కువైట్ సిటీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధంలో తీవ్ర ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. కువైట్ తీరానికి సమీపంలో ఇరాన్‌కు చెందిన ఓ పెద్ద ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో సముద్రంలో భారీగా చమురు లీక్ అవుతూ, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడిందని యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (UKMTO) ఈ సంఘటనను ధృవీకరించింది. ఆ ట్యాంకర్‌ను పేల్చింది అమెరికానేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కువైట్ సముద్ర తీరంలో కూలిన ఆ ట్యాంకర్ ఇరాన్‌కు చెందినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు తర్వాత మంటలు చెలరేగి, సముద్రంలో చమురు వ్యాపించడంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. కువైట్, యుఎఇ, శ్రీలంక తీరప్రాంతాలకు ఈ చమురు లీక్ ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళం, ఇరాన్ మిలిటరీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ పేలుడు ఆ యుద్ధానికి సంబంధించి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యూఏఈ, కువైట్ అధికారులు అత్యవసర చర్యలు ప్రారంభించారు. సముద్రంలో చమురు వ్యాప్తిని నియంత్రించడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు. ఈ లీక్ వల్ల సముద్ర జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా రక్షణ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఇరాన్ మిలిటరీ ఈ పేలుడులో తమ ప్రమేయం లేదని ప్రకటించింది. అయితే, యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మరింత ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
UKMTO WARNING INCIDENT 014-026
Click here to view the full warning ⤵️ https://t.co/ygKSBOCLZi#MaritimeSecurity #MarSec pic.twitter.com/RPZXtz6RU7— UKMTO Operations Centre (@UK_MTO) March 5, 2026


