47 ఏళ్ల నుంచి చచ్చిపోతూనే ఉన్నాను..! | I Have been dead for 47 years Iran Woman Protests | Sakshi
Sakshi News home page

47 ఏళ్ల నుంచి చచ్చిపోతూనే ఉన్నాను..!

Jan 9 2026 11:15 AM | Updated on Jan 9 2026 11:28 AM

I Have been dead for 47 years Iran Woman Protests

ఇరాన్‌లో నిరసనల పర్వం తారాస్థాయికి చేరింది. ఇజ్రాయిల్‌తో యుద్ధం అనంతరం  ఇరాన్‌లో రాజకీయ సంక్షోభం ప్రబలింది.  ప్రధానంగా ఇరాన్‌ సుప్రీంలీడర  ఆయుతుల్లా ఖమేనీ నేతృత్వంలో ఇరాన్‌ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతండటంతో ఆ దేశ ప్రజల ఒక్కసారిగా రోడ్లపైకి పెద్ద ఎత్తున వచ్చి నిరసన బాట పట్టారు. ఇక ఖమేనీ శకం అయిపోయిందని,  తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ వినిపిస్తోంది. తమకు స్వేచ్ఛ జీవితం లేదని, ఇరాన్‌లో చచ్చి బతుకుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

47 ఏళ్లగా చచ్చిపోయే ఉన్నాను..
ఒక మహిళ తడిసిన రక్తంతో పెద్ద పెద్దగా అరుస్తూ ఖమేనీ ప్రభుత్వంపై తన నిరసనను వ్యక్తం చేసింది.  ఆమె నాలుకపై రక్తం కారుతున్న దృశ్యాలు అత్యంత బాధాకరంగా కనిపిస్తున్నాయి. ‘ నేను 47 ఏళ్లుగా చచ్చిపోయే ఉన్నాను.. ఇంకా భయమెందుకు. ఇంకా కొత్తగా చచ్చిపోయేదేముంది’ అంటూ పెద్దగా కేకలు పెడుతూ నిరసన వ్యక్తం చేయడం అక్కడ ఖమేనీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు అద్దం పడుతోంది. 

నియంత ఇక లేడు.. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ కూడా ఉండదు..!
 ఇరాన్‌ నియంతగా పేరు గాంచిన ఖమేనీ ఇక లేడని, ఆయనకు చెందిన ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ పార్టీ కూడా ఇక ఇరాన్‌లో ఉండదని ప్రజలు తమ నిరసన గళం విప్పారు. తాము ఖమేనీ పాలనలో నలిగిపోయే ఉన్నామని, ఇక ఆ పరిపాలన వద్దంటూ కదం తొక్కుతున్నారు. ఖమేనీ స్వచ్ఛదందగా రాజీనామా చేస్తే ఓకే కానీ ఒకవేళ అలా జరగని పక్షంలో తామే గద్దె దింపుతామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నా..  ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. 

 


 ఇదీ చదవండి:

ఇరాన్‌లో ఉధృతమైన ‘స్వేచ్ఛా’ స్వరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement