కట్టెల పొయ్యిలతోనే కాలుష్యం ఎక్కువ

Pollution with Wood burning Stoves - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం కట్టెల పొయ్యిలు ఎక్కువ వాడుతారనే విషయం తెల్సిందే. ఈ పొయ్యిల వల్ల ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని నియంత్రించడంలో భాగంగా కట్టెల పొయ్యిల స్థానంలో గ్యాస్‌ స్టవ్‌లను ప్రోత్సహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘పేదల ఇంటింటికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌’ తీసుకొచ్చారు. గ్యాస్‌ సిలిండర్ల కోసం నెలకు ఐదారు వందలు పెట్టాల్సి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో పొయ్యిలోకి కట్టెలు ఉచితంగా దొరకడం వల్ల ఆ పథకం అంతగా విజయవంతం కాలేదు.

కట్టెల పొయ్యిల వల్ల ఎంత వాయు కాలుష్యం ఏర్పడుతుందనే విషయంలో ఇప్పటికీ చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాతావరణంలోని ‘పీఎం–2.5’ కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి అత్యంత హానికరమైనది. దీని వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. పీఎం–2.5 అంటే పార్టికులేట్‌ మ్యాటర్‌ (నలుసులు లేదా రేణువులు) 2.5 సెంటీమీటర్ల వ్యాసం కన్నా తక్కువగా ఉండడం. ఇవి రోజుకు ఒక్క ఇంటి పొయ్యి నుంచి వెలువడుతాయంటే ఓ ట్రక్కు రోజంతా తిరిగితే వెలువడే రేణువులకన్నా ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉన్న కట్టెల పొయ్యిలన్నింటికి 2022 నాటికి స్వస్తి చెప్పాలన్నది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సు నిర్మాణం. ఈ దిశగా లండన్‌ ఇప్పటికే చర్యలు పట్టింది. బ్రిటన్‌లో ప్రస్తుతం 17 లక్షల మంది కట్టెల పొయ్యిలను ఇప్పటికీ వాడుతున్నారు. వారు వంటకోసం కాకుండా రూమును వెచ్చబరచడం కోసమే ఎక్కువగా వాడుతారు. ఇప్పుడవి రకారకాల డిజైన్లలో వస్తుండడంతో వాటి పట్ల లండన్‌ వాసులకు ఆకర్షణ కూడా పెరిగింది. ఎలక్ట్రిక్‌ రూమ్‌ ఈటర్ల కన్నా ఈ కాచుకొనే కట్టెల పొయ్యిలను వాడడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదవడమే కాకుండా ఆకర్షణీయంగా ఉండడం కారణం.

భారత్‌లోని కట్టెల పొయ్యిల కన్నా లండన్‌ వాసుల పొయ్యిల ద్వారా తక్కువ కాలుష్యమే ఏర్పడుతుంది. అయినా వారికి అదే ఎక్కువట. మొత్తం దేశ వ్యాప్తంగా వివిధ రూపాల్లో కలుగుతున్న కాలుష్యంలో వారి కట్టెల పొయ్యిల వల్ల వెలువడుతున్న కాలుష్యం దాదాపు 30 శాతం అట. భారత కట్టెల పొయ్యిల వల్ల కాలుష్యం ఎక్కువగా ఏర్పడగానికి కారణం ఏ కట్టెలు దొరికితే అవే వాడేయడం, కొన్నిసార్తు పచ్చి కట్టలు కూడా వాడడం. లండన్‌ వాసులు ప్రత్యేక దుంగలను వాడుతారు. చిన్న చిన్న దుంగలను, పూర్తిగా ఎండిన దుంగలను, అవి కొన్ని ప్రత్యేక రకాలకు చెందిన దుంగలను మాత్రమే వాడాలంటూ అక్కడి ప్రభుత్వం వారికి మార్గదర్శకాలను నిర్దేశించింది. పొయ్యిల నుంచి ఎక్కువ పొగ రాకుండా ఎక్కువ మంట వచ్చే విధంగా పొయ్యిల నిర్మాణం ఉండాలంటూ వాటిని తయారు చేసే కంపెనీలకు కూడా మార్గదర్శకాలను సూచించింది.
ఈ మేరకు ఇప్పుడు అక్కడి మార్కెట్‌లోకి ఐదు కిలోవాట్ల ‘సిల్వర్‌ డలే 5 ఎస్‌ఈ’ వుడ్‌ బర్కింగా స్టవ్‌ వచ్చింది. దాని ధరం 525 పౌండ్లు (దాదాపు 48 వేలు). అలాగే ‘బెల్టనే మిడ్‌ఫోర్డ్‌ ఎస్సీ’ వుడ్‌ బర్నింగ్‌ స్టవ్‌ వచ్చింది. దాని ధర 946 పౌండ్లు (86 వేలు).

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top