ఢిల్లీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ నావల్ బేస్‌లను ధ్వంసం చేసిన తర్వాత అమెరికా భారత్ నావల్ బేస్‌లను వినియోగిస్తోందంటూ అమెరికా మీడియా విస్తృత ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది.
భారత్ స్పష్టంగా తెలిపింది: అమెరికా మీడియా ప్రసారం చేస్తున్న కథనాలు అసత్యమని, భారత నావల్ బేస్‌లను అమెరికా వినియోగిస్తోందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కథనాలను నిరాధారమైనవిగా, కల్పితమైనవిగా పేర్కొంది.
ఇటీవల ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరిగిన నేపథ్యంలో, అమెరికా ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ ఒక అమెరికా మీడియా సంస్థ నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా అన్ని బేస్‌లు ధ్వంసం అయ్యాయి. మా నౌకాశ్రయ (Harbour) సదుపాయాలు కూడా నాశనం అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం భారత్, భారత పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సరైన పరిష్కారం కాదు, కానీ పరిస్థితుల వల్ల తప్పనిసరిగా చేయాల్సి వస్తోంది’ అని అన్నారు. అయితే, అమెరికా మీడియా సంస్థ OAN ప్రసారం చేసిన ఈ కథనాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
అమెరికా నేవీ భారత్ పోర్టులను వినియోగిస్తున్నట్లు అమెరికా మీడియా చేస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం. ఇలాంటి నిరాధారమైన, కల్పిత వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Claim: On a US-based channel, One America News Network (@OANN), former U.S. Army Colonel Douglas Macgregor made a statement suggesting that the United States is using Indian naval bases to attack Iran, amidst the ongoing Iran-US conflict.#PIBFactCheck:
❌This claim is #FAKE… pic.twitter.com/nzcXCi7yT9— PIB Fact Check (@PIBFactCheck) March 4, 2026
Fake News Alert!
Claims being made on OAN, a US based channel that Indian ports are being used by the US Navy are fake and false. We caution you against such baseless and fabricated comments. pic.twitter.com/xiFWnkoXBk— MEA FactCheck (@MEAFactCheck) March 4, 2026


