Live Updates
అమెరికా సైన్యం తొమ్మిది ఇరానియన్ నౌకలను ముంచేసింది: ట్రంప్
అమెరికా భారీ దాడి.. IRGC ప్రధాన కార్యాలయం ధ్వంసం
- అమెరికా సైన్యం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పై భారీ దాడి జరిపి వారి ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి.
- గత 47 ఏళ్లలో IRGC 1,000 మందికి పైగా అమెరికన్లను హతమార్చిందని అమెరికా ఆరోపిస్తోంది.
- అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని, IRGC ఇకపై ప్రధాన కార్యాలయం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
అమెరికా సైన్యం తొమ్మిది ఇరానియన్ నౌకలను ముంచేసింది: ట్రంప్
- అమెరికా సైన్యం తొమ్మిది ఇరానియన్ నౌకలను ముంచేసింది.
- ఇరాన్ నేవీ ప్రధాన కార్యాలయాన్ని కూడా భాగంగా ధ్వంసం చేశాం.
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన.
- హోర్ముజ్ జలసంధిలో మూడు నౌకలు దాడికి గురయ్యాయని బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ UKMTO తెలిపింది.
- ఒక నౌకపై క్షిపణి దాడి జరగగా, అగ్ని ప్రమాదం నియంత్రణలోకి వచ్చింది.
- మరో ట్యాంకర్‌పై దాడి జరగగా, మంటలు ఆర్పివేసి ప్రయాణం కొనసాగిస్తున్నట్లు సమాచారం.
- UAE తీరానికి సమీపంలో మరో నౌకపై క్షిపణి పేలుడు సంభవించింది.
కువైట్‌లోని యూఎస్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడులు
- కువైట్‌లోని యూఎస్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడులు
- యూఎస్ ఎయిర్‌బేస్‌లే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ల వర్షం
యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన
- దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారు
- అంతా మంచే జరుగుతుంది.. ఆందోళన వద్దు
- చమురు ధరలపై ఆందోళన చెందొద్దు
ఒమన్ ఆయిల్ ట్యాంకర్ పై దాడి
ఒమన్ ఆయిల్ ట్యాంకర్ పై దాడి
15 మంది భారతీయ నావికులను రక్షించిన ఒమన్ యంత్రాంగం
యుఎస్ స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు
- ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో ముగ్గురు అమెరికన్ సైనికుల మృతి
- ఐదుగురు సైనికులకు తీవ్రగాయాలు, పలువురికి స్వల్పగాయాలు
- సైనికుల మృతిని ధృవీకరించిన యుఎస్ సెంట్రల్ కమాండ్
- పశ్చిమాసియాలో యూఎస్ స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు
- మృతులో వివరాలను మరో 24 గంటల్లో వెల్లడిస్తామన్న యూఎస్
ఖమేనీ హత్యను వ్యతిరేకిస్తూ కర్ణాటకాలో నిరసన
- ఆల్ ఇండియా షియా కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో నిరసన
- నల్ల చొక్కాలు ధరించి, నల్ల జెండాలు చేతబట్టి నిరసన
#WATCH | Karnataka: Members of the All India Shia Council hold a protest in Chikkaballapur against the killing of Iran's Supreme Leader Ayatollah Ali Khamenei, who was killed in Israeli and US strikes.
A protestor says, "My daughter is doing an internship in Iran... She is… pic.twitter.com/Ui1zHMp1gl— ANI (@ANI) March 1, 2026
ఇరాన్ దాడులపై యూఏఈ ప్రకటన
- 165 బాలిస్టిక్ మిస్సైళ్లు, 2 క్రూయిజ్ మిస్సైళ్లు, 541 డ్రోన్ దాడులను ఎదుర్కొన్నాం
- చాలా వరకూ గాల్లోనే ధ్వంసం చేశాం
- ఇరాన్ దాడుల్లో ముగ్గురు చనిపోయారు
- మృతులు పాక్, నేపాల్, బంగ్లా వాసులు
- వివిధ దేశాలకు చెందిన 58 మంది గాయపడ్డారు
- గాయపడ్డవారిలో భారతీయులు కూడా ఉన్నారు
జెరుసలెంపై ఇరాన్ దాడి
- ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- జెరుసలెంలోని నివాసంపై ఇరాన్ క్షిపణిదాడి
- క్షిపణి ఢీకొట్టడంతో కూలిన భవనం
- 8మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
మిడిల్ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో CBSE పరీక్షలపై ప్రకటన
- రేపు జరగాల్సిన 10,12 తరగతుల ఎగ్జామ్స్ వాయిదా
- ఎల్లుండి పరిస్థితిని సమీక్షించనున్న CBSE
- బహ్రెయిన్,ఇరాన్,కువైట్, ఒమన్, ఖతర్
- సౌదీ అరేబియా, యూఏఈలో జరగనున్న పరీక్షలపై CBSE ప్రకటన
గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో భారత్ కీలక సూచన
- భారత నావికులు అప్రమత్తంగా ఉండాలి
- యుద్ధం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలి
- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సూచనలు చేసిన భారత్
గల్ప్ దేశాల్లో ఉన్న తెలుగుప్రజలకు సీఎం రేవంత్ సూచన
- తెలంగాణ వాసుల పరిస్థితిని సమీక్షిస్తున్నాం
- ఆ ప్రాంతాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచన
- ఎంబసీ మార్గదర్శకాలు పాటించాలని కోరిన సీఎం రేవంత్
- కేంద్రంతో చర్చలు జరిపి తెలంగాణకు రప్పించేలా చర్యలు తీసుకుంటాం
టెహ్రాన్‌పై దాడులు.. 57 మంది మృతి
గడిచిన 24 గంటల్లో60 ఎటాక్స్ జరగాయన్న ఇరాన్
ఈ దాడులలో 57 మంది మృతి చెందినట్లు ప్రకటించిన ఇరాన్
ఇరాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు
- ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి ఏర్పాటు
కశ్మీర్‌లో ఖమేనీ మృతికి వ్యతిరేకంగా నిరసనలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా కశ్మీర్‌లో నిరసనలు
- కశ్మీర్ అంతటా పెద్దఎత్తున నిరసనలు
- కశ్మీర్‌లో రెండురోజుల పాటు స్కూళ్లు, కాలేజీల బంద్
సైప్రస్‌పై ఇరాన్ మిసైళ్ల దాడి
- సైప్రస్‌పై మిసైళ్ల వర్షం కురిసిస్తున్న ఇరాన్
- యుకే స్థావరాలే లక్షంగా దాడులు జరుపుతున్న ఇరాన్
ఇరాన్‌పై దాడులను ఖండించిన రష్యా, చైనా
- ఇజ్రాయెల్-యుఎస్ దాడులపై చైనా,రష్యా చర్చలు
- ఇరాన్‌లో పాలన మార్చాలనుకోవడం సరైంది కాదు:చైనా
- చర్చలు కొనసాగుతున్నప్పుడు దాడులు చేయడం సరైంది కాదు
- దాడులను వెంటనే ఆపాలి: చైనా
ఇరాన్ దాడులపై స్పందించిన నార్త్ కొరియా
- ఇరాన్‌పై దాడి చేయడం చట్టవిరుద్ధమైంది
- అమెరికా ఈ దాడిలో పాల్గొనడం ఊహించిందే.
- ఈ దాడి ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదన్న నార్త్ కొరియా విదేశాంగ శాఖ
ఇరాన్ వార్ ఎఫెక్ట్.. ముంబైలో విమానాల రద్దు
- ముంబై ఎయిర్‌పోర్టులో 225 విమానాల రద్దు
- మధ్య ఆసియాలో పరిస్థితుల నేపథ్యంలో విమానాల రద్దు
ఖమేనీ మృతిపై రష్యా అధ్యక్షుడి సంతాపం
- ఇరాన్ సుప్రీం లీడర్ మృతిపై సంతాపం తెలిపిన పుతిన్
- అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి దాడులు
ఖమేనీ మృతిపై హైదరాబాద్‌లో నిరసనలు
- ఖమేనీ మృతిపై హైదరాబాద్‌లో నిరసనలు
- అమెరికా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు
ఖమేనీ హత్యను ఖండించిన అసుదుద్దీన్ ఒవైసీ
- ఖమేనీ హత్య పిరికిపంద చర్య
- ఇరాన్ దీనికి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటుంది
- ఈ యుద్ధం కొనసాగితే చమురు ధరలు పెరుగుతాయి
#WATCH | Hyderabad: AIMIM Chief Asaduddin Owaisi says, "A respected leader of Iran, Ayatollah Khamenei was killed, the Iranians will definitely retaliate... While the peace talks were underway in Geneva, the attack was launched. This is a cowardly and inhuman attack... If this… pic.twitter.com/sbPe35Rv2o
— ANI (@ANI) March 1, 2026
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ ఎంపిక
- తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆయాతుల్లా అలిరెజా అరాఫీ ఎన్నిక
- ఖమేనీ అత్యంత సన్నిహిత వర్గంలో అరాఫీ ఒకరు
- ప్రస్తుతం ఇరాన్ సెమిసరీ సిస్టమ్ హెడ్‌గా వ్యవహారిస్తున్న అయతుల్లా అరాఫీ
- ముగ్గురు సభ్యులున్న లీడర్ షిప్ కౌన్సిల్‌లో చేరిన అరాఫీ
- అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ IRGC చీఫ్ మహ్మద్ మృతి
- IRGC కొత్త చీఫ్‌గా అహ్మద్ వహిది ఎంపిక
ఖమేనీ హత్యను ఖండించిన జమ్మాకశ్మీర్ మాజీ సీఎం
- ఇరాన్ పరిస్థితి ప్రపంచానికి ఓ పాఠమన్నమెహబూబా ముఫ్తీ
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తన లక్షం కోసం అమెరికాను వాడుకున్నాడు
- అమెరికాను కీలుబొమ్మగా నెతన్యాహూ వాడారు.
- భారత్‌కు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే శక్తి ఉంది
- కానీ అమెరికాతో సంబంధాల వల్ల ఏం చేయలేకుండా ఉంది
- జమ్మూ బంధుకు పీడీపీ సంపూర్ణ మద్ధతిస్తుంది
- ఇరాన్ ప్రజలతో మా ప్రజలకు సత్సంబంధాలుండేవి.
#WATCH | Srinagar, J&K: PDP chief Mehbooba Mufti says, "I don't have the words right now. The incident that took place right now, in which Allah grants the Supreme Leader of Iran martyrdom. The situation in Iran right now is a lesson for the whole world to see how a war criminal,… pic.twitter.com/hTpBhEwEUe
— ANI (@ANI) March 1, 2026
యూఏఈపై విరుచుకపడుతున్న ఇరాన్
- యూఏఈపై ఇరాన్ భీకర దాడులు
- షార్జాలో అతిపెద్ద షాపింగ్ మాల్ ధ్వంసం
ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా జమ్మూలో ఆందోళన
- ఖమేనీ హత్యకు నిరసనగా జమ్మూలో ఆందోళన
- ఐక్యరాజ్యసమితి మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ కార్యాలయం ఎదుట నిరసన
- ఆందోళన చేపట్టిన షియా మతస్తులు
- ర్యాలీగా బయిలుదేరి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు
#WATCH | Srinagar, J&K: Shia community people protest outside the United Nations Military Observer Group HQ after the death of Iranian Supreme Commander Ayatollah Ali Khamenei. pic.twitter.com/9SBOQLdlTV
— ANI (@ANI) March 1, 2026
40 మంది ఇరాన్ టాఫ్ కమాండర్స్ హతం
- యుఎస్ ఇజ్రెయెల్ దాడుల్లో 40 టాఫ్ కమాండర్స్ హతం
- 40 మంది టాప్ కమాండెర్స్ హతం
- ఇరాన్‌లో ఉగ్రవాద పాలన నాయకత్వం అంతమైనట్లు ప్రకటించిన ఇజ్రాయెల్
ఖమేనీ హత్యపై బెంగళూరులో నిరసన
- ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా కర్ణాటకలోని బెంగళూరు నగరంలో షియా ముస్లిం కమ్యూనిటీకి చెందిన మహిళలు నిరసన
#WATCH | Bengaluru, Karnataka: Women of the Shia Muslim community protest against the killing of Iran's Supreme Leader Ayatollah Ali Khamenei, who has been killed in Israeli and US strikes pic.twitter.com/80FIkFvDqo
— ANI (@ANI) March 1, 2026
ఇరాన్ వార్ ఎఫెక్ట్... ఢిల్లీలో100 విమానాలు రద్దు
- మధ్య ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల రీత్యా విమానాల నిలిపివేత
- ఢిల్లీనుంచి వెళ్లాల్సిన 60 విమానాల రద్దు
- ఢిల్లీకి రావాల్సిన 40 విమానాల రద్దు
ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
- ఇరాన్‌లోని అన్ని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేస్తాం
- టెర్రరిస్ట్ ప్రాంతాలన్నీ ధ్వంసం చేస్తాం
- ఇరాన్‌లో ఉగ్రవాద పాలనను పడగొడతాం
- టెహ్రాన్‌లోని IRGC హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ దాడి
- దాడి వీడియోని విడుదల చేసిన ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్
The Israeli Air Force released footage of massive strikes on IRGC headquarters in Tehran... pic.twitter.com/UO1HNshk0h
— THE INFYN (@theinfyn) March 1, 2026
- ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
- హర్‌ముంజ్ జలసంధిలో ఉన్న ట్యాంకర్పై దాడి
- దాడి సమయంలో ఆయిల్‌ట్యాంకర్‌లో ఇండియన్స్
- దాడితో నలుగురికి తీవ్రగాయాలు
మా ప్రతీకార దాడులు కరెక్టే.. ఇరాన్ ప్రెసిడెంట్
- ఇజ్రాయెల్, అమెరికాలకు మాదాడులకు బదులిస్తాం ఇరాన్ ప్రెసిడెంట్
- ప్రతీకార దాడులతో శత్రువును దెబ్బతీస్తాం
- మా ప్రతీకార దాడులు చట్టబద్దమైనవి ఇరాన్ ప్రెసిడెంట్
ఒమన్‌పై ఇరాన్ దాడి
- ఒమన్ పోర్టుపై దాడి చేసిన ఇరాన్
- ఇరాన్ దాడులతో కువైట్, బహ్రెయిన్‌లలో సైరన్ల మోత
- యఎఈ, ఖతార్‌లలో భారీ పేలుళ్లు
- అబుదాబీ విమానాశ్రయంపై ఇరాన్ దాడి
- లెబనాన్‌లోని యూఎస్ ఎంబసీలే టార్గెట్‌గా ఇరాన్ దాడులు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాంబుల వర్షం
- ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం
- టెల్‌అవీవ్‌తో సహా పలు ప్రాంతాల్లో విధ్వంసం
- ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలే టార్గెట్‌గా దాడులు
బూర్జ్ ఖలీపా మీదుగా దూసుకెళ్లిన డ్రోన్
- దుబాయ్ ఎయిర్‌పోర్టును తాకిన డ్రోన్
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ఎయిర్‌పోర్టు
- బూర్జ్ ఖలీపా మీదుగా దూసుకెళ్లిన క్షిపణి
పాకిస్థాన్ పౌరులపై యుఎస్ ఆర్మీ కాల్పులు
- పాకిస్థాన్‌లో యుఎస్ ఆర్మీ కాల్పులు
- పాకిస్థాన్ పౌరులపై కాల్పులు జరిపిన ఆర్మీ
- 8 మంది పాక్ పౌరులు మృతి
పాక్: కరాచీలోని యూఎస్ కాన్సులేట్‌పై దాడి
- కర్రలు, రాళ్లతో ఆందోళనకారుల దాడి
- యూఎస్ కాన్సులేట్‌కు నిప్పుపెట్టే ప్రయత్నం
- ఆందోళనకారులపై టీయర్ గ్యాస్ ప్రయోగం
ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- ప్రతీకారానికి దిగకపోవడం ఇరాన్‌కు మంచిది: ట్రంప్
- ప్రతీదాడులు చేస్తే మరింత తీవ్ర పరిణామాలు తప్పవు
- అమెరికా హద్దు మీరింది.. మూల్యం చెల్లించుకోక తప్పదు: ఇరాన్
- యూఎస్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తాం: ఇరాన్
ఖమేనీ హత్యకు నిరసనగా ఇరాన్ ప్రతీకార దాడులు
- యూఎస్, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చకుంటాం: ఇరాన్
- ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో సైరన్ వార్నింగ్స్
- ఇజ్రాయెల్, జోర్డాన్‌పై ఇరాన్ క్షిపణ దాడులు
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు
- ఇరాన్ డ్రోన్లను ధ్వంసం చేస్తున్న ఇజ్రాయెల్
ఇరాన్ ప్రతీకార దాడులు..
- దుబాయ్‌ను టార్గెట్ ఇరాన్
- దుబాయ్‌పై ఇరాన్ బాంబుల వర్షం..
Big boom 8.13 am Dubai time pic.twitter.com/O8DeMqSx7q
— Mountain Rats (@mountain_rats) March 1, 2026
An Iranian Shahed-136 drone has reportedly struck civilian infrastructure in Dubai, marking a dangerous escalation in the 2026 Middle East conflict. Following massive U.S.-Israeli strikes on Tehran, the Iranian Shahed-136 drone was deployed in waves against UAE, Bahrain, Qatar. pic.twitter.com/2R7C875lHm
— Shogri (@shogri786) March 1, 2026
A Zionist can be heard CRYING as Iranian rockets hits Dubai.
No more Dubai chocolate!pic.twitter.com/LoDiWF4tpD— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) March 1, 2026
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు.
- ఇజ్రాయెల్‌పై దాడులు తీవ్రతరం చేసిన ఇరాన్.
- జెరూసలేం గగనతలంలో కనిపించిన ఇరాన్ డ్రోన్లు.
- ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో సైరన్ వార్నింగ్స్
- ఇరాన్ డ్రోన్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్.
- ఇరాన్ దాడుల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు ధ్వంసం.
దుబాయ్ దాడులు కొనసాగిస్తున్న ఇరాన్
- దుబాయ్‌లోని సీఐఏ కేంద్రంపై దాడులు
- తాజాగా దోహాలో బాంబు దాడులు
- గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై గురిపెట్టిన ఇరాన్
- ఇరాన్ ప్రతీకార దాడులు నేపథ్యంలో అమెరికా అప్రమత్తం
- ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులకు దిగిన అమెరికా
ఖమేనీ మృతిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ కేబినెట్
- ఖమేనీ మృతిని మహానేరంగా అభివర్ణించిన ఇరాన్ కేబినెట్
- గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయాం: ఇరాన్
- దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారు
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనే?
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు మొజ్తబాకు ఖమేనీ?
- అయుతుల్లా ఖమేనీ మృతిలో ఆయన స్థానంలో అతడి రెండో కుమారుడు బాధ్యతలు.
- ఇరాన్ ఆర్మీ చీఫ్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చీఫ్ మహమ్మద్ పక్ పౌర్ మృతి.
- ఈ నేపథ్యంలో కొత్త ఐఆర్‌జీసీ చీఫ్‌గా అహ్మద్ వహిదీ నియామకం.
- ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్సెస్‌కు కమాండర్‌గా వ్యవహరించిన మహమ్మద్ పక్ పౌర్.
🚨🇮🇷 BREAKING: Reports that Mojtaba Khamenei, son of the late Supreme Leader, has been named as Iran's new Supreme Leader.
Father to son. Mojtaba has long been considered the shadow power behind the regime, controlling key IRGC appointments, overseeing intelligence operations pic.twitter.com/wtFXhJFKeQ— METRONIDAZOLE (@METRO_NIDAZOLE) March 1, 2026
ఖమేనీ బాధితులకు న్యాయం చేశాం: ట్రంప్
- ఖమేనీ మృతి.. ఇరాన్ ప్రజలకే కాదు.. అమెరికన్లకు గొప్ప విజయం: ట్రంప్
- ఖమేనీ బాధితులకు న్యాయం చేశాం.
- ఇరానియన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం.
- అమెరికా నిఘా, అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారు.
- ఇరాన్‌లోని ఇతర నాయకులు చేయగలిగేదిల ఏమీ లేదు.
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, సైన్యం, పోలీసులు మాతో పోరాడాలనుకోవట్లేదు.
- ఇరాన్ సైన్యం మా నుంచి మద్దుతు కోరుకుంటున్నారు.
అమెరికాలో నిరసనలు..
- ఇరాన్‌పై దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసన
- న్యూయార్క్ టైమ్‌స్క్వేర్ వద్ద పెద్దఎత్తున గుమిగూడిన ప్రజలు
- అమెరికాలోని కొలంబో సర్కిల్ చుట్టూ కవాతు చేసిన నిరసనకారులు.
ఖమేనీ ప్రస్థానం ఇలా..
- ఖమేనీ ప్రస్థానం ఇలా..
- 1989లో ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు తీసుకున్న ఖమేనీ
- ఇరాన్‌ను బలమైన మత రాజ్యంగా మలిచిన అయతుల్లా అలీ ఖమేనీ
- ఇరాన్‌ను ప్రాంతీయ శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించిన ఖమేనీ
- ఇరాన్‌లోని ప్రజాస్వామ్య ఆందోళనలను కఠినంగా అణచివేసిన ఖమేనీ
- ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్‌ను సైనిక, ఆర్థిక శక్తిగా మార్చిన ఖమేనీ
- ఇరాన్ అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసిన అయతుల్లా అలీ ఖమేనీ
- ఖమేనీ మరణంతో అనిశ్చితిలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్తు
- ఇరాన్ కొత్త నాయకుడిని ఎన్నుకోనున్న 88 మంది సభ్యుల అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్
ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ఇజ్రాయెల్
- ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు
- ఇరాన్‌లో 30కి పైగా స్థావరాలను లక్ష్యాలు చేసుకున్నాం
- మా లక్ష్యాల్లో ఇరాన్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లు ఉన్నాయి
- ఇరాన్ పాలకులు, సైనిక కమాండ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాం.
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన.
- ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన.
- ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
- గొప్ప నాయకుడిని కోల్పోయాం.
- దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీర మరణం పొందారు.
- పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారు.
దాడులపై ఇరాన్ కేబినెట్ ఫైర్
- అనిశ్చితిలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్
- కొన్ని నాయకుడిని ఎన్నుకోనున్న 88 మంది అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్.
- ఖమేనీ మృతిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ కేబినెట్.
- ఖమేనీ మృతిని మహానేరంగా అభివర్ణించిన ఇరాన్ కేబినెట్.
- సరైన సమాధానం చెప్పకుండా వదిలేదన్న ఇరాన్ కేబినెట్.
40 రోజులు సంతాప దినాలు..
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం.
- 40 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఇరాన్
🔴 Iran announces 40 days of national mourning after martyrdom of Leader of Islamic Revolution pic.twitter.com/uQrUfO1Fj9
— Press TV 🔻 (@PressTV) March 1, 2026
ఖమేనీ మృతి చెందినట్టు ట్రంప్ ప్రకటన..
- ఖమేనీ మృతిపై ట్రంప్ అధికారిక ప్రకటన.
- సోషల్ మీడియా ట్రుత్ వేదికగా ట్రంప్ పోస్టు.
- ఇరానియన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం.
- ఇరాన్‌పై భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి.
- ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణమంత్రి అమీర్ నాసిర్జాదే మృతి.
- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ గార్డ్స్ కమాండర్ పక్పూర్ మృతి
ఏడుగురు సీనియర్ అధికారులు హతం..
- ఇజ్రాయెల్ దాడుల్లో ఏడుగురు సీనియర్ అధికారులు హతం.
- IAF ఫైటర్ జెట్‌లు ఇరాన్ అంతటా సైనిక లక్ష్యాలను ఢీకొట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటన.
- ఇరాన్ రక్షణ నాయకత్వంలోని ఏడుగురు సీనియర్ అధికారులు మృతి.
- అలీ షంఖానీ, మొహమ్మద్ పక్‌పూర్, సలేహ్ అసది, మొహమ్మద్ షిరాజీ, అజీజ్ నాసిర్జాదే, హుస్సేన్ జబల్ అమేలియన్, రెజా మొజాఫారి-నియా హతం.
- ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ అధికారిక ప్రకటన.
🔴ELIMINATED:
IAF fighter jets precisely struck military targets across Iran, eliminating 7 senior officials of the Iranian Defense Leadership:
Ali Shamkhani, Mohammad Pakpour, Saleh Asadi, Mohammad Shirazi, Aziz Nasirzadeh, Hossein Jabal Amelian, Reza Mozaffari-Nia.
The world… pic.twitter.com/747uf7kJ4J— Israeli Air Force (@IAFsite) February 28, 2026
ఖమేనీ ఫ్యామిలీ హతం..
- ఇజ్రాయెల్-అమెరికా దాడులతో ఇరాన్ అతలాకుతలం.
- దాడుల్లో ఖమేనీ మృతి.
- అమెరికా దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి.
- ఖమేనీ నివాసంపై ఆధునిక క్షిపణులతో విరుచుకుపడిన యూఎస్, ఇజ్రాయెల్ దళాలు.
🛩️THE LARGEST MILITARY FLYOVER IN IDF HISTORY:
~200 IAF jets completed a broad strike against the missile array and the aerial defense systems of the IRGC in western and central Iran.
500+ targets hit, including aerial defense systems & missile launchers in several locations… pic.twitter.com/PVOuzlOekj— Israel Defense Forces (@IDF) February 28, 2026
ఖమేనీ మృతి.. అధికారిక ప్రకటన
- అమెరికా ఇజ్రాయిల్ మిలటరీ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం
- అధికారికంగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- ఖమేనీ నివాసం నేలమట్టం అయిందని తెలిపిన ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యహు
- ఆయన నివాసం పై 30 బాంబులతో దాడి చేసినట్లు వెల్లడి
- మరోవైపు.. ఖమేనీ చనిపోయినట్టు నిర్ధారించిన ఇరాన్ మీడియా
The Supreme Leader of Iran, Ayatollah Seyyed Ali Khamenei, is dead; his body has been found: Senior Israeli official to Reuters pic.twitter.com/2q8JdwxLMm
— ANI (@ANI) February 28, 2026


