Wood stove
-
గ్యాస్ కొన్ని జ్ఞాపకాలు
‘ఇంట్లో బోర్ కొడితేబయట తినొచ్చు’ అనేవారు. ఇప్పుడు బయట తినడానికి దొరికేలా లేదు. కొన్నాళ్ల తర్వాత ఇంటి పరిస్థితీ తెలియదు. ఏమంటే యుద్ధం వల్ల గ్యాస్ లేదు. కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టవ్ దాటి గ్యాస్ వచ్చాక అది ఇంటి ఊపిరిగా మారింది. ఇప్పటి తరానికి తెలియదు గాని గ్యాస్ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి స్త్రీలకు.‘వాళ్లు గ్యాస్ కొనుక్కున్నారట’... 1980లలో ఇది చిన్న ఊళ్లలో పెద్ద వార్త. గ్యాస్ కొనుక్కోవడం అంటే ఆడవాళ్లకు అతి పెద్ద రిలీఫ్ ఏమిటంటే– అది ఎప్పుడు పడితే అప్పుడు వెలుగుతుంది. వాన వచ్చినా, చలి ఉన్నా, అర్ధరాత్రయినా, తెల్లవారుజామున కానీ... ఎప్పుడైనా సరే... టప్.. వెలుగుతుంది. ఆడవాళ్లు ఈ వింతను చూడటానికి ఆ గ్యాస్ కొనుక్కున్న వారి ఇంటికి వెళ్లేవారు. అప్పటివరకూ వాళ్లకు కట్టెల పొయ్యి తెలుసు. కట్టెలు తెచ్చుకుని, పొయ్యిలో పెట్టుకుని, వాటిని కిరోసిన్ వేసి ముట్టించి, బాగా మండే వరకు ఆగి... ఆ తర్వాత ఊదుడు గొట్టంతో ఊది ఊది... ఇన్ని చేస్తే గాని వంట పూర్తి కాదు.ఇక కిరోసిన్ స్టవ్ ఉంటుంది గానీ అందుకు కిరోసిన్ కావొద్దూ! వొత్తులు ఉండే స్టవ్‌ను వొత్తులు సరి చేసుకుని వెలిగించి మెల్లగా వంట మొదలెడితే ఎప్పటికో అవుతుంది. పంప్ స్టవ్ కొంచెం డేంజర్. ఇది మగవారికి సౌకర్యంగాని ఆడవాళ్లకు బెరుకే. బుజ్‌మని నీలిరంగు మంట వచ్చే ఈ స్టవ్‌లు ఆ రోజుల్లో పేలేవి. ఈ స్టవ్‌లు వాడాలంటే తరచు పిన్‌తో నొక్కి బర్నర్‌ను యాక్టివేట్ చేయాలి. అది మరో తలనొప్పి. అయినా సరే. పెద్ద టెన్షన్ ఉండేది కాదు. కట్టెలు దొరుకుతాయి. కిరోసిన్ కూడా బ్లాక్‌లో బాగానే దొరికేది. వంట చేయాలనుకోవాలేగాని చేయొచ్చు. ఆ సమయంలో ఇదిగో ఇలా గ్యాస్ ఊడిపడింది.ఎన్నో అనుమానాలుమొదట గ్యాస్ స్టవ్‌ను ఎవరూ నమ్మలేదు. సిలిండర్ పేలి చచ్చిపోతారని భయపడుతూ స్తోమత ఉన్నవారు కూడా కొనలేదు. గ్యాస్ మంట మీద వొండేది రుచిగా ఉండదని మరో అభి్ర పాయం. గ్యాస్ స్టవ్‌ను ఎలా తుడవాలి, ఎలా శుభ్రం చేయాలి తెలియదు. ఇక రెగ్యులేటర్ది పెద్ద అవస్థ. అది బిగించడం తీయడం తెలియదు. రెగ్యులేటర్ ఆన్ ఆఫ్ బటన్‌తో కూడా భయం ఉండేది. ఇక గ్యాస్ లీక్ కావడం గురించి గగ్గోలు ఉండేది. గ్యాస్ వాసన వస్తే భయపడిపోయేవారు. ఇవన్నీ ఇలా ఉండగా గ్యాస్ డీలర్లు గ్యాస్ కొనమని ప్రచారం చేసేవారు. ఆ ఎర్రరంగు సిలిండర్ ఇంటిలోకి అడుగుపెట్టింది.సిలిండర్ వొచ్చిందాసింగిల్ సిలిండర్లే చాలా ఇళ్లలో. డబుల్ సిలిండర్ ఏ కొద్దిమంది దగ్గరో ఉండేది. సిలిండర్ అవుతూ ఉండగా గ్యాస్ బుక్ చేస్తే అయిపోయిన ఎన్నో రోజులకు అది వచ్చేది. అంతవరకు మళ్లీ రకరకాల పద్ధతుల్లో వంట సాగేది. ‘గ్యాస్ దొరకడం లేదట’ అనే వార్త అప్పటినుంచి ఇప్పటి వరకూ స్త్రీలను హైరానా పెడుతూనే ఉంది. గ్యాస్ అయిపోవడం కూడా గమ్మత్తుగా జరుగుతుంది. అదెప్పుడూ తీరుబడిగా ఉన్నప్పుడు అయిపోదు. ఉదయాన్నే అందరూ హడావిడిగా బయలుదేరుతూ వంట చేసుకుని టిఫిన్లు కట్టుకుంటూ ఉండగా అయిపోతుంది. ఆ క్షణంలో ఇంట్లో రేగే కలకలం శత్రుదేశాల సరిహద్దుల వద్ద కూడా ఉండదు.కాస్త సిలిండర్ ఇస్తారాసిలిండర్ చేతుల్లోకి కుటుంబాలు వెళ్లాక ఇరుగు పొరుగు మధ్య గ్యాస్ స్నేహం ఏర్పడింది. వీరు ‘సిలిండర్ ఇచ్చేవారు’ ‘సిలిండర్ ఇవ్వనివారు’గా విభజితం అయ్యాయి. మనకు సిలిండర్ ఇచ్చేవారే క్లోజ్ఫ్రెండ్సు. గ్యాస్ ఎప్పుడైపోతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి స్నేహం ఒక్కటైనా లేకపోతే మనుగడ కష్టమైపోతుంది. గతంలో పోస్టుమ్యాన్ వస్తే జనానికి ఆనందం ఉండేది. ఇప్పుడు గ్యాసు బండి వీధిలోకి వస్తే సంతోషం కలుగుతోంది. బంగారం ధర, గ్యాస్ ధర... ఇవే సగటు మధ్యతరగతి మహిళకు మోదం ఖేదం కలిగించే విషయాలుగా మారాయి. 1980లలో 40 రూ పాయలున్న సిలిండర్ నేడు 930కి చేరింది. -
ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ: గ్యాస్ కొరత వేళ కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలు వాడుకోవచ్చని ప్రకటించింది. ఢిల్లీలో కాలుష్యం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం మరింత పెరగకుండా ప్రభుత్వం ఎన్నో నిబంధనలను తీసుకొచ్చింది. అయినప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్ కొరత నెలకొనడంతో ఇప్పుడు కట్టెల పొయ్యి వాడక తప్పడం లేదు. దీంతో దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. కమర్షియల్ సిలిండర్ల కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కొన్ని రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జిల్లాలోనూ గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలుపుదల చేశాయి. కొందరికి మాత్రం పాత స్టాక్ ఉండడంతో ఎలాగోలా రెండు రోజులు నెట్టుకొచ్చారు. స్టాక్ లేని వారు కట్టెల పొయ్యిపై వంటలు చేయడం ప్రారంభించారు. ఇంకొందరు సుదూర ప్రాంతాల నుంచి గ్యాస్ తెచ్చుకొని రెస్టారెంట్లను నడుపుతున్నారు.మరోవైపు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటివి మూడపడకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్ బిల్లులో యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇవాళ ప్రకటన చేశారు.తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్ సెక్టార్ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. ‘గ్యాస్ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు. -
కట్టెడు దుఖం
విద్యార్థులకు వడ్డించే ఆహారం తయారీకి మన్యంలో ఇంకా కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. తరగతి గదుల పక్కనే వంటలు చేయడంతో పొగతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏళ్లకాలంగా పరిస్థితిలో మార్పురాక పొగమాటున విద్యాభ్యాసం సాగుతోంది. చంద్రబాబు సర్కారులో విద్యారంగానికి గ్రహణం పట్టింది. ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్టు తయారైంది. వంట తయారు చేసే వారికి ‘కట్టె’డు దుఖం మిగులుతోంది. రంపచోడవరం: ఎన్నో ఆశల నడుమ కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటైంది. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందని అందరూ భావించారు. కానీ ఇక్కడ వి ద్యార్థుల కష్టాలు తీర్చే నాథుడే లేకపోయారు. పాఠశాలలు, వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. జిల్లాలో 79 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 16,238 మంది విద్యా ర్థులు చదువుతున్నారు. ఇక 15 వసతి గృహాల్లో 1,281 మంది విద్యను అభ్యసిస్తున్నారు. అయితే జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో కట్టెల పొయ్యిలపైనే విద్యార్థులకు భోజనాలను తయారు చేస్తున్నారు. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు గ్యాస్ సిలిండర్లను ఉయోగించి వంటలు చేసుకుంటున్నా, ఇక్కడ మాత్రం ఇంకా కట్టెల పొయ్యిలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏళ్ల కాలంగా ఈ పరిస్థితి ఉంది. కంట్లో పొగ.. ఇదో సెగ పాఠశాలల భవనాల పక్కనే కట్టెల పొయ్యిపై విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. వంట సమయంలో వెలువడుతున్న పొగతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉన్నా ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పొగ కారణంగా చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వంట షెడ్లను నిర్మించకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. చాలా చోట్ల తరగతి గదులకు దగ్గరలోనే వంట చేయడంతో విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు గ్యాస్ సరఫరా చేయడం లేదు. అన్ని చోట్లా కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. ఇష్టారాజ్యం వంట కోసం గ్యాస్ అందించాలని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులు కోరుతున్నా, ఫలితం లేకుండా పోతోంది. కట్టెల పొయ్యి కారణంగా పొగచూరి ఆహార పదార్థాలకు పట్టడంతో ఒక్కోసారి తినడానికి ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశారు. కొన్ని నెలలు తర్వాత ఎక్కడా అవి కనిపించలేదు.కనీసం ఆయా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన లెక్కలే లేవు. కాగా.. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు సంబంధించిన ఖాళీ గోనె సంచులు, విద్యార్థులు ఉపయోగించి, పాడైన ఐరన్ పెట్టెలు, పాత పుస్తకాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఫలసాయం డబ్బులను ట్రెజరీ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ పద్దులో జమ అయ్యేటట్లు బ్యాంకు ద్వారా చెల్లించాలి. కానీ ఎక్కడా ఇదీ జరగడం లేదు. తమ ఇష్టారాజ్యంగా వార్డెన్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపాదనలు పంపించాం ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో గ్యాస్‌పైనే వంట చేసే విధంగా సిలిండర్ల సరఫరాకు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌కు ఇక్కడి పరిస్థితిపై నివేదిక అందజేశాం. ప్రస్తుతం అన్ని చోట్లా గ్యాస్ సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. జీసీసీ ద్వారానే గ్యాస్ సరఫరా చేసే అంశాలను ఆలోచన చేస్తున్నాం. – రుక్మాంగదయ్య, డీడీ, రంపచోడవరంఇబ్బంది పడుతున్నాం ఎంపీపీ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు నెలకు ఒక్క సిలిండర్ మాత్రమే ఇస్తున్నారు. దీంతో రెండు వారాలకే అది ఖాళీ అవుతోంది. ఆ తర్వాత కట్టెల పొయ్యిపైనే వంట చేయాలి. కట్టెల పొయ్యిపై వంట చేయడం వలన పొగ వచ్చి ఇబ్బంది పడుతున్నాం. నెలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తే బాగుంటుంది. – లక్షి్మ, వంటమనిషి, ఎంపీపీ స్కూల్, ఎర్రంపాలెంపొగతో ఆరోగ్యానికి ముప్పు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కట్టెల పొయ్యిపై వంట చేసి భోజనం పెడుతున్నాం. దీని వల్ల పొగతో చాలా ఇబ్బంది పడుతున్నాం. కళ్లు పాడైన వారు, ఊపిరితిత్తులు పాడైన వారు కూడా ఉన్నారు. కట్టెల పొయ్యిపై వంట చేసే బాధను తప్పించాలి. – జమయమ్మ, ఆశ్రమ పాఠశాల, గంగవరం -
బండకు టాటా.. కట్టెల వేట
రామన్నపేట: గ్యాస్ ధర భారీగా పెరిగిపోవడంతో పల్లెల్లో కట్టెలపొయ్యిలపై వంట మొదలైంది.. పొయ్యిల నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి హానికరంగా మారింది. గ్యాస్ ధర అమాంతం రూ.1,100 దాటడంతో గ్రామీణులు కట్టెల పొయ్యిల వాడకం మొదలుపెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మంగళవారం కొందరు మహిళలు అడవి నుంచి తలపై కట్టెలమోపులు తీసుకొస్తుండడం కనిపించింది. వారిని వాకబు చేయగా గ్యాస్ ధర పెరగడంతో వంట చేయడానికి అడవి నుంచి కట్టెలను తీసుకొస్తున్నట్లు వాపోయారు. వారిలో కొందరు స్థానికులు కాగా.. మరికొందరు సంచార జాతులున్నారు. -
కట్టెల పొయ్యిలతోనే కాలుష్యం ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం కట్టెల పొయ్యిలు ఎక్కువ వాడుతారనే విషయం తెల్సిందే. ఈ పొయ్యిల వల్ల ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని నియంత్రించడంలో భాగంగా కట్టెల పొయ్యిల స్థానంలో గ్యాస్ స్టవ్‌లను ప్రోత్సహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘పేదల ఇంటింటికి ఉచిత గ్యాస్ కనెక్షన్’ తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్ల కోసం నెలకు ఐదారు వందలు పెట్టాల్సి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో పొయ్యిలోకి కట్టెలు ఉచితంగా దొరకడం వల్ల ఆ పథకం అంతగా విజయవంతం కాలేదు. కట్టెల పొయ్యిల వల్ల ఎంత వాయు కాలుష్యం ఏర్పడుతుందనే విషయంలో ఇప్పటికీ చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాతావరణంలోని ‘పీఎం–2.5’ కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి అత్యంత హానికరమైనది. దీని వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. పీఎం–2.5 అంటే పార్టికులేట్ మ్యాటర్ (నలుసులు లేదా రేణువులు) 2.5 సెంటీమీటర్ల వ్యాసం కన్నా తక్కువగా ఉండడం. ఇవి రోజుకు ఒక్క ఇంటి పొయ్యి నుంచి వెలువడుతాయంటే ఓ ట్రక్కు రోజంతా తిరిగితే వెలువడే రేణువులకన్నా ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉన్న కట్టెల పొయ్యిలన్నింటికి 2022 నాటికి స్వస్తి చెప్పాలన్నది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సు నిర్మాణం. ఈ దిశగా లండన్ ఇప్పటికే చర్యలు పట్టింది. బ్రిటన్‌లో ప్రస్తుతం 17 లక్షల మంది కట్టెల పొయ్యిలను ఇప్పటికీ వాడుతున్నారు. వారు వంటకోసం కాకుండా రూమును వెచ్చబరచడం కోసమే ఎక్కువగా వాడుతారు. ఇప్పుడవి రకారకాల డిజైన్లలో వస్తుండడంతో వాటి పట్ల లండన్ వాసులకు ఆకర్షణ కూడా పెరిగింది. ఎలక్ట్రిక్ రూమ్ ఈటర్ల కన్నా ఈ కాచుకొనే కట్టెల పొయ్యిలను వాడడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదవడమే కాకుండా ఆకర్షణీయంగా ఉండడం కారణం. భారత్‌లోని కట్టెల పొయ్యిల కన్నా లండన్ వాసుల పొయ్యిల ద్వారా తక్కువ కాలుష్యమే ఏర్పడుతుంది. అయినా వారికి అదే ఎక్కువట. మొత్తం దేశ వ్యాప్తంగా వివిధ రూపాల్లో కలుగుతున్న కాలుష్యంలో వారి కట్టెల పొయ్యిల వల్ల వెలువడుతున్న కాలుష్యం దాదాపు 30 శాతం అట. భారత కట్టెల పొయ్యిల వల్ల కాలుష్యం ఎక్కువగా ఏర్పడగానికి కారణం ఏ కట్టెలు దొరికితే అవే వాడేయడం, కొన్నిసార్తు పచ్చి కట్టలు కూడా వాడడం. లండన్ వాసులు ప్రత్యేక దుంగలను వాడుతారు. చిన్న చిన్న దుంగలను, పూర్తిగా ఎండిన దుంగలను, అవి కొన్ని ప్రత్యేక రకాలకు చెందిన దుంగలను మాత్రమే వాడాలంటూ అక్కడి ప్రభుత్వం వారికి మార్గదర్శకాలను నిర్దేశించింది. పొయ్యిల నుంచి ఎక్కువ పొగ రాకుండా ఎక్కువ మంట వచ్చే విధంగా పొయ్యిల నిర్మాణం ఉండాలంటూ వాటిని తయారు చేసే కంపెనీలకు కూడా మార్గదర్శకాలను సూచించింది. ఈ మేరకు ఇప్పుడు అక్కడి మార్కెట్లోకి ఐదు కిలోవాట్ల ‘సిల్వర్ డలే 5 ఎస్ఈ’ వుడ్ బర్కింగా స్టవ్ వచ్చింది. దాని ధరం 525 పౌండ్లు (దాదాపు 48 వేలు). అలాగే ‘బెల్టనే మిడ్‌ఫోర్డ్ ఎస్సీ’ వుడ్ బర్నింగ్ స్టవ్ వచ్చింది. దాని ధర 946 పౌండ్లు (86 వేలు). -
ఇదోరకం కట్టెల పొయ్యి
కొన్ని సంవత్సరాల క్రితం కట్టెల పొయ్యి మీదే వంట చేసేవారు. అందరికీ ఇంకా బాగా గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ పల్లెల్లో కొందరు కట్టెల పొయ్యి మీదే∙వండుతున్నారు. నగరాలలో ఉండేవారు వండుకోవాలనుకుంటే, రెడీ మేడ్ కట్టెల పొయ్యి 800 రూపాయలకు అందుబాటులో ఉంది. నిఖిల్ ఇంజినీర్స్ స్మార్ట్ వుడ్ బర్నింగ్ కుక్ స్టవ్ పేరుతో గూగుల్‌లో వెతికితే ఈ స్టౌ సమాచారం దొరుకుతుంది. ఈ పొయ్యిలో వంటచెరకుగా... కట్టెలు, పిడకలు, ఎండు పుల్లలు, చితుకులు, ఎండుటాకులు... వేటినైనా వాడుకోవచ్చు. పొగ తక్కువ వస్తుంది. ఉపయోగించడం కూడా సులువే. ఈ స్టౌ మీద భారీ వంటలు చేయడానికి అవకాశం లేదు. ఇంట్లో సరదాగా వాడుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్తలు: ►స్టవ్‌ను సమతలంగా ఉన్న ప్రదేశం మీద ఉంచాలి ►స్టౌ వెలిగించాక ముట్టుకోకూడదు ►పిల్లలకు దూరంగా ఉంచాలి ►మండేపదార్థాలను దూరంగా ఉంచాలి ►బాగా గాలి, వెలుతురు ఉన్న ప్రాంతంలో ఉపయోగించాలి ►వర్షం పడే చోటులో ఉంచకూడదు ►స్టౌ శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగించకూడదు. -
కొంప ముంచిన కట్టెల పొయ్యి
గరికివలస గ్రామంలో రోజూలాగే గ్రామస్తులంతా పొలం పనులకు ఆదివారం ఉదయం వెళ్లిపోయారు. గ్రామంలో ఓ పూరింట్లో వెలిగించిన కట్టెల పొయ్యిను ఆర్పడం మరచిపోయారు. అది కాస్త గాలికి రాజి మంటలు చేలరేగాయి. దీంతో పొట్నూరు తవుడు ఇల్లు కాలిపోయింది. తరువాత పక్కన ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఏడు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.ఎనిమిది లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. జరిగిన సంఘటనతో బాధితులంతా గొల్లుమన్నారు. గుర్ల: మండలంలోని గరికివలసలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు...గ్రామానికి చెందిన పొట్నూరు తవుడు ఇంట్లో ఉన్న కట్టెల పోయ్యి బొగ్గులు అర్పకుండా వదిలేశారు. గాలికి బొగ్గులు నిప్పు రాజుకోని ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. తరువాత మంటలు పక్కనే ఉన్న పొట్నూరు ఆదిలక్ష్మి, పొట్నూరు లక్ష్మి, పొట్నూరు పాపినాయుడు, పెనుమజ్జి పైడమ్మ, పొట్నూరు తవిటినాయుడు, పొట్నూరు పాపినాయుడు ఇళ్లకు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి. బాధితుల ఇళ్లల్లో సామగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రమాదంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు బోరుమన్నారు. గ్రామంలో అందరూ పోలం పనులకు వెళ్లిన తర్వాత అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీ నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వ పరంగా సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక నేత బెల్లాన వెంకటరమణ, వీఆర్వో మీసాల చిన్నారావు ఉన్నారు. పాతబగ్గాంలో... గజపతినగరం రూరల్: మండలంలోని పాతబగ్గాం గ్రామానికి చెందిన లెంక అప్పయ్యమ్మ మిద్దె ఇల్లు ఆదివారం కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే...కార్తీక మాసం పూజలు చేస్తున్న సందర్భంగా పలువురు ఇంట్లో దీపాలు పెట్టడంతో ఆ దీపం ద్వారా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో లెంక అప్పయ్యమ్మ ఇంట్లో తినడానికి దాచుకున్న ధాన్యం, బట్టలు, తదితర వంట సామగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో బాధితురాలు కట్టుబట్టలతో మిగిలింది. ప్రమాదం జరిగినప్పుడు అప్పయ్యమ్మ వరి కోతలకు వెళ్లి పోయింది. ఆమె కుమార్తె వరలక్ష్మి ఇంటి వద్ద ఉంది. సంఘటన విషయాన్ని గజపతినగరం అగ్నిమాపక సిబ్బందికి తెలియజేసిన వెంటనే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మహేశ్వరరావు గ్రామానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. నష్టాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంజీవరావు అంచనా వేశారు. సర్పంచ్ లెంక పద్మావతి బాధితురాలిని పరామర్శించారు. -
‘మధ్యాహ్నా’నికి కట్టెల పొయ్యిలే దిక్కు
నిజాంసాగర్ : మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం సరఫరా చేసిన గ్యాస్ సిలిండర్లు, స్టౌలు మూలనపడ్డాయి. పాఠశాలల వారీగా అందించిన గ్యాస్ కనెక్షన్లకు ప్రభుత్వం సబ్సిడీని వర్తింపజేయకపోవడంతో వంట ఏజెన్సీలకు కట్టెల పొయ్యిలే దిక్కయ్యాయి. ఇరుకుగా ఉన్న వంటశాల గదులు, వరండాల్లో వంట తయారీకి ఏజెన్సీల నిర్వాహకులు నానా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒక్క పూట సంపూర్ణ భోజనాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం వంట ఏజెన్సీల కష్టాలపై దృష్టి సారించడం లేదు. పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న నిర్వాహకులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెం డు అంచెల పద్ధతిన బిల్లులు చెల్లిస్తున్నాయి. అవి వంట ఏజెన్సీలకు స్లాబ్ ధరలు ఏమాత్రం కడుపునింపడం లేవు. నెలనెలా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల పాలవుతున్నా రు. పాఠశాలల గ్యాస్ బండలకు సబ్సిడీ ఇవ్వకపోవడంతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కట్టెలపొయ్యిలనే ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 2,303 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ఒక్క పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. 2 లక్షల కు పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం లబ్ధిపొందుతున్నారు. పథకం అమలును పర్యవేక్షిస్తున్న అధికారులు.. వంట ఏజెన్సీ నిర్వాహకుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులకు ఒక్కపూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం స్లాబ్రేట్లను పెంచకపోవడంతో కార్మికులు కష్టాలను ఎదుర్కుంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ. 4.35, ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ. 6 చొప్పున వంట ఏజెన్సీలకు బిల్లులను చెల్లిస్తోంది. ప్రభుత్వం వంట కార్మికులకు చెల్లిస్తున్న బిల్లులు నిర్వాహకులకు ఏమాత్రం సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. సిలిండర్లను సబ్సిడీపై సరఫరా చేయకపోవడంతో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. దీంతో సిలిండర్లను, గ్యాస్ స్టౌలను మూలన పడేశారు.


