ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అతనే.. ప్రతీకారం తీర్చుకుంటాం.. | Iran New Supreme Leader Mojtaba Khamenei Son Of Ayatollah Ali Khamenei, Warns Of Unprecedented Attacks On US And Israeli Bases | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అతనే.. ప్రతీకారం తీర్చుకుంటాం..

Mar 1 2026 10:45 AM | Updated on Mar 1 2026 11:29 AM

Iran new Supreme Leader Mojtaba Khamenei

టెహ్రాన్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి చెందాడు. ఈ మేరకు ఇరాన్‌, అమెరికా.. ఖమేనీ మృతిని నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరనేది చర్చకు దారి తీసింది. అయితే, ఖమేనీ తన జీవితకాలంలో ఎవరినీ అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఎంపిక బాధ్యత ఎవరిది? 
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, కొత్త సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రేణి మత పండితులు ఉంటారు. వీరు చర్చించి కొత్త నేతను ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పాత్ర ఇందులో అత్యంత కీలకం. దేశంలో అత్యంత శక్తివంతమైన ఈ సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.

కాగా, తాజా దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్‌పూర్ కూడా మరణించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ఐఆర్‌జీసీ చీఫ్‌గా అహ్మద్‌ వహిదీ నియామకం అయ్యారు. అనంతరమే.. ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్టు తెలిసింది.

మరోవైపు.. ఖమేని హత్య కారణంగా ఇరాన్‌ సైన్యం విరుచుకుపడుతోంది. యూఏఈ, ఖతార్‌, బహ్రెయిన్‌పై ఇరాన్‌ దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్‌ దాడులతో బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్టు ధ్వంసమైంది. ఇదే సమయంలో అమెరికా- ఇజ్రాయెల్‌పై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్‌ కేబినెట్‌ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (IRGC) సంతాపం తెలిపింది. ఈ సందర్బంగా తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని..  చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగొచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌, యూఎస్‌ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్‌ చేపట్టేందుకు ఐఆర్‌జీసీ సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement