అంత పెద్ద క్షిపణీ... చిన్నబోయిన వేళ! | A shepherd boy walks away from an unexploded Iranian projectile that landed | Sakshi
Sakshi News home page

అంత పెద్ద క్షిపణీ... చిన్నబోయిన వేళ!

Mar 5 2026 7:40 AM | Updated on Mar 5 2026 2:09 PM

A shepherd boy walks away from an unexploded Iranian projectile that landed

ఈ ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది. ఆ చిన్నారి బాలుని గుండె ధైర్యం ముందు అంత పెద్ద క్షిపణి కూడా చిన్నబోయి నేలచూపులు చూస్తున్నట్టుగా ఉంది కదూ! ఇది పేలని క్షిపణి. ఇజ్రాయెల్‌–అమెరికాపై యుద్ధంలో భాగంగా బుధవారం ఇరాన్‌ ప్రయోగించగా తూర్పు సిరియాలోని ఖమిష్లీ శివార్లలో ఇలా బహిరంగ ప్రదేశంలో పడిపోయింది. పశువుల కాపరి అయిన ఆ బాలుడు ఒక చేత్తో టోపీని నింపాదిగా సర్దుకుంటూ, మరో చేతిలో కర్రతో ఆ క్షిపణి పక్కనుంచే ఇదుగో, ఇలా నిబ్బరంగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు.


తగ్గుతున్న అమెరికా క్షిపణి నిల్వలు
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా వద్ద క్షిపణి నిల్వలు శరవేగంగా తగ్గుతున్నట్టు సమాచారం. ఇంటర్‌సెప్టర్లు, గైడెడ్‌ మిసైళ్ల సంఖ్య బాగా తగ్గుతున్నట్టు పెంటగాన్‌ ఆందోళన వెలిబుచి్చంది. ఇరాన్‌పై దాడులు ఇంకో వారం పది రోజులు కొనసాగితే క్షిపణి నిల్వలు మరీ క్షీణించవచ్చని పేర్కొంటూ అది రూపొందించిన తాజా నివేదిక ఒకటి లీకైంది. అమెరికా వద్ద అపారమైన ఆయుధ నిల్వలున్నట్టు అధ్యక్షుడు ట్రంప్‌ రెండు రోజుల క్రితమే ప్రకటించడం తెలిసిందే. అత్యాధునిక క్షిపణులతో పాటు ఇతర ఆయుధాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.   

Advertisement
 
Advertisement
Advertisement