్‌ లేని వారు కట్టెల పొయ్యిపై వంటలు చేయడం ప్రారంభించారు. ఇంకొందరు సుదూర ప్రాంతాల నుంచి గ్యాస్‌ తెచ్చుకొని రెస్టారెంట్లను నడుపుతున్నారు.

మరోవైపు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటివి మూడపడకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్‌ బిల్లులో యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇవాళ ప్రకటన చేశారు.

తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్‌ సెక్టార్‌ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. ‘గ్యాస్‌ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్‌లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement