ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర | US Court Probes Iran Backed Assassination Plot Against Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర

Feb 27 2026 5:14 AM | Updated on Feb 27 2026 11:01 PM

US Court Probes Iran Backed Assassination Plot Against Trump

వాషింగ్టన్‌: అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసిన ఈ కేసు ప్రస్తుతం న్యూయార్క్‌లో విచారణ దశలో ఉంది. పాకిస్తాన్‌కు చెందిన అసిఫ్ మర్చంట్ అనే వ్యక్తి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు తాజాగా కోర్టు విచారణ లో తేలింది. ఆసిఫ్‌ పాక్‌ జాతీయుడియే అయినా ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. 

2024లో అమెరికాలోకి ప్రవేశించిన అసిఫ్, న్యూయార్క్ చేరిన కొద్ది రోజుల్లోనే కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ అతను కలిసిన వారు వాస్తవానికి ఎఫ్‌బీఐ గూఢచారులు కావడంతో మొత్తం కుట్ర బయటపడింది. విచారణలో అసిఫ్ ఇద్దరికి 5వేల డాలర్ల అడ్వాన్స్ చెల్లించినట్లు రుజువైంది.

ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. నిందితుడు దోషిగా తేలితే అతనికి జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉంది. అమెరికా న్యాయ శాఖ ఈ కేసును ‘మర్డర్-ఫర్-హైర్ కుట్ర’గా పేర్కొంటూ, దేశ రాజకీయ నాయకులపై దాడి ప్రయత్నం అత్యంత తీవ్రమైన నేరమని స్పష్టం చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement