సడన్‌గా బోలెడంత పాపులారిటీ వస్తే ఏ సెలబ్రిటీ సంతోషపడడు? మరాఠి నటి గిరిజ ఓక్ (Girija Oak) కూడా అంతే.. ఓ ఇంటర్వ్యూ క్లిప్స్ వల్ల సడన్‌గా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. లేటు వయసులో ట్రెండ్ అయింది. తన ఫాలోవర్లు అమాంతం పెరిగారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 20 ఏండ్ల తర్వాత ఈరేంజ్ పాపులారిటీ చూసి గిరిజ సైతం షాకైపోయింది.
ఏ మార్పూ లేదు
ఇదే మంచి తరుణంగా భావించి కెరీర్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. కానీ, రియాలిటీలో అదేమీ జరగడం లేదు. పేరొచ్చింది కానీ అవకాశాలైతే రావడం లేదంటోంది. తాజాగా ద లాలన్‌టాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే లేదనే చెప్తాను. నాకేమీ ఎక్స్‌ట్రా సినిమా ఆఫర్లు రావడం లేదు. పైగా నెగెటివ్ కామెంట్లు కూడా చాలా వస్తున్నాయి.
గంటకు ఎంత?
నా రేటెంత? అని అడుగుతున్నారు. నాతో గంటసేపు గడపాలంటే ఎంత తీసుకుంటానని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లకు లెక్కే లేదు. వీళ్లకు నిజ జీవితంలో నేను తారసపడితే కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఒకవేళ చూసినా.. గౌరవంతో మాట్లాడతారే తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు చేయరు. కానీ ఈ ఆన్‌లైన్ చాటున నోటికి ఏదొస్తే అది అనేస్తున్నారు అని గిరిజ అసహనం వ్యక్తం చేసింది.
సినిమా
కాగా మరాఠి నటి గిరిజ ఓక్ 2004లో మానిని అనే మరాఠి సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. తారే జమీన్ పర్, షోర్ ఇన్ ద సిటీ, సైకిల్ కిల్, కాలా, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్‌స్పెక్టర్ జిండె వంటి హిందీ సినిమాల్లో నటించింది. హిందీతో పాటు మరాఠి, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది.


