అఫ్గానిస్థాన్- పాకిస్థాన్ మధ్య అధికారికంగా యుద్ధం మెుదలైంది. గజీబ్ లిల్ హాక్ పేరుతో మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ రాజధాని కాబూల్‌పై వైమానిక దాడులతో పాక్ విరుచుకపడుతుంది. ఇప్పటివరకూ పాక్ జరిపిన దాడుల్లో 130 మంది తాలిబన్లు మృతిచెందినట్లు పాక్ ప్రకటించింది.
కాగా నిన్న( గురువారం) రాత్రి పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ దాడులతో విరుచుకు పడింది. పాక్ సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో 70 మందికి పైగా ఆ దేశ సైనికులు మృతిచెందినట్లు తాలిబన్లు ప్రకటించారు. పెద్దమెుత్తంలో సైనికస్థావరాలు ధ్వంసమైనట్లు తెలిపారు. పాక్ సైనిక స్థావరాలే లక్షంగా దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే దీనికి ప్రతీకారంగా అఫ్గాన్‌తో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. కాబూల్‌తో పాటు, కాందహార్ పై ఎయిర్‌స్ట్రైక్స్ చేస్తున్నట్లు తెలిపింది
కాగా పాక్ జరిపిన దాడిలో ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే కొద్దిరోజులుగా పాక్- అఫ్గాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాలలో పాకిస్థాన్ దాడులు జరుపగా దాదాపు 70 మంది దాకా అఫ్గాన్ పౌరులు మృతిచెందారు. దీనికి బదులుగా పాకిస్థాన్‌పై అప్గానిస్థాన్ అటాక్ చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


