మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్ షోల విషయంలో దుమ్మురేపుతున్నాడు. హైదరాబాద్‌లో ఏకంగా 200 స్క్రీన్స్‌లలో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. రూ. 600 టికెట్ ఉన్నప్పటికీ దాదాపు అన్ని థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. ఆపై నార్త్ అమెరికాలో కూడా టికెట్స్ బుకింగ్ జోరు కనిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అమెరికాలో కేవలం ప్రీమియర్స్ ద్వారానే 9 లక్షల డాలర్లు (రూ. 8.12కోట్లు) కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. 1మిలియన్ మార్క్ కూడా చేరవచ్చని తెలుస్తోంది. దీంతో చిరంజీవి కెరీర్‌లో మరో అతిపెద్ద ఓవర్సీస్ ఓపెనింగ్‌గా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

‘మన శంకర వరప్రసాద్ గారు’ అమెరికా ప్రీమియర్స్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రీమియర్స్ కలెక్షన్స్ పరంగా చిరు కెరీర్‌లో రెండో చిత్రంగా నిలిచింది. మొదటి స్ధానంలో ఖైదీ 150 మూవీ ఉంది. చిరు రీఎంట్రీ మూవీ కావడంతో కేవలం ప్రీమియర్స్ ద్వారా 1.25 మిలియన్ డాలర్స్ వచ్చాయి. ఆ తర్వాత అంతటి రేంజ్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి దక్కింది. అయితే, చిరు హిట్ సినిమా వాల్తేరు వీరయ్య కూడా 6 లక్షల డాలర్ల వద్దే ఆగిపోయింది. సంక్రాంతి పండుగ కాబట్టి చిరు సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తే తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలిచే ఛాన్స్ ఉంది.


