breaking news
Ayatollah Ali Khamenei
-
సూపర్ పవర్ ఇరాన్ డార్క్ సీక్రెట్.. ఇలాంటి పరిస్థితి ఎందుకు?
ఇటీవలి కాలంలో ఇరాన్ అనగానే మనందరికీ ఏం గుర్తుకొస్తుంది.. వీధుల్లో నిరసనలు, మహిళల హిజాబ్ ఆందోళనలు, ఇజ్రాయెల్-అమెరికా దేశాలతో యుద్ధాలు, ఆంక్షలు.. మతచాందసవాద ప్రభుత్వం..! కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు ఇరాన్ అంటే ఇదంతా కాదు..! ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్లలో ఇరాన్ ఒకటి. 2,000 ఏళ్ల చరిత్ర ఉన్న 'పర్షియన్ సామ్రాజ్యం' పశ్చిమాసియాతోపాటు.. మధ్య ఆసియాను ఏలింది..! మరి అలాంటి గొప్ప నాగరికత ఉన్న దేశం.. ఈ రోజు ఒక క్రూరమైన, మతచాందసవాద రెజీమ్గా ఎలా మారింది..? అమెరికా, బ్రిటన్ వేసిన ఎత్తుగడలు ఇరాన్‌ను ఎలా మార్చేశాయి.. ఇరాన్ అసలు రక్తచరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే అసలు కథ తెలుస్తుంది..చరిత్రలోకి వెళ్తే క్రీస్తు శకం 1800 ప్రాంతంలో ఇరాన్‌ను 'కజార్' రాజవంశం పాలిస్తోంది. బయటి ప్రపంచం దీన్ని 'పర్షియా' అని పిలిచేది. ఆ సమయంలో రెండు పెద్ద సామ్రాజ్యాలు ఇరాన్‌పై కన్నేశాయి. వాటిల్లో ఒకటి రష్యన్ ఎంపైర్, రెండోది బ్రిటిష్ ఎంపైర్. రష్యాకు చలికాలంలో గడ్డకట్టని సముద్ర మార్గాలు కావాలి. అందుకే రష్యా ఇరాన్‌పై దాడి చేసి.. కొన్ని యుద్ధాల్లో ఓడించి, ఇరాన్ సముద్ర మార్గాలపై పూర్తి హక్కులు సాధించింది. ఇది చూసి బ్రిటన్ వణికిపోయింది..!రష్యా గనక ఇరాన్‌ను దాటుకుని ముందుకు వస్తే.. తమ అత్యంత విలువైన కాలనీ అయిన 'ఇండియా' రష్యా చేతికి చిక్కుతుందని భయపడింది. దాంతో బ్రిటన్, రష్యా మధ్య ఇరాన్‌ను ఎవరు కంట్రోల్ చేయాలనే ఒక పెద్ద పోటీ మొదలైంది. దాన్నే చరిత్రలో 'ది గ్రేట్ గేమ్' అంటారు. బ్రిటన్ ఓపెన్‌గానే చెప్పింది.. ‘మాకు ఇరాన్‌ను ఆక్రమించడం ఇష్టం లేదు. కానీ రష్యా ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోలేం..’ అని..! దాంతో ఇరాన్ రాజు షహా డబ్బుల కోసం తన దేశంలోని ఆస్తులను, రైల్వేలను, పరిశ్రమలను వ్యాపార హక్కులుగా రష్యా, బ్రిటన్లకు అమ్మేయడం మొదలుపెట్టాడు.1908లో ఇరాన్లో ఒక పెద్ద నిధి దొరికింది.. అదే చమురు..! బ్రిటిష్ నావికాదళం తమ నౌకలను బొగ్గు నుంచి చమురుకు మార్చే సమయానికి ఇరాన్లో క్రూడాయిల్ దొరకడం ఒక వరంగా మారింది. దీంతో.. బ్రిటన్ 'ఆంగ్లో-ఇరానియన్ ఆయిల్ కంపెనీ'ని స్థాపించింది. ఇప్పటికీ కొనసాగుతున్న British Petroleum కంపెనీయే అది..! ఇరాన్ చమురును తోడేస్తూ బ్రిటన్ ధనికదేశమైంది. కానీ ఇరాన్‌కు ఇచ్చిన వాటా కేవలం 16 శాతం మాత్రమే..! దీన్ని నిరసిస్తూ.. 1951లో ఇరాన్ ప్రజలు మొహమ్మద్ మొసద్దెగ్ (Mohammad Mosaddegh) అనే ప్రజాస్వామ్య నాయకుడిని తమ ప్రధానిగా ఎన్నుకున్నారు. మొసద్దెగ్ వచ్చీ రాగానే ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు.‘‘ఇరాన్ చమురు ఇరాన్ ప్రజలదే..! విదేశీయులు నడిపే ఆయిల్ కంపెనీని జాతీయకరణ (Nationalize) చేస్తున్నాం’’ అని ప్రకటించాడు..! ఈ నిర్ణయాన్ని బ్రిటన్, అమెరికా తట్టుకోలేకపోయాయి. 1953లో అమెరికా CIA, బ్రిటన్ MI6 కలిసి ఇరాన్లో రహస్యంగా ఒక కుట్ర పన్నాయి. ఫలితంగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రధాని మొసద్దెగ్ గద్దెదిగడమే కాకుండా.. జైలుపాలవ్వాల్సి వచ్చింది. బ్రిటన్, అమెరికాకు పెంపుడు కుక్కలా పనిచేసే 'మొహమ్మద్ రేజా షహా' (Mohammad Reza Shah) అనే రాజును సింహాసనంపై కూర్చోబెట్టారు..!ఖమేనీ ఎంట్రీ.. అమెరికా రక్షణతో అధికారంలోకి వచ్చిన షహా.. ఇరాన్లో వేగంగా పాశ్చాత్యీకరణ చేయడం మొదలుపెట్టాడు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చాడు, పాఠశాలలు కట్టించాడు. సాంప్రదాయ ఇస్లామిక్ పద్ధతులను రద్దు చేశాడు. హిజాబ్‌ను నిషేధించాడు. తనను ఎదిరించిన వారిని సీఐఏ సాయంతో ఏర్పడిన 'సవాక్' అనే క్రూరమైన సీక్రెట్ పోలీసులతో హింసించి చంపేశాడు. ప్రజల్లో కోపం నరనరానా పాకింది..! ‘‘మన రాజు అమెరికా చేతిలో కీలు బొమ్మ.. మన సంస్కృతిని, చమురును విదేశీయులు దోచుకుంటున్నారు’’ అని ప్రజలు రగిలిపోయారు. ఆ సమయంలో వచ్చాడు అయతుల్లా రుహోల్లా ఖమేనీ..!ఆయన ఒక మత గురువు. ఆయన దేశం వెలుపల ఉంటూ క్యాసెట్ టేపుల ద్వారా ఇరాన్ ప్రజలకు సందేశాలు పంపేవాడు. ‘‘బ్రిటన్, అమెరికాలు మనల్ని బానిసలుగా చేశాయి. ఈ షహాను తరిమికొట్టండి..!’’ అని పిలుపునిచ్చాడు. 1979లో ఇరాన్ ప్రజలందరూ.. అంటే విద్యార్థులు, కార్మికులు, మత పెద్దలు కలిసి విప్లవం లేవనెత్తారు..! ఆ దెబ్బకు షహా దేశం వదిలి పారిపోయాడు. ఖమేనీ మళ్లీ ఇరాన్ వచ్చి 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్'ను స్థాపించాడు..!పక్కా నెట్వర్క్.. 1979 తర్వాత ఖమేనీ ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం చాలా విచిత్రమైనదని చెప్పవచ్చు. అమెరికా, రష్యా వంటి ఏ విదేశీ శక్తి మళ్లీ వచ్చి, తమ దేశాన్ని ఆక్రమించకుండా ఉండటానికి.. ఖమేనీ ఒక పక్కా నెట్వర్క్ నిర్మించాడు.మొదటిది ఫిల్టర్డ్ ప్రజాస్వామ్యం: ఇరాన్లో ఎన్నికలు ఉంటాయి. ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ వీళ్లందరి కంటే పైన సుప్రీమ్ లీడర్ (Supreme Leader) ఉంటాడు. మత కౌన్సిల్‌కు నచ్చిన వాళ్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలి.రెండోది.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్: సాధారణ మిలిటరీగా కాకుండా, మత ప్రభుత్వాన్ని కాపాడటానికి సొంతంగా 'IRGC' అనే 5 లక్షల బలగాలున్న ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశారు.మూడోది ప్రాక్సీ నెట్వర్క్: లెబనాన్‌లో హెజ్బొల్లా, యెమెన్‌లో హూతీలు, ఇరాక్‌లోని మిలీషియాలు.. పాలస్తీనాలో హమాస్.. ఇలా పశ్చిమాసియా అంతటా తమ ప్రాక్సీ గ్రూపులను తయారు చేసిన ఇరాన్, వాటి ద్వారా అమెరికా-ఇజ్రాయెల్లను భయపెట్టడం మొదలుపెట్టింది. ఈరోజు ఇరాన్ వద్ద ఉన్న అణు కార్యక్రమం (Nuclear Program) కూడా.. విదేశీయులు తమపై దాడి చేయకుండా ఉండటానికి వాడుతున్న ఆఖరి ఆయుధమే..!ఇరాన్ విషయంలో ఫైనల్‌గా మనం ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి..! ఇప్పుడున్న ఇరాన్ ప్రభుత్వం నిరంకుశమైనదే కావచ్చు. కానీ.. ఇరాన్ ప్రజలు వేరు. ఇరాన్ ప్రభుత్వం వేరు..! వివిధ సర్వేల ప్రకారం.. ఇరాన్‌లోని 80 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ మతఛాందస ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. గత 200 ఏళ్లుగా ఇరాన్ ప్రజలు ఒకవైపు తమ సొంత నిరంకుశ పాలకులు, ఇంకోవైపు తమ స్వార్థం కోసం దేశాన్ని వాడుకున్న అమెరికా, బ్రిటన్, రష్యా వంటి విదేశీ శక్తుల మధ్య నలిగిపోతూనే ఉన్నారు. ఇదీ ఇరాన్ అసలు చరిత్ర.-హెచ్. కమలాపతి రావు, సీనియర్ జర్నలిస్టు. -
మొజ్తబా పని అయిపోయినట్లే!.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్న ట్రంప్.. మొజ్తబా పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని, ఆయన పని అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. "వారికి నౌకాదళం లేదు.. వైమానిక దళం లేదు.. గగనతల రక్షణ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. వారి కీలక నాయకులంతా హతమయ్యారు" అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఖమేనీ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ.. మేం జరిపిన దాడుల్లో అయతొల్లా ఖమేనీ చనిపోయారు. ఆ తర్వాత సుప్రీం లీడర్ అంటూ ఆయన వారసుడు మొజ్తబా ఖమేనీ వచ్చారు. ఆయన పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆయన 90 శాతం దెబ్బతిన్నారు. ఆయన పని కూడా దాదాపు అయిపోయినట్లే అని అన్నారు. అయితే మొజ్తబా పరిస్థితిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలను అమెరికా విడుదల చేయలేదు. ఇరాన్ కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు.తండ్రి మరణం తర్వాత తెరపైకి.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పేరు ఒక్కసారిగా అంతర్జాతీయ చర్చల్లోకి వచ్చింది. ఇరాన్ రాజకీయ వ్యవస్థపై ప్రభావం ఉన్న వ్యక్తిగా మొజ్తబాను పరిగణిస్తుంటారు. అయతొల్లా మరణం తర్వాత సుప్రీం ఎవరు? అనే సమయంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. అయితే.. గతంలో ఆయనపై ఉన్న విమర్శలు, వివాదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఆ గౌరవం దక్కడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే మత పెద్దలు, ఐఆర్జీసీ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపించింది. అయితే సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అయతొల్లా ఖమేనీ కుటుంబ సభ్యులు కొందరు మరణించారు. అయితే ఆ దాడిలో కొడుకు మొజ్తాబా మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారనే ప్రచారం ప్రచారం మాత్రం జోరుగా సాగింది. ముఖ్యంగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు కూడా మొజ్తబా హాజరు కాలేదు. టెహ్రాన్‌లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో ఆయన సోదరులు మాత్రమే పాల్గొన్నారు. దేశ అత్యున్నత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఇప్పటిదాకా కనిపించకపోవడం తీవ్ర చర్చకు కారణమైంది.త్వరలో ప్రజల ముందుకు వస్తారా?ఇటీవల మొజ్తబా ఖమేనీ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారనే ప్రచారం జరుగుతోంది. తన తండ్రి జ్ఞాపకార్థం నిర్వహించే భారీ స్మారక సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉందని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సభలో ఆయన ప్రత్యక్షమైతే.. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి బహిరంగ కార్యక్రమం కానుంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి, నాయకత్వ సామర్థ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని భావించారు.‘తండ్రి మరణానికి ప్రతీకారం’ అంటూ ప్రకటనలుఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గాయపడిన మొజ్తబా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. సందేశాలు ఏమున్నా సరే.. అత్యంత గోప్యంగా ఆయనకు చేరవేస్తూ వస్తున్నారు. అలాగే ఆయన నుంచి బదులు కూడా అలాగే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తప్పదంటూ మొజ్తబా కూడా ప్రకటన ఇచ్చినట్లు ఇరాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు నిజంగానే వస్తారా?.. ట్రంప్ ప్రకటన ఉత్తదేనని తేలుస్తారా? అన్నది కీలకంగా మారింది.హర్ముజ్‌పై ట్రంప్ ప్రకటన.. భగ్గుమన్న ఇరాన్ఇదే సమయంలో ట్రంప్ హర్ముజ్ జలసంధిపై కూడా కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై సముద్ర దిగ్బంధనాన్ని తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. హర్ముజ్ గుండా ప్రయాణించే కార్గో నౌకల నుంచి 20 శాతం రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిపై ఇరాన్ భగ్గుమంది. హర్ముజ్ విషయంలో అమెరికా జోక్యం సహించబోమని.. తమ నౌకలపై ఆధిపత్యం ప్రదర్శిస్తే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. ఇటు అమెరికాకు సహకరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గల్ఫ్ దేశాలను సైతం వారించింది. -
అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించిన మిస్టరీ వ్యక్తి ఎవరు?
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో నల్ల ముసుగు ధరించిన ఓ వ్యక్తి కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ముందు వరుసలో నిలబడి ప్రార్థనల్లో పాల్గొన్న ఆ వ్యక్తిని చూసిన చాలామంది మొజ్తబా ఖమేనీ తొలిసారి బహిరంగంగా కనిపించారని ఊహించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వేగంగా వైరల్ కావడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే కొద్ది గంటల్లోనే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ముసుగు వెనుక ఉన్న వ్యక్తి మొజ్తబా ఖమేనీ కాదని, అలీ ఖమేనీ పెద్ద మనవడు మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్ర గాయాలు కావడం వల్లే ఆయన ముఖాన్ని ముసుగుతో కప్పుకున్నట్టు సమాచారం. ఈ పరిణామం ఇరాన్ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది.ఆ ముసుగు మనిషి ముందు వరుసలో నిలబడి అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన బేస్‌బాల్ టోపీ ధరించి, ముఖాన్ని నల్ల ముసుగుతో కప్పుకున్నారు. అయితే, ఆయన మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించడంతో ఆయన ఎవరో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.జవాద్ ఖమేనీకి ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆ దాడుల్లోనే అలీ ఖమేనీ మరణించారు. మొజ్తబా ఖమేనీ ముఖం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టు అమెరికా నిఘా నివేదికలు తెలిపాయి.మొహమ్మద్ జవాద్ ఖమేనీ ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పెద్ద మనవడు. అలీ ఖమేనీ పెద్ద కుమారుడు మొస్తఫా ఖమేనీ. మొస్తఫా కుమారుడే మొహమ్మద్ జవాద్ ఖమేనీ. మొస్తఫా ఖమేనీ సుమారు 1965లో జన్మించినట్టు అక్కడి మీడియా తెలిపింది. అలీ ఖమేనీ అంత్యక్రియలు గురువారం జరిగాయి. 6 రోజుల పాటు సాగిన కార్యక్రమంలో 43 మిలియన్ల మంది పాల్గొన్నట్టు ప్రభుత్వ మీడియా తెలిపింది. కాగా, మొజ్తబా ఖమేనీ శనివారం టెలిగ్రామ్‌లో లిఖితపూర్వక సందేశం విడుదల చేశారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని అందులో పేర్కొన్నారు. -
హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నాం : ఇరాన్
టెహ్రాన్ : ఇరాన్–అమెరికా పరస్పర దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో గుర్తింపు లేని, అనధికారిక నౌకల రాకపోకలకు అనుమతి లేదని ఇరాన్ ముందునుంచే హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా అనధికారికంగా ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. అనంతరం హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్లు సహా వాణిజ్య నౌకల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.ఈ పరిణామాల మధ్య, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. మూడో దఫా తమ భూభాగంపై అమెరికా దాడులకు పాల్పడిందని పేర్కొంటూ, దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు చేస్తూ, ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని వెల్లడించింది.యుద్ధాన్ని ముగించేందుకు గత నెలలో కుదిరిన ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసే చర్చలు హర్మూజ్ జలసంధి భద్రత లేకుండా ముందుకు సాగలేవని అమెరికా ఉన్నతాధికారులు గతంలో పేర్కొన్నారు. ఈ అంశంపై ఇరాన్ కూడా స్పష్టమైన బహిరంగ ప్రకటన చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన ఓ వాణిజ్య నౌకపై కాల్పులు జరిపామని, హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నామని వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.వాణిజ్య నౌకలపై ఇరాన్ చర్యలు, వాటికి అమెరికా ప్రతిస్పందనల నేపథ్యంలో యుద్ధ విరమణకు కుదిరిన తాత్కాలిక ఒప్పందానికి విఘాతం ఏర్పడింది. ఈ పరిస్థితులపై చర్చించేందుకు ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులు శనివారం సమావేశమైన అనంతరం ఈ ప్రకటనలు వెలువడ్డాయి.ఇదిలా ఉండగా, తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని ఆరోపిస్తూ, ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనికి ప్రతిస్పందించిన ట్రంప్, తనపై ఎలాంటి దాడికి ప్రయత్నించినా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
స్వస్థలంలో ఖమేనీ అంత్యక్రియలు పూర్తి
దుబాయ్: ఇరాన్న 37 ఏళ్లపాటు ఎదురులేకుండా పరిపాలించిన దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వస్థలమైన మష్హద్ నగరంలో శుక్రవారం ఉదయం ఖమేనీ పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించిన సంగతి విదితమే. తర్వాత ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ నూతన సుప్రీంలీడర్‌గా నియమితులయ్యారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధం కారణంగా అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేశారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో అంత్యక్రియలు ప్రారంభించారు. గత వారం రోజులుగా ప్రజల సందర్శనార్థం ఖమేనీ భౌతికకాయాన్ని వేర్వేరు నగరాలకు తరలించారు. తమ అభిమాన నేతకు లక్షలాది మంది జనం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన విగతజీవిగా ఉండడం చూసి చలించిపోయారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఖననం పూర్తయ్యింది. మష్హద్ నగరంలో ఖననం జరిగిన ఇరాన్ రెండో పాలకుడు ఖమేనీ మాత్రమే. దాదాపు 11 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత హత్యకు గురైన నాదిర్ షాను 1747లో ఆ నగరంలోనే ఖననం చేశారు. -
ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో ఖమేనీ అంత్యక్రియలు..
-
ఫైటర్ జెట్ల పహారాలో ఖమేనీ పార్థివదేహం
టెహ్రాన్: ఇరాన్ మజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘట్టం తుదిదశకు చేరుకుంది. మష్హాద్‌లోని ఇమామ్ రెజా పవిత్రక్షేత్రంలో పార్థివదేహం ఖననం చేయనున్నారు. ఈ సందర్భంగా ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు లక్షల సంఖ్యలో జనం మష్హాద్ బాట పట్టారు. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో ఆ నగర వీధులన్నీ జనసముద్రంగా మారాయి.ఈ రోజు ఉదయం ఇరాక్‌లోని నజాప్ విమానాశ్రయం నుంచి ఖమేనీ భౌతికకాయం ఉన్న విమానం మష్హాద్ నగరానికి బయిలుదేరింది. ఈ అంత్యక్రియల విమాన ప్రయాణానికి అత్యంత భారీ భద్రత,అధికారిక ప్రోటోకాల్‌ను కేటాయించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్వయంగా ఆ విమానంలో ఖమేనీ భౌతికకాయంతో పాటు ప్రయాణించి ఎస్కార్ట్‌గా నిలిచారు.ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భౌతిక కాయం తరలిస్తున్న విమానానికి అత్యంత పటిష్ట భద్రత కల్పించారు. వాయుతలంలో ఆ విమానానికి ఇరు దేశాల వైమానికి దళాలు ఫైటర్ జెట్స్తో భద్రత కల్పించాయి. మష్హాద్ చేరుకున్న అనంతరం అక్కడి నుండి హెలికాప్టర్ల ద్వారా కర్బలాకు తరలించే సమయంలో కూడా భారీ సైనిక ఎస్కార్ట్ మధ్యే శవపేటికను తరలించారు.కాగా ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా దాడులు తీవ్ర కలకలం రేపాయి. ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్సులో ఉన్న రైల్వే వంతెనపై దాడులు చేసింది. దీంతో టెహ్రాన్- మష్హాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.Iranian Fighter Jets escorted the plane carrying the caskets of Ayatollah Khamenei and his familyThis explains reports of the jet activity I was reading. https://t.co/7TxUPwnwD4 pic.twitter.com/gfTXLUwe21— Ryan Rozbiani (@RyanRozbiani) July 9, 2026 -
అంత్యక్రియల వేళ.. ఇరాన్‌కు గుండెకోత
టెహ్రాన్: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం ముగింపు వేళ ఇరాన్ కీలక వీడియో విడుదల చేసింది. ఆయన నివాసంపై అమెరికా జరిపిన దాడికి సంబంధించిన చిత్రాలను తొలిసారిగా అధికారికంగా పంచుకుంది. ఇంతవరకూ కేవలం శాటిలైట్ చిత్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా తొలిసారిగా అధికారికంగా వీడియోను విడుదల చేసింది.ఫిబ్రవరి 28 అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడికి సంబంధించిన వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో దాడులలో భవనం పూర్తిగా శిథిలమైన చిత్రాలు క్షిపణుల దాడులు భవనం కుప్పకూలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేని అంత్యక్రియలు ముగింపువేళ ఈ చిత్రాలు ఇరానీయలను తీవ్రమైన బాధకు గురి చేస్తున్నాయి.కాగా ఈ దాడిలో ఖమేనీ ఆయన కుటుంబసభ్యులతో సహా 14 నెలల మనవరాలు 40 మంది అధికారులు సైతం మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ భవనంపై ఏకకాలంలో 35 క్షిపణులను ప్రయోగించాయి. అయితే అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆయనను మషద్‌లో ఖననం చేయనున్నారు.కాగా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న అమెరికా దాడులకు తెగబడింది. చైనా, రష్యా, ఇరాన్‌లకు భూమర్గం ద్వారా జరిగే వస్తురవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వేబ్రిడ్జిపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఆందోళన నెలకొంది.Iran released footage of leader Khamanei's residence after the US attack that martyred him and his family, including 14-month old Zahra pic.twitter.com/dpSEJWKeGP— COMBATE |🇵🇷 (@upholdreality) July 8, 2026 -
అలీ ఖమేనీ అంతిమ యాత్ర.. ట్రంప్ ను హతమార్చాలి
-
మీ స్నేహం మరిచిపోం.. భారత్‌పై ఇరాన్ భావోద్వేగ పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు భారత్ ప్రతినిధులు హాజరవడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ భావోద్వేగ పోస్ట్ చేసింది. భారత సమాజానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ కష్టకాలంలో భారత్ చూపిన స్నేహం, సానుభూతి, హృదయపూర్వక గౌరవాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ (ఇరాన్) ఎప్పటికీ మరచిపోదని ఎక్స్ వేదికగా పేర్కొంది.ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియ వేడుకలకు భారత ప్రభుత్వం తరపున బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటాతో బృందం హాజరయి నివాళులర్పించింది. అదే విధంగా వ్యక్తిగతంగా కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీలతో పాటు భారతదేశానికి చెందిన సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు కూడా ఇరాన్ దివంగత నేతకు అంజలి ఘటించారు.అయితే దీనిపై భారత్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది.."భారత స్నేహపూర్వక ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు, ముఖ్యంగా భారత్ తరపున హాజరైన అధికారిక ప్రతినిధి బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇరాన్ అమరవీరుడు, హిస్ ఎమినెన్స్ అయాతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొని నివాళులర్పించినందుకు ధన్యవాదాలు." అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది."ఈ జాతీయ శోక సమయంలో ఇరాన్ ప్రజలతో భారత్ చూపిన హృదయపూర్వక సంఘీభావం, పరస్పర గౌరవానికి ఇది ఒక బలమైన నిదర్శనం. ఇరాన్ ప్రజలు ఈ స్నేహపూర్వక, సానుభూతితో కూడిన గౌరవపూర్వకమైన సంజ్ఞను ఎప్పటికీ మరచిపోలేరు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య ఉన్న దీర్ఘకాలిక బంధానికి ఇదొక విలువైన నిదర్శనంగా వారు భావిస్తారు. అలాగే ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక విలువైన పునాదిగా నిలుస్తుంది." అని పోస్ట్ చేసిందిఅలీ ఖమేనీ అంత్యక్రియలుఇరాన్ ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ 'ప్రెస్ టీవీ' నివేదిక ప్రకారం.. అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపు సోమవారం ఉదయం టెహ్రాన్‌లో ప్రారంభమైంది. ఈ ఊరేగింపు దాదాపు 10 నుండి 12 గంటల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఆ దేశ ఆధునిక చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద ప్రజా ప్రదర్శన (సమీకరణ) కానుంది. A tribute that amazed the whole world.. The Iranian Ummah paints a historical picture at the funeral of the martyred Imam Leader Khamenei.PS: NOT AI #Iran pic.twitter.com/3MJLyTayGX— Zeinab Al Saffar | زينـــب الصفّـــار (@ZeinabSaffar) July 6, 2026 -
ఖమేనీ అంత్యక్రియల్లో.. కనిపించని మొజ్జబా ఖమేనీ
-
ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం ‘గ్రాండ్ మొసల్లా' కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు మరణించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అలజడి కారణంగా దాదాపు నాలుగు నెలల ఆలస్యం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు వారం రోజుల పాటు సాగే ఈ భారీ అంత్యక్రియల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.ఈ అంత్యక్రియల ప్రార్థనలు కేవలం శోకసంద్రంగానే కాకుండా, ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకోవాలనే నినాదాలతో హోరెత్తాయి. ప్రార్థనా మందిరంలో చేరిన లక్షలాది మంది ప్రజలు ఇరాన్ జాతీయ జెండాలతో పాటు, ప్రతీకారానికి చిహ్నమైన ఎరుపు రంగు జెండాలను ప్రదర్శించారు. ఖమేనీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను అంతమొందించాలంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు, పోస్టర్లు, గ్రాఫిటీలను ప్రదర్శించారు.అమెరికా నశించాలి,ఇజ్రాయెల్ నశించాలి అనే నినాదాల మధ్య.. ఇరాన్ మిలటరీ త్రివిధ దళాధిపతులు, అగ్రశ్రేణి రాజకీయ నాయకులు బహిరంగంగా హాజరయ్యారు. ట్రంప్‌ను చంపడం మా బాధ్యత అంత్యక్రియల వేళ లౌడ్స్పీకర్లలో ఈవెంట్‌ను నడిపిస్తున్న మొహమ్మద్ రసౌలి అనే కవి మాట్లాడుతూ..ఇకపై శవాల కఫనే మా వస్త్రం. ఖమేనీ రక్తం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం.. ట్రంప్‌ను హతమార్చడం ఇకపై మా బాధ్యత’అని పిలుపునివ్వడంతో లీడర్లు, ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.ఈ ఉద్రిక్తతల మధ్య అర్మేనియాలో ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్‌ఘోలామి ఎక్స్ వేదికగా స్పందిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మీరు మనుషులను చంపగలరు కానీ వారి ఆదర్శాలను చంపలేరు. మీరు అయతుల్లా ఖమేనీని చంపడం ద్వారా ఒక అత్తరు సీసాను పగులగొట్టారు. ఇప్పుడు దాని సువాసన (ఆదర్శం) అంతటా వ్యాపించింది. నాగరికత, చరిత్ర, గౌరవం లేని మీకు ఇది ఎప్పటికీ అర్థం కాదు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్‌లోని వరుస పరిణామాలు అంతర్జాతీయంగా చర్చాంశనీయమయ్యాయి. -
ఖమేనీ అంత్యక్రియల్లో కీలక నేతలు
టెహ్రాన్: దివంగత అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల్లో ఇరాన్ అగ్రనాయకులు, నూతన సుప్రీం నేత మొజ్తబా సోదరులు ఆదివారం ప్రజల ముందుకు వచ్చారు. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ బయటకు కనిపించలేదు. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో తండ్రి ఖమేనీ, తదితరులు చనిపోగా మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు. కాగా, ఖమేనీ శవపేటికను సోమవారం టెహ్రాన్‌లో ఊరేగించనున్నారు. దీనికోసం, యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. నగరంలో వాహనాల రాకపోకలను, ఇతర కార్యక్రమాలను నిలిపివేసింది.అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల కోసం టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాలో జరిగిన ప్రార్థనలకు 97 ఏళ్ల షియా మత పెద్ద అయతొల్లా జాఫర్ సొభానీ సారథ్యం వహించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరైన ఈ ప్రార్థనల్లో ఖమేనీ కుమారులు మసూద్, మేసమ్, మొస్తాఫా పాల్గొన్నారు. యుద్ధం మొదలైన తర్వాత వీరు కినిపించడం ఇదే మొదటిసారి. రివల్యూషనరీ గార్డ్స్ విభాగం అధిపతి జనరల్ అహ్మద్ వాహిది సైతం వచ్చారు. నల్ల బేస్‌బాల్ టోపీ ధరించిన ఆయన చుట్టూ సాధారణ దుస్తుల్లో వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు.మొజ్తబాకు అత్యంత సన్నిహితుడుగా భావిస్తున్న వాహిది అమెరికాతో చర్చల్లో వ్యూహాత్మకంగా ఇరాన్ పైచేయి సాధించడం వెనుక కీలకంగా ఉన్నారని సమాచారం. వీరితోపాటు అధ్యక్షుడు పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘెర్ ఘాలిబాఫ్, రివల్యూషనరీ గార్డ్స్‌లోని కీలకమైన ఖుద్స్ ఫోర్స్ అధిపతి ఇస్మాయిల్ ఖానీ కూడా కనిపించారు.ప్రార్థనలకు ముందు జరిగిన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కవి మహ్మద్ రసౌలి అమెరికా నశించాలి!, ’ఇజ్రాయెల్ నశించాలి! అంటూ నినదించారు. ఈ సందర్భంగా రసౌలి ఉద్రేకపూరిత ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడైన ఆ వ్యక్తి ఇంకా ఎందుకు బతికే ఉన్నాడు? అంటూ ట్రంప్ నుద్దేశించి ప్రశ్నించారు. ట్రంప్ ఉండాల్సిన చోటు కాదిది అని రసౌలి పేర్కొనడగా జనం పెద్ద పెట్టున కేరింతలు కొట్టారు. -
ఇరాన్ నేతల ఏడుపు.. అంతా ఫేక్!.. నోటి దురుసు ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ.. ఆ దేశంలో మిగిలి ఉన్న కీలక నాయకత్వాన్ని తాము ఒకే ఒక్క షాట్‌తో అంతమొందించగలమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అలా చేస్తే భవిష్యత్తులో చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు కాబట్టి తాను ఆ పని చేయడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో ఖమేనీ అంత్యక్రియల్లో తీరని ఆవేదనతో కన్నీరు మున్నీరవుతున్న నేతలను ఉద్దేశిస్తూ ట్రంప్ తన నోటికి పని చెప్పారు. అమెరికన్ మీడియా సంస్థ ‘ఆక్సియోస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఇరాన్ నేతలందరూ ఖమేనీ అంత్యక్రియల్లో ఉన్నారు. ఒక్క షాట్‌తో వారందరినీ మేము తుడిచిపెట్టేయగలము. కానీ మేము ఆ పని చేయబోవడం లేదు. ఎందుకంటే ఆ తర్వాత చర్చలు జరపడానికి అక్కడ ఎవరూ ఉండరు. నిజానికి వారు మాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అర్ధరిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు ముగిసే వరకు చర్చల నుంచి వారం రోజుల పాటు విరామం తీసుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నట్లు కూడా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ లోపు ఏ పక్షం కూడా అవతలి పక్షంపై ఎలాంటి దాడులు చేయబోవని ఆయన వెల్లడించారు. Mohammad Bagher Ghalibaf broke down in tears 🥺 pic.twitter.com/ypcwHrAPvg— ساسان (@eghtesadnia) July 3, 2026ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ ఆశ్చర్యంఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు కన్నీరు పెట్టుకుంటూ కనిపించారు. ఖమేనీ అంత్యక్రియలకు వేలాది మంది హాజరుకాగా, ఇరాన్ నేతలు భావోద్వేగానికి లోనై ఏడ్చారు. అయితే, అంత్యక్రియల్లో ఇరాన్ ప్రజలు, నేతలు ఏడవడంపై డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని తాను అనుకున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. బహుశా అవి నకిలీ కన్నీళ్లు కావచ్చు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొనసాగుతున్న అంత్యక్రియలుఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు ప్రస్తుతం అధికారికంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించగా, యుద్ధ పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ అంతిమ సంస్కారాలు జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యాయి. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలను ఇరాన్, ఇరాక్‌లలోని 5 ప్రధాన నగరాల్లో జూలై 3 నుండి జూలై 9 వరకు 7 రోజుల పాటు నిర్వహించేలా ఇరాన్ ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. జూలై 4, 5 తేదీల్లో రాజధాని టెహ్రాన్‌లోని ‘గ్రాండ్ మొసల్లా’ ప్రార్థనా మందిరంలో ఖమేనీ, ఆయనతో పాటు మరణించిన కుటుంబ సభ్యుల పార్థివ దేహాలను ప్రజల సందర్శనార్థం ఉంచారు. లక్షలాది మంది ప్రజలు ఆయనకు నివాళులర్పించేందుకు తరలివస్తున్నారు. టెహ్రాన్ తర్వాత ఈ అంతిమయాత్ర కోమ్ నగరానికి, ఆపై ఇరాక్‌లోని ప్రముఖ షియా పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాలకు తరలివెళ్తుంది. చివరగా జూలై 9న ఖమేనీ సొంత పట్టణమైన ఇరాన్‌లోని అత్యంత పవిత్ర నగరం మషహద్‌లో ఆయన భౌతిక కాయాన్ని అధికారికంగా ఖననం చేయనున్నారు. -
ఖమేనీ అంత్యక్రియల్లో విషాదం
-
ఇరాన్లో భావోద్వేగ దృశ్యాలు.. ఖమేనీకి కన్నీటి నివాళి
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తుదివీడ్కోలు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రాండ్ మోసల్లా ప్రాంగణం కన్నీళ్లు, నినాదాలు, సంతాప సందేశాలతో శోకసంద్రంగా మారింది. ప్రార్థన మందిరం వద్ద నిశ్శబ్దం అలుముకోగా.. ఖమేనీ పార్థివదేహం రాకతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.ఖమేనీ భౌతికకాయాన్ని జాతీయ జెండాతో కప్పి ప్రాంగణానికి తీసుకురాగా, ఆయన తలపై ఉండే నల్ల టర్బన్‌ను కూడా సంప్రదాయంగా ఉంచారు. కుటుంబ సభ్యుల పార్థివదేహాలను ప్రత్యేక పేటికల్లో ఆయన పక్కపక్కనే ఉంచారు. ఈ క్రమంలో అత్యంత భావోద్వేగ దృశ్యంగా ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది గోల్పాయెగాని చిన్న శవపేటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. జాతీయ జెండాతో కప్పిన ఆ చిన్న పేటిక పక్కనే ఆమె ఫోటోను ఉంచడంతో అక్కడున్నవారు తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సహా పలువురు ఉన్నతాధికారులు భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు.Un cadre du cercueil de la martyre Zahra Mohammadi Golpayegani, #petite-fille du Guide suprême martyr de la Révolution islamique, à la Mosalla de #Téhéran.#بدرقه_آقای_شهید_ایران#باید_برخاست#NousDevonsNousSoulever#MartyrKhamenei pic.twitter.com/8JemW4zW4A— Iran en France (@IRANinFRANCE) July 3, 2026ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అప్పటి నుంచి భద్రపరచిన భౌతికకాయాన్ని ఇప్పుడు ఆరు రోజుల పాటు జరిగే సంతాప కార్యక్రమాల కోసం ప్రజల సందర్శనార్థం ఉంచారు.టెహ్రాన్‌లోని గ్రాండ్ మోసల్లా వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గేట్లు తెరవగానే భారీ జనసంద్రం లోపలికి ప్రవేశించింది. అమెరికాకు వ్యతిరేక నినాదాలతో పాటు ప్రతీకారాన్ని సూచించే ఎరుపు రంగు జెండాలు ప్రదర్శించారు. మరోవైపు.. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హతమార్చాలని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని’’ వేలమంది నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.ఈ సంతాప కార్యక్రమానికి దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. భారత్ సహా రష్యా, పాకిస్థాన్, టర్కీ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం రెండు కోట్ల మంది వివిధ దశల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని అంచనా వేశారు. అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్‌లో సోమవారం వరకు ఉంచి, అనంతరం ఖోమ్‌కు తరలించనున్నారు. మంగళవారం కర్బలా, నజాఫ్ వంటి పవిత్ర నగరాల మీదుగా ప్రయాణించి, చివరగా గురువారం ఆయన స్వస్థలమైన మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఆరు రోజుల సంతాప యాత్రతో ఇరాన్ అంతటా శోక వాతావరణం కొనసాగుతోంది. Mohammad Bagher Ghalibaf cries during the farewell ceremony of Ali Khamenei. pic.twitter.com/i4DC5OgM2y— Raz Zimmt (@RZimmt) July 3, 2026 -
ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వివరాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బిహార్ గవర్నర్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఆలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడి అనంతరం సైతం భీకరమైన యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఖమేనీ అంత్యక్రియలకు అనుకూల సమయం లభించలేదు. దీంతో ఇంతకాలం పాటు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఎట్టకేలకు జూలై 4 నుంచి అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మసూజ్ ఫెజెష్కియన్ ఈ కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అధికారికంగా ఆహ్వానం అందించారు. అయితే, అదే సమయంలో ప్రధానమంత్రి ముందే ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల పర్యటనలో ఉండటం వల్ల ఆయన ఈ కార్యక్రమాల్లో స్వయం పాల్గొనలేకపోతున్నారని కేంద్రం తెలిపింది. దీంతో సుప్రీం లీడర్ అంత్యక్రియలకు భారత్ తరఫున బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గరీటాలు హాజరు కానున్నట్లు పేర్కొంది.ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్జూలై 4న టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్‌లో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. దీనితో అంత్యక్రియల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతాయి. టెహ్రాన్, కోమ్ నగరాల్లో బహిరంగ ఊరేగింపులు నిర్వహిస్తారు. అలాగే ఇరాక్ లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేపడతారు. జూలై 9 న ఖమేనీ సొంత ఊరైన మషహాద్‌లోని ప్రసిద్ధ 'ఇమామ్ రెజా' పుణ్యక్షేత్రంలో జూలై 9న అంతిమ కార్యక్రమం జరగనుంది. -
ఖమేనీ అంత్యక్రియలపై ఉత్కంఠ.. మోజ్తాబా ఖమేనీ ఎక్కడ?
-
ఖమేనీ అంత్యక్రియలపై ఉత్కంఠ.. మొజ్తబా ఖమేనీ ఎక్కడ?
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జూలై 4 నుంచి 9 వరకు టెహ్రాన్, ఖోమ్, మష్హద్ నగరాల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలపై ప్రపంచ దృష్టి నెలకొంది. అయితే ఈ అంత్యక్రియల కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం.. ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తొలిసారిగా బహిరంగంగా కనిపిస్తారా లేదా అన్నదే. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత అత్యున్నత పదవిని చేపట్టిన ఆయన ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో అలీ ఖమేనీ మరణానంతరం ఇరాన్ అత్యున్నత మతపరమైన సంస్థలు, రాజకీయ నాయకత్వం అత్యవసరంగా సమావేశమై మొజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించాయి. అయితే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక్క బహిరంగ సభలోనూ పాల్గొనలేదు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రత్యక్ష ప్రసంగం చేయలేదు. ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. వీడియో సందేశం, ఆడియో ప్రసంగం కూడా విడుదల చేయలేదు. దీంతో ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యం, అధికార బదిలీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారులు గతంలో వెల్లడించారు. ముఖానికి తీవ్ర గాయాలు, కాలికి గాయాలైనట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన పూర్తిగా ప్రజలకు దూరంగా ఉండటంతో అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.కాగా, జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే అంత్యక్రియల సందర్భంగా మొజ్తబా ఖమేనీ ప్రత్యక్షంగా హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆయన బహిరంగంగా కనిపిస్తే, కొత్త సుప్రీం లీడర్‌గా ఆయన అధికారాన్ని ప్రజలకు, ప్రపంచానికి చాటిచెప్పే తొలి సందర్భంగా భావిస్తున్నారు. మరోవైపు, ఆయన గైర్హాజరు అయితే ఆరోగ్య పరిస్థితి, అధికార నిర్వహణపై ఉన్న సందేహాలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.ప్రపంచ నేతలు హాజరు..ఇదిలా ఉండగా.. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఖమేనీ అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే కార్యక్రమాల అనంతరం ఖోమ్‌లో మతపరమైన నివాళులు, ఆపై మష్హద్‌లోని పవిత్ర స్థలంలో ఖననం జరగనుంది. ఈ కార్యక్రమాలకు పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి రష్యా, చైనా, టర్కీ, ఖతర్, ఇరాక్, లెబనాన్ తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంత్యక్రియలు అత్యంత సున్నితమైన కార్యక్రమంగా మారాయి.ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఇప్పటికే తన భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. కీలక ప్రభుత్వ భవనాలు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాల వద్ద అత్యున్నత స్థాయి అప్రమత్తత కొనసాగుతోంది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజకీయ, మతపరమైన నాయకత్వంలో చోటుచేసుకున్న మార్పులు మధ్యప్రాచ్య రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం
ఢిల్లీ: వచ్చే నెల(జులై)లో జరగనున్న అయాతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించారు. ఇవాళ (మంగళవారం) న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ అధికారిక ఆహ్వానాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖకు (MEA) పంపింది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో మషాద్‌లో ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాలని మోదీని ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానించారు. జులై 9న ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. 4వ తేదీ నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అంత్యక్రియల కార్యక్రమాలు జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమై.. జూలై 9న ఖమేనీ స్వగ్రామమైన మషాద్‌లో ఆయన ఖననంతో ముగుస్తాయి.అధ్యక్షుడు పెజెష్కియాన్ తరపున అధికారిక ఆహ్వానాలు అందుకున్న ప్రపంచ నాయకులలో పీఎం మోదీతో పాటు చైనా, రష్యా, ఖతార్, ఫ్రాన్స్ , పాకిస్తాన్ దేశాల నేతలు ఉన్నారు. పాకిస్తాన్ ప్రతినిధి బృందం ఖమేనీ అంత్యక్రియలకు హాజరవుతుందని పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ప్రకటించారు.న్యూఢిల్లీలోని వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అధికారిక అంత్యక్రియల కార్యక్రమానికి భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భారత్.. మార్చి 5న ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి అధికారిక సంతాప పుస్తకంలో సంతకం చేశారు.ప్రధాని మోదీ చివరిసారిగా మే 2016లో ఇరాన్లో అధికారిక ద్వైపాక్షిక పర్యటన చేశారు. ఆ సమయంలో చాబహార్ రేవు అభివృద్ధికి త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడానికి ఆయన ఖమేనీ, అప్పటి అధ్యక్షుడు హసన్ రౌహానీలతో సమావేశమయ్యారు. రెండేళ్ల తర్వాత, ఫిబ్రవరి 2018లో పీఎం మోదీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు రౌహానీ భారత్‌లో న్యూఢిల్లీ, హైదరాబాద్‌లను సందర్శించారు. మోదీ, పెజెష్కియాన్ చివరిసారిగా అక్టోబర్ 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో పీఎం మోదీ, పెజెష్కియాన్‌ను భారత్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. -
ఆయతుల్లా ఖమేనీ చివరి క్షణాల్లో ఏం జరిగింది..?
టెహ్రాన్: ఆయతుల్లా ఆలీ ఖమేనీ మృతి ప్రపంచాన్ని ఎంత దిగ్భ్రాంతికి గురిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఆయన మృతిచెందడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దాడికి ముందు ఖమేనీ గడిపిన క్షణాల గురించి ఆ దేశ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తొలిసారిగా బహిరంగంగా పంచుకున్నారు.ఇరాన్- అమెరికా యుద్ధం మెుదలయి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. అయినా ఈ యుద్ధం ముగింపు అంశంలో ఎటువంటి స్పష్టత లేదు. ఇన్ని రోజుల ఈ యుద్ధంలో అత్యంత భయానక అంశం ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి చేసి చంపడం.. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. అయితే ఆ సందర్భంలో ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ దాడి చేసిన ప్రాంతంలోనే ఉన్నానని తెలిపారు.ఈ రోజు (శుక్రవారం) అబ్బాస్ అరాగ్చీ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. "ఇరాన్‌పై దాడులు ప్రారంభం అయ్యాక.. సుప్రీం లీడర్ని సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని కోరాం. దానికి ఆయన నిరాకరించారు. ఇరాన్ ప్రజలందరికీ సురక్షితమైన ప్రదేశానికి ప్రవేశం లభించేంత వరకు తాను ఎటువంటి ఆశ్రయానికి గానీ, సురక్షిత ప్రాంతానికి గానీ వెళ్ళనన్నారు... నా ప్రజలకు ఏది జరిగినా, అది నాకు కూడా జరుగుతుంది ," అని ఖమేనీ అన్నట్లు అరాఘ్చి తెలిపారు.సుప్రీం లీడర్‌పై దాడి జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే ఉన్నానని ఆ దాడిలో ఆయనకు ఏమయిందా అని కలవర పడ్డానని తెలిపారు. అయితే దాడులకు ఇరాన్ ఇచ్చిన ప్రతీకారం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఎంతో కలవరపాటుకు గురిచేసిందన్నారు. అదే విధంగా ఇరాన్ పొరుగు దేశాల్లో అమెరికా స్థావరాలు లేకపోయి ఉంటే వాటిపై దాడులు జరిగేవి కావన్నారు. పస్తుతం సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సర్వాధికారాలు కలిగి ఉన్నారని కొత్త సుప్రీం లీడర్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతన్నామన్నారు. అతని ఆదేశాలను యుథాతధంగా అమలు చేస్తున్నామన్నామన్నారు. ఆయుతుల్లా ఖమేనీకి ఏలాంటి గౌరవం దక్కేదో ఇతనికీ అదే విధమైన గౌరవం దక్కుతుందన్నారు. -
అయతుల్లా అలీ ఖమేనీ ఒంటి చేయి రహస్యం ఇదేనా?
టెహ్రాన్: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. అచ్చం సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ విషయంలో అదే జరిగింది. ప్రపంచ దేశాలకు ఆయన ఇరాన్ సుప్రీమ్ లీడర్‌గానే కనిపించవచ్చు. కానీ సుపరిచితులందరికీ ఆయన ఒంటి చేయి వీరుడు అని మీకు తెలుసా?ఇరాన్ -ఇరాక్ యుద్ధం 22 సెప్టెంబర్ 1980న ప్రారంభమైంది. దాదాపు ఎనిమిదేళ్లు కొనసాగి, 20 ఆగస్టు 1988న ముగిసింది. ఈ యుద్ధం ప్రారంభమైన మరుసటి ఏడాది జూన్ 27, 1981న నాటి అధ్యక్ష హోదాలో ఇరాన్ యుద్ధ సన్నాహాల్ని పర్యవేక్షించారు. అనంతరం, ప్రార్ధన చేసి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో అనుచరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.అదిగో అప్పుడే ఓ యువకుడు ఖమేని ముందుకు వచ్చాడు. ఖమేని డెస్క్‌పై ఓ టేప్‌రికార్డ్ పెట్టాడు. దానిని ఆన్ చేశాడు. ఇరాన్‌లోని మతపరమైన పాలనకు వ్యతిరేకంగా ఉన్న ఒక మిలిటెంట్ గ్రూప్ ఫుర్కాన్ అమర్చిన బాంబు నిమిషం వ్యవధిలో పేలింది. ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఆయన చావునుంచి తృటిలో తప్పించుకున్నారు. ఖమేనీ తన కుడి చేయి, లంగ్స్, ఊపిరితిత్తులకు తీవ్రగాయాలయ్యాయి. కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టింది. కొన్ని గాయాలు నయమైనప్పటికీ, అతని కుడి చేయి శాశ్వతంగా పనిచేయకుండా ఆగిపోయింది.ఘటన జరిగిన కొద్ది రోజులకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఖమేనీకి సహచరులు ‘ఒంటి చేత్తో ఏం సాధిస్తావు, అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి’ అని సలహా ఇచ్చిన వేళ, ఆయన గద్గద స్వరంతో, ‘నేను ఒంటి చేయి వీరుణ్ని. ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి లేచినట్లు లేస్తాను. నాకు ఆ చేయి అవసరం లేదు. నా మెదడు, నా నాలుక పనిచేస్తే చాలు’ అని అన్నారు.కొంతకాలం తర్వాత ఖమేనీ తన ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాడు. ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ.. ఘటన జరిగిన ఎనిమిదేళ్లకు ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా ఓ దేశానికి సుప్రీం లీడర్‌గా ఖమేనీ చరిత్రలో నిలిచిపోయారు. -
ఇరాన్ రాజకీయాల్లో కలకలం.. ఖమేనీ అంత్యక్రియలు ఎప్పుడు?
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించి నెలలు గడుస్తున్నా,ఆయన అంత్యక్రియలు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దీనికి కారణం ఇరాన్ ప్రభుత్వంలో నెలకొన్న భయాలేనని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఖమేనీ అంత్యక్రియలను బహిరంగంగా నిర్వహిస్తే భారీ ఎత్తున జనసమూహం కారణంగా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సమాచారం.ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆ రోజు నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుమణిగినట్లు కనిపిస్తున్నా అంత్యక్రియలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.మార్చి 4న మూడు రోజుల పాటు రాష్ట్ర అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా–ఇజ్రాయెల్ వరుస దాడుల కారణంగా ఆ ప్రణాళికను విరమించుకుంది. ఫలితంగా ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినా, ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.1989లో ఇస్లామిక్ విప్లవ నాయకుడు, తొలి సుప్రీం లీడర్ రుహుల్లా మోసావీ ఖమేనీ మరణించిన మరుసటి రోజే ఆయన అంత్యక్రియలు భారీ ఎత్తున జరిగాయి. లక్షలాది మంది ప్రజలు తేహ్రాన్ వీధుల్లోకి పోటెత్తారు. కానీ అలీ ఖమేనీ మరణం తర్వాత అలాంటి దృశ్యాలు కనిపించకపోవడం విశేషం.ఈ నేపథ్యంలో అమెరికాలోని ఇరాన్ విశ్లేషకుడు బెహ్నామ్ బెన్ తలెబ్లూ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించలేనంత బలహీనంగా ఉంది. ప్రజా వీధులు తమవని ఎప్పుడూ చెప్పుకుంటుంది. కానీ వాస్తవానికి ప్రజలు నిరసనలకు దిగుతారనే భయంతో 50 రోజుల పాటు ఇంటర్నెట్ను బ్లాక్ చేసింది” అని వ్యాఖ్యానించారు.అంత్యక్రియల ఆలస్యానికి కారణాలుగా వైమానిక దాడుల ముప్పు, జాతీయవాద నిరసనలు మళ్లీ చెలరేగే అవకాశం, అలాగే మోజ్తబా ఖమేనీ ఖననానికి ఆశించిన స్థాయిలో ప్రజల ముందుకు రాకపోవడం వంటి కారణాలుగా అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఖమేనీ స్వస్థలం మష్హాద్ నగరాన్ని అంత్యక్రియల స్థలంగా పరిశీలిస్తున్నారు. మష్హాద్‌లోని ఇమామ్ రెజా దర్గా షియా ముస్లింలకు పవిత్ర స్థలం. అక్కడే ఖమేనీని సమాధి చేయాలన్న ప్రతిపాదన ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
పాక్ మధ్యవర్తిత్వం? ఇరాన్ ఏమందంటే?
పట్నా: పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ భారత ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి తిరస్కరించారు. బిహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఇలాహి ఓ ఇంటరర్వ్యూలో మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు పాకిస్థాన్ ద్వారా జరుగుతున్నాయనే వాదనలు నిజం కాదని తెలిపారు."ఈ విషయంలో పాక్‌కు ఎలాంటి పాత్ర లేదు. పాకిస్థాన్ ద్వారా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయన్న వాదనల్లో నిజం లేదు. ఇటువంటి మాటలను అమెరికా కేవలం చమురు ధరలను తగ్గించడానికే చెబుతోంది. వారు నిజంగా చర్చలకు సిద్ధంగా లేరు. కొన్ని దేశాలను ఉపయోగించాలనుకున్నారు. చర్చలు జరపాలనుకుంటున్నామని చెప్పారు.. కానీ, అది నిజం కాదు" అని ఆయన తెలిపారు.శాంతి ప్రయత్నాల్లో భారతదేశం పాత్ర పోషించగలదా? అనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. భారతదేశం సహా ఇతర అన్ని దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆపడానికి సహకరించవచ్చని అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మంచి పాత్రను పోషించవచ్చని పేర్కొన్నారు.యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. యుద్ధం ముగింపు అనేది అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఫిబ్రవరి 28న వారు యుద్ధాన్ని ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అన్నారు."ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలపైనే యుద్ధం ముగింపు అంశం ఆధారపడి ఉంది. వారు ఇరాన్‌పై దాడులు ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మానవ వనరుల కేంద్రాలు, గనులపై దాడులు చేశారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది పౌరులు మరణించారు. వారు ఆపితే యుద్ధం ముగుస్తుంది" అని చెప్పారు.ఇరాన్ యుద్ధాన్ని కోరుకోలేదని.. ఈ ఘర్షణ వల్ల అనేక దేశాల పౌరులు బాధపడుతున్నారని ఇలాహి చెప్పారు. ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు."దురదృష్టవశాత్తు ఇది అధర్మ యుద్ధం. ప్రపంచంలోని అనేక మంది బాధపడుతున్నారు. ప్రపంచ నాయకులు కలిసి ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలను ఆపాలని కోరాలి" అని తెలిపారు. -
మోజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ట్రంప్ బ్రీఫింగ్‌లలో హాట్‌టాపిక్!
టెహ్రాన్: రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించినట్టే… ఇరాన్ యుద్ధంలో మోజ్తాబా మౌనం. దేశం రగులుతున్నా కొత్త సుప్రీం లీడర్ ఒక్క బహిరంగ ప్రకటన చేయలేకపోవడం ఇప్పుడు ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లలో హాట్‌టాపిక్‌గా మారిందిఅమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఫిబ్రవరి 28న జరిగిన క్షిపణి దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యంపై అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జెరూసలెం పోస్ట్ నివేదిక ప్రకారం, మోజ్తాబా తీవ్ర గాయాలతో బాధపడుతున్నారని, వాస్తవానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) యుద్ధ వ్యూహాలను నడిపిస్తున్నాయని పేర్కొంది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, దాడుల్లో ఆయన ఒక కాలు కోల్పోయి, కాలేయం దెబ్బతిని ఆయన ఆరోగ్య పరిస్థి అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.మోజ్తాబా మౌనంమరో అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ ..ఇరాన్‌పై ముప్పేటా దాడి,ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని ముట్టుబెట్టడం,ఇరాన్‌పై పైచేయి సాధించేలా యుద్ధ వ్యూహాల్ని రచిస్తున్నా మోజ్తాబా మౌనం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌ల సమయంలో చర్చనీయాంశంగా ఉంది. ఇరాన్ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారో అమెరికా జాతీయ భద్రతా బృందం ఆరా తీస్తుందని ట్రంప్ వర్గంలోని ఓ కీలక వ్యక్తి చెప్పారని నివేదించింది మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం అంతంత మాత్రమే?అదే సమయంలో ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ నిపుణుడు రజ్ జిమ్మ్ట్ మోజ్తాబా ఆచూకీపై మీడియా యాక్సియోస్‌తో మాట్లాడారు. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా ప్రజల ముందుకు రావడం అసాధ్యం.క్షిపణి దాడుల్లో ఆయన గాయపడిన తీరు అలాంటిది. ఓ వీడియో రికార్డు చేసి ప్రజలకు సైతం సందేశం పంపించ లేకపోతున్నారని చెప్పారు.వరుస ప్రాణాలు కోల్పోతున్న ఇరాన్ అగ్రనాయకులు ఇదే సమయంలో ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మార్చి 16న కమాండర్ ఘోలాంరెజా సోలేమానీ, మార్చి 17న భద్రతా వ్యూహకర్త అలీ లారిజానీ మరణించారు. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందిస్తూ.. ఓ వ్యక్తి ఉండటం,లేకపోవడం ఇరాన్ రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపదు. మేము పోరాటాన్ని కొనసాగిస్తాం.సుప్రీం లీడర్ కూడా వీరమరణం పొందినా, వ్యవస్థ తన పనిని కొనసాగించింది’ అని పేర్కొన్నారు.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 1270 మంది మరణించారు. అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు జరిపిన ఇరాన్, హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా జరుగుతుంది. నౌకలు ప్రయాణించలేకపోవడంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిణామాలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై మాత్రమే కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. -
ఇరాన్‌కు ఎదురుదెబ్బ
దుబాయ్: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కుడిభుజంగా పనిచేసిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీతోపాటు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)కు చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ తమ దాడుల్లో మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం వెన్నుముక విరిచేశామని వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ సైన్యం సోమవారం రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై విరుచుకుపడింది.అత్యున్నత సైనికాధికారులు నివాసం ఉండే కీలక స్థావరాలపై క్షిపణలు, డ్రోన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో అలీ లారిజానీ, ఘోలమ్రెజా సులేమానీ సహా పలువురు మృతిచెందారు. అయితే, ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఇంకా ధ్రువీకరించలేదు. ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత ఇరాన్ తమ అగ్రశ్రేణి అధికారులను కోల్పోవడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ సైన్యం వైమానిక దాడులు కొనసాగింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ రెండు క్షిపణుల ప్రయోగించిట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. యూఏఈలోని దుబాయ్‌పై ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చాయి. దాంతో ముందుజాగ్రత్తగా దుబాయ్ గగనతలాన్ని కొద్దిసేపు మూసివేశారు. అబూదాబీపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ మిస్సైల్‌ను అబూదాబీ సైన్యం కూల్చివేసింది. ఈ శకలాల కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై దాడి గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. పుజైరా తీరంలో నిలిచి ఉన్న చమురు ట్యాంకర్‌పై తాజాగా డ్రోన్‌తో దాడికి దిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు విడవడం లేదు. అక్కడ చమురు రవాణాపై ఆంక్షలు కొనసాగించడం తప్ప మరో మార్గం లేదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ తేల్చిచెప్పారు. తమ దేశంపైకి రాకెట్లు, క్షిపణులు దూసుకొస్తున్నాయని, తాము ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండిపోవాలా? అని ప్రశ్నించారు.ఇరాన్ మంగళవారం ఉదయం పదుల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించిందని, వాటిని మధ్యలోనే తుత్తునియలు చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడించింది. ఖతార్‌లో భారీ ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ క్షిపణుల దండును విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ రక్షణశాఖ తేల్చిచెప్పింది. అయితే, క్షిపణుల శకలాలు నేలకూలడంతో మంటలు చెలరేగాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపైనా దాడి జరిగింది. నాలుగు డ్రోన్లను ఎంబసీ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. లెబనాన్‌లోని హెజ్»ొల్లా మిలిటెంట్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడికి దిగారు. పలు డ్రోన్లు ప్రయోగించారు. లెబనాన్‌లో ఇద్దరు జవాన్లకు గాయాలు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. టెహ్రాన్‌తోపాటు లెబనాన్ రాజధాని బీరూట్‌పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. కమాండ్ సెంటర్లు, మిస్సైల్ లాంచింగ్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడికి దిగింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ సేనలు దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకొస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇరుపక్షాల మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్‌తో ప్రత్యక్షంగా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు లెబనాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, లెబనాన్ సైన్యం అందుకు ఒప్పుకోవడం లేదు. ఖమేనీకి నీడలా లారిజానీ అలీ లారిజానీ ఘనమైన నేపథ్యం ఉంది. ఇరాన్లో ప్రముఖ రాజకీయ కుటుంబంలో జని్మంచారు. పార్లమెంటరీ స్పీకర్‌గా పనిచేశారు. ఇరాన్ సాంస్కృతిక మంత్రిగా వ్యవహారించార. ప్రజలపై ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రభుత్వానికి విధానపరమైన సలహాదారుగా సేవలందించారు. అణ్వాయుధాల అంశంపై అమెరికాతో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఖమేనీకి సలహాదారుగా నియమితులయ్యారు. అత్యున్నత భద్రతా విభాగమైన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా ఎదిగారు. ఖమేనీకి నీడగా నిలిచారు. తత్వశాస్త్రంపై లారిజానీ ఆరు పుస్తకాలు రాశారు.కరడుగట్టిన బసిజ్ మిలీíÙయా ఫోర్స్ చీఫ్ సులేమానీ 1965లో జని్మంచారు. ఇటీవల ఇరాన్లో జరిగిన నిరసన కార్యక్రమాలను ఉక్కుపాదంలో అణచివేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ ప్రజలపై హింసకు పాల్పడిందని, అరెస్టులు చేసిందని ఇజ్రాయెల్ సహా పశి్చమ దేశాలు పేర్కొన్నాయి. బసిజ్ మిలీషియా ఫోర్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ముద్రవేసింది. సులేమానీ మరణంతో ఆ దళం చాలావరకు బలహీనపడినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారిద్దరూ గ్యాంగ్‌స్టర్ అసిస్టెంట్లులారిజానీ మృతిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపర్చి ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇరాన్ ప్రజల భవిష్యత్తు వారి చేతుల్లో ఉండాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. అలీ లారిజానీతోపాటు బసిజ్ చీఫ్ సులేమానీని హతమార్చామని ప్రకటించారు. వారిద్దరూ గ్యాంగ్‌స్టర్(అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లు అంటూ మండిపడ్డారు. ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని విమర్శించారు. -
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
టెహ్రాన్: యుద్ధం వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తాబా ఖమేనీ మొట్టమొదటిసారి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. హోర్ముజ్ జలసంధి మూసివేతను ఒత్తిడి పెంచే సాధనంగా ఉపయోగించాలని తమ అధికారులకు చెప్పారు. గల్ఫ్, అరబ్, పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.మొజ్తాబా ఖమేనీ నియామకం తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ మొట్టమొదటి ప్రకటనను ఆ దేశ టెలివిజన్‌లో గురువారం చదివారు. ఖమెనీ కెమెరా ముందు కనిపించలేదు. యుద్ధం ప్రారంభంలో ఆయన గాయపడ్డారని ఇజ్రాయెల్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఖమేనీ ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా గల్ఫ్, అరబ్ పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని చెప్పారు. అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.మరోవైపు, ఇవాళ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పలు డ్రోన్ల దాడి జరిగింది. దీనిపై కువైట్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ప్రకటన చేసింది. భౌతిక నష్టాన్ని మాత్రమే కలిగించిందని చెప్పింది. పూర్తి సమన్వయంతో వ్యవహరించి సమస్యను అధికారులు పరిష్కరించారని చెప్పింది.అలాగే, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియాపై దాడులకు ఇరాన్ యత్నించింది. విదేశీ చమురు ట్యాంకర్లనూ లక్ష్యంగా చేసుకుంటోంది. దీంతో ఇరాక్ అప్రమత్తమై పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. చమురు పోర్టు కార్యకలాపాలను మూసివేసినట్లు ప్రకటించింది. చమురు ధరలపై ఇవాళ ఉదయం ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో చమురు బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచం దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. -
మొజ్తాబా నా మాట విను : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవాలి. ఆ డిమాండ్‌ను తిరస్కరిస్తే, కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీయే లక్ష్యంగా చేసే దాడులకు తాను మద్దతు ఇస్తానని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.37 ఏళ్ల పాటు ఇరాన్‌ను ఒంటిచేత్తో పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ జీవితం విషాదాంతమైంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుండగా, ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి దాడి చేసింది. ఆ దాడిలో అయతుల్లా ఖమేనీ మరణించారు. ఇజ్రాయెల్ ఎలా మిలటరీ ఆపరేషన్ చేపట్టిందో, అదే తరహా చర్యలు మోజ్తబా ఖమేనీపై కూడా జరగవచ్చని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడంపై ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారని నేను నమ్మను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోజ్తబా నియామకానికి ముందు, అమెరికా ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో కూడా తమకు పాత్ర ఉండాలని పట్టుబట్టింది. వెనిజువెలా పాలనా పరమైన అంశాల్లో అమెరికా జోక్యం చేసుకున్నట్లే, ఇరాన్లో కూడా అదే విధంగా ప్రభావం చూపాలని ట్రంప్ కోరుకున్నారు.అయితే, దివంగత అయతుల్లా ఖమేనీ తన వీలునామాలో మోజ్తబా తన వారసుడిగా రావాలని కోరుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడితో మోజ్తబా ఎంపిక లాంఛనమైంది. ఇదే అంశంపై ఇరాన్ ప్రతిపక్ష గ్రూప్ ‘నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ రీసెర్చ్’ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ మాట్లాడుతూ..‘ఖమేనీ తన కుమారుడిని వారసుడిగా కోరుకోలేదు. ఆయన వీలునామాలో మోజ్తబాను వారసుడిగా పేర్కొనవద్దని స్పష్టంగా రాశారు’ అని తెలిపారు. -
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఎంపికలో బిగ్ ట్విస్ట్!
టెహ్రాన్: ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా అయతుల్లా సయ్యద్ మొజ్తాబా ఖమేనీ ఎంపిక విషయంలో బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. తన కుమారుడు తన వారసుడిగా కొనసాగడం తనకు ఇష్టం లేదని అయతుల్లా అలీ ఖమేనీ వీలునామా రాసినట్లు తెలుస్తోంది.అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో మొజ్తాబాను ఇరాన్ నిపుణుల అసెంబ్లీ ఎన్నుకుంది. అయితే ఈ మొజ్తాబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు పెదవి విరిస్తున్నారు. తాజాగా, ట్రంప్ మాత్రమే కాదు మొజ్తాబా తండ్రి, మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి సైతం ఇష్టం లేదని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అర్హతలు లేవని, గతంలో పలు మార్లు చెప్పిన ఆయతుల్లా వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ తాజాగా, పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల్లో తన వారసుడిగా మొజ్తాబా అనర్హుడంటూ గతంలో చెప్పిన విషయాన్ని తాజాగా న్యూయార్స్ టైమ్స్ కథనంలో పేర్కొంది. అయినప్పటికీ, వడ్డించే వాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయని సామెత చందంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఒత్తిడి మేరకు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడం అనివార్యమైంది.ఇరాన్‌లోని ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య మార్పు కోసం కృషి చేస్తున్న నేషనల్ యూనియల్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ (ఎన్యూడీఐ) రీసెర్చ్ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఖోస్రో మాట్లాడుతూ.. మొజ్తాబాకు ఇరాన్‌ను నడిపించే శక్తి సామర్ధ్యాలు, అనుభవం, రాజకీయ అనుభవం లేదు. మొజ్తబా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయాడు. చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.ఇరాన్ నాయకత్వ వారసత్వాన్ని సాధారణంగా సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత షియా మత పెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్)కి ఉంది. మొజ్తాబా నియామకం అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక జరగలేదు. బదులుగా, గత వారం ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరు అనే అంశంపై చర్చలు జరిగాయి. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఐఆర్జీసీ తరుఫు ప్రతినిధులు సైతం హాజరయ్యారు. వారే కమిటీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి మొజ్తాబాను ఎన్నుకునేలా చేశారని చెప్పారు.ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో మాకు మంచి సంబంధాలున్నాయి. ఖమేనీ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిన నిపుణుల సభ మొజ్తాబాకు ఓటు వేయలేదు. అతనిపై చాలా వ్యతిరేకత ఉంది. కానీ ఐఆర్జీసీ ఒత్తిడితో, అతన్ని వారసుడిగా పేర్కొన్నారు. సుప్రీం లీడర్ అంటే తాము చెప్పినట్లు నడుచుకునే నాయకుడే కావాలని ఐఆర్జీసీ చూస్తోంది. అందుకే మొజ్తాబాను ఎంచుకుంది. ఐఆర్జీసీ ఏది చెబితే అది చేసే మనస్తత్వం మొజ్తాబాది. ఐఆర్జీసీ ఆయన్ని ఓ తోలు బొమ్మలా చూస్తోందని’ ఆరోపించారు. -
ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయనే.. అధికారిక ప్రకటన
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీ (Ayatollah Ali Khamenei)ఎన్నికైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాగా, ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ముజ్తబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నాయి.ముజ్తాబా గాయం? తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్ చనిపోయారు. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్ అదెల్ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంతమైన సాయుధ విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. -
ట్రంప్ నిన్ను వదలం.. ఖమేనీ సన్నిహితుడి వార్నింగ్
ఇరాన్ సుప్రీం ఆయతుల్లా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఖమేనీ హత్యపై ఇరాన్ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తీవ్రంగా స్పందించారు. తమ దేశ సుప్రీం హత్యకు ట్రంప్ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.ఫిబ్రవరి 28 ఇరాన్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మృతి చెందారు. దీంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతీకారేచ్చతో రగిలిపోయి ఏక కాలంలో గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతుంది. తాజాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ ఈ అంశంపై స్పందించారు. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు."మేము మా నాయకుడి రక్తానికి మా ప్రజల మృతికి నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్ దీనికి మూల్యం చెల్లించాలి. చెల్లిస్తాడు కూడా మేము ఆయనను ఒంటరిగా వదిలిపెట్టం, అతను మా నాయకున్ని చంపడంతో పాటు 1000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాడు. ఇది మాములు విషయం కాదు " అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామిక్ రిపబ్లిక్‌ను విడగొట్టే కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.వెనెజువెలా మాదిరి ఇరాన్లో కూడా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్నారు. కానీ వారు అనుకున్న విధంగా జరగలేదు. ఇరాన్‌లోని పరిస్థితిని అంచనా వేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని లారిజానీ అన్నారు. గల్ఫ్ దేశాలు వారి దేశంలో నుంచి తమపై దాడి చేయకుండా నియంత్రించాలని లేని పక్షంలో ప్రతి దాడి చేయడం తప్పదన్నారు.లారిజానీ ఖమేనీకి సన్నిహితుడు ఇతను గతంలో IRGCలో పనిచేశారు. ఇతని సోదరుడు సాదిక్ లారిజానీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ పోటీదారులలో ఒకరు. -
ఖమేనీని చంపిన నీలి పిచ్చుక.. దీని ప్రత్యేకత ఇదే
-
అంతరిక్షపుటంచు నుంచి...
నిత్యం కట్టుదిట్టమైన భద్రత మధ్య అప్రమత్తంగా ఉండే ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ సైన్యం అత్యంత కచి్చతత్వంతో కూడిన దాడికి పాల్పడి హత్య చేసింది. 37 ఏళ్లపాటు ఇరాన్‌ను ఒంటిచేత్తో ఏలిన ఖమేనీ కథ చివరకు విషాదంగా ముగిసింది. గత 28న రాజధాని టెహ్రాన్‌లో నడి»ొడ్డున అత్యున్నత స్థాయి సమావేశంలో ఉండగా జరిగిన దాడిలో మరణించారు. అసలీ దాడి ఎలా జరిగింది, ఖమేనీ అంతం చూసేందుకు ఇజ్రాయెల్ ప్రయోగించిన ఆయుధం ఏమిటనేవి చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి లక్ష్యం సాధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మిసైల్‌ను ‘రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్’ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అత్యంత ప్రాణాంతక ఆయుధమని చెప్పుకోవచ్చు. ఒక్కసారి లక్ష్యం వైపు దూసుకెళ్లిందంటే దాన్ని మధ్యలో అడ్డుకోవడమే అసాధ్యమే. గురి తప్పే ప్రసక్తే లేదు. శత్రువు నేల కూలాల్సిందే! అసలేమిటి నీలి పిచ్చుక? మూడు బాలిస్టిక్ టార్గెట్ క్షిపుణుల కుటుంబంలో బ్లూ స్పారో కూడా ఒకటి. ఇందులో బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో కూడా ఉన్నాయి. మరో ఖండంలో సుదూరంలోని లక్ష్యాలను ఛేదించడానికి బాలిస్టిక్ క్షిపణులను ఫైటర్ జెట్ లేదా రాకెట్‌కు అమర్చి ప్రయోగిస్తారు. గాల్లోకి లేచిన క్షిపణి తర్వాత ఫైటర్ జెట్ నుంచి విడిపోయి భూ వాతావరణపు అంచుల దాకా వెళ్తుంది. తర్వాత గురుత్వాకర్షణ శక్తితో భూమి దిశగా ప్రయాణించి లక్ష్యాన్ని తాకి పేలిపోతుంది. ఇది ఒక బంతిని గాల్లోకి విసరడం లాంటిదే. పైకి వెళ్లిన బంతి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మళ్లీ భూమిని తాకుతుంది. అందుకే దీన్ని ‘అంతరిక్ష క్షిపణి’గా కూడా పిలుస్తుంటారు. నిజానికి బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో క్షిపణులను ఇజ్రాయెల్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌లో భాగంగా ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేశారు. శత్రుదేశాల బాలిస్టిక్ క్షిపణులను ముందే గుర్తించి, నేలమట్టం చేయడం ఈ డిఫెన్స్ సిస్టమ్ విధి. ఇక్కడ శత్రుదేశాల క్షిపణుల స్థానంలో స్పారో మిస్సైళ్లను డమ్మీగా ఉపయోగించి, ప్రాక్టీస్ చేస్తుంటారు. యుద్ధ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. బ్లూ స్పారో పొడవు 6.51 మీటర్లు. బరువు 1,900 కిలోలు. సింగిల్ స్టేజ్ సాలిడ్ రాకెట్ ప్రొపెల్లెంట్ రాకెట్ ఉంటుంది. జీపీఎస్‌తోపాటు ఐఎన్ఎస్ నావిగేషన్ సిస్టమ్‌తో ముందుకెళ్తుంది. బయటి నుంచి అందే సిగ్నల్‌తో పనిలేకుండా తన కదలికలు నిర్దేశించుకోగలదు. బ్లూ స్పారో మిస్సైల్ లండన్ బస్సు పరిమాణంలో ఉంటుంది. బ్లూ స్పారో స్ఫూర్తితో ‘రాక్స్’ ఇతర దేశాల అత్యాధునిక క్షిపణులకు దీటుగా బ్లూ స్పారోను డిజైన్ చేశారు. భూవాతావరణాన్ని దాటి ముందుకెళ్లి, మళ్లీ భూవాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని తాకడం ఈ నీలి పిచ్చుక ప్రత్యేకత. ఫైటర్ జెట్‌కు అమర్చిన బ్లూ స్పారో ఆకాశంలో భూవాతావరణం పరిధి వరకూ వెళ్లి విడిపోతుంది. అలాగే పైకి దూసుకెళ్లి భూవాతావరణం అంచును దాటేస్తుంది. పేలుడు పదార్థాలు కూర్చిన క్షిపణి ముందుభాగం వెనుక భాగం నుంచి విడిపోయి భూమి దిశగా వేగంగా ప్రయాణిస్తుంది. అలా కిందికి వచ్చే భాగాన్ని రీ–ఎంట్రీ వెహికల్ అంటారు. ఇందులో వార్హెడ్తోపాటు చిన్నపాటి థ్రస్టర్లు ఉంటాయి. శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేని రీతిలో నిట్టనిలువుగా కిందికి వచ్చి అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా ఫిబ్రవరి 28న ఉదయం టెహ్రాన్‌లో ఖమేనీ నివాసాన్ని బ్లూ స్పారో ఇదే తరహాలో ధ్వంసం చేసింది. ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేసిన ఒక మిస్సైల్ ఇరాన్ సుప్రీంలీడర్‌ను బలి తీసుకుంది. రఫేల్ సంస్థ బ్లూ స్పారో డెవలప్మెంట్తోనే ఆగిపోలేదు. సరిగ్గా ఇదే టెక్నాలజీతో ‘రాక్స్’ను అభివృద్ధి చేసింది. ప్రతికూల వాతావరణంలో సైతం అసాధారణమైన కచి్చతత్వంతో లక్ష్యాలను ఛేదించడం రాక్స్ క్షిపణుల ప్రత్యేకత. శత్రుదేశాలు జీపీఎస్ సిగ్నల్స్‌ను జామ్ చేసినా సరే ఈ క్షిపణులు సరిగ్గా పనిచేస్తాయి. భూఉపరితలంతోపాటు అంతర్భాగంలోని లక్ష్యాన్ని తాకుతాయి. 500 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. బ్లూ స్పారో ఒక స్కెచ్(చిత్తుప్రతి) అనుకుంటే రాక్స్ అనేది పూర్తిగా సిద్ధమైన ఆయుధం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖమేనీ కోసం.. అంతరిక్షం నుంచి మిస్సైల్?
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఆలీ ఖమేనీ ఇజ్రాయెల్ జరిపిన దాడులలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఖమేనీ మరణంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగింది. అయితే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్‌పై అటాక్ కోసం ఇజ్రాయెల్ అత్యాధునిక బ్లూస్పారో క్షిపణిని ప్రయోగించినట్లు పత్రికా కథనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు ఖమేనీని అంతంచేయడం కోసం ఈ క్షిపణి అంతరిక్షం నుంచి దూసుకొచ్చి లక్షాన్ని భేదించింది.ఇరాన్ సుప్రీం లీడర్ హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఒక దేశాధినేతను అతని దేశంలోనే అటాక్ చేసి చంపడం ప్రపంచాన్ని నోరెళ్లబెట్టాలా చేసింది. అయితే ఈ దాడికి సంబంధించిన ప్లాన్ గతేడాది నవంబర్లోనే జరిగిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. ఆయనపై ఈ 2026 మధ్యలో దాడి చేయాలని ప్లాన్ చేసినప్పటికీ ఇరాన్‌లోని నిరసనల కారణంగా ప్లాన్ ముందుకు జరిగిందని తెలిపారు. అయితే ఖమేనీపై అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ వాడిని క్షిపణి అత్యంత శక్తివంతమైనదిగా తెలుస్తోంది.బ్లూస్పారో ప్రత్యేకతబ్లూస్పారోగా పిలిచే ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజ్ దాదాపు 2 వేల కిలోమీటర్లు. దీని పొడవు 6.5 మీటర్లు కాగా బరువు 1.9 టన్నులు శత్రు రాడార్లకు చిక్కకుండా ఖచ్చితంగా లక్షాన్ని భేదించడం ఈ మిస్సైల్ ప్రత్యేకత. అయితే వేగవంతంగా లక్షాన్ని చేధించడానికి ఇవి తొలుత అంతరిక్షానికి ఎగిరి అక్కడి నుంచి టార్గెట్‌ను ధ్వంసం చేస్తాయి. బ్లూస్పారో రాకను గమనించేలోగే విధ్వంసం చేసేయడం ఈ మిస్సైల్ ప్రత్యేకత స్పందించే లోపే విధ్వంసం జరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.అయితే దీనిని ఇజ్రాయెల్ ‘అంతరిక్షం నుంచి విరుచుకుపడే బాలిస్టిక్ క్షిపణి’గా అభివర్ణిస్తుంది. ఎందుకంటే దీనిని ప్రయోగించేటప్పుడు మెుదటగా ఆకాశం అంచుల వరకూ ఎగురుతుంది అనంతరం తరువాత భూమిపై ఉన్న లక్ష్యాల వైపు మెరుపు వేగంతో దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేస్తుంది. భీకర వేగంతో అత్యంత కచ్చితత్వంతో టార్గెట్స్‌ను ఛేదించడం ఈ మిస్సైల్ ప్రత్యేకత. ఇక ఇరాన్ సుప్రీం ఖమేనీని ఈ క్షిపణి వాడే ఇజ్రాయెల్ అంతం చేసింది. -
ఖమేనీ హత్యకు ఇలా ప్లాన్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
టెలీ అవీవ్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఇరాన్ సైతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి హత్య ప్లాన్‌కు సంబంధించిన కీలక వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్లోనే నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్లోనే నిర్ణయించుకున్నాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో కలిసి జరిగిన అత్యంత రహస్య భద్రతా సమావేశంలో ఆ లక్ష్యాన్ని నిర్ణయించాము. మొదట ఆ ఆపరేషన్‌ను 2026 మధ్యలో అమలు చేయాలని భావించినప్పటికీ, ఇరాన్లో నెలకొన్న అంతర్గత అస్థిరత కారణంగా దాడి సమయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వ్యూహాన్ని అమెరికాకు కూడా వెల్లడించాం’ అని తెలిపారు.అలాగే.. ఇరాన్లో మతపెద్దల పాలనపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వారు ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై దాడులకు దిగే అవకాశముందని భావించి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్, ఎపిక్ ఫ్యూరీ ప్రారంభ దశలోనే ఈ లక్ష్యాన్ని అమలు చేసినట్లు సమాచారం. ఒక సార్వభౌమ దేశ అత్యున్నత నాయకుడిని వైమానిక దాడి ద్వారా హతమార్చడం ఇదే మొదటిసారి అని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, అణు కార్యక్రమం తమ దేశానికి అస్తిత్వ ముప్పుగా మారిందని చెబుతోంది. అందుకే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా బలహీనపరచడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. -
ఇరాన్ కొత్త నాయకుడికి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్ష్యుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపికలో అగ్రరాజ్యం పాత్ర ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అయతొల్లా అలీ ఖమేనీ కొడుకు మోజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంగా ఎంపిక అయ్యారనే ప్రచారంపైనా ట్రంప్ తీవ్రంగా స్పందించారు.ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా మోజ్తబాను చూడటం దాదాపుగా అసాధ్యం అని ట్రంప్ తేల్చేశారు. రాయిటర్స్ మీడియాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ భవిష్యత్తు కోసం జరిగే నాయకత్వ ఎంపికలో మేము (అమెరికా) భాగం కావాలి. అప్పుడే ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ప్రతీ ఐదు సంవత్సరాలకొకసారి మళ్లీ ఇదే చేయాల్సిన అవసరం ఉండదు. ఇరాన్‌కు, ఆ దేశ ప్రజలకు గొప్ప సేవ అందించే నాయకుడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మోజ్తబాను తదుపరి నాయకుడిగా పరిగణించడం అసాధ్యమనే రీతిలో ఆయన మాట్లాడినట్లు సదరు మీడియా సంస్థ కథనం ఇచ్చింది.మరోవైపు.. ఇరాన్ మాజీ రాజకుమారుడు రెజా పహ్లవికి ఆ అవకాశం ఉండొచ్చా? అని రాయిటర్స్ ప్రతినిధి వేసిన ప్రశ్నకు.. ఎంపికలో ఎంతో మంది పేర్లను పరిశీలించవచ్చు. అది ఇప్పుడే చెప్పలేం అని ట్రంప్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ కొత్త నాయకుడి ఎంపికలో అమెరికా ప్రమేయం ఉండాల్సిందేనన్న ట్రంప్ ప్రకటన చేయడం ద్వారా మధ్య ప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్‌లో అమెరికా ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ వ్యాఖ్యలు ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటనకు, రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న(2026)అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో అయతొల్లా ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించారు. ఆయన మరణాంతరం గార్డియన్ కౌన్సిల్‌కు చెందిన అయతొల్లా అలిరెజా ఆరఫీని (ఖమేనీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు కూడా) తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమించారు. ఆపై మార్చి 4న ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఖమేనీ తనయుడు మోజ్తబాను అధికారికంగా ఎన్నుకుంది. అయితే ఈ ఎంపిక సజావుగా జరగలేదని, ఇందులో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒత్తిడి ఉందని పలు కథనాలు చెబుతున్నాయి. -
అంతులేని ట్రంప్ అబద్ధాలు
ఎక్కువ ఉపయోగంలో లేదు గానీ ‘పారదర్శక అబద్ధాలు’ అనే మాట ఒకటుంది. దాని అర్థం, ఒక మనిషి అబద్ధాలు చెప్తే అవి అబద్ధాలని వెంటనే అందరికీ అర్థమైపోవటం. అటువంటి పారదర్శక అబద్ధాలు చెప్పటంలో ఘనా పాఠిగా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరో వరుస అబద్ధాలు చెప్తూ ఇరాన్‌పై ఫిబ్రవరి 28న యుద్ధానికి తలపడ్డారు. యుద్ధానికి చెప్పిన కారణాలన్నీ పచ్చి అబద్ధాలని పరిశోధనలు చేసి నిరూపించవలసిన అవసరమేమీ లేదు. స్వయంగా అమెరికన్ ప్రభుత్వపు నివేదికలు, అక్కడి మీడియా, చివరకు గతంలో ట్రంప్ తానే చేసిన ప్రకటనలు తేల్చి చూపుతున్నాయి. ‘యుద్ధాలు చేయ బోను, యుద్ధాలను అంతటా ఆపుతున్నాను’ అంటూ జనవరిలో మాదక ద్రవ్యాల విషయమై అబద్ధపు ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను అపహరించారు; కేవలం రెండు నెలల తర్వాత, ఇరాన్ ‘కొద్ది రోజులలోనే’ అణ్వస్త్రాలు తయారు చేసి తమకు ముప్పుగా మారనుందనే అబద్ధం చెప్తూ ఆ దేశ అధినేతను కుటుంబ సభ్యులతో సహా బలిగొన్నారు.మళ్లీ అవే అబద్ధాలుప్రస్తుత యుద్ధం ఎట్లా సాగి, ఏ విధంగా ముగుస్తుందన్నది అట్లుంచుదాం. అమెరికా, ఇజ్రాయెల్ తామే ప్రకటించినట్లు ‘గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో’ సైనిక సన్నాహాలు సాగించి మొదలుపెట్టిన యుద్ధం వారు ఆశించినట్లు రెండు రోజులలోనే ముగియక పోగా, రోజులు గడిచేకొద్దీ ఇరాన్ పట్టుదలతో మరింత భీకరంగా మారటం మాత్రం కనిపిస్తున్నది. ఇరాన్ అణుకేంద్రాలపై నిరుడు జూన్‌లో ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు జరిపిన ట్రంప్, ఆ కేంద్రాలు ‘పూర్తిగా తుడిచి పెట్టుకుపోయా’యని ప్రకటించారు. ఆ దాడులకు ముందు కూడా, ఇరాన్ అణ్వస్త్రాలు ఇక ‘కొద్ది వారాలలోనే’ తయారు కానున్నాయన్నారు. ఆ మాట అబద్ధమని అపుడు కూడా ప్రపంచానికి వెంటనే అర్థమైంది. తమ లక్ష్యం శాంతియుత వినియోగమే తప్ప అస్త్రాల తయారీ ఎంత మాత్రం కాదనీ, అంతర్జాతీయ చట్టాల మేరకు శాంతియుత వినియోగం తమ హక్కనీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో అందుకే చేరామనీ అన్న ఇరాన్ మాటలను నమ్మకపోయినా, యథాతథంగా అణ్వస్త్ర తయారీ సన్నాహాలు ఎప్పుడూ ఎవరికీ కనిపించలేదు. అస్త్రాల కోసం యురేనియం శుద్ధి 90 శాతం అవసరం కాగా ఆ కేంద్రాలలో శుద్ధి ఎన్నడూ 60 శాతానికి దాట లేదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నది. అమెరికన్ నిఘా సంస్థల నివేదికలు సైతం 60 శాతమనే చెప్పాయి. ఇవన్నీ గాక, అణుశక్తి వినియోగంపై ఇరానియన్ ప్రభుత్వం అమెరికా, యూరప్‌లతో చర్చలు జరుపుతూనే ఉంది. అయినా తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం, ట్రంప్ ఇరాన్ కేంద్రాలపై బి–52 బాంబర్లతో దాడులు చేశారు.గ్రేటర్ ఇజ్రాయెల్ కోసమే!అవే ప్రయోజనాల కోసం ఇపుడు తిరిగి సరిగా అవే అబద్ధాలు చెప్తూ యుద్ధం మొదలు పెట్టారు. గత జూన్ దాడులలో ఆ నిర్మాణాలు బాగా దెబ్బతినగా అక్కడి యురేనియం నిల్వలు, యంత్ర సామగ్రి ఆ శిథిలాల కింద కూరుకుపోయి ఉన్నాయి. వాటిని ఇరాన్ కనీసం బయటకు అయినా తీయలేదు. అటువంటపుడు అస్త్రాల తయారీ ప్రసక్తి ఎక్కడిది? పైగా, భవిష్యత్తులో శాంతియుత వినియోగం లేదా మరొకటి అన్న ప్రశ్నలపై ఇరాన్, అమెరికాల మధ్య కొద్ది నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయమై ఒప్పందం కుదిరే సూచనలున్నట్లు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్ గత వారమే ప్రకటించింది. విషయమేమంటే, ఇజ్రాయెల్‌కు, వారి పలుకుబడితో వ్యవహ రిస్తున్న ట్రంప్‌కు, పశ్చిమాసియాలో ఇరాన్ ఒక్కటే స్వతంత్రంగా నిలబడి అభివృద్ధి చెందటం కంటగింపుగా మారింది. వారి పరమ లక్ష్యం పాలస్తీనా దేశం ఏర్పడక పోవటం, గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టి, ఇరాన్‌ను సామంత రాజ్యంగా మార్చి అక్కడి చమురు నిల్వలు కాజేయటం! అమెరికా అధ్యక్షుడు అంతే పెద్ద అబద్ధం మరొకటి ప్రచారం చేస్తున్నారు. ఇరాన్ అణ్వస్త్రాలనే గాక, వాటిని అమెరికాపై ప్రయో గించగల క్షిపణుల తయారీని పూర్తి చేస్తున్నదని! ఇరాన్ వద్ద గల క్షిపణులలో అతి ఎక్కువ దూరం ప్రయాణించగల వాటి పరిధి సుమారు 1,200 కి.మీ. కాగా, ఇరాన్ నుంచి అమెరికా దూరం దాదాపు 12,000 కి.మీ.లు. అనగా 10 రెట్లు ఎక్కువ. ఇవన్నీ అమె రికా నివేదికలు, నిపుణుల లెక్కలే. అటువంటి స్థితిలో అణ్వస్త్రా లెక్కడ? వాటిని అమెరికా వరకు ప్రయోగించగల క్షిపణులెక్కడ? అసలు విషాదంట్రంప్ ఒక పారదర్శక అబద్ధాలకోరు అన్నది ప్రపంచంతో పాటు స్వయంగా అమెరికన్లకు, తన ‘మాగా’ ఓటర్లకు కూడా అర్థమైంది. అందువల్లనే ఆయన ‘అప్రూవల్ రేటింగ్’ 27 శాతానికి పడిపోయింది. ‘మాగా’ అనే ఉత్తేజకర నినాదంతో గెలిచిన ఆయన ఆ లక్ష్యాల సాధనకు సవ్యమైన మార్గాలను ఎంచుకునే బదులు, వ్యక్తిగత ప్రయోజనాలకు, విధానపరమైన వైఫల్యాలకు, ఇజ్రాయెలీ లాబీకి బందీ అయి, ఈ అరాచకాలన్నీ సృష్టిస్తున్నారు.యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఇరాన్లో ప్రభుత్వాన్ని, రాజ కీయ వ్యవస్థనే మార్చివేసి, రివల్యూషనరీ గార్డ్స్‌ను అంతం చేయగలమన్న ట్రంప్, 48 గంటలు గడవగానే ప్రభుత్వాన్ని, వ్యవస్థను మార్చటం తమ లక్ష్యం కాదంటున్నారు. ఆయన బహిరంగంగా పిలుపు ఇచ్చినట్లు అక్కడి ప్రజలేమీ తిరుగుబాటు చేసి ‘ప్రభుత్వాన్ని తమ చేతులలోకి తీసుకోవటం’ లేదు. ట్రంప్, నెతన్యాహూల దుర్మా ర్గానికి, పశ్చిమాసియాలో అమెరికన్ స్థావరాలకు అవకాశమిచ్చి సామంతులుగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశాలు బలవుతున్నాయి. గతంలోకి వెళితే, ఇరాన్ చమురును మొదటి నుంచి తమ అధీనంలో ఉంచు కున్న పాశ్చాత్య దేశాలు అక్కడ ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన ప్రధాని మొసాదెగ్ను 1953లో సీఐఏ, ఎంఐ6 కుట్రతో పడగొట్టినప్పటి నుంచి ఈ క్రీడ సాగుతున్నది. 1979లో వచ్చిన ఇస్లామిక్ పాలన అందుకు అడ్డుకట్ట వేయటాన్ని సహించలేక, షా పహ్లవీ కుమారుడిని తిరిగి అమెరికా నుంచి దిగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ పరిణామాల మధ్య పెద్ద విషాదం ఒకటున్నది. గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్న ప్రధాని మోదీ– మదురో దంపతుల అపహరణను, వెనిజులాపై దాడిని, ఇరాన్‌పై దాడిని, ఖమేనీ హత్యను కనీసం పరోక్షంగానైనా ఖండించే సాహసం చేయలేదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్
ఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతిపట్ల ఇండియా సంతాపం తెలిపింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. సంతాప సందేశం రాశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే.శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్‌తో ముగిసింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. దాంతో ఆయన తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ హిట్‌లిస్ట్‌లో ఉన్న ఖమేనీపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది.ఖమేనీతో జరిగిన భేటీకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కమాండర్ ఇన్ చీఫ్ మొహమ్మద్ పాక్‌పౌర్, రక్షణ శాఖ మంత్రి అజీజ్ నజీర్జాదే, మిలటరీ కౌన్సిల్ అధినేత అడ్మిరల్ అలీ షామ్‌ఖనీ, ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ సయ్యద్ మాజిద్ మౌసావీ, డిప్యూటీ ఇంటెలిజెన్స్ మంత్రి మొహమ్మద్ షిరాజీతోపాటు మరికొందరు ముఖ్యులు హాజరయ్యారు. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో వీరంతా హతమయ్యారు. ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. -
ఆపరేషన్ ముగియలేదు.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా సైన్యం పనితీరుకు అసాధారణ రేటింగ్ ఇచ్చారు. అమెరికా ఇప్పుడు కమాండింగ్ స్థానంలో ఉందన్నారు. యుద్ధ రంగంలో అమెరికా సైన్యం పైచేయి సాధించిందని.. బాగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ట్రంప్.. 15/10 రేటింగ్ ఇచ్చారు.వైట్ హౌస్‌లో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లతో ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికా, మిత్రదేశాలు.. ఇరాన్‌పై యుద్ధంలో పైచేయి సాధిస్తున్నాయి. వారం కంటే తక్కువ సమయంలోనే వేగంగా పురోగతి సాధించాం. మేము యుద్ధ రంగంలో బాగానే ఉన్నాము. ఈజీగా చెప్పాలంటే. 10 స్కేల్లో 15 రేటింగ్‌తో ముందంజలో ఉన్నాం. మనం ఇప్పుడు చాలా బలమైన స్థితిలో ఉన్నాం. ఇరాన్ నాయకత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఇరాన్‌కు నాయకుడిగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఇరాన్ నాయకత్వ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఇదే సమయంలో ట్రంప్ అణు హెచ్చరికను పునరావృతం చేశారు. ఇరాన్‌పై దాడి చేయాలనే నిర్ణయాన్ని అమెరికా నాయకుడు మళ్ళీ సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించడానికి దగ్గరగా ఉందని వాదించారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయి అని మండిపడ్డారు. ఇరాన్‌పై ఇంకా ఆపరేషన్ ముగియలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ఆయుధశాల వేగంగా తుడిచిపెట్టబడుతోందన్నారు. చివరగా.. వాషింగ్టన్ చివరికి టెహ్రాన్‌లో పాలన మార్పును కోరుకుంటుందో లేదో వైట్ హౌస్ నిర్ధారించకుండా ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఒమన్ పోర్టుపై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి
కొనసాగుతున్న అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధంయుద్ధం దృష్ట్యా ఖమేనీ అంత్యక్రియలు వాయిదా వేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన -
మషాద్ నగరంలో ఖమేనీ అంత్యక్రియలు
-
ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎన్నుకున్నారన్న ప్రచారం ఉత్తిదేనా?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ (అలీ ఖమేనీ కుమారుడు)ని ఎన్నుకున్నారంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ద్వారా ఆ దేశ ప్రభుత్వం ఖండించింది.“దేశానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎంపిక చేసిందని మీడియాలో ప్రచారం అవుతున్న నివేదికలకు ఏ ఆధారాలూ లేవు. వాటిని అధికారికంగా ఖండిస్తున్నాం” అని ఎక్స్‌లో ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ తెలిపింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎన్నుకున్నా, అతడిని టార్గెట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ ఇవాళ ఉదయమే హెచ్చరించిన విషయం తెలిసిందే.కాగా, మొజ్తాబాకు వారసుడిగా అలీ ఖమేనీని ఎన్నుకున్నారని, సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. కొన్ని గంటల్లోనే ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొజ్తాబా ఖమేనీని వారసుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పింది.మొజ్తాబా తన దివంగత తండ్రి అలీ ఖమేనీ కార్యాలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించారని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉన్నత వర్గం, ఖుద్స్ దళంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. మొజ్తాబా తన తండ్రి కంటే కఠిన వైఖరితో ఉంటారని తెలిపింది. ఇరాన్లో నిరసనకారులపై జరిగిన హింస, అణచివేతల వెనుక మొజ్తాబా పాత్ర ఉందని వివరించింది. 2019 నవంబర్‌లో అమెరికా ట్రెజరీ విభాగం మొజ్తాబాపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వంలో ఏ పదవీ లేకపోయినప్పటికీ సుప్రీం నాయకుడి తరఫున అధికారిక ప్రతినిధిగా వ్యవహరించినందుకు అతడిని గుర్తించింది.మరోవైపు, ఇరాన్ మీడియా ప్రకారం.. ఇరానీయులు దివంగత సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ పార్థివ దేహానికి ఇవాళ రాత్రి టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ ప్రార్థనా మైదానంలో జరిగే కార్యక్రమంలో తుది వీడ్కోలు పలుకనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజులు కొనసాగుతుంది, అంతిమయాత్ర తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ప్రతీకారంతో ఇరాన్‌పై బాంబులతో దాడి చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ఆరోపించారు.వైట్ హౌస్‌లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. “మేము చర్యలు చేపట్టకపోతే, అణుయుద్ధం జరిగేది. వారు అనేక దేశాలను నాశనం చేసేవారు. వారి మనస్తత్వం సరిగ్గాలేదు, కోపంతో ఉన్నారు, వారు పిచ్చివాళ్లు. వారి వద్ద అణ్వాయుధం ఉంటే ప్రయోగించేవారు” అని చెప్పారు. Reports circulating on media regarding potential candidates for leadership selected by Iran’s Assembly of Experts have no official source and are officially denied.#Iran#AssemblyOfExperts#FactCheck pic.twitter.com/g9b9znt8j8— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 4, 2026 -
ఇరాన్ కొత్త నేతను నియమిస్తే.. వెంటనే లేపేస్తాం.., ఇజ్రాయెల్ వార్నింగ్
జెరూసలేం: అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎంపికయ్యారు. అయితే, మోజ్తాబా ఎన్నికపై ఇజ్రాయెల్ స్పందించింది. ఇరాన్ ప్రభుత్వం నియమించిన నాయకుడు ఎవరైనా సరే వెంటనే లేపేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) ఒత్తిడి మేరకు ఇరాన్ 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ దేశానికి కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నుకుంది. ఈ క్రమంలో మోజ్తాబా ఎంపికపై ఇజ్రాయెల్ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేశారు. పరోక్షంగా మోజ్తాబా ప్రాణం తీసేందుకు తాను, దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ దళాల(IDF)కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ ‘రోర్ ఆఫ్ ది లయన్’లో భాగంగా అంతర్భాగంగా మిషన్‌ను నిర్వహించడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని, చర్య తీసుకోవాలని ఐడీఎఫ్‌కు సూచించినట్లు చెప్పారు. כל מנהיג שימונה ע"י משטר הטרור האיראני כדי להמשיך ולהוביל את התוכנית להשמדת ישראל, לאיים על ארה"ב והעולם החופשי ומדינות האזור, ולדכא את העם האירני - יהיה יעד חד משמעי לחיסול.לא חשוב מה שמו והמקום בו יסתתר.רה"מ ואני הנחינו את צה"ל להיערך ולפעול בכל האמצעים למימוש המשימה כחלק…— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) March 4, 2026 -
ఇక్కడికొచ్చేదాకా వణికిపోయాం
ఢిల్లీ/ముంబై/చెన్నై/బెంగళూరు: పశ్చిమాసియాలో మూడ్రోజులుగా చిక్కుకుపోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయుల్లో కొందరు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ క్షణమొక యుగంలా గడిచిందని, తిరిగొస్తామా అన్న భయంతో గడిపామని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకోగానే పశి్చమాసియాలో తాము అనుభవించిన భయాందోళనలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇప్పటిదాకా నా మనసు స్థిమితపడలేదు. విమానం ఎక్కాక కూడా అదే ఆందోళన. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాతే కుదుటపడ్డా’’అని సునీల్ గుప్తా అనే ప్రయాణికుడు చెప్పారు. ‘‘బుక్ చేసిన విమానం రద్దవడంతో నాలుగు రోజులు దుబాయ్‌లోనే ఉండాల్సి వచి్చంది. దూసుకొస్తున్న క్షిపణులను గగనతల రక్షణవ్యవస్థలు పేల్చేయడం కళ్లారాచూశా. దీంతో భయం ఒక్కసారిగా పెరిగింది. హోటల్ ఖర్చుల ఆర్థికభారం పెనుసమస్యగా మారింది’’ అని దుబాయ్ నుంచి వచి్చన నోయిడా వాసి అరవింద్ చెప్పారు. ‘‘ఇరాన్లో చదువుతున్న నా కూతురు హాస్టల్లో ఉంటోంది. వాళ్లకు సమీపంలో క్షిపణి పడటంతో హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది’’ అని కున్వర్ షకీల్ అహ్మద్ చెప్పారు. ‘‘న్యూయార్క్ నుంచి వస్తూ శనివారం దుబాయ్ చేరుకున్నా. మధ్యాహ్నం గగనతలం మూసేశారు. మమ్మల్ని హోటల్‌కు తరలించారు. బాంబులు, క్షిపణుల మోత చూసి వణికిపోయా’’ అని శుభా అనే మహిళ చెప్పారు. క్యూల్లో వేల మంది.. ‘‘విమానాలు రద్దయ్యాయని తెలియగానే దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిన్నారులు ఏడుపు మొదలెట్టారు. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో వేలాదిమంది పోగుబడ్డారు. క్యూ వరసల్లో దాదాపు 20,000 మంది నిలబడ్డారు. అందర్నీ తర్వాత వేర్వేరు హోటళ్లకు తరలించారు. స్వదేశానికి తిరిగొచ్చామంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చలువే’’ అని తమిళనాడులోని నాగూర్‌కు చెందిన సయ్యద్ అలీ చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేరుకున్న భారతీయుల ముఖాల్లో అమితానందం కని్పంచింది. ‘‘అబూదాబిలో చమురుశుద్ధి కంపెనీలో పనిచేస్తా. భారత్‌కు వచ్చేందుకు అక్కడి ఎయిర్‌పోర్టకు రాగానే అలర్ట్ ప్రకటించారు. కిటికీల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు. కింద కూర్చోమన్నారు. క్షిపణి దూసుకొస్తోందని చెప్పగానే ప్రాణం పోయినంత పనైంది. మీకు సమీపంలో క్షిపణి వచ్చిందంటే ఎలా ఉంటుంది?’’అని మంగళూరుకు చెందిన సౌరభ్ చెప్పారు. -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కుమారుడు
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఆయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడే మోజ్తాబా.ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం.. ఇరాన్ 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ మోజ్తాబాను ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ అంటే భారత్‌లో లోక్‌సభ,రాజ్యసభ సభ్యులని అర్ధం. మోజ్తాబా ఎన్నికలు ఐఆర్జీసీ ఒత్తిడి మేరకు అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు మోజ్తాబాను నియమించినట్లు తెలుస్తోంది. ఖమేనీ రెండో కుమారుడు ఇరాన్ ప్రభుత్వంలో ఇంత వరకు ఎలాంటి అత్యున్నత పదవి చేపట్టలేదు. కానీ ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో ఇరాన్ సైన్యంలో సేవలందించారు.ఐఆర్‌జీసీతో బలమైన సంబంధాలు ఉన్ మోజ్తబా, ఇరాన్ సంప్రదాయవాద రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ చైర్మన్ ఘోలం-అలీ హద్దాద్-అదెల్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఇటీవల అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్‌పై దాడి చేసినప్పుడు మోజ్తబా భార్య జహ్రా హద్దాద్-అదెల్ మరణించారు. -
కశ్మీర్లో ఖమేనీ ఎఫెక్ట్.. ఎంపీ, మేయర్‌పై కేసు నమోదు
శ్రీనగర్: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతిలో పలు దేశాల్లో ఉన్న షియా ముస్లింలు నిరసనలు చేపట్టారు. ఇదే సమయంలో భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో కూడా షియా ముస్లింలు ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. కాశ్మీర్ లోయలో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో అల్లర్లు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ డివిజన్లో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈ వారాంతం వరకు అంటే మార్చి 7వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సకీనా అధికారికంగా ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. దీంతో, వారం పాటు విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. మరోవైపు.. జమ్ముకశ్మీర్‌లో ఉద్రికత్తల కారణంగా కశ్మీర్ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఓ ప్రకటనలో అధికారులు వెల్లడించారు.ఇక, హింసాత్మక నిరసనలను నివారించడానికి శ్రీనగర్, ఇతర ప్రాంతాలలో ఆంక్షలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు. కశ్మీర్ లోయలో 2G మొబైల్ ఇంటర్నెట్ మాత్రమే అందుబాటులో ఉంది. హోం శాఖ ఆదేశాల ప్రకారం ప్రస్తుతానికి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పరిస్థితుల తీవ్రతను బట్టి వీటిని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు, కల్పిత, తప్పుదారి పట్టించే కంటెంట్‌ను పంచుకున్నారనే ఆరోపణలపై శ్రీనగర్ పోలీసులు నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ, శ్రీనగర్ మాజీ మేయర్ జునైద్ మట్టుపై కేసు నమోదు చేశారు.లోయలో రాళ్ల వర్షంఖమేనీ చనిపోయినట్లు ఆదివారం రోజు ఇరాన్ అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం నాడు నిరసనకారులు, భద్రతా దళాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఐదుగురు పోలీసులు సహా కనీసం 12 మందికి గాయాలు అయ్యాయి. రాళ్లు రువ్వే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు.. టీన్ షీట్లు, ముళ్ల కంచెలతో మూసివేశారు. లోయలో పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. -
కదలికల్ని ట్రాక్ చేసి ఖమేనీ ప్రాణం తీసిన మొస్సాద్?
జెరుసలేం : దశాబ్దాల పాటు ఇరాన్‌ను శాసించి, పశ్చిమ దేశాలకు కంట్లో నలుసులా మారిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (86) కథ ముగిసింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో గత శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు జరిపింది. ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఖమేనీ మరణించారు.అయితే, ఖమేనీ ప్రాణాలు తీసేందుకు ఇజ్రాయెల్ నిఘూ సంస్థ మొస్సాద్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలను, ఫోన్లను హ్యాక్ చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంచలన కథనాలు వెలువరించాయి. నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ టెహ్రాన్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాల నెట్‌వర్క్‌లోకి చొరబడి, వాటి ఫుటేజీని గోప్యంగా సేకరించినట్టు సమాచారం. ఇరాన్‌లోని ఖమేనీ నివాసం ఉండే అనుమానిత ప్రాంతం టెహ్రాన్‌లోని పాశ్చర్ స్ట్రీట్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు ఖమేనీ సన్నిహితులు, ఇతర ప్రభుత్వ పెద్దల ఫోన్ వ్యవస్థల్లో చొరబడింది. అనంతరం,ఇజ్రాయెల్ ట్రాక్ చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఫుటేజీ, ఖమేనీ ఫోన్ సంభాషణతో పాటు ఇతర వివరాలన్నీ ఎన్క్రిప్టెడ్,ట్రాన్స్‌మీటర్ ద్వారా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందేది.సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు ఖమేనీ రోజువారీ జీవనశైలిని, ఆయన ఎక్కడ నివసిస్తారో, ఎవరిని కలుస్తారో, ఎలా సంభాషిస్తారో, దాడి జరిగితే ఎక్కడికి వెళ్ళవచ్చో అన్న విషయాలను లోతుగా అధ్యయనం చేశారు. అదేవిధంగా, ఆయనతో తరచుగా సమావేశం కాని ఇతర రాజకీయ, సైనిక నాయకుల కదలికలను కూడా గమనించారు. ఇజ్రాయెల్ ఒక కెమెరా సాయంతో ఖమేనీ గురించి పూర్తి సమాచారం రాబట్టినట్లు తేలింది. ఆ కెమెరా ఖమేనీ బాడీగార్డులు తమ వ్యక్తిగత వాహనాలను ఎక్కడ పార్క్ చేస్తారో, వారి రోజువారీ అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఉపయోగపడింది.ఈ క్రమంలో గత శనివారం ఉదయం టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ కార్యాలయం, అధ్యక్ష భవనం, జాతీయ భద్రతా విభాగం ఉన్న సముదాయంలో ఖమేనీతో పాటు ఇతర ఉన్నతాధికారులు సమావేశం కావాల్సి ఉంది. మొదట రాత్రి దాడి చేయాలని నిర్ణయించినా, చివరికి పగలు దాడి చేయాలని వ్యూహం మార్చారు. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 6 గంటలకు, యుద్ధ విమానాలు ఖచ్చితమైన లక్ష్యాలను తాకే మెషిన్లతో దాడి ప్రారంభించాయి.అసోసియేటెడ్ ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు ఈ దాడులు 60 సెకన్లలో మూడు లక్ష్యాలను తాకాయని, ఫలితంగా ఖమేనీతో పాటు సుమారు 40 మంది ఉన్నతాధికారులు, రివల్యూషనరీ గార్డ్ చీఫ్ కూడా మరణించారని తెలిపారు. పగలు దాడి జరపడం ద్వారా ఆశ్చర్యాన్ని కలిగించగలిగామని ఆయన పేర్కొన్నారు. -
ఇరాన్ సుప్రీం ఖమేనీ భార్య 'మన్సూరే' మృతి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన నేపథ్యంలో ఖమేనీ కుటుంబ సభ్యులు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఆ దాడుల్లో ఖమేనీ భార్య తీవ్రంగా గాయపడింది. దాంతో మన్సూరేని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే మన్సూరే మృతిపై ఇరాన్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.సోమవారం నాడు తను మరణించినట్టు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి చెందారు. ఖమేనీ మృతితో ఇప్పటికే ఇరాన్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మన్సూరే ఖోజాస్తే కూడా మరణించడంతో ఉద్రితకలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సామ్రాజ్యవాద శక్తుల దాడులను భీకరంగా తిప్పికొడతామని ఇప్పటకే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. -
ఇరాన్‌పై ట్రంప్ ప్లానేంటి.. ఇరాక్ పరిస్థితి వస్తుందా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసి అమెరికా, ఇజ్రాయెల్.. అగ్రనేతను మట్టుబెట్టాయి. ప్రత్యర్థి దాడిలో ఖమేనీ అత్యంత సులువుగా హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతాయా?. ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యం నెరవేరిందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి ఇరాన్ ప్రాక్సీ గ్రూపుల సంగతేంటి?. ఖమేనీ మృతిపై పగ తీర్చుకునేందుకు ఇరాన్ ఎలాంటి ప్లాన్ చేస్తోంది. భవిష్యత్‌లో అమెరికా ఎదుర్కొవాల్సిన పరిస్థితులేంటి?. 2003 నాటి ఇరాక్ యుద్దం ఏం చెబుతోంది? అని సంగతులు తెలియాల్సిందే.. సుప్రీం లీడర్ ఖమేనీ దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్‌ను శాసించిన అగ్రనాయకుడు. 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ(86) మరణించడంతో, ఆయన వారసుడిగా.. ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ (మత పెద్దల మండలి) అయతుల్లా అలీ ఖమేనీని ఎంపిక చేసింది. తదుపరి 30 ఏళ్లలో ఖమేనీ పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పోలీసులు, మీడియా, మతపరమైన ఉన్నత వర్గాలతో సహా, తనకు విధేయులైన వారి నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలలో తన పట్ల భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఖమేనీ వ్యక్తిత్వ ఆరాధనను ప్రోత్సహించారు. రాజకీయ అణచివేత, ప్రత్యర్థుల అక్రమ అరెస్టులూ జరిగాయి. ఆయన చాలా అరుదుగా విదేశాలకు వెళ్లేవారు. ఖమేనీ తన భార్య, ఆరుగురు పిల్లలు, మనవరాళ్లు, మనవళ్లతో కలిసి సెంట్రల్ టెహ్రాన్‌లోని ఒక నివాస సముదాయంలో చాలా నిరాడంబరంగా జీవించేవారని రిపోర్టులున్నాయి.1999లో విద్యార్థుల నిరసనలు ఆయన అధికారానికి ముప్పుగా మారినప్పటికీ, వాటిని అణచివేయగలిగారు. ఒక దశాబ్దం తర్వాత, అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కొందరు తిరుగుబాటు చేయడంతో, వారిపై పెప్పర్ స్ప్రే వాడటం, కొట్టడం, కాల్పులు జరపడం వంటివి జరిగాయి. 2019లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిరసనలు మిన్నంటినప్పుడు, చట్టవిరుద్ధమైన ప్రదర్శనలను అడ్డుకోవడానికి ఖమేనీ రోజులు తరబడి ఇంటర్నెట్ను నిలిపివేశారు. మహిళా విద్యపై గత పాలకులు విధించిన అడ్డంకులను ఖమేనీ తొలగించారు. కానీ, ఆయనకు లింగ సమానత్వంపై ఏమాత్రం నమ్మకం లేదు. హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మహిళలను అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఏకాంత కారాగారంలో ఉంచారు. వారికి మద్దతు ఇచ్చిన వారిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఒక మానవ హక్కుల న్యాయవాదికి 38 ఏళ్ల జైలు శిక్ష, 148 కొరడా దెబ్బల శిక్ష విధించారు.అమెరికాతో వివాదాలుఅమెరికాపై సెప్టెంబర్ 11 (2001) దాడుల తర్వాత, అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇరాన్‌ను విమర్శించారు. ఖమేనీ వాషింగ్టన్‌తో అటు రాజీ పడకుండా, ఇటు నేరుగా యుద్ధానికి దిగకుండా చాలా జాగ్రత్తగా విదేశీ విధానం అమలుచేశారు. అమెరికాతో అత్యంత ఘర్షణ వాతావరణం నెలకొన్న అంశం అణ్వాయుధాలు. ఇరవై ఏళ్ల కిందట ఖమేనీ.. అణ్వాయుధాలు ఇస్లాంకు వ్యతిరేకమని ప్రకటిస్తూ, వాటి అభివృద్ధిని నిషేధిస్తూ ఒక ‘ఫత్వా’ జారీ చేశారు. కానీ, ఆయన పాలనలో ఇరాన్ రహస్యంగా అణు ఆయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలు బలంగా నమ్మాయి.2018లో ట్రంప్ అణు ఒప్పందం నుంచి వైదొలిగి, ఇరాన్‌ను కొత్త ఒప్పందానికి తీసుకువచ్చేందుకు ఆంక్షలు విధించారు. రెండు సంవత్సరాల తర్వాత, సుప్రీం లీడర్‌కు అత్యంత సన్నిహితుడైన టాప్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసీం సులేమానీని ఇరాక్‌లో హతమార్చాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, రష్యా, చైనాలతో మరింత సన్నిహితంగా మెలిగారు. అలాగే, జూన్ 2025లో ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి నిల్వలు, అగ్రశ్రేణి సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినప్పుడు, ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ నగరాలపైకి క్షిపణుల వర్షం కురిపించింది.ఈ యుద్ధంలో అమెరికా కూడా చేరి, ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై దాడులు చేసినప్పుడు, ఖమేనీ లొంగిపోబోనని శపథం చేశారు. అనంతరం, ఇరాన్ తన అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందానికి అంగీకరించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు. కానీ, ఖమేనీ యురేనియం శుద్ధిని ఆపడానికి నిరాకరించారు. దీంతో, ట్రంప్ ఆ ప్రాంతంలో అమెరికా సైనిక బలాన్ని పెంచాలని ఆదేశించారు. అనంతం, దాడుల్లో ఖమేనీ సహా కీలక నేతలు మృతి చెందారు.ట్రంప్ ప్లానేంటి? ఆత్మరక్షణ కోసమే ఇరాన్‌పై దాడులు చేస్తున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి. అయితే ఇరాన్ మిలిటరీ బలాన్ని యూఎస్, ఇజ్రాయెల్‌తో పోలిస్తే అది పోటీనే కాదు. అలాంటప్పుడు ఇది ఆత్మరక్షణ ఎలా అవుతుందనేది ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇరాన్ మొత్తం ప్రపంచానికే ముప్పు అని తన వీడియో సందేశంలో ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు ఖమేనీ మృతితో ట్రంప్ ఏం చేస్తారు. అక్కడి కొత్త ప్రభుత్వం దిశగా ప్లాన్ చేస్తారా? కొత్త నాయకుడిని ఏర్పాటు చేస్తారా?. అయితే, ఇరాన్లో నాయకత్వ మార్పు అకస్మాత్తుగా జరిగే అవకాశం లేదు. ఇరాన్ వ్యవస్థ కూలిపోవడం కష్టమే. మతపెద్దలు, IRGC (Islamic Revolutionary Guard Corps) ముందుగానే contingency plans సిద్ధం చేసుకోవడం వల్ల, నాయకత్వం మారినా వ్యవస్థ కొనసాగుతుంది. ఇరాన్ వ్యవస్థ వ్యక్తి ఆధారంగా కాకుండా, సంస్థాగతంగా నిర్మించబడింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ ఏం చేయనుంది?.ఖమేనీ మృతి పట్ల ఇరాన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్, అరబ్ దేశాలను టార్గెట్ చేసింది. అమెరికాను సైతం హెచ్చరించింది. ప్రతి దాడులు చేస్తామని.. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. అందులో భాగంగానే ఇరాన్.. ఇప్పటికే సౌదీ అరేబియా, దుబాయ్, ఇజ్రాయెల్, బహ్రెయిన్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇరాన్‌తోడు తాజాగా హెచ్‌బొల్లా దళాలు కూడా రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నాయి. దీంతో, ఇరాన్‌కు మద్దతు పెరిగి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది.ఇరాన్ ప్రాక్సీ నెట్వర్క్లుఇరాక్లోని మిలీషాలు, యెమెన్‌లోని హౌతీలు వంటి గ్రూపులు బలహీనపడినప్పటికీ ఇంకా చురుకుగా ఉన్నాయి. వీటి ప్రధాన పాత్ర.. అమెరికా బేస్‌లు, ఇజ్రాయెల్ లక్ష్యాలు, గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత సృష్టించడం. హౌతీలు గతంలో కూడా రెడ్ సీ షిప్పింగ్ మార్గాలను దాడి చేశారు, ఇది ప్రపంచ వాణిజ్యానికి పెద్ద సవాలుగా మారింది. మరోసారి ఇలాంటి దాడులు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లనుంది.2003 ఇరాక్ యుద్ధం (Operation Iraqi Freedom)2003 మార్చి 20న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నేతృత్వంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, పోలాండ్ వంటి దేశాలు ఇరాక్‌పై దాడి చేశాయి. ఇరాక్ వద్ద Weapons of Mass Destruction (WMDs) ఉన్నాయని, అలాగే అల్-ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తోంది అనే ఆరోపణలతో దాడులు చేశాయి. కేవలం మూడు వారాల్లోనే అమెరికా నేతృత్వంలోని బలగాలు బగ్దాద్‌లోకి ప్రవేశించి, సద్దాం హుస్సేన్ 30 ఏళ్ల పాలనను ముగించాయి. ఏప్రిల్ 2003లో బగ్దాద్‌లోని సద్దాం విగ్రహాన్ని కూల్చడం యుద్ధానికి ప్రతీకగా నిలిచింది. దీంతో, సద్దాం హుస్సేన్ పాలన ముగిసింది. యుద్ధం తర్వాత ఇరాక్‌లో సెక్టారియన్ హింస, ఉగ్రవాదం, ISIS ఉద్భవం వంటి సమస్యలు పెరిగాయి. 2003–2011 మధ్య US బలగాలు ఇరాక్‌లో ఉండి, చివరికి వెనక్కి వెళ్లాయి. అయితే, ఇలాంటి పరిస్థితులు ఇరాన్లో ఉండకపోవచ్చు.ఇరాక్ vs ఇరాన్ పోలికఇరాక్ (2003): వ్యక్తి ఆధారిత పాలన (సద్దాం హుస్సేన్). నాయకుడిని తొలగించగానే వ్యవస్థ కూలిపోయింది.ఇరాన్ (ప్రస్తుత వ్యవస్థ): వ్యక్తి ఆధారంగా కాకుండా, మతపెద్దల సంస్థాగత వ్యవస్థ. ఒక నాయకుడు లేకపోయినా, Assembly of Experts, Guardian Council, IRGC వంటి సంస్థలు పాలన కొనసాగిస్తాయి. అందువల్ల, ఇరాన్‌ను ఇరాక్‌లా త్వరగా కూల్చడం కష్టమవుతుంది. -
ఖమేనీ చావు ఇరాన్ కు వరం.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్
-
‘ఇరాన్‌పై యుద్ధం ఆగదు.. మా టార్గెట్ అదే’ దాడులపై ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్‌ను శాసించిన సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఖమేనీ మరణంతో దాడులు ఆగుతాయని అందరూ భావించారు. కానీ ఆ దాడులు ఆగవని, నాలుగు వారాల పాటు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నాలుగు వారాలు కొనసాగుతాయి. ఇరాన్ పెద్ద దేశం. ఈ దాడులు నాలుగు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజుల సమయం పడుతుందని మేం భావిస్తున్నాం’అని ట్రంప్ తన మార్ ఎ లాగో రిసార్ట్ నుండి ఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్తంగా జరిపిన భీకర దాడిలో సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ,వారి కుటుంబ సభ్యులు, ఇతర కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వారి మరణాలను ట్రంప్ ధృవీకరించారు. అమెరికా సైనిక చర్య ప్రణాళిక బద్ధంగా జరుగుతుందన్న ట్రంప్.. ఊహించని దాని కంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇరాన్ నాయకత్వాన్ని అంతమొందించాం. ఆ మొత్తం 48 మంది ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఇరాన్‌పై మా యుద్ధ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇప్పట్లో ఆగవు. పెద్ద దేశం కాబట్టి వారాల సమయం పట్టొచ్చు. ఇరాన్లో మాకు చాలా బలమైన లక్ష్యాలు ఉన్నాయి. తాము నిర్ధేశించిన లక్ష్యాలను నాశనం చేసేందుకు వరకు ఉపేక్షించం. అమెరికా తన మొత్తం ఫోర్స్‌ను రంగంలోకి దింపిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ వైపు దాడులు చేస్తూనే ఇరాన్‌తో దౌత్యానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అందుకు.. త్వరలో మీరు ఇరాన్‌తో చర్చలు జరుపుతారా? అని మీడియా ప్రశ్నించగా.. వాళ్లు మాతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆ పనేది గత వారం చేయాల్సి ఉంది. ఈ వారం కాదని పునరుద్ఘాటించారు. ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వారి మరణంపై డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా స్పందించారు. వాళ్ళు గొప్ప వ్యక్తులు. దురదృష్టవశాత్తూ ఇలా జరుగుతుందని మేం ముందే ఊహించాం. మరి కొంతమంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బంకర్ బస్టర్ బాంబులతోఇరాన్లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతీ వారం ప్రారంభం రోజున(శనివారం) తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ఈ సారి ఖమేనీ తన అధికారిక నివాసంలో కాకుండా ఓ స్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంపై నిఘా పెట్టిన అమెరికా, ఇజ్రాయెల్ 30కి పైగా శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించాయి. ఖమేనీ ప్రాణాలు తీశాయి. -
అమెరికా కాన్సులేట్‌కు భద్రత పెంపు
హైదరాబాద్: పశ్చిమాసియా పరిణామాలు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో నగరంలో నిరసన ర్యాలీలు చేపడుతుండడంతో అమెరికా కాన్సులేట్‌కు భద్రత పెంచారు. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఈ కార్యాలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నతాధికారులు గచి్చ»ౌలి పోలీసులను ఆదేశించారు. దీంతో ఆదివారం 70 మంది పోలీసులను అమెరికన్ కాన్సులేట్ వద్ద మోహరించారు. అటువైపు వెళ్లే రోడ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. కాగా, ఐటీ కారిడార్‌లోని స్టార్ హోటళ్లపైనా పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. వాటిలో బస చేసిన అమెరికన్లు , ఇతర దేశాలకు చెందిన పౌరుల వివరాలను సేకరిస్తున్నారు. అమెరికన్లు నివాసం ఉండేచోట ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. -
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
-
ఓ శకం ముగిసింది
సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్లో ఓ శకం ముగిసింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌ను మతరాజ్యంగా రూపాంతరం చేసేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించి విజయం సాధించారు. ఇరాన్ పరిపాలన, సాయుధ వ్యవస్థలకు మూడున్నర దశాబ్దాలకుపైగా ఖమేనీ మాటే శాసనం. పశ్చిమాసియాలో మత కేంద్రంగా ఇరాన్‌ను సమున్నత స్థాయికి చేర్చాలనే పట్టుదలతో సంస్కరణవాదులను అణచివేస్తూ దేశాన్ని ఏకఛత్రంగా ఏలుతూ అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఆయన కొరకరాని కొయ్యలా మారారు. దశాబ్దాలుగా ఇరాన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని అహరి్నశలు శ్రమిస్తున్న అమెరికాను ఎన్నోసార్లు దీటుగా ఎదుర్కొన్నారు. ఇస్లామిక్ విప్లవంలో చురుకైన విప్లవకారుడి నుంచి తిరుగులేని పాలకుని దాకా సాగిన ప్రస్థానం ఖమేనీది... పహ్లావీ శకం ముగిశాక... ఖమేనీ నగరం నుంచి వచ్చి మష్హాద్ సిటీలో స్థిరపడిన అజర్బైజాన్ టర్క్ వర్గానికి చెందిన దంపతులకు 1939 ఏప్రిల్ 19వ తేదీన ఖమేనీ జని్మంచారు. ఎనిమిది మంది సంతానంలో రెండోవాడు. నాలుగో షియా ఇమామ్ అలీ అల్ సజ్జాద్కు ఖమేనీలు వారసులు. పాఠశాల విద్యకాలంలోనే ఆయన ఖురాన్‌ను లోతుగా చదివారు. యుక్తవయసులోనే పర్షియన్లో కవితలు రాసేవారు. కచి్చతమైన సమయానికి ప్రార్థనలు చేయాల్సిందేననే పట్టుదలతో ఓసారి వెళ్తున్న రైలు నుంచి దూకేసి మరీ మసీదుకు పరుగెత్తారట! మొహమ్మద్ రెజా పహ్లావీ రాజరిక పాలనలో విప్లవకారునిగా మారారు. ఆరుసార్లు అరెస్టయ్యారు. మూడేళ్లు దేశ బహిష్కరణను ఎదుర్కొన్నారు. నాటి ఇరాన్ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్ సంజామీకి కుడిభుజంగా మారారు. 1980లో టెహ్రాన్ శుక్రవారంప్రార్థనల ఇమామ్‌గా ఎంపికయ్యారు. 1981లో ఖమేనీని టేక్ రికార్డర్ బాంబుతో చంపేందుకు ముజాహిదీన్–ఇ–ఖల్ప్ వర్గం విఫలయత్నం చేసింది. ఆ పేలుడులో కుడి భుజం దెబ్బ తిని కుడిచేయి చచ్చుబడిపోయింది. స్వరపేటిక తీవ్రంగా దెబ్బతిన్నాయి. 1981లో ఎన్నికల్లోఘనవిజయంతో ఖమేనీ తొలిసారి ఇరాన్ అధ్యక్షుడయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఉక్కుపాదంతో అణచివేసి కీలక నేతగా ఎదిగారు. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన అయతొల్లా రుహొల్లాæ ఖొమేనీకి కుడిభుజంగా మారారు. ఆయన 1989లో చనిపోయాక ఖమేనీ ‘గ్రాండ్ అయతొల్లా’ హోదా పొందారు. 1989 జూన్ 4న ఇరాన్ సుప్రీం లీడర్‌గా అవతరించారు. ఇరాక్‌తో యుద్ధం తర్వాత ప్రభుత్వంపై పట్టుసాధించారు. 36 ఏళ్లుగా ఇరాన్లో ఆయనే మాటే శాసనంగా సాగుతోంది. ఇరాన్ సాయుధ బలగాలకు కూడా ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. గార్డియన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, అది సూచించేవారే పార్లమెంట్ అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనలు తెచ్చారు. షిమా మతబోధకులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టారు. చీఫ్ జస్టిస్ సహా దేశంలోన్ని అన్ని వ్యవస్థలపైనా పట్టు నిలుపుకున్నారు. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే రెవల్యూషనరీ గార్డ్ విభాగం సైతం ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. రెవల్యూషనరీ గార్డ్ విభాగానికి సొంతంగా వ్యాపారం చేసుకునే అధికారం సైతం కట్టబెట్టారు. అలా అది అత్యంత శక్తివంతమైన సాయుధ వ్యవçస్థగా ఎదిగింది. పరోక్ష దళాల సృష్టికర్త పశ్చిమాసియాలో ఇస్లాం మత ప్రభావాన్ని పెంచేందుకు పొరుగు దేశాల్లో పరోక్ష దళాలను ఖమేనీ ఏర్పాటు చేశారు. లెబనాన్‌లో హెజ్»ొల్లా ఉగ్రసంస్థ ఆవిర్భావానికి కృషి చేశారు. 2000లో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుతిరిగేలా చేశారు. 2006లో జరిగిన యుద్ధంలోనూ పాక్షిక విజయం సాధించారు. యెమెన్‌లో హూతీ రెబల్స్‌కు సాయపడ్డారు. పాలస్తీనాలో హమాస్‌కు ఖమేనీ అండదండలు దండిగా ఉండేవి.తిరుగుబాట్లతో తలనొప్పులు దమనకాండకు వ్యతిరేకంగా 2022లో ఇరాన్లో తలెత్తిన దేశవ్యాప్తంగా ఉద్యమం ఖమేనీ పాలనకు పెను సవాల్ విసిరింది. దాన్ని ఉక్కుపాదంతో అణచి మానహక్కులను కాలరాశారన్న అపవాదును ఖమేనీ మూటగట్టుకున్నారు. తాజాగా 2025 డిసెంబర్లో ఖమేనీని వ్యతిరేకంగా ఇరాన్లో వెల్లువెత్తిన ఆందోళనలు కూడా ప్రపంచమంతటా చర్చనీయంగా మారాయి. అణ్వ్రస్తాలను సామూహిక మానవహననాలుగా ఛీత్కరించే ఖమేనీ, లోలోపల మాత్రం అణుబాంబుపై మక్కువ పెంచుకున్నారని అమెరికా దశాబ్దాలుగా ఆరోపిస్తోంది. రహస్య ప్రాజెక్టుతో యురేనియం నిల్వలను పెంచుకుంటున్నారనే ఆగ్రహంతో ఖమేనీపై అమెరికా, ఇజ్రాయెల్‌లు కత్తులు నూరాయి. చివరికి అదే ఖమేనీ అంతానికి దారితీసింది. ఖమేనీకి అన్ని రకాలా సాయపడే సైనిక జనరల్స్, ముఖ్య నేతలను అంతమొందిస్తూ అమెరికా చివరకు ఆయనను ఏకాకిని చేసింది. గత జూన్‌లో ఇజ్రాయెల్ ‘12 రోజుల యుద్ధం’ సందర్భంగా ఇరాన్ అణు స్థావరాలను అమెరికా బాంబు దాడులతో తుత్తునియలు చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల నడుమ పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నా ఇప్పటిదాకా పెద్దగా ఫలితం ఆలోపే ఇజ్రాయెల్, అమెరికా మెరుపు దాడులతో శనివారం ఖేమేనీతో పాటు పలువురు సైనిక, పౌర అగ్ర నేతలను అంతం చేశాయి.ఖమేనీ మూలాలు భారత్‌లో! ఖమేనీ మూలాలు భారత్‌లోనే ఉన్నట్టు ఇరాన్ చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. షియా వర్గానికి చెందిన ఖమేనీ వంశస్తుడు సయ్యద్ అహ్మద్ మూసావీ 18వ శతాబ్ధాంలో ఇరాన్ నుంచి భారత్ వలస వచ్చారు. యూపీలో షియా జనాభా అత్యధికంగా ఉండే బారాబంకీ జిల్లాలోని కింటూర్ అనే గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడ షియా మత బోధకుడిగా పేరుపొందాడు. తన పేరు చివర హిందీ అని కూడా తగిలించుకున్నారు. నేటికి ఇరాన్ చరిత్రకారుల గ్రంథాలు ఆయన పేరును సయ్యద్ అహ్మద్ మూసావీ హిందీ అనే పేర్కొంటారు. 1830లో ఆయన ఇరాన్‌లోని నజబ్ నగరానికి వెళ్లిపోయారు. తరవాత ఖమేనీ పట్టణంలో స్థిరపడ్డారు. ఖమేనీ తాతముత్తాతల బంధువుల ప్రభావంతోనే దక్షిణ భారతంలో, ముఖ్యంగా హైదరాబాద్, దక్కన్లో ఇరాన్ సంస్కృతి, సంప్రదాయాలు వర్ధిల్లినట్టు చెబుతారు. నాటి హైదరాబాద్ సంస్థానం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇరానీ కుటుంబాలు నేటికీ వందలాదిగా ఉన్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖమేనీ అంతానికి... ఎందుకంత పంతం?
ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీతో అమెరికా వైరం దశాబ్దాల నాటిది. దీని మూలాలు ఇరాన్లో అపార చమురు నిక్షేపాల్లో దాగున్నాయి. 1950వ దశకంలో ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసాదేగ్ను బ్రిటన్, అమెరికాలు ‘ఆపరేషన్ బూట్’ పేరుతో జరిగిన సైనిక తిరుగుబాటుతో గద్దె దించాయి. అంతకుముందు వరకు దశాబ్దాలు పరిపాలించిన రాజు మొహమ్మద్ రెజా పహ్లావీని మళ్లీ గద్దెనెక్కించాయి. కానీ అనూహ్యంగా కొంతకాలానికే రుహొల్లా ముసావీ ఖొమేనీ సారథ్యంలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తలెత్తింది. అనంతరం ఆయన మరణంతో అధికార పగ్గాలు ఖమేనీ చేతికొచ్చాయి. నాటినుంచీ అమెరికాకు ఆయన కొరకరాని కొయ్యగా తయారయ్యారు.పశ్చిమాసియాపై పెత్తనం చేయడానికి అమెరికా చేసే ప్రతి ప్రయత్నాన్నీ ఖమేనీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పశ్చిమాసియాను అమెరికాకు వ్యతిరేక శక్తిగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. అమెరికా కుయుక్తులను తన రాజకీయ చాణిక్యంతో తుత్తునియలు చేశారు. ఇరాన్‌కు తోడుగా పాలస్తీనా భూభాగంలో హమాస్‌ను, యెమెన్‌లో హూతీలను, లెబనాన్‌లో హెజ్»ొల్లా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ తన ఆధిపత్యాన్ని బలపర్చుకున్నారు. దాంతో ఖమేనీ ఆధిపత్యానికి గండికొట్టేందుకు అమెరికా శతథా ప్రయతి్నంచింది. ఇరాన్లో నిఘాను పెంచి సైబర్ దాడులు చేయించి, సున్నీలను రెచ్చగొట్టి తిరుగుబాటు లేవదీసి... ఇలా పలు రకాలుగా ప్రయతి్నంచి విఫలమైంది. ఖమేనీ పాలనకు చరమగీతం పాడేందుకు అమెరికా ఎన్నోసార్లు కోవర్ట్ ఆపరేషన్లు కూడా చేసింది. వాటికి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రతిసారీ తనకేం సంబంధం లేదని బుకాయించింది. ఇస్లామిక్ విప్లవం వేళ 1979లో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై విప్లవకారులు దాడిచేసి పలువురు దౌత్యవేత్తలు, సిబ్బందిని బంధించారు. వాళ్లను విడిపించేందుకు అమెరికా విశ్వప్రయత్నంచేసింది. ఆ విప్లవం తర్వాత ఇరాన్లో ఏర్పడిన మత రాజ్యాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా స్థానిక తిరుగుబాటుదారులకు సాయపడింది. ముజాహిదీన్–ఇ–ఖల్ఫ్ (ఎంఈకే)కు ఆర్థికసాయం చేసింది. సున్నీ ఉగ్రవాద సంస్థ జూన్దుల్హాకు అండదండలు అందించింది. ఇరాన్ ప్రభుత్వ నేతలు, కార్యాలయాలపై దాడులకు ఉసిగొల్పింది. మతపాలకుల పరువు పోగొట్టేందుకు పుకార్లను షికార్లు చేయించేది. అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయించేది. ఇరాన్లో సైబర్, నిఘా ఆపరేషన్లనూ విస్తృతపరిచింది. అణు పరిశోధనలు కొనసాగకుండా తరచూ ఆటంకపరిచేది. ఈ విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సైతం తనవంతు సాయం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిప్పుల వర్షం.. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడిన ఇరాన్
టెహ్రాన్/దుబాయ్/జెరూసలేం: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకుతోడు తమ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్య పట్ల ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం కురిపిస్తోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని పలు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్‌తో పాటు పలు ప్రాంతాలపై దాడులకు దిగింది. డ్రోన్ దాడిలో హోటల్లో స్వల్పంగా మంటలు చెలరేగాయని, వెంటనే ఆర్పేశామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. జెబెల్ అలీ ఓడరేవులోని ఓ బెర్త్‌లో మంటలు వ్యాపించినట్లు తెలిపింది. ఇరాన్ దాడుల్లో మొత్తం నలుగురు గాయపడినట్లు వెల్లడించింది. వారికి తక్షణమే వైద్య చికిత్స అందించామని పేర్కొంది. యూఏఈలో శనివారం రాత్రంతా సైరన్ల మోత వినిపించింది. పవిత్ర రంజాన్ మాసం కావడంతో జనం రాత్రి మేల్కొనే ఉన్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. అయితే, ఈ దాడిని అబుదాబీ ప్రభుత్వం ఇంకా ధ్రువీకరించలేదు. దోహాలో డజనుకు పైగా పేలుళ్లు సంభవించాయి. అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే నౌకపైనా ఇరాన్ దాడి చేసింది. శనివారం బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో మృతుల సంఖ 185కు పెరిగినట్టు ఇరాన్ తెలిపింది.ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ధ్వంసం మరోవైపు యూఏఈ సైన్యం ఎదురు దాడికి దిగుతోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను నేలమట్టం చేస్తోంది. 165 బాలిస్టిక్ క్షిపణులు, 541 డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ ప్రకటించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తున్నట్లు వెల్లడించింది. దుబాయ్ పేలుళ్లతో దద్దరిల్లింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, నౌకాశ్రయం కూడా బాంబు దాడుల్లో దెబ్బ తిన్నాయి. అబుదాబీలో పాఠశాలలను మంగళవారం దాకా మూసివేస్తూ ఆదేశాలిచ్చారు. ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా అంతటా విమానాల రాకపోకలకు తీవర అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దాంతో ఎయిర్‌పోర్టుల్లో జనం పడిగాపులు కాస్తున్నారు. ఇరాన్ దాడుల్లో ఇప్పటిదాకా ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని, 58 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. కువైట్‌పై ఇరాన్ ఇప్పటివరకు 97 బాలిస్టిక్ క్షిపణులు, 283 డ్రోన్లు ప్రయోగించింది. ముగ్గురు కువైట్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్‌కు చెందిన 49 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా నిరీ్వర్యం చేసినట్లు బహ్రెయిన్, ఖతార్ సైతం తెలియజేశాయి. ప్రార్థనా మందిరంపై ఇరాన్ దాడి ఇజ్రాయెల్‌పై ఇరాన్ వైమానిక దాడులు ఆదివారం సైతం కొనసాగాయి. ముఖ్యంగా సెంట్రల్ ఇజ్రాయెల్, అక్కడి రక్షణ రంగ సంస్థలు తదితరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. డజన్ల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లో బెయిత్ షెమేశ్లోని ఓ ప్రార్థనా మందిరంపై ఇరాన్ సైన్యం క్షిపణిని ప్రయోగించడంతో కనీసం ఎనిమిది మరణించారు. నాలుగేళ్ల బాలుడు సహా 28 మందికి పైగా గాయపడ్డారు. జెరూసలేంకు 35 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. దీంతో ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో మరణాల సంఖ్య 10కి చేరుకుంది. క్షతగాత్రుల సంఖ్య 120కి చేరింది. అలాగే ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో పదుల సంఖ్యలో నివాస గృహాలు దెబ్బతిన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు ఆగడం లేదు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్ తదితర దేశాల్లోని 27 సైనిక స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్ పేర్కొంది. ఇరాన్ దాడుల్లో అమెరికా సైన్యానికి ప్రాణనష్టం వాటిల్లుతోంది. ముగ్గురు జవాన్లు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అమెరికా మిలటరీ ప్రకటించింది. మరోవైపు కల్లోలిత పశ్చిమాసియాలోని తమ పౌరులను స్వదేశానికి తరలించడానికి ఇతర దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతీకారం తప్పదు: ఇరాన్ ఖమేనీని పొట్టనపెట్టుకున్న శత్రువులను ప్రాణాలతో విడిచిపెట్టబోమని ఇరాన్ తేలి్చచెప్పింది. శత్రువులు రెడ్ లైన్ దాటేశారని, అందుకు వారు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ పార్లమెంటరీ అధికార ప్రతినిధి మొహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ ఆదివారం స్పష్టంచేశారు. ఈసారి కోలుకోలేని విధంగా గట్టిగా దెబ్బకొడతామని, ఖమేనీ మృతికి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్లను హెచ్చరించారు. 9 యుద్ధ నౌకల్నిముంచేశాం:ట్రంప్ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ చేసిన హెచ్చరికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. తమపై ఎదురుదాడి ఆలోచన వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ప్రతిదాడులకు దిగితే గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో బుద్ధి చెప్తామన్నారు. అమెరికా వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఆదివారం 9 ఇరాన్ యుద్ధ నౌకల్ని ముంచేసినట్టు అ«ధ్యక్షుడు వెల్లడించారు. నేవీ ప్రధాన కార్యాలయాన్నీ తీవ్రంగా దెబ్బ తీశామని చెప్పారు.టెహ్రాన్‌లో పేలుళ్ల మోత అమెరికా–ఇజ్రాయెల్ సైన్యాలు ఇరాన్‌పై దాడులు ఉధృతం చేశాయి. ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. రాజధాని టెహ్రాన్‌లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. నగరంలో ఎక్కడ చూసినా బాంబుల మోతలే విని్పంచాయి. పేలుళ్ల నుంచి పెద్ద ఎత్తున వెలువడుతున్న పొగలు సుదూరాల దాకా వ్యాపిస్తున్నాయి. ఇరాన్ గుండెకాయపై దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌పై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ తేలి్చచెప్పారు. ఇరాన్‌లోని పలు ఇతర నగరాలపై కూడా దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది మరణించినట్టు ఇరాన్ పేర్కొంది. పలు నగరాల్లో భవన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. -
పక్కా సమాచారంతోనే దాడి
శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడం సంచలనాత్మకంగా మారింది. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్‌తో ముగిసింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. దాంతో ఆయన తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ హిట్‌లిస్ట్‌లో ఉన్న ఖమేనీపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత వేట మరింత ముమ్మరంగా సాగింది. టెహ్రాన్ నడి»ొడ్డున ఖమేనీ నివాసంలో శనివారం తెల్లవారుజామున కీలక సమావేశం జరుగబోతున్నట్లు సీఐఏకు సమాచారం అందింది. ఖమేనీతోపాటు సీనియర్ నేతలు, సైనికాధికారులు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. సీఐఏ వెంటనే ఇజ్రాయెల్‌ను అప్రమత్తం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు మంతనాలు జరిపాయి. తెల్లవారకముందే చిమ్మచీకట్లోనే దాడికి దిగాలని తొలుత భావించారు. ఉదయం అయితే ఆపరేషన్ కచ్చితంగా విజయవంతం అవుతుందన్న ఉద్దేశంతో తెల్లవారిన తర్వాత దాడులకు టైమ్ ఫిక్స్ చేశారు.సమాచారం ఇచ్చిందెవరు? ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇందులో ఖమేనీ వ్యతిరేకులు కూడా ఉన్నారు. అతడి కదలికల గురించి వారే అమెరికా సీఐఏకు సమాచారం చేరవేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీపై దాడికి ఎంచుకున్న సమయానికి కూడా యూదు మతంలో కొంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల 2న యూదులకు పూరిమ్ సెలవుదినం. ఇదొక పండుగ రోజు. ప్రాచీన కాలంలో యూదులను అంతం చేయడానికి అప్పటి పర్షియా(నేటి ఇరాన్) పాలకులు సాగించిన కుట్ర ఇదే రోజున విఫలమైంది. సరిగ్గా ఈ పండుగకు ముందు ఖమేనీని అంతం చేయడం గమనార్హం.కీలక నేతలు, అధికారులు హతంఖమేనీ నివాసం చుట్టూ నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నిజానికి ఇదొక భారీ కాంపౌండ్. ఇందులో ఖమేనీ కార్యాలయాలు, ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాలు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీసులు ఉన్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు ఇదొక గుండెకాయ అని చెప్పుకోవచ్చు. ఖమేనీతో జరిగిన భేటీకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కమాండర్ ఇన్ చీఫ్ మొహమ్మద్ పాక్‌పౌర్, రక్షణ శాఖ మంత్రి అజీజ్ నజీర్జాదే, మిలటరీ కౌన్సిల్ అధినేత అడ్మిరల్ అలీ షామ్‌ఖనీ, ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ సయ్యద్ మాజిద్ మౌసావీ, డిప్యూటీ ఇంటెలిజెన్స్ మంత్రి మొహమ్మద్ షిరాజీతోపాటు మరికొందరు ముఖ్యులు హాజరయ్యారు. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో వీరంతా హతమయ్యారు.క్షణాల్లోనే శిథిలాలుగా.. ఉన్నతస్థాయి వర్గాల నుంచి ఆదేశాలు అందిన వెంటనే స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు తమ స్థావరాల నుంచి గాల్లోకి లేచాయి. రెండు గంటల ఐదు నిమిషాల్లో.. ఇరాన్ కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు టెహ్రాన్‌కు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ఖమేనీ కాంపౌండ్‌ను శిథిలాలుగా మార్చేశాయి. ఖమేనీతోపాటు అక్కడే ఉన్న సైనికాధికారులు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సైనికాధికారుల ఒక భవనంలో, ఆ పక్కనే మరో భవనంలో ఖమేనీ ఉన్నారు.ఇజ్రాయెల్ దాడుల్లో ఈ రెండూ నామరూపాల్లేకుండాపోయాయి. లక్ష్యం ఎక్కడా గురితప్పలేదు. అంతా అనుకున్నట్లుగానే పూర్తయ్యింది. ఖమేనీపై దాడికి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతోపాటు అమెరికా క్షిపణులు, డ్రోన్లు కూడా ఉపయోగించినట్లు సమాచారం. అమెరికా యుద్ధనౌకల నుంచి తోమహక్ క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించారు. ఖమేనీ కదలికలను తమ నిఘా వర్గాలు సక్సెస్‌ఫుల్‌గా ట్రాక్ చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. -
ఖమేనీ మృతి.. ఒకవైపు విషాదం.. మరోవైపు ఆనందం
వాషింగ్టన్/దుబాయ్: దశాబ్దాలపాటు ఇరాన్‌ను శాసించి, పశ్చిమదేశాలకు కంట్లో నలుసులా మారిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(86) కథ ముగిసింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడిలో ఆయన మరణించారు. ఖమేనీతోపాటు ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం ముసావీ, రక్షణ మంత్రి అమీర్ నజీర్జాదే తదితరులు కూడా మృతి చెందారు. రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై శనివారం ఉదయం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో ఖమేనీ మృతిచెందినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఖమేనీ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటన చేశారు. చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తి విగతజీవిగా మారిపోయాడని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దేశాన్ని తిరిగి అదీనంలోకి తీసుకొనే ఏకైక అతిపెద్ద అవకాశం ఇరాన్ ప్రజలకు లభించిందని సూచించారు. ఇరాన్‌పై భారీ, పిన్‌పాయింట్ దాడులు మరో వారంపాటు.. అవసరమైతే ఆ తర్వాత కూడా యథాతథంగా కొనసాగుతాయని తేల్చిచెప్పారు. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేదాకా దాడులు తప్పవని ఉద్ఘాటించారు. తమ అత్యున్నత నిఘా వ్యవస్థ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయాడని ట్రంప్ వెల్లడించారు. ఖమేనీ మృతిపై ఇజ్రాయెల్ కూడా స్పందించింది. ఇరాన్ సుప్రీం లీడర్‌తోపాటు రక్షణ శాఖ మంత్రి అమీర్ నజీర్జాదే, ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి, ఖమేనీ సలహాదారు, 30 మందికి పైగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డు టాప్ కమాండర్లు కూడా అంతమయ్యారని తేల్చిచెప్పింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఖమేనీ సారథ్యంలోని సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా దాడులు చోటుచేసుకున్నాయి. 40 రోజులపాటు సంతాప దినాలు వైమానిక దాడిలో ఖమేనీ నివాసం చాలావరకు ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ ఘటనలో ఆయన కుటుంబ సభ్యులు సైతం మరణించినట్లు తెలిసింది. వీరిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు ఉన్నట్లు తెలిసింది. శత్రుదేశాల దాడిలో తమ అత్యున్నత నాయకుడు ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఇరాన్ కేబినెట్ రగిలిపోయింది. ప్రతీకారం తప్పదని తేల్చిచెప్పింది. శత్రువులు అతిపెద్ద తప్పు చేశారని, కచ్చితంగా సమాధానం చెబుతామని స్పష్టంచేసింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఖమేనీతోపాటు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కారŠప్స్ ఉన్నతస్థాయి కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ పాక్‌పౌర్, ఖమేనీ అత్యున్నత భద్రతా సలహాదారు అలీ షామ్‌ఖనీ కూడా మృతిచెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఖమేనీ కన్నుమూయడంతో దేశంలో 40 రోజలపాటు సంతాప దినాలు పాటించాలని ఇరాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్మారకార్థం వారం రోజులపాటు దేశవ్యాప్తంగా సెలువులు ప్రకటించింది. దాంతో సంతాప సూచకంగా జనం నల్ల జెండాలు ప్రదర్శించారు. షియా ముస్లింలకు పవిత్ర క్షేత్రమైన మషాద్ సిటీలోని ఇమామ్ రెజా మసీదుపై నల్ల జెండా ఎగురవేశారు. ఒకవైపు విషాదం.. మరోవైపు ఆనందం తమ అధినేత ఖమేనీ ఇక లేరన్న నిజాన్ని ఆయన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. శోకసంద్రంలో మునిగిపోయారు. ఇజ్రాయెల్, అమెరికా దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాపనార్థాలు పెట్టారు. ఖమేనీ చిత్రపటాలు చేతబూని నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు ఖమేనీ మరణించడం పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ ఆయన వ్యతిరేకులు వీధుల్లోకి వచ్చారు. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. నియంత పాలన అంతమైందంటూ నినదించారు. బూరలు ఊదుతూ పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోరుకుంటున్నామని వారు స్పష్టంచేశారు. -
ఖమేనీ నివాసంపై 30 బాంబులు 1500KM నుండి వేసేసిన ఇజ్రాయెల్..
-
ఇండియాలో ఖమేనీ మూలాలు!
ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, సంతాప సూచనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఖమేనీ కుటుంబ మూలాలు ఉన్న పలు గ్రామాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఖమేనీ పూర్వీకుల మూలాలు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా, కింతూర్ గ్రామానికి చెందినవారని రికార్డులు చెబుతున్నాయి. ఆయన తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ 1800 ప్రాంతంలో యూపీలో జన్మించారు. 1830లో ఇరాక్‌లోని నజాఫ్‌కు మతపరమైన ప్రయాణంలో వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇరాన్ అధికారిక రికార్డుల్లో ‘హిందీ’ అనే పదాన్ని తన పేరులో ఖమేనీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. భారత్‌తో ఖమేనీ అనుబంధం 1986లో ఖమేనీ భారత్ పర్యటనలో అలిపురాను సందర్శించారు. ఈ క్రమంలో ఖమేనీ గౌరవార్థం ఆయన పేరిట ఓ ఆస్పత్రిని నిర్మించారు. అలిపురాలోని అనేక కుటుంబాలు ఇప్పటికీ ఇరాన్‌తో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తున్నాయి. కొంతమంది గ్రామస్థులు విద్య, ఉపాధి కోసం ఇరాన్లో స్థిరపడ్డారు. అలిపురాలో విషాద వాతావరణం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా అలిపురా గ్రామంలో ఖమేనీ మరణంతో సంతాప దినాలు ప్రకటించారు. గ్రామంలోని షియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మూడు రోజులపాటు దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. అలిపురా జనాభా దాదాపు 30,000 కాగా, వీరిలో ఎక్కువ మంది షియా ముస్లింలే. ఖమేనీ మరణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, భారత్‌తో ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధం ఇప్పుడు మరింతగా వెలుగులోకి వచ్చింది. -
ఆయతుల్లా ఖమేనీ.. ఆస్తులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే?
ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఒక దేశ సుప్రీం లీడర్‌ను ఆయన దేశంలోనే అంత మెుందించడంతో మహాసంగ్రామానికి తెరలేసింది. ఒవైపేమో ఇజ్రాయెల్, అమెరికా దాడులు వాటికి ప్రతిగా ఇరాన్ సైతం విరుచుకపడుతుండడంతో మూడో ప్రపంచయుద్ధం ఆరంభం కానుందా అనే టెన్షన్ ప్రపంచ దేశాల్లో నెలకొంది. ఇదిలా ఉండగా సుప్రీం లీడర్ మృతితో ఆయనకు చెందిన లక్షల కోట్ల ఆస్తుల పరిస్థితి ఏంటా అనే చర్చ మెుదలైంది.ప్రస్తుతం ఇరాన్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యతో ఆ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఆయన మృతి కేవలం ఇరాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్ షియా ముస్లిం వర్గానికి తీరని లోటుగా భావిస్తున్నారు. 1939లో మషద్‌లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో ఖమేనీ జన్మించారు. అనంతరం 1979లో జరిగిన నాటి ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించి అప్పటి షా మహమ్మద్ రెజా పహ్లావీని కూల దోయడంలో కీలకంగా వ్యవహారించారు. అనంతరం ఆదేశ అధ్యక్షుడిగా, సుప్రీం లీడర్ గా ఎదిగారు.అయితే అనంతర కాలంలో ఇరాన్లో తిరుగులేని శక్తిగా ఆయతుల్లా ఖమేనీ వ్యవహారించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్ని శాసించడంతో పాటు మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రక్షణ రంగాలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో ఆయతుల్లా ఖమేనీ పెద్దమెుత్తంలో ఆస్తులు సైతం సంపాదించినట్లు సమాచారం. ఖమేనీ ఆస్తుల విలువ 2013లో వచ్చిన ఓ పత్రికా కథనం ప్రకారం 93 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 9 లక్షల కోట్లు అది ప్రస్తుత లెక్కల ప్రకారం మరింతగా పెరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వీటి పరిస్థితి ఎంటా అని తెలియాల్సి ఉంది. అయితే ఆయన కుమారుడికి సైతం పెద్ద మెుత్తంలో ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అయితే ఖమేనీ మృతితో ఆయన స్థానంలో తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ ఎన్నుకుంది. ఇదివరకూ ఇరాన్ సెమిసరీ సిస్టమ్ అధిపతిగా పనిచేసిన అలిరెజా అరాఫీని సుప్రీంగా ఎన్నుకున్నారు. కాగా ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ పై విరుచుకపడుతుంది. తన సమీప దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడుతుంది. టెహ్రాన్‌పైనా ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్త దాడులు జరుపుతున్నాయి. -
ఖమేనీ మరణంపై మోర్టీషియా అడామ్స్ కీలక వ్యాఖ్యలు
ఒట్టావా: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణంతో ఆస్ట్రేలియా,కెనడా,లండన్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఇరాన్ శరాణార్ధులు సంబరాలు చేసుకున్నారు. రోడ్లమీదకు వచ్చి కాకర్లు కాల్చతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలు సైతం డిక్టేటర్ మృతి అంటూ నినాదాలు చేశారు. కొన్ని చోట్ల ఖమేనీ విగ్రహాల్ని కూల్చేశారు.ఈ క్రమంలో ఓ యువతి వార్తల్లో నిలిచింది. ఆ యువతే గతంలో ఖమేనీ చిత్రాన్ని కాల్చి ఆ మంటతో సిగరెట్ వెలిగించిన వీడియోతో వైరల్‌గా మారారు. తాజాగా, ఖమేనీ మరణంపై ఆమె స్పందించారు.‘నా పేరు మోర్టీషియా అడామ్స్. కెనడాలో నివసిస్తున్న ఇరానియన్ శరణార్థి. కెనడాలో జరిగిన ఇరాన్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖమేనీ టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని తాజాగా ఆమె ప్రస్తావించారు. మరోవైపు, ఖమేనీ మృతిపై ఇరాన్ వ్యతిరేక వర్గాల్లో చర్చనీయాంశమవుతుండగా ఖమేనీ అనుచరులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకవైపు టెహ్రాన్‌లో సంతాప సభలు జరుగుతుండగా..మరోవైపు విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్ శరణార్థులు ఆయన మరణాన్ని సంబరంగా జరుపుకోవడం హాట్టాపిగ్గా మారింది. ఈ పరిణామం ఇరాన్ భవిష్యత్తు రాజకీయ దిశపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఖమేనీ హత్యపై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్
-
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ
టెహ్రాన్: ఇరాన్లో తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు. మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అత్యంత సన్నిహిత వర్గంలో ఆయన ఒకరుగా గుర్తింపు పొందారు. ఈ నియామకం తర్వాత అరాఫీ ముగ్గురు సభ్యుల లీడర్షిప్ కౌన్సిల్లో చేరారు.అరాఫీ ప్రస్తుతం ఇరాన్ మదర్సా వ్యవస్థకు అధిపతిగా, అలాగే గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. మతపరమైన విద్యా వ్యవస్థలో ఆయనకు ఉన్న అనుభవం, శియా సమాజంలో ఆయనకు ఉన్న ప్రభావం కారణంగా ఈ పదవికి ఎంపికయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ పరిణామం ఇరాన్ రాజకీయ, మతపరమైన వర్గాల్లో కీలకంగా పరిగణించబడుతోంది. కొత్త నాయకత్వం దేశంలో శాంతి, స్థిరత్వం తీసుకురావడంలో ఎంతవరకు ప్రభావం చూపుతుందో అన్నది అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీఅమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు మరణించారని ఇరాన్ మీడియా ఆదివారం (మార్చి 1,2026)నివేదించింది.అయతుల్లా అలీ ఖమేనీ మరణం ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. 2026 ఫిబ్రవరి 28న ఆయనను లక్ష్యంగా చేసుకుని అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించారు. ఈ దాడులు టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇరాన్ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకున్నాయి. 86 ఏళ్ల వయసులో ఖమేనీ మరణం ఇరాన్లో నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన నాయకత్వానికి ముగింపు పలికింది. -
ఖమేనీ మృతితో కరాచీలో హై టెన్షన్.. US కాన్సులేట్ పై దాడి
-
ఖమేనీ మృతితో జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తత
శ్రీనగర్: ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతితో జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడటంతో ఆదివారం కశ్మీర్ లోయతో పాటు జమ్మూలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. షియా సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి, తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.అయతొల్లా అలీ ఖమేనీ మృతి దరిమిలా శ్రీనగర్ సహా కశ్మీర్‌లోని మెజారిటీ ప్రాంతాలు, జమ్ము శివారులోని భటిండి, రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శాంతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ముఖ్యమంత్రి.. ఇరాన్లో ఉన్న జమ్ముకశ్మీర్ విద్యార్థులు, ఇతరుల భద్రత విషయంలో తమ ప్రభుత్వం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని భరోసా అన్నారు.శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై బలప్రయోగం చేయవద్దని, పోలీసులు, పరిపాలనా యంత్రాంగం నిగ్రహంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ‘ఎక్స్’ వేదికగా కోరారు. మరోవైపు ఈ ఆకస్మిక నిరసనల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉంచాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిశితంగా గమనించాలని జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కూడా చదవండి: పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు -
ఖమేనీ మృతికి సంతాపం.. నల్లజెండా ఎగరవేసిన ఇరాన్
-
పాకిస్తాన్లో హై అలర్ట్.. యూఎస్ కాన్సులేట్‌కు నిప్పు..
ఇస్లామాబాద్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్ పాకిస్తాన్‌ను తాకింది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో పాకిస్తాన్లో ఆందోళనలు మొదలయ్యాయి. పాకిస్తాన్ కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై పాకిస్తానీలు దాడి చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నిరసనగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో పాకిస్తాన్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నిరసనకారులు.. పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్‌పై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేశారు. కాన్సులేట్ భవనానికి నిప్పు పెట్టారు. దీంతో, రంగంలోకి దిగిన పాకిస్తాన్ సైన్యం, పోలీసులు.. నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు.. అమెరికా సైన్యం కాల్పుల జరపడంతో ఎనిమిది పాకిస్తానీలు మృతి చెందినట్టు, పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ క్రమంలో అమెరికా కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 🚨🔴8 people were lost his life during a protest near the US Consulate in Karachi. pic.twitter.com/ynmgd3MWuP— THE UNKNOWN MAN (@Theunk5555) March 1, 2026 US embassy in Karachi under siege pic.twitter.com/Vu7e46gL9e— laulukaskas (@clockstiqqun) March 1, 2026Another videoUS Consulate in Karachi, Pakistan, is now under attack by protesters.🚨 pic.twitter.com/euIGG5IVNl— Fatiqmir (@fatiqmir) March 1, 2026 -
ఇరాన్: ఖమేనీ మృతి.. మద్దతుదారుల కన్నీరుమున్నీరు (ఫొటోలు)
-
అమెరికా, ఇజ్రాయెల్ వేడుకోవాల్సిందే: ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, మాటల యుద్ధం నడుస్తోంది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు పెంచింది. దీంతో, ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం, అమెరికాకు ఇరాన్ అదిరిపోయే కౌంటరిచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేసింది. ఇక, ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4 పేరుతో ఇరాన్ దాడులు చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై తాజాగా ఇరాన్ స్పీకర్, అధికారులు స్పందించారు. ఈ క్రమంలో ఇరాన్..‘సుప్రీం లీడర్ ఖమేనీ హత్య పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మా జవాబు చూసి శత్రువులు ఏడ్వాల్సిందే, వేడుకోవాల్సిందే. అమెరికా, ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మేము దాడులు చేస్తే శత్రువులు కూడా బెంబెలెత్తిపోవాల్సిందే. ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తాం. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క’ అని డైరెక్ట్ హెచ్చరికలు జారీ చేసింది.ట్రంప్ హెచ్చరికలు.. అంతకుముందు ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌తోపాటు మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా స్థావరాలపై ఎడతెరిపి లేకుండా చేస్తున్న ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇంతకు ముందెన్నడూ చూడని బలంతో ప్రతిదాడులు చేస్తామని ట్రంప్ స్పష్టంచేశారు. చాలా తీవ్రంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా దాడులు చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించిందని ట్రంప్ గుర్తుచేశారు. వారు అలా చేయకపోవడమే మంచిదని, ఒక వేళ చేస్తే వారు కూడా ఇంతకు ముందు చూడని శక్తితో విరుచుకుపడతామని వార్నింగ్ ఇచ్చారు.🚨 BREAKING: DUBAI AIRPORT HIT! 🇦🇪An explosion has been reported at Dubai International Airport following Iran's strike. All flight operations have been suspended and there is a high alert throughout the UAE. pic.twitter.com/lAQSBDwrZN— Crypto Aman (@cryptoamanclub) March 1, 2026 దుబాయ్ విలవిల.. మరోవైపు.. సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్ సైన్యం.. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ క్షిపణుల రాకతో ఇజ్రాయెల్‌లో చాలా చోట్ల మోగిన సైరన్లు మోగాయి. ఇరాన్ డ్రోన్లు మరోసారి దుబాయ్ ఎయిర్‌పోర్టును మరోసారి తాకాయి. దీంతో, దుబాయ్ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిన్నది. యూఏఈ, ఖతార్‌లలో అనేక చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. యూఏఈలోని అమెరికా స్థావరమైన జబేలీ అలీ పోర్టును ఇరాన్ క్షిపణి తాకింది. అబుదాబి విమానాశ్రయంపై కూడా ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. బుర్జ్ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న దృష్యాలను ఇరాన్ మీడియా విడుదల చేసింది. పశ్చిమాసియాలోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్లలో సైరన్ల మోత మోగిపోయాయి. This isn’t looking good! Dubai Airport hit by Iranian missiles #DBX #Israel #Iran #Dubai pic.twitter.com/ELpEuHonDd— Bashir Gharwal غروال (@bashir_gharwall) February 28, 2026Burj Al Arab hotel in Dubai, has been hit by an Iranian drone😳😳😳World War III looming 💔 pic.twitter.com/p0ItUPfthh— Risi Arab Money (@OyinLadun0) March 1, 2026 -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనే.. ప్రతీకారం తీర్చుకుంటాం..
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఈ మేరకు ఇరాన్, అమెరికా.. ఖమేనీ మృతిని నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరనేది చర్చకు దారి తీసింది. అయితే, ఖమేనీ తన జీవితకాలంలో ఎవరినీ అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఎంపిక బాధ్యత ఎవరిది? ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, కొత్త సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రేణి మత పండితులు ఉంటారు. వీరు చర్చించి కొత్త నేతను ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పాత్ర ఇందులో అత్యంత కీలకం. దేశంలో అత్యంత శక్తివంతమైన ఈ సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.కాగా, తాజా దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ కూడా మరణించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ఐఆర్జీసీ చీఫ్‌గా అహ్మద్ వహిదీ నియామకం అయ్యారు. అనంతరమే.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్టు తెలిసింది.మరోవైపు.. ఖమేని హత్య కారణంగా ఇరాన్ సైన్యం విరుచుకుపడుతోంది. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ ఎయిర్‌పోర్టు ధ్వంసమైంది. ఇదే సమయంలో అమెరికా- ఇజ్రాయెల్‌పై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ కేబినెట్ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) సంతాపం తెలిపింది. ఈ సందర్బంగా తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని.. చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగొచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. -
‘ప్రతిజ్ఞ నెరవేర్చా’.. ఖమేనీ చివరి సందేశం?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (86) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఖమేనీ మృతికి గల కారణాలను అధికారిక యంత్రాంగం వెల్లడించనప్పటికీ, ఆయన మృతి వెనుక కుట్ర కోణాలు ఉండవచ్చనే అనుమానాలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి.ఖమేనీ మరణ వార్త వెలువడిన కొద్ది నిమిషాల్లోనే ఆయన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఒక ఖురాన్ వాక్యం పోస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘అల్లాకు ఇచ్చిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్న వారే నిజమైన విశ్వాసులు.. వారిలో కొందరు తమ ప్రమాణాన్ని నెరవేర్చగా, మరికొందరు ఆ సమయం కోసం నిరీక్షిస్తున్నారు’ అనే అర్థం వచ్చే సూరా అల్-అహ్జాబ్ (33:23) వాక్యాన్ని అందులో ప్రస్తావించారు.ఇది ముందే షెడ్యూల్ చేసిన సందేశమా లేక వ్యూహాత్మకంగా పోస్ట్ చేసిన చివరి వీడ్కోలా అన్నది అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఆయన అనుచరులు దీనిని ఆయన దైవానికి ఇచ్చిన మాటకు నిబద్ధతగా భావిస్తున్నారు. ఖమేనీ మృతి దరిమిలా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను, వారం రోజుల పాటు సెలవును ప్రకటించింది. بسم الله الرحمن الرحیممِنَ الْمُؤْمِنِینَ رِجالٌ صَدَقُوا ما عاهَدُوا اللّهَ عَلَیْهِ فَمِنْهُمْ مَنْ قَضى نَحْبَهُ وَ مِنْهُمْ مَنْ یَنْتَظِرُ وَ ما بَدَّلُوا تَبْدِیلاًhttps://t.co/vVE1NYLvr3 pic.twitter.com/H3xLBUullf— KHAMENEI.IR | فارسی (@Khamenei_fa) March 1, 2026మరోవైపు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా, తమ ప్రత్యేక దళాలు ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీని మట్టుబెట్టాయని ఆయన పేర్కొన్నారు. ‘ఇరాన్ సాగించిన ఉగ్రవాద పాలన నేటితో ముగిసింది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఆధిపత్యం నిరూపితమైంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై పెంటగాన్ అధికారులు అధికారికంగా స్పందించేందుకు నిరాకరించగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం సైతం ‘నో కామెంట్’ అంటూ గోప్యతను పాటించింది.కాగా ఖమేనీ వారసునిగా ఆయన కుమారుడు మోజ్తబా లేదా మరో వర్గానికి చెందిన నేతను ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ అధికార మార్పిడి సజావుగా సాగుతుందా లేక ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇరాన్ వ్యాప్తంగా ప్రార్థనలు, నిరసనలు మిన్నంటుతుండగా, ప్రపంచ దేశాలన్నీ పశ్చిమాసియా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.ఇది కూడా చదవండి: విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు.. -
వైరల్ వీడియో: ట్రంప్‌కు లేడీ యాంకర్ వార్నింగ్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్తను చదువుతూ... ఇరాన్ స్టేట్ టీవీ యాంకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ.. త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం. వారు ఏం చేశారో దానికి తగిన ఫలితం అనుభవిస్తారు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఖమేనీకి నివాళులర్పిస్తూ యాంకర్ అజర్చెహ్ర్.. ఖమేనీ నాయకత్వాన్ని, సిద్ధాంతాలను కొనియాడారు. ఆయన పాలస్తీనా పిల్లల కోసం నిలబడ్డారని.. లెబనాన్ పిల్లల కోసం పోరాడారన్నారు. ఈరోజు ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథలు విలపిస్తున్నారన్నారు. ఖమేనీ చరిత్రలో ఇమామ్ అలీ వలె చిరస్థాయిగా నిలిచిపోతారంటూ యాంకర్ తెలిపింది.ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దాడ్లులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారు. 40 రోజులు సంతాప దినాలుగా ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ నివాసంపై ఆధునిక క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఖమేనీ నివాసమే లక్ష్యంగా 30 క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే, రివల్యూషనరీ గార్డ్ ఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ కూడా మృతిచెందారు.Anchor breaks down at Iran's Press TV announcing the death of Supreme leader Khamenei. Says, "A revenge is coming. A revenge is coming soon. They will see what they have done." pic.twitter.com/4WGtZ58SX0— Sidhant Sibal (@sidhant) March 1, 2026 -
విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు..
కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయాలను, సైనిక వ్యూహాలను తన కనుసన్నలతో శాసించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రస్థానం ఊహించని రీతిలో ముగిసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఆయన మరణించినట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.విప్లవ వీరుడి నుంచి సుప్రీం లీడర్ వరకు..1939లో మషద్‌లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో జన్మించిన ఖమేనీ ప్రస్థానం ఒక పోరాట గాథలా సాగింది. 1979లో నాటి ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి షా మహమ్మద్ రెజా పహ్లావీ అణచివేత పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి, పలుమార్లు జైలు శిక్షను అనుభవించారు. విప్లవం విజయవంతం అయ్యాక, ఇరాన్ గణతంత్ర వ్యవస్థలో తిరుగులేని నేతగా ఎదిగి, 1981 నుండి 1989 వరకు దేశ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి తనదైన పాలన సాగించారు.నాడు తృటిలో ప్రాణాపాయం తప్పించుకుని..ఖమేనీ జీవితంలో 1981 నాటి హత్యాయత్నం ఒక కీలక మలుపు. నాటి దాడిలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆయన కుడి చేయి పాక్షికంగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి ఆయన తన వైకల్యాన్ని కూడా ఒక శక్తిగా మార్చుకుని, దేశాన్ని నడిపించడంలో ముందున్నారు. 1989లో ఖొమేనీ మరణానంతరం ఇరాన్ ‘అత్యున్నత నాయకుని’గా బాధ్యతలు చేపట్టి, మూడు దశాబ్దాలకు పైగా దేశ భవిష్యత్తును తన వేళ్లతో శాసించారు.ప్రాంతీయ శక్తిగా ఇరాన్ విస్తరణఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రభావం దేశ సరిహద్దులు దాటింది. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లోని ఇరాన్ అనుకూల వర్గాలకు అండగా నిలుస్తూ, అమెరికా, ఇజ్రాయేల్లకు ఖమేనీ నిరంతరం సవాలు విసిరారు. ఆయన హయాంలోనే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం ప్రపంచ దేశాల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.ఉక్కుపాదంతో అంతర్గత అణచివేతబాహ్య శత్రువులనే కాకుండా, అంతర్గతంగా తలెత్తిన అసమ్మతిని కూడా ఖమేనీ కఠినంగా ఎదుర్కొన్నారు. 2009 నాటి ‘గ్రీన్ మూవ్మెంట్’ నిరసనలు, అలాగే 2019, 2022లలో ప్రజల నుంచి వచ్చిన తీవ్ర తిరుగుబాట్లను ఆయన తన అధికార బలంతో పూర్తిగా అణచివేశారు. తనను తాను ఇరాన్ సార్వభౌమాధికార రక్షకుడిగా అభివర్ణించుకున్నప్పటికీ, ఆయన పాలనలో రాజకీయ స్వేచ్ఛ కరువైందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి.అగ్రరాజ్యంతో అలుపెరుగని పోరాటంఅమెరికాతో ఖమేనీకి ఉన్న వైరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా 2015 నాటి అణు ఒప్పందం నుంచి 2018లో డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ట్రంప్ ఇరాన్ సుప్రీం ఖమేనీని అత్యంత క్రూరమైన వ్యక్తిగా, ఆయన వర్గాన్ని ‘రక్తపిపాసి ముఠా’గా అభివర్ణించారు. అయితే ఖమేనీ ఏనాడూ అమెరికా ఒత్తిళ్లకు లొంగలేదు. ట్రంప్ ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ప్రతీకార జ్వాలల్లో మధ్యప్రాచ్యంఖమేనీ అంతంతో ఇరాన్ తన ‘ట్రూత్ ఫుల్ ప్రామిస్ 4’ ఆపరేషన్‌ను ప్రారంభించి, అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అబుదాబి, దోహాలతో పాటు బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయంపై పడుతున్న క్షిపణులు ఈ ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతను మరింతగా పెంచాయి.ఇది కూడా చదవండి: ఖమేనీ మృతితో నెతన్యాహు పరారీ? -
ఇరాన్ వీధుల్లో సంబరాలు.. యువరాజు రెజా కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలు పలుచోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇరాన్ యువరాజు రెజా కూడా స్పందించారు. ఖమేనీ పాలన ముగిసిందంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఇరాన్ సైన్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.హిజాబ్ లేకుండా డ్యాన్స్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతున్నట్లు సీఎన్ఎస్ పేర్కొంది. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలనే నినాదాలతో వీధులు మార్మోగినట్లు రిపోర్టు చేసింది. ఇరాన్ శివారు ప్రాంతమైన బేసత్ టౌన్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్న వీడియోను ఫాక్స్ న్యూస్ పోస్టు చేసింది. ఖమేనీ నియంత మరణించాడని తెలియగానే ఇరాన్ మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు చేస్తున్నారని ఇజ్రాయెల్ మాజీ అధికార ప్రతినిధి ఎలాన్ లెవీ ఒక వీడియోను పంచుకున్నారు.Women without hijab 😱Women singing Women dancing #Khamenei Welcome to the new, old Iran that is once again free!#Iran #Israel #Tehran #Bahrain #IranMassacre #Khamenei pic.twitter.com/BPJmFmOyku— DJ BROID (@DjBroid) March 1, 2026నా కల నిజమైంది.. మరోవైపు.. ప్రముఖ ఇరాన్ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ మసిహ్ అలీనెజాద్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సందర్భంగా అలీనెజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిరోజు ఇరాన్ ప్రజలు ప్రజలు ఖమేనీ చేతిలో మరణించారన్న వార్తలు చూస్తూ నిద్రలేచేదాన్ని. కానీ నా జీవితంలో మొదటిసారి ఒక శుభవార్తతో నిద్రలేచాను. నాకు గట్టిగా అరవాలని, పరిగెత్తాలని అనిపిస్తోంది. నేను కల గంటున్నానా? కొత్త ప్రపంచానికి స్వాగతం' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.Huge crowds in Tehran and multiple other Iranian cities celebrating the news of #Khamenei’s death 🤯While crowds celebrate in the streets, Iran’s Revolutionary Guard promises retaliation for Khamenei’s killing 🇮🇷 The situation is escalating fast 😐😐 pic.twitter.com/wXaBdW7z3F— Hinduism_and_Science (@Hinduism_sci) March 1, 2026 ఖమేనీ వారసుడికి తావు లేదు: రెజా పహ్లావీఇరాన్ మాజీ రాజవంశానికి చెందిన వారసుడు, యువరాజు రెజా పహ్లావీ కూడా ఖమేనీ మరణంపై స్పందించారు. ఈ సందర్భంగా..‘నిరంకుశ పాలకుడు, పదివేల మంది ఇరాన్ ముద్దుబిడ్డలను బలిగొన్న హంతకుడు అలీ ఖమేనీ చరిత్ర పుటల నుంచి తుడిచిపెట్టుకుపోయాడు. అతని మరణంతో, ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే ఇది చరిత్రలోని చెత్తబుట్టలోకి వెళుతుంది. ఖమేనీ వారసుడిని నియమించడానికి ఈ వ్యవస్థలోని మిగిలిన శక్తులు చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది. అతని స్థానంలో వారు ఎవరిని ఉంచినా, వారికి చట్టబద్ధత ఉండదు, మనుగడ ఉండదు. వారు కూడా నిస్సందేహంగా ఈ పాలన చేసిన నేరాల్లో భాగస్వాములుగానే ఉంటారు. 👏Breaking: Fardis, Iran — NOW: Iranians launch fireworks, honk horns in joy, crowds celebrate death of regime dictator Khamenei. Support Trump & Israel freeing Iran? A. Yes B. NoVia @realRayanAmiri pic.twitter.com/VylUx1S27S— 𝔉🅰𝒏 Karoline Leavitt (@WHLeavitt) March 1, 2026నేరస్థుడైన ఖమేనీ మరణం ఇరాన్ 'లయన్ అండ్ సన్ నేషనల్ రివల్యూషన్' కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి కుటుంబాలకు, బాధిత తల్లులకు, గాయపడిన పిల్లల హృదయాలకు ఒక ఓదార్పుగా అవుతుంది. ఖమేనీ మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన ముగిసింది. ఇరాన్ సైన్యం (ఐఆర్జీసీ), పోలీసులు, భద్రతా దళాలు ఇకనైనా ప్రజలతో చేతులు కలపాలి. కూలిపోతున్న వ్యవస్థను కాపాడటానికి ప్రయత్నించవద్దు. ఇది సైన్యానికి లభించిన చివరి అవకాశం. స్వేచ్ఛాయుతమైన ఇరాన్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’ అని పిలుపునిచ్చారు. -
ఖమేనీ కథ ముగిసింది.. ఫ్యామిలీతో సహా హతం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఆయన మృతిచెందినట్లు ఇరాన్ ప్రకటించింది. దాడ్లులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారు. 40 రోజులు సంతాపదినాలుగా ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ నివాసంపై ఆధునిక క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఖమేనీ నివాసమే లక్ష్యంగా 30 క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే, రివల్యూషనరీ గార్డ్ ఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ కూడా మృతిచెందారు.ఖమేనీ, అధ్యక్షుడు పెజెష్కియానే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిన్న(శనివారం) ఉదయాన్నే వారి నివాసాలు, కార్యాలయ సముదాయాలపై పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగింది. ఆ వెంటనే మొత్తం టెహ్రాన్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. అనంతరం అమెరికా సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇరాన్ అగ్ర నేతలతో పాటు అణు స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, భారీ బాంబులతో విరుచుకుపడింది. కొద్ది గంటల అనంతరం ఇరాన్ తేరుకుని ప్రతి దాడికి దిగింది. తొలుత ఇజ్రాయెల్‌పై రెండు దఫాలుగా క్షిపణులతో విరుచుకుపడింది. అనంతరం పలు గల్ఫ్ దేశాల్లోని పలు అమెరికా స్థావరాలపైనా దాడులకు తెర తీసింది. నెలల పాటు ప్లాన్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్.. శాటిలైట్ ద్వారా ఖమేనీ లోకేషన్‌ను గుర్తించాయి. ట్రెహాన్‌లోని తన ఆఫీసులోనే ఖమేనీ ఉన్నట్లు నిర్థారణ అయిన తర్వాత నిన్న శనివారం, ఫ్రిబవరి 28) ఉదయం 1:15 కు ఇరాన్‌పై మిస్సైల్ దాడులు ప్రారంభించాయి. ఖమేనీ కార్యాలయం సముదాయాలపై ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లను ఇజ్రాయెల్ ప్రయోగించగా.. తొమహాక్ మిస్సైళ్లతో అమెరికా ఎటాక్ చేసింది. లోకేషన్ గుర్తించిన 15 నిమిషాల్లో ఎటాక్ ప్రారంభించాయి. ట్రెహాన్‌లోని ఖమేనీ కార్యాలయంపై ఏకకాలంలో దాడులు చేపట్టాయి. ఆపరేషన్ కిల్ ఖమేనీ ఆపరేషన్‌కు సౌదీ, గల్ఫ్ దేశాలు మద్దతు తెలిపాయి.ఖమేనీ మరణించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న(శనివారం) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఖమేనీను "చరిత్రలో అత్యంత దుష్టులలో ఒకరు" అంటూ పేర్కొన్న ట్రంప్.. ఇది ‘‘ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు అమెరికన్లకు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు న్యాయం" జరిగిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ నిఘా, ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారన్న ట్రంప్.. ఇరాన్‌లోని ఇతర నాయకులు చేయగలిగేది ఏమీలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో ఖమేనీ నివాస సముదాయంపై 30 బాంబులు వేశారని ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదిక తెలిపింది.శనివారం జరిగిన దాడుల తర్వాత ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై (బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ) దాడులు జరిపింది. ఈ పరిణామాలు ప్రాంతీయంగా పెద్ద ఎస్కలేషన్‌కు దారితీశాయి. అయతొల్లా అలీ ఖమేనీ 1989లో రుహొల్లా ఖొమేనీ తరువాత సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత 36 ఏళ్లుగా ఆయన ఇరాన్‌ను పాలించారు. చివరి సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, ప్రజా నిరసనలు, హమాస్–హిజ్బుల్లా బలహీనత, అమెరికా–ఇజ్రాయెల్ దాడులు వంటి పరిణామాలు ఆయన పాలనను కుదిపేశాయి. -
అమెరికా సైన్యం తొమ్మిది ఇరానియన్ నౌకలను ముంచేసింది: ట్రంప్
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు సంబంధించిన... -
ట్రంప్ వ్యాఖ్యల కలకలం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ప్రకటించారు. ఆయన ఖమేనీను "చరిత్రలో అత్యంత దుష్టులలో ఒకరు" అని పేర్కొన్నారు. ఇది "ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు అమెరికన్లకు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు న్యాయం" జరిగిందని అన్నారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో ఖమేనీ నివాస సముదాయంపై 30 బాంబులు వేశారని ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదిక తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని నెటాన్యాహు కూడా ఖమేనీ మరణించి ఉండవచ్చన్న సంకేతాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రి NBC Newsతో మాట్లాడుతూ, "ఖమేనీ బతికే ఉన్నారు, నాకు తెలిసినంతవరకు అందరు ఉన్నతాధికారులు సురక్షితంగానే ఉన్నారు" అని తెలిపారు. BBCకి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ, "ఏదైనా ధృవీకరించే స్థితిలో లేను, కానీ దేశం మొత్తం జాతీయ సమగ్రతను కాపాడడంపై దృష్టి పెట్టింది" అని అన్నారు. శనివారం జరిగిన దాడుల తర్వాత ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై (బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ) దాడులు జరిపింది. ఈ పరిణామాలు ప్రాంతీయంగా పెద్ద ఎస్కలేషన్‌కు దారితీశాయి. అయతొల్లా అలీ ఖమేనీ 1989లో రుహొల్లా ఖొమేనీ తరువాత సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత 36 ఏళ్లుగా ఆయన ఇరాన్‌ను పాలించారు. చివరి సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, ప్రజా నిరసనలు, హమాస్–హిజ్బుల్లా బలహీనత, అమెరికా–ఇజ్రాయెల్ దాడులు వంటి పరిణామాలు ఆయన పాలనను కుదిపేశాయి. అయితే ఖమేనీ మృతిపై ఇరాన్ నుంచి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. కానీ దీంతో అంతర్జాతీయంగా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. -
మదురోగా ఖమేనీ?.. ఏ క్షణమైనా..
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్లో నాయకత్వ మార్పుదిశగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఖమేనీ పరిస్థితిపై స్పష్టత లేదు. ఆయన రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ రైట్ హ్యాండ్ జనరల్ అలీ ఖంబాని హతం కాగా, ఇరాన్‌కు చెందిన పలువురు సినియర్ కమాండర్లు మృతిచెందినట్లు సమాచారం.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు, దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతొల్లా ఆలీ ఖమేని చనిపోయాడంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తుండగా.. తమ సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని ఇరాన్ ఆర్థిక మంత్రి అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా జల్లెడ పడుతోంది. 1979లో రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి ఇరాన్లో ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం.. దాన్ని అణచివేసేందుకు ఖమేనీ నేతృత్వంలోని ఐఆర్జీసీ బలగాల దమనకాండ.. వేల మంది మరణాల నేపథ్యంలో.. ట్రంప్ టెహ్రాన్‌పై దాడికి దిగారు. ప్రస్తుత పరిణామాలు, జియోపాలిటిక్స్ ఈక్వేషన్లు అంచనా వేసినట్లుగానే జరుగుతున్నాయి.మదురోను అరెస్టు చేసిన సమయంలో అమెరికా తన నౌకదళాన్ని ఎక్కువగా వాడుకుంది. అదే సమయంలో సైబర్ ఎటాక్‌లు చేసింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ జలాల సమీపంలోకి రావడంతో.. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది.ఇరాన్ పౌరులు కూడా ఖమేనీ శకాన్ని ఖతం చేయాలంటూ భీష్మించుకోవడం.. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు కలిసివచ్చింది. నిజానికి 2012లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తాము యురేనియం కడ్డీని తయారు చేశామని ప్రకటించినప్పటి నుంచే అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పుడు టెహ్రాన్‌లో ప్రజాందోళనలు అమెరికాకు కలిసివచ్చాయి. ఇదే అదనుగా ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా యుద్ధం ప్రారంభించిందనే వాదనలు ఉన్నాయి.వాస్తవానికి ఇరాన్-అమెరికా వివాదాలు, దాడులు-ప్రతిదాడులు గత ఏడాది నుంచి మొదలయ్యాయి. గత ఏడాది జూన్ 21 అర్ధరాత్రి దాటాక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఆ మర్నాడే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్‌లోని అమెరికా ఎయిర్ బేస్‌లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ దాడి గురించి ఇరాన్ తమకు ముందుగానే సమాచారం అందించిందని అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా చెప్పారు. ఫలితంగా తాము ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. 2020లో ట్రంప్ ఇదే తరహా దాడులు చేయించారు.ఆ ఏడాది జనవరి 3న ఇరాక్‌లోని బగ్దాద్ విమానాశ్రయం సమీపంలో.. కుద్స్‌ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ లక్ష్యంగా దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇరాక్‌లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అల్-అసద్ వైమానిక స్థావరంపై విరుచుకుపడింది. అప్పట్లో కూడా ఇరాన్ ముందస్తుగా సమాచారం ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఈ దాడులతో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగకున్నా.. అప్పట్లో అక్కడ పనిచేసిన సైనికులు ఇప్పుడు అదే ట్రామాలో కొనసాగుతూ మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారనే నివేదికలు వచ్చాయి.గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పుడు దాడులు-ప్రతిదాడుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టమవుతోంది. అమెరికా సైనిక శక్తి విషయంలో బలంగా ఉంది. ఇరాన్ ఆ విషయంలో చాలా వెనుకబాటులో ఉంది. అయితే.. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో ఇరాన్ గడిచిన మూడేళ్లలో చాలా పురోగతి సాధించింది. అయితే.. సొంత ప్రజలే వ్యతిరేకంగా ఉండడంతో.. ఇరాన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ఇటీవల నివేదికలు వచ్చాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు నేపథ్యంలో ఖమేనీ ఇప్పటికీ టెహ్రాన్‌లోనే ఉన్నాడా? లేక వేరే దేశంలో తలదాచుకుంటున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. -
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి?
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందారంటూ సాగుతున్న ప్రచారం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌కు చెందిన ప్రముఖ ప్రతిపక్ష సాయుధ ముఠా ‘పీపుల్స్ ముజాహిదీన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్’ (ఎంఈకే) ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. సోమవారం నాడు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఖమేనీ నివాస సముదాయం ‘మొతాహరి కాంప్లెక్స్’పై తమ సభ్యులు సాయుధ దాడికి పాల్పడ్డారని ఆ సంస్థ వెల్లడించింది.సుమారు 100 మంది ఫైటర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని, ఈ భీకర పోరులో ఇరాన్ ప్రభుత్వ బలగాలకు భారీ ప్రాణనష్టం వాటిల్లడంతో పాటు, తమ వైపు కూడా ప్రాణనష్టం సంభవించిందని ఎంఈఎక్స్ పేర్కొంది. మరోవైపు ఈ దాడి జరిగినట్లు చెబుతున్న సమయంలో మొతాహరి కాంప్లెక్స్ పరిసరాల్లో భారీగా అంబులెన్సులు మోహరించాయని, భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ వెబ్సైట్లు సైబర్ దాడికి గురై, ఖమేనీకి వ్యతిరేకంగా సందేశాలు ప్రసారమయ్యాయనే ప్రచారం జరుగుతోంది. 🟥#فوریشهادت و دستگیری ۱۰۰ مجاهدستاد فرماندهی #مجاهدین در داخل کشور اعلام کرد از بامداد روز دوشنبه ۴ اسفند تا بعدازظهر دوشنبه در سلسلهای از درگیریها با نیروهای رژیم که از بیتالعنکبوت #خامنهای در هنگام اذان صبح آغاز شد، بیش از ۱۰۰ مجاهد شهید یا دستگیر شدهاند.تلفات دشمن… pic.twitter.com/Y2vvjofKTh— سازمان مجاهدین خلق ایران (@PMOIRAN) February 23, 2026అయితే ఈ వాదనలపై అటు ఇరాన్ అధికారిక మీడియా గానీ, ఇటు అంతర్జాతీయ స్వతంత్ర సంస్థలు గానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఖమేనీ ఆరోగ్య పరిస్థితి, మృతిపై వస్తున్న వార్తలను ధ్రువీకరించే ఆధారాలేవీ లభ్యం కాకపోవడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ అధికార యంత్రాంగంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఎంఈకే చరిత్రను పరిశీలిస్తే గతంలోనూ ఇలాంటి సంచలన ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. BBC Persia: The People's Mujahedin of Iran has claimed that on Monday, they carried out an armed attack on Khamenei's residence. The atmosphere around there today was described as tense by many eyewitnesses, but it wasn't clear why. pic.twitter.com/3SkMA6n43G— World Source News (@Worldsource24) February 24, 20261965లో స్థాపితమైన ఈ సంస్థ 1979 విప్లవంలో పాల్గొన్నప్పటికీ, తదనంతరం ప్రస్తుత నాయకత్వంతో విభేదించి, ప్రవాసంలో ఉంటూ పోరాటం కొనసాగిస్తోంది. ఇదే తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెంటగాన్ అధికారులు సమర్పించిన సైనిక ప్రణాళికల్లో ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకునే ‘అస్సాసినేషన్’ (హత్య) ప్లాన్ కూడా ఉన్నట్లు వార్తలు రావడం గమనార్హం. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు యుద్ధ మేఘాలకు దారితీస్తాయేమోనన్న అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి: శశికళ సంచలన ప్రకటన -
ఇరాన్ యూనివర్సిటీల్లో మళ్లీ నిరసన జ్వాలలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు మరోసారి రోడ్లెక్కారు. శనివారం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో అనేక విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు నిరసనలు తెలిపారు. గత నెలలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో భద్రతా దళాల అణిచివేత కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ ఆందోళన చేపట్టారు.టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. అయతుల్లా అలీ ఖమేనీని " అత్యంత క్రూరమైన నాయకుడు" అని అభివర్ణిస్తూ నినాదాలు చేశారు. అదేవిధంగా ఇరాన్ మాజీ రాజు షా కుమారుడు రెజా పహ్లావిని కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరడం చర్చానీయాంశమైంది. ఈ నేపథ్యంలో పలు క్యాంపస్‌లలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులైన 'బసీజ్' (Basij) విద్యార్థి విభాగాలకు మధ్య పలు చోట్ల వాగ్వాదం జరిగింది. టెహ్రాన్‌లోని అమీర్ కబీర్, షాహిద్ బెహెష్టి యూనివర్సిటీలతో పాటు ఈశాన్య ప్రాంతంలోని మషద్ యూనివర్సిటీలో కూడా నిరసనలు జరిగాయి. కాగా 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత, ఇరాన్ ప్రభుత్వం ఇంతటి భారీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొవడం ఇదే మొదటిసారి. ఇరాన్ భద్రతా బలగాలు అణిచివేతలో వేల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. -
ఖమేనీ, అతడి కుమారుడి హత్యకు అమెరికా ప్లాన్.. సంచలన నివేదిక
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని టార్గెట్ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తాజాగా ఆక్సియోస్(Axios) నివేదికలో పేర్కొంది. దీంతో, ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.అణు ఒప్పందం అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్ సమీపంలో అమెరికా సైన్యం దాడులు చేసేందుకు రెడీగా కూడా ఉంది. ఇరాన్‌కు సమీపంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనుమతి కోసం వేచిచూస్తున్నాయి. అత్యాధునిక విమానాలు మిడిల్ ఈస్ట్‌కు చేరాయి. మరోవైపు, ఇరాన్ రష్యాలు కలిసి హార్మోజ్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి.🇺🇸🇮🇷 NEW:According to Axios, one option under consideration by President Donald Trump involves a potential targeted strike on Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei and his son, described as a limited military option.Source: Axios pic.twitter.com/5GJKpAtNVn— WAR (@warsurv) February 21, 2026ఇలాంటి తరుణంలో ఆక్సియోస్ నివేదిక అమెరికా దాడులు, ఖమేనీ గురించిన సంచలన విషయాలను బయటపెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఈ సైనిక ఆప్షన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచినట్లు తెలిపింది. మొజ్తాబాను సుప్రీం లీడర్ వారసుడిగా అంతా భావిస్తున్నారు. ఇరాన్ అగ్రనేతలతో పాటు కీలకమైన ముల్లాలను అంతమొందించేలా రక్షణ శాఖ పలు ఆప్షన్లను ట్రంప్ ముందు ఉంచింది. అయితే, దీనిపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.మరోవైపు.. అధ్యక్షుడు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పందిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలుసు అని వ్యాఖ్యలు చేశారు. సీనియర్ల సలహాదారులు, అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఇక, ఓ వైపు ఇరాన్‌తో అణు చర్చలు జరుపుతూనే అమెరికా సైనికంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకువస్తోంది. -
ఇరాన్‌కు బిగ్ షాక్.. ఈయూ సంచలన నిర్ణయం
టెహ్రాన్: ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బిగ్ షాక్ తగిలింది. యూరోపియన్ యూనియన్(EU) ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. దీంతో, ఐఆర్‌జీసీకి చెందిన నిధులు, ఆస్తులు.. ఈయూ సభ్య దేశాల్లో స్థంభించిపోనున్నాయి.అయితే, 2026 జనవరి 29న యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల మండలి (Foreign Affairs Council) సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)ను EU అధికారికంగా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, పరాగ్వే, ఈక్వడార్, ఉక్రెయిన్ సహా పలు దేశాలు ఇందుకు అనుకూలంగా ఓటు వేయగా.. ఇజ్రాయెల్, అర్జెంటీనా రెండు దేశాలు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో, ఉగ్రవాద సంస్థల జాబితాలోకి ఐఆర్జీసీ వెళ్లిపోయింది.కాగా, ఐఆర్జీసీ ఉగ్రవాద సంస్థగా గుర్తింపు కావడంతో దీనికి చెందిన నిధులు, ఆస్తులు ఈయూ సభ్య దేశాల్లో స్తంభింపజేయబడతాయి. అలాగే, ఈయూలోని వ్యక్తులు, సంస్థలు.. ఐఆర్‌జీసీకి ఆర్థిక వనరులు అందించకూడదు. ఇదిలా ఉండగా.. మొత్తం 13 మంది వ్యక్తులు, 23 సంస్థలు ప్రస్తుతం ఈయూ ఉగ్రవాద జాబితాలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈయూ ఉగ్రవాద జాబితాలో ప్రధానంగా అల్‌ఖైదా, ఐసిస్ వంటి అప్రభుత్వ మిలిటెంట్ గ్రూపులు మాత్రమే ఉండేవి. ఐజీఆర్ఎసీ చేరడం ద్వారా ఒక దేశానికి చెందిన సైనిక బలగాన్ని ఈయూ ఉగ్రవాద జాబితాలో చేర్చిన మొదటి గ్రూపుగా రికార్డుల్లో చేరింది. మొత్తంగా, ఈయూ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడమే కాకుండా, ఐఆర్జీసీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈయూ, ఇతర దేశాలు విధించిన ఆంక్షలు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా, సాధారణ ప్రజల జీవితాలను కూడా గణనీయంగా ప్రభావితం చేయనున్నాయి.IRGC స్థాపన, ఉద్దేశ్యం..ఐఆర్జీసీ 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఏర్పడింది. దీని ప్రధాన లక్ష్యం.. విప్లవాన్ని రక్షించడం, ఇస్లామిక్ వ్యవస్థను కాపాడటం. ఇది నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఇది ఇరాన్లో రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో అత్యంత శక్తివంతమైన సంస్థ. ఐఆర్జీసీ.. ఇరాక్, లెబనాన్ (హిజ్బుల్లా), సిరియా, యెమెన్, పాలస్తీనా ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇస్తుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగం IRGC నియంత్రణలో ఉంది. మరోవైపు.. అమెరికా దాడి హెచ్చరికల నేపథ్యంలో ఈనెలలోనే IRGC హోర్ముజ్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. -
ట్రంప్ భయం.. 37 ఏళ్ల రికార్డు బ్రేక్
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తన నివాస రహస్యం ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా తలదాచుకుంటున్నారు. అమెరికా శాటిలైట్స్ సైతం కనిపెట్టకుండా ప్రత్యేకమైన బంకర్లలో ఆయన తలదాచుకుంటున్నట్లు సమాచారం .ఈ నేపథ్యంలో ఖమేనీ 37 ఏళ్లుగా ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశారు.1989లో షియా మత గురువు ఆదేశ సుప్రీం లీడర్ రుహోల్లా ఖోమేని మరణాంతరం ఆయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు నుంచి నేటి వరకూ దాదాపుగా 37 ఏళ్లుగా ఇరాన్ సుప్రీంగా ఖమేనీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దశాబ్ధాలుగా ఉన్న ఓ సంప్రదాయాన్ని అమెరికా ఉద్రికత్తల నేపథ్యంలో వదులుకోవాల్సి వచ్చింది.1979 ఫిబ్రవరి 8వ తేదీ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది, ఆ రోజున ఒక బృందం వైమానిక దళ అధికారులు పహ్లావీ రాజవంశాన్ని కూలదోసినందుకు గాను రుహోల్లా ఖొమేనీకి విధేయత ప్రకటించారు. అనంతరం అప్పటి నుంచి ఆ రోజున ఆ దేశ వైమానిక అధికారులతో ఇరాన్ సుప్రీం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. కరోనాతో ప్రపంచం మంతా ఆంక్షలు ఉన్న సమయంలోనూ ఈ సమావేశం నిర్వహించారు.అయితే ప్రస్తుతం అమెరికాతో హాని పొంచి ఉన్న నేపథ్యంలో తొలిసారిగా ఆ దేశ సుప్రీం ఆ భేటీకి హాజరుకానట్లు ఇరాన్ అధికారులు ప్రకటించారు. ఈ సారి ఆయనకు బదులుగా ఆ సమావేశానికి ఆర్మీ ఫోర్స్ చీఫ్ అబ్ధుల్ రహీం మౌస్వీ హాజరైనట్లు అధికారులు తెలిపారు. దీంతో 37 ఏళ్లుగా ఇరాన్ సుప్రీం పాటిస్తున్న సంప్రదాయానికి తొలిసారిగా బ్రేక్ పడినట్లయింది.అయితే అమెరికాతో ముంపు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఖమేనీ బయిటకి రాలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు వెనక్కితగ్గేలా కనిపించడం లేదు. అణు కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్న యురేనియం శుద్ధి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో నిలిపేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. తమ దేశ సౌర్వభౌమాధికారం విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.అటు అమెరికా తన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను అరేబియా సముద్రంలో మెుహరించింది. కొద్దిరోజుల క్రితం ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేసిన యుఎస్ ఇప్పుడు ఆ దేశంపైకి ఏ క్షణానైనా దాడి చేసేలా మరింత దగ్గరగా అబ్రహం లింకన్‌ను తీసుకవచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఏం జరగనుందా? అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. -
అమెరికా దాడి చేస్తే.. రణరంగమే
దుబాయ్: అగ్ర రాజ్యం అమెరికా తమపై దాడి చేసిన పక్షంలో పశ్చిమాసియా యుద్ధ రంగంగా మారుతుందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ(86) తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజల నిరసనలను హింసాత్మక అణచివేయాలని చూస్తే తీవ్ర దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడం తెల్సిందే. విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్, ఇతర యుద్ధ నౌకలు అరేబియా జలాల్లోకి ప్రవేశించిన వేళ ఖమేనీ అమెరికానుద్దేశిస్తూ సూటిగా చేసిన హెచ్చరికలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా ముదిరే ప్రమాదముందని భావిస్తున్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలను తిరుగుబాటుగా ఖమేనీ అభివర్ణించారు. తమపై దాడులకు దిగితే అది ఈసారి ప్రాంతీయ యుద్ధంగా మారుతుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. ‘మేం రెచ్చగొట్టే వాళ్లం కాము. మేం ఎవరిపైనా యుద్ధానికి వెళ్లాలనుకోవడం లేదు. మమ్మల్ని వేధించాలని చూసినా, దాడులకు పాల్పడినా తీవ్రస్థాయిలో ప్రతిచర్యలు తప్పవు’అని ప్రకటించారు. అదేవిధంగా, గతంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు నిరసనలకు పాల్పడుతున్నారంటూ గతంలో వ్యాఖ్యానించిన ఖమేనీ ఈసారి ఆందోళనకారులపై స్వరం పెంచారు. ‘ఇటీవల జరుగుతున్న నిరసనలు తిరుగుబాటుతో సమానమైనవి. అందుకే ఆ తిరుగుబాటును అణచివేశాం. దేశాన్ని నడిపించే కీలక వ్యవస్థలను ధ్వంసం చేయడమే నిరసనకారుల లక్ష్యం. అందుకే వారు పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, రివల్యూషనరీ గార్డుల కేంద్రాలు, బ్యాంకులు, మసీదులపై దాడులకు పాల్పడ్డారు. ఖురాన్ ప్రతులను దహనం చేశారు’అని ఆరోపించారు.ఈయూ సైనికులూ ఉగ్రవాదులేనిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న రివల్యూషనరీ గార్డ్స్ విభాగం బలగాలను యూరోపియన్ యూనియన్(ఈయూ)ఉగ్రవాదులుగా పక్రటించడంపై ఇరాన్ మండిపడింది. ఈయూ సభ్యదేశాల మిలటరీని కూడా ఉగ్ర గ్రూపులుగా ప్రకటించే విషయం పరిశీలిస్తున్నామని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం 2019లోనే రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించింది. బదులుగా ఇతర దేశాల మిలటరీని ఉగ్రవాద గ్రూపుగా ప్రకటించే విషయం తామూ పరిశీలిస్తామని అప్పట్లోనే ఇరాన్ తెలిపింది. రివల్యూషనరీ గార్డు విభాగం సుప్రీం నేత ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. అయితే, యూరప్‌లోకి ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా కట్టడి చేస్తున్న రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించడం ద్వారా యూరప్ తనకంటిని తానే పొడుచుకుందని గార్డుల మాజీ కమాండర్ మహ్మద్ బఘెర్ వ్యాఖ్యానించారు. అమెరికా మాట విని ఈయూ గుడ్డిగా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. మరో పరిణామంలో...వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆది, సోమవారాల్లో లైవ్ ఫైర్ మిలటరీ డ్రిల్ చేపడుతోంది. ప్రపంచంలో జరిగే చమురు రవాణాలో ఐదో వంతు పర్షియన్ గల్ఫ్‌లోని ఈ జలసంధి ద్వారానే సాగుతోంది. తమ యుద్ధ నౌకలు, విమానాలకు నష్టం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ హెచ్చరికలు జారీ చేసింది. -
వార్ టెన్షన్.. ట్రంప్‌తో యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్
ఇస్తాంబుల్: శాంతియుత ఆందోళనలను తీవ్రంగా అణచివేయడంతోపాటు మూకుమ్మడి మరణశిక్షలను అమలు చేస్తున్న ఇరాన్‌పై మిలటరీ దాడులు తప్పవంటూ అమెరికా చేస్తున్న హెచ్చరికలను ఆ దేశం బేఖాతరు చేస్తోంది. ఉద్రిక్తతలను సడలించేందుకు అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటున్న ఇరాన్ ప్రభుత్వం.. ప్రస్తుతానికి అందుకు సంబంధించిన ప్రణాళికేదీ లేదని మరోవైపు చెబుతోంది.ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శుక్రవారం తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్‌తో కలిసి ఇస్తాంబుల్‌లో మీడియాతో మాట్లాడారు. అమెరికాతో నిష్పక్షపాత, సమానత్వంతో కూడిన చర్చలకు సిద్ధమన్నారు. అయితే, ముందుగా ఏ అంశంపై చర్చ జరగాలి, ఎక్కడ కలుసుకోవాలి అనే వాటిపై నిర్ణయం జరగాలని స్పష్టం చేశారు. చర్చలకు, అవసరమైతే యుద్ధానికి కూడా తాము సిద్ధమేనంటూ అరాగ్చి వ్యాఖ్యానించారు. అమెరికా ఆంక్షలుమరోవైపు.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇస్కందర్ మోమినీపై అమెరికా శుక్రవారం ఆంక్షలు విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన నిరసనకారులపై మోమినీ ఆదేశాల మేరకు భద్రతా సిబ్బంది దమనకాండకు పాల్పడ్డారని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. మోమినీతో పాటు.. ఇరాన్ పారిశ్రామిక బాబక్ జంజానీ సహా 18 మంది వ్యక్తులు, కొన్ని సంస్థలపై ఆంక్షలు విధించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. -
మరో మదురోగా ఖమేనీ? ఏ క్షణమైనా అమెరికా పూర్తిస్థాయి యుద్ధం..!!
వాషింగ్టన్ డీసీ: అయతుల్లా ఖమేనీ.. ఇరాన్ సుప్రీం లీడర్..! ఇప్పుడు ఇతణ్ని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు అమెరికా సిద్ధమైందా?? 1979లో రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి ఇరాన్లో ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం.. దాన్ని అణచివేసేందుకు ఖమేనీ నేతృత్వంలోని ఐఆర్జీసీ బలగాల దమనకాండ.. వేల మంది మరణాల నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా ట్రంప్ తన సైన్యంతో టెహ్రాన్‌పై దాడికి సన్నద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, జియోపాలిటిక్స్ ఈక్వేషన్లు అవుననే సమాధానం చెబుతున్నాయి. మదురోను అరెస్టు చేసిన సమయంలో అమెరికా తన నౌకదళాన్ని ఎక్కువగా వాడుకుంది. అదే సమయంలో సైబర్ ఎటాక్‌లు చేసింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ జలాల సమీపంలోకి రావడంతో.. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పుడు ఇరాన్ సమీపంలోని జలాల్లో పూర్తిస్థాయిలో మోహరించింది. అదే సమయంలో.. వెనిజెవెలా మాదిరిగా సైబర్ దాడి చేసేందుకు అమెరికా సైబర్ కమాండ్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ పౌరులు కూడా ఖమేనీ శకాన్ని ఖతం చేయాలంటూ భీష్మించుకోవడం.. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు కలిసివచ్చింది. నిజానికి 2012లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తాము యురేనియం కడ్డీని తయారు చేశామని ప్రకటించినప్పటి నుంచే అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పుడు టెహ్రాన్‌లో ప్రజాందోళనలు అమెరికాకు కలిసివచ్చాయి. ఇదే అదనుగా యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోంది.వాస్తవానికి ఇరాన్-అమెరికా వివాదాలు, దాడులు-ప్రతిదాడులు గత ఏడాది నుంచి మొదలయ్యాయి. గత ఏడాది జూన్ 21 అర్ధరాత్రి దాటాక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఆ మర్నాడే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్‌లోని అమెరికా ఎయిర్ బేస్‌లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ దాడి గురించి ఇరాన్ తమకు ముందుగానే సమాచారం అందించిందని అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా చెప్పారు. ఫలితంగా తాము ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. 2020లో ట్రంప్ ఇదే తరహా దాడులు చేయించారు. ఆ ఏడాది జనవరి 3న ఇరాక్‌లోని బగ్దాద్ విమానాశ్రయం సమీపంలో.. కుద్స్‌ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ లక్ష్యంగా దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇరాక్‌లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అల్-అసద్ వైమానిక స్థావరంపై విరుచుకుపడింది. అప్పట్లో కూడా ఇరాన్ ముందస్తుగా సమాచారం ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఈ దాడులతో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగకున్నా.. అప్పట్లో అక్కడ పనిచేసిన సైనికులు ఇప్పుడు అదే ట్రామాలో కొనసాగుతూ మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారనే నివేదికలు వచ్చాయి.గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పుడు దాడులు-ప్రతిదాడుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టమవుతోంది. అమెరికా సైనిక శక్తి విషయంలో బలంగా ఉంది. ఇరాన్ ఆ విషయంలో చాలా వెనుకబాటులో ఉంది. అయితే.. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో ఇరాన్ గడిచిన మూడేళ్లలో చాలా పురోగతి సాధించింది. అయితే.. సొంత ప్రజలే వ్యతిరేకంగా ఉండడంతో.. ఇరాన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ఇటీవల నివేదికలు వచ్చాయి.ఖమేనీ ఇప్పటికీ టెహ్రాన్‌లోనే ఉన్నాడా? లేక రష్యాలో తలదాచుకుంటున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశాలయ్యాయి. అయితే.. అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఖమేనీ ఉనికిపై ఓ స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనా.. యుద్ధ విమానాలు, సేనలను ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నా.. ప్రజలకు నష్టం కలగకుండా.. కలుగులో దాక్కొన్న ఖమేనీ, నియంతృత్వ భావాలున్న ఇతర నాయకులే అమెరికా లక్ష్యమని స్పష్టమవుతోంది. అంటే.. పరిమిత ప్రాంతాలపైనే.. ఇంకా చెప్పాలంటే నిర్ణీత భవనాలు, బంకర్లపైనే అమెరికా దాడులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఇరాన్ గార్డ్స్, సైన్యాధికారులు కూడా తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా ట్రంప్ సేనలు ఇరాన్ పెద్దలను బంధించేందుకు దాడులు జరిపే అవకాశాలున్నాయి. -
కాబోయే సుప్రీం మొజ్తబా ఖమేనీ..దిమ్మదిరిగే వ్యాపార సామ్రాజ్యం
ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కాబోయే వారసుడిగా ప్రచారంలో ఉన్న ఆయన రెండో కుమారుడు 56 ఏళ్ల ఈ మత గురువు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) విదేశాల్లో విస్తరించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం ఇపుడు నెట్టింట్ చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ తన అణు కార్యక్రమం కారణంగా గత రెండు దశాబ్దాలుగా చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ దేశ ఉన్నత వర్గాలు విదేశాలకు మూలధనాన్ని ఎలా తరలించగలిగాయో ఖమేనీ విదేశీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో చూస్తే అర్థం అవుతుంది అంటోంది తాజా నివేదిక.ప్రముఖ పాశ్చాత్య గూఢచార సంస్థ అంచనా ప్రకారం ఉత్తర లండన్‌లోని "బిలియనీర్స్ రో" అని పిలువబడే వీధిలో, పొడవైన కంచెలు, మూసివేసిన గేట్ల వెనుక చాలా వరకు ఖాళీగా ఉన్న కొన్ని భవనాలు ఉన్నాయి. ది బిషప్స్ అవెన్యూలోని ఈ విలాసవంతమైన ఇళ్ల ముఖభాగాల వెనుక టెహ్రాన్ నుండి దుబాయ్ , ఫ్రాంక్ఫర్ట్ వరకు విస్తరించి ఉన్న ఒక నెట్వర్క్ ఉంది. అనేక బినామీ కంపెనీల ద్వారా, దీని అంతిమ యాజమాన్యం మధ్యప్రాచ్యంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన ఇరాన్ సర్వోన్నత నాయకుడి రెండవ కుమారుడు మొజ్తబా ఖమేనీదే అని చెబుతోంది.యువ ఖమేనీ తన ఆస్తులను తన సొంత పేరు మీద పెట్టడానికి ఇష్టపడకపోయినప్పటికీ, విస్తారమైన పెట్టుబడుల సామ్రాజ్యాన్ని నిర్మించారని, కొన్ని కనీసం 2011 నాటివి అని అంచనా. గ్లోబల్‌గా విస్తరించిన అతని ఆస్తులు విలువ పర్షియన్ గల్ఫ్ షిప్పింగ్ నుండి స్విస్ బ్యాంక్ ఖాతాలుదాకా విస్తరించి ఉన్నాయని భావిస్తున్నారు. 2019లో అతనిపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, ఈ సంస్థల నెట్వర్క్ మొత్తం కలిసి ఖమేనీకి నిధులను బిలియన్ల డాలర్లను పాశ్చాత్య మార్కెట్లలోకి మళ్లించారు.ముఖ్యమైన ఆస్తులుమొజ్తబా ఖమేనీ లండన్, దుబాయ్, జర్మనీ మరియు స్పెయిన్ వంటి దేశాల్లో వందల మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన భవనాలు, హోటళ్లు మరియు వ్యాపారాలను కలిగి ఉన్నారని బ్లూమ్‌బెర్గ్ పరిశోధనలో తేలింది. ఈ ఆస్తులేవీ నేరుగా ఆయన పేరు మీద లేవు. అలీ అన్సారీ అనే ప్రముఖ ఇరానియన్ వ్యాపారవేత్తను బినామీగా వాడుకుని, అనేక షెల్ కంపెనీల ద్వారా ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా వచ్చిన నిధుల నుంచే ఈ సంపద సమకూరినట్టు సమాచారం. ఇరాన్‌పై కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ, గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుని ఈ నిధులను విదేశాలకు తరలించారు.లండన్ (UK): లండన్‌లోని "బిలియనీర్స్ రో" (The Bishops Avenue) లో సుమారు రూ. 1,241 కోట్ల ($138 మిలియన్లు) విలువైన విలాసవంతమైన భవనాలున్నాయి. ఇందులో ఒక ఇల్లు 2014లో ఏకంగా రూ. 371.09కోట్లకు కొనుగోలు చేశారట.దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన "ఎమిరేట్స్ హిల్స్" (దీనిని దుబాయ్ బెవెర్లీ హిల్స్ అంటారు) ప్రాంతంలో ఒక పెద్ద విల్లా ఉంది.ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ), మల్లోర్కా (స్పెయిన్) లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు (ఉదాహరణకు Hilton Frankfurt Gravenbruch) ఈ నెట్వర్క్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. కెనాడాలోని టొరంటోలోని ఫోర్ సీజన్స్ ప్రైవేట్ రెసిడెన్స్‌లో ఒక పెంట్‌హౌస్‌ను సుమారు 7.7 మిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి.మరికొన్ని ఆస్తులను నేరుగా మెజ్తబా పేరు మీద కాకుండా, Birch Ventures Ltd, Ziba Leisure Ltd, , A&A Leisure వంటి షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేశారు. ఇవి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఐల్ ఆఫ్ మ్యాన్ వంటి దేశాల్లో రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఇరాన్లో చమురుకంపెనీల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును దుబాయ్, స్విట్జర్లాండ్, లీచ్టెన్స్టెయిన్ బ్యాంకు ఖాతాల ద్వారా దారి మళ్లించి ఈ ఆస్తులను కొన్నారట."ఇరాన్ ప్రభుత్వం జర్మనీ ఆర్థిక వ్యవస్థలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది" అని ఫ్రాంక్ఫర్ట్ డిప్యూటీ మేయర్, టెహ్రాన్‌లో జన్మించి ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించిన నర్గెస్ ఎస్కందారి-గ్రున్‌బర్గ్ అన్నారు. మన వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.ఎవరీ అన్సారీమొజ్తబా సామ్రాజ్యాన్ని నడపడంలో అలీ అన్సారీ (Ali Ansari) కీలక పాత్ర పోషించాడనే విమర్శలు భారీగానే ఉన్నాయి. ఇరాన్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్ (Iran Mall) యజమాని ,బ్యాంకర్. 1980ల చివరలో, ఇరాన్-ఇరాక్ యుద్ధం ముగిసే సమయానికి - యువ అన్సారీ సైన్యంలో చేరాడు. ఈ సమయంలోనే అతను మొదటిసారిగా మొజ్తబా ఖమేనీని కలిశాడు. ఆ తరువాత అన్సారీ లాభదాయకమైన ప్రభుత్వ కాంట్రాక్టులు , దిగుమతి లైసెన్సులను పొందాడు. నిర్మాణ రంగం, షిప్పింగ్ మరియు పెట్రోకెమికల్స్ రంగాలలోకి వేగంగా ప్రవేశించాడు. ఈ పరిశ్రమలు ప్రభుత్వ నిధులను విదేశాలకు తరలించడానికి మార్గాలుగా ఉపయోగపడ్డాయని సమాచారం. 1990- 2000లలో, అన్సారీ టెహ్రాన్‌లో ఒక వర్ధమాన పారిశ్రామికవేత్తగా ఎదిగాడు అతను 2009లో TAT బ్యాంక్‌ను స్థాపించాడు, ఇది తరువాత బ్యాంకు యాజమాన్యంలోని విలాసవంతమైన షాపింగ్ సెంటర్ అయిన ఇరాన్ మాల్‌ను నిర్మించే ప్లాన్ వేశాడు. 2013 నాటికి, ఒక విలీనం TAT బ్యాంక్‌ను అయందే బ్యాంక్‌గా మార్చింది. ఇది 2025లో కుప్పకూలింది. అంతర్గత రుణాల ఆరోపణలలో చిక్కుకుని, అప్పులు మరియు అధికారులతో ఉన్న సన్నిహిత రాజకీయ సంబంధాలపై వివాదాలతో కూరుకుపోయింది.బ్రిటన్ ఇతనిని "అవినీతిపరుడైన ఇరానియన్ వ్యాపారవేత్త"గా పేర్కొంటూ ఆంక్షలు విధించింది. అన్సారీపై UK ఆస్తులను స్తంభింపజేయడం వలన EU ఆంక్షలు విధించినట్లయితే నెట్వర్క్ యూరోపియన్ ఆస్తులను భారీగా విక్రయించే అవకాశం ఉందని మనీలాండరింగ్ దర్యాప్తు యూరోపియన్ అధికారి పేర్కొన్నారు.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!ఖమేనీ వారసుడిగామొజ్తబాతండ్రి 86 ఏళ్ల అలీ ఖమేనీ తర్వాత ఇరాన్ తదుపరి "సుప్రీం లీడర్" అయ్యేందుకు మెజ్తబా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఆస్తులు ఆయనకు రాజకీయంగా మరియు ఆర్థికంగా బలాన్ని ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇరాన్లో విప్లవం వచ్చి ప్రభుత్వం కూలిపోతే, విదేశాలకు పారిపోయి సుఖంగా జీవించడానికి ఈ భారీ సంపదను "రెయిన్ డే ఫండ్"గా సిద్ధం చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి.2025-26లో అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో ఇరాన్‌పై ఒత్తిడి పెరిగింది. అలీ అన్సారీపై బ్రిటన్ ఆంక్షలు విధించడంతో, ఈ విదేశీ ఆస్తులను ఫ్రీజ్ (Freeze) చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే, పాలకుల కుటుంబం ఇలా కోట్లాది రూపాయల సంపదను విదేశాల్లో దాచుకోవడంపై ఇరాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.మరోవైపు ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని యుద్ధనౌకలను తరలిస్తున్నామంటూ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రజలు పేదరికంతో అలమటిస్తుంటే, పాలకుల కుటుంబం ఇలా విదేశాల్లో విలాసవంతమైన ఆస్తులు కూడబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇరాన్ ప్రభుత్వం తమను తాము సామాన్య భక్తులుగా చెప్పుకున్నా, లోపల జరుగుతున్నది వేరని తాజా నివేదిక చెబుతోంది. ఈ నివేదికలోని పేర్కొన్న ఆస్తులపై అటు ఖమేనీ లేదా అన్సారీ స్పందించ లేదు.-తుమ్మలపల్లి సూర్యకుమారి -
ఇరాన్లో ఖమేనీని తొలగిస్తే.. రూబియో సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దాడులు చేస్తామని అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తుండగా.. తాము తగ్గేదేలా అనే విధంగా ఇరాన్ యుద్ధానికి రెడీ అవుతోంది. పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ నిమగ్నమైంది. ఇలాంటి తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని తొలగిస్తే.. అంటూ కామెంట్స్ చేయడం కొత్త చర్చకు దారి తీసింది.అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరాన్లో పాలన మార్పు తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్నలకు రూబియో స్పందిస్తూ.. ‘ఇరాన్లో ఎవరు అధికారం చేపడతారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వం ఎన్నోఏళ్ల నుంచి పాతుకుపోయి ఉంది. అక్కడున్న అధికారులు, సైన్యం.. ఖమేనీ ఆదేశాల మేరకే నడుచుకుంటారు. సుప్రీం లీడర్, పాలన పడిపోతే.. అక్కడ తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్నకు బదులివ్వడం కష్టం. ఇరాన్లో పాలన ఖమేనీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో పాటు ఎన్నికైన వ్యక్తుల మధ్య విభజించి ఉంది. ఇది వెనెజువెలా కంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదురైతే దానిపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పశ్చిమాసియా అంతటా అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయాలనే ట్రంప్ నిర్ణయాన్ని రూబియో సమర్థించారు. అమెరికన్ బలగాలు, భాగస్వాములపై దాడి చేసేందుకు ఇరాన్ సామర్థ్యాన్ని కూడగట్టుకుంటుందన్నారు.BREAKING: 🚨🇺🇸🇮🇷 Marco Rubio warns that no one knows who will lead Iran after Khamenei. pic.twitter.com/yNmCeqsms4— Globe Observer (@_GlobeObserver) January 29, 2026మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అణు ఒప్పందంపై చర్చలకు రాని పక్షంలో ఇరాన్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడతామని వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందం అందరికీ మేలు చేస్తుంది. భారీగా యుద్ద నౌకలు ఇరాన్‌వైపు వెళుతున్నాయి. సమయం లేదు. ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్‌కు మరోసారి చెబుతున్నా. ఇరాన్ చర్చలకు రాకపోతే గతంలో కంటే భీకరస్థాయిలో దాడులు చేస్తాం.. నాశనం తప్పదని హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమను యుద్ధం దిశగా నెడితే.. గతంలో ఎన్నడూ చేయని స్థాయిలో దాడి చేస్తామంది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అమెరికా దాడి నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ నిమగ్నమైంది. -
ఇరాన్లో మృతులు 30 వేల పైమాటే?
టెహ్రాన్: ఇరాన్ వ్యాప్తంగా ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన నిరసనల్లోనే కనీసం 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆ దేశ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ టైమ్ పత్రిక ఈ విషయం తెలిపింది. గురు, శుక్రవారాల్లోనూ ఇరాన్ భద్రతా విభాగాల సిబ్బంది ఇంతే కర్కశంగా వ్యవహరించారని, మరణాలు కూడా అదే స్థాయిలో ఉండొచ్చన్న అంచనాలున్నాయి. మృతదేహాలున్న ప్లాస్టిక్ బ్యాగులు ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణల్లో గుట్టలుగా పడి ఉన్నాయని, అంబులెన్సులకు బదులుగా వీటిని తరలించేందుకు 18 చక్రాలుండే సెమీ ట్రయిలర్లను వాడుతున్నారని పేర్కొంది. జనవరి 21న సుప్రీం నేత ఖమేనీకి అందించిన సమాచారం ప్రకారం నిరసనల్లో 3,117 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఆస్పత్రుల రికార్డుల ఆధారంగా చూస్తే 30,304 మంది మృతుల్లో 5,459 మంది వివరాలను మాత్రమే ఇప్పటి వరకు ధ్రువీకరించారు. -
ట్రంప్ ఓవరాక్షన్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తన వల్లే ఇరాన్లో నిరసనకారులకు మరణ శిక్షలు ఆగిపోయాని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదని ఓ అధికారి చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. వందల మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్ష విధించాలని ఖమేనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అమెరికా ఒత్తిడి వల్ల అక్కడి అధికారులు దాదాపు 800 మందికి మరణ శిక్షను రద్దు చేశారు. అమెరికా కల్పించుకోకపోయి ఉంటే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు. వారి ఉరిశిక్షలను నేనే ఆపాను. నేను తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గింది అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన అధికారి స్పందించారు. ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని క్లారిటీ ఇచ్చారు. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఎవరికీ ఉరిశిక్షలు విధించలేదని తెలిపారు. అరెస్టు చేసిన వారి సంఖ్య కూడా అంత మొత్తంలో లేదన్నారు. దీనిపై తప్పుడు వార్తలు, ప్రకటనలను ప్రచారం చేయొద్దని అంతర్జాతీయ మీడియా వర్గాలకు సూచించారు.ఇరాన్లో నిరసనలు.. ఇదిలా ఉండగా.. ఇరాన్లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేశారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్‌లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.రెండు వేల మందికిపైగా మృతిఇరాన్లో నిరసనలో పాల్గొన్న వారిలో రెండువేల మందికిపైగా మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. -
ట్రంప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. ఇలా మోసం చేస్తాడనుకోలేదు
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు.. ప్రపంచాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకసారి సైనిక చర్యకు సిద్ధమని.. మరోసారి శాంతి చర్చలని.. ఇంకోసారి ఇరాన్ నాయకత్వాన్ని పొగుడుతూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులే అందుకు కారణం. దీంతో ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఆయన సరిగా అంచనా వేయలేకపోయారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. అదే సమయంలో.. పోటస్(President of the United States) ట్రంప్ ఫేస్ చూసి ఇరాన్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తమ దేశంలో తలెత్తిన సంక్షోభంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని.. ఖమేనీని గద్దె దించుతుందని.. తమకు స్వేచ్ఛ లభిస్తుందని వాళ్లు బలంగా నమ్మారు. ఆ ఆశతోనే నిరసనల్లో ఉవ్వెత్తున పాల్గొని మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో ప్రాణాలు పోతున్నా.. అరెస్టులు జరిగినా లెక్క చేయలేదు. అయితే తమను ఇంతలా రెచ్చగొట్టిన ట్రంప్.. చివరకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని తిట్టిపోస్తున్నారు. ఆ ప్రకటన తర్వాతే.. మతపరమైన పాలనపై ఎప్పటి నుంచో ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ఆర్థిక సంక్షోభం తోడైంది. సోషల్ మీడియా ప్రచారం ద్వారా డిసెంబర్ 28న రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనలు మొదలయ్యాయి. అదే సమయంలో వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి తీసుకెళ్లింది. ఇది సాధారణంగానే ఇరాన్ ప్రజలకు ఆశలు పుట్టించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. అప్పటికే రోడ్డెక్కిన ఆందోళనకారులకు ట్రంప్ ప్రకటనలు బలాన్ని ఇచ్చాయి. ‘‘సహాయం వస్తోంది.. నిరసనలు కొనసాగించండి’’ అని.. ‘‘లాక్డ్ అండ్ లోడెడ్’’ అంటూ చేసిన సో.మీ. పోస్టులు చూసి వేల మంది రోడ్డెక్కారు. అయితే నిరసనలు మళ్లీ ఉధృతం కావడంతో ఇరాన్ ప్రభుత్వం పాత పద్ధతులను అనుసరించింది. కమ్యూనికేషన్లు నిలిపివేయడం, భద్రతా బలగాలను మోహరించడం, కాల్పులు జరపడం. దేశవ్యాప్తంగా స్నైపర్ దాడులు, మెషిన్ గన్ కాల్పులు, వందలాది మరణాలు, అదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో.. ప్రజలు ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని బలంగా ఫిక్సయ్యారు. సరిగ్గా అప్పుడే..అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ నుంచి ఇరాన్‌కు యుద్ధ విమానాలు రెడీ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఏ క్షణమైనా అమెరికా తమ భూభాగంపై దాడులు జరుపుతుందని ఆకాశం వంక చూడసాగారు. అనూహ్యంగా ట్రంప్ వెనక్కి తగ్గి.. ‘‘ఇరాన్ నాయకత్వం ఆందోళనకారుల ఉరి శిక్షలు ఆపుతామని హామీ ఇచ్చింది.. అందుకు కృతజ్ఞలు అని చెబుతూ సైనిక చర్య జరగదని పరోక్షంగా చెప్పేశారు. ఈ ప్రకటన ఇరాన్ నిరసనకారులకు గట్టి షాక్ ఇచ్చింది.ట్రంప్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్ నిరసనలను కొందరు అధికారులు ఎగతాళి చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్నవాళ్లకు ఇక చుక్కలు చూపిస్తామంటూ కొందరు బాహటంగానే ప్రకటిస్తున్నారు. దీంతో చాలా మంది భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఇరాన్లో నిరసనలు చాలా వరకు చల్లారాయి. మళ్లీ జరుగుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలిపశువుల్ని చేశారా?ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని భావించామని.. కానీ, చివరకు ఆయనొక బిల్డప్ బాబాయ్‌గా తేలిపోయిందని గాలి తీస్తున్నారు ఇరాన్ ప్రజలు. ఓ అంతర్జాతీయ మీడియా అక్కడి ప్రజలను ఇంటర్వ్యూ చేసింది. ఆందోళనల్లో వేలమంది మరణించారు. ఆ మరణాలకు ట్రంపే బాధ్యుడు అంటూ ఓ వ్యాపారి తెలిపాడు. అమెరికా అధ్యక్షుడి పిలుపుతోనే వేలమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చివరికి ఆయన మా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మమ్మల్ని మోసం చేశాడు అని ఆరోపించింది మరో మహిళ. మరికొందరేమో.. ట్రంప్ తమను బలిపశువుల్ని చేశాడంటూ తిట్టిపోస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ట్రంప్ వెనకడుగు వ్యూహాత్మకమని.. ఇరాన్ ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేసి దెబ్బ తీస్తాడని చెబుతుండడం కొసమెరుపు. -
ఖమేనీని సాగనంపాల్సిందే
వాషింగ్టన్: ఇరాన్లో సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ శకం పరిసమాప్తి కావాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. పొలిటికో వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్ అంశంపై మాట్లాడారు. ‘‘ఇరాన్లో నూతన నాయకత్వం తెరమీదకు రావల్సిన తరుణం ఆసన్నమైంది. ఖమేనీని సాగనంపాల్సిందే’’అని అన్నారు. తమ దేశంలో హింసకు ట్రంపే కారణమని ఖమేనీ పలుమార్లు ఆరోపణలు గుప్పించిన వేళ ఇరాన్లో నాయకత్వ మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలుచేయడం ఇదే తొలిసారికావడం విశేషం. ‘‘దేశంలో అత్యున్నత పరిపాలనా హోదాలో కొనసాగుతూ కూడా దేశం సర్వనాశనమవుతుంటే ఆయన(ఖమేనీ) పట్టించుకోలేదు. పైగా పోలీసు చర్యతో ఉద్యమాలను అణచివేస్తూ హింసను ప్రోత్సహించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో హింసాత్మక ఘటనలకు కారకుడయ్యారు. నాయకులు నాలా దేశాన్ని సవ్యంగా పరిపాలించడంపై దృష్టి సారించాలి. అధికారంలో కొనసాగేందుకు ఆయనలాగా నేను వేలాది మందిని చంపలేదు. అసమర్థ ఖమేనీకి పరిపాలించే అర్హత లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ట్రంప్ ఓ నేరగాడు
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో సంభవించిన ప్రజల మరణాలు, విధ్వంసాలకు ఆయనే కారణమన్నారు. నిరసనలకు ఆజ్యం పోసింది ట్రంపేనంటూ నిందించారు. ఇటీవల తలెత్తిన అశాంతి వెనుక అమెరికా హస్తం ఉందన్నారు. ఇరాన్‌ను అస్థిరపర్చడం ద్వారా పైచేయి సాధించాలన్నదే ఆ దేశం లక్ష్యమన్నారు. అయితే, తమ దేశాన్ని బలవంతంగా యుద్ధంలోకి నెట్టలేరని కుండబద్దలు కొట్టారు. విధ్వంసానికి కారణమైన దేశీయ, విదేశీ నేరగాళ్లను శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. ఇరాన్ ఎంతో సంయమనం పాటిస్తోందని, అదే సమయంలో హింసకు కారణమైన వారిపై సహనంచూపే ప్రసక్తే లేదన్నారు. ‘దేశంలో జరుగుతున్న ఆందోళనల విషయంలో ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. విధ్వంసాలకు పాల్పడే వారిని ఇరానియన్లుగా పేర్కొన్నారు. నిరసనలపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేశారు. సైన్యాన్ని మద్దతుగా పంపుతామంటూ ఉసిగొల్పారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ద్వారా అశాంతికి ఆజ్యం పోశారు’అని ఖమేనీ విమర్శించారు. అంతర్గత, బాహ్య శత్రువులపై తీవ్ర స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. అల్లర్లను కఠినంగా అణచివేయడంతోపాటు రెచ్చగొట్టే వారి వెన్ను విరుస్తామన్నారు. అశాంతికి కారణమైన లోపలి, బయటి నేరగాళ్లను వదలబోమని తెలిపారు.రెండు రోజుల్లోనే 12 వేల మందిదేశంలో తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆందోళనలను కఠినంగా అణగదొక్కేందుకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్లోని కుద్స్ బలగాలు, అనుబంధ సాయుధ గ్రూపులు రంగంలోకి దిగినట్లు చెబుతు న్నారు. ఈ నెల 8, 9వ తేదీ రాత్రుల్లోనే కనీసం 12 వేల మందిని ఇవి పొట్టన బెట్టుకున్నాయని సమాచారం. అధికారిక సమాచారం, ఆస్పత్రుల్లో డేటా ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు ఇరాన్ ఇంటర్నేనల్ అనే మీడియా సంస్థ పేర్కొంది. అయితే, నిరసనల్లో ఇప్పటి వరకు 3,090మంది చనిపోయినట్లు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మృతుల్లో 2,885మంది నిరసన కారులున్నారంది. ఇలా ఉండగా, శనివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 8 గంటల సమయంలో జాతిని ఉత్తేజపరిచేలా నినాదాలు చేయాలని ప్రజలకు అమెరికాలో ఉన్న రాజ కుటుంబ వారసుడు రెజా పహ్లావీ పిలుపునిచ్చారు. -
ఖమేనీ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో నిరసనల్లో అరెస్టైన వందలాది మందిని ఉరి తీయాలని తొలుత అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ పరిణామం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే.. ఏమైందోగానీ వాటిని వాయిదా వేసింది. అయితే.. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేసిందట. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా ప్రకటించారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇలా చెప్పుకొచ్చారు.. నిన్న జరగాల్సిన 800కిపైగా ఉరి శిక్షలను ఇరాన్ నాయకత్వం రద్దు చేసింది. ఈ పని చేసినందుకు ధన్యవాదాలు. ఈ చర్యతో వాళ్లపై గౌరవం పెరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. నిన్న మొన్నటిదాకా సైనిక చర్యకు ఉవ్విళ్లూరిన ట్రంప్.. హఠాత్తుగా ఇలా వెనక్కి తగ్గడం అమెరికా–ఇరాన్ సంబంధాల విషయంలో ఒక కొత్త మలుపు అనే చెప్పొచ్చు.ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు, రాజకీయ ఆంక్షలు, మహిళల స్వేచ్ఛ అణచివేత.. ఈ కారణాలతో ఇరాన్ వ్యాప్తంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగాలని.. బహిష్కృత యువరాజు రెజా పహ్లావి తిరిగి ఇరాన్లో అడుగుపెట్టాలని నినాదాలతో ప్రధాన నగరాలను అట్టుడికి పోయేలా చేశారు. అయితే వేలాది మంది నిరసనకారులు అరెస్టు అయ్యారు. వాళ్లను విదేశీ శక్తులకు సహకరించే శక్తులుగా పేర్కొంటూ ఉరి తీయాలని ఖమేనీ ప్రభుత్వం, అక్కడి న్యాయవ్యవస్థ నిర్ణయించింది. ఇదీ చదవండి: ఎప్పుడేం చేయాలో ట్రంప్‌నకు తెలుసు ‘‘ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేశాం. గూఢచర్యం నేరానికి ఇరాన్లో మరణశిక్ష ఉంటుంది. మేం అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారు. వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులు’’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి.అమెరికా అధ్యక్షుడు కూడా ముందుగా ఇరాన్ చర్యలపై హెచ్చరికలు జారీ చేసి.. శిక్షలు అమలు చేస్తే సైనిక చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అదే సమయంలో ఇరాన్‌తో చర్చలు ఉండొచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆందోళనకారుల విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ ప్రకటించడంతో ఆయన మరోసారి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే ఈ విషయంలో ఇరాన్ అనూహ్యంగా వెనక్కి తగ్గడం, ట్రంప్ ధన్యవాదాలు తెలపడం ఒక విధంగా ఉద్రిక్తతలను తగ్గించే సంకేతంగా కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వం విషయంలో ఏం జరిగిందో ఎవరికీ స్పష్టత లేదు. గల్ఫ్ దౌత్యం చేశాయని ప్రచారం ఉంది. అయితే ఎలాంటి ఒప్పందం కుదిరిందో(అణు చర్చకు సంబంధించి), లేదంటే చర్చల పురోగతిలో ఇది ముందడుగు మాత్రమేనా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ తాను చేసిన ఒత్తిడి వల్లే ఇరాన్ ఈ నిర్ణయం వెనక్కి తీసుకుందని కలరింగ్ ఇచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు.. అంతర్జాతీయంగా ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చి ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేశామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించుకుంది కూడా. కొసమెరుపు.. ఒకవైపు నిరసనకారుల మరణశిక్ష విషయంలో ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గగా.. వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. రాజధాని టెహ్రాన్‌కు చెందిన అహ్మద్ ఖటామీ అనే మతాధికారి శుక్రవారం ప్రార్థనల అనంతరం.. ‘‘ఇది దేవుని తీర్పు. అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అంటూ జనం కోలాహలం మధ్య ప్రకటించాడు. -
ఇరాన్‌పై దాడులు లేనట్లే!
వాషింగ్టన్: ఇరాన్ విషయంలో పూర్తి సంయమనం పాటించాలని అమెరికాతో సన్నిహితంగా మెలిగే పలు మధ్య ప్రాచ్య దేశాలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇరాన్‌పై దాడులు చేయొద్దని అమెరికాను కోరినట్లు అరబ్ దౌత్యవేత్త ఒకరు చెప్పారు. అయతొల్లా అలీ ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్‌పై సైనిక చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా సంకేతాలిస్తున్నారు. నిరసనకారులపై దమనకాండ ఆపకపోతే భీకర దాడులకు దిగుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల ఈజిప్టు, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయాదేశాల అత్యున్నత దౌత్యవేత్తలు తాజాగా సమావేశమై చర్చించుకున్నారు. ఇరాన్‌పై ఇప్పుడు సైనిక చర్యకు పాల్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను మరింత అస్థిరంగా మార్చొద్దని విన్నవించారు. మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తిని ట్రంప్ మన్నించినట్లే కనిపిస్తోంది. ఆయన కొంత మెత్తబడ్డారు. ఇరాన్‌పై దాడులకు దిగే ఆలోచన లేదని ప్రకటించారు. సానుకూల సంకేతాలు రావడంతో గురువారం చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సుల్తానీకి విధించిన మరణ శిక్షను ఇరాన్ ప్రభుత్వం రద్దు చేయడంపై ఫాక్స్న్యూస్లో ప్రచురితమైన వార్తను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఎప్పుడేం చేయాలో ట్రంప్‌కు తెలుసు మరోవైపు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ భిన్న స్వరం వినిపించారు. ఇరాన్‌ను డీల్ చేసే విషయంలో అన్ని రకాల ఐచి్ఛకాలు ట్రంప్ చేతిలో ఇప్పటికీ ఉన్నాయని స్పష్టంచేశారు. ఎప్పుడేం చేయాలో ఆయనకు తెలుసని ఉద్ఘాటించారు. ఇరాన్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. ఆగని ఆందోళనలు ఇరాన్లో పరిస్థితులు కుదుటపడే సూచనలు కనిపించడం లేదు. ఖమేనీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం వీధుల్లోకి వచి్చ, ఖమేనీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటిదాకా కనీసం 2,637 మంది మరణించారు. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని స్థానిక ప్రసార మాధ్యమాలు చెబుతున్నాయి. ఆ ఆలోచన ఇంకా ఉంది ఇరాన్ సైనిక చర్య అనే ఆలోచన ఇంకా ఉందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ పేర్కొన్నారు. గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశం జరిగింది. అమెరికాతోపాటు ఇరాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మైక్ వాల్జ్ వ్యాఖ్యానించారు. ఇరాన్లో ప్రజల ఊచకోతను ఆపడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అందుకోసం అన్ని రకాల అవకాశాలను ఆయన ఉపయోగించుకుంటారని, ఆ విషయం ఇరాన్ నాయకత్వానికి బాగా తెలుసని స్పష్టంచేశారు. -
దాడులకు అమెరికా రెడీ!
దుబాయ్/వాషింగ్టన్/బ్యాంకాక్/న్యూఢిల్లీ: ఇరాన్‌తో వాణిజ్యంచేసే దేశాలపై పాతిక శాతం సుంకాలువేసి టారిఫ్‌ల కొరడా ఝళిపించిన ట్రంప్ సేన హఠాత్తుగా సుంకాల మాటెత్తకుండా సైన్యంతో దండెత్తబోతోందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరం నుంచి పెద్దసంఖ్యలో బలగాలు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేయొచ్చనే ముందస్తు అంచనాతోనే తమ సైన్యాన్ని స్థావరం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని, దాడి ఉద్దేశం తమకు లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఆందోళనకారులపై కాల్పులు జరిపితే కన్నెర్ర జేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా తమ స్థావరం మీదనే ఇరాన్ దాడులకు దుస్సాహసం చేస్తే చూస్తూ ఊరుకోబోడని, ఇరాన్ కంటే ముందే దాడులతో విరుచుకుపడతాడని అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తొలుత వందల్లో కన్పించిన మరణాలు ఇప్పుడు వేలల్లో తేలుతున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మొదలైన ఆందోళనల్లో, పోలీసులతో ఘర్షణల్లో ఇప్పటిదాకా 2,571 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 2,403 మంది ఉద్యమకారులు కాగా 147 మంది పోలీసులు ఉన్నారు. ఉద్యమంలో పాల్గొనని, అభంశుభం ఎరుగని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు సైతం ఈ ఘర్షణల్లో చనిపోయారని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘ ది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజె న్సీ’ బుధవారం ప్రకటించింది. ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచేస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా 18,100 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. దీటుగా బదులిస్తాం.. దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికాకు దీటుగా బదులిస్తామని ఖమేనీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖమేనీ సలహాదారు అలీ షామ్‌ఖానీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘గతంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేశామని ప్రగల్భాలు పలికే ట్రంప్.. మేం మీ అల్ ఉదేయిద్ స్థావరంపై క్షిపణులతో దాడి చేసి వినాశనం సృష్టించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?. ఆనాటి మా దాడి మా సంకల్పం, సామర్థ్యాలకు బలమైన నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టార్‌లింక్ నుంచి ఉచిత ఇంటర్నెట్ సేవలు ఉద్యమకారులపై పోలీస్‌ల దమనకాండతో రక్తసిక్తమవుతున్న ఇరాన్లో వాస్తవ పరిస్థితులు ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఎప్పటికప్పుడు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎలాన్ మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ సంస్థ ఉచితంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందిస్తోందని ఉద్యమకారులు బుధవారం వెల్లడించారు. అయితే ఈ వార్తలను స్టార్‌లింక్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ‘‘టెహ్రాన్ ఫోరెన్సిక్ వైద్య కేంద్రం వరండాలో వరసబెట్టి మృతదేహాలు పడి ఉన్నాయి. ఇలాంటి దారుణోదంతాలను బయటి ప్రపంచానికి తెలియజేయాలంటే కనీసం ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. ఈ విషయంలో స్టార్‌లింక్ పాత్ర కీలకం’’ అని ఇరాన్‌లోని మెహ్దీ యాహ్యానిజాద్ అన్నారు.ఇరాన్‌ను వీడాలన్న భారత్పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇరాన్‌లోని తమ పౌరులు, భారతీయు లు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమస్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదావేసుకోవాలని భారత్‌లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది. -
ఇరాన్‌పై యుద్ధం.. హింట్ ఇచ్చిన ట్రంప్?!
టెహ్రాన్: ఇరాన్లో నరమేధం సృష్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారా? ఇరాన్‌పై రాకెట్ దాడులు జరపడానికి అమెరికా సన్నద్ధమవుతోందా?. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి, ఆయన స్థానంలో ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించేందుకు మంతనాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం కారణంగా పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై కాల్పులు జరిపి, ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ ప్రభుత్వంపై దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చడం, రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు, ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీయాలని జారీ చేసిన ఆదేశాలు, ట్రంప్ హెచ్చరికలు.. ఈ పరిణామాల మధ్య ఏం జరగనుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇరాన్ చర్యలకు ధీటుగా స్పందించాలని అమెరికా భావిస్తోంది. అయితే, తమ దేశంపై దాడి జరిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, టర్కీ వంటి దేశాల్లో ఉన్న తమ సైనిక స్థావరాల నుండి అమెరికా సిబ్బందిని ఖాళీ చేస్తోంది. అమెరికా దాడులు జరిగితే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మాజిద్ మౌసావి ప్రకటించారు.డిసెంబర్ 28 నుంచి కొనసాగుతున్న నిరసనలను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం నిరసనకారుల ప్రాణాలు తీస్తోంది. ఇలాగే కొనసాగితే అయతొల్లా ప్రభుత్వానికి హాని కలిగిస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం 3,000 మంది పౌరులు మరణించారని చెబుతుండగా, ప్రతిపక్ష ఛానల్ ఇరాన్ ఇంటర్నేషనల్ 12,000 మందికి పైగా మరణించారని నివేదించింది. -
ఇరాన్లో పరిస్థితి అంత ఘోరంగా ఉందా?
ఇరాన్ కల్లోలంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా స్పందించారు. నిరసనకారులను ఉరి తీస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో.. అక్కడి నిరసనకారులకు సాయం అందించే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు తమ దేశంలో అలజడిపై ఇరాన్ సైతం సంచలన ఆరోపణలకు దిగింది. అరెస్టైన నిరసనకారుల్లో ఇర్ఫాన్ అనే వ్యక్తిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆందోళనలు కొనసాగితే.. మరికొందరికి అదే పరిస్థితి తప్పదంటూ ఖమేనీ ప్రభుత్వం హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ Truth Socialలో స్పందించారు. అలాంటిదే జరిగితే అమెరికా ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ‘‘నిరసనలు కొనసాగించండి.. సహాయం వస్తోంది’’ అని ఇరానీయులకు పిలుపునిచ్చారు. అయితే ఆ సహాయం ఏ రూపంలో ఉంటుందో మాత్రం ట్రంప్ వివరించలేదు.దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. వేలాది మంది మరణించి ఉండవచ్చని మానవహక్కుల సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఇంటర్నెట్ బ్లాక్అవుట్, కాల్పులు, అరెస్టులు, మరణశిక్షలు వంటి చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రకారం.. ఇప్పటివరకు 734 మంది మరణించారు. కానీ అసలు సంఖ్య వేలల్లో ఉండవచ్చని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా భారీగానే ఉన్నారని చెబుతున్నాయి. అమెరికా ఆధారిత హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం ఇప్పటివరకు 2,403 మంది నిరసనకారులు మరణించగా.. ఇందులో 12 మంది మైనర్లు ఉన్నారు. మొత్తంగా ఇప్పటిదాకా 18,137 మందిని అరెస్టు చేశారు. అయితే.. ఇరాన్‌కు చెందిన ఓ టెలివిజన్ సంస్థ వేలమంది శవాలుగా మారిపోయారంటూ కథనం ఇవ్వడం సంచలనాత్మకంగా మారింది. అయితే.. ఆందోళనకారుల మరణాల సంఖ్యను నిర్ధారించని ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా బలగాల మరణాలను మాత్రం అమరవీరులుగా ప్రకటించి.. పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహిస్తోంది. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ల హస్తం ఉందని చెబుతూ.. కౌంటర్ వార్నింగులు ఇస్తున్నారు. ట్రంపే ఈ హత్యలకు కారణమంటూ తీవ్ర విమర్శలు చేస్తూ టెహ్రాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో రాజకీయ అస్థిరతను ట్రంప్ ప్రొత్సహిస్తున్నారని.. ఇది సార్వభౌమత్వానికి ముప్పు అని యూఎన్‌లో ఇరాన్ రాయబారి వ్యాఖ్యానించారు. జరగబోయే పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్‌లు సమిష్టిగా బాధ్యత వహించాల్సిందేనన్నారాయన. అయితే ఒకవైపు అణచివేత ద్వారా తన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే.. ప్రజల నుంచి తమకు మద్దతు ఉందని చూపేలా ర్యాలీలను ఖమేనీ ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది కూడా. అయితే.. నిరసనకారులపై కఠిన చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి దారితీస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ సహా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించే ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఓ అడుగు ముందుకేసి ఖమేనీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఖమేనీ ప్రభుత్వ పతనం ఖాయమైనట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే.. విశ్లేషకులు మాత్రం ఇరాన్ పాలన తక్షణమే కూలిపోతుందని చెప్పడం తొందరపాటు అవుతుందని, అణచివేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే కొనసాగుతున్నాయని అంటున్నారు. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. అతడికి ఉరిశిక్ష
టెహ్రాన్: ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆందోళన తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటికే దాదాపు 600 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్.. సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి మొదటి ఉరిశిక్షను అమలు చేయడానికి ఇరాన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానీకి త్వరలో మరణశిక్ష అమలు కానుంది. దీంతో, ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, వివరాల మేరకు.. టెహ్రాన్ శివారులోని కరాజ్ సమీపంలోని ఫర్దిస్కు చెందిన సోల్తానీ జనవరి ప్రారంభం నుండి ఇరాన్ అంతటా వ్యాపించిన అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేక నిరసనలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జనవరి 8వ తేదీన సోల్తానీ అరెస్టు అయ్యాడు. అయితే, ఇరాన్లో నిరసనల నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరసనకారులను హెచ్చరించే క్రమంలో సోల్తానీకి మరణ శిక్షను విధించారు. ఒక మానవ హక్కుల సంస్థ, మీడియా నివేదికల ప్రకారం.. సోల్తానీకి విధించిన శిక్ష బుధవారం అమలు కానుంది. కాగా, గతంలో ఇరాన్ అసమ్మతిని అణచివేయడానికి మరణశిక్షను ఒక సాధనంగా ఉపయోగించినప్పటికీ, ఆ మరణ శిక్షలు ఎక్కువగా కాల్చివేతల ద్వారానే అమలు చేయబడ్డాయి. కానీ, ప్రస్తుత నిరసనలలో మాత్రం మొదటిసారిగా సోల్తానీని ఉరితీయనున్నట్టు సమాచారం. నిరసనల కారణంగా ఇరాన్లో ఇప్పటి వరకు దాదాపు పదివేల మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. Erfan Soltani is scheduled to be executed by hanging in Iran in 48 hours.He was arrested in Karaj on January 9 for taking part in the protests. His family was given just 10 minutes to say goodbye. No lawyer. No fair trial. Days later, the Islamic regime sentenced him to death.… pic.twitter.com/jxRwCJznpj— Sarah Raviani (@sarahraviani) January 12, 2026కుబుంబ సభ్యుల ఆందోళన.. మరోవైపు.. ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన వార్తా సంస్థ జెఫీడ్ నివేదించిన ప్రకారం సోల్తానీ కేసు తదుపరి విచారణలను నిరోధించే లక్ష్యంతో వేగంగా మరణ శిక్షను అమలు చేయాలని అక్కడి అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఇక, నార్వేలోని కుర్దిష్ పౌర హక్కుల సంస్థ ఈ మరణ శిక్ష అమలుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. సోల్తానీ అరెస్ట్ అయిన నాటి నుంచి అతడిని న్యాయవాది సంప్రదించడం, తన వాదనలను వినిపించే అవకాశం కూడా దక్కలేదు. అరెస్టు చేసిన అధికారి గుర్తింపుతో సహా కేసులోని కీలక అంశాల గురించి అతని కుటుంబానికి కూడా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. కానీ, షెడ్యూల్ ప్రకారం అతడికి మరణ శిక్ష అమలు చేస్తామని అధికారులు తమకు తెలియజేశారని సుల్తానీ కుటుంబ సభ్యులు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.అనుకూల ప్రదర్శనలు.. తాజాగా ఇరాన్లో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు మొదలయ్యాయి. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్ ప్రభుత్వం సోమవారం లక్షల మంది ప్రభుత్వ మద్దతుదారులను వీధుల్లోకి సమీకరించింది. టెహ్రాన్‌లోని ఎంఘెలాబ్ స్క్వేర్ వద్ద వేల మంది ప్రదర్శనకారులు గుమిగూడారు. దేశాధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తదితరులూ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ‘అమెరికన్- ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరాన్ తిరుగుబాటు’గా ఈ ప్రదర్శనలను ఇరాన్ (Iran) అధికారిక మీడియా ప్రసారం చేసింది. కాగా, తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అబ్బాస్ అరాఘ్చి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. -
అమ్మాయిల నోట్లో సిగరెట్.. చేతిలో లైటర్..
టెహ్రాన్: ఇరాన్లో నిరసనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. మరోవైపు.. ఆందోళనల్లో యువతులు సిగరెట్లు తాగుతూ.. ఖమేనీ ఫొటోలను మంటల్లో కాల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.ఇరాన్లో సుప్రీం లీడర్ ఖమేనికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా దేశం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న కరెన్సీ విలువ, విదేశీ మారకం నిల్వలతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. అక్కడ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అంతటి స్థాయిలో మళ్లీ అక్కడ విప్లవ జ్వాలలు రగులుతున్నాయి.మరోవైపు.. మహిళలు తమ హక్కులపై పోరాటం చేస్తున్నారు. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. హిజాబ్ (బురఖా) లేకుండా బయటకు రావద్దనే కఠిన నిబంధనలున్న దేశంలో.. స్కర్టులు, మిడ్డీలు వేసుకుని యువతులు, మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. అంతటితో ఆగకుండగా.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ఏళ్లుగా ఉన్న సిగరెట్ నిషేధాన్ని కాదని.. ఏకంగా సుప్రీం లీడర్ ఫొటోతో సిగరెట్ అంటించుకోవడంపై చర్చ జరుగుతోంది. అక్కడి మహిళలు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. An Iranian girl burns a picture of Ayatollah Khamenei and lights her cigarette, a new trend in Iran! Young Iranian women are leading the revolution against the Islamic regime.pic.twitter.com/UIFYHMPBGA— Dr. Maalouf (@realMaalouf) January 10, 2026అయితే, ఇరాన్లో సుప్రీం లీడర్ ఫొటోను కాల్చడం అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరం. అది కూడా ఫొటోతో సిగరేట్ అంటించుకోవడం ఆ చట్టాల ప్రకారం క్షమించరాని నేరం. అయితే ఈ చర్య ద్వారా మహిళలు ప్రభుత్వానికి, భవిష్యత్ నాయకులకు స్పష్టమైన మెసేజ్ పంపినట్లు స్పష్టమవుతోంది. అక్కడి పురాతన చట్టాలను ధిక్కరిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. మహిళా హక్కులు, స్వేచ్ఛపై ఇస్లాం చట్టాలు విధిస్తున్న నిర్బంధాల గోడలను కూల్చేస్తున్నామని వాళ్లు.. అంత ధైర్యంగా.. తెగింపుతో ఈ విధంగా నిరసనలకు దిగారు. ఇదిలా ఉండగా.. ఖమేనీకి వ్యతిరేకంగా చేసే చర్యలను ఉపేక్షించేది లేదని అధికార వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. మహిళలు తిరస్కార ధోరణిలో ఇలాంటి చర్యలకు దిగటం.. మహిళలపై అణచివేతను ఎప్పటికీ సహించేది లేదని వాదనను బలంగా వినిపిస్తున్నట్లు ప్రపంచానికి సందేశం పంపుతున్నట్లు తెలుస్తోంది.Iranian women burning their hijabs in Tehran tonight. Protesters are also torching property linked to Islamic regime forces, including vehicles, mosques, and even their residences.This is a message not only to the regime, but for the who world to see#Iran #IranRevolution2026 pic.twitter.com/A910OUoJSL— acpcrf (@acpcrf) January 10, 2026ఇక, డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్‌ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు. ఇరాన్‌ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పారిశ్రామీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.These Iranian women are showing their faces, no burkas, no fear...inside Iran....calmly smoking while burning a photo of Khamenei.That takes more courage than the entire Western left-wing feminist class combined.These women aren’t posting slogans or trying to run over law… pic.twitter.com/dZItOJzwzw— Flopping Aces (@FloppingAces) January 9, 2026 -
ఇరాన్ వీధుల్లో మిడ్డీలు, స్కర్టులు!
మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీ..వ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. మిడ్డీలు, స్కర్టులు వేసుకున్న అమ్మాయిలు.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్‌ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు కూడా. 👉ఇరాన్‌ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పరిశ్రమీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉ఇరాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. ఇదే సమయంలో, గతంలో పహ్లవి రాజవంశం కాలంలో ఇరాన్ స్వేచ్ఛ, ఆధునికతతో ప్రసిద్ధి చెందిందని, కానీ కఠిన పాలన, అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉పహ్లవి వంశం రాజవంశ రక్తంలో కాకుండా యుద్ధరంగంలో పుట్టింది. రేజా ఖాన్ అనే సాధారణ నేపథ్యం కలిగిన సైనిక అధికారి.. 1921లో బ్రిటిష్ అధికారుల సహకారంతో కుట్ర చేసి అధికారంలోకి వచ్చాడు. 1925లో క్వాజర్ వంశాన్ని గద్దె దించి.. మజ్లిస్ ఆయనను షాగా ఎన్నుకుంది. ఆ సమయంలో పహ్లవి అనే బిరుదు స్వీకరించి.. ఆధునికీకరణ, సెక్యులర్ జాతీయత లక్ష్యాలతో కొత్త రాజవంశాన్ని ప్రారంభించాడు.👉పహ్లవి రాజవంశ పాలనలో.. వెస్ట్రన్ కల్చర్ మేఘాలు ఇరాన్‌ను ఆవరించాయి. హిజాబ్ నిషేధంతో.. మహిళలు పాశ్చాత్య శైలి దుస్తులకు అలవాటు పడ్డారు. సంస్కరణల పేరిట ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు, రైల్వే వ్యవస్థ, కేంద్ర పాలన బలపరచడం వంటి సంస్కరణలు చేశారు. అయితే.. రాజకీయ అణచివేత, పత్రికా స్వేచ్ఛను కాలరాయడం విమర్శలకు తావిచ్చింది. 👉రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీతో ఆయన సాన్నిహిత్యం కారణంగా.. 1941లో బ్రిటిష్-సోవియట్ దళాలు ఇరాన్‌పై దాడి చేసి ఆయనను రాజీనామా చేయించాయి. ఆయన స్థానంలో కుమారుడు మొహమ్మద్ రేజా పహ్లవి షాగా అయ్యాడు. బలహీన సింహాసనం, విభజిత దేశం, పెరుగుతున్న జాతీయవాదం 22 ఏళ్ల రేజాకు వారసత్వంగా లభించాయి. అదే సమయంలో.. ఇరాన్ చమురు బ్రిటిష్ AIOC కంపెనీ ఆధీనంలో ఉండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో.. 1951లో పార్లమెంట్ మొహమ్మద్ మోసాదేఘ్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. ఆయన చమురు పరిశ్రమను జాతీయికరణ చేయడంతో బ్రిటన్, అమెరికా ఆగ్రహించాయి. 1953లో CIA “ఆపరేషన్ అజాక్స్” ద్వారా మోసాదేఘ్‌ను గద్దె దించి, పహ్లవిని తిరిగి సంపూర్ణ అధికారంతో షాగా తిరిగి కూర్చోబెట్టింది. ఇది పహ్లవి సంపూర్ణ రాజ్యాధికారానికి, అమెరికా ప్రభావానికి ఆరంభంగా నిలిచింది. 👉1960లో.. మొహమ్మద్ రేజా షా వైట్ రివల్యూషన్ పేరుతో సంస్కరణలు చేపట్టాడు, భూసంస్కరణలు (జమీందారుల శక్తి తగ్గించడం), మహిళలకు ఓటు హక్కు, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్య కార్యక్రమాలు, పారిశ్రామికరణ, సైన్యం బలోపేతం చేయడంలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా ఇరాన్లో ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, మధ్యతరగతి పెరుగుదల చోటు చేసుకున్నాయి.👉పాశ్చాత్య సంస్కృతి (ఫ్యాషన్, సినిమాలు) వేగంగా వ్యాపించినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితుల ఏర్పడడాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చినవారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. సావక్ SAVAK అనే షా రహస్య పోలీస్.. విపక్షాన్ని అణచివేసింది.ఆ సమయంలో మతాధికారి అయతొల్లా రుహొల్లా ఖోమేనీ 1964లో షా పాశ్చాత్యీకరణను విమర్శించి ప్రవాసంలోకి వెళ్లాడు.👉ఈలోపు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అసమానతలు, అధికారవాద పాలన, అన్ని కలగలిపి 1978లో భారీ నిరసనలకు దారితీశాయి. శక్తివంతమైన సైన్యం ఉన్నప్పటికీ, షా పూర్తి బలప్రయోగం చేయడానికి వెనుకాడాడు. 1979 జనవరిలో షా దేశం విడిచి పారిపోయాడు. ఇదే అదనుగా ఫిబ్రవరి 1న ఖోమేనీ ప్రవాసం వీడాడు. ఇరాన్ ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కొన్ని వారాల్లోనే పహ్లవి రాజవంశం కూలిపోయి, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది. మొహమ్మద్ రేజా షా 1980లో ఈజిప్టులో ప్రవాసంలో ఉండగానే మరణించాడు. రేజా పహ్లవి ఈ విప్లవం తర్వాత అమెరికాలో స్థిరపడి.. ఇరాన్లో ప్రజాస్వామ్య మార్పు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాడు.👉షా యొక్క అధికారవాద పాలనను మరిచిపోయిన ఇరానీయులు, ముఖ్యంగా ఆ పరిస్థితుల రుచేంటో చూడని యువత.. పహ్లవి కాలాన్ని స్వేచ్ఛలు, ఆర్థిక సౌభాగ్యం, అంతర్జాతీయ ప్రతిష్ఠ కారణంగా గర్వంగా పీలవుతోంది. అదే సమయంలో ప్రవాసంలో ఉన్న షా కుమారుడు రేజా పహ్లవి మళ్లీ ఖమేనీ ఆధ్వర్యంలోని ధార్మిక పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదిగాడు.👉1979 విప్లవం సమయంలో రేజా పహ్లవి వయసు కేవలం 18. పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న ఆయన.. ఇరాన్లో సెక్యులర్ ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పిలుపు తర్వాత ఇరాన్లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో.. ఇరాన్ ప్రజలు మళ్లీ క్రౌన్ ప్రిన్స్ వైపు మొగ్గుచూపుతారనే సంకేతాలు అందుతున్నాయి. 👉ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి వచ్చే వారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మార్-ఎ-లాగోలో జరగనున్న Jerusalem Prayer Breakfast కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12న జరగనుంది. లాత్వియా పార్లమెంట్ ప్రతినిధులు, బ్రెజిల్ ఎంపీ ఎడ్వార్డో బోల్సోనారో కూడా పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ దశలో పహ్లవిని కలవడం సరైనది కాదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే పహ్లవి తనను రాజ్యాధికారంలో కాకుండా రాజ్యాంగ పరిరక్షణలో ఉండే రాజవంశానికి మద్దతుదారుడిగా పేర్కొన్నారు. “మిలియన్ల ఇరానీయులు స్వేచ్ఛ కోరుతున్నారు, కానీ ప్రభుత్వం అన్ని కమ్యూనికేషన్ లైన్లను కట్ చేసింది”.. :::ఖమేనీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పహ్లవి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ రేజా పహ్లవి ప్రొఫైల్- రేజా పహ్లవి (జననం అక్టోబర్ 1960) ఇరాన్ చివరి షా మొహమ్మద్ రేజా పహ్లవి పెద్ద కొడుకు- 1979 ఇరాన్ విప్లవంలో రాజ్యాన్ని గద్దె దింపిన తర్వాత ఆయన కుటుంబం ప్రవాసంలోకి వెళ్లింది.- రేజా పహ్లవి అమెరికాలో పైలట్ శిక్షణ పొందారు, తరువాత USCలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.- ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఫైటర్ పైలట్‌గా సేవ చేయాలని ప్రయత్నించినా, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించింది.అధికారం వద్దంటూనే,. - ఆయన తనను “ప్రజాస్వామ్యానికి మార్పు కోసం జాతీయ మార్గదర్శి”గా పేర్కొంటున్నారు.- ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో ప్రజలు “పహ్లవి తిరిగి వస్తాడు”, “ఖమేనీ గద్దె దింపబడతాడు” అంటూ నినాదాలు చేస్తున్నారు.- ఆయన నాలుగు దశాబ్దాలుగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.- ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, విద్యార్థి సంఘాలతో సమావేశమై ఇరాన్ ప్రజల పరిస్థితిని వివరించారు.- ఆయన Washington Postలో రాసిన వ్యాసంలో, ఇస్లామిక్ రిపబ్లిక్ “1979 తర్వాత ఎప్పుడూ లేనంత బలహీనంగా, విభజితంగా ఉంది” అని పేర్కొన్నారు.- “నేను అధికారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేను, కానీ ప్రజాస్వామ్య మార్పు కోసం మార్గదర్శకుడిగా బాధ్యత వహిస్తాను” అని ఆయన అన్నారు.- ఆయన US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, “ప్రపంచ స్వేచ్ఛా నాయకుడు”గా అభివర్ణించారు.- అయితే ట్రంప్, “ఇప్పుడే ఆయనను కలవడం సరైనది కాదు” అని వ్యాఖ్యానించారు.- 2023లో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును కలవడం వివాదాస్పదమైంది. -
ఆయన్ని సంతోషపెట్టేందుకు ఇరాన్ పరువు తీయొద్దు
తన పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించబోమంటూ ఆందోళనకారుల్ని హెచ్చరించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా చురకలు అంటించారు. శుక్రవారం ఇరాన్ ఆందోళనలపై ఓ వీడియో మేసేజ్‌లో ఖమేనీ స్పందిస్తూ..మన దేశ వీధులను పాడుచేసి.. మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసం రోడ్డెక్కి దేశ పరువు తీయొద్దు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని ఇస్లామిక్ రిపబ్లిక్ సహించబోదు అని వార్నింగ్ ఇచ్చారు. తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన.. ఈ సమయంలో ఇరాన్ యువత ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎలాంటి శత్రువునైనా ఇరాన్ ఎదుర్కొగలుగుతుందని అభిప్రాయపడ్డారు.మీ సంగతి చూస్కోండినిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ పదే పదే ఇరాన్‌ను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ, అగ్రరాజ్యం అధ్యక్షుడికి చురకలంటించారు. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టిపెట్టాలంటూ ట్రంప్‌కు ఖమేనీ హితవు చెప్పారు.ఖమేనీ గద్దె దిగాలంటూ ఇరాన్ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరుగుతున్న ఆందోళనలు.. గత కొద్దిరోజులుగా తీవ్రతరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచిపారిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం వాటిని ఖండించినా.. ఖమేనీ మాత్రం అధికారికంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఆశ్రయం కోసం మాస్కోకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఊహాగాలను తెర దించుతూ ఇవాళ ఆయన ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. 2026 ఆర్థిక బడ్జెట్‌పై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రసంగం సమయంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, తారాస్థాయికి చేరుకున్న నిరుద్యోగ సమస్య, కరెన్సీ విలువ పడిపోవడం,వీటికి తోడు రాజకీయ స్వేచ్ఛకు భంగం కలగడంతో.. ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. టెహ్రాన్, మష్హాద్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా, ఇరాన్లో నూతన సంస్కరణలను డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ప్రజలు రోడ్డెక్కి నినాదాలు చేశారు.డిసెంబర్ 28న మొదలై.. 27 ప్రావిన్సుల్లో 250కి పైగా ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి. ఆందోళనకారుల్ని అణచివేసేందుకు భద్రతా బలగాలు.. టియర్ గ్యాస్, షాట్‌గన్స్, వాటర్ కేనన్లు ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 12 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటిదాకా 35 మంది మరణించారు. వీళ్లలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. సుమారు 1,200 మందికి పైగా అరెస్టు అయ్యారు. భారీగా ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసింది ఇరాన్ ప్రభుత్వం. నిరసనకారులను విదేశీ శక్తుల కిరాయి సైనికులుగా అభివర్ణిస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
47 ఏళ్ల నుంచి చచ్చిపోతూనే ఉన్నాను..!
ఇరాన్లో నిరసనల పర్వం తారాస్థాయికి చేరింది. ఇజ్రాయిల్‌తో యుద్ధం అనంతరం ఇరాన్లో రాజకీయ సంక్షోభం ప్రబలింది. ప్రధానంగా ఇరాన్ సుప్రీంలీడర ఆయుతుల్లా ఖమేనీ నేతృత్వంలో ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతండటంతో ఆ దేశ ప్రజల ఒక్కసారిగా రోడ్లపైకి పెద్ద ఎత్తున వచ్చి నిరసన బాట పట్టారు. ఇక ఖమేనీ శకం అయిపోయిందని, తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. తమకు స్వేచ్ఛ జీవితం లేదని, ఇరాన్లో చచ్చి బతుకుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 47 ఏళ్లగా చచ్చిపోయే ఉన్నాను..ఒక మహిళ తడిసిన రక్తంతో పెద్ద పెద్దగా అరుస్తూ ఖమేనీ ప్రభుత్వంపై తన నిరసనను వ్యక్తం చేసింది. ఆమె నాలుకపై రక్తం కారుతున్న దృశ్యాలు అత్యంత బాధాకరంగా కనిపిస్తున్నాయి. ‘ నేను 47 ఏళ్లుగా చచ్చిపోయే ఉన్నాను.. ఇంకా భయమెందుకు. ఇంకా కొత్తగా చచ్చిపోయేదేముంది’ అంటూ పెద్దగా కేకలు పెడుతూ నిరసన వ్యక్తం చేయడం అక్కడ ఖమేనీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు అద్దం పడుతోంది. నియంత ఇక లేడు.. ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా ఉండదు..! ఇరాన్ నియంతగా పేరు గాంచిన ఖమేనీ ఇక లేడని, ఆయనకు చెందిన ఇస్లామిక్ రిపబ్లిక్ పార్టీ కూడా ఇక ఇరాన్లో ఉండదని ప్రజలు తమ నిరసన గళం విప్పారు. తాము ఖమేనీ పాలనలో నలిగిపోయే ఉన్నామని, ఇక ఆ పరిపాలన వద్దంటూ కదం తొక్కుతున్నారు. ఖమేనీ స్వచ్ఛదందగా రాజీనామా చేస్తే ఓకే కానీ ఒకవేళ అలా జరగని పక్షంలో తామే గద్దె దింపుతామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నా.. ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. I’m not afraid. I’ve been dead for 47 years this is the voice of a woman in Iran who is fed up with the Islamic republic.47 years ago, the Islamic Republic took our rights and turned a nation into hostages.Today people have nothing left to lose, they rise.Iran is rising. pic.twitter.com/GAawmynE0C— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) January 8, 2026 ఇదీ చదవండి:ఇరాన్లో ఉధృతమైన ‘స్వేచ్ఛా’ స్వరం -
ఇరాన్లో ఉధృతమైన ‘స్వేచ్ఛా’ స్వరం
ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు స్వేచ్ఛ కావాలంటూ ప్రజలు రోడ్లపై నిరసన బాట మరింత ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా చేస్తున్న వారి నిరసన అంతకంతకూ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెబుతూ తీవ్రతరమయ్యింది. అమెరికా డాలర్‌తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి, ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది మరో ‘జెన్‌జీ’ కానుందా?ఇది క్రమంగా జెన్‌జీ(Gen-Z) ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న జీవన వ్యయం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, భద్రతా బలగాల కఠిన చర్యలపై ఆగ్రహంతో ఇరానీయులు వీధుల్లోకి వచ్చి, పాలక ధార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ , అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ ను నిలిపివేసింది. దీనిపై భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా, ప్రజలు ‘స్వేచ్ఛ, స్వేచ్ఛ’ అనే నినాదాలతో తమ నిరసనను మరింత ఉధృతం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందిన ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లవి ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. Iranians have had enough.They want the regime to fall pic.twitter.com/31pKHpNZD2— Visegrád 24 (@visegrad24) January 9, 2026 ఫహ్లవి పిలుపుతో మరింత ఉధృతం..పహ్లవి గురువారం, శుక్రవారం స్థానిక సమయం రాత్రి 8 గంటలకు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో తెహ్రాన్‌లోని పలు ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. ఆయన ఇచ్చిన పిలుపుతో నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. అమెరికాలో ఉన్న పహ్లవి తిరిగి రావాలని ఇరాన్ ప్రజల ఆశాభావంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న పహ్లవి తప్పకుండా తిరిగి వస్తారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. Another video from Dolat Street in #Tehran, capital city of #Iran, shows protesters chanting slogans against the Islamic regime and expressing support for #RezaPahlavi, the leader of Iran’s revolution. #IranProtests pic.twitter.com/AO1SmFq9DT— Babak Taghvaee - The Crisis Watch (@BabakTaghvaee1) January 9, 2026 ట్రంప్‌తో కలిసి పని చేయండి.. పాలనను గాడిలో పెట్టండిఖమేనీతో పాటు, యూరోపియన్ నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి పాలనను గాడిలో పెట్టాలని వాగ్దానం చేయాలని పహ్లవి డిమాండ్ చేశారు. ‘ ‘ఇరాన్ ప్రజలతో మళ్లీ సంబంధాలు ఏర్పడేలా అన్ని సాంకేతిక, ఆర్థిక, దౌత్య వనరులను వినియోగించమని నేను వారిని కోరుతున్నాను, తద్వారా వారి స్వరం మరియు సంకల్పం వినబడేలా, కనిపించేలా అవుతుంది. నా ధైర్యవంతమైన సహచరుల స్వరాలు మూగబారనివ్వకండి’ అని తెలిపారు. BREAKING:The people of Tehran are burning down regime buildings right now. The crowd is MASSIVE. pic.twitter.com/V5j6nwbLb4— 𝐍𝐢𝐨𝐡 𝐁𝐞𝐫𝐠 ♛ ✡︎ (@NiohBerg) January 8, 2026 -
ఇరాన్లో మరింత ఉధృతమైన ఆందోళనలు
‘‘ఇజ్రాయెల్‌తో 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగినప్పుడు కూడా ఖమేనీ ఎక్కడికి పారిపోలేదు. అలాంటి సొంత దేశంలో.. అదీ అక్కడక్కడా జరిగే నిరసనలు చూసి పారిపోతారా?..’’ అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ దేశం విడిచిపోతారన్న కథనాలను ఇరాన్ వర్గాలు ఖండిస్తున్నాయి. కానీ, పరిస్థితులు మాత్రం ఆ ప్రచారంలో కాస్తో కూస్తో వాస్తవం లేకపోలేదని చెబుతున్నాయి. ఇరాన్లో ప్రజా నిరసనల వేళ.. అయతొల్లా అలీ ఖమేనీ అడ్రస్ లేకుండా పోయారు. ఆఖరికి.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఆయన స్పందించడం లేదు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయారని ప్రచారం జోరందుకుంది. కానీ, ఇరాన్ వర్గాలు ఆ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. అయితే మారుతున్న సమీకరణాలు.. పరిస్థితులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఖమేనీ నెక్ట్స్ స్టెప్ గురించి ది టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్లో చెలరేగిన ఆందోళనలను ‘ఫ్లాన్ ఏ’ ద్వారా అణచివేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే.. వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య నేపథ్యంలో ఖమేనీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రజా ఉద్యమం చల్లారకపోయినా.. ఒకవేళ ట్రంప్ జోక్యం చేసుకున్నా.. తక్షణమే దేశం విడిచిపోవాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సదరు కథనం పేర్కొంది. 86 ఏళ్ల ఖమేనీకి, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో తన వారసుడిగా భావిస్తున్న కుమారుడు ముజ్తబా సహా సుమారు 20 మంది బృందంతో ఖమేనీ టెహ్రాన్ విడిచి వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు ప్లాన్ బీ సిద్ధమైనట్లు ది టైమ్స్ పత్రిక సదరు ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశాన్ని కథనంగా ఇచ్చింది. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు 78 నగరాలకు విస్తరించాయి. కనీసం 35 మంది మరణించగా, 1200 మందికి పైగా అరెస్టయ్యారు. అయితే.. భద్రతా బలగాల కాల్పుల్లో పసికందులు కూడా బలయ్యారని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. విదేశీ జోక్యం దాకా పరిస్థితి వస్తే ఆయన తప్పకుండా దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి తరలి పోవచ్చనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అలాంటి ఇలాంటి సంక్షోభం కాదుఇరాన్ కరెన్సీ రియాల్ విలువ 2025 డిసెంబర్లో డాలర్‌కు 42 వేల రియాల్‌కు చేరుకుంది. దీంతో ఆహార ధరలు (72%) ఔషధాల రేట్లు(50%) ఆకాశాన్నంటాయి. 2026 బడ్జెట్లో పన్నులు 62% పెంచే ప్రతిపాదన జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అంతర్జాతీయ ప్రతిస్పందనఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులపై దాడులు జరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్లో ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని సూచించింది.బలహీనంగా ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’.ఇరాన్ మిత్ర బలగాలైన హమాస్, హిజ్బుల్లా, హౌతి తిరుగుబాటుదారులు, సిరియా ప్రభుత్వం గత కొన్నేళ్లలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో అమెరికా–ఇజ్రాయెల్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమి క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది. ఇరాన్‌పై వెనెజువెలా తరహా సైనిక చర్య జరిగితే ఇవి ఎంత వరకు మద్దతుగా నిలుస్తాయనేదానిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.ఖమేనీ పాలనప్రముఖ మత గురువు అయిన ఖమేనీ.. 1979 ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 1981లో అధ్యక్షుడిగా, 1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంటే గత 35 ఏళ్లుగా ఆయన ఇరాన్లో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. ఆర్థిక సంక్షోభం, ప్రజా అసంతృప్తి, అంతర్జాతీయ ఒత్తిడి మధ్య ఖమేనీ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. -
రెడ్ లైన్ దాటితే ఏం చేయాలో మాకు తెలుసు!
ఇరాన్లో కరెన్సీ విలువ పతనంతో మొదలైన ఆర్థిక సంక్షోభం.. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆందోళనలు హింసాత్మక మలుపు తీసుకున్నాయి. భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగి ఇప్పటిదాకా 8 మంది మరణించారు. అయితే ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇవ్వగా.. ఆ దేశం కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే ప్రతిస్పందన మరోలా ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు మరిన్ని నగరాలకు విస్తరించాయని కథనాలు వెలువడుతున్నాయి. పలు చోట్ల భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నది ఆ కథనాల సారాంశం. అయితే శాంతియుతంగా నిరసనలు తెలిపేవారిపై కాల్పులు జరిపితే మేం జోక్యం చేసుకుంటామంటూ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఇరాన్ ఘాటుగా స్పందించింది.ట్రంప్ హెచ్చరికలను తిప్పి కొట్టింది ఇరాన్. తమ దేశ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంటే అది ఘర్షణలకు దారి తీస్తుందని.. ఇరాన్ జాతీయ భద్రత రెడ్‌లైన్ లాంటిదని.. దానిని దాటే ప్రయత్నం చేస్తే ఎక్కడ గురిపెట్టాలో తమకు తెలుసని.. కాబట్టి అమెరికా అలా చేయకపోవడం ఉత్తమం’’ అని ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఒక ప్రకటనలో తెలిపారు.మరోవైపు.. ట్రంప్ బెదిరింపుల అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది ఇరాన్. ఐరాసలో ఆ దేశ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. ట్రంప్ బెదిరింపులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఖండించిన ఇర్వానీ.. అవసరమైతే తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కుల్ని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. ఇరాన్ మరో సీనియర్ నేత అలి లారిజానీ సంచలన ఆరోపణలకు దిగారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంలో నిరసనలను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. ఇరాన్లో విదేశీ జోక్యం జరిగితే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని సొంత ప్రజలను ఉద్దేశించి హెచ్చరించారాయన.ఇరాన్లో నిరసనలు ఏడో రోజుకి చేరాయి. 2022లో మోరల్ పోలీసింగ్ ఘటనతో మరణించిన మహ్సా అమినికి సంఘీభావంగా మహిళా లోకం పెద్ద ఎత్తున ఉద్యమించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరాన్లో ఆ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. -
ఈ మనిషికే అంత సామర్థ్యం ఉంటే.. ఖమేనీ చురకలు
కొంత గ్యాప్ తర్వాత ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అగ్రరాజ్యంలో నడుస్తున్న నో కింగ్స్ నిరసనలను(No Kings Protest) ఉద్దేశించి తన ఎక్స్ ఖాతాలో ఓ సెటైరిక్ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇరాన్ అణుకేంద్రాలను నాశనం చేశానని ట్రంప్ కలలు కంటున్నారని ఖమేనీ అంటున్నారు.ట్రంప్ నియంతృత్వ ధోరణి, ఆ దేశంలో పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలో No Kings నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఖమేనీ ఏమన్నారంటే.. ‘‘అమెరికాలో ఈ మనిషికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో 70 లక్షల మందికిపైగా నినాదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేంత సామర్థ్యమే ఉన్నప్పుడు.. అక్కడి ప్రజల ఆందోళనలు మాన్పించి ఇళ్లకు పంపొచ్చు కదా’’ అని అన్నారు.According to the reports, seven million people are chanting slogans against this individual in different states across America. If you’re that capable, calm them down, send them back to their residences, and don't interfere in the affairs of other countries! pic.twitter.com/zAkusSWdQf— Khamenei.ir (@khamenei_ir) October 21, 2025ట్రంప్ పాలన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నగరాల్లో బలగాల మోహరింపు, పలు పథకాలకు ప్రభుత్వ నిధులను కత్తిరించడం లాంటి చర్యలను ఖండిస్తూ నో కింగ్స్ నిరసనలు జరిగాయి. అక్టోబర్ 18వ తేదీన అమెరికా 50 రాష్ట్రాల్లో.. 2,700 ఈవెంట్లలో లక్షల మంది పాల్గొన్నారు. అయితే దీనిని అమెరికా వ్యతిరేక ర్యాలీగా రిపబ్లికన్ పార్టీ అభివర్ణించింది. అంతేకాదు.. నిరసనకారులపై కోపం ప్రదర్శిస్తూ ఓ ఏఐతో కూడిన డీప్‌ఫేక్ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.ఇక.. ఇరాన్‌తో చర్చల పునరుద్ధరణకు ట్రంప్ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని ఖమేనీ చెబుతున్నారు. ‘‘ట్రంప్ తనను తాను డీల్‌మేకర్ అని చెప్పుకుంటారు. కానీ, బలవంతంగానో, బెదిరింపులతోనో జరిగేది అసలు ఒప్పందమే కాదు. అది దౌర్జన్యం కిందకు వస్తుంది. అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరించా’’అని ఖమేనీ అన్నారు.ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశామని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారంపై ఖమేనీ స్పందిస్తూ..‘‘ మంచిది.. అలాగే కలలు కనమనండి’’అంటూ వ్యాఖ్యానించారాయన.ఇరాన్ అణు కార్యక్రమాలతో తమ దేశానికి ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఈ ఏడాది జూన్‌లో దాడులకు దిగింది. ఆ వెంటనే అణు ఒప్పందం వంకతో అమెరికా బలగాలు కూడా ఇజ్రాయెల్‌కు తోడయ్యాయి. 12 రోజులపాటు ఇరువైపుల నుంచి దాడులు, ప్రతిదాడులతో భారీ నష్టమే వాటిల్లింది. చివరకు.. ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి అమెరికాతో నేరుగా అణు చర్చలు ఉండబోవంటూ ఖమేనీ చెబుతూ వస్తున్నారు. ఇదీ చదవండి: అధ్యక్ష భవనం నుంచి ఇరుకు జైలు గదికి! -
నిత్యం డ్రగ్స్.. రోజంతా మత్తులోనే
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొస్సాద్ సంబంధ సోషల్ మీడియా ఖాతాలో ఇరాన్ సుప్రీం నేత అయెతొల్లా ఖమేనీ గురించి తీవ్ర వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఖమేనీ పాలనకు తగిన వ్యక్తి కారని, డ్రగ్స్‌కు బానిసై ఎప్పుడూ మత్తులోనే జోగుతుంటారని ఆరోపించింది. పర్షియన్ భాషలోని ఈ అకౌంట్‌ను @Mossad Spokesman గా గుర్తించారు. ఇది ‘మొస్సాద్ ఫార్సి’గా కూడా పేరుతెచ్చుకుంది. అచ్చు మొస్సాద్ అధికార చానెల్ అకౌంట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇరాన్ లక్ష్యంగా ఇందులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇరాన్‌కు ఇబ్బంది కలిగించేలా ఆ దేశ ప్రభుత్వ రహస్య సమాచారం వంటివి ఇందులో కనిపిస్తుంటాయి. అంతేకాదు, పలువురు ముఖ్య నేతలు, అధికారుల గురించిన రహస్య క్విజ్ పోటీలను సైతం ఈ అకౌంట్ నిర్వహిస్తుంటుంది. శుక్రవారం @MossadSpokesman ఎక్స్ అకౌంట్లో..‘రోజులో సగం నిద్రకు, మరో సగం డ్రగ్స్‌కు బానిసై గడిపే వ్యక్తి దేశాన్ని ఎలా నడపగలరు?..నీళ్లు, కరెంటు, జీవితం’అంటూ పేర్కొంది. అయితే, ఇందులో ఖమేనీ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇరాన్లో కనీస మౌలిక సదుపాయాలైన నీళ్లు, విద్యుత్ కొరతలతోపాటు నిత్యం కనిపించే ప్రజాందోళనలను పరోక్షంగా పేర్కొంది. ఈ పోస్టుకు 48 గంటల్లోనే 1.80 లక్షల మంది స్పందించారు. గత నెలలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య 12 రోజులపాటు కొనసాగిన సంక్షోభం సమయంలో ఈ అకౌంట్లో ఇరాన్ నూతన సైనిక కమాండర్ ఎవరో చెప్పాలంటూ సవాల్ విసరగా ఒక వ్యక్తి కచ్చితమైన పేరును వెల్లడించడం విశేషం. ఈ అకౌంట్లో గతంలోనూ ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులే ఉండేవి. డ్రగ్స్ వాడే వారు నాయకత్వం వహించగలరా అంటూ ప్రశ్నించింది. ఇందులో ప్రత్యేకంగా అయెతొల్లా ఖమేనీ పేరును ప్రస్తావించనప్పటికీ ఆ తీవ్రత, కంటెంట్‌ను బట్టి ఇరాన్ సుప్రీం లీడరే టార్గెట్ అన్న విషయం తేలిగ్గా ఎవరికైనా అర్థమవుతుంది. పర్షియా భాషలో ఉన్న ఈ పోస్టులను ఆటో–ట్రాన్స్లేషన్తో అందరూ చదవొచ్చు. ఈ అకౌంట్ తమదేనంటూ ఇజ్రాయెల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ఇరాన్ ప్రజలే లక్ష్యంగా మొస్సాద్ నిర్వహించే మెసేజింగ్ చానెల్గానే చెబుతుంటారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ వేళ... గత నెలలో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన వేళ ఈ అకౌంట్ వచ్చిన ఒక పోస్టు తీవ్ర వివాదానికి కారణమైంది. ఇజ్రాయెల్ చేసిన మొట్టమొదటి దాడిలో ఇరాన్‌కు చెందిన ఘొలాం అలీ రషీద్ అనే మిలటరీ కమాండర్ చనిపోయారు. ఆ వెంటనే అలీ షాద్మానీ అనే ఆయన వారసుడు సైతం మృతి చెందారు. ఆయన స్థానంలో కొత్తగా నియమించిన కమాండర్ పేరును ఇరాన్ రహస్యంగా ఉంచింది. ఈ అంశంపై @Mossad Spokesman రెచ్చగొట్టే రీతిలో స్పందించింది. ఆ కమాండర్ ఎవరో తనకు తెలుసునంటూ, కొత్తగా నియమితులైన కమాండర్ పేరును తెలిస్తే చెప్పాలంటూ నెటిజన్లకు క్విజ్ పెట్టింది. ‘ఇరాన్ ప్రభుత్వం ఖతమ్ అల్ అన్బియాకు కొత్త కమాండర్‌ను నియమించింది. భద్రత కోసం ఆయన పేరును వెల్లడించలేదు. మాకు అతడెవరో తెలుసు, అతడితో ఉండే వారి పేర్లూ తెలుసు. దురదృష్టవశాత్తూ ఇటువంటి విషయాలను ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం తెలియనివ్వడం లేదు. ఆ కొత్త కమాండర్ పేరు తెలిస్తే దయచేసి చెప్పండి’అని కోరింది. దీనికి 2,300 మంది స్పందించారు. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ తదితర పేర్లను కొందరు ఊహించి చెప్పగా మరికొందరు మాత్రం తిట్టిపోశారు. తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ సోషల్ మీడియా యూజర్ బెహ్నమ్ గొలిపౌర్ మాత్రం కొత్త కమాండర్ పేరు అలీ అబ్దొల్లాహి అలియాబాది అంటూ కరెక్ట్‌గా గెస్ చేశారు. అతడి పేరును ప్రకటించిన మొస్సాద్ అకౌంట్..వ్యక్తిగతంగా తమను కలిసి, బహుమతి అందుకోవాలని కోరింది. -
ఇజ్రాయెల్ ఓ క్యాన్సర్ కణితి: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నేరాల్లో అమెరికా భాగస్వామి అంటూ విరుచుకుపడ్డారు. టెల్ అవీవ్‌ను క్యాన్సర్ కణితిగా ఆయన అభివర్ణించారు. వాషింగ్టన్ చెప్పినట్లు నడుచుకుంటుందంటూ మండిపడ్డారు. కాగా, ఇజ్రాయెల్‌తో యుద్ధం తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బయటకు రాగా.. జూలై 5న టెహ్రాన్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొలిసారిగా కనిపించారు. ఇరాన్-ఇజ్రాయెల్‌లలో 12 రోజుల పాటు జరిగిన వైమానిక దాడుల కారణంగా ఖమేనీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. మరోవైపు అమెరికాతో అణు చర్చలు జరపనున్న వేళ సుప్రీం లీడర్ తీవ్ర స్థాయిలో స్పందించడం సంచలనం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెలతో గొప్పగా పోరాటం చేశామన్న ఖమేనీ.. మళ్లీ ఎలాంటి దాడులు జరిగినా దీటుగా బదులిచేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇటీవల 12 రోజుల యుద్ధాన్ని ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రారంభించింది.. కానీ విఫలమైంది’’ అంటూ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు.12 రోజుల పాటు జరిగిన తీవ్ర యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇరాన్లో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో వందల మంది మరణించారు. ఇజ్రాయెల్ తన వైమానిక దాడులతో ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతిగా మిస్సైల్ దాడులు చేసి, అమెరికా స్థావరాలపై కూడా దాడి చేసింది. -
నా ప్రాణాలకు ముప్పు నిజమే: ట్రంప్
వాషింగ్టన్: తన ప్రాణాలకు ముప్పు ఉన్న మాట నిజమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డ్రోన్ దాడి చేసి ట్రంప్‌ను అంతం చేస్తామంటూ ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహితుడొకరు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మర్–ఎ–లాగో రిసార్ట్‌లో ట్రంప్ సన్ బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్ ప్రయోగిస్తామని, అదే అనువైన ప్రదేశమని చెప్పారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఇది తనకు వచి్చన బెదిరింపుగానే భావిస్తున్నానని తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయంలో సందేహం లేదన్నారు. వాస్తవానికి ఏడేళ్ల వయసు నుంచి తాను సన్ బాత్ చేయడం లేదని వివరించారు. ఖమేనీ అనుచరుడి హెచ్చరికలను పరోక్షంగా ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. -
ట్రంప్ టార్గెట్‌గా ఇరాన్ భారీ ప్లాన్.. సన్‌బాత్ సమయంలో డ్రోన్‌తో దాడికి..
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్‌గా ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసం సురక్షితం కాదని.. అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ట్రంప్‌ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. దీంతో, ఇరాన్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. మరోవైపు.. ఇరాన్ వ్యాఖ్యలకు ట్రంప్ సెటైరికల్ కౌంటరివ్వడం గమనార్హం.ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా సైన్యం కూడా పెద్దఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో తమపై దాడులకు ట్రంప్, అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించారు. ఇక, తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) సలహాదారు జావద్ లారిజాని తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదు. మార్-ఎ-లాగో రిసార్ట్‌లో అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. ఇది చాలా సులభమైన పని అని వ్యాఖ్యానించారు. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు. స్థానిక మీడియాలో ఆయన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.Larijani: "We can target Trump's navel!"Javad Larijani, in a televised program, said:"Trump can no longer sunbathe in Mar-a-Lago, because while he's lying down, a tiny drone might target his stomach and hit his navel!" pic.twitter.com/QOJfNlWpNL— Radio Faryad (@radiofaryad) July 8, 2025ట్రంప్ కౌంటర్.. ఇరాన్ అధికారి లారిజాని వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. లారిజాని వ్యాఖ్యలను ముప్పుగా భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ట్రంప్ స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలను ముప్పు అనే అనుకుంటున్నా. వాస్తవానికి అది నిజమో, కాదో తెలియదు అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ట్రంప్.. మీరు చివరిసారిగా ఎప్పుడు సన్‌బాత్‌కు వెళ్లారు అని విలేకరి అడగ్గా.. ట్రంప్ నవ్వుతూ తనకు ఏడేళ్ల వయసులో అని సమాధానం ఇచ్చారు. సన్‌బాత్ తనకు అంతగా ఇష్టం ఉండదని నవ్వుతూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బ్లడ్ పాక్ట్ క్రౌడ్ ఫండింగ్..ఇదిలా ఉండగా.. అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్‌గా చాలా విషయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ నాయకత్వానికి శత్రువులుగా భావిస్తున్న వారిపై, ఖమేనీని టార్గెట్ చేసిన వారిపై బ్లడ్ పాక్ట్ అనే ప్లాట్‌ఫామ్ చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్టు సమాచారం. ట్రంప్‌నకు బౌంటీ ఇవ్వాలని బ్లడ్ పాక్ట్ క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు రావడం గమనార్హం. ఇది జులై 8 నాటికి ఇది 27 మిలియన్ డాలర్లను సేకరించినట్టు తెలుస్తోంది. -
ఇన్నాళ్లకు వేదికపై ఖమేనీ.. మారుమోగిన నినాదాలు
టెహ్రాన్: ఇజ్రాయెల్‌తో వివాదం.. ఇరాన్‌లోని అణుస్థావరాలపై అమెరికా భీకర దాడుల అనంతరం తాజాగా ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ఒక బహిరంగ వేదికపై కనిపించారు. టెహ్రాన్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారని సమాచారం. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపధ్యంలో ఇంతకాలం ఖమేనీ సురక్షితమైన ప్రదేశంలో దాక్కున్నారు.తాజాగా ఇరాన్‌లోని షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రం సంతాప దినాలలో ఖమేనీ కనిపించారు. షియా ముస్లిం క్యాలెండర్‌లోని అషురా(మొహరం)ను జరుపుకుంటున్న హాలులోకి ఆయతుల్లా ఖమేనీ ప్రవేశించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ స్టేట్ టీవీ మీడియాకు విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఖమేనీ ఈ కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఖమేనీ సంప్రదాయ నల్లని వస్త్రాలు ధరించి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను చూసిన అక్కడి జనం పలు నినాదాలు చేశారు. 📹 لحظه ورود رهبر انقلاب به حسینیه امام خمینی(ره) در مراسم عزاداری شب عاشورای حسینی#عاشورا pic.twitter.com/09mfwm3qFM— خبرگزاری تسنیم 🇮🇷 (@Tasnimnews_Fa) July 5, 2025జూన్ 14న ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం నేత ఖమేనీ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వైమానిక దాడుల తొలి రోజుల్లో ఖమేనీ రికార్డ్ చేసిన సందేశాలు మీడియాకు విడుదల చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల సమయంలో భద్రతా సమస్యల కారణంగా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే మతపరమైన ఆచారాలను గుర్తుచేసేందుకు ఆయన ప్రసంగాలను ముందే రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇది కూడా చదవండి: పుట్టినరోజు సందేశంలో.. దలైలామా నోటి వెంట ఘన భారతం -
చాలా వెతికాం.. కనిపిస్తే కథ ముగించేవాళ్లం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కోసం చాలా వెతికామని, ఆయన కనబడితే కచ్చితంగా చంపేవాళ్లమని అంగీకరించింది. అయితే ప్రాణ భయంతోనే ఖమేనీ పారిపోయి దాక్కున్నారంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వ్యాఖ్యానించారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కోసం చాలా చోట్ల వెతికామని, జాడ తెలిసి ఉంటే కచ్చితంగా మట్టుపెట్టేవాళ్లమని, కానీ ఆ విషయం తెలుసుకున్న ఖమేనీ లోతైన బంకర్లలో దాక్కున్నారని వ్యాఖ్యానించారాయన. ఖమేనీని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాం. కానీ, ఆయన సురక్షితంగా ఎక్కడో బంకర్లో దాక్కుని క్షిపణి దాడులు చేయించారు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం కిందకే వస్తుంది అని కాట్జ్ అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తులో అలాంటి ప్రయత్నాలు సాగుతాయా? అనే ప్రశ్నకు.. ఆయన మౌనం వహించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీపై కాట్జ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. టెల్ అవీవ్‌పై జూన్ 14వ తేదీన ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 47 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కాట్జ్.. ఖమేనీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖమేనీకి ఇక భూమ్మీద ఉండే హక్కు లేదు అని, ఖమేనీ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని ఆ సమయంలో కాట్జ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా ఖమేనీపై విరుచుకుపడ్డారు. ఖమేనీ అభినవ హిట్లర్ అని, ఆయన ప్రాణాలతో లేకుంటేనే శాంతి నెలకొంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికా మాత్రం ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని చెబుతూ.. ఆయన్ని చంపే ఉద్దేశం లేదని, బేషరతుగా లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. ఖమేనీ తనకు వస్తున్న బెదిరింపులను తేలికగానే తీసుకుంటూ వచ్చారు. ఇరాన్ ఎప్పటికీ లొంగదు, బెదిరింపులకు భయపడదు అని సోషల్ మీడియాలో, ఇటు టెలివిజన్ ప్రసంగంలో పేర్కొంటూ వస్తున్నారు.ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాక.. ఆయన టెహ్రాన్‌ను వీడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలతో సంబంధాలు లేకుండా.. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా.. గట్టి భద్రత మధ్య ఆయన సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ తర్వాత ఆయన జాడ లేదంటూ ఇరాన్ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అయితే అందులో 86 ఖమేనీ కాస్త నీరసంగా కనిపించారు. -
అమెరికా చెంప చెళ్లుమనిపించాం
దుబాయ్: ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు ప్రయోగించి ఇరాన్ తన సత్తాను చాటిందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. దాడులతో అమెరికా చెంప చెళ్లుమనిపించామని ఆయన అన్నారు. యుద్ధంలో మేమే గెలిచామని ఆయన ప్రకటించారు. ఇరాన్‌పై బాంబుదాడులు చేసిన అమెరికాకు ఒనగూరింది శూన్యమని ఆయన ఎద్దేవాచేశారు. మరోసారి ఇరాన్‌పై దాడికి సాహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. యుద్ధం ముగిశాక తొలిసారి ఖమేనీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు హెచ్చరికలు చేస్తూ పది నిమిషాలకుపైగా ఖమేనీ మాట్లాడిన ఆ వీడియోను ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ గురువారం ప్రసారం చేసింది. I offer my congratulations on the victory over the fallacious Zionist regime.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 My congratulations on our dear Iran’s victory over the US regime. The US regime entered the war directly because it felt that if it didn’t, the Zionist regime would be completely destroyed. It entered the war in an effort to save that regime but achieved nothing.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 The fact that the Islamic Republic has access to key US centers in the region and can take action whenever it deems necessary is a significant matter. Such an action can be repeated in the future too. Should any aggression occur, the enemy will definitely pay a heavy price.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025అమెరికా రాకుంటే ఇజ్రాయెల్ ధ్వంసమయ్యేది‘‘యుద్ధంలో ఇజ్రాయెల్‌ను రక్షించేందుకే అమెరికా తప్పని పరిస్థితుల్లో రంగప్రవేశం చేసింది. అమెరికా గనక జోక్యంచేసుకోకపోయి ఉంటే మా దాడుల్లో ఇజ్రాయెల్ దారుణంగా ధ్వంసమయ్యేది. అయినా సరే అమెరికా స్థావరాలపైనా క్షిపణుల్ని ప్రయోగించి మా సత్తా చాటాం. ఖతార్‌లోని దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడులు చేశాం. ఇరాన్‌పై అమెరికా దాడులను ట్రంప్ అతిశయోక్తిగా చెప్తున్నారు. నిజానికి ఇరాన్‌పై దాడులతో అమెరికా సాధించింది శూన్యమే. జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందన్న అంచనాతోనే అమె రికా యుద్ధంలోకి అడుగుపెట్టింది. కానీ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమైంది. మా ఇస్లామిక్ రిపబ్లిక్ జయకే తనం ఎగరేసింది. ఇది అమెరికాకు ఘోర పరాభవం. భవిష్యత్తులో మరోసారి మాపై దాడి చేయాలని అమెరికా భావిస్తే ఇంతకంటే పెద్దస్థాయిలో పరాభవం ఎదుర్కోక తప్పదు’’ అని ఖమేనీ హెచ్చరించారు. అయితే ఈ వీడియోలో ఖమేనీ కాస్తంత నీరసంగా కనిపించారు. -
ఇరాన్ ప్రజల ఆందోళన.. ఖమేనీ ఎక్కడ?
టెహ్రాన్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా సైతం ఆకస్మిక దాడులకు దిగింది. దీంతో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతోందా? అన్న భయాందోళన నెలకొంది. కానీ, అనూహ్య పరిణామాలతో యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. అయితే, వారం రోజులుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటి వరకు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అదృశ్యమయ్యారు. వారం రోజులుగా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో కూడా ఖమేనీ వాయిస్ కూడా బయటకు వినిపించలేదు. దీంతో ఇరాన్ నేతలు, ప్రజలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, యుద్ధం ప్రారంభం తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీని రహస్య భూగర్భ బంకర్‌కు తరలించారని వార్తలు బయటకు వచ్చాయి. ఆయనను ఎవరూ టార్గెట్ చేయకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా ఉంచినట్టు సన్నిహిత అధికారులు చెబుతున్నారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇరాన్ ప్రభుత్వ అగ్రశ్రేణి వ్యక్తులకు కూడా ఆయనతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మంగళవారం ప్రైమ్-టైమ్ ఇరాన్ స్టేట్ టెలివిజన్ షో హోస్ట్ ఖమేనీ కార్యాలయంలో సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి అడిగారు. ఈ సందర్భంగా ప్రజలు సుప్రీం లీడర్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో మాకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కానీ ఫజేలీ.. మాత్రం ఆ ప్రశ్నను పక్కనపెట్టి మనమందరం ప్రార్థన చేయాలి. సుప్రీం లీడర్‌ను రక్షించే పనిలో ఉన్నవారు తమ పనిని చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా ఇరాన్‌ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.చావుకు భయపడే మనిషి కాదు.. ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచ్చితంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం దొరకకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. -
ఇంతకీ గెలిచిందెవరు?
పన్నెండు రోజులపాటు భీకరంగా సాగి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా పయనించిన ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో తామే విజయం సాధించామని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎవరికి వారు ప్రకటించుకున్నారు. తన వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించుకోగా, తమ ప్రయత్నం కారణంగానే సమరం సమసిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.దీంతో ఈ ఘర్షణలో నిజంగా గెలుపు జెండా ఎవరు ఎగరేశారనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విజయం సాధించారనే వాదనా వినిపిస్తోంది. అణుక్షేత్రాలను కుప్పకూల్చి ఇరాన్ కోలుకోలేని దెబ్బతీశానని అమెరికా ప్రకటించుకుంది. సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలుసహా వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లను నాశనంచేసి ఇరాన్‌కు బుద్ధి చెప్పానని ఇజ్రాయెల్ గొప్పలు పోయింది. అమెరికాను సైతం ఎదిరించి పోరాడి తమ సత్తా చూపామని ఇరాన్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధాగ్ని నుంచి ఎవరు ఏ ప్రయోజనాలు పొందారనేది ఆసక్తికరంగా మారింది.ట్రంప్‌కు శాంతిదూతగా మార్కులుఇజ్రాయెల్– హమాస్ యుద్ధం, ఉక్రెయి న్–రష్యా యుద్ధంలో జోక్యం చేసుకుని శాంతిస్థాపనకు శతథా ప్రయత్నించానని ట్రంప్ చెప్పుకున్నారు. అయితే అక్కడ విఫలమైనా ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధాన్ని ఆపి సఫలీకృతుడిని అయ్యానని ట్రంప్ చెబుతున్నారు. శాంతిని కోరుకుంటూనే ఫోర్డో అణుకేంద్రంపై బాంబులేయడమేంటని అమెరికాలోనూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.దోహాలోని తమ స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినా ట్రంప్ సంయమనం కోల్పోలేదు. ఈ విషయంలో ట్రంప్‌కు మంచి మార్కులు పడ్డాయి. శాంతికాముకులు ట్రంప్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. శాంతి నోబెల్ కోసం ఎదురుచూస్తున్న ట్రంప్ ఆశలు ఈ కాల్పుల విరమణతో చిగురించినట్లే భావించాలి.గగనతలంపై ఇజ్రాయెల్ విజయంక్షిపణి లాంచర్లను నాశనం చేయడం ద్వారా ఇరాన్ గగనతలంపై తాము పూర్తి పట్టుసాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇది తన ఘన విజయమని చెప్పారు. ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఉన్నతాధి కారులు, అణు శాస్త్రవేత్తలను అంతంమొందించారు. సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసంచేశారు. అణుకేంద్రాలు, మౌలిక వసతు లను కోలు కోనంతగా దెబ్బ తీశారు.ఇవన్నీ తన విజ యాలేనని నెతన్యా హూ సొంత డబ్బా భజా యించారు. శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టడం ద్వారా ఒక రకంగా నెతన్యా హూ భారీ స్థాయిలో పాపులారిటీ, ప్రజాదరణను పెంచుకున్నారు. వచ్చే ఏడాది తమ దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఈ యుద్ధపర్వం నెతన్యాహూ పార్టీ విజయావకాశాలు అమాంతం పెంచింది. యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్‌ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ విజయం సాధించారు.అగ్రరాజ్యాన్నీ ఢీకొట్టగలనని ఇరాన్ సంకేతంతమ ఉనికే ప్రశ్నార్థకమైతే అగ్రరాజ్యం అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహా యూఎస్ స్థావరంపై క్షిపణి దాడులతో ఇరాన్ నిరూపించింది. ఘర్షణ మరింతగా విస్తరించకుండా గౌరవప్రదంగా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నిష్క్రమించాలో తమకూ తెలుసునని ఇరాన్ రుజువు చేసింది. పశ్చిమాసి యాలో ఎ న్నో దేశాల్లో అమెరికా స్థావరా లున్నా తమకు మిత్రదే శమైన ఖతార్‌లోని స్థావ రం మీదనే ఇరాన్ వ్యూహా త్మకంగా క్షిపణుల్ని ప్రయోగించింది.అమెరికా, ఇరాన్ కయ్యా నికి తమ భూభాగం రణక్షే త్రంగా మారొద్దని ఖతార్ సైతం మధ్యవర్తిత్వానికి ముందుకు రావాలనే వ్యూహంతో ఇరాన్ కేవలం అల్ ఉదేయిద్ బేస్‌పైనే దాడులు చేసింది. వందల కేజీల యురేనియంను దాచిపెట్టి మధ్యవర్తి త్వానికి తన వైపు కొన్ని అస్త్రాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పింది.కొసమెరుపుఇప్పటికే హమాస్– ఇజ్రాయెల్ పోరు, ఉక్రెయిన్–రష్యా రణం, హౌతీ తిరుగుబాటుదారులు చమురునౌకలపై దాడులతో అధిక పెట్రో ధరల కత్తి గుచ్చుకుంటుందన్న భయాలతో ప్రపంచదేశాలు అల్లాడుతున్న వేళ 12 రోజులకే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ కంచికి చేరడం అందరికీ పెద్ద ఊరట. అయితే అంతెత్తున ఎగసిన యుద్ధజ్వాలలు పూర్తిగా ఆరిపోతాయో లేదోనన్న అనుమానాలూ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్నాయి.ఈ దేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న విద్వేషాలను మళ్లీ రాజేసుకుని పశ్చిమాసియా ప్రశాంతతకు గండి కొడతాయేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులతో పాఠం నేర్చుకున్న ఇరాన్ మళ్లీ అత్యంత రహస్యంగా యురేనియంను వేరే చోట శుద్ధిచేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితీ ఉంది. అందుకే వీలైనంత త్వరగా శాంతిచర్చలు మొదలెట్టి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం అత్యావశ్యకం. -
నో సీజ్ ఫైర్ ట్రంప్.. అంతా తుస్!!
ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ముందే క్రెడిట్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాకే తగిలింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే అంతా ఉత్తదేనంటూ ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ఒప్పందం కోసం ట్రంప్ తమను వేడుకున్నారంటూ సంచలన ప్రకటన చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌పై మరోసారి క్షిపణులతో దాడులకు తెగబడింది. పశ్చిమాసియాలో యుద్ధం 12వ రోజుకి చేరగా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ తాజాగా మిస్సైల్స్ ప్రయోగించింది. ఏకంగా 10 మిస్సైల్స్ ప్రయోగించిందని.. ఐదుగురు మరణించారని తెలుస్తోంది. అయితే ఇరాన్ తమపై ఆరు క్షిపణులతో దాడులకు దిగినట్లు ధృవీకరించిన ఇజ్రాయెల్.. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ప్రకటించుకుంది. మరోవైపు.. ఇజ్రాయెల్‌లో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ ప్రకటన ఆయన సొంత అడ్మినిస్ట్రేషన్‌లోని ఉన్నతాధికారులను ఆశ్చర్యపరిచినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. అదే సమయంలో ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మండిపడిన సంగతి తెలిసిందే. కాసేపటికే శాంతి ఒప్పందం కోసం ట్రంప్ వేడుకొన్నారంటూ మరో సంచలన ప్రకటన చేసింది. ‘‘ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్‌లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది. అంతకు ముందు.. కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి, ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము ఆపుతామని స్పష్టం చేసింది.ఇరాన్ ప్రకటనతో సంబంధం లేకుండా ట్రంప్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇరుదేశాలు ఒకేసారి కాళ్లబేరానికి వచ్చాయంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం సాధించామని, అందుకు గర్వకారణంగా ఉందంటూ తన సోషల్ ట్రూత్ అకౌంట్లో వరుస పోస్టులు పెడుతున్నారు. -
చిక్కడు.. దొరకడు!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. దాడులు, ప్రతిదాడులకు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలోకి అమెరికా సైతం అడుగుపెట్టడం అగి్నకి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాపై కత్తులు నూరుతున్న అసలు కథానాయకుడు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నారు? అనేది టాప్ సీక్రెట్‌గా మారింది. దశాబ్దాలుగా ఇరాన్‌ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ‘‘ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ సైతం అన్నారు. చావుకు భయపడే మనిషి కాదు ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచి్చతంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) అత్యున్నత స్థాయి అధికారులకు సైతం ఖమేనీ ఆచూకీ గురించి తెలియదని అంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం ఉప్పందకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. అమెరికా దాడుల తర్వాత బంకర్లోకి.. సాధారణ పరిస్థితుల్లో ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ కాంపౌండ్‌లో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు. మిలటరీ కమాండర్లు, అధికారులతో ప్రతివారం సమావేశమవుతారు. ప్రజలతో మాట్లాడాలన్నా ఇక్కడే. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరు. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్లలేదని సమాచారం. బయటే ఉంటూ ప్రతిదాడికి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అమెరికా సైన్యం యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన బంకర్లోకి చేరుకున్నారు. మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఖమేనీ మరింత అప్రమత్తమయ్యారు. తన విశ్వాసపాత్రులైన అనుచరులు, సహాయకులతోనూ కమ్యూనికేషన్ తగ్గించుకున్నారు. ఫోన్లు ఉపయోగించడం ఆపేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటున్నారు. శత్రువులకు తన ఆచూకీ చిక్కకుండా ఉండడానికే ఈ జాగ్రత్త. శత్రువుల చేతికి చిక్కితే మరణాన్ని చేతులారా ఆహ్వానించినట్లేనని ఖమేనీని బాగా తెలుసు. ఆయనను ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా చేయని ప్రయత్నమే లేదు. ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఎంతోమందిని హత్య చేసింది. కొద్ది రోజుల క్రితమే పేజర్ బాంబులతో హెజ్»ొల్లా నాయకులను మట్టుబెట్టింది. ఖమేనీని మాత్రం కనీసం టచ్ చేయలేకపోయిందంటే ఆయన ఎంత సురక్షితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఏదో ఒకరోజు ఇజ్రాయెల్ నన్ను చంపేయడం ఖాయం. దేశం కోసం వీరమరణం పొందడం నాకు సంతోషమే’’ అని కొన్నేళ్ల క్రితం ఖమేనీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!
టెహ్రాన్ : అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదు.. అనే పదే పదే చెబుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి నిరసన సెగ మొదలైంది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఖమేనీ సాధించిందేమీ లేదంటూ ఆ దేశ బహిష్కృత ప్రిన్స్ రెజా పహ్లవి సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, ఆమెరికా దాడుల తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు, ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కుమారుడు రెజా పహ్లవి ఈరోజు( సోమవారం, జూన్ 23వ తేదీ) పారిస్ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ(ఇరాన్) రక్తపాతంతో తడిసి ముద్దవడం తప్పితే ఖమేనీ కారణంగా దేశానికి ఒరిగిందేమీ లేదని దేశ బహిష్కరణకు గురైన ప్రిన్స్ రెజా పహ్లవి పేర్కొన్నారు. ఇక ఖమేనీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిజాయితీగా విచారణ ఎదుర్కోవడానికి ఖమేనీ సిద్ధంగా ఉండాలి. ఇరాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దశకు వచ్చేసింది. ఖమేనీతో పాటు మరికొంతమంది ఆయన మద్దతుదారులు దేశం విడిచి పోవడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు(ఖమేనీ) ఇక దిగిపో.. చట్ట ప్రకారం విచారణకు సిద్ధం అవ్వు’ అని హెచ్చ,రించారు.పశ్చిమ దేశాలు అనేవి పలు దేశాలకు జీవితాను ఇచ్చే దేశాలుగా ఉండేవి. ఈ పరిపాలనలో అదేమీ లేదు. అంతా రక్తపాతమే. ఎవరికీ లొంగిపోను అనే నినాదంతో విధ్వంసానికి కారణమయ్యాడు. ఇలా సుదీర్ఘకాలం ఒక దేశాన్ని అట్టిపెట్టుకోవాలని చూడటం మంచిది కాదు. ఇలా ఏ ఒక్కరి చేతుల్లోనూ బందీ అయిన దేశాలు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినప్పటికీ ఇరాన్ క్రౌన్ ప్రిన్స్‌గా రెజా ఫహ్లావి పరిగణించబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్లో అధికార మార్పుకు సమయం ఆసన్నమైందనే సంకేతాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా రెజా పిలుపునిచ్చారు. ఖమేనీ పీడకలని అంతం చేయాలంటే దేశ వ్యాప్తంగా ప్రజలే తిరగబడాలన్నారు. ప్రజలచే జాతీయ, ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రెజా వ్యాఖ్యానించారు. -
ఇరాన్ జెండాలతో వైట్‌హౌజ్ ఆవరణలో ప్రదర్శనలు
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ.. అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా ప్రధాన నగరాల్లో ఇరాన్ మద్దతు ప్రదర్శనలు జరుగుతుండడం తీవ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోనే ట్రంప్ వ్యతిరేక నినాదాలతో ఓ ప్రదర్శన జరగడం గమనార్హం. ఇరాన్‌పై యుద్ధం వద్దు.. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం ఆపండి.. గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే అంటూ అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి పలువురు నినాదాలు చేశారు. మరికొందరు ఇరాన్‌కు మద్దతుగా పాటలు పాడుతూ తమ నిరసన గళం విప్పారు. ప్రస్తుతం యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అమెరికా ప్రధాన నగరాలు మారుమ్రోగుతున్నాయి.బోస్టన్, చికాగోతో పాటు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్ స్లోగన్లు ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ కొందరు ఈ ప్రదర్శనలు చేపట్టారు. వైట్‌హౌజ్ వద్ద జరిగిన నిరసనల్లో పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దంటూ నినాదాలు చేశారు.HAPPENING NOW 🚨: Anti-war protest in Boston following US strikes in Iran. pic.twitter.com/LRP6wELFtB— Ron Smith (@Ronxyz00) June 22, 2025ఇరాన్‌పై అమెరికా యుద్ధ విమానాలు దాడులు జరిపి.. తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో కేవలం 25 నిమిషాల్లోనే ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను (ఫోర్దో, ఇస్ఫాహాన్, నటాంజ్) దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో.. యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. మరోవైపు.. నిరసనల నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు నిరసనకారుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.Happening now: Anti-war protesters have started to rally in front of the White House, calling for no war with Iran and an end to U.S. support to Israel. pic.twitter.com/mmenVH1wOG— BreakThrough News (@BTnewsroom) June 18, 2025అయితే అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టమే వాటిల్లిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ యుద్ధంలో జోక్యంతో అమెరికా ఘోర తప్పిదం చేసిందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమనీ మండిపడగా.. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో తాము చేపట్టిన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగబోదని.. దాడుల్లో తాము లక్ష్యానికి చేరువైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తాజాగా ఓ ప్రకటన చేశారు. వెల్లడించారు.ఇరాన్‌పై అమెరికా బాంబు దాడుల చేసిన తర్వాత.. యుద్ధాన్ని ఆపేది అప్పుడే: నెతన్యాహుఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా (USA) తీవ్రంగా ధ్వంసం చేసింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్‌ను వెనక్కి నెట్టాం. ముప్పును తొలగించుకున్నాం. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం. మా టార్గెట్‌ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే. అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది. ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. ఇందులో ప్రధానంగా మా అస్థిత్వానికి పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం. ఒకటి అణ్వాయుధాలు.. రెండు బాలిస్టిక్ క్షిపణులు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేం ఒక్కో అడుగు వేస్తూ ముందుకుసాగుతున్నాం. వాటికి మేం చేరువయ్యాం. టెహ్రాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోం. అయితే, అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదు. ఐరాస స్పందన.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అందులో ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ మాట్లాడుతూ.. ‘‘అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్ చేసి.. నెతన్యాహు అగ్రరాజ్యాన్ని ఈ యుద్ధంలోకి లాగారు. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోనుంది. దౌత్యాన్ని నాశనం చేయడానికి అగ్రరాజ్యం కంకణం కట్టుకుంది. దీనికి సరైన సమయంలో దీటుగా బదులిస్తాం’’ అని హెచ్చరించారు.ఖమేనీ ఏమన్నారంటే.. యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు. తీవ్ర నేరానికి పాల్పడ్డారు. దీనికి శిక్ష తప్పదు. తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది అని అమెరికా పేరును ప్రస్తావించకుండానే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఏమన్నారంటే.. తాజా దాడులకు అగ్రరాజ్యం మూల్యం చెల్లించుకోవాల్సిందే. అమెరికాకు దీటుగా బదులిస్తాం అని అన్నారు. -
ట్రంప్‌కు ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్.. చైనా, రష్యా, భారత్ పరిస్థితేంటి?
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇదే సమయంలో దాడులు చేసిన వారికి తప్పకుండా శిక్ష కొనసాగుతుంది అంటూ హెచ్చరించారు.ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీ మొదటిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఖమేనీ..‘ఇజ్రాయెల్, అమెరికాకు కఠినమైన, నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుంది. శిక్ష కొనసాగుతోంది. జియోనిస్ట్ శత్రువు పెద్ద తప్పు చేశాడు. పెద్ద నేరం చేశాడు. దానిని శిక్షించాల్సిందే.. తప్పకుండా శిక్ష ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు.మరోవైపు.. ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ అంబాసిడర్ అమీర్ సయీద్ ఇరవానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమ దేశంలోని అణు స్థావరాలపై దాడి చేసి దౌత్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని విమర్శించారు. ఇరాన్ మిలిటరీ సరైన సమయంలో స్పందిస్తుందని అమెరికాను హెచ్చరించారు. దాడుల నేపథ్యంలో అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.#همین_حالا مجازات ادامه دارددشمن صهیونی یک اشتباه بزرگی کرده، یک جنایت بزرگی را مرتکب شده؛ باید مجازات بشود و دارد مجازات میشود؛ همین حالا دارد مجازات میشود.#الله_اکبر pic.twitter.com/wH6Wk9nNhJ— KHAMENEI.IR | فارسی 🇮🇷 (@Khamenei_fa) June 23, 2025రష్యా, చైనా వైఖరేంటి?ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది. ఇజ్రాయెల్ ‘రెడ్ లైన్ దాటిందని’ చెప్పింది. ఇజ్రాయెల్ చర్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజింగ్ వ్యాఖ్యానించింది. మరోవైపు.. రష్యా ఇజ్రాయెల్ దాడులను విమర్శించినప్పటికీ ఇరాన్‌కు మాస్కో ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించడం, ఆ తర్వాత ఇది మరింత తీవ్రమైతే చైనా, రష్యా ఇరాన్‌కు సైనిక సాయం అందిస్తాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘రష్యా, చైనా ఇరాన్‌కు దౌత్యపరమైన మద్దతిస్తాయి. కానీ అవి సైనికంగా ఎలాంటి సాయం చేయవు. ఇరాన్ కోసం ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగవు’ అని చైనాకు చెందిన కీలక నేత చెప్పుకొచ్చారు.ఇస్లామిక్ దేశాలు ఎటువైపు?ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్ని ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం అని ఖతార్ హెచ్చరించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు నిదర్శనం అని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమైతే, దాని ప్రభావం పశ్చిమాసియాపైనే కాకుండా మొత్తం ప్రపంచం మీద ప్రభావం చూపుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి. అయితే, అరబ్ దేశాల తాజా ప్రకటనలు చూస్తుంటే, ఈ ఘర్షణ మరింత పెద్దది కావడం వారికి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది.ఆందోళనలో భారత్?భారత్‌కు ఇజ్రాయెల్, ఇరాన్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్, ఇరాన్ రెండు దేశాలవి ప్రాచీన నాగరికతలు. చమురు విషయంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన భారత్‌కు ఇరాన్ బలమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య చాలాకాలంగా వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇక, ఇజ్రాయెల్ విషయానికి వస్తే.. నెల రోజుల క్రితం భారత్ పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసింది. ఈ విషయంలో భారత్‌కు ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతిచ్చింది. దీంతో, రెండు దేశాల మధ్య స్నేహ బంధం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో తన ప్రయోజనాలకు హాని కలగకుండానే ఎవరి పక్షం వహించాలో నిర్ణయించుకోవడమనేది భారత్ ముందున్న అతి పెద్ద సవాల్. -
భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?
న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. ఇంతలో ఇరాన్ నుంచి ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ.. ఒకవేళ తాను హత్యకు గురైతే తన స్థానంలో ‘ఈ ముగ్గురు’ సీనియర్ మతాధికారులలో ఒకరిని చీఫ్‌గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.ఇప్పటికే రహస్య బంకర్లో తలదాచుకున్న ఖమేనీ, తనను కనుక్కోవడం మరింత కష్టతరం చేయడానికి తన చుట్టూ ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను మూసివేయాలని అధికారులను ఆదేశించాడని ఆ వార్తాపత్రిక నివేదించింది. అయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా.. ఇతను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కు సన్నిహితుడైన మతాధికారి. ఈయన సుప్రీం చీఫ్ రేసులో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతను ఖమేనీ పేర్కొన్న అభ్యర్థుల జాబితాలో లేడని, ఆయన పేర్కొన్న పేర్లలో మరో ముగ్గురు ఉన్నారని అధికారులు తెలిపారు.శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్.. ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఇకపై ఉనికిలో ఉంచే ప్రసక్తే లేదు అని పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి టెల్ అవీవ్ సమీపంలోని పట్టణంలోని ఒక ఆసుపత్రిని ఢీకొట్టిన అనంతరం కాట్జ్ ఈ వ్యాఖ్య చేశారు. ‘ఇరానియన్ నియంత రహస్య బంకర్లో కూర్చుని ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులు, నివాస భవనాలపై క్షిపణులను ప్రయోగిస్తున్నాడు. ఇది తీవ్రమైన యుద్ధ నేరం. వీటికి ఖమేనీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కాట్జ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇరానియన్ సుప్రీంను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్)ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.ఇజ్రాయెల్‌కు ఎదురవుతున్న ముప్పును తప్పించేందుకు, ఖమేనీ పాలనను అంతం చేసేందుకు ఇరాన్‌లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులను పెంచాలని ఆదేశించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరానియన్ అణు ప్రదేశాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతు పలకాలని భావిస్తున్న తరుణంలో యుద్ధ పరిణామాలు మరోమలుపు తిరిగాయి. ఇది కూడా చదవండి: ‘యుద్ధం’ ఆపితే నోబెల్ రాదు: ట్రంప్ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు -
ఖమేనీ కథ ముగిస్తాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. తాజా టెల్ అవీవ్ ఆస్పత్రి దాడిని ఉద్దేశించి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్(israel katz) స్వయంగా ఈ ప్రకటన చేశారు.తాజాగా.. టెల్ అవీవ్‌లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్‌తో ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడికి ఇరాన్ సుప్రీం ఖమేనీ(Khamenei)నే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ .. త్వరలోనే ఆయన కథ ముగిస్తామని, ఇరాన్‌ను ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్ 13వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో.. నేరుగా ఇరాన్ సుప్రీంను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే.. ఈ బెదిరింపులను ఖమేనీ తీవ్రంగా భావించే పరిస్థితులు కనిపించడం లేదు. ‘‘బెదిరింపులకు తలొగ్గం.. యుద్ధం తీవ్రతరం అయ్యింది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి సందేశాలు పంపుతున్నారు. తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఓ వీడియో సందేశం సైతం విడుదల చేశారాయన. ‘‘ఇరాన్ లొంగిపోదనే విషయాన్ని వాళ్లు(ట్రంప్, నెతన్యాహులను ఉద్దేశిస్తూ) తెలుసుకోవాలి. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుంది. ఈ యుద్ధంలో వాళ్ల సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలి అని ఖమేనీ తన సందేశం పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఖమేనీకి బెదిరింపులపై లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లా తీవ్రంగా స్పందించింది. ఈ బెదిరింపులు మూర్ఖపు చర్య అని, అలాంటి ప్రయత్నాలు జరిగితే తాము చూస్తూ ఉండబోమని, అమెరికా-ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. ఎవరీ ఖమేనీ.. అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ (Ayatollah Sayyid Ali Khamenei) ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్. అత్యంత శక్తివంతమైన ప్రపంచాధినేతల్లో ఒకరు. ఖమేనీ ఒక షియా మత పండితుడు మాత్రమే కాదు.. రాజకీయ నేతగా ఇస్లామిక్ విప్లవంలో కీలకంగా వ్యవహరించాడు. 1989లో అయతొల్లా ఖోమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు సుప్రీం అయ్యారు. ఖమేనీ (మధ్యలో వ్యక్తి)ఖమేనీ జీవిత నేపథ్యం:పుట్టిన తేదీ: జూలై 17, 1939స్థలం: మష్హద్, ఇరాన్విద్య: మష్హద్, కూమ్ నగరాల్లో మత విద్యవృత్తి: మత పండితుడు, రచయిత, రాజకీయ నాయకుడురాజకీయ ప్రస్థానం:1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు.విప్లవం తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా 1981 నుంచి 1989 వరకు పనిచేశారు.1989లో ఖోమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్‌గా పగ్గాలుసుప్రీం లీడర్‌గా.. ఇరాన్లో సుప్రీం లీడర్ పదవి అత్యున్నతమైనది. ఖమేనీకి సైనిక, న్యాయ, మత వ్యవస్థలపై పూర్తి నియంత్రణ ఉంది. విదేశాంగ విధానాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈయనదే. ఆయన నియామకాలు, ఆదేశాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ పేరు మరింతగా వార్తల్లోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి. -
తలదూర్చితే చావుదెబ్బ తప్పదు.. ట్రంప్‌కు ఖమేనీ వార్నింగ్!
తెహ్రాన్: హెచ్చరికలు,అల్టిమేట్టంలు ఆఖరికి చంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు బెదిరింపులకు దిగినా సరే వెనక్కి తగ్గబోమని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ(83) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఖమేనీ తన సన్నిహితులతో పాటు సైన్యంలో కీలక పాత్రపోషిస్తున్న అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఖమేనీ లొంగిపోవాలని నెతన్యాహు,ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఆ బెదిరింపులకు తానేమి లొంగిపోనని, కాదు కూడదని ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో తలదూర్చాలని చూస్తే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు.ఎక్స్ వేదికగా ఖమేనీ ఏమన్నారంటే?ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదు. కాదు కూడదని సైనిక పరంగా జోక్యం చేసుకుంటే మాత్రం అమెరికాను కోలుకోలేని విధంగా దెబ్బకొడతామని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ గురించి ఖమేనీ స్పందించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అవివేకంతో ఇరానియన్లు తనకు లొంగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ఎవరికో (ఇజ్రాయెల్ దేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ) భయపడి తమను బెదిరిస్తే.. తాము బెదిరిపోమని పునరుద్ఘాటించారు. పదేపదే అమెరికా కవ్వింపు చర్యలకు దిగితే ప్రస్తుతం ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ ఎదుర్కొంటున్న హానికంటే ఎక్కువ హాని అమెరికా ఎదుర్కొవాల్సి ఉంటుందని ఇరాన్ అమెరికాకు చేయబోయే నష్టం గురించి హెచ్చరించారు. The US entering in this matter [war] is 100% to its own detriment. The damage it will suffer will be far greater than any harm that Iran may encounter.— Khamenei.ir (@khamenei_ir) June 18, 2025ఖమేనీని చంపే ఉద్దేశం మాకు లేదు.. కానీ సుప్రీం లీడర్ అనే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతని ఆచూకీ పెద్ద కష్టమేమీ కాదు. అతను అక్కడ సురక్షితంగా ఉన్నాడు. ప్రస్తుతం మేం అతన్ని చంపే ఉద్దేశంతో లేము. ఖమేనేని చంపితే మా వారిపై దాడులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నాకు ఓపిక నశిస్తున్నది. ఖమేనీ భేషరతుగా లొంగిపోతే మంచిది. మా సహనాన్ని పరీక్షించొద్దు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్‌పై ఖమేనీ పైవిధంగా స్పందించారు. -
‘నీ ఇష్టమొచ్చింది చేసుకో’.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్ వీడియో
తెహ్రాన్ : ఇరాన్ ఎనభై ఐదు సెకన్ల నిడివిగల వీడియోతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రెచ్చగొట్టింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో అణు ఒప్పందం చేసుకోబోమని పరోక్షంగా సంకేతాలిచ్చింది.ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని ఆహ్వానించారు. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు.అయితే, ట్రంప్ విధించిన అణు ఒప్పందం డెడ్ లైన్ గడువు సమీపిస్తున్న తరుణంలో తన సైనిక విభాగం బలంగా ఉందని చెబుతూ ఇరాన్ ఎనభై ఐదు సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మిస్సైల్ సిటీ పేరుతో క్షిపణులను ఏర్పాటు చేసిన తన మూడవ అండర్‌గ్రౌండ్ ప్రదేశాల్ని క్యాప్చర్ చేసింది. అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌లో ఏర్పాటు చేసిన మిస్సైల్ సిటీలో భారీ అణు ఆయుధాల్ని మనం చూడొచ్చు. Iran is responding to external threats by releasing a new video showcasing one of its underground missile tunnel systems, packed with missile engines, mobile launchers, and a range of advanced weaponry. The footage prominently features the Paveh cruise missile, the Ghadr-380… pic.twitter.com/ILsdlrPtQy— Basha باشا (@BashaReport) March 25, 2025ఇక ఇరానియన్ రాష్ట్రీయ మీడియా ప్రసారం చేసిన 85 సెకన్ల వీడియోలో ఇరాన్ సైనిక సారథి మేజర్ జనరల్ మొహమ్మద్ హోసేన్ బాగెరీ, ఐఆర్సీజీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ అమీర్ అలీ హాజిజాదెహోలు ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఆ క్షిపణుల్ని చూపిస్తున్నారు.ఇరాన్ మిస్సైల్ సిటీలో ఖైబర్ షెకాన్, ఘదర్-హెచ్,సెజిల్, పావే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. ఈ అణు ఆయుధాల్ని ఇరాన్ ఇటీవల ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు ఉపయోగించినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. -
‘ఇది సరిపోదు.. నెతన్యాహును ఉరితీయాలి’ : ఖమేనీ
టెహ్రాన్ : ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేస్తే సరిపోదని ఉరితీయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) సూచించారు. అలీ ఖమేనీ వ్యాఖ్యలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని పశ్చిమా దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. -
ప్చ్.. ఖమేనీ వారసుడికి పగ్గాలు కష్టమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగున్న వేళ.. మరోవైపు ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన కోమాలోకి కూడా వెళ్లారని, ఆయన వారసుడు మోజ్తాబా ఖమేనీ తదుపరి సుప్రీంగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం తీవ్రతరమైంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది.తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ సంకేతాలిస్తూ.. ఖమేనీ తాజాగా ఓ ఫొటో రిలీజ్ చేశారు. లెబనాన్ ఉన్న ఇరాన్ రాయబారి ముజ్తబా అమనిని కలుసుకున్నట్లు తన ఎక్స్ ఖాతాలో ఖమేనీ పోస్ట్ చేశారు. ఇటీవల లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన పేజర్ దాడుల్లో ముజ్తబా అమని కూడా గాయపడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఖమేనీ ఆరా తీసినట్లు సమాచారం.ఇక.. ఖమేనీ ఆరోగ్యం విషమించిందని, కోమాలోకి వెళ్లారని, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని.. ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం వెలువడడం తీవ్ర చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 20వ తేదీన 60 మంది ఇరాన్ అసెంబ్లీ నిపుణులతో ఒక తీర్మానం కూడా ఖమేనీ చేయించాడన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఆ తీర్మానాన్ని.. ఓటింగ్‌ను చాలామంది వ్యతిరేకించారని కూడా అదే కథనం పేర్కొంది. ఈ కథనం ఆధారంగా రకరకాల కథనాలు వండి వార్చాయి మిగతా మీడియా సంస్థలు. కానీ, ఖమేనీ తాజా పోస్టుతో మోజ్తాబాకు ఇరాన్ సుప్రీం పగ్గాలు ఇప్పట్లో పగ్గాలు అప్పజెప్పకపోవచ్చనే స్పష్టత వచ్చింది. ఇదే కాదు.. మెజ్తాబాకు ఆటంకాలు కూడా ఉన్నాయి. అయతొల్లా అలీకి ఆరుగరు సంతానం. మోజ్తాబా.. రెండో కొడుకు. 1969లో మషాబాద్లో పుట్టాడు. తన తండ్రి బాటలో నడుస్తూ.. మత పెద్దగా మారాడు. అలాగే 2005, 2009 ఇరాన్ ఎన్నికల్లో మహమూద్ అహ్మదీనెజాద్‌కు మద్దతు ఇచ్చి.. అతని విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. ఇరాన్ రిచ్చెస్ట్ మ్యాన్‌గానూ మోజ్తాబాకు పేరుంది.ఇరాన్ జీడీపీ 388 బిలియన్ డాలర్లు కాగా, ఖమేనీ కుటుంబం ఆస్తుల విలువ 200 బిలియన్ డాలర్లుగా ఉందని.. ఇందులో 90 బిలియన్ డాలర్లు మోజ్తాబా పేరిటే ఉందని అమెరికా నివేదికలు వెల్లడించాయి. అయితే.. ఇరాన్ రాజకీయాల్లో జోక్యం ద్వారా అలీపై విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. 2009లో అహ్మదీనెజాద్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. చెలరేగిన నిరసనల అణచివేత మోజ్తాబా ఆధ్వర్యంలోనే కొనసాగింది. అయితే తర్వాతి కాలంలో ఈ ఇద్దరి మధ్య సంబంధాలు చెడాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ ఖజానా సొమ్మును దుర్వినియోగం చేశాడంటూ మోజ్తాబాపై అహ్మదీనెజాద్ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో ఇరాన్ అసెంబ్లీ నిపుణులు మెజ్తాబాకు ఇరాన్ సుప్రీం బాధ్యతలు వెళ్లనివ్వకుండా అడ్డుకునే అవకాశం లేకపోలేదు. అయతొల్లా వారసుడిగా సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్నప్పటికీ.. సుప్రీం కుర్చీ మాత్రం మెజ్తాబాకు చాలా దూరంగానే ఉందన్నది పలువురి వాదన. -
దిమ్మతిరిగేలా బదులిస్తాం
దుబాయ్/టెహ్రాన్: గత నెలాఖరులో ఇజ్రాయెల్ తమ మిలటరీ లక్ష్యాలపై చేపట్టిన దాడులపై ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమెనీ తీవ్రంగా స్పందించారు. దిమ్మతిరిగేలా బదులిచ్చి తీరతామంటూ అమెరికా, ఇజ్రాయెల్లను హెచ్చరించారు. ‘‘మాకు, హెజ్బొల్లా, హమాస్ వంటి మా మిత్ర గ్రూపులకు హాని తలపెడుతున్నందుకు తగు మూల్యం చెల్లించుకోకతప్పదు. మాపై, మా మిత్ర దేశాలపై దాడులకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయి. శత్రువులను పూర్తిగా అణగదొక్కేలా మా ప్రతిస్పందన ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్ గ్రహించాలి. అనవసరంగా మా జోలికి రావొద్దు. ఇబ్బందుల్లో పడొద్దు’’అని శనివారం టెహ్రాన్ వర్సిటీ విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఖమేనీ పేర్కొన్నారు. ఇరాన్ అధికారిక టీవీ చానల్ ఈ మేరకు తెలిపింది. ‘మా నరాల్లో ప్రవహిస్తున్న రక్తం మా నాయకుడికి బహుమానం’అంటూ ఖమేనీకి మద్దతుగా విద్యార్థులు భారీగా నినాదాలు చేశారు. హమాస్, హెజ్బొల్లా అగ్ర నాయకులు హతమైన నేపథ్యంలో ఇరాన్ అక్టోబర్ ఒకటో తేదీన ఇజ్రాయెల్‌పై పెద్ద సంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడింది. ప్రతిగా ఇజ్రాయెల్ గత శనివారం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల్లో ఎవరు ఎవరిపై దాడికి దిగినా పశి్చమాసియా అగి్నగుండం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్, అమెరికా శత్రు దేశాలుగా మారడానికి కారణమైన ఘటనకు ఆదివారం 45 ఏళ్లు నిండనుండటం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది. 1979 నవంబర్ 4న ఇరాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇస్లామిస్టు విద్యార్థులు దిగ్బంధించారు. సిబ్బందిని కార్యాలయంలోని బంధించారు. ఈ సంక్షోభం ఏకంగా 444 రోజులు కొనసాగింది. నాటినుంచే ఇరాన్, అమెరికా శత్రు దేశాలుగా మారిపోయాయి. ఇజ్రాయెల్‌కు మరింత సాయం ఇజ్రాయెల్‌కు అమెరికా మరింత సాయం ప్రకటించింది. అగి్నమాపక ఎయిర్ ట్యాంకర్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఫైటర్ విమానాలు, లాంగ్ రేంజ్ బి–52 బాంబర్లను పశి్చమాసియాకు తరలించనున్నట్లు శనివారం పేర్కొంది. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు గగనతల రక్షణ వ్యవస్థలను, భారీగా సైనిక, ఆయుధ సామగ్రిని సమకూర్చడం తెలిసిందే. -
ఇజ్రాయెల్ హై అలర్ట్
టెల్ అవీవ్: ఇరాన్ చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. ఎప్పుడు, ఎలా దాడి చేయనుందో కచ్చితంగా తెలియనప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం అత్యున్నత స్థాయి అప్రమత్తత ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పైకి విరుచుకుపడటం తెలిసిందే. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూడా ఇరాన్‌పై రెండు సార్లు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఇది ఇరాన్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇజ్రాయెల్‌పైకి దాడి చేసే శక్తి, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనే సామర్ధ్యం ఈ దాడులతో దెబ్బతిన్నట్లు రూఢీ అయ్యింది. ‘ఇజ్రాయెల్ చేసిన దాడులను అతిగా చూపలేం, అలాగని తక్కువని చెప్పలేం’అని సాక్షాత్తూ ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీయే స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అయినప్పటికీ, ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. -
ఇజ్రాయెల్‌పై ట్వీట్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్స్ ఖాతా సస్పెండ్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్లో క్షిపణి తయారీలో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్‌లోని అణు శక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసినట్లు సమాచారం. ఈ దాడులతో టెహ్రాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలిసింది.ఇక ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వివాదాస్పద ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమం ద్వారా ఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ పోస్టు పెట్టారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు లేదా అతిశయోక్తి చేయకూడదని అన్నారు. ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన ట్వీట్ చేసిన ఖాతాను ‘ఎక్స్’ సస్పెండ్ చేసింది.‘రెండు రాత్రుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ దుష్టపాలన చర్యలను అతిశయోక్తి చేయకూడదు. లేదా తక్కువగా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ పాలకుల తప్పుడు లెక్కలను భంగం చేయాలి. ఇరాన్ శక్తి, దేశ యువత బలం, సంకల్పం, చొరవను వారికి అర్థం చేయడం చాలా అవసరం’ అని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాడటంతో ఆ ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసింది. -
ఖమేనీ ఆరోగ్యం విషమం?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ఖమేనీ తనయుడు ముజ్తబా ఖమేనీ (55) తదుపరి సుప్రీం లీడర్ కావొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఖమేనీ 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్నారు. రుహొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు దిగజారుతున్న ఖమేనీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఇరాన్లో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఘర్షణలు మరింత ముదరడం తాము కోరుకోవడం లేదని ఇరాన్ అధికారులు చెప్పారు. -
హమాస్ ఉనికి ఎప్పటికీ సజీవమే: ఇరాన్ సుప్రీం నేత
టెహ్రాన్: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ నేత యాహ్యా సిన్వర్ మృతి చెందినప్పటికీ హమాస్ ఉనికి విషయంలో ఎటువంటి సమస్య లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఆయన యాహ్యా సిన్వర్ మృతి చెందిన అనంతరం తొలిసారి స్పందించారు. సిన్వర్ మృతి బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ ఆయన మృతితో హమాస్ ఉనికి కోల్పోపోయినట్లు కాదని అన్నారు.The loss of Yahya #alSinwar is painful for the Resistance Front. But this front didn’t halt its progress in wake of the martyrdoms of eminent figures like Sheikh Ahmed Yassin, Fathi Shaqaqi, Rantisi, & Ismail Haniyeh. Similarly, it won’t falter with Sinwar’s martyrdom either.— Khamenei.ir (@khamenei_ir) October 19, 2024 ‘‘సిన్వర్ మృతి హమాస్‌కు నష్టం. ఆయన మృతి చాలా బాధాకరం. కానీ హమాస్ ప్రముఖ నేతల బలిదానంతో ముందుకు సాగడం మానలేదు. హమాస్ సజీవంగా ఉంది.. సజీవంగానే ఉంటుంది. హమాస్ నేత మరణానికి సంతాపం తెలియజేస్తున్నాం. ఆయన ఒక ‘వీరోచిత ముజాహిద్’. దోపిడీ చేసే క్రూరమైన శత్రువుతో పోరాడటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. నిజాయితీగల పాలస్తీనా ముజాహిదీన్, యోధుల పక్షాన నిలబడటం కొనసాగిస్తాం’’ అని అన్నారు.Hamas is alive and will stay alive. Yahya #Sinwar— Khamenei.ir (@khamenei_ir) October 19, 2024 ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న దాడికి ఆదేశించిన హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ శుక్రవారం మృతి చెందారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) అక్టోబర్ 17 చేసిన దాడిలో ఆయన మృతి చెందారని ప్రకటించింది. ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన హమాస్ నేతల్లో ముఖ్యమైన నేత సిన్వర్ ఒకరు. ఇజ్రాయెల్ యాహ్యా సిన్వార్ చివరి క్షణాలను చూపించే డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. మరోవైపు.. తమ నాయకుడు యాహ్యా సిన్వార్ మృతిని హమాస్ ధృవీకరించింది. గాజాలో దురాక్రమణ ముగిసే వరకు అక్టోబర్ 7న తాము బంధీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ పౌరులను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయబోమని ప్రతిజ్ఞ చేసింది.చదవండి: హమాస్ సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్, చేతి వేలు కత్తిరించి.. -
మా శత్రువులను ఓడిస్తాం: ఇరాన్ సుప్రీం లీడర్
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మిసైల్స్ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. శుక్రవారం సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదు వద్ద వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 7 హమాస్ బలగాలు.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను సరైన చర్యగా అభివర్ణించారు. ‘మేము మా శత్రువులను ఓడిస్తాం. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు, లెబనాన్ ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తాం. మా శత్రువులను కచ్చితంగా ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. లెబనాన్, పాలస్తీనియన్లపై ఆక్రమణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తాము తెలుపుతున్న నిరసనను అడ్డుకునే హక్కు ఏ అంతర్జాతీయ చట్టానికి లేదు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు ప్రజా సేవ వంటివి. హమాస్ , హెజ్బొల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎటువంటి విజయం సాధించదు. హమాస్, హెజ్బొల్లాతో మేము ఉన్నాం.Grand Ayatollah #Khamenei leads Friday Prayers in Tehran, with the presence of the Iranian nation, maybe with different opinions but a united hand against the enemy.This is the point that some Western politicians and #Israel, could not understand and miscalculate. pic.twitter.com/w1C0VNKzAa— Pooya (@PooyaMirzaei86) October 4, 2024సయ్యద్ హసన్ నస్రల్లా ఇప్పుడు మనతో లేరు. కానీ ఆయన స్ఫూర్తి. ఆయన ఏర్పాటు చేసిన మార్గం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన ఇజ్రాయెల్ శత్రువులకు వ్యతిరేకంగా ఎత్తిన జెండా. ఆయన బలిదానం మనపై మరింత బాధ్యత పెంచుతోంది. మన విశ్వాసాన్ని బలపరుస్తూనే శత్రువులకు వ్యతిరేకంగా నిలబడాలి. అదేవిధంగా హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై గతేడాది అక్టోబర్ 7న చేసిన మెరుపు దాడులు సరైన చర్యనే’’ అని అన్నారు.చదవండి: అటు డోమ్..ఇటు ఫతాహ్! -
ఇరాన్ హై అలర్ట్.. సురక్షిత ప్రాంతానికి సుప్రీమ్ లీడర్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో హెజ్బొల్లాకు భారీ నష్టం సంభవిస్తోంది. దక్షిణ బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం జరిపిన దాడుల్లో మిలటరీ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. అయితే నస్రల్లా మరణ వార్తలపై హెజ్బొల్లా కానీ, లెబనాన్ కానీ ఇంకా స్పందించలేదు.ఇదిలా ఉండగా దాడుల విషయంలో ఇజ్రాయెల్ సైన్యం దూకుడు ప్రదర్శిస్తున్న వేళ.. ఇరాన్ అప్రమత్తమైంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని దేశంలోని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయనకు భద్రతా ఏర్పాట్లను కూడా పెంచినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నస్రల్లాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత.. తదుపరి చర్యపై లెబనాన్, హెజ్బొల్లా, ఇతర ప్రాంతీయ గ్రూపులతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారు
టెహ్రాన్/న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సోమవారం చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదనను అనుభవిస్తున్నారు. మయన్మార్, గాజా, భారత్..తదితర ఏప్రాంతంలోనైనా ముస్లింలు పడుతున్న బాధలను పట్టించుకోకుంటే మనం ముస్లింలమే కాదు’అంటూ ఖమేనీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్‌లోని మైనారిటీ వర్గాన్ని గురించి ఇరాన్ సుప్రీం నేత చేసిన ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోని మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే ముందు సొంత మానవ హక్కుల రికార్డును పరిశీలించుకోవాలని ఇరాన్‌కు హితవు పలికింది. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని ఇరాన్లో వేలాదిగా మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లోకి వచ్చిన రోజే ఖమేనీ భారత్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
Iran: ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష యుద్ధమే!
టెహ్రాన్/బీరుట్: ఒకవైపు గాజాలో మారణకాండ సాగిస్తూ, మరోవైపు హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియేను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ దుశ్చర్య పట్ల ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం నేర్పాలన్న కృతనిశ్చయంతో ఆయన ఉన్నారు. హనియే హత్యకు ఇక ప్రతీకారం తీర్చుకోక తప్పదని భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేయాలని ఆయన తమ సైన్యానికి తాజాగా స్పష్టమైన ఆదేశాలిచి్చనట్లు ముగ్గురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. హనియే హత్యపై ప్రకటన వెలువడగానే బుధవారం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహిస్తారు. తాజా పరిణామాలపై ఈ భేటీలో ఖమేనీ సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగాలని సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పడానికి ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండగా, పూర్తిస్థాయి యుద్ధానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఇరాన్‌కు సందేశం చేరవేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ‘చానెల్ 12’ తెలియజేసింది. తమ దేశంపై ఇరాన్ గానీ, దాని మిత్రదేశాలు గానీ దాడులకు దిగితే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లేనని ఇజ్రాయెల్ తేలి్చచెప్పినట్లు వివరించింది. భారీ మూల్యం తప్పదు: నెతన్యాహూ ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది ముమ్మటికీ ఇజ్రాయెల్ సైన్యమేనని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా నోరువిప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తాజాగా స్పందించారు. తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ‘అసోసియేటెడ్ ప్రెస్’తో మాట్లాడుతూ చెప్పారు. ఇస్మాయిల్ హనియేకు ఖమేనీ నివాళులు ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు విడిచిన హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేకు, ఆయన అంగరక్షకుడికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఘనంగా నివాళుర్పించారు. గురువారం టెహ్రాన్ యూనివర్సిటీలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో హనియే, సెక్యూరిటీ గార్డు శవపేటికల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
Iran Presidential Election 2024: ఖమేనీ కనుసన్నల్లో... ఇరాన్లో ఎన్నికలకు వేళాయె
అగ్ర రాజ్యాల ఆంక్షలు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి. హక్కుల కోసం రోడ్డెక్కుతున్న మహిళలు. కరడుగట్టిన మతవాద పాలనపై యువతలోనే గాక సర్వత్రా తీవ్రతరమవుతున్న అసంతృప్తి. ఇన్ని గడ్డు సమస్యల నడుమ ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలకు వేళైంది. మూడున్నర దశాబ్దాలుగా ఇరాన్‌ను ఏకఛత్రంగా పాలిస్తున్న సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అభీష్టానుసారం ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు రేసులో ఉన్నారు. వారిలో ఖమేనీ వీర విధేయుడే పీఠమెక్కడం లాంఛనమే కానుంది. జనాల్లో ఇప్పటికీ తిరుగులేని ఆదరణ ఉన్న మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ తదితరుల అభ్యరి్థత్వాన్ని తిరస్కరించడం ద్వారా జనాకర్షక నేతలెవరూ పోటీలో ఉండకుండా సలక జాగ్రత్తలూ తీసుకున్నారు. దాంతో ఎప్పట్లాగే ఈసారి కూడా ఇరానీలు అధ్యక్ష ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితిని ఊహించే ఆరుగురిలో డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ రూపంలో ఒక సంస్కరణలవాదిని ఎంపిక చేశారు. ఆయన్ను చూసి జనాలు ఎంతో కొంత పోలింగ్ బూత్‌లకు వస్తారని ఆశిస్తున్నారు. అంతిమంగా విజేత మాత్రం మిగతా ఐదుగురు కరడుగట్టిన మతవాదుల్లోంచే ఒకరు కానున్నారు. అది ఎవరన్నది జూన్ 28న జరిగే పోలింగ్‌లో తేలనుంది. ప్రభుత్వంపై విమర్శలే ప్రచారా్రస్తాలు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గత మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఇరాన్లో ఏడాది ముందుగానే ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రధాని పదవిని రద్దు చేస్తూ, అధ్యక్ష పదవి స్థాయిని పెంచుతూ 1998లో రాజ్యంగ సంస్కరణలు చేసిన అనంతరం దేశంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులంతా ఈసారి ప్రభుత్వంపై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతుండటం విశేషం. దేశ ఆర్థిక దుస్థితికి ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని వారంతా బాహాటంగా తప్పుబడుతున్నారు. ఇదంతా ప్రజలను పోలింగ్ బూత్‌కు రప్పించేందుకు ఖమేనీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని చెబుతున్నారు. ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛ గా, పారదర్శకంగా జరిగిన దాఖలాలు లేవని అంతర్జాతీయ నిపుణులతో పాటు ఇరాన్ మేధావులు కూడా అంటుంటారు. ఎన్నికల ఫలితాలను ఖమేనీ పూర్తిగా నిర్దేశించడమే గాక తనకు అనుకూలంగా మార్చేస్తారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఎన్నిక ఇలా... ఇరాన్ అధ్యక్షున్ని ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిన ఎన్నుకుంటారు. పదవీకాలం నాలుగేళ్లు. పూర్తి అధికారాలు సుప్రీం లీడర్ ఖమేనీవే అయినా అధ్యక్షునికి కూడా పలు కీలక దేశీయ విధాన నిర్ణయాలతో పాటు కొంతమేరకు విదేశాంగ విధానంపై కూడా చెప్పుకోదగ్గ అధికారాలుంటాయి. 12 మంది మత పెద్దలు తదితరులతో కూడిన గవరి్నంగ్ కౌన్సిల్ ఖమేనీ నిర్దేశాలకు లోబడి అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈసారి 80 దరఖాస్తులను వడపోసి ఆరుగురిని మాత్రం పోటీకి అనుమతించింది. తన ఆధిపత్యానికి సవాలుగా మారతారనుకున్న వారెవరికీ అవకాశం దక్కకుండా ఖమేనీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఆ క్రమంలోనే బాగా జనాకర్షణ ఉన్న మాజీ అధ్యక్షుడు నెజాద్తో పాటు మూడుసార్లు పార్లమెంట్ స్పీకర్‌గా చేసిన అలీ లారిజానీ అభ్యర్థిత్వం కూడా తిరస్కరణకు గురైంది. తిరస్కృత జాబితాలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు! జూన్ 28న ఓటింగ్ జరగనుంది. 30కల్లా ఫలితాలు వెలువడే అవకాశముంది. ఎవరికీ 50 శాతానికి మించి ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల మధ్య తిరిగి ఎన్నిక జరుగుతుంది. ఆ ఆరుగురుమసూద్ పెజెష్కియాన్ గట్టి సంస్కరణలవాది. దేశ ఆరోగ్య మంత్రిగా చేశారు. విద్యావంతునిగా మంచి పేరే ఉంది. మితిమీరుతున్న మతవాదంపై ప్రజల్లో ప్రబలుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే ఈయనను అభ్యర్థుల జాబితాలో చేర్చినట్టు చెబుతున్నారు. 2008 నుంచీ పార్లమెంటు సభ్యుడు. అందరికీ ఆయోదమోగ్యమైన కొత్త ముఖం మేలని ఖమేనీ భావిస్తే తప్ప మసూద్‌కు అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.అలీ రజా జకానీ టెహ్రాన్ మేయర్. గతంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. పబ్లిక్ పార్కుల్లో మసీదు నిర్మాణాన్ని మద్దతిచ్చి విమర్శలకు గురయ్యారు. 2021లో కూడా అధ్యక్ష పదవికి పోటీ పడ్డా పెద్దగా ఓట్లు సాధించలేదు. ఈసారి కూడా జకానీ పేరు గట్టి పోటీదారుగా పెద్దగా పరిగణనలో లేదు. కాకపోతే ఖమేనీకి వీర విధేయుడు.జనరల్ మహమ్మద్ బఖర్ గలీబాఫ్ పార్లమెంట్ స్పీకర్. రాజధాని టెహ్రాన్ మేయర్‌గా, సైనిక విభాగమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కుమాండర్గా, దేశ పోలీస్ చీఫ్‌గా చేసిన అనుభవముంది. పైగా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు కూడా. ఆయనతో బంధుత్వమూ ఉందంటారు. దాంతో గలీబాఫ్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. సైన్యంలోని కీలక అధికారుల మద్దతు అదనపు బలం కానుంది. కాకపోతే ఆయనపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలున్నాయి. పైగా గతంలో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడారు. సయీద్ జలిలీ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోíÙయేటర్. ఇరాన్–ఇరాక్ యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్నా రు. యుద్ధవీరునిగా దేశమంతటా కాస్తో కూస్తో పేరున్న నేతే. ఈయనకూ ఖమేనీ ఆశీర్వాదముందని చెబుతారు. దాంతో జలిలీ అవకాశాలకు గండి కొట్టేందుకు గలీబాఫ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు జనాదరణ విషయంలో మరో అహ్మదీనెజాద్లా ఎదిగే సత్తా ఉండటం కూడా జలిలీ అవకాశాలకు గండి కొట్టవచ్చని పరిశీలకుల అభిప్రాయం. ముస్తాఫా పోర్ మొహమ్మదీ రేసులో ఉన్న ఆరుగురిలో ఏకైక మతాధికారి కావడం ఈయనకు కలిసొచ్చే అంశం. పైగా 85 ఏళ్ల ఖమేనీ తన వారసుని ఎంపికపై గట్టిగా దృష్టి సారించారు. కుమారుడు కుమారుడు ముజ్తబాకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ సమయంలో అధ్యక్ష పదవిలో మత పెద్ద ఉండటం మేలని ఖమేనీ భావించే పక్షంలో మొహమ్మదీకి చాన్సుంటుందని చెబుతున్నారు. కాకపోతే సుప్రీం లీడర్ పదవి కోసం ముజ్తబాతో పోటీ పడే సత్తా ఉండటం మొహమ్మదీకి ప్రతికూలంగా మారవచ్చు. ఆమిర్ హొసేన్ గజీజాదే హషేమీ ప్రస్తుతం 12 మంది దేశ ఉపాధ్యక్షుల్లో ఒకరు. రిటైరైన సైనికులు, యుద్ధాల్లో మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమ బాధ్యతలు చూస్తున్నారు. దాంతో ఆయా వర్గాల్లో మంచి ఆదరణే ఉంది. కాకపోతే ఈయనకు కూడా ఈసారి అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్‌కు ఇరాన్ అణుబాంబు హెచ్చరికలు!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌కు కీలక హెచ్చరికలు చేసింది. తమ దేశానికి ముప్పు ఉందంటే అణుబాంబలు తయారుచేయడానికైనా తాము వెనకాడబోమని ఇరాన్ పేర్కొంది.‘మేము అణుబాంబులు తయారు చేసేందుకు ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇజ్రాయెల్ వంటి దేశంతో.. మా దేశ ఉనికి ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా మిలిటరీ సిద్ధాంతాలను మార్చుకుంటాం. మా అణు కేంద్రాలపై ఇజ్రయెల్ దాడికి పాల్పడితే.. మా అణు సిద్ధాంతలను కూడా మార్చుకుంటాం’ అని ఇరాన్ సుప్రీ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖరాజీ తెలిపారు.ఏప్రిల్‌లో సిరియా రాజధాని నగరంలో ఇరాన్ ఎంబసీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌పై దాడులకు తెగపడినట్లు అంతర్జాతీయా మీడియా కథనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇరు ఇరాన్- ఇజ్రయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాజాలో పాలస్తీన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఇరాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇక.. ఇరాన్‌కు సాంకేతికంగా అణు బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇప్పటికే ఉంది. కావాలనుకుంటే అణ్వస్త్రాలను తయారు చేయగలం. అయితే ప్రస్తుతానికి అణు బాంబు తయారు చేయాలన్న అంశం మా ఎజెండాలో లేదని గతంలో ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరాన్ 60 శాతం స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేసే సామర్థ్యాన్ని సాధించిందని తెలుస్తోంది. కాగా, 90శాతం వరకు స్వచ్ఛతను సాధిస్తే అణు బాంబులను తయారు చేయడానికి వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
హమాస్ దాడులపై ఇరాన్ సుప్రీం స్పందన
టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులపై ఇరాన్ స్పందించింది. దాడులలో తమ ప్రమేయం లేదని.. ఇరాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేని నేరుగా ప్రకటన చేయడం గమనార్హం. ‘‘జియోనిస్ట్ పాలన (ఇజ్రాయెల్) మద్దతుదారులు, దోపిడీ పాలనలోని కొందరు వ్యక్తులు గత రెండు లేదా మూడు రోజులుగా ఈ చర్య వెనుక ఇస్లామిక్ ఇరాన్ ఉందని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. అవి తప్పు’’ అని మంగళవారం మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారాయన. అయితే హమాస్ దాడులతో సంబంధం లేదని ఆయన ప్రకటించినప్పటికీ.. పాలస్తీనాకు ఇరాన్ మద్దతు కొనసాగుతుందని ఆయన తెలిపారు. శనివారం నుంచి హమాస్ బలగాలు ఇజ్రాయెల్ సరిహద్దుగుండా విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల తర్వాత ఇరాన్ స్పందించడం ఇదే తొలిసారి. అయితే.. పాలస్తీనా పోరాటానికి తమ మద్దతు ఉంటుందని, వాళ్ల పోరాట పటిమ అమోఘమని ఖమేని వెల్లడించారు. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన తప్పిదాల వల్లే ఈ ఘోర పరిస్థితి అని ఖమేని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇది ముమ్మాటికీ ఇజ్రాయెల్ రక్షణ, నిఘా వ్యవస్థ లోపం వల్ల జరిగిన తప్పిదమేనని అన్నారు. మరోవైపు ఇది రాజకీయపరమైన ఆరోపణ అని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారమే ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఇరాన్లో వేలాది నిరసనకారులకు క్షమాభిక్ష
దుబాయ్: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టయిన 22 వేల మందికి ఇరాన్ క్షమాభిక్ష ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ యువతి పోలీస్ కస్టడీలో మృతి చెందినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం, అణచివేత చర్యల్లో భాగంగా పోలీసుల కాల్పుల్లో వందల మంది చనిపోవడం తెలిసిందే. వేలాది మందిని ౖజñయ్పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే 22 వేల మందికి సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ క్షమాభిక్ష ప్రసాదించినట్లు ఇరాన్ న్యాయశాఖ అధిపతి జి.ఎం.ఎజెహి సోమవారం తెలిపారు. వీరితోపాటు వివిధ ఆరోపణలను ఎదుర్కొంటున్న మొత్తం 82 వేల మందికి సుప్రీం నేత క్షమాభిక్ష ప్రకటించారన్నారు. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్ నెల సందర్భంగా సుప్రీం నేత ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. తాజా చర్యతో ప్రభుత్వ విధానాలపట్ల దేశ ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం తీవ్రతను పాలకులు గుర్తించినట్లయింది. -
కుట్ర కోణం?.. ఇరాన్ హిజాబ్ ఆందోళనలపై సంచలన ఆరోపణలు
టెహ్రాన్: హిజాబ్ వేసుకోలేదని మహ్సా అమినీ(22)ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అనుమానాస్పద రీతిలో ఆ యువతి మృతి చెందడం.. ఇరాన్లో కార్చిచ్చును రాజేసింది. యావత్ ప్రపంచం తల తిప్పి చూసేలా.. అక్కడి మహిళా లోకం హిజాబ్ వ్యతిరేక నిరసనలు చేపట్టింది. భద్రతా సిబ్బంది ఉక్కుపాదంతో వంద మందిని బలిగొన్న.. తగ్గేదేలే అంటూ ప్రభుత్వ వ్యతిరేక గొంతుకను వినిపిస్తోంది అక్కడి వనితాలోకం. ఇదిలా ఉంటే.. హిజాబ్ ఆందోళలనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెని తొలిసారి పెదవి విప్పారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నా అయతుల్లా స్పందించడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 83 ఏళ్ల ఇరాన్ సుప్రీం స్పందిస్తూ.. సంచలన ఆరోపణలకు దిగారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల వెనుక కుట్ర కోణం ఉందన్న ఆయన.. వీటి వెనుక అమెరికా, ఇజ్రాయెల్‌లు ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. ఈ అల్లర్లకు, అభద్రతా భావానికి కారణం ఏంటో తెలిసింది. ప్రణాళికాబద్దంగా ఇరాన్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే అవి అసాధారణ రీతిలో ఉంటున్నాయి. ఇందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణం. విదేశాల్లో ఉన్న కొంతమంది ఇరానియన్ల సహాయంతో, పెయిడ్ ఏజెంట్లతో ఈ రచ్చకు కారణం అయ్యాయి ఆ రెండు దేశాలు. పోలీసులు నేరస్థులకు ఎదురొడ్డి పోరాడాలి. పోలీసులపై ఎవరు దాడి చేసినా.. వాళ్ల వల్ల నేరస్థులు, దుండగులు, దొంగల నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని గుర్తించాలి. ఈ హింసాత్మక ఆందోళనలను ఖండిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. అలాగే.. అమినీ మృతి ఘటనపై స్పందిస్తూ.. చాలా బాధాకర ఘటన. యువతి మరణం గుండెను బద్దలు చేసింది. అయితే.. ఇది సాధారణ విషయం కాకున్నా.. కొందరు వ్యక్తులు ఎలాంటి ఆధారాలు, విచారణ లేకుండా.. ఆందోళన పేర్లతో ఇరాన్ వీధుల్ని రణరంగంగా మార్చేశారు. ఖురాన్‌ను తగులబెట్టారు. బలవంతంగా కొందరి హిజాబ్‌లను తొలగించారు. మసీదులకు, కార్లకు నిప్పు పెట్టారు. కాబట్టి, హిజాబ్ వ్యతిరేక కుట్రను గుర్తించి.. నిరసనకారులు ఆందోళన విరమించాలని సోమవారం విద్యార్థులు పాల్గొన్న ఓ కార్యక్రమం నుంచి ఆయన పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. నిరసనలు మూడవ వారం సైతం ఉధృతంగా కొనసాగుతుండగా.. ఇరాన్ శత్రువులు కుట్రలో విఫలమయ్యారు అంటూ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఒక ప్రకటన విడుదల చేశారు. -
దుమారం రేపుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ‘ట్వీట్’!
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంలీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆయన ట్విటర్ ఖాతాను నిషేధించాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అది ఖమేనీ అసలు ఖాతా కాదని ట్విటర్ యాజమాన్యం ప్రకటించింది. సదరు అకౌంట్‌పై నిషేధం విధించినట్లు తెలిపింది. ఇంతకీ విషయమేమిటంటే.. ట్రంప్ అగ్రరాజ్య పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఇక గతేడాది.. ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమానిని అమెరికా దళాలు ఇరాక్‌లో హతమార్చిన నేపథ్యంలో వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఇరు దేశాలు పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. దీంతో అమెరికాపై ఆగ్రహంతో ఊగిపోయిన ఇరాన్ ప్రభుత్వం... ట్రంప్ తలపై అప్పట్లో సుమారు రూ. 575 కోట్ల రివార్డును కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే చివరినాళ్లలో కూడా ట్రంప్ యంత్రాంగం, మధ్య ప్రాచ్య దేశంలో పెద్ద ఎత్తున బాంబర్లు, యుద్ధవాహక నౌకలు మోహరించింది. ఈ క్రమంలో ఇరాన్ యుద్ధాన్ని కోరుకోదని, అయితే తమ ప్రజలను కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా పూనుకుంటుందంటూ ఇటీవలే ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. కొత్త సంవత్సరంలో అమెరికన్లకు శోకంలో ముంచవద్దంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌నకు హెచ్చరికలు జారీచేసింది.(చదవండి: మళ్లీ వస్తా: డొనాల్డ్ ట్రంప్) ఇక జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ పేరిట శుక్రవారం ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది. ‘‘తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇరాన్ జనరల్‌ను బలితీసుకున్న అమెరికా దాడులకు బదులుగా.. అందుకు ఆదేశాలిచ్చిన వ్యక్తిపై ప్రతీకారం తప్పదు’’ అంటూ ట్రంప్‌ను పోలిన వ్యక్తి గోల్ఫ్ ఆడుతుండగా.. ఆయనపై నుంచి క్షిపణులు ప్రయాణిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేశారు. పర్షియన్ భాషలో ఉన్న ఈ ట్వీట్ ఖమేనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు స్థానిక మీడియాలోనూ దర్శనమిచ్చింది. ఈ విషయంపై తీవ్ర స్థాయిలో దుమారం రేగగా, దానిని తొలగించారు. ఇక ఇప్పుడు సదరు ఖాతా నకిలీదని, తమ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ అకౌంట్‌పై నిషేధం విధించినట్లు ట్విటర్ ప్రకటించింది. -
అమెరికాను దెబ్బకొట్టి తీరతాం: ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమాని హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పునరుద్ఘాటించారు. ఖాసీంను హతమార్చినందుకు అమెరికాను దెబ్బకొట్టి తీరతామని స్పష్టం చేశారు. ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్- కధిమితో మంగళవారం జరిగిన భేటీలో ఖమేనీ ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. ఇరాక్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అగ్రరాజ్యం.. జనవరి 3న ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్ దాడికి పాల్పడి.. ఇరాన్ జనరల్ సులేమానిని హతమార్చింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరుకోవడంతో పరస్పరం ప్రతీకార దాడులకు దిగాయి. (ట్రంప్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్) ఈ క్రమంలోనే ఇరాన్లో ఉక్రెయిన్ విమానం కూలిపోగా 176 మంది మృత్యువాత పడ్డారు. తొలుత ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్న ఇరాన్.. ఆ తర్వాత మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమను క్షమించాల్సిందిగా బాధితుల కుటుంబాలను అభ్యర్థించింది. అదే విధంగా సులేమానిని హతమార్చిన అమెరికా, అందుకు సహకరించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సులేమాని గురించి అమెరికాకు సమాచారమిచ్చిన తమ పౌరుడిని ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఇరాన్ న్యాయ శాఖ గత నెలలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా... అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ డ్రాగన్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకుంటూ భారీ ఒప్పందాలు చేసుకోవడం గమనార్హం. అదే విధంగా ఇరాక్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించే దిశగా ప్రధానితో ఖమేనీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.(అమెరికాకు ఇరాన్ వార్నింగ్) -
భారత్‌పై మండిపడ్డ ఇరాన్.. తీవ్ర వ్యాఖ్యలు!
టెహ్రాన్: భారత రాజధాని ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లో ముస్లింలపై ఊచకోత జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు... ‘‘భారత్‌లో జరుగుతున్న ముస్లిం నరమేధంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాలు ద్రవించిపోతున్నాయి. హిందూ ఉగ్రవాదులను, వారి పార్టీలను భారత ప్రభుత్వం అడ్డుకోవాలి. ముస్లింలపై జరుగుతున్న ఊచకోతను ఆపాలి. ఇస్లాం ప్రపంచం నుంచి వేరుగా ఉండేందుకు చేపడుతున్న చర్యలు ఆపేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకోవాలి’’అని ఖమేనీ ట్వీట్ చేశారు. ఇందుకు ఢిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తి భౌతికకాయం ముందు పిల్లాడు ఏడుస్తున్న ఫొటోను జతచేసి... ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషల్లో ట్విటర్లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.(ఇరాన్ బలంగా తయారవ్వాలి: ఖమేనీ) ఈ క్రమంలో... ఇరాన్ అధినాయకుడిగా దేశ భద్రత, విదేశాంగ విధానాలపై నిర్ణయం తీసుకునే ఖమేనీ.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. భారత ముస్లింల గురించి బాధపడుతున్న ఆయన.. సొంత దేశం ఇరాన్లో ముస్లింలపై జరిగిన ఊచకోతను గుర్తుచేసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ కూడా ఢిల్లీ అల్లర్లను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ కొన్ని శతాబ్దాలుగా ఇరాన్ భారత్‌తో స్నేహం కొనసాగిస్తోంది. భారతీయులందరూ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. విచక్షణారహిత అల్లర్లు చెలరేగకుండా చూసుకోవాలి. శాంతియుత చర్చలు, చట్టం ప్రకారమే ముందుకు సాగే అవకాశం ఉంటుంది. భారత ముస్లింలకు వ్యతిరేకంగా చెలరేగిన హింసను ఇరాన్ ఖండిస్తోంది’’ అని జావేద్ ట్వీట్ చేశారు.(విమానాన్ని మేమే కూల్చేశాం: ఇరాన్) అదే విధంగా ఇండోనేషియా సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ అల్లర్లపై స్పందించాల్సిందిగా తమ దేశంలో భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. భారత్‌లో సుహృద్భావ వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ... సున్నిత అంశాలపై బాధ్యతా రహితంగా మాట్లాడవద్దని అంతర్జాతీయ నాయకులు, సంస్థలకు సూచించారు. అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ.... పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో ఇప్పటికే దాదాపు 53 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక సుదీర్ఘకాలంగా ఇరాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్... అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనూ సంయమనం పాటించిన విషయం విదితమే. ఇరాన్ జనరల్ సులేమానిని అమెరికా హతమార్చిన తర్వాత ఇరాన్ మంత్రి జావేద్ జరీఫ్ భారత్‌లో పర్యటించి పలు అంశాలపై చర్చలు జరిపారు. The hearts of Muslims all over the world are grieving over the massacre of Muslims in India. The govt of India should confront extremist Hindus & their parties & stop the massacre of Muslims in order to prevent India’s isolation from the world of Islam.#IndianMuslimslnDanger — Khamenei.ir (@khamenei_ir) March 5, 2020 -
ఇరాన్ బలంగా తయారవ్వాలి: ఖమేనీ
టెహ్రాన్: యుద్ధాన్ని నిరోధించడానికి, శత్రువుల బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇరాన్ ఇంకా బలంగా తయారు కావాలని ఆ దేశ సుప్రీం నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దశాబ్దాలుగా అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరాన్ బలమైన వైమానిక దళాన్ని తయారు చేసుకోగలిగిందన్నారు. శనివారం వైమానిక దళం కమాండర్స్, సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. యుద్ధ భయం, శత్రు భయం లేకుండా మనం పటిష్టంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. -
ఆ క్యాంప్‌ల కహానీ
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాక్‌లో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులకు దిగామంటూ ఇరాన్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అగ్రరాజ్యం ముఖం మీద చెంపదెబ్బకొట్టినట్టుగా రెండు స్థావరాలపై దాడి చేశామని ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేని వ్యాఖ్యానించడంతో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న అమెరికా స్థావరాలేవి? ఎందుకు వాటికంత ప్రాధాన్యత ? అల్ అసద్ స్థావరం పశ్చిమ బాగ్దాద్‌కు 100 మైళ్ల దూరంలో ఎడారి మధ్యలో 1980 సంవత్సరంలో ఇరాక్ మిలటరీ ఈ వైమానిక స్థావరాన్ని నిర్మించింది. ఇరాకీయుల విముక్తి కోసం 2003లో వచ్చిన అమెరికా సైన్యానికి అదే అతి పెద్ద సైనిక స్థావరంగా మారింది. ఈ స్థావరంలో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాయి. చిన్న టౌన్ మాదిరిగా అమెరికా ఈ స్థావరాన్ని తీర్చిదిద్దింది. 2009–10లో అమెరికా సైన్యం వెనక్కి వెళ్లాక తిరిగి ఇరాక్ స్వాధీనంలోకి వచ్చింది. అరబ్ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదుల్ని నియంత్రించడానికి 2014లో అమెరికా బలగాలు తిరిగి ఇరాక్‌కి వచ్చాయి. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల్ని నియంత్రించడంలో ఈ స్థావరమే కీలక పాత్ర పోషించింది. గత రెండేళ్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇద్దరూ ఆకస్మికంగా ఈ స్థావరాన్ని సందర్శించారు. ఇర్బిల్ స్థావరం కుర్దిస్తాన్ ప్రాంతంలో ఇర్బిల్ స్థావరం ఉంది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఏరివేతకు అమెరికా ఈ స్థావరాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుంది. 2018 క్రిస్మస్ సెలవుల్లో ట్రంప్ అనూహ్యంగా ఇరాక్‌కు వచ్చి ఈ స్థావరాన్ని సందర్శించారు. డెల్టా ఫోర్స్ కమాండోలు ఈ స్థావరాన్నే ప్రధాన కేంద్రంగా చేసుకొని నిర్వహించిన ఆపరేషన్‌లో గత ఏడాది అక్టోబర్‌లో ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాది హతమయ్యాడు. అమెరికా బలగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ని అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ నుంచే వీక్షించారు. 2015లో ఐసిస్ తీవ్రవాదులు పలుమార్లు ఈ స్థావరాన్నే లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. 13 దేశాలకు చెందిన సంకీర్ణ బలగాలు, ఇతర సిబ్బంది ఇక్కడ ఉన్నారు. ఇరాక్‌లో మొత్తం అమెరికా బలగాలు: 6,000 అల్ అసద్ స్థావరంలో అగ్రరాజ్యం సైనికులు: 1,500 ఇర్బిల్ స్థావరంలో బలగాలు: 3,000 జనరల్ సులేమానీ హత్య తర్వాత ఇరాక్ పార్లమెంటు అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవాలంటూ తీర్మానించింది. కానీ అల్ అసద్ స్థావరాన్ని ఆధునికంగా తీర్చిదిద్దడానికి అమెరికా వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని, వాటిని తిరిగి చెల్లించే వరకు ఇరాక్ నుంచి కదిలే ప్రసక్తే లేదని ట్రంప్ అంటున్నారు. -
'ఈ దాడులు అమెరికాకు చెంపపెట్టు'
టెహ్రాన్ : ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై మంగళవారం రాత్రి జరిపిన క్షిపణి దాడులపై ఇరాన్ సుప్రీం కమాండర్, అగ్రనేత అయతోల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇరాన్‌లోని పవిత్రమైన ఖోమ్ నగరంలో ఏర్పాటు చేసిన ఖాసీం సులేమానీ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖమేనీ మాట్లాడుతూ.. తాము గత రాత్రి ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేశామని పేర్కొన్నారు. ఈ దాడులతో తమలో కూడా తిరుగుబాటు ఇంకా బతికే ఉందని నిరూపించామని వెల్లడించారు. ఈ క్షిపణి దాడులు అమెరికాకు చెంపపెట్టులాంటిది అవుతుందని తెలిపారు. తాము చేసే ప్రతీకార దాడులు, సైనిక చర్యలు తమకు జరిగిన నష్టాన్ని పూరించలేవని తెలిపారు. నిన్న రాత్రి అమెరికా స్ధావరాలపై జరిగిన దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని మున్ముందు ఇలాంటివి చూడడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని ఖమేనీ హెచ్చరించారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఉనికికి ముగింపు పలకడమే తమ కర్తవ్యమని ఖమేనీ పేర్కొన్నారు. చదవండి: 80 మంది చచ్చారు.. మళ్లీ దాడికి తెగబడితే.. రేపే ప్రకటన.. ఆత్మరక్షణ కోసమే ‘భారత్ ముందుకొస్తే స్వాగతిస్తాం’! -
కమాండర్ హత్య: వీడియో పోస్టు చేసిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్ ఖాసీం సొలెమాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఖాసీం హత్యతో ఇరాకీలు సంబరాలు చేసుకుంటున్నారని, జాతీయ పతాకంతో ఇరాకీ వీధుల్లో కోలాహలం నెలకొందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘స్వేచ్ఛ కోసం ఇరాకీలు వీధుల్లో నృత్యాలు చేస్తున్నారు. జనరల్ సోలెమాన్ లేకపోవడమే అందుకు కారణం’ అని పేర్కొన్నారు. రోడ్డు మీద ఇరాకీలు జాతీయ జెండాతో, ఇతర బ్యానర్లతో పరిగెత్తుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్, ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందారు. వీరిద్దరి మృతితో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిపోయాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు సోలెమన్‌ను చంపినట్టు అమెరికా ప్రకటించగా.. అమెరికా అవివేక చర్యకు తీవ్ర ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ హెచ్చరించింది. అమెరికా తాజా చర్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యకు దిగుతుందోనన్న ఆందోళన నెలకొంది. చదవండి: అమెరికాది అవివేకపు చర్య : ఇరాన్ ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్ -
అమెరికాది అవివేకపు చర్య : ఇరాన్
టెహ్రాన్ : బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా బలగాలు రాకెట్ దాడి జరపడాన్ని ఇరాన్ అవివేకపు చర్యగా అభివర్ణించింది. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలెమన్‌ను చంపాడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ దాడి భయంకరమైనదని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ అన్నారు. అమెరికా చర్యను అంతర్జాతీయ ఉగ్రవాదంగా పేర్కొన్నారు. ఈ వంచన చర్యతో ఎదురయ్యే పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇరాన్లో అమెరికా ప్రయోజనాలను చూస్తున్న స్విస్ దౌత్యకార్యాలయానికి సమన్లు పంపారు. అలాగే మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారు. సోలెమాన్ హత్యకు తీవ్ర ప్రతీకారం తప్పదని అమెరికాను హెచ్చరించారు. కాగా, శుక్రవారం బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై అమెరికా జరిపిన రాకెట్ దాడిలో ఇరాన్ క్వాడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్‌తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని పెంటగాన్ వెల్లడించింది. చదవండి : ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి.. 8 మంది మృతి ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్


