పాకిస్తాన్‌లో హై అలర్ట్‌.. యూఎస్‌ కాన్సులేట్‌కు నిప్పు.. | Pakistan Protesters Attack On US Consulate In Karachi After Khamenei Death, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో హై అలర్ట్‌.. యూఎస్‌ కాన్సులేట్‌కు నిప్పు..

Mar 1 2026 12:51 PM | Updated on Mar 1 2026 1:56 PM

Pakistan protesters attack US Consulate in Karachi

ఇస్లామాబాద్‌: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల ఎఫెక్ట్‌ పాకిస్తాన్‌ను తాకింది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. పాకిస్తాన్ కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై పాకిస్తానీలు దాడి చేశారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నిరసనగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.

వివరాల మేరకు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నిరసనకారులు.. పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్‌పై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేశారు. కాన్సులేట్‌ భవనానికి నిప్పు పెట్టారు. దీంతో, రంగంలోకి దిగిన పాకిస్తాన్‌ సైన్యం, పోలీసులు.. నిరసనకారులపైకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. మరోవైపు.. అమెరికా సైన్యం కాల్పుల జరపడంతో ఎనిమిది పాకిస్తానీలు మృతి చెందినట్టు, పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ క్రమంలో అమెరికా కాన్సులేట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement