
టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) మైదానంలో ఎంతో కూల్‌గా ఉంటాడు. బాల్‌తోనే ప్రత్యర్థి జట్టు బ్యాటర్లతో మాట్లాడతాడు. పదునైన యార్కర్లతో, బౌన్సర్లతో వారిని బోల్తా కొట్టిస్తాడు. అయితే, తాజాగా బుమ్రా కూడా కాస్త సహనం కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే.. టీమిండియా- వెస్టిండీస్ (IND vs WI 2nd Test) మధ్య శుక్రవారం మొదలైన రెండో టెస్టు.. నాలుగో రోజు ఆటకు చేరుకుంది. 173/2 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టిన విండీస్.. భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.
జాన్ క్యాంప్‌బెల్ సెంచరీ
ఇక ఆదివారం 87 పరుగులతో క్రీజులో నిలిచిన విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (John Campbell)... సెంచరీ (115) సాధించాడు. అయితే, క్యాంప్‌బెల్ 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ బుమ్రా అతడిని వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్నట్లు కనిపించింది.
ఎల్బీడబ్ల్యూ కాదు
అయితే, ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇలింగ్‌వర్త్ మాత్రం తల అడ్డంగా ఉపుతూ ఎల్బీడబ్ల్యూ (Leg Before Wicket) ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో టీమిండియా రివ్యూకి వెళ్లింది. అయితే, రీప్లేలో అల్ట్రాఎడ్జ్ స్పైక్ వచ్చింది. కానీ బంతి ముందుగా ప్యాడ్స్ లేదంటే బ్యాట్‌ను తాకిందా అనేది స్పష్టంగా తెలియలేదు. బంతి అటు బ్యాట్‌కు.. ఇటు ప్యాడ్‌కు అత్యంత సమీపంగా ఉన్నట్లు కనిపించడంతో నిర్ణయం తీసుకోవడం కష్టమైంది.

ఈ నేపథ్యంలో థర్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ ఇన్‌సైడ్ ఎడ్జ్ ఉందని.. ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండవచ్చని స్పష్టం చేశాడు. దీంతో టీమిండియా రివ్యూ కోల్పోయింది.
ఇది అవుట్ అని మీకూ తెలుసు
ఈ క్రమంలో బుమ్రా తిరిగి బౌలింగ్‌కు వెళ్లే సమయంలో.. ‘‘ఇది అవుట్ అని మీకూ తెలుసు. కానీ సాంకేతికత కూడా దానిని నిరూపించలేదు కదా!’’ అంటూ నవ్వుతూనే అంపైర్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. కాగా విండీస్ రెండో ఇన్నింగ్స్ 55వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.
ఇక ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 93 ఓవర్ల ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తద్వారా 33 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంతకుముందు టీమిండియా 518/5 వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. విండీస్ 248 పరుగులకు ఆలౌట్ అయింది.
— crictalk (@crictalk7) October 13, 2025
చదవండి: జైస్వాల్ అంటే గిల్‌కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్ ఫైర్
Trapped! 🕸#RavindraJadeja gets the all-important wicket of centurion #JohnCampbell. 💪
Catch the LIVE action 👉 https://t.co/WbUGnskEdz#INDvWI 👉 2nd Test, Day 4 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/eHUVezgNs2— Star Sports (@StarSportsIndia) October 13, 2025