బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నటించిన కొత్త సినిమా ‘120 బహదూర్’ ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం అదనంగా రూ. 349 అద్దె చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించకుండా సినిమా చూసే అవకాశం రానుంది. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రజనీష్ (రాజీ ఫేమ్) దర్శకత్వం వహించారు. పరమ వీర చక్ర అవార్డ్ అందుకున్న మేజర్ సైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ అక్తర్ మెప్పించారు. ఇందులో రాశీఖన్నా కీలక పాత్రలో నటించింది. గతేడాదిలో విడుదులైన ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ లేకుండా ప్రభుత్వాలు అనుమతులు కూడా ఇచ్చాయి.

‘120 బహదూర్’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జనవరి 16నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు. భాగ్ మిల్కా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్ మరోసారి బయోపిక్ చేయడంతో భారీగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురుచూశారు. ఈ హిస్టారికల్ మూవీ అందరినీ మెప్పిస్తుంది. కానీ, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు.
'120 బహదూర్' విషయానికొస్తే.. మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్).. తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్‌లో ఎలాంటి యుద్ధం చేశాడు. మూడు వేల మంది చైనా సైనికుల్ని ఎలా నిలువరించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. యుద్ధ తరహా సినిమాలంటే ఇష్టముండే వాళ్లకు ఇది నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు రొటీన్‌గానే అనిపించొచ్చు. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ.. విజువల్స్, యాక్టింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి.


