breaking news
Girija Oak
-
వస్తావా? గంటకు ఎంత? అని అడుగుతున్నారు
సడన్‌గా బోలెడంత పాపులారిటీ వస్తే ఏ సెలబ్రిటీ సంతోషపడడు? మరాఠి నటి గిరిజ ఓక్ (Girija Oak) కూడా అంతే.. ఓ ఇంటర్వ్యూ క్లిప్స్ వల్ల సడన్‌గా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. లేటు వయసులో ట్రెండ్ అయింది. తన ఫాలోవర్లు అమాంతం పెరిగారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 20 ఏండ్ల తర్వాత ఈరేంజ్ పాపులారిటీ చూసి గిరిజ సైతం షాకైపోయింది. ఏ మార్పూ లేదుఇదే మంచి తరుణంగా భావించి కెరీర్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. కానీ, రియాలిటీలో అదేమీ జరగడం లేదు. పేరొచ్చింది కానీ అవకాశాలైతే రావడం లేదంటోంది. తాజాగా ద లాలన్టాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే లేదనే చెప్తాను. నాకేమీ ఎక్స్ట్రా సినిమా ఆఫర్లు రావడం లేదు. పైగా నెగెటివ్ కామెంట్లు కూడా చాలా వస్తున్నాయి. గంటకు ఎంత?నా రేటెంత? అని అడుగుతున్నారు. నాతో గంటసేపు గడపాలంటే ఎంత తీసుకుంటానని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లకు లెక్కే లేదు. వీళ్లకు నిజ జీవితంలో నేను తారసపడితే కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఒకవేళ చూసినా.. గౌరవంతో మాట్లాడతారే తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు చేయరు. కానీ ఈ ఆన్లైన్ చాటున నోటికి ఏదొస్తే అది అనేస్తున్నారు అని గిరిజ అసహనం వ్యక్తం చేసింది.సినిమాకాగా మరాఠి నటి గిరిజ ఓక్ 2004లో మానిని అనే మరాఠి సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. తారే జమీన్ పర్, షోర్ ఇన్ ద సిటీ, సైకిల్ కిల్, కాలా, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జిండె వంటి హిందీ సినిమాల్లో నటించింది. హిందీతో పాటు మరాఠి, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: కాస్త మర్యాద ఇవ్వండి.. బలుపుతో చెప్పట్లేదు: నిర్మాత -
తెరపై ముద్దు.. ఎలా ఉంటుందో చెప్పిన నటి!
ఇది సోషల్ మీడియా యుగం. ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలియదు. అసలు ఎందుకు ట్రెండ్ అవుతారనే విషయం చెప్పడం కూడా కష్టమే. గత 15 రోజులుగా ఓ నటి పేరు నెట్టింట మారుమోగుతుంది. ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. ఒకే ఒక ఇంటర్వ్యూతో వచ్చింది. ఆ ట్రెండింగ్ బ్యూటీ ఎవరోకాదు మరాఠీ ముద్దుగుమ్మ గిరిజా ఓక్(Girija Oak). ఓ సినిమా కోసం గుల్షన్ దేవయ్యతో రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ ఫన్నీ ఇన్నిడెంట్ని షేర్ చేసుకోవడంతో గిరిజా పేరు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంత వైరల్ అవుతుందని ఆమె కూడా ఊహించలేదు. ఆ ఇంటర్వ్యూ తర్వాత గిరిజాకు సంబంధించిన ఓ కిస్ సీన్ కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ లిప్‌లాక్ సీన్ గురించి కూడా స్పందించారు గిరిజా. ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న ఆమెకు ముద్దు సన్నివేశాలు ఎలా షూట్ చేస్తారు? రొమాంటిక్ సీన్ల షూటింగ్‌కి ప్రత్యేకమైన నైపుణ్యం ఏమైనా అవసరం ఉంటుందా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి గిరిజా సమాధానం ఇస్తూ.. అదంతా మెకానికల్‌గా ఉంటుంది తప్ప..నిజమైన భావాలకు ఏమాత్రం చోటు ఉండదని స్పష్టం చేసిది.‘షూటింగ్ సమయంలో సౌండ్‌కి ఇబ్బంది అవుతుందని ఏసీలను సైతం ఆఫ్ చేస్తారు. చెమటలు కారుతూనే ఉంటాయి. ఒకరు వచ్చి చెమటలు తూడుస్తుంటారు. మరొకరు వచ్చి హెయిర్‌ని సెట్ చేస్తుంటారు. ఇంకోవైపు లైట్ సరిగా పడడం లేదంటూ థర్మాకోల్ తీసుకొస్తారు.. ఇలా ఇన్ని కళ్లు చూస్తున్నప్పుడు రొమాన్స్ ఎక్కడ నుంచి వస్తుంది? అదంతా మెకానికల్, టెక్నికల్ ప్రాసెస్ మాత్రమే. ఆ సీన్లు షూట్ చేసేటప్పుడు హీరో ముఖం కంటే ఎక్కువగా సౌండ్ ఇంజనీరింగ్ ముఖమే గుర్తుకు వస్తుంది’ అని నవ్వుతూ చెప్పింది గిరిజా.ఇక ముద్దు సీన్ గురించి మాట్లాడుతూ.. తెరపై కిస్ అంటే.. కార్ట్బోర్డ్ని ముద్దు పెట్టుకున్నట్లే ఉంటుందని చెప్పింది. క్లోజప్ సీన్స్ తీసేటప్పుడు ఎదుటివాడు అక్కడ ఉండడు కూడా. కెమెరాని చూస్తూనే నటించాల్సి ఉంటుంది. అక్కడ ఏ మాత్రం ఎమోషన్ ఉండదు. చాలా సార్లు నేను కెమెరా దగ్గర ఉన్న ఒక స్టాండ్ లేదా థర్మాకోల్ ముక్కను చూస్తూ రొమాంటిక్ డైలాగులు చెప్పాను’ అని గిరిజా చెప్పుకొచ్చింది.ఎవరీ గిరిజా?స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజా ఓక్.. హిందీలోనూ పలు మూవీస్ చేసింది. బాలీవుడ్లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి సినిమా. ఆ తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ(2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది. రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఇన్స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది. -
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
కొందరు తారలు ఫస్ట్ సినిమాకే క్లిక్ అవుతుంటారు.. మరికొందరు పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే కానీ క్లిక్ అవరు. కానీ, మరాఠి నటి గిరిజ ఓక్ (Girija Oak Godbole) సోషల్ మీడియా వల్ల సడన్‌గా పాపులర్ అయిపోయింది. హిందీ, మరాఠి, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆమె ఇంటర్వ్యూ క్లిప్పింగ్సే కనిపిస్తున్నాయి.చాలా హ్యాపీ..ఇలా సడన్‌గా వైరల్‌గా మారడంపై సంతోషం వ్యక్తం చేసింది గిరిజ. అయితే తన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. అందులో గిరిజ మాట్లాడుతూ.. ఆన్లైన్లో నాకు వస్తున్న సడన్ అటెన్షన్ చూసి షాకైపోయాను. చాలామంది నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. గ్యాప్ లేకుండా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రేమ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. కొన్ని మీమ్స్ చూస్తుంటే భలే సరదాగా ఉన్నాయి. నా 12 ఏళ్ల కొడుకుస్తే..కానీ కొన్ని మీమ్స్‌లో మాత్రం ఏఐ (కృత్రిమ మేధ)ను ఉపయోగించి నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. అవి చూడటానికి కూడా చాలా అసౌకర్యంగా ఉన్నాయి. ఆ ఎడిటింగ్స్ అస్సలు బాగోలేవు. ఏదైనా వైరలయితే చాలు ఇలా ఏవేవో ఇష్టమొచ్చినట్లు ఎడిట్లు చేస్తుంటారు. దీనికి హద్దులు, పరిమితులంటూ ఏవీ ఉండవు. అదే నాకు వచ్చిన పెద్ద సమస్య! నాకు 12 ఏళ్ల కొడుకున్నాడు. ప్రస్తుతానికైతే వాడు సోషల్ మీడియా వాడడు. కానీ, రేప్పొద్దున వాడు కూడా ఈ ఆన్లైన్ ప్రపంచంలో అడుగుపెట్టక మానడు. చీప్ ట్రిక్స్ మానుకోండిఅప్పుడు నా మార్ఫింగ్ ఫోటోలు వాడి కంట పడతాయని భయంగా ఉంది. మా అమ్మ అభ్యంతరకర ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయేంటి? అని వాడు బాధపడతాడన్న ఆలోచనే నన్ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వ్యూస్ కోసమే మీరిలాంటి అసభ్య ఫోటోలు సృష్టిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండి. ఒకమ్మాయి ఫోటోలను ఇలా ఎడిట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అంతకంటే ఏం కావాలి!అలాంటి ఎడిటింగ్ ఫోటోలను చూసి ఆస్వాదించేవారు కూడా ఈ తప్పుడు పనిలో భాగమైనట్లే లెక్క! దయచేసి అలాంటివి ఆపేయండి. ఇదంతా పక్కనపెడితే సడన్‌గా వచ్చిన ఈ పాపులారిటీ వల్ల ఎక్కువమంది జనాలు నా సినిమా, సిరీస్‌లు చూస్తే అంతే చాలు అని వీడియో ముగించింది. గిరిజ ఓక్... హిందీలో తారే జమీన్ పర్, షోర్ ఇన్ ద సిటీ, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జిండె సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Girija Oak Godbole (@girijaoakgodbole) చదవండి: నా యాక్టింగ్‌పై నాకే డౌట్: దుల్కర్ -
లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)
-
ట్రెండింగ్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?
గత మూడు నాలుగు రోజుల నుంచి ఓ నటి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి కారణం ఓ ఇంటర్వ్యూ. అలా అని ఆమె గ్లామరస్ హీరోయిన్ కాదు, ఇంటర్వ్యూలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఏం చేయలేదు. అయినా సరే ఈమె గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎందుకు వైరల్ అవుతుందనేది చూద్దాం.సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతారనేది చెప్పలేదు. తాజాగా ఓ హిందీ ఇంటర్వ్యూలో మరాఠీ నటి గిరిజా ఓకే పాల్గొంది. తన గురించి పలు విషయాలు చెప్పింది. 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య.. తనతో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకేనా అని 17 సార్లు తనని అడిగాడని, అలాంటి యాక్టర్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని గిరిజా చెప్పుకొచ్చింది. ఈ బిట్‌తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన పలు వీడియో క్లిప్స్ ట్విటర్లో తెగ కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)స్లీవ్ లెస్ బ్లౌజ్, స్కై బ్లూ చీరలో గిరిజా ఓకే చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ.. నెటిజన్లు ఎందుకో ఈమెని చూసి ఫిదా అయిపోయినట్లు ఉన్నారు. అందుకే ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యేసరికి ఈమె ఎవరా అని తెగ కామెంట్స్ పెడుతున్నారు. అలా అని ఈమేం కొత్తగా ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన నటి కాదు. 2004 నుంచి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజా ఓక్.. హిందీలోనూ పలు మూవీస్ చేసింది. బాలీవుడ్లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి చిత్రం. ఇందులో చిన్న రోల్ చేసినప్పటికీ ఫేమ్ సంపాదించింది. తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ(2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది. రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఇన్స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది. ఇప్పుడు ట్రెండ్ కావడం ఏమో గానీ ఈమె యాక్ట్ చేసిన పాత మూవీ క్లిప్స్ అన్నీ ఇప్పుడు వైరల్ చేస్తున్నాడు. ఇలా వైరల్ అయిన వీడియోల్లో సందీప్ కిషన్‌తో గిరిజ చేసిన రొమాంటిక్ సీన్ కూడా ఒకటుంది.గిరిజ వ్యక్తిగత జీవితానికొస్తే.. తండ్రి గిరీష్ ఓకే కూడా నటుడే. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత థియేటర్స్‌లో చేరింది. తొలుత అడ్వర్టైజ్మెంట్స్ చేసి గుర్తింపు తెచ్చుకుని తర్వాత నటిగా మారింది. సుహ్రుద్ గోడ్బోలే అనే నిర్మాతని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా 37 ఏళ్ల వయసులో ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతానని ఈమె కూడా అనుకుని ఉండదేమో?(ఇదీ చదవండి: తిరుమలలో పెళ్లి చేసుకున్న 'కేజీఎఫ్' సింగర్)


