ఖమేనీ మరణంపై మోర్టీషియా అడామ్స్ కీలక వ్యాఖ్యలు | Morticia Addams Controversial Reaction To Iran's Supreme Leader Khamenei's Death, Celebrations And Protests Erupt Worldwide | Sakshi
Sakshi News home page

ఖమేనీ మరణంపై మోర్టీషియా అడామ్స్ కీలక వ్యాఖ్యలు

Mar 1 2026 5:14 PM | Updated on Mar 1 2026 6:39 PM

Morticia Addams Reacts to Khamenei Death

ఒట్టావా: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణంతో ఆస్ట్రేలియా,కెనడా,లండన్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఇరాన్‌ శరాణార్ధులు సంబరాలు చేసుకున్నారు. రోడ్లమీదకు వచ్చి కాకర్లు కాల్చతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇరాన్‌ ప్రజలు సైతం డిక్టేటర్‌ మృతి అంటూ నినాదాలు చేశారు. కొన్ని చోట్ల ఖమేనీ విగ్రహాల్ని కూల్చేశారు.

ఈ క్రమంలో ఓ యువతి వార్తల్లో నిలిచింది. ఆ యువతే గతంలో ఖమేనీ చిత్రాన్ని కాల్చి ఆ మంటతో సిగరెట్ వెలిగించిన వీడియోతో వైరల్‌గా మారారు. తాజాగా, ఖమేనీ మరణంపై ఆమె స్పందించారు.‘నా పేరు మోర్టీషియా అడామ్స్. కెనడాలో నివసిస్తున్న ఇరానియన్ శరణార్థి. కెనడాలో జరిగిన ఇరాన్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖమేనీ టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల్ని తాజాగా ఆమె ప్రస్తావించారు. 

మరోవైపు, ఖమేనీ మృతిపై ఇరాన్ వ్యతిరేక వర్గాల్లో చర్చనీయాంశమవుతుండగా ఖమేనీ అనుచరులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకవైపు టెహ్రాన్‌లో సంతాప సభలు జరుగుతుండగా..మరోవైపు విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్ శరణార్థులు ఆయన మరణాన్ని సంబరంగా జరుపుకోవడం హాట్‌టాపిగ్గా మారింది. ఈ పరిణామం ఇరాన్ భవిష్యత్తు రాజకీయ దిశపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement