breaking news
protests
-
21వ రోజుకు విద్యార్థుల నిరసన
రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలు శుక్రవారం 21వ రోజుకు చేరుకున్నాయి. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరంగా యాత్ర చేపడతామని విద్యార్థులు తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరంగా యాత్రతో తమ ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో మరింత పారదర్శకతను తేవాలని, పలు పరీక్షలను రద్దు చేసి, సీబీఐ లేదా రా్రõÙ్టతర రిటైర్డ్ జడ్జీలతో విచారణ జరిపించాలనే డిమాండ్లతో విద్యార్థులు నిరసనలను కొనసాగిస్తుండటం తెల్సిందే. ఈ నెల 10వ తేదీన చలో అసెంబ్లీ సందర్బంగా జరిగిన నిరసనలకు సంబంధించి పోలీసులు 300 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు పెట్టారు. కాగా, గత 13 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఆస్పత్రిలో చేరిన జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికార్ మోర్చా(జేఎల్కేఎం) నేత దేవేంద్రనాథ్ మహతో ఆరోగ్యం విషమంగా మారింది. ఆయనతోపాటు దీక్ష చేపట్టిన మరో నలుగురు విద్యార్థులకు కూడా సదర్ ఆస్పత్రిలోనే చికిత్సలు అందుతున్నాయి. -
టీచర్‌కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ఆల్ఫా
దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్‌లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్‌జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మరీ వయొలెంట్‌గా ఉండడంతో.. నెట్టింట ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది. కొత్త తరం పిల్లలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి బదిలీని వ్యతిరేకిస్తూ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. కాండీ బ్లాక్ పరిధిలో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన బ్లాక్ చీఫ్ పింకు పాండే.. ఓ విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అసలు ఏం జరిగిందంటే..గర్వా జిల్లాలోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీ కావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీని నిలిపివేయాలంటూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీళ్లకు తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. మొదట జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన.. తర్వాత కాండీ బ్లాక్ వరకు విస్తరించింది. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.ఈ తరుణంలో విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ చీఫ్ పింకు పాండే అక్కడికి చేరుకున్నారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. పాండే వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.ఆ తర్వాత విద్యార్థులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.జెన్ ఆల్ఫా గళం.. స్కూల్ రోడ్డు కోసం పోరు!ఉత్తరప్రదేశ్‌లోని చందూపూర్ గ్రామంలో జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ సమస్యపై గళమెత్తారు. స్కూల్‌కు వెళ్లేందుకు సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, బ్యానర్లతో విద్యార్థులు తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలోనూ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ చాలాసార్లు విజ్ఞప్తి చేసినా తాత్కాలికంగా మట్టి పోసి వదిలేశారని, వర్షాలతో మళ్లీ దారంతా బురదగా మారిందని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.జెన్ ఆల్ఫా అంటే ఎవరు?జెన్‌జీ తర్వాతి తరమే జెన్ ఆల్ఫా (Generation Alpha). సాధారణంగా 2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫాగా పరిగణిస్తారు.ఈ తరం పిల్లలు చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ మధ్య పెరిగారు. అందుకే వీరిని కొందరు “డిజిటల్ నేటివ్స్” అని కూడా పిలుస్తారు. వీరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో భయం తక్కువగా ఉంటుందని, సామాజిక అంశాలపై వేగంగా స్పందించే స్వభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటు మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ కొందరు పిల్లలు రోడ్డెక్కడం గమనార్హం.#Jabalpur में Gen Alpha का धरना प्रदर्शन.चीन-अमेरिका हमारे देश की शिक्षा व्यवस्था सुधारने के लिए इन छात्रों को Funding कर रहा है- कट्टर अंधभक्त pic.twitter.com/3IVFzMuuFC— NEYU MADHYAPRADESH (@NEYU4MP) August 13, 2026ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా యువత నిరసనలు, సామాజిక ఉద్యమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ (సుమారు 1997–2012 మధ్య జన్మించిన తరం) ఉద్యమాలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు చిన్న వయసులోనే తమ హక్కులు, న్యాయం, విద్యా సమస్యలపై స్పందిస్తున్న జెన్ ఆల్ఫా పిల్లలు కూడా చర్చలోకి వస్తున్నారు. జార్ఖండ్ ఘటనలో విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి కోసం ఏకంగా రోడ్డెక్కడం.. ఈ కొత్త తరం వైఖరిపై మరోసారి చర్చకు తెరతీసింది. -
తొలగని ప్రతిష్టంభన
రాంచీ: చర్చలకు జార్ఖండ్ ప్రభుత్వం ముందుకొచ్చినా సరే తమ ఉద్యమపంథాను వీడేదిలేదని జార్ఖండ్‌లో పరీక్షల సంస్కరణల కోసం ఉద్యమిస్తున్న పరీక్షార్థులు పునరుద్ఘాటించారు. శుక్రవారం పది మంది సభ్యుల ప్రతినిధి బృందంతో మొదలైన చర్చలు శనివారం సైతం కొనసాగాయి. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి కన్పించలేదు. జార్ఖండ్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ వారి 14వ పరీక్షను రద్దుచేయాలన్న డిమాండ్‌సహా ప్రధాన డిమాండ్లకు సానుకూలంగా ఐదుగురు మంత్రుల ప్రతినిధి బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో రెండో రోజూ చర్చలు సత్ఫలితాలివ్వలేదని తెలుస్తోంది. తమ డిమాండ్లను నెరవేర్చేదాకా రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో తమ నిరాహార దీక్షలు ఆగవని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ శనివారం ప్రకటించింది. శనివారం చర్చలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ బృందం దీక్షాస్థలికి వచ్చి కొద్దిరోజులుగా నిరాహార దీక్షచేస్తున్న ఉద్యమనేత దేవేంద్ర నాథ్ మహతోను కలిసి మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ మద్దతున్న ఎన్ఎస్యూఐ, ఏఎస్ఎస్, జేసీఎం విద్యార్థి సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం విడిగా భేటీ అయింది. ‘‘ఉద్యమిస్తున్న పరీక్షార్థుల డిమాండ్లలో వాస్తవికత దాగిఉంది. ఈ డిమాండ్లను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు నివేదించాం’’అని భేటీ తర్వాత మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ మీడియాతో చెప్పారు. ‘‘సీఎంతో నాలుగు గంటలపాటు చర్చించాం. ఉద్యమనేతలతో ఇప్పటికే ఐదు విడతల చర్చలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం ఆరో విడత చర్చిస్తాం’’అని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ తెలిపారు. ‘‘14వ జేపీఎస్సీ పరీక్ష రద్దు, గత పరీక్షలపై 90 రోజుల్లోపు సీఐడీ విచారణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరహాలో జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు ఇలా ఆరు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుపెట్టామని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ అధికార ప్రతినిధి సంజీవ్ షా తెలిపారు. మరోవైపు విద్యార్థుల ఉద్యమం శనివారం 15వరోజుకు చేరింది. స్టేడియంలో పెద్దసంఖ్యలో విద్యార్థి సంఘా నేతలు, ఉద్యమకారులు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో స్టేడియంను హోరెత్తించారు. అయితే దీక్షలో కూర్చున్న మహతో ఆరోగ్యం క్షీణిస్తోంది. ‘‘శుక్రవారమే మా డిమాండ్లు చెప్పాం. మళ్లీ శనివారం మీ వైఖరేంటని అడగడంలో అర్థంలేదు. నా ఆరోగ్యం పాడవుతోందని వైద్యులు హెచ్చరించారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకింది. ఇది ఇలాగే కొనసాగితే మాట్లాడలేను. రక్తపోటు, చక్కర స్థాయిలు పడిపోతున్నాయి. మీరు చెప్పే విషయాలు వినగలను. కానీ మాట్లాడలేను’’అని మహతో అన్నారు. మరోవైపు కాక్రోచ్ జనతాపారీ్ట(సీజేపీ) బృందం శనివారం దీక్షాస్థలికి వచ్చి ఉద్యమానికి మద్దతు తెలిపింది. ఉద్యమంలోకి మరో వేదిక.. ఇప్పటికే జేపీఎస్సీ,జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్తోపాటు జేపీఎస్సీ,జేఎస్ఎస్సీ అభ్యర్తుల ఫోరమ్ ఈ స్టేడియంలో వేర్వేరుగా దీక్షాస్థలిలను ఏర్పాటుచేసి ఉద్యమిస్తున్నాయి. వీటికి శనివారం మరో వర్గం తోడైంది. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాపై శుక్రవారం అసెంబ్లీ సమీపంలో సిరా దాడి జరగడంతో వాళ్లు సైతం స్టేడియంలో మరో నిరసన వేదికను ఏర్పాటుచేశారు. ‘వేదికలు వేరైనా ఉద్యమం మాత్రం ఒక్కటే. డిమాండ్లూ ఒక్కటే. 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దుచేయాలి. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలి’’అని ఏఐఎస్ఏ రాంచీ అధ్యక్షుడు విజయ్ స్పష్టంచేశారు. -
లోకేశ్ తప్పుకోవాల్సిందే
సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని, డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహించి మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలపై మూడవ రోజు శనివారం కూడా చంద్రబాబు సర్కారు దమనకాండ సాగించింది. అయినప్పటికీ ఎక్కడికక్కడ దీక్షలు విజయవంతం కావడం, జెన్ జీ యువత కదం తొక్కడంతో రోజురోజుకు ఉద్యమం ఉధృతం అవుతోంది. ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వానికి వణుకు పుట్టింది. డీఎస్సీ అక్రమాలపై జెన్ జీ యువత, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. తన తనయుడి రాజకీయ భవితపై బెంబేలెత్తుతూ ఇప్పటికే పోలీసులు, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి రిలే దీక్షల భగ్నానికి విఫలయత్నం చేస్తున్నారు. అడ్డంకులను అధిగమించి ఉధృతంగా పోరుడీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తాయి. వేలాది మంది నిరుద్యోగులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, జెన్‌జీ యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు, టీడీపీ శ్రేణుల అడ్డంకులను అధిగమించి రిలే దీక్షలను కొనసాగించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు.. స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది.ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్ దీక్షా శిబిరాల్లో విన్పించింది. యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని జెన్ జీ యువత మండిపడింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని యువత ప్రశ్నించింది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. రోజురోజుకూ ఉద్యమానికి యువత మద్దతు పెరుగుతుండటంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన తీవ్రమైంది. చిలకలూరిపేటలో పోలీసుల దౌర్జన్యంచిలకలూరిపేటలో రిలే దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు దౌర్జన్యం చేశారు. దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పాల్గొన్నారు. అంతలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో రజిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో విడదల రజిని కిందపడిపోయారు. మహిళా నేత అని కూడా చూడకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అడ్డుకున్న పోలీసులువైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో టీడీపీ నేతల ఒత్తిడితో రంగంలోకి దిగిన పోలీసులు వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను అడ్డుకున్నారు. దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణి ఇందిరమ్మలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది సరికాదని వైఎస్సార్సీపీ శ్రేణులు నిలదీయడంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. రామసుబ్బారెడ్డిని తరలించే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. క్యారమ్స్ ఆడుతాం.. మాకూ ఉద్యోగాలివ్వండిబాపట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన నిర్వహించారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో పేకాట, లూడో ప్రామాణికంగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారని వినూత్న నిరసన చేపట్టడం ప్రజలను ఆలోచింపజేసింది. రిలే దీక్షా శిబిరం వద్ద క్యారం బోర్డు ఆడుతూ.. ‘మాకు కూడా డీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వండి’ అంటూ నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా చంద్రబాబు సర్కారు కుటిలయత్నాలు, కుట్రలను అధిగమించి వైఎస్సార్సీపీ శనివారం మూడవ రోజు రిలే దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. ఈ నెల 10న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.సంతలో సరుకుల్లా డీఎస్సీ కొలువులు⇒ కూరగాయల బుట్టల్లో పోస్టుల విక్రయాల నాటిక⇒ క్రీడా కోటాకు ‘తొక్కుడు బిళ్ల’ ఆటలతో వినూత్న నిరసన పార్వతీపురం రూరల్: పార్వతీపురం వైఎస్సార్ కూడలి వద్ద వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో జరిగిన ఈ ఆందోళనలో మహిళలు, జెన్–జి యువత వినూత్న రీతిలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. డీఎస్సీ టీచర్ పోస్టులను కూటమి నాయకులు అంగడిలో సరుకుల్లా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ దీక్షా శిబిరం వద్ద మహిళలు ప్రదర్శించిన నాటికలు అందరి దృష్టిని ఆకర్షించాయి.కూరగాయల బుట్టల్లో ‘ఎస్జీటీ పోస్టు’, ‘సూ్కల్ అసిస్టెంట్ పోస్టు’ అని బోర్డులు ఉంచి.. ‘రండి బాబు రండి.. రేటు మాట్లాడితే ఉద్యోగం మీదే.. చదువుతో పనిలేదు, డబ్బులిస్తే చాలు’ అంటూ వీధి వ్యాపారుల్లా అరుస్తూ నిరసన తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ.. మహిళలు ‘తొక్కుడు బిళ్ల’ ఆడుతూ, వీధి ఆటలను కూడా కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో చేర్చే అవకాశం ఉంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
పార్లమెంట్లో అదే గందరగోళం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావే శాల్లో వాయిదాల పర్వం ఆగడం లేదు. విపక్షాల ఆందోళనల కారణంగా చర్చ లేకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. కార్యకలాపాలేవీ సాగకుండానే ఉభయ సభలు తరచుగా వాయిదా పడుతున్నాయి. శుక్రవారం సైతం అదే దృశ్యం ఆవిష్కృతమైంది. ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, అయోధ్య రామాలయ విరాళాల చోరీ సహా కీలక అంశాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయగా, ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. గాంధీ నుంచి స్ఫూర్తి పొందండి లోక్‌సభ ఉదయం ప్రారంభమైన వెంటనే భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవం సందర్భంగా స్పీకర్ ఓంబిర్లా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఆదర్శాలు, పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలు నిరసనకు దిగడంతో స్పీకర్ తీవ్రంగా స్పందించారు. జాతిపిత గాంధీజీ స్ఫూర్తిని దేశ విదేశాలు అనుసరిస్తున్నాయని, అదే స్ఫూర్తిని మన సభలో కనబరచాలని సభ్యులకు సూచించారు. అనంతరం నీట్ పేపర్ లీక్‌పై లోక్‌సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. విద్యార్థుల నిరసనల పట్ల పోలీసుల దమనకాండపై హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. నినాదాలతో హోరెత్తించాయి. దాంతో వాయిదాల పర్వం కొనసాగి చివరకు సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో నినాదాల హోరు హోంమంత్రి అమిత్ షా సభకు హాజరు కావాలని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ పదేపదే అంతరాయం కలిగించడంతో కార్యకలాపాలు స్తంభించాయి. అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. దాంతో ఛైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. అయినప్పటికీ ప్రశ్నోత్తరాలను చేపట్టడంతో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేయడం చేయడంతోపాటు రామమందిర విరాళాల చోరీ అంశాన్ని లేవనె త్తారు. దాంతో అధికారపక్ష సభ్యులు ఎదురు దాడికి దిగారు. గందరగోళం కొనసాగుతుండగా చైర్మన్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. అమిత్ షా వస్తే తట్టుకోలేరు: కిరణ్ రిజిజు దేశాన్ని అస్థిరపరచాలని చూసే ఉగ్రవాదులు, తీవ్రవాదులు సైతం హోంమంత్రి అమిత్ షా పేరు చెబితే భయంతో వణికిపోతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. అలాంటి నాయకుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం తగదని ప్రతిపక్షాలకు సూచించారు. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ఏ మంత్రి సభలో సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం, సభాపతి నిర్ణయిస్తారని స్పష్టంచేశారు. హోంమంత్రి సభకు రావాలంటూ సభాపతి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని అన్నారు. విపక్ష ఎంపీలు ఉదయం 11 గంటల తర్వాత సభను వదిలి వెళ్లిపోతున్నారని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉంటున్నారని గుర్తుచేశారు. హోంమంత్రి సభలో సమాధానం చెప్పే సమయం వచ్చినప్పుడు, ఆయన చర్చలో పాల్గొన్నప్పుడు వినడానికి విపక్ష ఎంపీలు సభలో ఉండరని ఆక్షేపించారు. అమిత్ షా వస్తే తట్టుకోలేక వెళ్లిపోతారని అన్నారు. -
మాచర్లలో పోలీసుల ఓవరాక్షన్.. పిన్నెల్లితో వాగ్వాదం
సాక్షి, పల్నాడు: మాచర్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షల్లో నిర్వహించనుంది. ఇందులో భాగంగా మాచర్లలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని గతరాత్రి పోలీసులు అడ్డుకున్నారు.మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత స్థలం వద్ద దీక్ష నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేపట్టారు. అయితే శిబిరం ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.“సొంత స్థలంలో దీక్ష చేసుకునే హక్కు కూడా లేదా?”ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన దీక్షలు చేపడుతుంటే మాచర్లలో మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. తన సొంత స్థలంలో శాంతియుతంగా దీక్ష నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం అనుమతులు లేకుండా దీక్ష నిర్వహించేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. సొంత స్థలమైనప్పటికీ శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి అవసరమని పేర్కొంటూ ఏర్పాట్లను నిలిపివేశారు.నేడు వైఎస్సార్సీపీ నిరసనలుడీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఇటు మాచర్లలో దీక్షా శిబిరం ఏర్పాట్లను పోలీసులు అడ్డుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్సీపీ నేతలు దీనిని ప్రభుత్వ అణచివేతగా మండిపడుతున్నారు. -
భారత్‌తో పోలుస్తావా?.. పాక్‌లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆ దేశ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి’’ అంటూ పాకిస్థాన్ పాలకులకు హితవు పలికారు. ప్రజల గొంతును అణచివేయడం కాకుండా.. వారి సమస్యలను వినే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.పాకిస్థాన్‌లో ఇటీవల విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో విద్యార్థుల నిరసనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు వంటి నిర్ణయాలు తీసుకుందని అలీమా ఖానుమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదనను వినడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ విషయంలో భారత్‌ను చూసి పాకిస్థాన్ ప్రభుత్వం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.‘‘భారత్‌లో విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ పాకిస్థాన్‌లో ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు, బెదిరింపులే ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతును అణచివేయడం కాదు’’ అంటూ ఆమె మండిపడ్డారు. అధికార యంత్రాంగం ప్రజల హక్కులను గౌరవించకుండా వ్యవహరిస్తోందని, ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అలీమా హెచ్చరించారు.అలీమా ఖానుమ్ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. అధికార పక్షానికి చెందిన నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడగా, పాకిస్థాన్‌ను భారత్‌తో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ నేతలు మాత్రం ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే విమర్శలను అంగీకరించే సంస్కృతి అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారని, న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీమా ఖానుమ్ చేసిన "మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి" వ్యాఖ్యలు భారత్-పాకిస్థాన్ పోలికలకే కాకుండా, పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పరిస్థితులపై కూడా మరోసారి చర్చను రేకెత్తించాయి.ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. కొందరు అలీమా ఖానుమ్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు భారత్‌ను ఉదాహరణగా చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా, ఆమె చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కొత్త దుమారానికి తెరలేపాయి.నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించి.. పరీక్ష రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదం తీవ్రం కావడంతో కేంద్రం విచారణలు, సంస్కరణలపై చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో ప్రభుత్వం–నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులు తమ నిరసనలను విరమించినట్లు ప్రకటించారు. -
సీజీపీ రీఎంట్రీ హెచ్చరిక.. జంతర్‌మంతర్ వద్ద హైఅలర్ట్
ఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరిగిన నిరసనల్లో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించకపోతే మరోసారి ఆందోళన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రదర్శనల సమయంలో నిరసనకారులు నిర్ణీత ప్రాంతం దాటి వెళ్లకుండా ఉండేందుకు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన మెటల్ బ్యారికేడ్లను ఇనుప కడ్డీలతో వెల్డింగ్ చేసినట్లు సమాచారం.భవిష్యత్తులో ఆందోళనలు జరిగితే బ్యారికేడ్లను తొలగించడం లేదా ముందుకు కదలడం సాధ్యం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, ఇతర భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. సీజీపీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది.36 రోజుల ఆందోళన.. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజీపీ గతంలో జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం జూలై 25న ఆందోళన విరమించింది. అయితే నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమన్న హామీని కేంద్రం ఉల్లంఘించిందని సీజీపీ ఆరోపించింది. అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరోసారి రోడ్డెక్కుతామని హెచ్చరించింది.సీజీపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా తాజాగా మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా ఉల్లంఘించిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారని, అరెస్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, అదుపులో ఉన్న నిరసనకారుల విడుదల, కొత్త క్రిమినల్ కేసుల నమోదును నిలిపివేయడం, ఒప్పంద వివరాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారా?సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే మరో ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల్లో అసంతృప్తి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు సహాయం చేసేందుకు దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ సెల్ ఏర్పాటు చేసినట్లు సీజీపీ ప్రకటించింది. అలాగే సాక్ష్యాల సేకరణ కోసం ‘సాక్షి’ అనే ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కూడా కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు న్యాయ సహాయం అందించేందుకు రూ.1 కోటి నిధిని ప్రకటించినట్లు సమాచారం. -
కాక్రోచ్ నిరసనల ఎఫెక్ట్.. ఢిల్లీ వీధుల్లో టెన్షన్!
నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ముగిసిన తర్వాత ఢిల్లీలో కొత్త వివాదం మొదలైంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, భద్రతా సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరికొన్ని వీడియోలు చర్చకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు నీట్ పేపర్ లీక్, పరీక్షా వ్యవస్థలో లోపాలపై ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు తీవ్రతరం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అనంతరం నిరసనలపై భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు జరిగినట్టు తాజాగా వీడియోలు బయటకు వస్తున్నాయి. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.As Soon as Dharmendra Pradhan’s Resignation is Confirmed……• Sonam Wangchuk has left.• Abhijeet Deepke and Saurabh Das are celebrating.Meanwhile, in Delhi, the Sangh Parivar has put their most Notorious and Riotous Group, the Bajrang Dal, out on the Streets.They are… pic.twitter.com/yLa72eEdBA— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 28, 2026ఇటీవల సత్యం పండిట్ అనే వ్యక్తి ఇద్దరు నిరసనకారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన వీడియో చర్చకు వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు చూపించే మరికొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో చిత్రీకరించినట్లు చెబుతున్న ఓ వీడియోలో, మైక్ పట్టుకున్న ఓ వ్యక్తి కొందరు నిరసనకారులను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నిస్తూ నిలదీసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అతడి మెడపై చేయి వేసి మాట్లాడుతున్నట్లు, క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది.जो काॅकरोच जंतर-मंतर पर सनातन धर्म और मोदी जी को गाली दे रहे थे उनकी दिल्ली मेट्रो में जमकर धुलाई हो रही है...🤣😏 pic.twitter.com/XHtgERs9Hx— राजपूत सवित सिंह (@Savit12) July 29, 2026 మరో వీడియోలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు వెంబడించి కొట్టినట్లు, తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక వీడియోలో ఓ మహిళను పలువురు వ్యక్తులు చుట్టుముట్టి ప్రశ్నిస్తూ, ఆమెను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలపై నిరసనలకు మద్దతు ఇస్తున్న వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని లేదా విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమని, నిరసనకారులను బెదిరించడం, దాడి చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొంటున్నారు.బీజేపీ అనుకూల వర్గాల వాదనమరోవైపు, బీజేపీకి మద్దతు ఇస్తున్న వర్గాలు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, పోలీసులపై అనుచిత నినాదాలు చేసినట్లు చూపించే కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిరసనల పేరుతో చట్టపరమైన, సామాజిక పరిమితులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నిరసనల్లో పాల్గొన్న వ్యక్తుల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేశాయి. అయితే, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాల్సింది చట్టపరమైన వ్యవస్థ మాత్రమేనని, వ్యక్తులు లేదా ప్రైవేట్ గుంపులు స్వయంగా చర్యలకు దిగడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.THIS IS SHAMEFUL !!!If this is what young Indians have to face simply for supporting a protest then what kind of democracy are we becoming?This video appears to show Satyam Pandit confronting and slapping two youths on their way to the Jantar Mantar protest has sparked… pic.twitter.com/8zDPBMb1at— Ravi Prakash Official (@raviprakash_rtv) July 26, 2026ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు. అదే సమయంలో నిరసనల సమయంలో హింస, బెదిరింపులు, దాడులు లేదా చట్ట ఉల్లంఘనలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు, న్యాయ వ్యవస్థలపై ఉంటుంది. కాగా, నీట్ నిరసనలు ముగిసినా, వాటి చుట్టూ రాజకీయ వాదోపవాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఒకవైపు నిరసనకారులపై దాడుల ఆరోపణలు, మరోవైపు నిరసనల్లో జరిగిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. The police have started their job. The Students movement is over. Now who will come forward to help these students?Unity of students is required. #cjpprotesters #india #arrested #students #police pic.twitter.com/6o7LxWowhb— भारतीय (@ramanswall) July 27, 2026 -
నిరసనలకు ‘సుప్రీం’ ఛత్రం!
ఉద్యమించటం, నిరసనలు వ్యక్తం చేయటం నేరమన్న అభిప్రాయం వ్యవస్థల్లో నరనరానా వ్యాపించింది. ఒక బ్యానర్తోనో, ఒక జెండాతోనో, నిర్దిష్టమైన ఎజెండాతోనో జనం రోడ్లపైకి రాగానే లాఠీలు పైకి లేవడం, బాష్పవాయు గోళాలు వర్షించడం... ఉద్యమకారుల్ని ఈడ్చుకెళ్లడం, పిడిగుద్దులు, బూటుకాళ్లతో తన్నడాలు రివాజయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమంలోనైతే పెల్లెట్లనుంచి ఏకే–47 బుల్లెట్ల వరకూ కనబడటం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం శాంతియుత నిరసనలపట్ల ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ మార్గదర్శ కాలు జారీచేస్తామనటం స్వాగతించదగింది. నిరసనలు రాజ్యాంగం ప్రసాదించిన హక్కనీ, వాటిని నిరాకరించటం సరికాదనీ వ్యాఖ్యానించింది. పాలకులూ, వారిని సమర్థించే కొన్ని వర్గాలూ ఈ సంగతి మరిచి చాన్నాళ్లయింది. ఉద్యమాలూ, నిరసనలను ఏవగించుకునే జాతీయ మీడియా చానెళ్లకు కూడా కొదవలేదు. దగ్గర వాటర్ బాటిళ్లు తప్ప మరేం లేని 15, 16 ఏళ్ల పిల్లల్ని... అందునా ఆడపిల్లల్ని గూండాలుగా అభివర్ణించే స్థాయికి అవి దిగజారాయి. ఆడపిల్లల ఛాతీపై చేతులువేసి నెట్టడం, చెంపదెబ్బలు కొట్టడం, లాఠీలతో మోదటం ఏ రకంగా సమర్థనీయం? వారు కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయలేదే! విధి నిర్వహణలోవున్న పాత్రికేయుల్నీ, పక్కన నిలబడి చూస్తున్నవారినీ కూడా తలలు పగలగొట్టారు. పెల్లెట్లతో గాయపరిచారు. ఇలా అతిగా ప్రవర్తించిన సిబ్బంది మాస్క్‌లు, స్వెట్టర్లు ధరించి వివరాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ కేసులో వెలువరించిన తీర్పులో చట్టబద్ధమైన విధి నిర్వహణలో ఉండే ప్రతి పోలీసు అధికారి తప్పనిసరిగా తమ గుర్తింపు తెలిసేలా ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అటుపై అది సీఆర్పీసీలో 41–బి సెక్షన్‌గా, ఇప్పుడు బీఎన్ఎస్లో సెక్షన్–36గా చేరింది. బలప్రయోగం చేయటానికి రాజ్యానికున్న అధికారం తాలూకు బాధ్యతను నిర్దిష్టంగా గుర్తించదగిన వ్యక్తికి ఆపాదించగలిగేలా ఉండాలన్న రాజ్యాంగపరమైన హామీ ఇది.పెద్దయెత్తున జనం పాల్గొనే ఆందోళనల్లో నేరగాళ్లు చొరబడే అవకాశాలు లేకపోలేదు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశాలు తోసిపుచ్చలేం. అలాంటివారిని గుర్తించి అదుపు చేయటానికే సాధారణ దుస్తుల్లో పోలీసు సిబ్బంది ఉంటారు. అంతకన్నా ముందు నిరసన జరిగే ప్రాంతాన్ని నిరంతరం నిఘా కళ్లు చూస్తుంటాయి. అలాంటపుడు ఊరేగింపు జరపాలని సీజేపీ నిర్ణయించిన రోజు వేకువజామున జంతర్‌మంతర్‌లో పెద్ద పెద్ద రాళ్లతో కూడిన ట్రక్కు, అప్పటికే పూర్తిగా ధ్వంసమైన వాహనం ఎలా చేరాయి? అప్రమత్తంగా ఉన్న కార్యకర్తలు వెనువెంటనే వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అప్పుడైనా చర్యలుంటే పోలీసులపై జరిగాయంటున్న దాడులకు ఆస్కారం ఉండేది కాదు. కానీ అటుతర్వాత విచక్షణారహితంగా ఉద్యమకారుల్ని కొట్టారు. తలలకు గాయాలై నెత్తురోడుతున్నవారు అనేకమంది వీడియోల్లో కనబడ్డారు. కొందరికి చేతులు విరిగాయి. లాఠీచార్జి చేసేటపుడు మోకాలు దాటి పై భాగంలో కొట్టడం చట్టవిరుద్ధం.ఈ నెల 25న బిహార్ బంద్ సందర్భంగా శివాన్ జిల్లాలో ఉద్యమకారులతో ఘర్షణ చోటుచేసుకున్నప్పుడు ఒక కానిస్టేబుల్ ఏకే–47తో కాల్పులు జరుపుతూ కెమెరాలకు చిక్కాడు. 15 యేళ్ల బాలుడితోసహా ముగ్గురు గాయపడ్డారని అంటున్నా పోలీసులు మాత్రం ఆ కాల్పులవల్ల ఎవరూ గాయపడలేదంటున్నారు. నిరాయుధ పౌరులపై మిలిటరీ గ్రేడ్ ఆయుధాలు ఉపయోగించరాదన్న ప్రాథమిక పరిజ్ఞానం కూడా అతగాడికి లేదని అర్థమవుతుంది. అతన్ని సస్పెండ్ చేశారు సరేగానీ... కనీస అవగాహన లేనివారికి ఇటువంటి ప్రమాదకర ఆయుధాలు ఎలా ఇచ్చారన్నది తేల్చాలి. మొన్న శుక్రవారం విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల ‘చలో లోక్‌భవన్’లో సైతం ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఏపీలో అమలయ్యేది రెడ్ బుక్ రాజ్యాంగం కనుక విద్యార్థి సంఘాల కండువాలేసుకుని మరీ పోలీసులు దాడిచేశారు. యువకుల్ని బూటుకాళ్లతో తన్ని, పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచారు. రోడ్డుపై పడేసి కొట్టారు. ఇలా ఆటవిక ప్రవృత్తి మితిమీరుతున్న దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం శుభ పరిణామం. -
‘మాకే లేదు ఇంకేం ఇస్తాం’: పాక్ క్రియేటర్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలపై పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ చేసిన భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో బిలాల్ హసన్ మాట్లాడుతూ.. ‘మా మధ్య ద్వేషం పెరిగిందని నాకు తెలుసు, కానీ నిరసనల్లోని ప్రతి గుర్తును, పోస్టర్‌ను, అంతర్గత జోక్‌ను మేం (పాకిస్థానీయులు) అర్థం చేసుకోగలం. మేం మా పోలికలను దాంట్లో చూసుకుంటాం. ఏదేమైనా మేం విడిపోయిన తల్లిదండ్రుల సంతానం’ అని పేర్కొన్నారు.భారతదేశంలో విద్యార్థుల నిరసనకు మద్దతు తెలుపుతూ.. ‘వీరు పిల్లలు. ఎంతో ధైర్యవంతులు. తమ దేశం మెరుగైన భవిష్యత్తును సాధించడం కోసమే వారు నిరసన తెలుపుతున్నారు. అందులో ఏదో ఒక అందం ఉంది’ అని అన్నారు. ఈ నిరసనలకు పాక్ నిధులు సమకూర్చిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను హసన్ ఖండించారు. ‘పాకిస్థాన్ నిరసనలకు నిధులు ఇచ్చిందని అంటున్నారు. మా దేశాన్ని నడుపుకోవడానికే మా వద్ద సరిపడా డబ్బు లేదు. ఇక మేం వాటికి ఎలా నిధులు సమకూర్చగలం?" అని హసన్ ప్రశ్నించారు. ‘ఫ్రమ్ పాకిస్థాన్ టు ఇండియా’ అనే శీర్షికతో ఈ వీడియోను పోస్ట్ చేశారు.భారత్, పాకిస్థాన్లలో నిరసనకారుల పట్ల అనుసరిస్తున్న తీరును కూడా ఆయన పోల్చారు. పాకిస్థాన్‌లో విద్యార్థులు తీవ్రమైన ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చివరగా భారతీ విద్యార్థులకు సందేశమిస్తూ ‘మిమ్మల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఆలోచించి రిస్క్ తీసుకోండి. ఐక్యంగా ఉండండి. అమ్ముడుపోకండి’ అని హసన్ సూచించారు. ఈ వీడియోకు ఆన్లైన్లో విపరీతమైన స్పందన వస్తోంది. భారత్, పాకిస్థాన్ వినియోగదారులు హసన్ పరిశీలనా శక్తిని ప్రశంసిస్తున్నారు. -
ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
ఏపీ డీఎస్సీ–2025లో నష్టపోయిన లక్షలాదిమంది అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ మరోమారు సమరభేరి మోగించింది. నష్టపోయిన బాధితులకు ఆకాంక్షలకు అనుగుణంగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తుతో పాటు, మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో మంగళవారం వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. -
దగా డీఎస్సీపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో నష్టపోయిన అభ్యర్థులు చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియ అంతా దగా, మోసం, పెద్ద కుంభకోణమని నిప్పులు చెరుగుతున్నారు. ప్రశ్నాపత్రం లీక్, స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టుల అమ్మకం, నియామక ఉత్తర్వుల జారీలో అవకతవకలు ఇలా డీఎస్సీలో జరిగిన ప్రతి అక్రమం పక్కా సాక్ష్యాధారాలతో రుజువైనా సీబీఐ దర్యాప్తునకు ఎందుకు వెనకాడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీకి కేంద్రం బాధ్యత వహించినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించడం లేదని నినదిస్తున్నారు.కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాదిరిగానే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ కూడా రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఏపీ డీఎస్సీ–2025లో నష్టపోయిన లక్షలాదిమంది అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ మరోమారు సమరభేరి మోగించింది. నష్టపోయిన బాధితులకు ఆకాంక్షలకు అనుగుణంగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తుతో పాటు, మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో మంగళవారం వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.స్కామ్‌ల డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులతో అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలను నిర్వహించబోతోంది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, బాధితుల పక్షాన నిలుస్తూ ఈ ఏడాది జూన్ ఒకటిన వైఎస్సార్సీపీ యువజన విభాగం కలెక్టరేట్ల ముట్టడి చేపట్టింది. సీబీఐ విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కలెక్టర్లు, ఆర్డీవోలు, ప్రభుత్వానికి అనేక వినతులు సమర్పించింది. అయితే నిష్పçక్షపాతంగా సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు బాబు సర్కార్ జంకుతోంది. సీబీఐ విచారణంటే బెరుకెందుకు.?నీట్ యూజీ తరహాలోనే ఏపీ డీఎస్సీ ప్రశ్నాపత్రం సైతం తయారీ చేసిన దగ్గరే లీక్ అయిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నాపత్రం తయారీ, ఆన్లైన్ అప్లోడ్ చేయడం వంటి ఎంతో గోప్యమైన ప్రక్రియలో పాల్గొన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ టాప్ ర్యాంకర్‌గా నిలవడమే పేపర్ లీక్‌కు పెద్ద సాక్ష్యమని చెబుతున్నారు. టాప్ ర్యాంకర్‌గా నిలిచినప్పటికీ నవీన్‌కు ఉద్యోగం ఇవ్వకపోగా, రెండో దఫా ఇచ్చిన మెరిట్ లిస్ట్‌లో నవీన్ వివరాలను తొలగించడంతోనే పేపర్ లీకైందని స్పష్టంగా రుజువైందని యువత గుర్తుచేస్తోంది. అయితే ఈ లీక్ ఎంత వరకూ వెళ్లింది? లీకైన పేపర్ ద్వారా ఎంత మంది ఉద్యోగాలు సాధించారు? లీక్ వెనుక అసలు కుట్రదారులు ఎవరు? అనే విషయాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని అభ్యర్థులు నమ్ముతున్నారు.ప్రభుత్వం నిష్పక్షపాతంగా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు పేపర్ లీక్ కాలేదని ప్రభుత్వం వాదిస్తోంది. పేపర్ లీక్ కాకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే నవీన్ టాప్ ర్యాంకర్‌గా నిలిస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సెలక్షన్ లిస్టులో అతని పేరు తొలగించడమే కాకుండా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌కు రాలేదని బుకాయించడం... ఇలా ప్రభుత్వం చేసిన తప్పుల మీద తప్పులే పేపర్ లీక్‌కు మెగా సాక్ష్యాలని అభ్యర్థులు బల్లగుద్ది వాదిస్తున్నారు.జీవోలే సాక్ష్యం.. బేరసారాలే రుజువు..రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా స్పోర్ట్స్ కోటా కింద అతిపెద్ద కుంభకోణం జరిగిన మాట వాస్తవం కాదా? అని బాబు సర్కార్‌ను యువత నిలదీస్తోంది. స్పోర్ట్స్ కోటా కుంభకోణానికి ప్రభుత్వం డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఇచ్చిన రోజునే ఇచ్చిన జీవో 4.. 47 అతిపెద్ద సాక్ష్యాలు కాగా.. రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా పప్పుబెల్లాలు మాదిరిగా సాగిన టీచర్ పోస్టుల విక్రయాలకు బేరసారాల ఆడియోలే రుజువని స్పష్టం చేస్తున్నారు.తామనుకున్నవారికి టీచర్ పోస్టులు అడ్డగోలుగా కట్టబెట్టడం కోసమే జీవో 4.. 47 తెచ్చారని నష్టపోయిన నిజమైన క్రీడాకారులు మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో స్వర్ణపతకాలు సాధించిన వారికి సైతం అన్యాయం చేస్తూ టీడీపీ ప్రజా ప్రతినిధులు అధ్యక్షులుగా ఉన్న సంఘాల నుంచి పాల్గొన్న సర్టిఫికెట్లున్న వారికి టీచర్ పోస్టులు ఇచ్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు బేరం పెట్టారని, ఇందుకు సంబంధించిన ఆడియోలు వెలుగు చూసినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని నిలదీస్తున్నారు.బడా స్కామ్‌కు బాధ్యత ఎందుకు వహించరు?దేశ చరిత్రలో వెలగు చూసిన ఆర్ఆర్బీ, మధ్యప్రదేశ్ వ్యాపం స్కామ్, పశ్చిమ బెంగాల్ సేవా కమిషన్ స్కామ్, ఇటీవల వెలుగు చూసిన నీట్ యూజీ పేపర్ లీక్ వంటి అనేక స్కామ్‌లను తలదన్నేలా ఏపీ డీఎస్సీ–2025లో అక్రమాలు జరిగాయని లక్షలాది మంది అభ్యర్థులు చెబుతున్నారు. వారు చేస్తున్న ప్రతి ఆరోపణకు పక్కాగా డిజిటల్, ఆడియో, వీడియో, రికార్డెడ్ సాక్ష్యాధారాలు, రుజువులు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ చేపట్టదని, విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఎందుకు బాధ్యత వహించరని నిలదీస్తున్నారు. -
విద్యార్థులపైకి ఏకే–47
పట్నా: కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో పార్లమెంట్ దిశగా ‘చలో సంసద్ ర్యాలీ’కి పిలుపునివ్వగా ఆ ర్యాలీకి మద్దతుగా శనివారం బిహార్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఉద్యమకారుల పైకి పోలీసులు ఏకంగా ఏకే–47 మారణాయుధాన్ని ప్రయోగించిన వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజికవేత్తలను లాఠీచార్జ్‌తో రెచ్చగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి చివరకు ఏకే–47 గన్ను పోలీసులు వినియోగించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? పట్నా, సరణ్ జిల్లాలోని ఛాప్రా, సివాన్, ఔరంగాబాద్, భాగల్పూర్, సమస్తీపూర్, నవాడా, పూరి్ణయా, నలందా, బోజ్పూర్, మధుబని, షేక్పురాల్లో జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థి ర్యాలీలు జరిగాయి. అయితే సివాన్ పట్టణంలో జరిగిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక్కడ జేపీ చౌక్ ప్రాంతంలో జాతీయరహదారి గుండా రాకపోకలను నిలిపేశారు. దుకాణాలను మూసేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ర్యాలీగా వెళ్తున్న తమను అడ్డుకున్న పోలీసులపైకి ఉద్యమకారులు రాళ్లతో దాడిచేశారు. ట్రాఫిక్ పోలీస్బూత్లను ధ్వంసంచేశారు. విద్యార్థుల రాళ్ల దాడిలో సివాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పురన్ కుమార్ ఝా గాయపడ్డారు. దీంతో బాష్పవాయుగోళాలు ప్రయోగించాలని ఆయన ఆదేశించారు. అయితే ఉద్యమకారులు రాళ్ల వర్షం కురిపించడంతో వారిని నిలువరించేందుకు జిల్లా నిఘా విభాగానికి చెందిన అభిషేక్ పటేల్ అనే కానిస్టేబుల్ తన వద్ద ఉన్న ఏకే–47ను విద్యార్థుల పైకి ఎక్కుపెట్టారు. నాలుగు రౌండ్లు కాలుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో తాజాగా ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఝా ప్రకటించారు. నాలుగు రౌండ్ల కాల్పుల్లో అటుగా వెళ్తున్న కుమార్ గోండ్ ఒక వ్యక్తి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే ఉద్యమకారులు నాటుబాంబులు విసిరేయడంతోనే ఈ కాల్పుల ఘటన జరిగిఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. వాళ్లేమైనా ఉగ్రవాదులా?న్యూఢిల్లీ: బిహార్‌లో నీట్ లీకేజీ నిరసనోద్యమంలో విద్యార్థులపైకి పోలీసులు ఏకే–47 గన్ను ఎక్కుపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మోదీ సర్కార్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిలదీశారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘మోదీ ప్రభుత్వసారథ్యంలో యావత్ పోలీస్‌వ్యవస్థ విద్యార్థులను హతమార్చే స్థాయికి దిగజారింది. బిహార్‌లో ఏకే–47 గన్ను విద్యార్థులపైకి గురిపెట్టారు. వందలాది మందిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌చేశారు. మోదీజీ.. విద్యార్థులపై ఒక్క ఎఫ్ఐఆర్ నమోదుకాబోదన్న మీ వాగ్దానం ఏమైంది? ఢిల్లీలో పెల్లెట్ గన్స్ వాడితే బిహార్‌లో ఏకంగా ఏకే–47ను వాడా రు’’అని అన్నారు. ఏకే–47 గురిపెట్టిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడారు. ‘‘మీ అమ్మాయిలను నిరసనలకు ఎందుకు పంపించారు? అని తల్లిదండ్రులను కొందరు నేతలు మందలిస్తున్నారు. అమ్మాయిలు ఉద్యమంలో పాల్గొనకూడదా? ఏకే47, పెల్లెట్ గన్స్ వాడొచ్చా? విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? ’’అని ప్రియాంక నిలదీశారు. కాల్పుల ఘటనపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై రాజ్యస భ సభ్యుడు, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా బిహార్‌లో జరిగిన పోలీసుల కాల్పుల ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసనకారులపై జరిగిన లాఠీచార్జి తదితర ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. -
‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన ‘నీట్’ పేపర్ లీక్ నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫలితంగా కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నిరసనలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి యువత తరలివచ్చింది. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన మోహన్ శ్రీవాస్తవ్, ఢిల్లీకి చెందిన ఓ యువతి మధ్య చిగురించిన ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. This could be a prank from Bihar. But it ends so authentically with a question, that is so steeped in reality. pic.twitter.com/t1EBCziYhy— Smita Prakash (@smitaprakash) July 26, 2026నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొనేందుకు మోహన్ బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆందోళన ప్రాంతంలో భోజన వసతి లేకపోవడంతో ఒ యువతి అతనికి ఆహారం అందించింది. తర్వాతి రోజు తాగునీరు కూడా తెచ్చి ఇచ్చింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య మంచి స్నేహానికి దారితీసింది. ఆ యువతి కూడా ‘నీట్’ పరీక్ష రాసి, పేపర్ లీక్ బాధితురాలే కావడంతో ఆందోళనలో పాలుపంచుకుంది.ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో మోహన్ తలకు తీవ్ర గాయమై అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన ఆ యువతి అతనిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది. మోహన్ కోలుకున్నాక ఆమె తన ప్రేమను వ్యక్తం చేసింది. మోహన్ కూడా తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు. గాయాలతో బాధపడుతూనే మోహన్ ఆ యువతిని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఒంటరిగా ఢిల్లీకి వెళ్లిన మోహన్, ఆందోళన ముగిశాక నూతన వధువుతో కలిసి బీహార్‌కు తిరుగుముఖం పట్టాడు.ఇది కూడా చదవండి: ఇక గడ్కరీకి ‘బొద్దింకల’ బెడద? -
విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్
నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహం రాజుకుంటోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. ఢిల్లీ నుంచి కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో జంతర్‌మంతర్‌కు తరలివస్తూ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు లాఠాచార్జీ చేసినప్పటికీ విద్యార్థులు ఏమాత్రం బెదరకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది . తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విద్యార్థుల నిరసనలకు మద్దతు పలికాడు. ఎంతో కష్టపడి చదివినా ఫలితం దక్కనప్పుడు విద్యార్థులు ఆవేదన చెందడం అర్థం చేసుకోదగిన అంశమేనని పేర్కొన్నాడు. విద్యార్థులు మరోసారి ఇలా నిరాశకు లోనవ్వకుండా చూసే బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సచిన్ గురువారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. స్వతహాగా తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో చిన్నప్పుడే తనకు నూరి పోసిన మాటలను సచిన్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘ఓటములు ఎదురైనా పర్వాలేదు, కానీ మోసం మాత్రం చేయకూడదు. విజయం కోసం ఎప్పుడూ అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న నాకు చెప్పేవారు. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందడం సహజం. భవిష్యత్తులో వారికి మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనమందరం సమష్టిగా కృషి చేయాలి. జైహింద్’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కేవలం ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం, ప్రతిభ కంటే అక్రమ మార్గాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుందని అని సచిన్ అభిప్రాయపడ్డాడు. యువత ఆకాంక్షలను పరిరక్షించే దిశగా త్వరలోనే సరైన పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.సచిన్‌తో పాటు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో పాటు కోహ్లి, శుబ్‌మన్ గిల్ కూడా తమ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనలకు మద్దతు ప్రకటించారు. ఇదిలాఉంటే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై అటు పార్లమెంట్ కూడా అట్టుడుకుతోంది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతాపార్టీ తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. pic.twitter.com/3a8WRHhWIK— Sachin Tendulkar (@sachin_rt) July 23, 2026 -
మోదీ వీడియో.. వాంగ్‌చుక్ దీక్ష విరమణపై సీజేపీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నీట్ నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. అయితే.. వాంగ్‌చుక్ దీక్ష ముగింపుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. వాంగ్‌చుక్ దీక్ష విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందామని, ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాంగ్‌చుక్ దీక్ష విరమణతో ఆందోళనలు ఆగిపోతాయా? అనే అనుమానాలకు అభిజిత్ పుల్‌స్టాప్ పెట్టారు. అసాధారణ ధైర్యం.. గొప్ప త్యాగం“26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్ సర్‌కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. We are relieved and grateful that Sonam sir has ended his hunger strike after 26 days.Thank you, sir, for your extraordinary courage and sacrifice. By putting your own life on the line, you awakened the conscience of an entire nation. Your life is far too precious to this…— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య. అది నెరవేరే దాకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారాయన. వీ సపోర్ట్ వాంగ్‌చుక్ అనే డీపీని అభిజిత్ ఇంకా ఎక్స్ కొనసాగిస్తుండడం గమనార్హం.కేంద్రం ఇచ్చిన హామీలేంటి?వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించినట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. దేశంలో హింస చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని షరతులతో దీక్షను ముగించినట్లు వెల్లడించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోనే వీడియో ద్వారా వివరిస్తానని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వొద్దని కోరారు.కాగా, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.జూన్ 28 నుంచి నిరాహార దీక్షపరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకు ముందే జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను జంతర్ మంతర్ నుంచి తరలించి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అనుమతితో మెదాంత ఆస్పత్రికి మార్చారు. 26 రోజుల దీక్షలో ఆయన సుమారు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.పేపర్ లీకులపై కేంద్రం కీలక చర్యలుపరీక్ష పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లో స్పెష్టల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ను నియమించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది. ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్‌ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్‌కుమార్‌ను నియమించింది.మోదీ వీడియో మెసేజ్.. రాహుల్ కౌంటర్ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అతిపెద్ద సమస్య.. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026అలాగే సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణపైనా మోదీ స్పందించారు. వైద్యుల సలహా మేరకు వాంగ్‌చుక్ తన దినచర్యను కొనసాగించాలని.. త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.అయితే.. మోదీ ట్వీట్‌పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా.. విద్యార్థుల్ని అవమానించొద్దు అని రీట్వీట్ చేశారు. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి.. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, విద్యార్థులు కోరుకునేది ఇదేనని అన్నారాయన. అలాగే లీకులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలకు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.Don’t insult their intelligence with this pathetic midnight video. 1. Sack Pradhan.2. Punish those who beat students.3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026మాకు రాజీనామానే కావాలిఇటు మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. “ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదు. విద్యార్థుల న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని సీజేపీ తెలిపింది. మరోవైపు సీజేపీతో ఏ టైంలోనైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. రాజీనామా డిమాండ్ విషయంలో మాత్రం తలొగ్గే తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. -
మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధం
సాక్షి, తాడేపల్లి: ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలపై నిరంతరం వైఎస్సార్సీపీ పోరాడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. అమరావతి దోపిడీ నుంచి డీఎస్సీ అక్రమాల వరకూ అన్నింటినీ ప్రజల ముందు పెట్టి వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.ఈ క్రమంలో మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. 28న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. పార్టీ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనుంది. డీఎస్సీ అక్రమాలు, నీట్ పరీక్షలో జరిగిన తప్పులు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబ్సర్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నిరసనలు నిర్వహించనుంది.వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. యువతను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో కోటిమంది యూత్ ఉన్నారని చంద్రబాబు చెప్తున్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.72 వేల కోట్ల బకాయి పడ్డారు. డీఎస్సీలో భారీగా జరిగిన అక్రమాలను సాక్షాలతో బయటపెట్టాం. అయినా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. బంగ్లాదేశ్‌లో యువత తిరగపడితే ఏం జరిగిందో చంద్రబాబు గుర్తుంచుకోవాలి’’ అని ఆయన హెచ్చరించారు.‘‘ఢిల్లీలో యువత చేస్తున్న ఆందోళనలు ఎలా ఉన్నాయో చూడండి. చంద్రబాబు యువత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. నీట్ పేపర్ లీక్ తో లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబిఐ విచారణ చేయాలి. నీట్ తప్పులు, ఫీజు రీయింబ్సర్మెంట్పై పోరాటం చేస్తాం. 28న జిల్లా కేంద్రాల్లో యూత్, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేస్తాం’’ అని జక్కంపూడి రాజా తెలిపారు.స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ.. డీఎస్సీలో పారదర్శకత లేదని.. మొదటి ర్యాంకు వచ్చిన వారికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. మెరిట్, రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా వారు డీఎస్సీ పరీక్షలు రావాల్సిన పనిలేదని జీవో ఇచ్చారు. బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?. డీఎస్సీలో అన్నీ అక్రమాలే. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. రూ.9 వేల కోట్లపైనే బకాయిలు పడ్డారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యూనిఫాంలో ఉన్నంత మాత్రాన..!
ఢిల్లీ: సీజేపీ నిరసనల్లో 118 మంది పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సంచలన ట్వీట్ చేశారు. తమ సిబ్బందిపై జరిగిన దాడులను ఖండిస్తూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు కూడా తమ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో బాధను అనుభవిస్తారని చెబుతూ.. పోలీసు వ్యవస్థలోని మానవీయ కోణాన్ని ఎక్స్ వేదికగా ఢిల్లీ పోలీసులు ఎత్తిచూపారు.‘‘యూనిఫాం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి నొప్పి తక్కువగా అనిపించదు. ప్రతి బ్యాడ్జ్ వెనుక స్పందించే గుండె.. ఒక కుటుంబం, సేవ చేస్తామనే హామీ ఉంటాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి జరగడం తీవ్రంగా కలిచివేస్తోంది. అభిప్రాయ భేదాలుంటే గళం వినిపించొచ్చు కానీ.. హింసకు మాత్రం చోటు ఉండకూడదన్న ఢిల్లీ పోలీసుల పోస్ట్.. వైరల్‌గా మారింది.సీజేపీ ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్‌మంతర్‌కు తరలివస్తున్నారు. బుధవారం సాయంత్రం అక్కడ ఉన్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జై ప్రకాశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘర్షణల అనంతరం ఢిల్లీ పోలీసులకు, సీజేపీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది.హింసను రెచ్చగొట్టారని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిరసనకారులు రాళ్ళు రువ్వడం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో సీనియర్ అధికారులతో సహా 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఏసీపీ (పంజాబీ బాగ్) జై ప్రకాష్, ఏసీపీ (కన్నాట్ ప్లేస్) వివేక్ భగత్, ఇన్స్పెక్టర్ నంద్ కిషోర్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. -
ఢిల్లీలో ఉద్రిక్తతలు.. TCS లొకేషన్ చేంజ్!
జాతీయ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు, సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అప్రమత్తమైంది. ఢిల్లీ క్యాంపస్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రత, ఆటంకం లేని కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని వారిని నోయిడా లేదా గురుగ్రామ్‌లోని సమీప కార్యాలయాల నుంచి పనిచేయాలని సూచించింది.సురక్షిత ప్రయాణం కోసం ముందస్తు అడ్వైజరీఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాల్లో కొనసాగుతున్న నిరసనలు, పార్లమెంట్ వైపు చేపట్టిన 'సంసద్ చలో' మార్చ్ కారణంగా ఢిల్లీ పరిధిలో రాకపోకలు ప్రభావితమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండి హౌస్, ఐటీఓ సహా కీలకమైన 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది.దీనికి తోడు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతో రోడ్డు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు ఆఫీసులకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో టీసీఎస్ హెచ్ఆర్ విభాగం ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది.ఈ పరిస్థితికి కారణం..జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన పరీక్షల నిర్వహణ వివాదాలు, నీట్ అక్రమాలపై జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పార్లమెంట్ ముట్టడి పిలుపుతో పోలీసు బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, లాఠీచార్జీలు జరగడంతో రాజధానిలోని వ్యాపార, ఐటీ రంగాలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.ఇదీ చదవండి: మామిడి రసంలో పల్ప్ ఉంటేనే ట్యాక్స్ బెనిఫిట్ -
సీజేపీ నిరసనలపై ఉక్కుపాదం.. కేంద్రం సంచలన నిర్ణయం
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ జాతీయ భద్రతా చట్టం అమలు చేయనుంది. నిరసనకారులను ఏడాది పాటు నిర్బంధించేందుకు పోలీసులకు అధికారం ఇచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఎటువంటి విచారణ లేకుండా ఏడాదిపాటు నిర్బంధించే అవకాశం ఉంది. మూడు నెలల వరకు ఢిల్లీలో చట్టాన్ని అమలు చేస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. పోలీసు కమిషనర్‌కు విశేష అధికారం కల్పించారు. ఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు భారీ అదనపు అధికారాలు ఇచ్చింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) కింద నిర్భందించే అధికారం ఉంది. అసాధారణ ఢిల్లీ గెజిట్ నోటిఫికేషన్‌ను హోం శాఖ విడుదల చేసింది. ఈ ప్రత్యేక అధికారాలను పరిమిత కాలం (మూడు నెలలు) వరకు వినియోగించే అధికారం ఉంది.అయితే, జాతీయ భద్రత చట్టంపై ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ భద్రత చట్టం మూడు నెలలకొకసారి రొటీన్‌గా రెన్యువల్ అవుతుందని.. సీజేపీ ఉద్యమాలకు ముందే ఈ ఆదేశం జారీ అయిందని పేర్కొన్నారు. ఇటీవల ఘటనలతో సంబంధం లేదని.. సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై పై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వెళుతోందన్న ఢిల్లీ పోలీసులు.. సీజేపీ ఉద్యమాలను అణచివేయడానికి అధికారాలు ఇచ్చారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఇది రొటీన్ త్రైమాసిక ఎన్ఎస్ఏ పునరుద్ధరణ మాత్రమేనని వెల్లడించారు.కాగా, జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీజేపీ నిరసనలకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. పార్లమెంట్ పరిసరాల్లో ఉద్యమకారులపై పోలీసులు జులుం తర్వాత విద్యార్థుల ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్‌మంతర్‌కు తరలివస్తున్నారు. -
ఆమె విద్యార్థి కానే కాదు!
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్‌కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్‌గా మారింది.“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”బుధవారం దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్‌ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026ఒక్క అడుగు.. ఓ సందేశంరిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.ఎవరీ రిహియా యాదవ్?రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. -
చర్చల్లో ట్విస్ట్! కేంద్రానికి CJP కొత్త కండిషన్
న్యూఢిల్లీ: నీట్ ఆందోళనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమేనని చెబుతూనే.. కాక్రోచ్ జనతా పార్టీ కొత్త కండిషన్ పెట్టింది. తాము వాళ్ల దగ్గరకు వెళ్లబోమని.. చర్చలకు ప్రభుత్వమే ముందుకు రావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా జంతర్ మంతర్‌కు వచ్చి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.“ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే మా వద్దకే రావాలి. మా షరతులకు అంగీకరించాలి” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని, అహంకారాన్ని పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని CJP తేల్చిచెప్పింది. తమ ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపింది.జంతర్ మంతర్‌లోనే, లేకుంటే..సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా మాట్లాడుతూ.. చర్చలు జరపాలంటే తటస్థ ప్రదేశంలో లేదా జంతర్ మంతర్‌లోనే నిర్వహించాలని అన్నారు. తమ డిమాండ్ల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన చర్చలపై కూడా సీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ప్రతినిధులను నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు సిద్ధమన్న కేంద్రంమరోవైపు, నిరసనకారులు చర్చలకు వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. అయితే చర్చల విషయంలో బాధ్యతను ప్రభుత్వం నిరసనకారులపైనే ఉంచినట్లు తెలుస్తోంది.జూలై 20న CJP చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించగా.. నిబంధనలు ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలోనే జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు.. మూడు డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. వాటిని పరిశీలించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సీజేపీ–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో దఫా చర్చల అంశం కీలకంగా మారింది. ఎవరు ముందడుగు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
నిరసనలకు మమత మద్దతు.. అవసరమైతే వస్తానని ప్రకటన!
కోల్‌కతా: నీట్ (NEET) పేపర్ లీకేజీ ఉదంతంపై దేశ రాజధానిలో విద్యార్థులు, నిరసనకారులు చేపట్టిన ఆందోళనలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. అవసరమైతే తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లి నిరసనలో పాల్గొంటానని ఆమె తెలిపారు. ప్రదర్శనకారులపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును, పోలీసుల అణచివేతను ఆమె తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వంపై, పోలీసుల దౌర్జన్యాలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సహా పలువురు సీనియర్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల ధర్నా నిర్వహించారు. ఈ నిరసనల నేపథ్యంలో పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం కాంగ్రెస్ ఎంపీలందరూ నల్లటి దుస్తులు ధరించి పార్లమెంటుకు హాజరయ్యారు.‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో వేలాది మంది జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనిని అణచివేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పాటు బాష్పవాయువును ప్రయోగించారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుండగా, ఆయనతో చర్చలు జరపాలని అన్నా హజారే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా రాహుల్ తన చర్యలతో రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు.బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ప్రతిపక్షాలు నిర్వహించిన నిరసనపై స్పందించిన గిరిరాజ్ సింగ్.. రాహుల్ గాంధీ తీరుపై మండిపడ్డారు. ఆయన చర్యలు అత్యంత ప్రమాదకరమైన ఉద్దేశాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యానించారు.‘‘రాజ్యాంగ పదవిలో ఉంటూ రాహుల్ గాంధీ తన చర్యలతో రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారు. ఆయన ప్రవర్తన చాలా ప్రమాదకరమైనది’’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇతర దేశాల్లో జరిగిన పరిణామాలను అనుసరిస్తూ భారత్‌లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్‌పై ఆరోపణలు చేశారు. ప్రధాని నివాసం సమీపంలో నిరసన చేపట్టడం బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించారు.VIDEO | Delhi: On Congress leaders’ protest at 7, LKM, Union Minister Giriraj Singh (@girirajsinghbjp) says, “By holding a constitutional office, he (Rahul Gandhi) has torn apart the dignity of the Constitution through his actions. His conduct reflects a very dangerous intention.… pic.twitter.com/j68qjxjiha— Press Trust of India (@PTI_News) July 22, 2026ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపైనా గిరిరాజ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీరు ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం లేదని, “అర్బన్ నక్సల్స్‌గా మారుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. నిరసనల పేరుతో దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.‘‘ప్రధాని నివాసం సమీపంలో ఆందోళన చేయడం చాలా బాధ్యతారాహిత్యం. అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగి ఉంటే.. లేదంటే ఎవరైనా ప్రమాదకర వస్తువులు విసిరి ఉంటే పరిస్థితులు తీవ్రంగా ఉండేవి’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని తాను భావిస్తున్నట్లు గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు.ఇదే సమయంలో సీజేపీ నిరసనలపై కూడా కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. ఆందోళనల పేరుతో విద్యార్థులను ముందుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని చెబుతున్నాయి. సీజేపీ ఆందోళనలు, రాహుల్ గాంధీ నిరసనల నేపథ్యంలో కేంద్రం–విపక్షాల మధ్య రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. -
జంతర్‌మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం పార్లమెంట్ ముట్టడి సమయంలో, అలాగే మంగళవారం చోటుచేసుకున్న ఘర్షణల అనంతరం పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, వేదికను తొలగించారు. అయితే బుధవారం ఉదయం నుంచి నిరసనకారులు మళ్లీ అక్కడకు చేరుకుని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు.లేటెస్ట్ అప్డేట్స్:ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులుపోలీసులపై అల్లరిమూకల దాడిదాడిలో పలువురు పోలీసులకు గాయాలుజంతర్మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్పై నిషేదంగాయపడిన పలువురు పోలీసులుజంతర్మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణంపోలీసులపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులుపోలీసులు, RAF సిబ్బందిపైకి రాళ్లు, బాటిళ్లు విసిరిన ప్రొటెస్టర్లుగాయపడిన పలువురు పోలీసులు ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర హైటెన్షన్భారీగా తరలివస్తున్న యువతపార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలుప్రభుత్వం చర్చలకు రావాలంటే తమ వద్దకే రావాలని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమేనని, కానీ తమ షరతులను అంగీకరించాలని తెలిపారు.ప్రభుత్వ అహంకారం తగ్గాలని డిమాండ్ చేశారు.NEET పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.చర్చలు తటస్థ ప్రదేశంలో లేదంటే జంతర్ మంతర్‌లో జరగొచ్చని CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా తెలిపారు.ప్రభుత్వం తమతో చర్చలు జరుపుతూనే మరోవైపు విద్యార్థులపై పోలీసు చర్యలకు దిగిందని CJP ఆరోపించింది.తమ ప్రతినిధులను జేపీ నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు పిలిచి మరోవైపు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారని విమర్శించారు.జూలై 20 పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది.మరోవైపు, నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.NEET అంశంపై CJP–ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు కొనసాగుతున్నాయి.నాలుగు నినాదాలే చేద్దాం: సీజేపీ జంతర్ మంతర్‌లో CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు.ఆందోళనల్లో నాలుగు నినాదాలకే పరిమితం కావాలని పిలుపు.‘‘భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’’ అంటూ నినాదాలు చేయాలని సూచన.ప్రతికూల నినాదాలతో ఉద్యమంపై తప్పుడు కథనం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ.ఎలాంటి నెగెటివ్ స్లోగన్స్‌ను సహించబోమని స్పష్టం చేశారు.స్పీకర్‌ను కలిసిన ధర్మేంద్ర ప్రధాన్NEET అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాల ఒత్తిడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో డిమాండ్రాజీనామాకు పట్టుబడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. విపక్షాలుఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామంలోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠCJP నిరసనలు.. తాజా పరిణామాలువిద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని DMK ఎంపీ తిరుచ్చి శివ ఆరోపించారు.NEET వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని విమర్శించారు.సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను 20 రోజులకు పైగా కొనసాగించేందుకు అనుమతించారని గుర్తుచేశారు.ప్రభుత్వానికి మానవతా దృక్పథం లేదని DMK ఎంపీ ఆరోపించారు.విద్యార్థుల పోరాటం ఆగదని, వారు తమ డిమాండ్ల కోసం కొనసాగుతారని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో భద్రతా కారణాలతో మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.రాజీవ్ చౌక్, ఐటీవో, మండీ హౌస్ సహా 16 మెట్రో స్టేషన్లు తదుపరి ఆదేశాల వరకు మూసివేశారు.జంతర్ మంతర్ పోలీస్ యాక్షన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు👉 ‘సమయం వృథా చేయొద్దు’జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. “మా సమయం, మీ సమయం వృథా చేయొద్దు” అని న్యాయవాదికి సూచించింది. 👉 వీడియోలు చూడబోమన్న సీజేఐపోలీసుల చర్యకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోరగా.. “మేము ఎలాంటి వీడియోలు చూడాలనుకోవడం లేదు” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.👉 పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తతనీట్ పేపర్ లీక్‌పై CJP చేపట్టిన నిరసనల్లో భాగంగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.👉 లాఠీఛార్జ్ చేశారంటూ ఆరోపణలువిద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది. పలువురు గాయపడ్డారని తెలిపింది.👉 ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్పోలీసుల చర్యపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.👉 ‘కోర్టును ఇందులోకి లాగొద్దు’పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సూచన చేసింది. కేసును బుధవారం విచారణకు లిస్ట్ చేసింది. విచారణ జరగాల్సి ఉంది.👉 నిరసనలు కొనసాగుతున్నాయిజంతర్ మంతర్ వద్ద CJP ఆందోళనలు కొనసాగుతుండగా.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.CJP హెచ్చరిక.. ఢిల్లీకి లక్షల మంది వస్తారుNEET పేపర్ లీక్ ఆరోపణలపై ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని CJP హెచ్చరిక.జూలై 20న జరిగిన నిరసన కేవలం ‘‘ట్రైలర్ మాత్రమే’’ అని CJP జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకా వ్యాఖ్య.ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించకపోతే లక్షలాది మంది ఢిల్లీకి తరలివస్తారని హెచ్చరిక.స్వాతంత్ర్యం తర్వాత దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యమమని రంకా పేర్కొన్నారు.ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, లేదంటే భారీ స్థాయిలో నిరసనలు తప్పవని వ్యాఖ్య.జూలై 20 మార్చ్ పోలీసుల జోక్యం వరకు శాంతియుతంగానే సాగిందని ఆరోపణ.ఆందోళనకారులను హింసాత్మకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శ.పోలీసులు విద్యార్థులపై బలప్రయోగం చేయడంతోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.31 రోజులుగా శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా ఉద్యమం సాగుతోందని చెప్పారు.CJP–ప్రభుత్వం రెండో దఫా చర్చలు నేడుNEET-UG 2026 పేపర్ లీక్ వివాదంపై కొనసాగుతున్న CJP ఆందోళనలు.నేడు మధ్యాహ్నం 12 గంటలకు CJP–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు.జూలై 20న తొలిసారి CJP ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ.ప్రభుత్వానికి మూడు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం సమర్పించిన CJP.కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలని డిమాండ్.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా తొలగింపు కోరిన CJP.NEET పేపర్ లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్.తొలి చర్చల్లో డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం.CJP ఆందోళనకు TMC మద్దతుCJP చేపట్టిన నిరసనలకు మద్దతు ప్రకటించిన TMC ఎంపీ కల్యాణ్ బెనర్జీ.విద్యార్థుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వ స్పందన దురదృష్టకరమని వ్యాఖ్య.‘‘విద్యార్థుల మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు?’’ అని ప్రశ్న.ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై విమర్శలు చేసిన బెనర్జీ.పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు.నిరసనల్లో భద్రతా సిబ్బంది, జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై ప్రశ్నించగా అసహనం వ్యక్తం చేశారు.జంతర్ మంతర్ పోలీస్ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో విచారణజంతర్ మంతర్‌లో విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసుల చర్యను సవాల్ చేస్తూ పిటిషన్.ఈ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.జూలై 18న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించిన ఘటనపై అభ్యంతరం.పోలీస్ ఆపరేషన్‌పై స్వతంత్ర దర్యాప్తు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి.ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బాడీ కెమెరా రికార్డులు భద్రపరచాలని కోరారు.శాంతియుత నిరసన హక్కును కాపాడేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి.భవిష్యత్‌లో నిరసనకారులపై విచక్షణారహిత పోలీస్ చర్యలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.CJP నిరసనలు.. 10 ఎఫ్ఐఆర్లు నమోదుఢిల్లీలో CJP నిరసనలకు సంబంధించి మొత్తం 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.న్యూఢిల్లీ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌లో 4, కన్నాట్ ప్లేస్‌లో 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.మండీర్ మార్గ్, బరాఖంబా రోడ్, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు చేశారు.నిరసనల సమయంలో హింస, రాళ్ల దాడి, విధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం వంటి అంశాలపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.హింస ముందస్తు ప్రణాళికలో భాగమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.ఘటనలకు సంబంధించిన 250కిపైగా వీడియోలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.👉 పార్లమెంట్లో చర్చకు సిద్ధం: కేంద్రంనీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.👉 ‘ఘోర పాపం’ అన్న ప్రధాని మోదీనీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. యువత భవిష్యత్‌తో ఆడుకోవడం ‘ఘోర పాపం’ అని వ్యాఖ్యానించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.👉ఆయన రాజీనామా చేయాల్సిందే!నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్లు పట్టుబడుతున్నాయి. ఆ తర్వాతే ఆందోళనలను విరమిస్తామని సీజేపీ ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలేవీ కనిపించడం లేదు. తొలిరోజు నిరసనల సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన నిరసనకారుల ప్రతినిధులు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించినప్పటికీ.. ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా తప్పు చేసినవాళ్లను జైల్లో పెట్టామని ప్రధాని మోదీ అంటుండగా.. చర్చలకు ప్రభుత్వం సిద్ధమంటూ ధర్మేంద్ర ప్రదాన్ విపక్షాలకు స్పష్టం చేశారు. #WATCH | Delhi | Cockroach Janta Party (CJP) National Spokesperson Ashutosh Ranka says, "This is the biggest movement in India's post-independence history...We have said this very clearly, what happened on 20th was a trailer. If the Govt doesn't agree, millions more will come to… pic.twitter.com/YwBpgeGkXc— ANI (@ANI) July 22, 2026👉జంతర్ మంతర్‌లో మళ్లీ భారీగా చేరిన నిరసనకారులువర్షం కురుస్తున్నప్పటికీ CJP కార్యకర్తలు జంతర్ మంతర్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం ఉదయం ఆందోళనకారుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను కొనసాగిస్తున్నారు.👉 CJP నేత వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అంటూ ఆరోపణCJP ప్రతినిధి సౌరవ్ దాస్ తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని ఆరోపించారు. తమ నిరసనల నేపథ్యంలోనే డిజిటల్ ఆంక్షలు విధిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే తమ సంస్థకు చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలు, వ్యవస్థాపకుడికి సంబంధించిన ఖాతాలు బ్లాక్ లేదా సస్పెండ్ అయ్యాయని CJP ఆరోపిస్తోంది.👉 పోలీసులపై రాళ్ల దాడి.. కేసు నమోదుమంగళవారం రాత్రి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడి జరిగిన ఘటనపై కేసు నమోదైంది. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.👉 RAF వాహనంపై దాడికన్నాట్ ప్లేస్‌లో గుంపును చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు పోలీసులు తెలిపారు. RAFకు చెందిన వజ్ర వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు సంయమనం పాటించారని అధికారులు తెలిపారు.👉 రాహుల్ గాంధీ నిరసన.. ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తతజంతర్ మంతర్ ఆందోళనకు దూరంగా ఉన్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వైపు నిరసనకు వెళ్లారు. పోలీసులు అడ్డుకుని రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు.👉భద్రత కట్టుదిట్టంజంతర్ మంతర్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత పెంచారు. -
నిరసనలకు వెళ్లలేదు.. ర్యాంక్ కొట్టాడు!
నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యా సంస్కరణలు.. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. ఓ టాపర్ మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. తోటి విద్యార్థుల్లా నిరసనల్లో పాల్గొనడం కంటే.. మళ్లీ పరీక్ష రాసి ర్యాంక్ కొట్టడంపైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టాడు. అంతేకాదు ఆ ప్రయత్నంలో విజయమూ సాధించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అతని స్పందన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.NEET-UG 2026 రీ ఎగ్జామినేషన్‌లో ఆల్ ఇండియా ర్యాంక్-2 సాధించిన పంషుల్ బన్సల్ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులకు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. నిరసనకు ఎందుకు వెళ్లాలి? దాని బదులు ఇంట్లో చదువుకుని స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చు కదా అని తాను అనుకున్నానని చెబుతున్నాడు. మొదట నేనూ బాధపడ్డా..ఢిల్లీ గ్రేటర్ కైలాష్‌లోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ విద్యార్థి అయిన పంషుల్.. మొదటి NEET పరీక్ష రద్దు కావడంతో తొలుత తీవ్ర నిరాశకు గురయ్యాడట. "మొదట బాధగా అనిపించింది. నేను బాగా రాశానని, మెడికల్ సీటు వస్తుందని అనుకున్నాను. కాసేపటికి దీనినే మరో అవకాశం లాగా మార్చుకోవాలనుకున్నా. ఆ ఫలితం ఆధారంగా నా పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపాడు.706 నుంచి 715 మార్కులకు..నీట్ మొదటి పరీక్షలో పంషుల్ 706 మార్కులు సాధించాడు. అయితే రీ ఎగ్జామినేషన్‌లో అతని స్కోర్‌ను 715 మార్కులు. ఎగ్జామ్‌లో 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించాడు. ఈ విజయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు కూడా తెలియజేశారు. అదనంగా లభించిన సమయాన్ని కొత్తగా చదవడానికి కాకుండా.. తన పాత ప్రణాళికనే మరింత క్రమశిక్షణతో కొనసాగించానని చెప్పాడు. "నా షెడ్యూల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇదే రొటీన్‌ను కొనసాగించాను. చివరి నెలన్నరలో చేయగలిగినంత కష్టపడ్డాను. మిగతాది దేవుడిపై వదిలేశాను" అని పంషుల్ తెలిపాడు.నిరసనలపై నో కామెంట్NEET పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇప్పుడు నిరసనలపై తన అభిప్రాయం చెప్పాలని అడిగినప్పుడు.. పంషుల్ స్పందించేందుకు నిరాకరించాడు. "దానిపై నేను వ్యాఖ్యానించను" అని స్పష్టం చేశాడు.#NDTVExclusive | "I thought of the situation as an opportunity to improve my score. So I thought, why should I go to the protest? Instead I could be studying at home and improving my skill and score": NEET UG 2026 topper Panshul Bansal to NDTV's @ShivAroor on #IndiaMatters pic.twitter.com/G8c7O2KXHn— NDTV (@ndtv) July 21, 2026పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన NEET-UG పరీక్షను తొలుత మే 3న నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న పరీక్షను రద్దు చేశారు. అనంతరం జూన్ 21న భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య రీ ఎగ్జామ్ నిర్వహించి.. జులై 16న ఫలితాలు ప్రకటించారు.అయితే పంషుల్ బన్సల్ విజయ ప్రయాణంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన లక్ష్యంపై దృష్టి పెట్టి ర్యాంక్ సాధించిన అతని కృషిని పలువురు ప్రశంసిస్తుండగా.. మరోవైపు NEET వివాదంలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పరిస్థితులను కొందరు గుర్తు చేస్తున్నారు.పంషుల్ వంటి సౌకర్యాలు ఉన్న విద్యార్థులకు మరో అవకాశం లభించడం ఒక కోణమైతే.. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు పరీక్షా వ్యవస్థలోని లోపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళనకారులు చెబుతున్నారు. పేపర్ లీక్ వ్యవహారం ఇప్పటికే ఒత్తిళ్లతో ఉన్న విద్యార్థుల్లో అసంతృప్తికి చివరి కారణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
నీట్ వివాదంపై మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పత్రాలను లీక్ చేయడం ‘ఘోర పాపం’ అని అభివర్ణించిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు కొనసాగుతున్న వేళ.. ఎన్టీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరాలు వెల్లడించారు.‘తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ప్రధాని పేర్కొన్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. లీక్‌కు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేశామని.. ఇప్పటివరకు 13 మంది నిందితులు జైలులో ఉన్నారని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నట్లు చెప్పారు.విద్యార్థుల ప్రయోజనాలే ప్రాధాన్యంనీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు రిజిజు వెల్లడించారు. లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ పరీక్షకు ప్రభుత్వం రీ-ఎగ్జామ్ నిర్వహించిందని.. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ఫలితాలను కూడా నిర్ణీత సమయంలో ప్రకటించామని తెలిపారు.పరీక్షా వ్యవస్థలో మార్పులపై దృష్టిపరీక్షా పత్రాల లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ విధానంలో మరింత పటిష్ఠమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. పరీక్షల భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.ఎన్టీయే భేటీలో పలు అంశాలపై చర్చఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ వివాదంతో పాటు పార్లమెంట్ సమావేశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారని తెలిపారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి తప్పుకోవడం లేదా కేంద్రం ఆయనను తప్పించడం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని పేర్కొంటూ.. తమ డిమాండ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కూడా అందజేసింది. ఆ డిమాండ్లపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా సీజేపీ నిరసనలపై స్పందించారు. యువత సమస్యలను ప్రభుత్వం వినాలని, నీట్ వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
పాకిస్తాన్ గుండెల్లో గుబులు!.. పీవోకేలో పరిస్థితి అదుపు తప్పుతోందా?
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. స్థానిక సమస్యలు, రాజకీయ హక్కులు, పాలనా విధానాలపై అసంతృప్తితో జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు చేపట్టిన భారీ మార్చ్‌ను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా ఆందోళనకారుల కదలికలను నియంత్రించేందుకు సుమారు నాలుగు వేల మంది పాకిస్తాన్ రేంజర్స్‌ను మోహరించినట్లు సమాచారం. ప్రధాన రహదారులపై భద్రతను పెంచడం, కొన్ని ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించడం, నిరసనలను అడ్డుకునేందుకు పోలీసు బలగాలను రంగంలోకి దించడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే, మీడియాపై కూడా నిషేధం విధించారు. దీంతో, అక్కడే ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది.అయితే, ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న JAAC గత కొంతకాలంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజా సమస్యలను ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం, పరిపాలనలో స్థానికులకు ఎక్కువ పాత్ర, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు వంటి అంశాలపై కమిటీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలు. ఈ స్థానాలు స్థానిక ప్రజల రాజకీయ హక్కులను ప్రభావితం చేస్తున్నాయని JAAC ఆరోపిస్తోంది. ఈ రిజర్వు స్థానాల వ్యవస్థలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తోంది.అయితే ఆందోళనలు శాంతియుతంగా కొనసాగకముందే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడులు, నిరసనలు, బలగాల ప్రతిస్పందనతో పరిస్థితి అదుపు తప్పినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. పాక్ ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే భద్రతను పెంచినట్లు చెబుతోంది. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆందోళనకారులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.ముజఫరాబాద్ వైపు సాగుతున్న ఈ మార్చ్ ఇప్పుడు కేవలం స్థానిక నిరసనగా కాకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి సంకేతంగా మారింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కొంటుంది? నిరసనకారులతో చర్చలకు దిగుతుందా? లేక కఠిన చర్యలకే పరిమితం అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజా డిమాండ్లు, ప్రభుత్వ నియంత్రణ చర్యలు, భద్రతా బలగాల మోహరింపు మధ్య ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత సున్నితంగా మారాయి. -
14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్!
న్యూఢిల్లీ: దక్షిణ చైనా సముద్రంపై బీజింగ్ ప్రాంతీయ సార్వభౌమాధికార వాదనలను జపాన్ సహా 14 దేశాలు తోసిపుచ్చడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2016 నాటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (పీసీఏ)తీర్పును సమర్థిస్తూ ఆయా దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం దౌత్యపరమైన ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో, చైనా తన నిరసనను వ్యక్తం చేస్తూ, బీజింగ్‌లోని జపాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌కు సమన్లు జారీ చేసింది. జపాన్ వైఖరి ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించింది.అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫిలిప్పీన్స్ సహా 14 దేశాలు ఈ వివాదాస్పద తీర్పు 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (యూఎన్సీఎల్ఓఎస్)ప్రకారం చైనా విస్తరణ వాదనలకు చట్టబద్ధత లేదని స్పష్టం చేశాయి. 27 దేశాల యూరోపియన్ యూనియన్ సైతం ఈ తీర్పును మైలురాయిగా అభివర్ణించింది. అయితే, చైనా విదేశాంగ శాఖ ఈ ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తూ, జపాన్ ఈ సముద్ర తీర ప్రాంతంలో భాగస్వామి కాదని, తమ సార్వభౌమాధికారంపై మాట్లాడే హక్కు దానికి లేదని పేర్కొంది. చైనా తన వాదనను సమర్థించుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను కూడా పంచుకుంది.వ్యూహాత్మక రవాణా మార్గంగా, 17.7 బిలియన్ టన్నుల చమురు, సహజ వాయువు నిక్షేపాలు కలిగిన దక్షిణ చైనా సముద్రంపై చైనా చారిత్రక హక్కులను క్లెయిమ్ చేస్తూ, కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. చైనా సైనిక చర్యలు, గస్తీలు అమెరికా కూటమి నౌకాదళ పర్యటనల మధ్య ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ముప్పు ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: రౌడీషీటర్ బర్త్‌డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి -
మంత్రి ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో 30 నుంచి కాంగ్రెస్ ఆందోళనలు
అహ్మదాబాద్/భోపాల్/నాగ్‌పూర్: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 30వ తేదీ నుంచి దేశవ్యాప్త ప్రచారోద్యమం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. విద్యార్థుల గళం పేరుతో 40 రోజులపాటు జరిగే దేశవ్యాప్త నిరసనలు, ఆగస్ట్ 9వ తేదీన ‘ఢిల్లీ ఛలో’తో ముగియనుందని ఆ పార్టీ పేర్కొంది. నిరసనల సమయంలో మొత్తం 28 నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగార్థులు, కోచింగ్ కేంద్రాలు, కాలేజీ క్యాంపస్‌లు, గ్రంథాలయాల్లో ప్రభుత్వ నిర్వాకాన్ని వివరిస్తామంది. కరపత్రాల పంపిణీ, వీధివీధినా సమావేశాలు, క్యాంపస్‌లో విద్యార్థులతో ముఖాముఖి వంటివి చేపడతామంది. అహ్మదాబాద్, భోపాల్, నాగ్‌పూర్ తదితర నగరాల్లో 30వ తేదీ నుంచి సాగే ఆందోళనలకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ నేతలు మీడియాకు వివరించారు. పదేపదే జరుగుతున్న పరీక్షల అవకతవకల కారణంగా విద్యార్థులకు వ్యవస్థపై నమ్మకం తగ్గిపోయిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ నేత సతేజ్ పాటిల్ ఆరోపించారు. 130 కోట్ల మంది కలిగిన దేశాన్ని నడిపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం..కేవలం 23 లక్షల మంది కోసం పక్కాగా పరీక్షను సైతం నిర్వహించలేకపోతోందని ఎద్దేవా చేశారు. పరీక్ష పత్రాలు ముందుగానే లీకవడం మామూలు అంశంగా మారిపోయిందని, ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పాటిల్ విమర్శించారు. గతంలో ఇలాంటి అనేక కేసుల్లో కేవలం మధ్యదళారులను మాత్రమే అరెస్ట్ చేసి, వాటి వెనుక ఉన్న కుంభకోణాల నెట్‌వర్క్‌ను మాత్రం వదిలేసిందని దుయ్యబట్టారు. కోచింగ్ కేంద్రాలు, పరీక్ష పత్రాల లీక్ నెట్‌వర్క్‌ల మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాలన్నారు. వార్షిక పరీక్షలు, వాటి ఫలితాలు, నియామకాలకు సంబంధించిన తేదీలను ముందుగానే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాన్ క్షమాపణ చెప్పాలి: రాహుల్ పరీక్ష పత్రాల లీకేజీలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులంటూ వ్యాఖ్యానించిన విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఆయన మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరినీ ద్రోహులంటూ బీజేపీ ప్రభుత్వం ముద్రవేస్తోందని రాహుల్ గురువారం ఎక్స్‌లో ఆ రోపించారు. -
పీవోకేపై పాకిస్తాన్ కఠిన వ్యూహాం!
ముజఫరాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నెలలుగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. నిరసనలను అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆహారం, మందులు, ఇంధనం వంటి నిత్యవసర వస్తువుల సరఫరాలను అడ్డుకుంటోందని స్థానిక సంస్థలు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యల వల్ల ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలు మరింత సంక్షోభంలోకి నెట్టబడ్డారని చెబుతున్నారు.ఆందోళనకారుల ఆరోపణల ప్రకారం పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీవోకేలోకి వచ్చే ప్రధాన సరఫరా మార్గాలపై భద్రతా తనిఖీల పేరుతో సరుకు వాహనాలను నిలిపివేస్తున్నారు. దీనివల్ల గోధుమలు, పిండి, కూరగాయలు, వంటనూనె, పెట్రోల్, డీజిల్, వైద్య సామగ్రి వంటి వస్తువుల సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో మందుల కొరత ఏర్పడిందని, ఆసుపత్రులు కూడా అవసరమైన ఔషధాల కోసం ఇబ్బందులు పడుతున్నాయని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇంధన కొరత కారణంగా ప్రజా రవాణా, సరుకు రవాణా వ్యవస్థలు కూడా ప్రభావితమయ్యాయి.పెరుగుతున్న ఒత్తిడి..పీవోకేలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉండటం, జీవన వ్యయం పెరగడం, ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ దిగ్బంధం ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా పడుతోంది. మార్కెట్లలో సరుకుల కొరత కారణంగా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.పాక్ ప్రభుత్వ వైఖరిఈ ఆరోపణలను పాక్ ప్రభుత్వం అధికారికంగా ఖండించింది. భద్రతా కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు పెంచామని, సరఫరాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఉద్యమకారులు మాత్రం ఇది ప్రజా ఉద్యమాలను బలహీనపరిచేందుకు చేపట్టిన వ్యూహమని ఆరోపిస్తున్నారు.ఎందుకు ఆందోళనలు?గత కొంతకాలంగా పీవోకేలో విద్యుత్ చార్జీల పెంపు, అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యవసరాల ధరల పెరుగుదల వంటి సమస్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతం అయినప్పటికీ స్థానిక ప్రజలకు అధిక ధరలకు కరెంట్ సరఫరా చేయడంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, సమ్మెలు, బంద్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గత ఏడాది జరిగిన నిరసనల తర్వాత కొన్ని డిమాండ్లను అంగీకరిస్తామని పాక్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, వాటి అమలులో పురోగతి లేకపోవడంతో ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు.భద్రతా బలగాల కఠిన చర్యలు..ఇటీవలి వారాల్లో పీవోకేలో అనేక ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలువురు ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడం, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిరసనకారులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలు వివాదానికి దారితీశాయి. మానవ హక్కుల కార్యకర్తలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను చెప్పుకునే హక్కును అణచివేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.అంతర్జాతీయంగా చర్చ..పీవోకేలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు కశ్మీర్ అంశాన్ని ప్రపంచ వేదికలపై ప్రస్తావించే పాకిస్తాన్, మరోవైపు తన ఆధీనంలోని ప్రాంతంలో ప్రజా అసంతృప్తిని ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రజల ఆర్థిక సమస్యలను పరిష్కరించడం కంటే కఠిన చర్యలకు ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి మరింత సంక్లిష్టమయ్యే అవకాశం ఉంది. సరఫరాల కొరత కొనసాగితే పీవోకేలో మానవతా సంక్షోభం తలెత్తే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. -
నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
కోయంబత్తూర్: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల పరీక్ష ‘నీట్’ చుట్టూ ముసురుకున్న వివాదాలు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 19 ఏళ్ల నీట్ అభ్యర్థిని అనుకీర్తన బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవలి నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, ఆపై తిరిగి పరీక్ష రాయాల్సి వస్తుందనే తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వైఖరిపై దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసింది.ప్రశ్నపత్రం లీక్‌తో..పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. మృతురాలు అనుకీర్తన ఇప్పటికే రెండుసార్లు నీట్ పరీక్ష రాసింది. మెడిసిన్ సీటు సాధించాలనే పట్టుదలతో మూడో ప్రయత్నం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ దుమారం రేగడం, బాధితులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారనే వార్తలు రావడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ పరీక్షల గందరగోళం తన భవిష్యత్తును ఎటు తీసుకెళ్తుందోనన్న ఆందోళనతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు డెహ్రాడూన్‌లోనూ ఇటీవలే ఇద్దరు విద్యార్థులు ఇదేవిధంగా పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం.రగులుతున్న కోయంబత్తూర్..అనుకీర్తన మృతి వార్త తెలియగానే కోయంబత్తూర్‌లోని ఈఎస్ఐ (ఈఎస్ఐ) ఆస్పత్రి ప్రాంగణంలో సీపీఐ(ఎం) నాయకులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు అధికార పక్షం డీఎంకే తీవ్రంగా స్పందించింది. నీట్ పరీక్ష నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలనే సుదీర్ఘ డిమాండ్‌ను మరింత ఉధృతం చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.‘నీట్’ వర్సెస్ తమిళనాడుమొదటి నుంచి తమిళనాడు ప్రభుత్వం నీట్ పరీక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష కేవలం ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లగలిగే ఆర్థిక పటిష్టత ఉన్న విద్యార్థులకే లాభం చేకూరుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్లస్-టూ లో మంచి మార్కులు సాధించినప్పటికీ వైద్య విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు ఇచ్చేవారని, ఆ విధానమే పేదలకు న్యాయం చేసిందని పేర్కొంది. ఇది కూడా చదవండి: New York: భారతీయుడి ప్రాణాలు తీసిన గుర్రపు బగ్గీ -
ఐర్లాండ్‌లో చెలరేగిన అల్లర్లు: కత్తిపోట్ల ఘటనతో..
బెల్ఫాస్ట్: ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఒక స్థానిక వ్యక్తిపై సుడాన్ దేశానికి చెందిన శరణార్థి జరిపిన కత్తిపోట్ల దాడి.. నగరంలో భారీ ఎత్తున వలస వ్యతిరేక అల్లర్లకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు వీధుల్లోకి వచ్చి, వలసదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగి, దీనిని ఒక ‘తీవ్రమైన సంక్షోభ పరిస్థితి’గా ప్రకటించారు.అర్ధరాత్రి ఘోరం.. కత్తితో విచక్షణారహితంగా దాడిబెల్ఫాస్ట్లోని కిన్నైర్డ్ ఎవెన్యూలో సోమవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. స్టీఫెన్ ఓగిల్వీ (44) అనే స్థానిక వ్యక్తిపై 30 ఏళ్ల సుడాన్ శరణార్థి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఓగిల్వీ ముఖం, మెడ, వీపు, కళ్ల భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.సోషల్ మీడియాలో వైరల్ వీడియోతో..నడిరోడ్డుపై జరిగిన ఈ భీభత్సానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం కావడంతో ప్రపంచవ్యాప్త రైట్-వింగ్ నేతలు తీవ్రంగా స్పందించారు. బ్రిటీష్ నేత జేమ్స్ రాబిన్సన్ ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ నిరసనలకు పిలుపునిచ్చారు. ఎలాన్ మస్క్ సైతం ఈ వీడియోను రీపోస్ట్ చేస్తూ, నిరసనలు జరగబోయే ప్రాంతాల వివరాలను పంచుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ముసుగులు ధరించిన నిరసనకారులు శరణార్థుల ఇళ్లపై రాళ్లు, ఇటుకలతో దాడులు చేస్తూ ‘స్థానిక ఇళ్లు స్థానికులకే’ అంటూ గోడలపై నినాదాలు రాశారు.తగలబడుతున్న వీధులు.. ఈ వలస వ్యతిరేక ప్రదర్శనలు కాస్తా హింసాత్మకంగా మారడంతో బెల్ఫాస్ట్ వీధులు రణరంగాన్ని తలపించాయి. నిరసనకారులు వలసదారుల ఇళ్లను, వాహనాలను తగులబెట్టారు. ఒక మిడిల్ ఈస్టర్న్ సూపర్‌మార్కెట్‌కు కూడా నిప్పు పెట్టారు. ప్రాణభయంతో వలసదారులు తమ ఇళ్లను వదిలి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ న్యాయశాఖ మంత్రి లాంగ్ ఈ హింసాకాండను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజలంతా సంయమనంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: అఫ్గాన్‌పై పాక్ భీకర వైమానిక దాడులు.. 13 మంది దుర్మరణం -
తమిళనాడులో తెరపైకి మరోసారి ఆ వివాదం
చెన్నై: తమిళనాడులో కావేరి నదీ జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కావేరీ నదీకి మధ్య భాగంలో మేఘదాతు వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఇవాళ(జూన్ 2, మంగళవారం) తమిళ పార్టీల నేతృత్వంలో చెన్నైలో ఆందోళనలు చేపట్టారు. మేఘదాతు ప్రాజెక్టుకు కర్ణాటకు సర్కార్ ఏర్పాట్లు చేస్తుండగా.. కర్ణాటక వైఖరిని ఖండిస్తూ ఆందోళనలకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో పిలుపునిచ్చారు.డ్యామ్‌ను కచ్చితంగా నిర్మించి తీరుతామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ.. అలాగే ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి ఈ నిరసన కార్యక్రమం చేపటినట్లు ఆయన తెలిపారు. చెన్నై జిల్లా కలెక్టరేట్ సమీపంలో తన నాయకత్వంలో జరిగే ఈ నిరసనలో పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సామాజిక సంస్థలు పాల్గొన్నాయి.ఈ ప్రాజెక్టు కోసం కర్ణాటక రూ. 5,900 కోట్లు కేటాయించిందని, నిర్మాణ సామగ్రిని కూడా సిద్ధం చేస్తోందని పేర్కొన్న వైగో.. 68 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్రతిపాదిత డ్యామ్.. సుప్రీంకోర్టు, కావేరీ నీటి నిర్వహణ అథారిటీ ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఇటీవల వైగో ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడు సాగునీటి అవసరాలు తీవ్రంగా దెబ్బతింటాయని.. మెట్టూరు డ్యామ్‌కు నీటి ప్రవాహం తగ్గుతుందని, దీనివల్ల కావేరీ నీటిపై ఆధారపడిన డెల్టా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు. -
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా
రాజమహేంద్రవరం సిటీ: డీఎస్సీ–2025లో అవకతవకలు, మోసాలపై జూన్ 1న వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.డీఎస్సీ నిర్వహణలో ప్రతిభ కలిగిన అర్హులకు అన్యాయం చేయడం, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించడం, విస్తుగొలిపే అక్రమాలు వెలుగు చూడడం, మెరిట్ లిస్టులు వెబ్సైట్ నుంచి మాయం చేయడం, రోల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడం, పోస్టులు అమ్ముకోవడం వంటి ఆరోపణలు బయటికి రావడం, స్పోర్ట్స్ కోటా పోస్టుల నియామకంలో అక్రమాలు వెలుగు చూడడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
‘సకల శాఖల మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే’
ఏపీలో కూటమి సర్కార్ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అనంతపురం..డీఎస్సీ స్కాంపై విద్యార్థి సంఘాల ఆగ్రహంఅనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విద్యార్థి విభాగం నేతలువిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ఉరేసుకుని విద్యార్థుల వినూత్న నిరసనటీడీపీ కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్విద్యార్థి విభాగం నేతల ఆందోళనకు సంఘీభావం తెలిపిన డీఎస్సీ అభ్యర్థులు గుంటూరు..పానుగంటి చైతన్య వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు కామెంట్స్..ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు.అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించకుండా ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసిందిప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ఒక అక్రమాల పుట్టడీఎస్సీ పరీక్ష గందరగోళంగా మారిందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారించాలివిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్...ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీపరీక్షలు నిర్వహించే వారు ఎలా డీఎస్సీ పరీక్ష రాస్తారులోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారుస్పోర్ట్స్ కేటగిరీ కింద ఉన్న ఉద్యోగాలను లోకేష్ అమ్ముకున్నారులోకేష్ కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి లోకేష్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..దేశంలో చంద్రబాబు లాంటి దరిద్రపు ప్రభుత్వం ఎక్కడా లేదుయువకుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలినారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలికర్నూలు..ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్..రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన.రాష్ట్రంలో మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మార్చి అభ్యర్థులను రోడ్డున పడేశారు.మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందివిద్యాశాఖలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి.డీఎస్సీలో మెరిట్ విద్యార్థుల పేర్లను మంత్రి లోకేష్ తప్పించారు.అభ్యర్థులు నుండి నేరుగా డబ్బులు ముట్టినట్లు సమాచారం.డీఎస్సీలో అన్యాయం జరిగిందని అడిగితే కేసులు పెడుతున్నారు.డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ..డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరుబాట..డాబా గార్డెన్స్ అంబేద్కర్ కూడలి పార్టీ శ్రేణుల ఆందోళన..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నేతలు..కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవి బాబు తదితరులు..నెల్లూరు..నెల్లూరు విఆర్సీ సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనడీఎస్సీ పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై ఆందోళననియామక ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆగ్రహంనిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి, కూటమి ప్రభుత్వ పరిపాలన లోపంపై మండిపాటుఎస్వీ యూనివర్సిటీ ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమంలో భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.భూమన కామెంట్స్..డీఎస్సీ అక్రమాలకు బాధ్యత చేస్తూ రాజీనామా చేయాలిఒక్కో ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారుఓసీ ఓపెన్ కటాఫ్ లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు అన్యాయం చేశారుబీసీ, ఎస్సీ, ఎస్టీలు మెరిట్లో వచ్చినా రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేశారు, ఓపెన్ కేటగిరిలో అన్యాయం చేశారుఓపెన్ కేటగిరి కటాఫ్ బయట పెట్టాలిరిజర్వేషన్ లేకుండా కొన్ని లక్షలు మందికి అన్యాయం చేశారుదీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.స్పోర్ట్స్ కోటాలో అదనపు కోట కలిపి, శాప్ చైర్మన్ రవినాయుడు అర్హత లేని వారికి ఉద్యోగాలు3.50 లక్షలు మంది డీఎస్సీ రాస్తే.. వాళ్లకు కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చాయిప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వ్యాఖ్యలు..మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలిదీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.సకల శాఖ మంత్రి నారా లోకేష్ భారీ ఎత్తున కోట్లు అవినీతికి పాల్పడ్డారు -
సిరిసిల్లలో ఉద్రిక్తత.. పోలీసులు లాఠీచార్జ్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు సమాచారం. రెండు పార్టీ నేతల నిరసనలతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.వివరాల మేరకు.. సిరిసిల్లలోని నేతన్న చౌరస్తా వద్ద బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో పరస్పర నినాదాలతో చౌరస్తా దద్దరిల్లింది. అనంతరం, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ కొట్టుకునే స్థాయికి చేరింది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల భారీ నినాదాలు చేశాయి. దీంతో, రంగంలోకి దిగి ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీచార్జ్ చేశారు.కాగా, ఉభయ పార్టీల నేతలు.. పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో, జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రెండు పార్టీ నేతలను అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. -
రేపు వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం నిరసనలు
సాక్షి, అమరావతి: పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈ నెల 27న(సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తెలిపారు. నిరసన అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు నిర్వహించిన పనులకు సంబంధించి కూలీలకు వేతనాలు అందకపోవడం బాధాకరమన్నారు. -
డిపోలకే పరిమితమైన బస్సులు.. ప్రయాణికుల అవస్థలు
-
ఏబీఎన్ రాధాకృష్ణ రోత వ్యాఖ్యలపై ధర్మాగ్రహం
మహిళలను కించపరిచేలా, సభ్యసమాజం తలదించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షి నెట్వర్క్: మహిళలను కించపరిచేలా, సభ్యసమాజం తలదించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘రాధాకృష్ణది జర్నలిజం కాదు. ముమ్మాటికీ బ్రోకరిజం’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారాహిత్య జర్నలిజాన్ని ఖండించారు. మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట శాంతియుత ఆందోళనలు చేపట్టారు. నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొనగా.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై జులుం ప్రదర్శించారు. ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అతనిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందే విజయవాడ రామవరప్పాడు సమీపంలోని ముస్తాబాద రోడ్డులో గల ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు పెద్దపెట్టున నిరసనకు దిగారు. ‘బూతు రాధాకృష్ణ డౌన్‌డౌన్’ అని రాసిన ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని, మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, మహిళలు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆంధ్రజ్యోతి కార్యాలయం రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. శాంతియుత నిరసన తెలియజేయడానికి మాత్రమే వచ్చామని చెప్పినా వినకుండా అనుచితంగా ప్రవర్తించారు. పోలీసులు తోపులాటకు దిగటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గుంటూరులో లాఠీచార్జ్ గుంటూరు బ్రాడీపేటలోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలను పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుడిచేతికి గాయమైంది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిరసన ప్రదర్శన చేశారు. మల్లమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. పల్నాడు రోడ్డులోని పాత ఆంధ్రజ్యోతి కార్యాలయం ఉన్న కాంప్లెక్స్‌కు ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. రోత రాతలపై కన్నెర్ర ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు మహిళలను అడుగడుగునా అడ్డుకున్నారు. నెల్లూరు అయ్యప్పగుడి సమీపంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్ సెంటర్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, మహిళలను అడ్డుకునేందుకు పోలీసులు అన్ని మార్గాల్లో బారికేడ్లను, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను రోప్ పార్టీలతో అడ్డుకున్నారు. పోలీసులను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ముఖ్యనేతలతోపాటు మహిళలు, పార్టీ కార్యకర్తలను బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేసిన మహిళలు ‘రాధాకృష్ణా ఖబడ్దార్’ అంటూ హెచ్చరికలు జారీచేశారు. మురికి వ్యాఖ్యలపై నిరసనలు ఉభయ గోదావరి జిల్లాల్లో నిరసనలు మిన్నంటాయి. తణుకు నరేంద్ర సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, మహిళలు నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాలచెరువు సెంటర్లో గల ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు బైఠాయించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో నిరసన చేపట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు వేసిన టెంట్‌ను పోలీసులు తొలగించారు. హైస్కూల్ సెంటర్ నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్న నాయకులు, కార్యకర్తలు, మహిళలను అడ్డుకుని వెనక్కు నెట్టేశారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు హైసూ్కల్ సెంటర్లోనే నిరసనకు దిగి ఆంధ్రజ్యోతి, రాధాకృçష్ణకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉత్తరాంధ్రలోనూ పెల్లుబికిన నిరసనలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. విశాఖలోని అక్కయ్యపాలెం వద్ద గల ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అక్కడే బైఠాయించి రాధాకృష్ణ రాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయలసీమలో నిరసనల వెల్లువ అనంతపురంలోని ఏబీఎన్ ప్రాంతీయ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు ఆందోళన చేశారు. అక్కడ పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేసి నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలను అడ్డుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏబీఎన్ రాధాకృష్ణ దిష్టి»ొమ్మను దహనం చేశారు. కడపలో ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వైఎస్సార్సీపీ నేతలు, మహిళలు ప్రయత్నించారు. పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. ధర్నా చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. రాధాకృష్ణ డౌన్ డౌన్, బూతు చానల్ ఏబీఎన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పార్టీ నేతలను బలవంతంగా పోలీస్ వ్యాన్‌లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మొత్తం 57 మందిని అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులు చేతబూని ఆర్ఎస్ రోడ్డు నుంచి రాజ్‌విహార్ సెంటర్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం రాధాకృష్ణ ఫొటోలను మహిళలు చెప్పులతో కొట్టి అక్కడే కాల్చారు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదేం పని.. బాలస్వామీ! మహిళా కానిస్టేబుల్‌పై చేతులు వేసిన డీఎస్పీ కడప (కార్పొరేషన్): కడపలో ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చిన మహిళలను అరెస్ట్ చేసే క్రమంలో డీఎస్పీ బాలస్వామిరెడ్డి వారిని చేతులు పట్టి లాగుతూ వీపు, నడుముపై తోస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ, మాజీ కో–ఆప్షన్ సభ్యురాలు బి.మరియను మహిళా కానిస్టేబుళ్లు జీపులో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుంటే డీఎస్పీ బాలస్వామిరెడ్డి మహిళా కానిస్టేబుల్ చేయిపట్టి లాగుతూ వీపు, నడుముపై చేతులు వేసి తోశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మహిళలపైనా చేతులు వేశారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ చేతులు వేసి తోయడంతో సదరు మహిళా కానిస్టేబుల్ చిన్నబుచ్చుకుంది. -
కోల్‌కతానూ కొట్టగలం
లాహోర్: రెచ్చగొట్టేలా మాట్లాడటమే పనిగా పెట్టుకునే పాకిస్తాన్ మంత్రులు మరోసారి తమ వాచాలత్వాన్ని బయటపెట్టుకున్నారు. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖావాజా ఆసిఫ్ శనివారం ఇదే తరహా ప్రేలాపనలు చేశారు. ‘‘తప్పుడు ఆపరేషన్ల పేరిట భారత్ మాపై దాడికి దిగితే ఈసారి మేం దాడుల పరిధికి కోల్‌కతా దాకా విస్తరిస్తాం. కోల్‌కతాపై దాడిచేయగలం’’అని అన్నారు. శనివారం లాహర్ సమీప సొంత పట్టణం సియాల్కోట్లో ఆసిఫ్ మాట్లాడారు. ‘‘భారత ప్రభుత్వం తప్పుడు కథనాలు అల్లుతుంది. ఇందుకోసం సొంత వాళ్లను లేదా అక్కడి నిర్బంధంలో ఉన్న పాకిస్తానీలను వాడుకుంటోంది. కొందరిని నేలపై పడుకోబెట్టి ‘వీళ్లందరూ ఉగ్రవాదులు. అందర్నీ అంతంచేశాం’అంటూ ఏవేవో కథనాలు వెలువరుస్తుంది’’అని ఆసిఫ్ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా ఉద్రికత్తలను సాకుగా చూపి పొరుగుదేశం దాడులకు తెగబడితే తీవ్రస్థాయిలో విరుచుకుపడతామని భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ పాక్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఆసిఫ్ మాట్లాడారు. -
ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికీ బీఆర్ నాయుడిని వెనకేసుకువస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ మండిపడుతోంది.వైఎస్సార్ జిల్లా: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు.బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ చేశారు. ఈ నిరసన మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్ రెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.అనంతపురం జిల్లా: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని కోరుతూ అనంతపురంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్లకార్డులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ మండిపడ్డారు.విశాఖపట్నం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వెంటేశ్వరస్వామి వారి ఆలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రమణకుమారి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పూజల్లో మాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ నాయుడిని టీడీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. టీటీడీ పవిత్రతను కాపాడాలంటూ నినాదాలు చేశారు.చంద్రబాబు సమాధానం చెప్పాలి: మల్లాది విష్ణుబీఆర్ నాయుడు ఛైర్మన్ అయిన రోజు నుంచి తిరుమలపై అపచారాలు జరుగుతున్నాయి. టీడీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. ఏమొహం పెట్టుకుని చంద్రబాబు బీఆర్ నాయుడిని తన పక్కన కూర్చోబెట్టుకుని తిరుపతిలో పూజలు చేస్తారు. కళంకితమైన వ్యక్తితో కలిసి ఎలా ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణంలో పాల్గొంటారు. అసలు చంద్రబాబుకు నైతికత ఉందా?. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్‌గా తీసుకోవద్దని ఓ మహిళ లేఖ రాసింది. కానీ అవేమీ చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.పటమట వెంకటేశ్వరస్వామి ఆలయంలో..టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటమట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్పలత, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు చేశారు.తిరుపతి: టీటీడీ చైర్మన్ వైఖరి పట్ల హిందూ సమాజం సిగ్గు పడుతోందని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంఛార్జి భూమన అభినయ్‌రెడ్డి అన్నారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉంటూ.. ఆయన చరిత్ర ఇంత పరమ నికృష్ట మైందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలి. లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత తిరుమల సీఎం చంద్రబాబు మనవడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం, శ్రీరామ నవమి వేడుకల్లో సీఎం తో పాటు టీటీడీ చైర్మన్ పాల్గొనడం సిగ్గుచేటు.చిత్తూరు జిల్లా: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కృపాలక్ష్మీ డిమాండ్ చేశారు. కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘ బీఆర్ నాయుడు రాసలీలలు బయట పడిన తర్వాత కూడా టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం సిగ్గు చేటు. సీఎం చంద్రబాబు వెంటనే బీఆర్ నాయుడిని తొలగించాలి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.. హోంశాఖామంత్రి అనిత మహిళలకు అండగా ఉన్నామని అంటున్నారే కానీ నడిరోడ్డుపై మహిళను పదవిలో ఉన్న ఎమ్మెల్యే కొడుతుంటే ఎలాంటి స్పందన లేదు. హోం శాఖ మంత్రి విమర్శలకే పరిమితమైంది. పల్నాడు జిల్లా, మాచర్లలో ఇంట్లో వున్న మహిళను కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా అఘాత్యానికి పాల్పడిన ఘటనపై బాధ్యత మహిళలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచాము’ అని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణితో కలిసి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత.స్త్రీలోలుడు బి.ఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలిబీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయకుండా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారుచంద్రబాబు కు భక్తుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీఆర్ నాయుడిని తొలగించాలి- కాకాణి పూజిత నెల్లూరు జిల్లా, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం కేంద్రంలోని శ్రీలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి.ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణికి వేదమంత్రాల నడుమ, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికిన, ఆలయ అర్చకులు, స్థానికులుకాకాణి కామెంట్స్నైతిక విలువలు లేని బీఆర్ నాయుడికి పవిత్ర పదవి ఇవ్వడం సరికాదుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి, అనైతిక కార్యక్రమాలు పెచ్చరిల్లిపోయాయిచంద్రబాబు మహిళల పై ఎవరైనా చెయ్యి వేస్తే, అదే ఆఖరి రోజు అవుతుందని చెబుతూనే ఉన్నాడు-మా ప్రభుత్వం వస్తే మహిళల వైపు చూడడానికే భయపడతారని పవన్ కళ్యాణ్ ప్రగల్బాలు పలికాడుఇప్పుడు ఇన్నీ అరాచకాలు జరుగుతున్నా నోరు మెదపరేమి వైఎస్ జగన్ పాలనలోనే మహిళలు రక్షణ పొందారు పార్వతీపురం, మన్యం జిల్లా: టీటీడీ చైర్మన్ పదవిని బీఆర్ నాయుడు అపవిత్రం చేశారంటూ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ధ్వజం. బీఆర్ నాయుడు వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాల్సిందేనంటూ డిమాండ్గుంటూరు: బీఆర్ నాయుడు పదవి నుంచి దిగిపోవాల్సిందే: అంబటి రాంబాబువెంకటేశ్వరస్వామి ఆలయంలో అంబటి ప్రత్యేక పూజలు -
‘చలో పోతిరెడ్డిపాడు’ గ్రాండ్ సక్సెస్
సాక్షి ప్రతినిధి కర్నూలు: చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గురువారం ఉదయం సభ.. బుధవారం మధ్యాహ్నం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుపడ్డారు.. అనుమతి నిరాకరించి సభ జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ కుట్ర పసిగట్టిన వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పిటిషన్ వేయించింది. దీంతో సభకు కొన్ని గంటల ముందు అనుమతి లభించింది. ఈ క్రమంలో గోపాల్‌రెడ్డి పొలంలో సభ నిర్వహించుకునేందుదు ఆత్మకూరు డీఎస్పీ అనుమతిచ్చారు. దీంతో బుధవారం మధ్యాహ్నం తర్వాత నేతలు అక్కడికి చేరుకున్నారు.కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ధారా సుధీర్ తదితరులు రాత్రంతా పనులు చేయించి తెల్లవారే సరికి వేదికను సిద్ధం చేశారు. నేతలంతా చేయి చేయి కలిపి సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్‌ను పూర్తి చేయిస్తామని శపథం చేశారు. అయినా చంద్రబాబు చలించకపోతే జగన్ అధికారంలోకి రాగానే తక్కిన పనులు పూర్తి చేస్తామని ప్రతినబూనారు. సభకు వచ్చిన వారే కాదు ‘గ్రేటర్ రాయలసీమ’ పరిధిలోని ప్రతి ఇంట్లో సభను లైవ్‌లో వీక్షించారు. గురువారం గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏ పల్లెలో, ఎక్కడ నలుగురు గుమికూడినా రాయలసీమ లిఫ్ట్‌పైనే చర్చ జరిగింది.ఇంత తక్కువ వ్యవధిలో ‘సీమ’ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం నేతలు, కార్యకర్తలు, రైతులు సభకు వేలాదిగా తరలి రావడం గమనార్హం. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీమకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నేతలు వివరిస్తున్నప్పుడు రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులు‘చలో పోతిరెడ్డిపాడు’ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్సీపీ నేతలతో పాటు రైతులు సైతం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జనాలను తరలించేందుకు ఎవరూ కూడా ఒక బస్సు, లారీ ఏర్పాటు చేయలేదు. నందికొట్కూరు, పాణ్యం, ఆత్మకూరుతో పాటు నంద్యాల జిల్లాలోని నియోజకవర్గాలు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎవరికి వారు సొంత ఖర్చులతో తరలి రావడం విశేషం. గురువారం ఉదయం 10 గంటలకే రైతులు చేరుకున్నారు. నేషనల్ హైవే నుంచి పోతిరెడ్డిపాడు వరకు ట్రాఫిక్ జాం అయితే రైతులు పొలాల గట్ల వెంట నడుస్తూ వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ సభ పూర్తయ్యే వరకూ ఓపిగ్గా నేతల ప్రసంగాలను ఆలకించారు.కుర్చీలు లేకపోతే వేదిక చుట్టూ వేల సంఖ్యలో నిల్చుని ఆద్యంతం నేతల ప్రసంగాలు విన్నారు. దీన్నిబట్టి ప్రభుత్వం ఎంతగా అణిచి వేయాలని చూసినా, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు తమకు ఎంత విలువైందో చాటి చెప్పారు. ప్రాజెక్టు కోసం ఎందాకైనా ఉద్యమించాలనే కసి, పట్టుదల స్పష్టంగా కన్పించింది. సభ నిర్వాహకులను సజ్జల, పెద్దిరెడ్డి తదితర నేతలు అభినందించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, రమేష్ బాబు, రామసుబ్బారెడ్డి, కల్పలతా రెడ్డి, కర్నూలు పార్లమెంటు పరిశీలకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, బ్రిజేంద్రా రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, కేతిరెడ్డి వెంకటరావిురెడ్డి, దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, అంజద్ బాషా, రఘురామి రెడ్డి, అన్నా రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, కర్నూలు మేయర్ బీవై రామయ్య, కోడుమూరు ఇన్చార్జి ఆదిమూలపు సతీష్, కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
ఓటుకు నోటు భయం.. రాయలసీమ లిఫ్ట్ తాకట్టు: సజ్జల
సాక్షి, కర్నూలు జిల్లా: పోతిరెడ్డి పాడు నిరసన ఆరంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. సీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారంటూ మండిపడ్డారు. ఇవాళ చలో పోతిరెడ్డిపాడుకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. సీమ లిఫ్ట్ పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. చలో పోతిరెడ్డిపాడుకు ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.ముందుగా వైఎస్సార్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పలువురు నేతలు పోతిరెడ్డిపాడును సందర్శించారు. అనంతరం పోతిరెడ్డిపాడు దగ్గర నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయలసీమ జిల్లాల నుంచి బహిరంగ సభకు రైతులు తరలివచ్చారు. ఈ సభలో వైఎస్సార్సీపీ సీమ జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు శైలజానాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి, విశ్వేశ్వరరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు మంగమ్మ శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, కంగాటి శ్రీదేవి, బుట్టా రేణుక పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతలను నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేస్తోంది. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని నినదిస్తోంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జిస్తోంది. ‘తీరుమారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరిస్తోంది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిజాలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు. తెలంగాణ మాదిరే రాయలసీమకు 800 అడుగుల స్థాయిలోనే శ్రీశైలం నీరు రావాలి. చంద్రబాబుకు ఓటుకు నోటు భయం ఉంది. హైదరాబాద్‌లో ఆస్తులను కాపాడుకునేందుకు రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే కారణంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దారుణం. రైతులకు సమృద్ధిగా నీరందిస్తేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ ఏనాడో గుర్తించారు. సీమ తాగు సాగు నీటి కష్టాలకు ఏకైక పరిష్కారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే. 80 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఆపేయడం మహాపాపం అని చంద్రబాబు గుర్తించాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబుకు రాయలసీమ ప్రయోజనాలు పట్టవు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్‌కు తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల్లోనే తెలంగాణ తీసుకుంటూ ఉంటే రాయలసీమ ఎందుకు తీసుకోకూడదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు అర్ధాంతరంగా పనులు నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సుభిక్షంగా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ వలనే.. రాయలసీమ ప్రజలు నిత్యం సుభిక్షంగా ఉండాలని వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకువచ్చారన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపారని సతీష్‌రెడ్డి మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగలేదు. కరువు సమయంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వైఎస్ జగన్ తెచ్చిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు అపాల్సి వచ్చింది?. రేవంత్ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు సమాధానం చెప్పాలి. జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎంఎస్‌ఎస్‌కి పిడికెడు మట్టి తీయలేదు. రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రాయలసీమ రైతులపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోంది. పోతిరెడ్డిపాడు నిరసన ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం’’ అని సతీష్‌రెడ్డి హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏనాడు రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్, హైకోర్టు తరలించుకు పోయారు.శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టాడన్నారు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో చంద్రబాబు మిగిలి పోతారన్నారు. రాయలసీమకు మేలు చేసిన ఏకైక కుటుంబం వైఎస్సార్ మాత్రమే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయాలని వైఎస్ జగన్ శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలి. సీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించాలి. -
మహిళలపై ఇరాన్ ప్రతీకారం.. జైళ్లలో అత్యాచారాలు?
ఇరాన్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అక్కడి సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో వారిని అక్కడి ప్రభుత్వం బంధించి జైళ్లలో వేసింది. అయితే కారాగారాలలో వారిపై అత్యాచారం చేసి హతమారుస్తున్నారని ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. వారిలో కొంతమంది హిజాబ్ తొలగించి సిగరెట్‌తో ఖమేనీ ఫోటోకు నిప్పంటిస్తూ నిరసనలు తెలిపారు. దీంతో అక్కడి భద్రతా బలగాలు వారిని అరెస్టు చేశాయి. తాజాగా ఖమేనీ ప్రభుత్వం వారిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.ఇరాన్-జర్మన్ జర్నలిస్టు మిచెల్ అబ్దోల్లాహి ఇరాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరాన్ ప్రభుత్వంపై నిరసన చేసిన మహిళలపై జైళ్లలో అత్యాచారాలు చేస్తున్నారని, వారిని అంగవైకల్యానికి గురిచేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా సిగరెట్లతో కాల్చుతూ చిత్రవధలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు గర్భం దాల్చితే వాటిని తొలగిస్తున్నారని పేర్కొన్నారు.అయితే వారు పెడుతున్న హింసల్ని తట్టుకోలేక మరణిస్తే మరణిస్తే వారి మృత దేహాలను ఎవరికి తెలియకుండా కాల్చి వేస్తున్నారని తెలిపారు. జైళ్లలో హింస జరుగుతున్న సంగతి ఎవరికి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా చేస్తున్నారని జర్నలిస్టు పేర్కొన్నారు. అయితే ఇరాన్లో జరిగిన ఆందోళనల కారణంగా దాదాపు ఐదువేల మంది పౌరులు మృతిచెందిన సంగతి తెలిసిందే. -
బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’నోటీసులు జారీ చేయడానికి నిరసనగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపాయి. 12 వేలకు పైగా గ్రామాలు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఊరూరా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, ప్రభుత్వ దిష్టి»ొమ్మలు దహనం చేశా రు. నల్ల జెండాలతో ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నా లు, రాస్తారోకోలు తదితర నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాల నేప థ్యంలో పలుచోట్ల పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల నడుమ వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులను పోలీసులు పలుచోట్ల అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కేసీఆర్ నివాసానికి కూతవేటు దూరంలో ఆపేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నందినగర్‌కే రావాలని పట్టుబట్టడం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి తెలంగాణ భవన్‌కు ర్యాలీగా చేరుకున్న పార్టీ నేతలు మన్నె క్రిశాంక్, కిశోర్‌గౌడ్ తదితరులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. కొందరు కార్యకర్తలు సీఎం వ్యతిరేక నినాదాలు చేస్తూ రేవంత్ దిష్టి»ొమ్మకు ఉరి వేసి తెలంగాణ భవన్‌కు వేలాడదీశారు. సచివాలయం వద్ద పార్టీ శ్రేణులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. తెలంగాణ భవన్లో గాయకులు మిట్టపల్లి సురేందర్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. మంత్రుల నివాస సముదాయం ముట్టడి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు నే తృత్వంలో మంత్రుల నివాస సముదాయాన్ని ము ట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నేతల ఆగ్రహం తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను విచారణ పేరిట రేవంత్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, నవీన్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్ తదితరులు వేర్వేరుగా మీడియా సమావేశా లు నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సీఎం ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు బీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
రేపు రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రేపు రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేసీఆర్‌ను సిట్ విచారణను పిలవడంపై బీఆర్ఎస్ నిరసనలు చేపట్టనుంది. రేపు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. బైక్ ర్యాలీలు, నల్లజెండాలతో నిరసనలు, రాస్తారోకోలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. న్యాయ నిపుణులతో చర్చించాక విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించారు. రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు.కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ సంచలన విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?. స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?.65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. -
విశాఖ భూ దోపిడీపై వైఎస్సార్సీపీ పోరాటం..
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపునకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు ప్రారంభించారు. దీక్షలో గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మజ్జి చిన శ్రీను, వాసుపల్లి గణేష్ కుమార్, ధర్మశ్రీ, పసుపులేటి బాలరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. నిరసన దీక్ష అనంతరం గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీగా కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. గీతం యూనివర్సిటీకి 5 వేల కోట్ల విలువచేసే భూములను క్రమబద్ధీకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకోనుంది. గీతంకు భూ కేటాయింపుపై పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. గీతంకు భూ కేటాయింపు రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. జీవీఎంసీ కౌన్సిల్లో అడ్డదారిలో ఆమోదించే ప్రక్రియను వైఎస్సార్సీపీ అడ్డుకోనుంది. భూకబ్జాకు పాల్పడిన ఎంపీ భరత్‌ను అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది.చంద్రబాబు కుటుంబ సభ్యులు.. భూ దోపిడీకి తెర తీశారని.. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జీవీఎంసీ కౌన్సిల్ అజెండా నుంచి గీతం భూ దోపిడీ అంశాన్ని వెనక్కు తీసుకోవాలని కోరాం. వెనక్కు తీసుకుంటే సరి.. లేదంటే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.ఉత్తరాంద్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అతి పెద్ద భూ కబ్జాను అడ్డుకోవడం కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది చంద్రబాబు కుటుంబ సభ్యుడు.. ఎంపీ భరత్ రూ.5 వేల కోట్ల భూ దోపిడీ చేశారు. మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని గీతం సంస్థ భూ కబ్జా చేస్తుంది. గీతం భూ కబ్జాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కన్నబాబు అన్నారు.వామపక్షాల నిరసన..జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. గీతం భూ దోపిడీని అడ్డుకోవాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు ఎంపీగా ఉండి భూ ఆక్రమణకు పాల్పడటం ఏంటని నేతలు ప్రశ్నించింది. -
ఇరాన్లో మృతులు 30 వేల పైమాటే?
టెహ్రాన్: ఇరాన్ వ్యాప్తంగా ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన నిరసనల్లోనే కనీసం 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆ దేశ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ టైమ్ పత్రిక ఈ విషయం తెలిపింది. గురు, శుక్రవారాల్లోనూ ఇరాన్ భద్రతా విభాగాల సిబ్బంది ఇంతే కర్కశంగా వ్యవహరించారని, మరణాలు కూడా అదే స్థాయిలో ఉండొచ్చన్న అంచనాలున్నాయి. మృతదేహాలున్న ప్లాస్టిక్ బ్యాగులు ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణల్లో గుట్టలుగా పడి ఉన్నాయని, అంబులెన్సులకు బదులుగా వీటిని తరలించేందుకు 18 చక్రాలుండే సెమీ ట్రయిలర్లను వాడుతున్నారని పేర్కొంది. జనవరి 21న సుప్రీం నేత ఖమేనీకి అందించిన సమాచారం ప్రకారం నిరసనల్లో 3,117 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఆస్పత్రుల రికార్డుల ఆధారంగా చూస్తే 30,304 మంది మృతుల్లో 5,459 మంది వివరాలను మాత్రమే ఇప్పటి వరకు ధ్రువీకరించారు. -
ట్రంప్ ఓవరాక్షన్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తన వల్లే ఇరాన్లో నిరసనకారులకు మరణ శిక్షలు ఆగిపోయాని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదని ఓ అధికారి చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. వందల మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్ష విధించాలని ఖమేనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అమెరికా ఒత్తిడి వల్ల అక్కడి అధికారులు దాదాపు 800 మందికి మరణ శిక్షను రద్దు చేశారు. అమెరికా కల్పించుకోకపోయి ఉంటే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు. వారి ఉరిశిక్షలను నేనే ఆపాను. నేను తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గింది అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన అధికారి స్పందించారు. ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని క్లారిటీ ఇచ్చారు. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఎవరికీ ఉరిశిక్షలు విధించలేదని తెలిపారు. అరెస్టు చేసిన వారి సంఖ్య కూడా అంత మొత్తంలో లేదన్నారు. దీనిపై తప్పుడు వార్తలు, ప్రకటనలను ప్రచారం చేయొద్దని అంతర్జాతీయ మీడియా వర్గాలకు సూచించారు.ఇరాన్లో నిరసనలు.. ఇదిలా ఉండగా.. ఇరాన్లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేశారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్‌లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.రెండు వేల మందికిపైగా మృతిఇరాన్లో నిరసనలో పాల్గొన్న వారిలో రెండువేల మందికిపైగా మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. -
ట్రంప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. ఇలా మోసం చేస్తాడనుకోలేదు
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు.. ప్రపంచాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకసారి సైనిక చర్యకు సిద్ధమని.. మరోసారి శాంతి చర్చలని.. ఇంకోసారి ఇరాన్ నాయకత్వాన్ని పొగుడుతూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులే అందుకు కారణం. దీంతో ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఆయన సరిగా అంచనా వేయలేకపోయారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. అదే సమయంలో.. పోటస్(President of the United States) ట్రంప్ ఫేస్ చూసి ఇరాన్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తమ దేశంలో తలెత్తిన సంక్షోభంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని.. ఖమేనీని గద్దె దించుతుందని.. తమకు స్వేచ్ఛ లభిస్తుందని వాళ్లు బలంగా నమ్మారు. ఆ ఆశతోనే నిరసనల్లో ఉవ్వెత్తున పాల్గొని మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో ప్రాణాలు పోతున్నా.. అరెస్టులు జరిగినా లెక్క చేయలేదు. అయితే తమను ఇంతలా రెచ్చగొట్టిన ట్రంప్.. చివరకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని తిట్టిపోస్తున్నారు. ఆ ప్రకటన తర్వాతే.. మతపరమైన పాలనపై ఎప్పటి నుంచో ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ఆర్థిక సంక్షోభం తోడైంది. సోషల్ మీడియా ప్రచారం ద్వారా డిసెంబర్ 28న రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనలు మొదలయ్యాయి. అదే సమయంలో వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి తీసుకెళ్లింది. ఇది సాధారణంగానే ఇరాన్ ప్రజలకు ఆశలు పుట్టించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. అప్పటికే రోడ్డెక్కిన ఆందోళనకారులకు ట్రంప్ ప్రకటనలు బలాన్ని ఇచ్చాయి. ‘‘సహాయం వస్తోంది.. నిరసనలు కొనసాగించండి’’ అని.. ‘‘లాక్డ్ అండ్ లోడెడ్’’ అంటూ చేసిన సో.మీ. పోస్టులు చూసి వేల మంది రోడ్డెక్కారు. అయితే నిరసనలు మళ్లీ ఉధృతం కావడంతో ఇరాన్ ప్రభుత్వం పాత పద్ధతులను అనుసరించింది. కమ్యూనికేషన్లు నిలిపివేయడం, భద్రతా బలగాలను మోహరించడం, కాల్పులు జరపడం. దేశవ్యాప్తంగా స్నైపర్ దాడులు, మెషిన్ గన్ కాల్పులు, వందలాది మరణాలు, అదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో.. ప్రజలు ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని బలంగా ఫిక్సయ్యారు. సరిగ్గా అప్పుడే..అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ నుంచి ఇరాన్‌కు యుద్ధ విమానాలు రెడీ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఏ క్షణమైనా అమెరికా తమ భూభాగంపై దాడులు జరుపుతుందని ఆకాశం వంక చూడసాగారు. అనూహ్యంగా ట్రంప్ వెనక్కి తగ్గి.. ‘‘ఇరాన్ నాయకత్వం ఆందోళనకారుల ఉరి శిక్షలు ఆపుతామని హామీ ఇచ్చింది.. అందుకు కృతజ్ఞలు అని చెబుతూ సైనిక చర్య జరగదని పరోక్షంగా చెప్పేశారు. ఈ ప్రకటన ఇరాన్ నిరసనకారులకు గట్టి షాక్ ఇచ్చింది.ట్రంప్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్ నిరసనలను కొందరు అధికారులు ఎగతాళి చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్నవాళ్లకు ఇక చుక్కలు చూపిస్తామంటూ కొందరు బాహటంగానే ప్రకటిస్తున్నారు. దీంతో చాలా మంది భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఇరాన్లో నిరసనలు చాలా వరకు చల్లారాయి. మళ్లీ జరుగుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలిపశువుల్ని చేశారా?ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని భావించామని.. కానీ, చివరకు ఆయనొక బిల్డప్ బాబాయ్‌గా తేలిపోయిందని గాలి తీస్తున్నారు ఇరాన్ ప్రజలు. ఓ అంతర్జాతీయ మీడియా అక్కడి ప్రజలను ఇంటర్వ్యూ చేసింది. ఆందోళనల్లో వేలమంది మరణించారు. ఆ మరణాలకు ట్రంపే బాధ్యుడు అంటూ ఓ వ్యాపారి తెలిపాడు. అమెరికా అధ్యక్షుడి పిలుపుతోనే వేలమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చివరికి ఆయన మా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మమ్మల్ని మోసం చేశాడు అని ఆరోపించింది మరో మహిళ. మరికొందరేమో.. ట్రంప్ తమను బలిపశువుల్ని చేశాడంటూ తిట్టిపోస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ట్రంప్ వెనకడుగు వ్యూహాత్మకమని.. ఇరాన్ ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేసి దెబ్బ తీస్తాడని చెబుతుండడం కొసమెరుపు. -
సాల్మన్ హత్యపై భగ్గుమన్న దళితులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు భగ్గుమన్నారు. టీడీపీ మూకలు పథకం ప్రకారం మందా సాల్మన్‌ను హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగిన ఈ నిరసనల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు దళితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.చంద్రబాబు రెడ్‌బుక్ పాలనలో రాష్ట్రంలోని దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సాల్మన్ హంతకులను కఠినంగా శిక్షించాలని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా మంత్రి నారా లోకేశ్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులు, వైఎస్సార్సీపీ శ్రేణులను దారుణంగా హత్య చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటున్నారనే దళితులను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.టీడీపీ మూకల రక్తదాహానికి మందా సాల్మన్ బలయ్యారని, ఇది ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వం చేయించిన హత్యేనని స్పష్టం చేశారు. హంతకులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై మండిపడ్డారు. తక్షణమే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి కొమ్ముకాసిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సీఐ, ఎస్ఐలపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని నినదించారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. వివిధ ప్రాంతాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు దళిత నాయకులు వినతి పత్రాలు సమర్పించారు.పలు ప్రాంతాల్లో ర్యాలీలు.. నల్లరిబ్బన్లతో నిరసనలుసాల్మన్ హత్యకు నిరసనగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా అమలాపురం మండలం బొంతువారిపేట నుంచి ఈదరపల్లి వంతెన వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు, దళితులు ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, దళితులను పోలీసులు అడ్డుకున్నారు.ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కేసులు పెడతామని బెదిరించారు. కడపలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని ధర్నా చేశారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి చంద్రబాబు డౌన్..డౌన్, జోహార్ అంబేడ్కర్... జైభీమ్.. పోలీసుల జులుం నశించాలి.. దళితులపై దాడులు అరికట్టాలి... రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాపట్లలోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, దళితులు ర్యాలీ నిర్వహించారు. -
సాల్మన్ హత్యకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా YSRCP ఆందోళనలు
-
పిన్నెల్లి ఘటన.. ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా పిన్నెల్లిలో మందా సాల్మన్ అనే కార్యకర్త హత్య ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. తాము విధించిన బహిష్కరణను అతిక్రమించి ఊరిలో అడుగు పెట్టాడని టీడీపీ గూండాలు కొందరు ఇనుప రాడ్లతో సాల్మన్‌ను కొట్టి తీవ్రంగా గాయపరిచారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లి సాల్మన్.. చివరకు కన్నుమూశారు. అయితే.. పిన్నెల్లిలో టీడీపీ దాష్టీకాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ సిద్ధపడింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గురజాల పరిధిలో 7గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు గానూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధపడింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాజ్యాంగ రూపకర్త డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించనున్నాయి పార్టీ శ్రేణులు. ఇప్పటికే సాల్మన్ కేసులో న్యాయం జరిగేదాకా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ కుటుంబానికి పార్టీ తరఫున రూ.5 లక్షల సాయం కూడా ప్రకటించారు. మరోవైపు..శుక్రవారం సాల్మన్ మృతదేహానికి పిన్నెల్లిలో అంత్యక్రియలు జరగకుండా టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మృతదేహంతో వస్తున్న వాహనాన్ని పోలీసులతో కలిసి అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేతల రాక కారణంగానే తాము అడ్డుకుంటున్నట్లు పోలీసు బాహాటంగా ప్రకటించారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైఎస్ జగన్‌ను ఫోన్ చేసి మాట్లాడారు. అంత్యక్రియలను అడ్డుకుంటూ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా ఆయన భగ్గుమన్నారు. అలా గంటన్నర తర్వాత పిన్నెల్లి గ్రామంలోని సాల్మన్ మృతదేహాన్ని, వైఎస్సార్సీపీ నేతలను అనుమతించారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన దళితుడు సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్‌కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. వైఎస్సార్సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే.. సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని రాడ్లతో చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత కన్నుమూశాడు. త్వరలో బాధిత కుటుంబాన్ని కలిసి వైఎస్ జగన్ పరామర్శిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ట్రంప్ వార్నింగ్‌తో వెనక్కి తగ్గిన ఇరాన్?
అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఇరాన్లో నిరసనకారులకు మరణదండన శిక్షలు వాయిదా పడ్డట్లు ప్రకటించారు. అదే సమయంలో.. సైనిక చర్య ఆలోచనను విరమించుకున్నారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. మరోవైపు.. ఇరాన్ సైతం ఆందోళనకారులను ఉరి తీసే ఆలోచనను ప్రస్తుతానికైతే పక్కన పెట్టినట్లు ధృవీకరించింది. ‘‘ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపిశారని.. అలాగే మరణశిక్షణలను కూడా వాయిదా వేసినట్లు తెలిసింది’’ అని వాషింగ్టన్లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంతో సైనిక చర్యపై వెనక్కి తగ్గుతారా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. అక్కడి ప్రభుత్వం నిరసనకారుల్ని హత్యలు చేస్తోంది. ఇప్పుడు వాటిని ఆపేసింది. ఇలాంటి టైంలో వేచి చూసే ధోరణి అవలంభించాలనుకుంటున్నాం అని అన్నారు. దీంతో.. ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి చేయవచ్చనే సంకేతాన్ని అలాగే ఉంచారు.ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కఠినంగా అణచివేస్తున్నది తెలిసిందే. ఇప్పటివరకు 18,000 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఘర్షణల్లో మరణాల సంఖ్య 2,600 దాటిందని.. 3,000 మందికి పైగా మరణించారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో జరిగిన అత్యంత ఘోర నిరసనలలో ఒకటిగా భావిస్తున్నారు. అయితే.. అరెస్టైన నిరసనకారుల్ని దేశద్రోహులుగా పరిగణిస్తూ న్యాయవిచారణ జరపకుండానే మరణశిక్ష అమలు చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వరుసలో ఇర్ఫాన్ సోల్తానీ పేరు ప్రముఖంగా వినిపించింది. న్యాయపరంగా ఎలాంటి సాయం అందకుండా చేసి.. కేవలం 10ని. మాట్లాడుకోవడానికి కుటుంబానికి అనుమతిచ్చి.. సోల్తానీని ఉరి తీసేందుకు బుధవారం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి నిమిషంలో ఆ ఉరి వాయిదా పడింది. నార్వేలోని హ్యూమన్ రైట్స్ సంస్థ హెన్గావ్ ప్రకారం.. సోల్తానీకి విధించబోయే శిక్షను వారంపాటు వాయిదా వేసినట్లు సమాచారం. అందుకు గల కారణాలకు మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ట్రంప్ వార్నింగ్ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఇరాన నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని.. అవసరమైతే సైనిక చర్యలకు దిగుతామని ఖమేనీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన సాయం పంపిస్తాం అంటూ ఆందోళనలను ప్రొత్సహిస్తున్నారు. అయితే కఠిన మార్గాలు ఆయన ఉద్దేశాలు కావని.. ఏదైనా సామరస్యంగా పరిష్కారం కావాలనే కోరుకుంటున్నారని వైట్‌హౌస్ ప్రతినిధి కరోలైన్ లేవిట్ విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి సైతం ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. నిరసనలతో సంబంధం ఉన్నవాళ్లకు మరణదండనలు అమలు చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. వాళ్లను ఉరి తీసేందుకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేయలేదు అని ఆయన ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఇరాన్ న్యాయవ్యవస్థ మాత్రం వేగంగా విచారణలు జరిపి శిక్షలు అమలు చేయాలని చూస్తోంది. -
దాడులకు అమెరికా రెడీ!
దుబాయ్/వాషింగ్టన్/బ్యాంకాక్/న్యూఢిల్లీ: ఇరాన్‌తో వాణిజ్యంచేసే దేశాలపై పాతిక శాతం సుంకాలువేసి టారిఫ్‌ల కొరడా ఝళిపించిన ట్రంప్ సేన హఠాత్తుగా సుంకాల మాటెత్తకుండా సైన్యంతో దండెత్తబోతోందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరం నుంచి పెద్దసంఖ్యలో బలగాలు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేయొచ్చనే ముందస్తు అంచనాతోనే తమ సైన్యాన్ని స్థావరం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని, దాడి ఉద్దేశం తమకు లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఆందోళనకారులపై కాల్పులు జరిపితే కన్నెర్ర జేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా తమ స్థావరం మీదనే ఇరాన్ దాడులకు దుస్సాహసం చేస్తే చూస్తూ ఊరుకోబోడని, ఇరాన్ కంటే ముందే దాడులతో విరుచుకుపడతాడని అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తొలుత వందల్లో కన్పించిన మరణాలు ఇప్పుడు వేలల్లో తేలుతున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మొదలైన ఆందోళనల్లో, పోలీసులతో ఘర్షణల్లో ఇప్పటిదాకా 2,571 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 2,403 మంది ఉద్యమకారులు కాగా 147 మంది పోలీసులు ఉన్నారు. ఉద్యమంలో పాల్గొనని, అభంశుభం ఎరుగని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు సైతం ఈ ఘర్షణల్లో చనిపోయారని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘ ది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజె న్సీ’ బుధవారం ప్రకటించింది. ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచేస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా 18,100 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. దీటుగా బదులిస్తాం.. దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికాకు దీటుగా బదులిస్తామని ఖమేనీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖమేనీ సలహాదారు అలీ షామ్‌ఖానీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘గతంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేశామని ప్రగల్భాలు పలికే ట్రంప్.. మేం మీ అల్ ఉదేయిద్ స్థావరంపై క్షిపణులతో దాడి చేసి వినాశనం సృష్టించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?. ఆనాటి మా దాడి మా సంకల్పం, సామర్థ్యాలకు బలమైన నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టార్‌లింక్ నుంచి ఉచిత ఇంటర్నెట్ సేవలు ఉద్యమకారులపై పోలీస్‌ల దమనకాండతో రక్తసిక్తమవుతున్న ఇరాన్లో వాస్తవ పరిస్థితులు ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఎప్పటికప్పుడు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎలాన్ మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ సంస్థ ఉచితంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందిస్తోందని ఉద్యమకారులు బుధవారం వెల్లడించారు. అయితే ఈ వార్తలను స్టార్‌లింక్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ‘‘టెహ్రాన్ ఫోరెన్సిక్ వైద్య కేంద్రం వరండాలో వరసబెట్టి మృతదేహాలు పడి ఉన్నాయి. ఇలాంటి దారుణోదంతాలను బయటి ప్రపంచానికి తెలియజేయాలంటే కనీసం ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. ఈ విషయంలో స్టార్‌లింక్ పాత్ర కీలకం’’ అని ఇరాన్‌లోని మెహ్దీ యాహ్యానిజాద్ అన్నారు.ఇరాన్‌ను వీడాలన్న భారత్పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇరాన్‌లోని తమ పౌరులు, భారతీయు లు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమస్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదావేసుకోవాలని భారత్‌లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది. -
ఇరాన్లో నిరసనలు.. రెండు వేల మంది మృతి!
ఇరాన్లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఊచకోతలకు పాల్పడుతోంది. తాజాగా అక్కడి ఓ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కనబడిన దృశ్యాలు హృదయ విధారకంగా కనిపిస్తున్నాయి. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌లోని ఓ ఆసుపత్రి ముందు వందల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండగా వారిలో.. తమ వారు ఉన్నారా అని భయంభయంగా అక్కడి ప్రజలు వెతుకుతున్నారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కలతచెందేలా చేస్తున్నాయి.ఇరాన్లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్‌లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.రెండు వేల మంది మృతిఇప్పటివరకూ నిరసనలో పాల్గొన్న వారిలో 2 వేల మంది మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. తమ దేశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం ఎక్కువైతే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన ఓమంత్రి ఈ నిరసనలను ఖండిస్తున్నారు. అయితే ఇరాన్ రెడ్‌లైన్ దాటిందని అక్కడి పరిస్థితులను అమెరికా నిశితంగా గమనిస్తుందని తమ నిర్ణయం త్వరలోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.Dozens of black body bags seen in Iran. pic.twitter.com/6PB0y6sNxP— Open Source Intel (@Osint613) January 13, 2026 -
ఎమ్మెల్యే ధూళిపాళ్ల అండతో నా కుమార్తెకు చిత్రహింసలు
గుంటూరు: ‘‘నా కుమార్తె వారం రోజులుగా కనిపించడం లేదు..అసలు బతికే ఉందో..చనిపోయిందో తెలియడం లేదు...అల్లుడిని అడిగితే బెదిరిస్తున్నాడు..నా బిడ్డ ప్రాణాలతో కావాలంటూ’’ ఓ తల్లి సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తున్న ఆమె భర్త చెర నుంచి విడిపించాలని వేడుకుంది. నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో కావాలి అంటూ ఫ్లెక్సీ చేతపట్టుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. వివరాలు ఇలా... బాపట్ల జిల్లా కూనపద్మావతినగర్ జగన్ కాలనీకి చెందిన నంబూరు లక్ష్మి కుమార్తె వెంకటేశ్వరమ్మ, పౌలురాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన దగ్గర్నుంచి భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఐదు సవర్ల బంగారు గొలుసు తీసుకుని బ్యాంక్‌లో తనఖా పెట్టాడు. ఇటీవల మరో ఎకరం పొలం రాసివ్వాలంటూ భార్యపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. వారం రోజులుగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదు. నా బిడ్డ బతికే ఉందో.. చనిపోయిందో తెలియడంలేదని లక్ష్మి వాపోయింది. కుమార్తె విషయమై అల్లుడ్ని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త చిత్రహింసలు భరించలేక గతంలో కుమార్తె పలుమార్లు జిల్లా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది. పౌలురాజుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు ఉందని, ఆయన అండదండలతోనే తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించింది. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. అతడికి ఉరిశిక్ష
టెహ్రాన్: ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆందోళన తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటికే దాదాపు 600 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్.. సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి మొదటి ఉరిశిక్షను అమలు చేయడానికి ఇరాన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానీకి త్వరలో మరణశిక్ష అమలు కానుంది. దీంతో, ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, వివరాల మేరకు.. టెహ్రాన్ శివారులోని కరాజ్ సమీపంలోని ఫర్దిస్కు చెందిన సోల్తానీ జనవరి ప్రారంభం నుండి ఇరాన్ అంతటా వ్యాపించిన అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేక నిరసనలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జనవరి 8వ తేదీన సోల్తానీ అరెస్టు అయ్యాడు. అయితే, ఇరాన్లో నిరసనల నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరసనకారులను హెచ్చరించే క్రమంలో సోల్తానీకి మరణ శిక్షను విధించారు. ఒక మానవ హక్కుల సంస్థ, మీడియా నివేదికల ప్రకారం.. సోల్తానీకి విధించిన శిక్ష బుధవారం అమలు కానుంది. కాగా, గతంలో ఇరాన్ అసమ్మతిని అణచివేయడానికి మరణశిక్షను ఒక సాధనంగా ఉపయోగించినప్పటికీ, ఆ మరణ శిక్షలు ఎక్కువగా కాల్చివేతల ద్వారానే అమలు చేయబడ్డాయి. కానీ, ప్రస్తుత నిరసనలలో మాత్రం మొదటిసారిగా సోల్తానీని ఉరితీయనున్నట్టు సమాచారం. నిరసనల కారణంగా ఇరాన్లో ఇప్పటి వరకు దాదాపు పదివేల మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. Erfan Soltani is scheduled to be executed by hanging in Iran in 48 hours.He was arrested in Karaj on January 9 for taking part in the protests. His family was given just 10 minutes to say goodbye. No lawyer. No fair trial. Days later, the Islamic regime sentenced him to death.… pic.twitter.com/jxRwCJznpj— Sarah Raviani (@sarahraviani) January 12, 2026కుబుంబ సభ్యుల ఆందోళన.. మరోవైపు.. ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన వార్తా సంస్థ జెఫీడ్ నివేదించిన ప్రకారం సోల్తానీ కేసు తదుపరి విచారణలను నిరోధించే లక్ష్యంతో వేగంగా మరణ శిక్షను అమలు చేయాలని అక్కడి అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఇక, నార్వేలోని కుర్దిష్ పౌర హక్కుల సంస్థ ఈ మరణ శిక్ష అమలుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. సోల్తానీ అరెస్ట్ అయిన నాటి నుంచి అతడిని న్యాయవాది సంప్రదించడం, తన వాదనలను వినిపించే అవకాశం కూడా దక్కలేదు. అరెస్టు చేసిన అధికారి గుర్తింపుతో సహా కేసులోని కీలక అంశాల గురించి అతని కుటుంబానికి కూడా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. కానీ, షెడ్యూల్ ప్రకారం అతడికి మరణ శిక్ష అమలు చేస్తామని అధికారులు తమకు తెలియజేశారని సుల్తానీ కుటుంబ సభ్యులు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.అనుకూల ప్రదర్శనలు.. తాజాగా ఇరాన్లో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు మొదలయ్యాయి. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్ ప్రభుత్వం సోమవారం లక్షల మంది ప్రభుత్వ మద్దతుదారులను వీధుల్లోకి సమీకరించింది. టెహ్రాన్‌లోని ఎంఘెలాబ్ స్క్వేర్ వద్ద వేల మంది ప్రదర్శనకారులు గుమిగూడారు. దేశాధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తదితరులూ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ‘అమెరికన్- ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరాన్ తిరుగుబాటు’గా ఈ ప్రదర్శనలను ఇరాన్ (Iran) అధికారిక మీడియా ప్రసారం చేసింది. కాగా, తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అబ్బాస్ అరాఘ్చి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. -
రెడ్ లైన్ దాటేసింది.. ఇక తాడోపేడో తేల్చుకుంటాం
ఆందోళనలతో అట్టుడికిపోతున్న ఇరాన్‌కు అమెరికా మరో సాలిడ్ వార్నింగ్ ఇచ్చింది. రెడ్ లైన్ దాటేసిందని.. ఇక తీవ్ర చర్యలు తప్పదన్నట్లుగా తీవ్ర సంకేతాలు పంపించింది. ఈ మేరకు అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా.. కవ్వింపు చర్యలకు దిగినా.. తాము అమెరికా మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని టెహ్రాన్ వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(భారత కాలమానం ప్రకారం) ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు.. ‘‘ఇరాన్ పరిణామాలను అమెరికా సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఆందోళనకారుల పట్ల అక్కడి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ముందు నుంచి చెబుతున్నట్లు మేం చూస్తూ ఊరుకోం. మేము బలమైన చర్యలపై పరిశీలిస్తున్నాం. గంట గంటకు నివేదికలు తెప్పించుకుంటున్నాం. ఆ నిర్ణయం త్వరలోనే ఉంటుంది’’ అని ట్రంప్ ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. ఇరాన్–అమెరికా మధ్య అణు చర్చల అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఇరాన్ ప్రతిపక్షాలు తనతో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అటు అమెరికాలో ఉంటూ ఇరాన్ నిరసనలను ప్రొత్సహిస్తున్న బహిష్కృత ఇరాన్ యువరాజు రేజా పహ్లవి రేపోమాపో ట్రంప్‌తో భేటీ కాబోతున్నారు. దీంతో ఖమేనీని గద్దె దించేందుకు అమెరికా అధ్యక్షుడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీనియర్ సలహాదారులతో సంప్రదింపులను ముమ్మరం చేసినట్లు వైట్‌హౌజ్ వర్గాలు చెబుతున్నాయి. కరెన్సీ పతనం, బడ్జెట్లో సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయాలు, ధరల పెరుగుదల.. ఇలా ఒక్కో నిర్ణయాలు ఖమేనీ పాలనపై అక్కడి ప్రజలకు విరక్తి కలిగించాయి. గతేడాది డిసెంబర్ 28న తేదీన టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో ప్రారంభమైన నిరసనలు.. భద్రతా బలగాల అణచివేత చర్యలతో హింసాత్మకంగా మారాయి. హక్కుల సంఘాల లెక్క ప్రకారం.. ఇప్పటిదాకా 500 మందికి పైగా మరణించారు. 10,600 మందిని అక్రమ అరెస్ట్ చేశారు. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆందోళనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తోంది. ఆ కథనాలను కూడా వండి వారుస్తున్నట్లు మండిపడింది. ఇరాన్‌పై దాడి జరిగితే, ఇజ్రాయెల్‌తో పాటు అన్ని అమెరికా బేస్‌లు, నౌకలు మా లక్ష్యాలు అవుతాయి అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున దేశవ్యాప్త ర్యాలీలకు పిలుపు ఇచ్చారాయన. 2022 తర్వాత ఇరాన్లో ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనలివే. హిజాబ్ ధరించలేదని ఓ యువతిపై మోరల్ పోలీసింగ్ ప్రయోగించగా.. అనుమానాస్పద రీతిలో ఆమె ఆస్పత్రిలో మరణించింది. దీంతో యువతులు పెద్ద ఎత్తున ఇరాన్ వీధుల్లోకి చేరి ఉద్యమించారు. అయితే ఖమేనీ ప్రభుత్వం వాటిని అణచివేసింది. ఇరాన్‌పై చర్యలకు అమెరికా ముందున్న ఆప్షన్లు: సైనిక దాడులు, సీక్రెట్ సైబర్ ఎటాక్స్, ఇరాన్‌పై అత్యంత కఠిన ఆంక్షలు, చివరగా.. అక్కడి ప్రతిపక్ష నేతలకు, నిరసనలు తెలియజేస్తున్న గ్రూపులకు డిజిటల్ మద్దతు ఇవ్వడం. ఇరాన్లో ఇంటర్నెట్ నిషేధం అమల్లో ఉండడంతో.. అక్కడేం జరుగుతుందో బయటి దేశాలకు తెలియని పరిస్థితి. ఈ క్రమంలో.. టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో మాట్లాడి స్టార్‌లింక్ (శాటిలైట్ ఆధారిత) ద్వారా ఇరాన్లో ఇంటర్నెట్ పునరుద్ధరించాలనుకుంటున్నట్లు ట్రంప్ చెబుతున్నారు. -
మాకు న్యాయం చేయాలి
హైదరాబాద్: న్యాయం కోసం పిల్లలతో కలిసి భర్త ఇంటి వద్ద భార్య నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని అహ్మద్‌గూడలో చోటుచేసుకుంది. సాయిచరణ్ అనే వ్యక్తి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్తల మద్య పలుమార్లు గొడవలు జరిగేవి. దీంతో 2020 సంవత్సరం నుండి దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి సాయిచరణ్ కనిపించకుండా తిరుగుతుండేవాడు. సాయిచరణ్ కీసర అహ్మద్‌గూడలోని హిడెన్ గార్డెన్ అపార్టుమెంట్లో ఉంటున్నాడని తెలుసుకొని పిల్లలతో కలిసి భార్య శిల్ప తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. అనంతరం కీసర పోలీసులు వచ్చి ఆమెతో చర్చలు జరిపారు, తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుకూర్చుంది. -
ఇరాన్ ఆందోళనల్లో భారతీయుల అరెస్ట్?!
ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆందోళనకారులను అణచివేస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని ట్రంప్.. తమ దేశ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఖమేనీ సవాల్-ప్రతిసవాల్ విసురుకుంటున్నారు. అయితే ఆందోళనలతో ఇరాన్ నెత్తురోడుతున్న వేళ.. ఆ దేశంలోని ఇతర దేశాల పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇరాన్ సంక్షోభంలో(Iran Crisis) మరణాలను అక్కడి ప్రభుత్వం తక్కువగా చూపెడుతోందంటూ మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటిదాకా 548 మరణించారని.. అందులో 48 భద్రతా సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది(హెచ్ఆర్ఏఎన్ఏ అనే అమెరికా మానవ హక్కుల సంఘం లెక్కల ప్రకారం). అలాగే 10 వేల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారని సమాచారం. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో ఇతర దేశా పౌరులు ఉన్నట్లు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. నిరసనల్లో పాల్గొనకపోయినా.. కొందరి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తన్నట్లుగా దృశ్యాలు అందులో ఉన్నాయి. అందులో భారతీయులు, అఫ్గనిస్థాన్ జాతీయులు ఎక్కువగా ఉన్నట్లు ఆ ప్రచార సారాంశం. పైగా విదేశీ వ్యవహారాల శాఖ సంబంధిత పేర్లతో ఉన్న అకౌంట్లలో ఆ వీడియోలు పోస్టు కావడం గమనార్హం. దీంతో.. ఆ దేశంలో పనుల నిమిత్తం వెళ్లిన భారత పౌరులు.. విద్యార్థుల భద్రతపై ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. భారత్‌లో ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలి(Mohammad Fathali) ఆ కథనాలను ఖండించారు. అలాంటిదేమీ.. ఇరాన్‌లోని భారతీయులతో సహా ఇతర దేశాల పౌరుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారం ఆధారంగానే ఆ కథనాలు పుట్టుకొచ్చాయని అంటున్నారు. పుకార్లను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన క్లారిటీగా ఓ పోస్ట్ చేశారు. అయితే.. అటు ఇరాన్ ఈ తరహా కథనాలు మొదటి నుంచే ఖండిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్ర అని ఆరోపించింది. ఇరాన్ నిరసనలను కొందరు విదేశీ నటులు.. మీడియా వక్రీకరిస్తున్నాయని.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. మన పిల్లలు సేఫ్!భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇరాన్లో 10,000 నుంచి 12,000 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో పనుల నిమిత్తం వెళ్లేవాళ్లు, భారతీయ మూలాలు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే అక్కడికి భారత్ నుంచి అత్యధికంగా వెళ్లేది వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులే. ఈ నేపథ్యంలో.. వాళ్ల భద్రతపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. వాళ్లు సురక్షితంగా ఉన్నారని ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA), ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం, సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని.. విద్యార్థులతో, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది. -
దాడి చేస్తే అంతు చూస్తాం
టెహ్రాన్/దుబాయ్: నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. ప్రజల ఆక్రోశం తీవ్ర ఆవేశంగా రూపుదాలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏ నగరం చూసినా ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. మొత్తం 36 ప్రావిన్సుల్లోనూ జనాందోళన పెద్దపెట్టున కొనసాగుతోంది. 100కు పైగా నగరాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్‌లో ఆదివారం నిరసనకారులు వీధుల్లోకి పోటెత్తారు. ఖమేనీ నియంతృత్వ పాలన తమకొద్దంటూ నిరసనలతో హోరెత్తించారు. వాటిని ఇరాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండటం, దీన్ని చూస్తూ ఊరుకోబోమని, నేరుగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌ను హెచ్చరించడం తెలిసిందే. దాంతో ఆ రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. పరిస్థితి ఏ క్షణమైనా అదుపు తప్పేలా కనిపిస్తోంది. అయితే ఇంటర్నెట్ పడకేయడం, ఫోన్ లైన్లు కూడా మూగబోవడంతో అక్కడ తాజా పరిస్థితి అంచనాలకు అందడం లేదు. వాస్తవ మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాక వేలాది మందిని సైన్యం, పోలీసు బలగాలు నిర్బంధంలోకి తీసుకుంటున్నట్టు వార్తలందుతున్నాయి. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఆందళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ తాజాగా ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ ఆదివారం పేర్కొన్నారు. నిండు పార్లమెంటులోనే ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. నిరసనల వెల్లువ! ఇరాన్లో జనాగ్రహం, నిరసనల వెల్లువ కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రాన్‌తో పాటు రెండో అతి పెద్ద నగరం మషాద్లోనూ ప్రజలు వీధుల్లోకి పోటెత్తుతున్నారు. రాత్రుళ్లు సెల్‌ఫోన్ లైట్లు వెలిగించి మరీ నిరసన తెలుపుతున్నారు. నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫుటేజీ ఆన్లైన్లో వైరల్‌గా మారింది. వీధుల నిండా పోలీసు, సైనిక సిబ్బంది పహారా, డ్రోన్ల నిఘా పెరిగినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. మషాద్‌లో పలుచోట్ల పోలీసులు, భద్రతా దళాలతో జనం ఘర్షణలకు దిగుతున్నారు. వీధుల నిండా తగలబడ్డ సామాన్లు తదితరాలు కనిపిస్తున్నాయి. కెర్మన్ తదితర నగరాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ప్రవాసంలో ఉన్న ఇరాన్ రాకుమారుడు రెజా పహ్లావీ ఒక వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ టీవీలో మాత్రం ఖోమ్, ఖాజ్విన్ తదితర నగరాల్లో జరుగుతున్న ప్రభుత్వ అనుకూల నిరసనల దృశ్యాలను చూపిస్తున్నారు. నిరసనలపై ఉక్కుపాదమే ఇరాన్ పార్లమెంటు కార్యకలాపాలను ప్రభుత్వ టీవీ చానల్ ఆదివారం ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిరసనలను అదుపు చేయడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారంటూ పోలీసులు, రివల్యూషనరీ గార్డ్ సిబ్బందిని స్పీకర్ ఖలిబాఫ్ ప్రస్తుతించారు. నిరసనల్లో అరెస్టయిన వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా గనక ఇరాన్‌పై దాడికి దిగితే ఈ ప్రాంతంలోని ఆ దేశ సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు తదితరాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 538 మందికి పైగా బలి !రెండు వారాలకు పైగా ఇరాన్లో సాగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 538కు పెరిగినట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ ‘యాక్టివిటీ’పేర్కొంది. దేశవ్యాప్తంగా 10,670 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శవాలతో నిండిన పికప్ ట్రక్కు విజువల్స్ టీవీల్లో ప్రసారమయ్యాయి. ఇరాన్లో పలు నగరాల్లో ఆస్పత్రుల్లో శవాలు గుట్టలుగా పేరుకుంటున్నట్టు మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఉత్తర ఇరాన్లో రస్త్ పట్టణంలోని పౌర్సిన ఆస్పత్రికి ఒక్క శుక్రవారం రాత్రే ఏకంగా 70కి పైగా శవాలు వచి్చనట్టు సమాచారం. టెహ్రాన్‌లో ఒక ఆస్పత్రికి తాజాగా 38 శవాలు వచి్చనట్టు అక్కడి మెడిక్ చెప్పారు. ‘చాలావరకు నేరుగా తలలో ఛాతీలో కాల్చి చంపారు. అంతేకాదు, చాలామంది యువకులు తూటా గాయాలతో వచి ఆస్పత్రిలో చేరుతున్నారు‘ అని ఆయన వివరించారు. అయితే ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో 30 మందిని, కెర్మన్షాలో ఆరుగురు పోలీసులను నిరసనకారులు చంపారని ప్రభుత్వం పేర్కొంది. మషాద్‌లో మసీదుకు నిప్పు పెట్టారని ప్రభుత్వం పేర్కొంది. నిరసనకారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు అన్నారు. ‘‘ఐసిస్ తరహాలో పోలీసు, భద్రతా సిబ్బందిని హతమారుస్తున్నారు. సజీవంగా తగలబెడుతున్నారు’’ అని మండిపడుతున్నారు. బలహీనంగా ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇరాన్ ఇప్పటికిప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగే స్థితిలో ఉందా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఆ దేశ వైమానిక సంపత్తి చాలావరకు ధ్వంసం కావడం తెలిసిందే. అంతేగాక ఇజ్రాయెల్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్ అణు స్థావరాలను భారీ బాంబులతో ధ్వంసం చేసేసింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడులకు దిగే దుస్సాహసం ఇరాన్ సుప్రీం లీడర్ 87 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ చేస్తారా అన్నది చూడాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరాన్లో పరిణామాలను ఇజ్రాయెల్ అత్యంత నిశితంగా గమనిస్తోంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పలు అంశాలపై ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు.యూఎస్, ఇజ్రాయెలే ఎగదోస్తున్నాయి: పెజెష్కియాన్ ఇరాన్‌ను అస్థిర పరిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్ర చేస్తున్నాయని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంలో అవి పనిగట్టుకొని నిరసనలను ఎగదోస్తున్నాయని దుయ్యబట్టారు. అయితే నిరసనకారుల ఆవేదనను సహానుభూతితో ఆలకిస్తామని ప్రకటించారు. ‘‘ప్రజలకు చాలా విషయంలో అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు వారితో చర్చించడం అవసరం’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే అల్లర్ల పట్ల అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. విధ్వంసకారులు మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేసేందుకు ప్రయతి్నస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రభుత్వ టీవీ ఆదివారం ప్రసారం చేసింది. అయితే ఇరాన్‌పై సైనిక దాడి విషయంలో ఉన్నతాధికారులు తాజాగా ట్రంప్‌కు పలు ఆప్షన్లు సూచించారని తెలుస్తోంది. వాటిపై ఆయన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైట్‌హౌస్ వర్గాలు చెబుతుండటం విశేషం. -
అమ్మాయిల నోట్లో సిగరెట్.. చేతిలో లైటర్..
టెహ్రాన్: ఇరాన్లో నిరసనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. మరోవైపు.. ఆందోళనల్లో యువతులు సిగరెట్లు తాగుతూ.. ఖమేనీ ఫొటోలను మంటల్లో కాల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.ఇరాన్లో సుప్రీం లీడర్ ఖమేనికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా దేశం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న కరెన్సీ విలువ, విదేశీ మారకం నిల్వలతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. అక్కడ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అంతటి స్థాయిలో మళ్లీ అక్కడ విప్లవ జ్వాలలు రగులుతున్నాయి.మరోవైపు.. మహిళలు తమ హక్కులపై పోరాటం చేస్తున్నారు. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. హిజాబ్ (బురఖా) లేకుండా బయటకు రావద్దనే కఠిన నిబంధనలున్న దేశంలో.. స్కర్టులు, మిడ్డీలు వేసుకుని యువతులు, మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. అంతటితో ఆగకుండగా.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ఏళ్లుగా ఉన్న సిగరెట్ నిషేధాన్ని కాదని.. ఏకంగా సుప్రీం లీడర్ ఫొటోతో సిగరెట్ అంటించుకోవడంపై చర్చ జరుగుతోంది. అక్కడి మహిళలు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. An Iranian girl burns a picture of Ayatollah Khamenei and lights her cigarette, a new trend in Iran! Young Iranian women are leading the revolution against the Islamic regime.pic.twitter.com/UIFYHMPBGA— Dr. Maalouf (@realMaalouf) January 10, 2026అయితే, ఇరాన్లో సుప్రీం లీడర్ ఫొటోను కాల్చడం అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరం. అది కూడా ఫొటోతో సిగరేట్ అంటించుకోవడం ఆ చట్టాల ప్రకారం క్షమించరాని నేరం. అయితే ఈ చర్య ద్వారా మహిళలు ప్రభుత్వానికి, భవిష్యత్ నాయకులకు స్పష్టమైన మెసేజ్ పంపినట్లు స్పష్టమవుతోంది. అక్కడి పురాతన చట్టాలను ధిక్కరిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. మహిళా హక్కులు, స్వేచ్ఛపై ఇస్లాం చట్టాలు విధిస్తున్న నిర్బంధాల గోడలను కూల్చేస్తున్నామని వాళ్లు.. అంత ధైర్యంగా.. తెగింపుతో ఈ విధంగా నిరసనలకు దిగారు. ఇదిలా ఉండగా.. ఖమేనీకి వ్యతిరేకంగా చేసే చర్యలను ఉపేక్షించేది లేదని అధికార వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. మహిళలు తిరస్కార ధోరణిలో ఇలాంటి చర్యలకు దిగటం.. మహిళలపై అణచివేతను ఎప్పటికీ సహించేది లేదని వాదనను బలంగా వినిపిస్తున్నట్లు ప్రపంచానికి సందేశం పంపుతున్నట్లు తెలుస్తోంది.Iranian women burning their hijabs in Tehran tonight. Protesters are also torching property linked to Islamic regime forces, including vehicles, mosques, and even their residences.This is a message not only to the regime, but for the who world to see#Iran #IranRevolution2026 pic.twitter.com/A910OUoJSL— acpcrf (@acpcrf) January 10, 2026ఇక, డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్‌ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు. ఇరాన్‌ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పారిశ్రామీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.These Iranian women are showing their faces, no burkas, no fear...inside Iran....calmly smoking while burning a photo of Khamenei.That takes more courage than the entire Western left-wing feminist class combined.These women aren’t posting slogans or trying to run over law… pic.twitter.com/dZItOJzwzw— Flopping Aces (@FloppingAces) January 9, 2026 -
నిరసనలను కఠినంగా అణచివేస్తాం
దుబాయ్: ఇరాన్లో ప్రజాందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో జనం నిత్యావసరాలను సైతం కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో సుప్రీం నేత అలీ ఖమేనీ(86) గద్దె దిగాలంటూ పది రోజులుగా నిరసనలు కొనసాగుతుండటం తెల్సిందే. సుప్రీం నేత అలీ ఖమేనీ శుక్రవారం తన నివాసం వెలుపల చేరిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన శాంతియుతంగా నిరసనలు దిగిన ప్రజలపై హింసాత్మక చర్యలకు దిగితే వారికి మద్దతుగా నిలబడతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన బెదిరింపుపై మండిపడ్డారు. ఇరానియన్ల రక్తంతో చేతులు తడుపుకున్నారంటూ ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసమే కొందరు వీధుల్లోకి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల వ్యవహారాల గురించి ఆలోచించడానికి బదులుగా ట్రంప్ తన దేశం గురించి ఆలోచించడం మంచిదని సలహా ఇచ్చారు. ఇరాన్ యువరాజు పిలుపుగురు, శుక్రవారాల్లో వీధుల్లోకి వచ్చి ఖమేనీ పాలనపై నిరసన వ్యక్తం చేయాలని ఇరాన్ మాజీ రాజకుటుంబ వారసుడు, చివరి షా కుమారుడు రెజా పహ్లావి ప్రజలకు పిలుపు ఇచ్చారు. దీంతో, రాజధాని టెహ్రాన్ వాసులు గురువారం రాత్రి పనికిరాని వస్తువులతో వీధుల్లో మంటలు వేశారు. ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రెజా పహ్లావి తిరిగి రావాలని డిమాండ్ చేశారు. జనం పెద్ద సంఖ్యల్లో వీధుల్లోకి తరలివచ్చి ర్యాలీలు చేపట్టిన వీడియోలు, ఫొటోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో ప్రభుత్వం ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ ఫోన్‌కాల్స్‌పై నిషేధం విధించింది. దీంతో, ఆందోళనల తీవ్రత బయటి ప్రపంచానికి తెలియడం లేదు. అయితే, ఇప్పటి వరకు ఇరాన్ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో కనీసం 62 మంది చనిపోయారని, మరో 2,500 మందిని అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. -
ఇరాన్ వీధుల్లో మిడ్డీలు, స్కర్టులు!
మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీ..వ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. మిడ్డీలు, స్కర్టులు వేసుకున్న అమ్మాయిలు.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్‌ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు కూడా. 👉ఇరాన్‌ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పరిశ్రమీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉ఇరాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. ఇదే సమయంలో, గతంలో పహ్లవి రాజవంశం కాలంలో ఇరాన్ స్వేచ్ఛ, ఆధునికతతో ప్రసిద్ధి చెందిందని, కానీ కఠిన పాలన, అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉పహ్లవి వంశం రాజవంశ రక్తంలో కాకుండా యుద్ధరంగంలో పుట్టింది. రేజా ఖాన్ అనే సాధారణ నేపథ్యం కలిగిన సైనిక అధికారి.. 1921లో బ్రిటిష్ అధికారుల సహకారంతో కుట్ర చేసి అధికారంలోకి వచ్చాడు. 1925లో క్వాజర్ వంశాన్ని గద్దె దించి.. మజ్లిస్ ఆయనను షాగా ఎన్నుకుంది. ఆ సమయంలో పహ్లవి అనే బిరుదు స్వీకరించి.. ఆధునికీకరణ, సెక్యులర్ జాతీయత లక్ష్యాలతో కొత్త రాజవంశాన్ని ప్రారంభించాడు.👉పహ్లవి రాజవంశ పాలనలో.. వెస్ట్రన్ కల్చర్ మేఘాలు ఇరాన్‌ను ఆవరించాయి. హిజాబ్ నిషేధంతో.. మహిళలు పాశ్చాత్య శైలి దుస్తులకు అలవాటు పడ్డారు. సంస్కరణల పేరిట ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు, రైల్వే వ్యవస్థ, కేంద్ర పాలన బలపరచడం వంటి సంస్కరణలు చేశారు. అయితే.. రాజకీయ అణచివేత, పత్రికా స్వేచ్ఛను కాలరాయడం విమర్శలకు తావిచ్చింది. 👉రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీతో ఆయన సాన్నిహిత్యం కారణంగా.. 1941లో బ్రిటిష్-సోవియట్ దళాలు ఇరాన్‌పై దాడి చేసి ఆయనను రాజీనామా చేయించాయి. ఆయన స్థానంలో కుమారుడు మొహమ్మద్ రేజా పహ్లవి షాగా అయ్యాడు. బలహీన సింహాసనం, విభజిత దేశం, పెరుగుతున్న జాతీయవాదం 22 ఏళ్ల రేజాకు వారసత్వంగా లభించాయి. అదే సమయంలో.. ఇరాన్ చమురు బ్రిటిష్ AIOC కంపెనీ ఆధీనంలో ఉండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో.. 1951లో పార్లమెంట్ మొహమ్మద్ మోసాదేఘ్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. ఆయన చమురు పరిశ్రమను జాతీయికరణ చేయడంతో బ్రిటన్, అమెరికా ఆగ్రహించాయి. 1953లో CIA “ఆపరేషన్ అజాక్స్” ద్వారా మోసాదేఘ్‌ను గద్దె దించి, పహ్లవిని తిరిగి సంపూర్ణ అధికారంతో షాగా తిరిగి కూర్చోబెట్టింది. ఇది పహ్లవి సంపూర్ణ రాజ్యాధికారానికి, అమెరికా ప్రభావానికి ఆరంభంగా నిలిచింది. 👉1960లో.. మొహమ్మద్ రేజా షా వైట్ రివల్యూషన్ పేరుతో సంస్కరణలు చేపట్టాడు, భూసంస్కరణలు (జమీందారుల శక్తి తగ్గించడం), మహిళలకు ఓటు హక్కు, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్య కార్యక్రమాలు, పారిశ్రామికరణ, సైన్యం బలోపేతం చేయడంలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా ఇరాన్లో ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, మధ్యతరగతి పెరుగుదల చోటు చేసుకున్నాయి.👉పాశ్చాత్య సంస్కృతి (ఫ్యాషన్, సినిమాలు) వేగంగా వ్యాపించినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితుల ఏర్పడడాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చినవారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. సావక్ SAVAK అనే షా రహస్య పోలీస్.. విపక్షాన్ని అణచివేసింది.ఆ సమయంలో మతాధికారి అయతొల్లా రుహొల్లా ఖోమేనీ 1964లో షా పాశ్చాత్యీకరణను విమర్శించి ప్రవాసంలోకి వెళ్లాడు.👉ఈలోపు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అసమానతలు, అధికారవాద పాలన, అన్ని కలగలిపి 1978లో భారీ నిరసనలకు దారితీశాయి. శక్తివంతమైన సైన్యం ఉన్నప్పటికీ, షా పూర్తి బలప్రయోగం చేయడానికి వెనుకాడాడు. 1979 జనవరిలో షా దేశం విడిచి పారిపోయాడు. ఇదే అదనుగా ఫిబ్రవరి 1న ఖోమేనీ ప్రవాసం వీడాడు. ఇరాన్ ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కొన్ని వారాల్లోనే పహ్లవి రాజవంశం కూలిపోయి, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది. మొహమ్మద్ రేజా షా 1980లో ఈజిప్టులో ప్రవాసంలో ఉండగానే మరణించాడు. రేజా పహ్లవి ఈ విప్లవం తర్వాత అమెరికాలో స్థిరపడి.. ఇరాన్లో ప్రజాస్వామ్య మార్పు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాడు.👉షా యొక్క అధికారవాద పాలనను మరిచిపోయిన ఇరానీయులు, ముఖ్యంగా ఆ పరిస్థితుల రుచేంటో చూడని యువత.. పహ్లవి కాలాన్ని స్వేచ్ఛలు, ఆర్థిక సౌభాగ్యం, అంతర్జాతీయ ప్రతిష్ఠ కారణంగా గర్వంగా పీలవుతోంది. అదే సమయంలో ప్రవాసంలో ఉన్న షా కుమారుడు రేజా పహ్లవి మళ్లీ ఖమేనీ ఆధ్వర్యంలోని ధార్మిక పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదిగాడు.👉1979 విప్లవం సమయంలో రేజా పహ్లవి వయసు కేవలం 18. పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న ఆయన.. ఇరాన్లో సెక్యులర్ ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పిలుపు తర్వాత ఇరాన్లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో.. ఇరాన్ ప్రజలు మళ్లీ క్రౌన్ ప్రిన్స్ వైపు మొగ్గుచూపుతారనే సంకేతాలు అందుతున్నాయి. 👉ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి వచ్చే వారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మార్-ఎ-లాగోలో జరగనున్న Jerusalem Prayer Breakfast కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12న జరగనుంది. లాత్వియా పార్లమెంట్ ప్రతినిధులు, బ్రెజిల్ ఎంపీ ఎడ్వార్డో బోల్సోనారో కూడా పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ దశలో పహ్లవిని కలవడం సరైనది కాదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే పహ్లవి తనను రాజ్యాధికారంలో కాకుండా రాజ్యాంగ పరిరక్షణలో ఉండే రాజవంశానికి మద్దతుదారుడిగా పేర్కొన్నారు. “మిలియన్ల ఇరానీయులు స్వేచ్ఛ కోరుతున్నారు, కానీ ప్రభుత్వం అన్ని కమ్యూనికేషన్ లైన్లను కట్ చేసింది”.. :::ఖమేనీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పహ్లవి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ రేజా పహ్లవి ప్రొఫైల్- రేజా పహ్లవి (జననం అక్టోబర్ 1960) ఇరాన్ చివరి షా మొహమ్మద్ రేజా పహ్లవి పెద్ద కొడుకు- 1979 ఇరాన్ విప్లవంలో రాజ్యాన్ని గద్దె దింపిన తర్వాత ఆయన కుటుంబం ప్రవాసంలోకి వెళ్లింది.- రేజా పహ్లవి అమెరికాలో పైలట్ శిక్షణ పొందారు, తరువాత USCలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.- ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఫైటర్ పైలట్‌గా సేవ చేయాలని ప్రయత్నించినా, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించింది.అధికారం వద్దంటూనే,. - ఆయన తనను “ప్రజాస్వామ్యానికి మార్పు కోసం జాతీయ మార్గదర్శి”గా పేర్కొంటున్నారు.- ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో ప్రజలు “పహ్లవి తిరిగి వస్తాడు”, “ఖమేనీ గద్దె దింపబడతాడు” అంటూ నినాదాలు చేస్తున్నారు.- ఆయన నాలుగు దశాబ్దాలుగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.- ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, విద్యార్థి సంఘాలతో సమావేశమై ఇరాన్ ప్రజల పరిస్థితిని వివరించారు.- ఆయన Washington Postలో రాసిన వ్యాసంలో, ఇస్లామిక్ రిపబ్లిక్ “1979 తర్వాత ఎప్పుడూ లేనంత బలహీనంగా, విభజితంగా ఉంది” అని పేర్కొన్నారు.- “నేను అధికారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేను, కానీ ప్రజాస్వామ్య మార్పు కోసం మార్గదర్శకుడిగా బాధ్యత వహిస్తాను” అని ఆయన అన్నారు.- ఆయన US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, “ప్రపంచ స్వేచ్ఛా నాయకుడు”గా అభివర్ణించారు.- అయితే ట్రంప్, “ఇప్పుడే ఆయనను కలవడం సరైనది కాదు” అని వ్యాఖ్యానించారు.- 2023లో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును కలవడం వివాదాస్పదమైంది. -
ఆయన్ని సంతోషపెట్టేందుకు ఇరాన్ పరువు తీయొద్దు
తన పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించబోమంటూ ఆందోళనకారుల్ని హెచ్చరించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా చురకలు అంటించారు. శుక్రవారం ఇరాన్ ఆందోళనలపై ఓ వీడియో మేసేజ్‌లో ఖమేనీ స్పందిస్తూ..మన దేశ వీధులను పాడుచేసి.. మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసం రోడ్డెక్కి దేశ పరువు తీయొద్దు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని ఇస్లామిక్ రిపబ్లిక్ సహించబోదు అని వార్నింగ్ ఇచ్చారు. తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన.. ఈ సమయంలో ఇరాన్ యువత ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎలాంటి శత్రువునైనా ఇరాన్ ఎదుర్కొగలుగుతుందని అభిప్రాయపడ్డారు.మీ సంగతి చూస్కోండినిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ పదే పదే ఇరాన్‌ను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ, అగ్రరాజ్యం అధ్యక్షుడికి చురకలంటించారు. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టిపెట్టాలంటూ ట్రంప్‌కు ఖమేనీ హితవు చెప్పారు.ఖమేనీ గద్దె దిగాలంటూ ఇరాన్ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరుగుతున్న ఆందోళనలు.. గత కొద్దిరోజులుగా తీవ్రతరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచిపారిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం వాటిని ఖండించినా.. ఖమేనీ మాత్రం అధికారికంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఆశ్రయం కోసం మాస్కోకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఊహాగాలను తెర దించుతూ ఇవాళ ఆయన ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. 2026 ఆర్థిక బడ్జెట్‌పై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రసంగం సమయంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, తారాస్థాయికి చేరుకున్న నిరుద్యోగ సమస్య, కరెన్సీ విలువ పడిపోవడం,వీటికి తోడు రాజకీయ స్వేచ్ఛకు భంగం కలగడంతో.. ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. టెహ్రాన్, మష్హాద్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా, ఇరాన్లో నూతన సంస్కరణలను డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ప్రజలు రోడ్డెక్కి నినాదాలు చేశారు.డిసెంబర్ 28న మొదలై.. 27 ప్రావిన్సుల్లో 250కి పైగా ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి. ఆందోళనకారుల్ని అణచివేసేందుకు భద్రతా బలగాలు.. టియర్ గ్యాస్, షాట్‌గన్స్, వాటర్ కేనన్లు ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 12 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటిదాకా 35 మంది మరణించారు. వీళ్లలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. సుమారు 1,200 మందికి పైగా అరెస్టు అయ్యారు. భారీగా ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసింది ఇరాన్ ప్రభుత్వం. నిరసనకారులను విదేశీ శక్తుల కిరాయి సైనికులుగా అభివర్ణిస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
47 ఏళ్ల నుంచి చచ్చిపోతూనే ఉన్నాను..!
ఇరాన్లో నిరసనల పర్వం తారాస్థాయికి చేరింది. ఇజ్రాయిల్‌తో యుద్ధం అనంతరం ఇరాన్లో రాజకీయ సంక్షోభం ప్రబలింది. ప్రధానంగా ఇరాన్ సుప్రీంలీడర ఆయుతుల్లా ఖమేనీ నేతృత్వంలో ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతండటంతో ఆ దేశ ప్రజల ఒక్కసారిగా రోడ్లపైకి పెద్ద ఎత్తున వచ్చి నిరసన బాట పట్టారు. ఇక ఖమేనీ శకం అయిపోయిందని, తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. తమకు స్వేచ్ఛ జీవితం లేదని, ఇరాన్లో చచ్చి బతుకుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 47 ఏళ్లగా చచ్చిపోయే ఉన్నాను..ఒక మహిళ తడిసిన రక్తంతో పెద్ద పెద్దగా అరుస్తూ ఖమేనీ ప్రభుత్వంపై తన నిరసనను వ్యక్తం చేసింది. ఆమె నాలుకపై రక్తం కారుతున్న దృశ్యాలు అత్యంత బాధాకరంగా కనిపిస్తున్నాయి. ‘ నేను 47 ఏళ్లుగా చచ్చిపోయే ఉన్నాను.. ఇంకా భయమెందుకు. ఇంకా కొత్తగా చచ్చిపోయేదేముంది’ అంటూ పెద్దగా కేకలు పెడుతూ నిరసన వ్యక్తం చేయడం అక్కడ ఖమేనీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు అద్దం పడుతోంది. నియంత ఇక లేడు.. ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా ఉండదు..! ఇరాన్ నియంతగా పేరు గాంచిన ఖమేనీ ఇక లేడని, ఆయనకు చెందిన ఇస్లామిక్ రిపబ్లిక్ పార్టీ కూడా ఇక ఇరాన్లో ఉండదని ప్రజలు తమ నిరసన గళం విప్పారు. తాము ఖమేనీ పాలనలో నలిగిపోయే ఉన్నామని, ఇక ఆ పరిపాలన వద్దంటూ కదం తొక్కుతున్నారు. ఖమేనీ స్వచ్ఛదందగా రాజీనామా చేస్తే ఓకే కానీ ఒకవేళ అలా జరగని పక్షంలో తామే గద్దె దింపుతామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నా.. ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. I’m not afraid. I’ve been dead for 47 years this is the voice of a woman in Iran who is fed up with the Islamic republic.47 years ago, the Islamic Republic took our rights and turned a nation into hostages.Today people have nothing left to lose, they rise.Iran is rising. pic.twitter.com/GAawmynE0C— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) January 8, 2026 ఇదీ చదవండి:ఇరాన్లో ఉధృతమైన ‘స్వేచ్ఛా’ స్వరం -
ఇరాన్లో ఉధృతమైన ‘స్వేచ్ఛా’ స్వరం
ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు స్వేచ్ఛ కావాలంటూ ప్రజలు రోడ్లపై నిరసన బాట మరింత ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా చేస్తున్న వారి నిరసన అంతకంతకూ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెబుతూ తీవ్రతరమయ్యింది. అమెరికా డాలర్‌తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి, ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది మరో ‘జెన్‌జీ’ కానుందా?ఇది క్రమంగా జెన్‌జీ(Gen-Z) ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న జీవన వ్యయం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, భద్రతా బలగాల కఠిన చర్యలపై ఆగ్రహంతో ఇరానీయులు వీధుల్లోకి వచ్చి, పాలక ధార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ , అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ ను నిలిపివేసింది. దీనిపై భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా, ప్రజలు ‘స్వేచ్ఛ, స్వేచ్ఛ’ అనే నినాదాలతో తమ నిరసనను మరింత ఉధృతం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందిన ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లవి ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. Iranians have had enough.They want the regime to fall pic.twitter.com/31pKHpNZD2— Visegrád 24 (@visegrad24) January 9, 2026 ఫహ్లవి పిలుపుతో మరింత ఉధృతం..పహ్లవి గురువారం, శుక్రవారం స్థానిక సమయం రాత్రి 8 గంటలకు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో తెహ్రాన్‌లోని పలు ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. ఆయన ఇచ్చిన పిలుపుతో నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. అమెరికాలో ఉన్న పహ్లవి తిరిగి రావాలని ఇరాన్ ప్రజల ఆశాభావంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న పహ్లవి తప్పకుండా తిరిగి వస్తారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. Another video from Dolat Street in #Tehran, capital city of #Iran, shows protesters chanting slogans against the Islamic regime and expressing support for #RezaPahlavi, the leader of Iran’s revolution. #IranProtests pic.twitter.com/AO1SmFq9DT— Babak Taghvaee - The Crisis Watch (@BabakTaghvaee1) January 9, 2026 ట్రంప్‌తో కలిసి పని చేయండి.. పాలనను గాడిలో పెట్టండిఖమేనీతో పాటు, యూరోపియన్ నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి పాలనను గాడిలో పెట్టాలని వాగ్దానం చేయాలని పహ్లవి డిమాండ్ చేశారు. ‘ ‘ఇరాన్ ప్రజలతో మళ్లీ సంబంధాలు ఏర్పడేలా అన్ని సాంకేతిక, ఆర్థిక, దౌత్య వనరులను వినియోగించమని నేను వారిని కోరుతున్నాను, తద్వారా వారి స్వరం మరియు సంకల్పం వినబడేలా, కనిపించేలా అవుతుంది. నా ధైర్యవంతమైన సహచరుల స్వరాలు మూగబారనివ్వకండి’ అని తెలిపారు. BREAKING:The people of Tehran are burning down regime buildings right now. The crowd is MASSIVE. pic.twitter.com/V5j6nwbLb4— 𝐍𝐢𝐨𝐡 𝐁𝐞𝐫𝐠 ♛ ✡︎ (@NiohBerg) January 8, 2026 -
ఇరాన్లో మరింత ఉధృతమైన ఆందోళనలు
‘‘ఇజ్రాయెల్‌తో 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగినప్పుడు కూడా ఖమేనీ ఎక్కడికి పారిపోలేదు. అలాంటి సొంత దేశంలో.. అదీ అక్కడక్కడా జరిగే నిరసనలు చూసి పారిపోతారా?..’’ అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ దేశం విడిచిపోతారన్న కథనాలను ఇరాన్ వర్గాలు ఖండిస్తున్నాయి. కానీ, పరిస్థితులు మాత్రం ఆ ప్రచారంలో కాస్తో కూస్తో వాస్తవం లేకపోలేదని చెబుతున్నాయి. ఇరాన్లో ప్రజా నిరసనల వేళ.. అయతొల్లా అలీ ఖమేనీ అడ్రస్ లేకుండా పోయారు. ఆఖరికి.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఆయన స్పందించడం లేదు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయారని ప్రచారం జోరందుకుంది. కానీ, ఇరాన్ వర్గాలు ఆ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. అయితే మారుతున్న సమీకరణాలు.. పరిస్థితులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఖమేనీ నెక్ట్స్ స్టెప్ గురించి ది టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్లో చెలరేగిన ఆందోళనలను ‘ఫ్లాన్ ఏ’ ద్వారా అణచివేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే.. వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య నేపథ్యంలో ఖమేనీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రజా ఉద్యమం చల్లారకపోయినా.. ఒకవేళ ట్రంప్ జోక్యం చేసుకున్నా.. తక్షణమే దేశం విడిచిపోవాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సదరు కథనం పేర్కొంది. 86 ఏళ్ల ఖమేనీకి, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో తన వారసుడిగా భావిస్తున్న కుమారుడు ముజ్తబా సహా సుమారు 20 మంది బృందంతో ఖమేనీ టెహ్రాన్ విడిచి వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు ప్లాన్ బీ సిద్ధమైనట్లు ది టైమ్స్ పత్రిక సదరు ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశాన్ని కథనంగా ఇచ్చింది. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు 78 నగరాలకు విస్తరించాయి. కనీసం 35 మంది మరణించగా, 1200 మందికి పైగా అరెస్టయ్యారు. అయితే.. భద్రతా బలగాల కాల్పుల్లో పసికందులు కూడా బలయ్యారని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. విదేశీ జోక్యం దాకా పరిస్థితి వస్తే ఆయన తప్పకుండా దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి తరలి పోవచ్చనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అలాంటి ఇలాంటి సంక్షోభం కాదుఇరాన్ కరెన్సీ రియాల్ విలువ 2025 డిసెంబర్లో డాలర్‌కు 42 వేల రియాల్‌కు చేరుకుంది. దీంతో ఆహార ధరలు (72%) ఔషధాల రేట్లు(50%) ఆకాశాన్నంటాయి. 2026 బడ్జెట్లో పన్నులు 62% పెంచే ప్రతిపాదన జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అంతర్జాతీయ ప్రతిస్పందనఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులపై దాడులు జరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్లో ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని సూచించింది.బలహీనంగా ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’.ఇరాన్ మిత్ర బలగాలైన హమాస్, హిజ్బుల్లా, హౌతి తిరుగుబాటుదారులు, సిరియా ప్రభుత్వం గత కొన్నేళ్లలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో అమెరికా–ఇజ్రాయెల్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమి క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది. ఇరాన్‌పై వెనెజువెలా తరహా సైనిక చర్య జరిగితే ఇవి ఎంత వరకు మద్దతుగా నిలుస్తాయనేదానిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.ఖమేనీ పాలనప్రముఖ మత గురువు అయిన ఖమేనీ.. 1979 ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 1981లో అధ్యక్షుడిగా, 1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంటే గత 35 ఏళ్లుగా ఆయన ఇరాన్లో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. ఆర్థిక సంక్షోభం, ప్రజా అసంతృప్తి, అంతర్జాతీయ ఒత్తిడి మధ్య ఖమేనీ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. -
దేశానికే అవమానం
డెహ్రాడూన్: ఈశాన్య రాష్ట్రం త్రిపురకు చెందిన ఓ విద్యారి్థని విద్వేష పూరిత వ్యాఖ్యలతో వేధించి, దారుణంగా చంపిన ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రిపురకు చెందిన ఏంజెల్ చక్మా(24) ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ నెల 9వ తేదీన కొందరు యువకులు కత్తులు, పదునైన ఆయుధాలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 26వ తేదీన కన్నుమూశాడు. అంజెల్ చక్మా తండ్రి బీఎస్ఎఫ్ జవాను. ఈయన ప్రస్తుతం మణిపూర్‌లోని టంగ్జెంగ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. డెహ్రాడూన్‌లో ఉంటున్న తన కుమారులు ఏంజెల్ చక్మా, మైకేల్ చక్మాలను కొందరు యువకులు ‘చైనీస్ మోమో’ అంటూ కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారని తరుణ్ ప్రసాద్ చక్మా ఆరోపించారు. మేం చైనీయులం కాము, భారతీయులమంటూ అడ్డు చెప్పినందుకు ఏంజెల్‌ను విద్వేషపూరితంగా వెక్కిరిస్తూ కత్తి, ఇతర పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టారన్నారు. ఈ విషయమై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సోమవారం తరుణ్ ప్రసాద్ చక్మాతో ఫోన్లో మాట్లాడారు. ఈ దారుణానికి పాల్పడిన ఆరుగురిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని, నేపాల్‌కు పారిపోయిన మరొకరిని తీసుకువస్తామని చెప్పారు. నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఏంజెల్ చక్మా కుటుంబానికి పరిహారంగా మొదటి విడతలో రూ.4.12 లక్షల చెక్కును పంపిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఘటనను తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ విభజనవాదాన్ని ఎగదోస్తోందని ఆరోపించారు. డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థి దారుణ హత్య దేశానికే అవమానమని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈ గడ్డపై పుట్టిన వారంతా భారతీయులే అనే మెలకువ సమాజంలో ప్రతి ఒక్కరికీ అవసరమని పేర్కొన్నారు. ఘటనను రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. హోం మంత్రి అమిత్ షా విద్వేష నేరాలపై స్పందించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమానం అందిస్తామని త్రిపురలోని తిప్రా మోథా సుప్రీం ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేబ్‌వర్మ ప్రకటించారు. ఏంజెల్ చక్మాకు న్యాయం జరగాలంటూ సోమవారం డెహ్రాడూన్, అగర్తలాలో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. -
ఆగ్రహ జ్వాలలు
న్యూఢిల్లీ/కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ కార్మికుడు దీపూచంద్ర దాస్‌ను అల్లరిమూకలు కొట్టి చంపడం పట్ల విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఈ మారణకాండను ఖండించడం పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. వందలాది మంది కార్యకర్తలు కాషాయం జెండాలు చేతబూని బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్లను దాటుకొని ముందుకు దూసుకొచి్చన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంస్థలు ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ హైకమిషన్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏడు అంచెల బారికేడ్లు సిద్ధంచేశారు. పారా మిలటరీ బలగాలను మోహరించారు. ప్రజా రవాణా సంస్థ బస్సులను సైతం వలయంగా నిలిపి ఉంచారు. హైకమిషన్‌కు 800 మీటర్ల దూరంలోనే నిరసనకారులను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిందువులకు రక్షణ కల్పించాలి యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య పట్ల బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ సిటీలో వ్రస్తాల పరిశ్రమలో పనిచేసే దీపూచంద్ర దాస్(25)ను ఈ నెల 18న దుండగులు కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. దైవ దూషణకు పాల్పడినందుకే దీపూచంద్ర దాస్‌ను శిక్షించినట్లు దుండగులు ప్రకటించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. హిందూ కార్మికుడి హత్యను పలు దేశాలు ఖండించాయి. భారత్‌లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్ సర్కార్ తీరును ఖండించారు. దీపూచంద్ర దాస్‌ను పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బంగ్లాదేశ్‌లోని హిందువులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై దౌత్యపరంగా ఒత్తిడి పెంచాలని చెప్పారు. పొరుగు దేశంలోని హిందూ కుటుంబాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిరసనకారులు హనుమాన్ చాలీసా పఠించారు. మతపరమైన నినాదాలతో హోరెత్తించారు. భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం పట్ల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్‌లోని తమ కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి ఘటనలు ఇరుదేశాల దౌత్య సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేయడం పది రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. హిందూ కుటుంబం ఇల్లు దహనం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చట్టోగ్రామ్‌లో హిందూ కుటుంబం ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఇంట్లో జయంతి సంఘా, బాబు షుకుశీల్ కుటుంబాలు నివసిస్తున్నాయి. దుండగుల దుశ్చర్యకు ఇల్లు చాలావరకు దహనమైపోయింది. ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు శునకాలు మరణించాయి. హిందువులను హెచ్చరిస్తూ దుండగులు ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇస్లామిక్ వ్యతిరేక కార్యకలాపాలు వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అందులో హెచ్చరించారు. కోల్‌కతాలో నిరసనలు బంగ్లాదేశ్‌లో మైనారీ్టలైన హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది హిందూ సంఘాల సభ్యులు ‘బోంగియో జాగరణ్ మంచ్’ఆధ్వర్యంలో నగరంలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టడానికి లాఠీచార్జి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
భారత్ వ్యతిరేక షరీఫ్ ఉస్మాన్ మృతి.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత
ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది(32) మరణ వార్త బంగ్లాదేశ్‌లో అగ్గి రాజేసింది. డిసెంబర్ 12న ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు హాది తలపై కాల్పులు జరపడంతో సింగపూర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ హాది మరణించాడని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నిరసనకారులు ఢాకాలో రెచ్చిపోయారు. ఆస్తులను ధ్వంసం చేశారు.కాగా.. తీవ్రవాద భావజాలం, 2024 బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాది మరణం కారణంగా వేలాది మంది నిరసనకారులు ఢాకా, షాబాగ్ ప్రాంతంలో గుమిగూడారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నిరసనలకు దిగారు. అధికారుల వైఫల్యమే హాది మృతికి కారణమని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. దేశంలోని అతిపెద్ద పత్రిక అయిన ‘డైలీ ప్రథమ్ ఆలో’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మొదట ఆఫీసులను ధ్వంసం చేసిన నిరసనకారులు, ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టారు. అలాగే, ఢాకాలోని కవ్రాన్ బజార్‌లోని కార్యాలయానికి నిప్పుపెట్టారు. గంటలతరబడి శ్రమించి దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్నికీలల నుంచి కాపాడారు. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. రెండు అంతస్తులు అగ్నికీలల్లో చిక్కుకొన్నాయి. దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్‌పైనా దాడి జరిగింది. దీంతో బంగ్లాదేశ్‌లో ప్రధాన పత్రికలు నేడు తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. అయితే, ఆ భవనాల వద్ద సైనికులు, సరిహద్దు భద్రతా బలగాలు మోహరించినప్పటికీ.. నిరసనకారులను చెదరగొట్టలేదు. భద్రతా సిబ్బంది శాంతియుతంగా వెళ్లిపోవాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. VIDEO | Dhaka, Bangladesh: Daily Star newspaper building was attacked in Dhaka following death of Sharif Osman Hadi, a prominent leader of the July Uprising and a spokesperson of the Inqilab Manch who was shot last week. Protests erupted in Dhaka as soon as the news of his death… pic.twitter.com/wJSfbc0E01— Press Trust of India (@PTI_News) December 18, 2025మరోవైపు.. హాది మరణ వార్త వెలువడిన తర్వాత చిట్టగాంగ్‌లోని భారత ఉప హైకమిషనర్ నివాసం వద్ద సైతం నిరసనకారులు చెలరేగాయి. భారత రాయబార కార్యాలయంపైకి నిరసనకారులు రాళ్లు విసిరారు. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖుల్షీ ప్రాంతానికి చేరుకున్న నిరసనకారులు హాదిని హత్య చేశారంటూ.. అవామీ లీగ్, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే, అవామీ లీగ్ ఆఫీసుకు నిప్పంటించారు. దీంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఆస్తులను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెలివిజన్‌లో యూనస్ ప్రసంగిస్తూ.. షరీఫ్ ఉస్మాన్ హాది మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అతని మరణం దేశానికి తీరని లోటు నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. అలాగే, శుక్రవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించి, దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. అతడి మృతికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.#WATCH | Bangladesh: Visuals of the aftermath from The Daily Star office in Dhaka, which was burned down by protesters. After the death of Osman Hadi, a key leader in the protests against Sheikh Hasina, Bangladesh has erupted in unrest, and two newspaper offices have been set… pic.twitter.com/dpKn5h97fI— ANI (@ANI) December 19, 2025ఇక, బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 2026 జరగబోయే పార్లమెంటరీ ఎన్నికలలో హాది అభ్యర్థిగా ఉన్నారు. అయితే, డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడి తలపై తీవ్ర గాయం కావడంతో హాదిని మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మరణవార్త విన్న అనంతరం ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. Bangladeshis are burning down offices of Newspapers as a protest to the death of their beloved islamic terrorist Osman Hadi. Osman Hadi was responsible for crimes against women too. pic.twitter.com/4mX4ql2wbA— Lord Immy Kant (@KantInEastt) December 18, 2025 -
ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం!
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్.. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం కానుందా?.. మిగిలిన జీవిత కాలం ఆయన జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా??.. పీటీఐ వర్గాలు, ఖాన్ కుటుంబ సభ్యుల ఆందోళలను హెష్‌బాజ్ షరీఫ్ ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందా?.. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను అసలు పట్టించుకోవడం లేదా?..‘మా తండ్రిని మళ్లీ చూడలేమేమో’.. అంటూ ఇమ్రాన్ ఖాన్ తనయులు చెబుతున్న ఈ మాట పీటీఐ వర్గాలను, ఆయన అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా సంస్థ స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ ఇద్దరు కొడుకులిద్దరూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఖాసిమ్ ఖాన్.. మా తండ్రికి(ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి..) రెండేళ్లుగా ఇతరులతో సంబంధాలు లేకుండా చేశారు. ఒక సెల్లో ఒంటరిగా బంధించారు. తాగడానికి ఆయనకు మురికి నీరు ఇస్తున్నారు. ఆయన చుట్టూ హెపటైటిస్‌తో బాధపడుతున్న ఖైదీలు ఉన్నారు అని అన్నాడు.మరో కొడుకు సులేమాన్ ఇసా ఖాన్ తన తండ్రి ఉంది డెత్ సెల్లో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైల్లో ఆయనతో ఎవరూ మాట్లాడకూడదనే ఆంక్షలు పెట్టారు. చివరకు జైలు గార్డులు కూడా ఆయన్ని పలకరించడానికి వీల్లేదు. పాక్ ప్రభుత్వం ఆయన విషయంలో సైకాలజికల్ టార్చర్ స్ట్రాటజీ అవలంభిస్తోంది అని ఆరోపించారు. పరిస్థితి పోనుపోను మరింత కఠినంగా మారుతోంది. ఆశను నిలుపుకోవడం కష్టమవుతోంది. ఇక ఆయనను మళ్లీ చూడలేమేమోనని భయపడుతున్నాం అని ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 22 నెలలుగా తాము తండ్రిని కలవలేకపోయామని.. జనవరిలో తాము ఇస్లామాబాద్ వెళ్తామని.. ఎలాగైనా ఆయన్ని కలిసి తీరతామని అంటున్నారు. మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడిపించేందుకు పీటీఐ పోరాటం చేస్తోంది. ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖానుం, నూరీన్ ఖాన్ నియాజీ ఆ నిరసనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వివిధ దేశాల అధినేతలకు, ప్రముఖులకు ఇమ్రాన్ ఖాన్ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. అయితే వాటికి ఫలితం కనిపించడం లేదు. అదే సమయంలో.. ఇమ్రాన్ ఖాన్‌పై దేశ ద్రోహం పెట్టాలని షెహబాజ్ షరీఫ్ సర్కార్ యోచిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కుట్ర ఉందనేది ఖాన్ కుటుంబం చెబుతున్న మాట. ఈ పరిణామాల నడుమ.. ఖాన్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.ఇమ్రాన్ ఖాన్ విడుదల డిమాండ్‌తో పాటు పీటీఐ కార్యాలయాల మూసివేత.. కీలక నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరవధిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. రావల్పిండిలోని ఆడియాలా జైలు సమీపంలోని ఫ్యాక్టరీ నాకా వద్ద ఈ నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే షెహబాజ్ ప్రభుత్వం రావల్పిండిలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించుకోకుండా కఠిన ఆంక్షలు విధించింది. అయితే.. ఆ ఆంక్షలను అణచివేతగా పేర్కొంటూ ఖాన్ సోదరీమణులు స్వయంగా ఈ దీక్షల్లో పాల్గొనబోతున్నారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 840 అనే రాతలు(ఖాన్‌కు కేటాయించిన ఖైదీ నెంబర్) కనిపిస్తున్నాయి.నాటి నుంచి.. పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోయారు. ఆ మరుసటి ఏడాది.. తోషాఖానా అవినీతి కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) మార్చి 24న వారానికి రెండు సార్లు (మంగళవారం, గురువారం) సందర్శకులను అనుమతించాలని ఆదేశించింది. అయితే PTI ఈ ఆదేశాలు అమలు కావడం లేదని ఆరోపిస్తోంది.జైల్లో ఉన్నప్పటికీ ములాఖత్‌ల ద్వారా ఇమ్రాన్ ఖాన్ సందేశాన్ని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గీయులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా చెబుతూ వస్తున్నారు. అయితే.. ఆర్మీ చీఫ్ అసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశాక.. ఆయన నుంచి ఎలాంటి చప్పుడు లేదు.ములాఖత్‌లకు అడియాలా జైలు అధికారులు అనుమతించకపోవడమే అందుకు కారణంగా తెలిసింది. అయితే జైల్లో ఆయన భద్రంగానే ఉన్నారా?.. సజీవంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అనే అనుమానాలతో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ పరిణామాల నడుమ ఖాన్ సోదరీమణికి 20 నిమిషాల ములాఖత్‌కు అవకాశం దక్కింది. ఆ సమయంలో ఆయన జైల్లో మానసికంగా కుంగిపోయి ఉన్నారని అన్నారామె. అయితే అటుపైనా ములాఖత్‌లకు పోలీసుల ఆటంకాలు ఎదురయ్యాయి. ఒకానొక దశలో పీటీఐ కార్యకర్తలు జైల్లోకి దూసుకెళ్లే ప్రయత్నంగా చేయగా.. వాటర్ కెనన్లతో చెదరగొట్టారు.భారత్ రియాక్షన్ ఇదే..ఇమ్రాన్ ఖాన్ జైలు నిర్బంధంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక ఒంటరి నిర్బంధంలో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న ఐక్యరాజ్య సమితి.. పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచే ప్రనయత్నంలో ఉంది. పాక్ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారే అవకాశం లేకపోలేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యంతో పాటు యూరప్ దేశాలు న్యాయమైన విచారణ జరగాలని, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై ఇంతదాకా ఎక్కడా స్పందించలేదు. కానీ, అది పాక్ రాజకీయ సంక్షోభంగా మాత్రం భావిస్తోంది. ఇక గల్ప్ దేశాలు ప్రత్యక్షంగా స్పందించకపోయినప్పటికీ.. అక్కడి ప్రవాస పాకిస్తానీలు మాత్రం #FreeImranKhan పేరిట నిరసనలు చేపడుతున్నారు. ఖాన్ కొడుకులు లండన్‌లో..ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పటిదాకా మూడుసార్లు వివాహం జరిగింది. మొదటి భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ బ్రిటిష్ జర్నలిస్గ్. 1995లో వీళ్ల వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. అయితే.. 2004లో విడాకులు తీసుకున్నాక ఆమె పిల్లలతో లండన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెహామ్‌ను ఖాన్ 2015 వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహ బంధం ఎన్నో రోజులు నిలవలేదు. 2018లో బుష్రా బీబీ (బుష్రా మానేకా)ను వివాహం చేసుకున్నారు. అయితే.. అవినీతి ఆరోపణల్లో ఖాన్‌తో పాటు అరెస్ట్ అయిన ఆమె అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. -
రంగంలోకి గులాబీ బాస్.. గేరు మార్చనున్న కారు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రత్యక్షంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది.నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. తెలంగాణకు సాగునీటి విషయంలో బీజేపీ కూడా అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి బీజేపీ సహకరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎదుర్కొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు.బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో బీఆర్ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటుంది. తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
బంగ్లాదేశ్ అతలాకుతలం.. హసీనాకు మరణశిక్ష?
ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి అతలాకుతలమైంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజధాని ఢాకా సహా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. నిరసనకారులు రోడ్ల మీదకు రావడంతో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) నేడు తీర్పు వెలువరించనుంది. గతేడాది విద్యార్థుల నిరసనల అణచివేత కేసులో ఆమె అమానుష చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. హసీనా, ఆమె ప్రభుత్వంలో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఖమాల్ను నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వ్యక్తులుగా ప్రకటించి విచారణ జరిపారు. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న హసీనాకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు.- Massive protests against Muhammad Yunus Govt in Bangladesh.- Shoot at sight orders issued against anyone not agreeing with Yunus diktats.- Protestors are burning Mohammad Yunus owned Grameen Bank outlets across Bangladesh.- Protestors are asking Yunus to go back to USA.… pic.twitter.com/3VbS9pNN3Q— Incognito (@Incognito_qfs) November 16, 2025మరోవైపు.. ఐసీటీ తీర్పు నేపథ్యంలో షేక్ హసీనా అవామీ లీగ్ ఫేస్బుక్ పేజీలో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె..‘ఈ దాడులు, కేసులు కొత్తవి కావు. నాకు శిక్ష వేసినా భయపడవద్దు. వాళ్లు నన్ను విచారిస్తే చేసుకోండి. నాకు ఫర్వాలేదు. ఇది దేవుడు ఇచ్చిన జీవితం. ఏదొక రోజు మరణించాల్సిందే. కానీ నేను ప్రజల కోసం పనిచేస్తున్నా. అలాగే చేస్తూనే ఉంటా. పథకం ప్రకారం నన్ను అధికారంలో నుంచి తొలగించినట్లు యూనస్ స్వయంగా చెప్పారు. ఆయన అధికార దాహి. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 7(B) ప్రకారం, ఎవరైనా బలవంతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగిస్తే శిక్షార్హులు. యూనస్ అదే చేశారు. నా మీద పెట్టిన కేసులు పూర్తిగా తప్పుడు కేసులే. కోర్టులో ఎవరైనా తప్పుడు ఫిర్యాదు చేస్తే వాళ్లపై కూడా శిక్ష ఉంటుంది. ఒక రోజు అది జరుగుతుంది. భయపడటానికి ఏమీ లేదు. నేను బతికే ఉన్నాను. నేను బతుకుతాను. దేశ ప్రజలకు నేను మద్దతు ఇస్తాను. యూనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మిలిటెంట్ రాజ్యంగా మారుస్తోంది. బంగ్లాదేశ్‌లో ప్రజలకు రక్షణ కరువైంది అని ఘాటు విమర్శలు చేశారు. ఇక, తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో నిరసనగా అవామీ లీగ్ నవంబర్ 17న దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించింది.హసీనా వీడియో సందేశం తర్వాత.. బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు కార్లకు నిప్పంటించారు. చెట్లను అడ్డుగా పెట్టి, ఓ జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం కలిగించారు. రోడ్లపైకి పెద్ద ఎత్తు చేరి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వం సైన్యం, పోలీసులతోపాటు బోర్డర్ గార్డులను రంగంలోకి దించింది. ఎవరైనా ప్రాణహాని తలపెట్టేలా ఆందోళనలు చేస్తే వారిపై కాల్పులు జరపొచ్చని పోలీసులను ఆదేశించింది. ముఖ్యంగా తీర్పును వెలువరించే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) చుట్టూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.Today, tens of thousands of Bangladeshis gathered in Dhaka to protest against interim government leader Muhammad Yunus.BANGLADESH = IN THE TANK.Stay tuned.pic.twitter.com/YybYXjbi9y— Steve Hanke (@steve_hanke) November 17, 2025మా అమ్మకు మరణశిక్ష విధిస్తారేమో: హసీనా కుమారుడుఇదిలా ఉండగా.. తీర్పు నేపథ్యంలో షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ స్పందిస్తూ.. మా అమ్మకు మరణశిక్ష విధిస్తారేమో. తీర్పు ఏమిటో మాకు ఖచ్చితంగా తెలుసు. యూనస్ ప్రభుత్వం ఆమెను దోషిగా నిర్ధారించబోతున్నారు. నా తల్లిని ఏం చేయగలరు?. ఆమె భారత్‌లో సురక్షితంగా ఉంది. ఆమెకు భారత్ పూర్తి భద్రతను ఇస్తోంది అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అవామీ లీగ్ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే వచ్చే ఏడాది ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తీర్పు ప్రత్యక్ష ప్రసారం.. తీర్పులోని కొన్ని అంశాలను ప్రభుత్వ యాజమాన్యంలోని బీటీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ICT-BD అధికారిక ఫేస్బుక్ పేజీలో ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. హసీనాను అరెస్టు చేయకపోతే లేదా 30 రోజుల్లోపు లొంగిపోకపోతే ఆమె అప్పీల్ చేయడాన్ని ICT-BD చట్టం నిషేధిస్తుందని చెప్పారు. తీర్పు ఎలా ఉన్నా అమలు చేస్తామని అని ప్రభుత్వ తాత్కాలిక సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి అన్నారు. దేశవ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్‌లో ఉన్నాయి.యూనస్ పరిస్థితి అంతే..షేక్ హసీనా ప్రభుత్వం పతనమై.. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా.. నిరసనలు, అశాంతి కొనసాగుతున్నాయి. హసీనా కూడా.. తాను బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలంటే.. ముందుగా భాగస్వామ్య ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని, అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తేయాలని కోరుతున్నారు. అంతేకాదు.. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలని కోరారు. యూనస్ ప్రభుత్వం.. మితవాదుల మద్దతుపై ఆధారపడుతోందని ఆరోపించారు. బంగ్లా ప్రభుత్వం తన మూర్ఖపు, ఆత్మహత్యా చర్యలతో.. భారత్‌తో ముఖ్యమైన సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న నిరసనలు, యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ తిరుగుబాటు.. కేవలం రాజీనామా కోసం జరిగిన గత ఉద్యమానికి కొనసాగింపు మాత్రమే కాదు. అనేక ఘర్షణల మధ్య జరుగుతున్న పోరాటం. హసీనాను గద్దె దించిన తర్వాత కూడా, తాత్కాలిక ప్రభుత్వంలో.. పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడంతో, దేశం పూర్తిగా విచ్ఛిన్నమైన రాజకీయ వ్యవస్థను ఎదుర్కొంటోంది. ఈ నిరసనలు, బంగ్లాదేశ్ నిజమైన, సమ్మిళిత ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు పయనించాలనే ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయి. -
రాజ్యాంగ సవరణపై పాక్‌లో ఆందోళనలు
ఇస్లామాబాద్: ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టడంతోపాటు సమూల మార్పులకు ఉద్దేశించిన 27వ రాజ్యాంగ సవరణకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేయగా, ప్రతిపక్ష పార్టీలు ఆదివారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగాయి. రాజ్యాంగ పునాదులనే కదిలించే సవరణలను ఆపివేయాలని డిమాండ్ చేశాయి. 27వ రాజ్యాంగ సవరణతో మిలటరీ అధికారం మరింత బలపడనుంది.ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల చీఫ్‌గా రాజ్యాంగ గుర్తింపు లభించనుంది. ఫీల్డ్ మార్షల్‌గా ఆయన జీవిత కాలం కొనసాగుతారు. దీనివల్ల జీవించి ఉన్నంతకాలం ఆయనపై కేసులు పెట్టకూడదు. సుప్రీంకోర్టు అధికారాలకు సైతం కోత పడనుంది. ఈ బిల్లుపై సోమవారం సెనేట్‌లో ఓటింగ్ జరగనుంది. అవసరమైన మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ధీమాతో ఉంది. దీనిపై ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ సహా ఐదు పార్టీల కూటమి నిరసనలను కొనసాగించాలని నిర్ణయించింది. -
బీర్లు, బిర్యానీలు కాదు.. రోడ్లు మరమ్మతు చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీర్లు, బిర్యానీల పేరిట పోటీపడి రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు.. వాటికి బదులు మా కరీంనగర్లో రోడ్లు బాగు చేయొచ్చు.. గుంతలతో రోజూ నరకం చూస్తున్నాం.. తక్షణమే మరమ్మతు చేయండి. అని నగరానికి చెందిన సామాజిక కార్యకర్తలు దుంపేటి రాము, ఉమర్ అన్సారీ వినూత్న రీతిలో నిరసన తెలియచేశారు. సోమవారం నగరంలోని కేబుల్ బ్రిడ్జి జంక్షన్ ఎదుట రాజీవ్‌రహదారి బైపాస్ రోడ్డులోని గుంతల్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వారు మాట్లాడుతూ, నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే మెయిన్‌రోడ్డు గుంతలుపడి అధ్వానంగా మారినా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. రాజీవ్ రహదారి, కేబుల్ బ్రిడ్జి రోడ్డు జంక్షన్లో గుంతలు నరకం చూపిస్తున్నాయన్నారు. తరచూ ప్రమాదాలు కూడా చోటుచేసుకొంటున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రూ.కోట్లు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తూ, కనీసావసరాలైన రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కేబుల్ బ్రిడ్జి జంక్షన్ రోడ్డు మరమ్మతు చేయాలని వారు కోరారు. -
టాంజానియా అల్లర్లు.. 700 మందికిపైగా మృతి
-
టాంజానియాలో వివాదాస్పదంగా ఎన్నికలు
నైరోబి(కెన్యా): టాంజానియాలో ఎన్నికలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. గురువారం రెండో రోజు కూడా నిరసనలు కొనసాగాయి. వివిధ ఘటనల్లో ఇద్దరు చనిపోయినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1961 నుంచి అధికారంలో ఉన్న చమా చా మపిండుజి(సీసీఎం) మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు నేతల్ని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఎన్నికల సంస్కరణలకు పిలుపునిచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత టుండు లిస్సును దేశద్రోహం నేరం కింద జైలులో పెట్టారు. రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి లుహా ఎంపినాను సైతం అనర్హుడిగా ప్రకటించారు. దీంతో, ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు హసన్‌తో ఎన్నికల బరిలో చిన్నాచితకా పార్టీలకు చెందిన 16 మంది పోటీ పడ్డారు. వీరెవరూ ప్రచారం కూడా చేయలేదు. బుధవారం పోలింగ్ జరిగింది. జనం స్పందన అంతంతమాత్రంగానే ఉంది. నిరసన కారులు ఒక బస్సుకు, గ్యాస్ స్టేషన్‌కు నిప్పంటించారు. పలు చోట్ల పోలీస్స్టేషన్లపై దాడులకు దిగారు. పోలింగ్ స్టేషన్లను ధ్వంసం చేశారు. ఘర్షణల్లో ఒక పౌరుడు, ఒక పోలీసు అధికారి చనిపోయారు. దీంతో, ప్రభుత్వం బుధవారం సాయంత్రం వాణిజ్య రాజధాని దారెస్సలామ్‌లో కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ రాత్రి నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. గురువారం ఉద్యోగులను ఇళ్ల నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. అత్యవసరం కాని సిబ్బంది బయటకు రావద్దని సూచించింది. రహదారులపై ఆర్మీ అడ్డంకులను ఏర్పాటు చేసింది. సరైన పర్మిషన్లు లేని వారిని ఇళ్లకు పంపించి వేసింది. ప్రధాన ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను సైన్యం నిలువరించింది. కెన్యా సరిహద్దులకు సమీపంలో ఉన్న మంగాంగా పట్టణంలో నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. వ్యాపార సంస్థలు పనిచేయలేదు. గురువారం వెలువడిన మొట్టమొదటి ఫలితాల్లో 272 నియోజకవర్గాలకు గాను 8 చోట్ల 96.99 శాతం ఓట్లు అధ్యక్షుడు హసన్‌కే పడినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఫలితాలపై యూరోపియన్ పార్లమెంట్ తీవ్రంగా స్పందించింది. ‘టాంజానియాలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. నిష్పాక్షికమూ కాదు’అంటూ వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం, పౌరుల హక్కుల కోసం గట్టిగా నిలిచి పోరాడాలని ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిచ్చింది. -
ట్రంప్‌కు బిగ్ షాక్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ భారీ సంఖ్యలో అమెరికన్లు.. ‘నో కింగ్స్’ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఇక, అమెరికన్లకు మద్దతుగా లండన్ నుంచి వాషింగ్టన్ వరకు యూరప్ దేశాల్లోనూ వీరికి సపోర్టు లభించింది. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా గ్రేట్, సంస్కరణల పేరుతో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వీసాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, షట్‌డౌన్ వంటి నిర్ణయాల కారణంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు. ఆయన పాలనాతీరు, విధానాలపై అనేక దేశాలతోపాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై గతంలో కూడా నిరసనలు చేపట్టిన అమెరికన్లు తాజాగా మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చారు. WOW! Protesters created a HUGE human sign on San Francisco’s Ocean Beach reading “No Kings YES on 50” to support California’s Prop 50 and stand up against Donald Trump’s fascist regime pic.twitter.com/NbUnQk6ZZB— Marco Foster (@MarcoFoster_) October 18, 2025‘నో కింగ్స్’ (No Kings protests) పేరుతో ఆందోళనలు జరుగుతున్నాయి. యాభై రాష్ట్రాల్లో దాదాపు 2500లకుపైగా ప్రదేశాల్లో నిరసనలు చేపట్టారు. పలు ఐరోపా దేశాల్లోనూ వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అమెరికా రాజధాని ప్రాంతం అంతటా నిరసనకారులు కవాతు చేశారు. ఉత్తర వర్జీనియాలో, వాషింగ్టన్ డీసీకి వెళ్లే దారిలో ఓవర్‌పాస్‌లపై నిరసనకారులు కవాతు చేస్తూ కనిపించారు. భారీ సంఖ్యలో ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు.Holy shit, look at this crowd from the Boston No Kings protest. Samuel Adams would be damn proud. pic.twitter.com/Efl1i8RExB— Mike Nellis (@MikeNellis) October 18, 2025ట్రంప్ స్పందన..మరోవైపు.. తాజా ఆందోళనలపై ట్రంప్ ఫాక్స్ బిజినెస్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. వారంతా నన్ను రాజు అని అంటున్నారు. కానీ, వారు చెబుతున్నట్లుగా తాను రాజును కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజా నిరసనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు. ఇక, అమెరికన్ల నిరసనలను వైట్‌హౌస్‌తో పాటు రిపబ్లికన్లు తోసిపుచ్చారు. ఈ ర్యాలీల్లో పాల్గొనేవారంతా అమెరికా రాజకీయాలకు దూరంగా ఉండేవారేనని.. ఇవి ‘హేట్ అమెరికా’ నిరసనలని అన్నారు.100,000+ out for a “No Kings” protest in Chicago. pic.twitter.com/oZhGrkfGUX— Spencer Hakimian (@SpencerHakimian) October 18, 2025 Thank you to the many millions who are showing up all over the country to say no to kings. pic.twitter.com/lzS4fzBYct— Adam Schiff (@SenAdamSchiff) October 18, 2025 -
మడగాస్కర్‌లో సైనిక తిరుగుబాటు
అంటాననరివో: ఆఫ్రికా దేశం మడగాస్కర్‌లో మరోసారి అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధ్యక్షుడు ఆండ్రీ రజొలినా ప్రకటించారు. అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జరిగే ప్రయత్నా లను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు వస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. సైనిక బలగాలు ఐక్యంగా ఉండి, రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నదీ తెలియడం లేదు. తాను దేశంలోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లలేదని రజొలినా కూడా ప్రకటించారు. రజొలినా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జెన్ జెడ్ మడగాస్కర్ పేరుతో యువత ఆందోళనలు సాగిస్తోంది. శనివారం అతిపెద్ద ర్యాలీ జరిగింది. ఈ ప్రదర్శనలో ఆర్మీలో కీలకమైన క్యాప్శాట్ అనే యూనిట్ కూడా పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆదివారం అధ్యక్ష కార్యాలయం తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రకటించడం గమనార్హం. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జాడలు లేవు. రాజధాని వీధుల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. తిరుగుబాటుకు కారణాలు, దీని వెనుక ఎవరున్నారు..వంటి విషయాలను అధ్యక్షుడు రజొలినా వెల్లడించలేదు. -
విశాఖ పెదగంట్యాడలో ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం, కుర్చీలు విసిరేసి..
సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుజా సిమెంట్ ఫ్యాకర్టీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో, స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపైకి స్థానికులు తిరగబడ్డారు. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని నిరసనలు తెలుపుతూ ఖర్చీలను విసిరేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇదిలా ఉండగా.. విశాఖలోని పెదగంట్యాలడ (Pedagantyada)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సిమెంట్ ఫ్యాక్టరీని స్థానికంగా ఉన్న 26 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న అన్ని గ్రామల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అయితే, ముందస్తుగా పోలీసులతో బందోబస్తు (arrangement)ను ఏర్పాటు చేసినప్పటికీ.. నిరసన కారులతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో స్థానికులు. సిమెంట్ కంపెనీతో జనావాసాలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆందోళన దిగారు. గోబ్యాక్ అంబుజా సిమెంట్ (Ambuja Cement) అంటూ నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల వారిని అదుపు చేసే ప్రయత్నం చేయడంతో.. ఆగ్రహించిన స్థానికులు మీటింగ్ స్థలంలో ఉన్న కూర్చీలను విసిరేశారు. -
ఎట్టకేలకు దిగి వచ్చిన పాక్ సర్కార్.. పీవోకేతో ఒప్పందం
ఇస్లామాబాద్: గత వారం రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో చెలరేగుతున్న నిరసనోద్యమాన్ని చల్లార్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. మొదటి మిలిటరీని పంపి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించి విఫలమైన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. చివరకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేకేజేఏఏసీ)తో ఒప్పందం చేసుకుంది.ఈ క్రమంలో 25 అంశాలతో కూడిన ఒప్పందం ప్రతిని పాక్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరి శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత నెల 29 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో 10 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ముజఫరాబాద్‌కు షహబాజ్ షరీఫ్ గత బుధవారం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపారు. వారు జేకేజేఏఏసీ నేతలతో రెండు రోజుల పాటు చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారం పాక్ ప్రభుత్వం పీవోకేలోని ముజఫరాబాద్, పూంచ్‌లలో అదనంగా ఇంటర్మీడియట్, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులను ఏర్పాటుచేస్తుంది. అలాగే, ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు స్థానిక ప్రభుత్వం 15 రోజుల్లోగా హెల్త్ కార్డు అమలుకు నిధులు మంజూరు చేయాలి. పీఓకేలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి నిధులు అందించాలి. పీఓకే అసెంబ్లీ సభ్యుల అంశంపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ చర్చించాలి. ఆస్తి బదిలీలపై పన్నును 3 నెలల్లోగా పంజాబ్ లేదా పంఖ్తుఖ్వాలతో సమానంగా తీసుకురావాలి. ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించి అమలుచేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటుచేస్తారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అజిత్‌సింగ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ రాహుల్లా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో సామాన్యుల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ విద్య చదవాలని కాలేజీలు తీసుకువచ్చారు. ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజి తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. డబ్బు మీద ప్రేమతో సామాన్యుల కలను చిదిమేస్తున్నాడు మెడికల్ కాలేజీల పరిశీలనకు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారు.. కేసులు పెట్టారు. నిర్బంధంతో పోరాటం ఆపలేరు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణ ఆపకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు.విశాఖ: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కుటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కూటమి సర్కార్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు పెడుతున్నారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. దళితుల జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం’’ అంటూ గొల్ల బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా: కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.అనంతపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ.. నల్లబ్యాడ్జీలు, బెలూన్లతో నిరసన తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేంద్ర మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పునరాలోచన చేయాలంటూ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.గుంటూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
అర్జెంటీనాలో దారుణం.. లైవ్ స్ట్రీమ్‌లో యువతుల హత్య
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా లైవ్‌లో ముగ్గురు యువతులను దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని, ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు.వివరాల ప్రకారం.. అర్జెంటీనాకు చెందిన లారా, బ్రెండా, మెరానా అనే ముగ్గురు యువతులను డ్రగ్స్ ముఠా అత్యంత దారుణంగా హత్య చేశారు. సెప్టెంబర్ 19వ తేదీన ముగ్గురు యువతులు ఒక పార్టీకి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు సభ్యుల డ్రగ్స్ ముఠా వారిని కిడ్నాప్ చేసింది. అనంతరం, వారిని వేధింపులకు గురిచేస్తూ నిందితులు సోషల్ మీడియా ఇన్స్‌స్టాగ్రామ్ లైవ్‌లో హత్య చేశారు. ఈ సందర్భంగా నిందితులు.. తమ వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నా.. దొంగలించినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అనే వ్యాఖ్యలు వినిపించినట్టు స్థానిక మీడియా తెలిపింది.De Plaza de Mayo a Congreso resonó fuerte el grito de NI UNA MENOS. Cientos de mujeres, familias, organizaciones y sindicatos colmaron las calles para exigir justicia por Morena Vardi, Brenda del Castillo y Lara Gutiérrez. pic.twitter.com/fc4i2slf2d— Shok Argentina (@shokargentina) September 28, 2025ఇక, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలించారు. ఐదుగురు నిందితుల్లో ఒకరిని బొలీవియన్ సరిహద్దు నగరం విల్లాజోన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పెరువియన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతడి ఫొటోను విడుదల చేశారు.🚨Confirmaron oficialmente que los tres cuerpos hallados en Florencio Varela son los de Brenda Castillo (20), Morena Verri (20) y Lara Morena Gutiérrez (15)Una cámara de seguridad las registró subiendo a una camioneta Chevrolet Tracker con patente adulterada, en La Tablada.… pic.twitter.com/Pba9OOhB3M— Hechos y Derecho (@Hechosanderecho) September 24, 2025మరోవైపు.. యువతుల హత్యపై అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. బాధితులకు న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజల రోడ్లకు మీదకు వచ్చారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదనతో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని పార్లమెంట్ వరకు ర్యాలీ తీశారు. -
లేహ్ లద్దాక్‌లో తీవ్ర ఉద్రిక్తత.. కేంద్రం సంచలన నిర్ణయం
ఢిల్లీ: లద్దాఖ్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో నలుగురు మృతిచెందగా, 50 మందికిపైగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. లేహ్ నగరంలో ఆందోళన కారులు బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. పెద్ద సంఖ్యలో యువత నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిరసనలపై కేంద్రం బ్యాన్ విధించింది. ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది.హింస చెలరేగడంతో లద్దాఖ్ ఉద్యమకారుడు, విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన 15 రోజుల దీక్ష విరమించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయన దీక్షను ముగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నగరంలో ఆంక్షలు విధించారు. వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. ఇది ‘జెన్-జెడ్ విప్లవం’గా అభివర్ణించారు. లద్దాఖ్‌ను 6వ షెడ్యూల్ కింద చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రదర్శనలపై నిషేధం విధించిన ప్రభుత్వం.. శాంతి భద్రతల దృష్ట్యా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడే సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ముందుగా అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటనలు చేయరాదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను 2019 ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో.. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళనకారులు లేహ్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.#WATCH | Leh, Ladakh: Security heightened in Leh amid a protest by the people of Ladakh demanding statehood and the inclusion of Ladakh under the Sixth Schedule pic.twitter.com/dBIYbVPMwo— ANI (@ANI) September 24, 2025 -
నేపాల్ అగ్నిగుండాన్ని చల్లార్చిన యాప్!
కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం(గత) 26 సోషల్ మీడియా యాప్‌లపై విధించిన నిషేధం.. ఆ దేశంలో అలజడిని సృష్టించింది. జెడ్ జనరేషన్ యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టడం.. వాటిని అదుపు చేసే క్రమంలో హింస చెలరేగి 51 మంది మరణించడం.. యాప్ బ్యాన్ ఎత్తివేత.. అయినా శాంతించని యువత.. ప్రధాని రాజీనామా.. ఆపై ఆందోళనకారుల ఛాయిస్ ప్రకారం తాత్కాలిక ప్రధాని ఎంపిక.. ఇదంతా పదిరోజుల వ్యవధిలోనే చకచకా జరిగిపోయింది. అయితే సో.మీ. బ్యాన్ నేపథ్యంలో ఆందోళనకారులు డిస్కార్డ్ Discord అనే చాట్ ప్లాట్‌ఫారమ్‌ను భలేగా ఉపయోగించారు. ఒకవేళ ఈ యాప్ గనుక లేకుండా ఉంటే.. నేపాల్ ఇంకా అగ్నిగుండంగా రగిలిపోతూ ఉండేదేమో అనే చర్చా నడుస్తోందక్కడ.పాలన పేరిట ఇన్నేళ్లుగా కొనసాగిన అవినీతికి నేపాల్ యువత ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంది. ఆందోళనలను ఉధృతంగా జరిపి ప్రభుత్వం మెడలు వచ్చింది. అయితే ఈ ఆందోళనలను సమన్వయపర్చుకోవడానికి డిస్కార్డ్ యాప్‌నే Gen Z నిరసనకారులు ఉపయోగించుకున్నారు. అంతేకాదు.. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత.. తమ ఆకాంక్షలకు అనుగుణంగా నాయకుడ్ని ఎన్నుకునే క్రమంలోనూ ఈ వేదికనే ఉపయోగించుకున్నారు. Discord అనే యాప్ గురించి మిలెనియల్స్కు పెద్దగా పరిచయం లేకపోయినా.. Gen Z యువత మాత్రం సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన వేదికగా భావిస్తోంది. డిస్కార్డ్(Discord) అనేది 2015లో ప్రారంభమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్. ఇది గేమర్ల కోసం ఆటల మధ్యలోనే స్నేహితులతో చాట్ చేయడానికి రూపొందించబడిన ఒక యాప్. అయితే.. 2020లో మహమ్మారి సమయంలో Gen Z యువతలో ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. Discord ద్వారా వినియోగదారులు సర్వర్లు అనే కమ్యూనిటీలు ఏర్పాటు చేసి.. టెక్స్ట్, ఆడియో, వీడియో చానెల్స్ ద్వారా చర్చలు జరపడం ప్రారంభించారు. స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్, మోడరేషన్ టూల్స్ వంటి ఫీచర్లు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సర్వర్‌లో గరిష్టంగా 5 లక్షల మంది చేరవచ్చు, కానీ ఒకేసారి 2.5 లక్షల మంది మాత్రమే యాక్టివ్‌గా ఉండగలరు. అందుకే నేపాల్ యువత ఉద్యమానికి దీన్నొక వేదికగా మల్చుకుంది. వీపీఎన్ సాయంతో.. సాధారణంగా వీపీఎన్‌లను ఎందుకు ఉపయోగిస్తారు?.. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. నేపాల్ యువత మాత్రం ఈమధ్య దీనిని తాజాగా నిరసనలకే ఉపయోగించింది(నేపాల్‌లో VPNల వినియోగం 3 రోజుల్లోనే 6,000% పెరిగింది.. అలాగే 5వ రోజుకొచ్చేసరికి 8,000% పెరిగింది.). నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం కొనసాగుతున్న వేళ.. విస్తృత యాప్‌గా పేరున్న డిస్కార్డ్(Discord) వీపీఎన్ సాయంతో అందుబాటులోకి తెచ్చుకుంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఉన్నట్లు ఎండ్లెస్ ఫీడ్లు లేకుండా.. వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్లతో Discord ఉండడం వల్లే దీనిని రైట్ఛాయిస్గా అక్కడి యువత భావించింది. అలా.. "Youth Against Corruption" అనే Discord సర్వర్‌లో 145,000 మందికి పైగా సభ్యులుగా చేరారు. ఈ సర్వర్‌లో చర్చలు, అనౌన్స్మెంట్స్, ఫ్యాక్ట్ చెక్, హెల్ప్లైన్లు వంటివి కొనసాగించింది. వారు ఏర్పాటు చేసిన Discord సర్వర్లలో ఇన్ఫర్మేషన్ సులభంగా పాసయ్యింది. పెద్ద సంఖ్యలో సభ్యులు చర్చలు జరిపేందుకు ఇదొ కీలక వేదికగా నిలిచింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.ఓటింగ్ కూడా.. నేపాల్ తాత్కాలిక నాయకత్వం విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని డిస్కార్డే తొలగించింది!. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ, నేపాల్ పవర్ హౌజ్‌గా పేరున్న కుల్మన్ ఘీసింగ్, రాపర్ బాలేంద్ర షా(బాలెన్), ఇలా పలువురి పేర్లతో ఓ డైలామా ఏర్పడగా.. డిస్కార్డ్ జరిగింది ఓటింగ్ ద్వారా స్పష్టత తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారానే ప్రతిపక్షాన్ని కూడా సమన్వయపర్చుకుని.. రాజకీయ అనిశ్చితిని తొలగించింది. ఈ ఓటింగ్‌ను పర్యవేక్షించిన శశ్వత్ లామిచ్ఛానే కూడా ఈ విషయాల్ని ధృవీకరించారు. ఇక డిస్కార్డ్లో ఓటింగ్ బుదవారం పూర్తైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 50 శాతం ఓట్లు సుశీల్ కార్కీకే పడ్డాయి. ఆ మరుసటి రోజు ఆమె నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీచీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను కలిశారు. అలా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎపిసోడ్లో ఉత్కంఠ వీడింది. అయితే.. ఇండియా టుడే ఓఎస్ఐఎన్టీ(Open-Source Intelligence) సర్వే ప్రకారం ఈ ఓటింగ్‌లో పాల్గొన్నవాళ్లంతా నేపాల్ పౌరులేనా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. భారత్‌లోనూ డిస్కార్డ్Discord ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అమెరికాలో దాదాపు 25 కోట్లు, బ్రెజిల్లో ఐదున్నర కోట్ల యూజర్లు ఉన్నారు. ఆ తర్వాత భారత్‌లోనూ ఐదు కోట్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తునన్నారు. ఈ లిస్ట్‌లో కెనడా, ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ విండోస్, మాక్ఓఎస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్, లైనక్స్ వెబ్ బ్రౌజర్లలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 30కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది, అందులో తెలుగు మాత్రం లేదు. డిస్కార్డులో గేమింగ్ మాత్రమే కాదు.. పౌర ఉద్యమాలు, రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. సొంత సర్వర్‌తో క్రియేటివ్ కమ్యూనిటీలు నిర్మించుకునేందుకు వీలుగా ఉండడంతోనే ఇది సాధ్యమవుతోంది. అంత నిషేధంలోనూ Gen Z యువతకు డిస్కార్డ్ యాప్ ఒక గళం ఇచ్చింది. ఒకవేళ ఈ యాప్‌ను జెన్ జెడ్ యువత గనుక సమర్థవంతంగా ఉపయోగించుకుని గనుక ఉండి ఉంటే.. నేపాల్ ఉద్యమం అసంఘటితంగా, అస్పష్టంగా, మరింత హింసాత్మకంగా మారిపోయే అవకాశం ఉండేదేమో!. -
అతి క్లిష్ట స్థితిలో నేపాల్
నేపాల్‌ను ఈ నెల 8, 9వ తేదీలలో తీవ్రంగా కుదిపివేసిన నిరసనలు, హింసాకాండ శాంతించి ఉండవచ్చు. నిరసనలకు నాయకత్వం వహించిన ‘జెన్–జడ్’ ఉద్యమకారులకూ, సైన్యానికీ మధ్య చర్చలు ఫలించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడవచ్చు. కానీ, ఒక దేశంగా నేపాల్ ప్రస్తుతం ఒక అతి క్లిష్టమైన స్థితికి చేరింది. వందల సంవత్సరాల రాచరిక పాల నను కూలదోసి ప్రజాస్వామికంగా మారిన ఒక దేశం, సుస్థిరంగా అదే వ్యవస్థలో కొనసాగాలంటే ముఖ్యంగా కావలసిందేమిటి? లోపాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసం పొంది, స్థిరపడి కొనసాగటం! అది జరగ నప్పుడు అనివార్యంగా వ్యక్తి నియంతృత్వాలు, వర్గ నియంతృత్వాలు, సైనిక నియంతృత్వాలు ఏర్పడతాయి. రాచరికం 2008లో పోయిన తర్వాత ఈ 17 ఏళ్లలో అక్కడి మూడు పార్టీలు కూడా స్వయంగానో, పరస్పరం చేతులు కలిపో పరిపాలించాయి. ప్రజల విశ్వాసాన్ని పొందటంలో మాత్రం అన్నీ విఫలమయ్యాయి. నిరసనకారులు మూడు పార్టీల నాయకుల ఇళ్ల పైనా దాడులు జరిపారు. దీనంతటి మధ్య ఆశాకిరణం–ఉద్యమ కారులు మౌలికంగా ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని కోల్పోకపోవటం, స్వయంగా సైన్యం ప్రజాస్వామ్యాన్ని కూలదోయక పోవటం!బద్దలైన నిరసనలునిరసనలు అనూహ్యంగా, అకస్మాత్తుగా సోషల్ మీడియాపై నిషేధం అనే చర్య నుంచి మొదలయ్యాయి. సాధారణంగా నిరస నలు, ముఖ్యంగా యువతరం నుంచి, నిరుద్యోగం, అవినీతి, బంధు ప్రీతి వంటి అంశా లపై జరగటం మనకు తెలుసు. కానీ నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధంతో మొదలై, ఆ తర్వాత తక్కిన అంశాలు వచ్చి చేరాయి. ఆ విధంగా, అక్కడి సమాజంలో సోషల్ మీడియాకు, ఇతర అంశాలకు అటువంటి అవినాభావ సంబంధం ఉంది. అది భారతదేశంలో కనిపించే స్థితికి భిన్నమైనది. ఇపుడు వెలుగులోకి వస్తున్న దానిని బట్టి, అక్కడి యువతరానికి నిరసనలకు సోషల్ మీడియా నిరంతర వేదికగా మారింది. దానితోపాటు, ఇతర దేశా లకు వలసపోయిన దాదాపు 25 లక్షలమంది నేపాలీలు అక్కడి నుంచి తమ వారికి చేస్తున్న ఆన్లైన్ నగదు బదిలీలకు కూడా! ఆ విధంగా ఆ నిషేధం పట్ల నిరసనలు, ఇతరత్రా పేరుకుపోతూ వస్తున్న నిరసనలు కలిసి అగ్ని పర్వతం వలె పేలేందుకు దోహద మయ్యాయి.ఇది ఒకటి కాగా, గత 17 ఏళ్లుగా పాలించిన అన్ని ప్రధాన పార్టీలలో ఏవీ ప్రజల విశ్వాసాన్ని పొందలేక పోయాయి. ఈ దోషం, వైఫల్యం ముఖ్యంగా వామపక్షాలవి కావటం గమనించ దగ్గది. అట్లా భావించటం ఎందువల్ల? రాచరికం నుంచి పరిమిత ప్రజాస్వామ్యం వైపు సంస్కరణల మార్గంలో ఇతర పార్టీలు ప్రయ త్నించగా, మావోయిస్టు పార్టీ పదేళ్ల పాటు రాజీలేని సాయుధ పోరాటం నడిపి రాచరిక వ్యవస్థనే అంతం చేసింది. అటువంటపుడు ఆ పార్టీగానీ, అంతకు ముందునుంచీ ప్రధాన స్రవంతిలో గల ఇతర కమ్యూనిస్టులు, సోషలిస్టులు గానీ ఏమి చేయాల్సింది? ప్రపంచంలోనే అతి పేద దేశాలలో ఒకటైన నేపాల్ అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారం, అంకితభావంతో కృషి చేయాలి. నైతిక విలువలను పాటిస్తూ ఆదర్శంగా నిలవాలి. తమ ఐక్యతను కొనసాగించి సుస్థిర పాలన సాగించటం మూడవ అవసరం. ఈ మూడూ జరిగి ఉంటే అసంతృప్తికి ఆస్కారమే ఉండేది కాదు.విశ్వాసం కోల్పోయిన పార్టీలునేపాల్లో అనేక పార్టీలు ఉన్నా, ప్రధానమైనవి మూడు: మధ్యే మార్గపు నేపాలీ కాంగ్రెస్, గతం నుంచి ఉన్న సాంప్రదాయిక కమ్యూ నిస్టు పార్టీ, రాచరికంపై పోరాడిన మావోయిస్టు పార్టీ. తక్కిన పార్టీ లలోనూ ఎక్కువ వామపక్ష మార్గం లోనివే. 2008లో రాచరికం పోయిన తర్వాత జరిగిన ఎన్నికలలో గెలిచి, మావోయిస్టు నాయ కుడు పుష్పకమల్ దహాల్ లేదా ప్రచండ ప్రధాని అయ్యారు. పరిపాలనలో విఫలమయ్యారు. ఏడాదికే పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. తన పార్టీ కూడా చీలిపోయింది. పరిపాలన ద్వారా సామా జిక మార్పులు, సమానత్వాలు కూడా తీసుకు రావాలని పట్టుబట్టిన ప్రచండ ప్రధాన సహచరుడు, జేఎన్‌యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి బాబూరాం భట్టరాయ్ వేరే పార్టీ ప్రారంభించాడు. అప్పటి నుంచి నేపాల్‌లో ఇక రాజకీయ సుస్థిరత లేకపోయింది. 17 ఏళ్ళలో మొత్తం 14 మంది ప్రధానులు వచ్చారు. కొందరు మళ్లీ మళ్లీ అయ్యారు. వారిలో ఎక్కువసార్లు వామపక్షాల వారే. ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి సుశీల కర్కీ పేరు వినవస్తున్నది. గతంలోనూ ఒకసారి ఇదే విధంగా జస్టిస్ ఖిల్రాజ్ రెగ్మీ (2013–14) నియమితులయ్యారు. ఇటువంటి నియామకాలు రాజకీయ అస్థిరతకు మరొక గుర్తు అవు తున్నాయి. అస్థిరతవల్ల పెట్టుబడులు రావటం లేదు.ఆశ్చర్యకరంగా అవినీతి, బంధుప్రీతి, విలాసవంతమైన జీవితం లాంటి ఆరోపణలను మావోయిస్టు ప్రచండ తన మొదటి పాలనా కాలంలోనే ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి అన్ని ప్రభు త్వాలూ ఈ విమర్శలకు గురవుతూనే ఉన్నాయి. అయినా సరైన విచారణలు, శిక్షలు లేకుండా పోయాయి. నిరుద్యోగం, పేదరికం విషయానికి వస్తే ఒక విచిత్ర స్థితి కనిపిస్తుంది. మూడు కోట్ల జనాభాలో సుమారు పావు కోటి మంది వలసలు పోయి పనులు చేసుకుంటున్నందున ఆ వర్గాల్లో స్థానికుల నిరుద్యోగం సుమారు 10 శాతం. కానీ యువతరంలో 20 శాతంగా ఉంది. అందుకు కారణం నైపుణ్యాలు నేర్పే చదువులు గానీ, స్థానిక పరిశ్రమలు గానీ లేక పోవటం. యువత తిరుగుబాటుకు ఇదీ ఒక ముఖ్య కారణం. పోతే, ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం పేదరికం 2022లో 7.5 శాతం కాగా, 2025లో 5.6కు తగ్గుతుందని అంచనా. అయితే, విపరీతమైన వలసలు, వారు పంపే డబ్బు ఈ విధంగా తక్కువ పేదరికానికి కారణమైంది. నిజంగా పేదరికం 25 శాతమని అంచనా.అక్కడ భూకంపాలు ప్రాకృతికమైన సహజ విపత్తు కాగా,ఇంకా 20 ఏళ్లయినా నిండని ఆ ప్రజాస్వామ్యానికి రాజకీయ అస్థిర తలు నాయకులు సృష్టించే విపత్తులుగా మారాయి. అన్ని పార్టీలూ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినందున రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ స్థానాన్ని ఆక్రమించగల కొత్త పార్టీలు కనీసం ఉనికిలోకైనా రాలేదు. ఉద్యమకారులకు ఆగ్రహం, ఆకాంక్షలు మినహా విధానపరంగా, ఆచరణపరంగా ఎటువంటి ఆలోచనలూ లేవు. ప్రస్తుత రాజకీయ శూన్యాన్ని పూరించగలవారెవరూ కన్పించటం లేదు. రాజ వంశీకు లకు పునరాగమనపు ఆశలున్నా ప్రజలు ఆమోదించే అవకాశం లేదు. ఇవన్నీ ఒక విధమైన క్లిష్ట స్థితి కాగా, స్థానికంగా ఆర్థికాభివృద్ధి ప్రశ్నకు తోడు ఇవన్నీ ఎన్నటికి జరిగేనన్నది మరొక క్లిష్ట స్థితి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఖైదీలపై కాల్పులు
కాఠ్మండు: నేపాల్‌లో ఓవైపు ఉద్యమం, మరోవైపు ప్రభుత్వం కుప్పకూలడంతో శాంతిభద్రతలు కట్టుతప్పి ఖైదీలు చెలరేగిపోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 కారాగారాల నుంచి 15 వేల మంది ఖైదీలు జైలు గదులు బద్దలుకొట్టిమరీ బయటపడ్డారు. పరారై బయటికొచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చారు. నేరస్తుల పరారీతో అప్రమత్తమైన సైన్యం పలుచోట్ల ఖైదీలను వెంటబడిమరీ పట్టుకుంది. కొన్ని చోట్ల జైలు సిబ్బందిపై ఖైదీలు ఎదురుతిరిగారు. మాధేశ్ ప్రావిన్సులోని రామెఛాప్ జిల్లా కారాగార కేంద్రంలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఖైదీలు జైలుసిబ్బందితో ఘర్షణకు దిగారు. జైలు గోడను బద్దలుకొట్టేందుకు ఖైదీలు గ్యాస్ సిలిండర్‌ను పేల్చేశారు. దీంతో ఘర్షణ మొదలైంది. పారిపోయేందుకు ప్రయతి్నంచిన వారిని నిలువరించేందుకు సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీంతో సోమవారం మొదలైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా సంభవించిన మరణాల సంఖ్య గురువారానికి 34కు పెరిగింది. 1,338 మందికి పైగా గాయాలపాలయ్యారు. భారత్‌లోకి ఖైదీల చొరబాటు యత్నం కల్లోల నేపాల్ నుంచి బయటపడే దురుద్దేశంతో ఇప్పటికే జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు కొందరు ఏకంగా దేశందాటి పారిపోయేందుకు విఫలయత్నంచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బయిర్‌గనియా చెక్‌పోస్ట్ సమీప ప్రాంతం గుండా భారత్‌లోకి చొరబడేందుకు యతి్నంచిన 13 మంది నేపాల్ ఖైదీలను భారత బలగాలైన సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) విజయవంతంగా అడ్డుకుంది. సరిహద్దు సమీపంలోని రౌతహాత్ జిల్లా కారాగార కేంద్రం నుంచి ఈ ఖైదీలు పారిపోయారని ఎస్ఎస్బీ గుర్తించింది. నిబంధనల ప్రకారం వారందరినీ నేపాల్ పోలీసులకు ఎస్ఎస్బీ సైనికులు అప్పగించారు. ఇప్పటిదాకా జైళ్ల నుంచి పారిపోయి సరిహద్దుదాకా చేరుకున్న దాదాపు 60 మంది నేపాలీ ఖైదీలు, ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని అదుపులోకి తీసుకుని నేపాల్ పోలీసులకు అప్పగించామని ఎస్ఎస్బీ అధికారి వెల్లడించారు. భారత్‌కు తూర్పున నేపాల్ వెంట 1,751 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు కాపలా, పర్యవేక్షణా బాధ్యతలను ఎస్ఎస్బీ చూసుకుంటోంది. పెట్రోల్ బంకుల వద్ద చాంతాడంత క్యూలైన్లు కర్ఫ్యూ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. సైన్యం రంగంలోకి దిగడంతో హింసాత్మక ఘటనలు సద్దుమణిగాయి. శనివారం ఉదయం ఆరు గంటలదాకా దేశవ్యాప్త కర్ఫ్యూ కొనసాగుతుందని సైన్యం ప్రకటించింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడింటిదాకా కర్ఫ్యూను సడలించారు. ఇప్పటికే కర్ఫ్యూ కారణంగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో బంకుల్లో పెట్రో నిల్వలు నిండుకున్నాయి. అయితే కాస్తంత పెట్రో నిల్వలు ఉన్న బంకుల వద్ద చాంతాడంత క్యూలైన్లు కనిపించాయి. కానీ జనం ముఖాల్లో భయంఛాయలు పోలేదు. పౌర ప్రభుత్వాన్ని త్వరగా కొలువుతీర్చాలని రచయితలు, విద్యావేత్తలు అధ్యక్షుడిని కోరుతూ లేఖలు రాశారు. అయితే సనాతన ధర్మా న్ని కాపాడాలంటే మళ్లీ రాచరిక వ్యవçస్థను పునరుద్ధరించాలని జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి డిమాండ్‌చేశారు. పూర్తిగా దగ్ధమైన సుప్రీంకోర్టు అవినీతి, వారసత్వ రాజకీయాలు, అసమర్థ పాలన, సోషల్‌మీడియాపై నిషేధం కారణాలతో కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహజ్వాలల్లో అధికార కేంద్రాలు కాలిపోయాయి. న్యాయవితరణ చేసే ధర్మాసనాలూ దగ్ధమయ్యాయి. సుప్రీంకోర్టు మసిబారింది. అయినాసరే ఆదివారం నుంచి కేసుల విచారణను మొదలెడతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ నిబద్ధతను చాటారు. ‘‘నేపాల్ న్యాయవ్యవస్థకు సంబంధించిన పత్రాలెన్నో బుగ్గిపాలయ్యాయి’’అని ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ మాన్ రౌత్ ఆవేదన వ్యక్తంచేశారు. బనేపా మున్సిపాలిటీలోని నయాబస్తీలో ఎనిమిది బాంబులను సైన్యం గుర్తించి జాగ్రత్తగా నిరీ్వర్యం చేసింది. జైళ్ల నుంచి పారిపోతూ ఖైదీలు ఎత్తుకెళ్లిన డజన్లకొద్దీ ఆయుధాలను సైన్యం తిరిగి స్వా«దీనంచేసుకుంది. మరోవైపు నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తిరుగుప్రయాణపర్వం మొదలైంది. పలు మార్గాల్లో పలు రాష్ట్రాల ప్రజలు వెనుతిరిగి వస్తున్నారు. -
నేపాల్ అల్లర్లు: జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారీ!
నేపాల్‌లో భారీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి రాజీనామాకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల కారణంగా దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నేపాల్ ఆర్మీ దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించింది. అనంతరం కర్ఫ్యూ ప్రకటించింది.ఆందోళనలను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. ఈ క్రమంలో దేశంలోని ఆయా జైళ్ల నుంచి దాదాపు ఏడు వేల మంది ఖైదీలు పరారైనట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నౌబస్తాలో జువెనైల్ హోంలో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు బాలలు మృతి చెందారు. భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను లాక్కోవడంతో పాటు.. జైలు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో సిబ్బంది జరిపిన కాల్పుల్లో వారు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.జైళ్లలో నిప్పుపెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దేశవ్యాప్తంగా ఆయా జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ బజార్ జైలు నుంచి 1,100 మంది, చిత్వన్-700, నక్కు-1,200, సున్సారి జిల్లా జుంప్కా జైలు-1,575.. కంచన్‌పూర్-450, కైలాలి-612, జలేశ్వర్-576, కాస్కి-773, డాంగ్-124, జుమ్లా-36, సొలుఖుంబు-86, గౌర్-260, బజ్హాంగ్ జైలు నుంచి 65 తప్పించుకున్నారు.కాగా, సోషల్ మీడియా యాప్‌లపై నిషేధంతో పాటు విద్యార్థులు, యువత సోమవారం మొదలెట్టిన ఆందోళనలు మెరుపు వేగంతో నేపాల్‌ను చుట్టేసి దేశాన్ని సంక్షోభ కుంపట్లోకి నెట్టేశాయి. సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరిస్తున్నామని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది గంటల్లోనే స్పష్టం చేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. రాజధాని కాఠ్మండు మొదలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత తమ నిరసనజ్వాలలను మరింతగా ఎగదోస్తూ ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. -
‘రాజ్యాంగాన్ని తిరగ రాస్తేనే శాంతిస్తాం’.. నేపాల్ యువత డిమాండ్లు ఇవిగో!
నేపాల్‌లో యువత(Gen Z) చేపట్టిన ఆందోళనలు దేశ రాజకీయాలను శాసించాయి. నిరసనలు హింసాత్మక మలుపు తిరగడం, ఆర్మీ రంగంలోకి దిగినా పరిస్థితి అదుపు రాకపోవడం, పైపెచ్చు నేతలు.. వాళ్ల ఆస్తులపై దాడులతో పరిస్థితి మరింత విషమించింది. ఈ దెబ్బకు.. కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. రాజకీయ సంక్షోభం దరిమిలా నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. విధ్వంసాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ జాతిని ఉద్దేశిస్తూ గత అర్ధరాత్రి ప్రసంగించారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలే మార్గమని అన్నారాయన. అదే సమయంలో విధ్వంసం, దాడులు, దోపిడీ వంటి చర్యలు కొనసాగితే.. ఆర్మీ కఠినంగా స్పందిస్తుంది అని ప్రకటించారు. ఆర్మీ ఇప్పటికే కీలక ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకుంది. ట్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం, సింగదుర్బార్, పార్లమెంట్ భవనం వంటి ప్రదేశాల్లో సైనికులు మోహరించారు. గత రాత్రి 10 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. అయితే.. ఇది కేవలం సోషల్ మీడియా నిషేధంపై స్పందన కాదని యువత అంటోంది. గత మూడు దశాబ్దాలుగా రాజకీయ నాయకులు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపించాలని అంటోంది. అలాగే.. రాజ్యాంగాన్ని తిరగరాసి పాలనలో విస్తృత సంస్కరణలు చేపట్టాలని అంటోంది. ఈ క్రమంలో.. ఉద్యమ నిర్వాహకులు తమ కీలక డిమాండ్లు ప్రకటించారు. అందులో.. • నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించడం• వారి కుటుంబాలకు రాష్ట్ర గౌరవం, గుర్తింపు & ఆర్థిక సహాయం అందించడం• నిరుద్యోగం, వలస, సామాజిక అన్యాయంపై ప్రత్యేక కార్యక్రమాలు• కొత్త రాజకీయ వ్యవస్థ స్థాపనకు పిలుపుఈ ఉద్యమం ఏ పార్టీకి లేదంటో వ్యక్తికి చెందింది కాదు. ఇది ఒక తరం కోసం.. దేశ భవిష్యత్తు కోసమే అని పేర్కొంది. శాంతి అవసరమే అని, కానీ, అది కొత్త రాజకీయ వ్యవస్థ పునాది మీదే సాధ్యమవుతుంది అని పేర్కొంది. Gen Z ఉద్యమం.. టైమ్‌లైన్4 సెప్టెంబర్ 2025నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధించింది (Facebook, YouTube, Instagram, X, Reddit, Snapchat).కారణం: కంపెనీలు స్థానికంగా నమోదు చేయకపోవడం, గ్రీవెన్స్ హ్యాండ్లర్ నియామకం చేయకపోవడం.8 సెప్టెంబర్ 2025Gen Z యువత పెద్ద ఎత్తున మైతీఘర్ మండల, న్యూ బనేశ్వర్ ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.పార్లమెంట్ ఆక్రమణ ప్రయత్నం, తీగాస్, వాటర్ కేనన్, రబ్బరు బుల్లెట్లుతో పోలీసుల స్పందన.19 మంది మరణం, 300 మందికి పైగా గాయాలు.సాయంత్రం: ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని వెనక్కి తీసుకుంది.హోం మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా.కర్ఫ్యూ: కాఠ్మాండూ, పోఖరా, బిర్గంజ్, బుట్వాల్, భైరహవా, ఇటహరి, దమక్.9 సెప్టెంబర్ 2025ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది, నిషేధం ఎత్తివేసినప్పటికీ నిరసనలు కొనసాగాయి.ప్రధానమంత్రి కెపీ శర్మ ఓలి రాజీనామా చేసి శివపురి ఆర్మీ క్యాంప్‌లో ఆశ్రయం పొందారు.పార్లమెంట్, సింగదుర్బార్, సుప్రీం కోర్ట్, సీతల్ నివాస్, బాలువటార్ వంటి ప్రభుత్వ భవనాలు దాడికి గురయ్యాయి.ఉమ్మెద్ పార్టీ, నెపాలి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాలు ధ్వంసం.నెపాల్ ఆర్మీ: త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంను నియంత్రణలోకి తీసుకుంది, విమాన సేవలు నిలిపివేత.10 సెప్టెంబర్ 2025అలర్లు కొనసాగుతున్నాయి, ప్రజల భద్రత కోసం ఆర్మీ చర్యలు.అధికారికంగా 23 మంది మరణించారు, ఇందులో 3 పోలీసు అధికారులు, ఝలానాథ్ ఖనాల్ భార్య కూడా ఉన్నారు.347 మంది గాయపడినట్లు అధికారిక సమాచారం, 422+ అనధికారిక గణాంకం.నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ (Ram Chandra Poudel), ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో జనరేషన్ జెడ్ ఉద్యమ నిర్వాహకులు చర్చలు జరపాల్సి ఉంది. నేపాల్‌కు స్వాతంత్ర దినోత్సవమంటూ ప్రత్యేకంగా లేదు. ఎందుకంటే.. అది ఏ దేశపు పాలన కింద లేదు. కానీ 1923 డిసెంబర్ 21న నేపాల్-బ్రిటన్ మధ్య Singha Durbar Treaty కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా నేపాల్ స్వతంత్ర దేశంగా బ్రిటన్ అధికారికంగా గుర్తించింది. అయితే.. రాణా పాలన ముగిసిన ఫిబ్రవరి 18వ తేదీని ప్రజాస్వామ్య దినోత్సవం (Democracy Day)గా, రాచరికం ముగిసి ప్రజాస్వామ్యం ఏర్పడిన తేదీ మే 28వ తేదీని గణతంత్ర దినోత్సవం (Republic Day)గా నిర్వహిస్తోంది. దఫదఫాలుగా రాజ్యాంగం..1948లో గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాక్ట్ ద్వారా తొలి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటి రాణా, రాజకీయ సంస్కరణలకు నిరాకరించడంతో అది నామమాత్రంగానే ఉండిపోయింది. ఆ తర్వాత.. రాజు త్రిభువన్ బిర్ బిక్రమ్ షా 1951లో ఇంటీరియమ్ గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి మార్గం వేసింది. 1990లో ప్రజా ఉద్యమం తర్వాత.. కానిస్టిట్యూషనల్ మోనార్చీ అనేది బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థకు మార్గం వేసింది. 2007లో ఇంటీరియమ్ కానిస్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ అనేది రాచరికాన్ని పూర్తిగా తొలగించి.. ప్రజాస్వామ్య పునాది వేసింది. ఇది 2008లో రాజ్యాంగ సభ మొదలైన తర్వాత పూర్తిగా అమలులోకి వచ్చింది. అటుపై 2015 సెప్టెంబర్ 20న పూర్తిస్థాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది నేపాల్‌ను ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌గా ప్రకటించింది. నేపాల్ రాజ్యాంగం అనేది ఒక తరం పోరాటం ఫలితం. ఇది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, దేశ భవిష్యత్తుకు పునాది రాయిగా ఉండాలని అంతా భావించారు. సోషల్ మీడియా బ్యాన్ నేపథ్యంలోనే నేపాల్ యువత ఆందోళనలు మొదలైనట్లు కనిపించినప్పటికీ.. రాజకీయ వారసత్వం, అవినీతిపైనే వాళ్ల పోరాటం సాగింది. ఈ నేపథ్యంలో నేపాల్ రాజ్యాంగం రాజకీయ నేతలకు అనుగుణంగా ఉందనేది ఇప్పుడున్న యువత అభిప్రాయం. అందుకే రేపటి తరం ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగంలో సమూల మార్పు కోరుకుంటోంది. -
ఆగ్రహ జ్వాలలు
కాఠ్మండు/న్యూఢిల్లీ: సోషల్ మీడియా యాప్‌లపై నిషేధంతోపాటు విద్యార్థులు, యువత సోమవారం మొదలెట్టిన ఆందోళనలు మెరుపువేగంతో నేపాల్‌ను చుట్టేసి దేశాన్ని సంక్షోభ కుంపట్లోకి నెట్టేశాయి. సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరిస్తున్నామని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది గంటల్లోనే స్పష్టంచేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. రాజధాని కాఠ్మండు మొదలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత తమ నిరసనజ్వాలలను మరింతగా ఎగదోస్తూ ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. మంగళవారం ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగాయి. కాళీమతిలో పోలీస్సర్కిల్కు నిప్పుపెట్టి అధికారులపై దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.దీంతో ఇద్దరు చనిపోయారు. దీంతో కాల్పులు, పరస్పర ఘర్షణ ఘటనల్లో మరణాల సంఖ్య మంగళవారానికి 22కు పెరిగింది. 300 మందికిపైగా గాయపడ్డారు. కట్టలు తెంచుకున్న యువాగ్రహాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం తన పదవికి రాజీనామాచేశారు. భద్రంగా ఇంటి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను బతిమాలుకున్నట్లు వార్తలొచ్చాయి.ఆందోళనకారుల నిరసన కార్యక్రమం అదుపుతప్పి మాజీ ప్రధానమంత్రి, తాజా మంత్రులపై భౌతికదాడులదాకా వెళ్లింది. ప్రధాని ఓలీకి చెందిన భక్తపూర్‌లోని బాల్కోట్ నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రకార్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను సమీప కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా ఆస్తుల విధ్వంసం, వినాశనంతో నేపాల్ నిలువెల్లా రక్తమోడింది. దుకాణాల లూటీలు, పౌరుల భయాందోళనల నడుమ ప్రధాని రాజీనామాతో ఎట్టకేలకు సైన్యం పూర్తస్థాయిలో రంగంలోకి దిగి శాంతభద్రతల పరిరక్షణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకుని ప్రజల ఆస్తులను ధ్వంసంచేస్తూ లూటీలకు తెగించిన వాళ్ల అంతుచూస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, రాజకీయ వారసత్వం, సంపన్న, ఉన్నతస్థాయి వర్గాల ఆధిప్యంపై ఇప్పటికే విసిగిపోయిన యువత తాజాగా సామాజికమాధ్యమాలపై హఠాత్తుక నిషేధం విధించడంతో వాళ్లలో ఆగ్రహం పెల్లుబికి మహోద్యమంగా మారడంతో దేశ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. పెల్లుబికిన ఆగ్రహం పరిస్థితిని మరింతగా కట్టుతప్పొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. అయినాసరే వేలాదిమంది విద్యార్థులు, యువత ‘జెన్ జెడ్’కూటమిగా ఏర్పడి రాజధాని కాఠ్మండు మొదలు పట్టణాలదాకా విధ్వంసానికి తెగించారు. మాజీ ప్రధానమంత్రులు మొదలు తాజా కేబినెట్ మంత్రులు, కీలక నేతల దాకా ముఖ్యమైన వ్యక్తుల ఇళ్లకు నిప్పంటించారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలనూ ధ్వంసంచేశారు. కనిపించిన ప్రతి ఒక్క రాజకీయ నేతను చితకబాదారు. దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్(ప్రచండ), ప్రస్తుత కమ్యూనికేషన్స్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోం మంత్రి రమేశ్ లఖ్హార్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాల ఇళ్లను నాశనంచేశారు. ఆందోళనలు కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ తాకాయి. దీంతో ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దుచేసి ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. ఎటుచూసినా విధ్వంసమే ఆందోళనలను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పార్టీల హెడ్‌ఆఫీస్‌లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా ప్రతి దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల ఆగ్రహజ్వాలల బారినపడ్డాయి. డల్లూ ఏరియాలోని మాజీ ప్రదాని ఝలానాథ్ నివాసానికి నిప్పుపెట్టారు. కపన్ ప్రాంతంలోని నేపాలీ కాంగ్రెస్ నేత ఇంటిని తగులబెట్టారు.సింఘదర్బార్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం భవనానికీ నిప్పుపెట్టారు. మహరాజ్‌గంజ్‌లోని అధ్యక్షకార్యాలయం, బలూవతార్‌లో ప్రధాని అధికారి నివాసం సైతం నిప్పురవ్వల వర్షంలో కాలిపోయాయి. టిన్కునేలో కాంతిపూర్ టెలివిజన్ ఆఫీస్‌ను ధ్వంసంచేశారు. బుద్ధనీలకంఠ ప్రాంతంలోని మాజీ ప్రధాని షేర్‌బహదూర్ దేవ్బా ఇంట్లో చొరబడి దేవ్బా, భార్య అర్జూ రాణాలను రక్తంకారేలా కొట్టారు. దీంతో ప్రాణభయంతో ఆయన పచ్చికబయళ్లకు పరుగులుపెట్టారు. విషయం తెల్సుకుని సైన్యం రంగంలోకి దిగి ఆయనను నిరసనకారుల బారినుంచి కాపాడింది.దేవ్బా కుమారుడు జైబీర్‌కు చెందిన కాఠ్మండులో హిల్టన్ ఐదునక్షత్రాల హోటల్‌కు, అర్జూకు చెందిన ఖుమల్తార్లోని ఉలెన్స్ పాఠశాలకు, తోఖాలో మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ ఇంటికి నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌదెల్ను వీధిలో పరుగెత్తించిమరీ చితక్కొట్టారు. వెనక నుంచి ఆయన్ను ఒకతను వీపుమీద ఎగిరి తన్నుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గోశాల, లూభూ, కాళీమతి పోలీస్పోస్ట్లకూ నిరసనకారులు నిప్పుపెట్టారు. కలాంకీ, కాళీమతి, తహచల్, బనేశ్వర్, నైకాప్, ఛియాసల్, ఛపగావ్, థేచో ఇలా ప్రతి ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించారు.టైర్లు తగలబెట్టి రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యాలయ భవనం ఎక్కి పార్టీ జెండాను చింపేశారు. పోఖ్రా పట్టణంలో ఆందోళనకారులు కారాగారం గోడలు బద్దలుకొట్టారు. దీంతో జైలులోని 900 మంది ఖైదీలు బయటకు పరుగులుతీశారు. కాఠ్మండూలోని నఖూ జైలుకూ ఇదే గతి పట్టింది. దీంతో ఇక్కడి ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో మాజీ హోం మంత్రి రవి లమీచ్ఛానే సైతం ఉన్నారు. ఇదే అదనుగా కొన్ని అల్లరిమూకలు దుకాణాలను లూటీ చేశాయి. దిగిపోవాలని డిమాండ్ చేసి దింపేశారుమంగళవారం ఉదయం ప్రధాని కేపీ శర్మ ఓలీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన వందలాది మంది ఆందోళనకారులు తర్వాత లోపలికి చొరబడి శర్మను వెంటనే గద్దె దిగాలని మొండిపట్టుపట్టారు. ‘‘కేపీ దొంగ, దేశాన్ని వీడిపో’’అంటూ పెద్దగా నినాదాలు చేశారు. తప్పని పరిస్థితుల్లో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు రాంచంద్రకు లేఖ రాశారు. ‘‘నేపాల్ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిస్థితి కుదుటపడేందుకు రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా తగు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నా’’అని 73 ఏళ్ల సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్కిస్ట్–లెనినిస్ట్) నేత శర్మ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.వెంటనే రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు. అయితే నూతన మంత్రివర్గం ఏర్పడేదాకా ఆయనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారని దేశాధ్యక్షుడు చెప్పారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అండతో గత ఏడాది జూలైలో శర్మ నాలుగోసారి ప్రధాని పదవిని చేపట్టడం తెల్సిందే. శర్మ దిగిపోవాలని నేపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి గగన్ థాపా సైతం అంతకుముందే డిమాండ్‌చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగించే శర్మీ తరచూ భారతవ్యతిరేక విధానాలను అవలంభించే నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత షెడ్యూల్ ప్రకారం ఈనెలలోనే భారత్‌లో పర్యటించాల్సి ఉండగా ఆలోపే పదవీసన్యాసం చేశారు. అయితే శర్మ దేశాన్ని వీడి దుబాయ్‌కు వెళ్లనున్నారని, ఆయన కోసం రన్‌వే మీద హిమాలయ ఎయిర్‌లైన్స్ విమానాన్ని సిద్ధంగా ఉంచారని వార్తలొచ్చాయి. అగ్నికి ఆహుతవుతున్న ప్రధాని ఇల్లు బాణసంచా కాల్చి.. పారిపోకుండా ఆపి.. నేపాల్ నుంచి పారిపోయేందుకు నేతలకు హెలికాప్టర్ సేవలను అందిస్తోందన్న పుకార్లతో సిమ్రిక్ ఎయిర్‌లైన్స్ భవంతిని ఆందోళనకారులు తగలబెట్టారు. భైసేపతి మంత్రుల క్వార్టర్స్ నుంచి మంత్రులు విదేశాలకు హెలికాప్టర్లలో పారిపోతున్నారన్న వార్తలతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ రన్‌వేల సమీపంలో బాణసంచా, రాకెట్లు కాల్చారు. దీంతో ఆకాశంలో పొగచూరింది. డ్రోన్లు ఎగరేసి, పౌర లేజర్‌లైట్లు రన్‌వే వైపు ప్రసరింపజేసి విమాన రాకపోకలను అడ్డుకోవాలని ప్రజలకు ఆందోళనకారులు సోషల్‌మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అయితే అప్పటికే కొన్ని హెలికాప్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయని వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు, వీవీఐపీలు ఆర్మీ బ్యారెక్‌లలో తలదాచుకున్నారు. పార్లమెంట్‌ను రద్దుచేయండి: బాలెన్ షా యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న కాఠ్మండు నగర మేయర్, 35 ఏళ్ల బాలేంద్ర షా మాత్రం వెంటనే పార్లమెంట్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ‘‘నిరసనకారులు శాంతించాలి. విద్యార్థి బృందాలు తక్షణం ఆర్మీ చీఫ్‌తో చర్చలకు సంసిద్ధమవ్వాలి. అంతకుముందే పార్లమెంట్‌ను రద్దుచేయాలి’’అని అన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, తాము ఎంపీలుగా రాజీనామా చేస్తామని రా్రïÙ్టయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ప్రకటించారు. ఉద్యమానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. తాను సైతం రాజీనామా చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ చెప్పారు. చర్చించుకుందాం.. రండి ఆందోళనను విడనాటి చర్చలకు రావాలని జెన్ జెడ్ విద్యార్థి, యువలోకానికి దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్ పిలుపునిచ్చారు. శాంతి, సుస్థిరతకు అందరం పాటుపడుతున్నామంటూ నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్‌రాజ్ సిగ్దెల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నారాయణ్ ఆర్యల్, హోం సెక్రటరీ గోకర్ణ దవాదీ, సాయుధ పోలీసు బలగాల చీఫ్ రాజు ఆర్యల్, ఐజీ చంద్ర కుబేర్, జాతీయ దర్యాప్తు విభాగ సారథి హుత్రాజ్ థాపా సంతకాలు చేసి ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశారు.అయితే 26 సోషల్‌మీడియా సైట్ల పునరుద్దరణతోపాటు వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా రాజకీయనేతలకూ రిటైర్మెంట్ వయసును ప్రకటించాలని పలు డిమాండ్లను యువత ప్రభుత్వం ముందుంచింది. మంత్రులు, ఉన్నతవర్గాల కుటుంబాలే సకల సౌకర్యాలను పొందుతున్నాయని ఉద్యమకారులు సోషల్‌మీడియాలో ప్రచారాన్ని మొదలెట్టారు. పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వం, ఆర్మీ దేశంలో మళ్లీ శాంతిని నెలకొల్పాలని నేపాల్‌లోని ఆ్రస్టేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, బ్రిటన్, అమెరికా రాయబార కార్యాలయాలు సంయుక్త ప్రకటనలో అభ్యర్థించాయి. ఉద్యమాలు శాంతియుతంగా సాగాలని హింసాత్మక పథం పనికిరాదని ఐక్యరాజ్య సమితి సైతం హితవు పలికింది. -
ఏపీలో కదం తొక్కిన రైతులు (ఫొటోలు)
-
బాబు సర్కార్‌కు ఆటో కార్మికుల హెచ్చరిక.. కార్యాచరణ ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 8న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు.. ప్రచార జాతాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున భారీ నిరసన చేపట్టనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో, క్యాబ్, టాటా మ్యాజిక్ డ్రైవర్లు తరలిరానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. స్త్రీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు వాహన మిత్ర కింద రూ.30 వేలు ఇవ్వాలని.. లేనిపక్షంలో బంద్ చేపడతామని హెచ్చరించారు. -
బందీల విడుదలకు ఒప్పందం చేసుకోండి
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గాజాపై సైనిక చర్యకు ప్రణాళికలు వేస్తుండగా.. ఇజ్రాయేలీలు నిరసన బాట పట్టారు. గాజాపై యుద్ధం ముగించాలని, బం«దీలను విడుదల చేయడానికి హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ర్యాలీలను నిర్వహించారు. జెరూసలేం, టెల్ అవీవ్‌లను కలిపే ప్రధాన రహదారిని ప్రదర్శనకారులు దిగ్బంధించారు. ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో వేలాది మంది ఇజ్రాయెలీలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీల్లో ఇజ్రాయెల్ జెండాలను ఊపుతూ, బందీల ఫొటోలను ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. కొమ్ము బూరలు ఊది, డ్రమ్స్ మోగించి నిరసన తెలిపారు. ప్రధాన రహదారులను దిగ్బంధించారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు 38 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్ నటి గాల్ గాడోట్ కూడా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బందీల కుటుంబాలను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీకి ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ హాజరై ప్రదర్శనకారులకు తన సంఘీభావాన్ని తెలిపారు. ‘దేశాన్ని బలోపేతం చేసే ఏకైక విషయం. అద్భుతమైన స్ఫూర్తితో ప్రజలు బయటకు అడుగు పెట్టారు’అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. బందీల కుటుంబాలు నిర్వహించిన ఈ సమ్మెకు వ్యాపార సంస్థలు సైతం మద్దతు ఇచ్చాయి. సిబ్బందిని నిరసనల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా మూసేశారు. వేసవి సెలవుల కారణంగా పాఠశాలలపై ఎలాంటి ప్రభావం పడలేదు. యెమెన్ క్షిపణి ప్రయోగిస్తుందని వైమానిక దాడి సైరన్లు హెచ్చరించడంతో స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రదర్శనలు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే.. హమాస్ లొంగిపోకుండా యుద్ధాన్ని ముగించాలనే పిలుపు ఆ గ్రూపును బలోపేతం చేస్తుందని ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇది బందీల విడుదల మరింత ఆలస్యం చేస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన గాజా నగరాన్ని సైన్యం స్వా«దీనం చేసుకునే ప్రణాళికలను పునరుద్ఘాటించారు. ఈ చర్యను ఇజ్రాయెలీలు, ముఖ్యంగా బందీల కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది బతికి ఉన్న బందీల ప్రాణాలకు ముప్పని భయపడుతున్నారు. -
21న అంగన్వాడీల నిరసనలు
సాక్షి, అమరావతి: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్ట్ 21న రాష్ట్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులు, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని మూడు యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఏపీ అంగన్వాడీ వర్క్‌ర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ), ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ), ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుబ్బరావమ్మ, లలితమ్మ, వీఆర్ జ్యోతి సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 21న దేశ వ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని అఖిల భారత అంగన్వాడీ యూనియన్ నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ఏపీలో చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు పిలుపునిచ్చారు. -
టీడీపీ గూండాల దాడిపై రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన నిరసన
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లా పులివెందులలో టీడీపీ గూండాలు ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ మీద దాడిచేయడాన్ని ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు పెల్లుబికాయి. జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో వేలాదిగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శనలు చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలిచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ నాయకుడు రమేష్ యాదవ్‌పై దాడిచేసిన వారిని అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలుగుదేశం వర్గీయులు ఈ దాడులకు తెగబడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేమని అడ్డదారుల్లో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏడాదన్నరగా కూటమి పాలనలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతూ, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని మండిపడ్డారు. రెడ్‌బుక్ పాలన అమలు చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు చూసి జ్యోతిరావ్ పూలే ఆత్మ క్షోభిస్తోందన్నారు. అధికారం ఉంది కదా అని బీసీలపై దౌర్జన్యానికి, దాడులకు పూనుకుంటే చూస్తూ సహించబోమన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేశ్ చెప్పినట్లు చేస్తూ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. శాంతియుతంగా నిరసన గుంటూరు హిందూ కాలేజీ కూడలి, తిరుపతి బాలాజీ కాలనీ, అనంతపురం జెడ్పీ కార్యాలయం, నెల్లూరు మినీ బైపాస్‌రోడ్డు, కర్నూలులోని బిర్లా సర్కిల్, నంద్యాలలోని పద్మావతినగర్ ఆర్చి, కాకినాడ, ఏలూరు, అనకాపల్లిల్లో జ్యోతిరావ్ పూలే విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల జ్యోతిరావ్ పూలే విగ్రహానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశంచౌక్ సెంటర్లో జ్యోతిరావ్ పూలే చిత్రపటంతో ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కాకినాడ జిల్లా ఏలేశ్వరం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిరసన ప్రదర్శనలు చేశారు. -
ఐదోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. విపక్ష సభ్యు లు ఆందోళనలు, నిరసనలు, నినాదాల కారణంగా వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం ఉభయ సభలు స్తంభించాయి. పలుమార్లు వాయిదా పడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై పార్లమెంట్లో వెంటనే చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశాయి. నినాదాలతో హోరెత్తించాయి. ప్రతిపక్షాల ఆగ్రహావేశాల వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో లోక్‌సభ, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తుతన్నట్లు సభాపతులు ప్రకటించారు. చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ జరగకుండానే వర్షాకాల సమావేశాల్లో తొలివారం ముగిసిపోవడం గమనార్హం. లోక్‌సభలో నినాదాల హోరు లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీనిపై చర్చకు విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. చేసేది లేక స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షాలు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఇప్పడే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. వారిపై జగదాంబికా పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సి సభలో ఈ అలజడి ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అన్నారు. సభ వాయిదా పడేలా చేయడం గొప్ప విషయం కాదని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోతే దేశమే నష్టపోతుందని చెప్పారు. చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. గోవాలో ఎస్టీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుపై చర్చిద్దామని న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెప్పారు. అయినా విపక్షాల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జగదాంబికా పాల్ ప్రకటించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ నేపథ్యంలో కార్గిల్ అమర వీరులకు లోక్‌సభలో నివాళులర్పించారు. ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ పార్లమెంట్ ఎగువ సభలోనూ విపక్షాల ఆందోళన యథాతథంగా కొనసాగింది. వివిధ అంశాలపై రూల్ 267 కింద చర్చను కోరుతూ విపక్షాలు ఇచ్చిన 28 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. దీనిపై సభలో తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ మొదలైన వెంటనే నినాదాలు మిన్నంటడడంతో రఘువంశ్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌పై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా కేకలు వేశారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను ఆపాలని డిమాండ్ చేశారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ అంటూ నినదించారు. కొందరు ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్లిపోవాలని, సభకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ ఘన్‌శ్యామ్ తివారీ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘన్‌శ్యామ్ తివారీ ప్రకటించారు. కమల్ హాసన్ ప్రమాణం ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌పీ) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డీఎంకే నాయకులు రాజాత్తి, ఎస్.ఆర్.శివలింగం, పి.విల్సన్ సైతం ఎగువ సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. విపక్షాల నిరసన బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పా ర్లమెంట్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. మకరద్వారం మెట్లపై వినూ త్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ అని రాసి ఉ న్న పత్రాలను చించివేసి, చెత్తకుండీలో విసి రేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఎస్ఐఆర్పై పార్లమెంట్లో చర్చించాలని తేల్చిచెప్పారు. సభకు సహకరించడానికి విపక్షాల అంగీకారం నిరసనలు, నినాదాలు పక్కనపెట్టి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇకపై సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం అన్ని పార్టీల సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరగా, ప్రతిపక్ష నాయకులు అందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి నిర్మాణాత్మక చర్చలు సాగిద్దామని స్పీకర్ సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది. -
పట్టువీడని ప్రతిపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో వరుసగా మూడో రోజు బుధవారం సైతం విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు కొనసాగాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఢిల్లీలో మురికివాడల కూల్చివేత, బెంగాలీ వలస కారి్మకుల పట్ల వివక్ష వంటి అంశాలపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సభకు సహకరించాలని కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. వారిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సభలో ఎంపీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల ఆకాంక్షలను వెల్లడించాలి. ఇలా నిరసనలతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదు. ఇది పార్లమెంటరీ విధానం కాదు. ఎంపీల ప్రవర్తనను దేశమొత్తం గమనిస్తోంది. సభా మర్యాదను కాపాడండి. వీధుల్లో చేయాల్సిన ప్రదర్శనలు సభలో చేస్తున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించే సభ్యులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే తీరు రాజ్యసభలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సహా పలు కీలక అంశాలపై చర్చకు ఇచి్చన వాయిదా తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని కోరినా విపక్షాలు వినిపించుకోలేదు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాలు చేపట్టినా విపక్షాల ఆందోళన, నిరసనలతో 2 గంటల వరకు, తర్వాత గురువారానికి వాయిదా పడింది. నల్ల దుస్తులతో నిరసన తమ డిమాండ్లపై పార్లమెంట్లో చర్చ చేపట్టాల్సిందేనని తేల్చిచెబుతూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ సహా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), జేఎంఎం, ఆర్జేడీ, వామపక్ష పారీ్టల ఎంపీలు పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి‘, ‘ఓటు బందీని ఆపండి‘ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చాలామంది ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఆపరేషన్ సిందూర్‌పై 28న ప్రత్యేక చర్చ ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంట్లో ప్రత్యేక చర్చకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న లోక్‌సభలో, 29న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువ సభలో ఈ అంశంపై 16 గంటలపాటు చర్చ జరపడానికి ఈ నెల 21న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం జరిగిన రాజ్యసభ బీఏసీ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలో భారత సైన్యం దాదాపు ఆరు యుద్ధ విమానాలు కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు బహిర్గతం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో తొలుత లోక్‌సభలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, ఆ తర్వాత రాజ్యసభలో చర్చ ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. బుధవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన మోదీ ఈనెల 28వ తేదీ కల్లా స్వదేశానికి తిరిగివస్తారు. -
ఇరాన్ జెండాలతో వైట్‌హౌజ్ ఆవరణలో ప్రదర్శనలు
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ.. అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా ప్రధాన నగరాల్లో ఇరాన్ మద్దతు ప్రదర్శనలు జరుగుతుండడం తీవ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోనే ట్రంప్ వ్యతిరేక నినాదాలతో ఓ ప్రదర్శన జరగడం గమనార్హం. ఇరాన్‌పై యుద్ధం వద్దు.. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం ఆపండి.. గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే అంటూ అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి పలువురు నినాదాలు చేశారు. మరికొందరు ఇరాన్‌కు మద్దతుగా పాటలు పాడుతూ తమ నిరసన గళం విప్పారు. ప్రస్తుతం యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అమెరికా ప్రధాన నగరాలు మారుమ్రోగుతున్నాయి.బోస్టన్, చికాగోతో పాటు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్ స్లోగన్లు ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ కొందరు ఈ ప్రదర్శనలు చేపట్టారు. వైట్‌హౌజ్ వద్ద జరిగిన నిరసనల్లో పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దంటూ నినాదాలు చేశారు.HAPPENING NOW 🚨: Anti-war protest in Boston following US strikes in Iran. pic.twitter.com/LRP6wELFtB— Ron Smith (@Ronxyz00) June 22, 2025ఇరాన్‌పై అమెరికా యుద్ధ విమానాలు దాడులు జరిపి.. తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో కేవలం 25 నిమిషాల్లోనే ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను (ఫోర్దో, ఇస్ఫాహాన్, నటాంజ్) దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో.. యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. మరోవైపు.. నిరసనల నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు నిరసనకారుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.Happening now: Anti-war protesters have started to rally in front of the White House, calling for no war with Iran and an end to U.S. support to Israel. pic.twitter.com/mmenVH1wOG— BreakThrough News (@BTnewsroom) June 18, 2025అయితే అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టమే వాటిల్లిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ యుద్ధంలో జోక్యంతో అమెరికా ఘోర తప్పిదం చేసిందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమనీ మండిపడగా.. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో తాము చేపట్టిన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగబోదని.. దాడుల్లో తాము లక్ష్యానికి చేరువైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తాజాగా ఓ ప్రకటన చేశారు. వెల్లడించారు.ఇరాన్‌పై అమెరికా బాంబు దాడుల చేసిన తర్వాత.. యుద్ధాన్ని ఆపేది అప్పుడే: నెతన్యాహుఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా (USA) తీవ్రంగా ధ్వంసం చేసింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్‌ను వెనక్కి నెట్టాం. ముప్పును తొలగించుకున్నాం. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం. మా టార్గెట్‌ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే. అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది. ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. ఇందులో ప్రధానంగా మా అస్థిత్వానికి పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం. ఒకటి అణ్వాయుధాలు.. రెండు బాలిస్టిక్ క్షిపణులు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేం ఒక్కో అడుగు వేస్తూ ముందుకుసాగుతున్నాం. వాటికి మేం చేరువయ్యాం. టెహ్రాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోం. అయితే, అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదు. ఐరాస స్పందన.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అందులో ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ మాట్లాడుతూ.. ‘‘అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్ చేసి.. నెతన్యాహు అగ్రరాజ్యాన్ని ఈ యుద్ధంలోకి లాగారు. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోనుంది. దౌత్యాన్ని నాశనం చేయడానికి అగ్రరాజ్యం కంకణం కట్టుకుంది. దీనికి సరైన సమయంలో దీటుగా బదులిస్తాం’’ అని హెచ్చరించారు.ఖమేనీ ఏమన్నారంటే.. యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు. తీవ్ర నేరానికి పాల్పడ్డారు. దీనికి శిక్ష తప్పదు. తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది అని అమెరికా పేరును ప్రస్తావించకుండానే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఏమన్నారంటే.. తాజా దాడులకు అగ్రరాజ్యం మూల్యం చెల్లించుకోవాల్సిందే. అమెరికాకు దీటుగా బదులిస్తాం అని అన్నారు. -
హోరెత్తిన నో కింగ్స్
ఫిలడెల్ఫియా: ట్రంప్ సర్కారు వలస వ్యతిరేక చర్యలపై అమెరికావ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలు క్రమంగా దేశమంతటికీ విస్తరిస్తున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా వందలాది చోట్ల నిరసన కార్యక్రమాల్లో లక్షలాదిగా ప్రజలు పాల్గొన్నారు. న్యూయార్క్, టెక్సాస్, మిసిసిపి, పోర్ట్లాండ్, మిన్నెసొటా, నార్త్ కరొలినా తదితర ప్రాంతాలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి.వీధులు, పార్కు లు, ప్లాజాలు... ఇలా అన్ని చోట్లా జనం నిరసనలకు దిగారు. ట్రంప్ నియంతృత్వ పోకడలను దుయ్యబట్టారు. ‘నో కింగ్స్ (నియంతృత్వం వద్దు)’ అంటూ నినదించారు. ప్రజాస్వామ్యా న్ని, వలసదారుల హక్కు లను కాపాడుకుంటామని ప్రతినబూనారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఆందోళనలు ఆగబోవని ‘నో కింగ్స్ కోయెలిషన్’ నిర్వాహకులు తెలిపారు. ప్రజలు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని రాష్ట్రాల గవర్నర్లు కోరారు. పలు ప్రాంతాల్లో నేషనల్ గార్డులను మోహరించారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారుల దాడులకు నిరసన్ఛఠి వారం క్రితం లాస్ఏంజెలెస్లో మొదలైన నిరసనలు హింసాత్మక రూపం దాల్చడం తెల్సిందే.రగడ, ఉద్రిక్తతలుశనివారం లాస్ఏంజెలెస్లో ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పోర్ట్‌ల్యాండ్‌లో ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉటాహ్‌లోని సాల్ట్‌లేక్ సిటీలో ర్యాలీలో కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. వర్జీనియాలో నిరసనకారులపై వాహనం నడిపి ఒకరిని గాయపరిచిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆర్మీ డే, ట్రంప్ బర్త్ డే!అమెరికా ఆందోళనలతో అట్టుకుతుంటే ట్రంప్ మాత్రం ఆర్మీ 250వ అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్నారు. శనివారం ఆయన 79వ పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఏకంగా 4.5 కోట్ల డాలర్ల వ్యయంతో వాషింగ్టన్లో అట్టహాసంగా జరిగిన సైనిక పరేడ్‌లో భార్య మెలానియాతో కలిసి ఆయన పాల్గొన్నా రు. ఉక్రెయిన్‌కు అందజేసిన అత్యాధునిక సైనిక సంపత్తిని ఈ సందర్భంగా ప్రదర్శించారు. పరేడ్ మార్గంపై 9 అపాచీ హెలికాప్టర్లు జనానికి కనువిందు చేశాయి. ‘‘అమెరికా కంటే సాహసోపేతమైన సైన్యం భూ ప్రపంచంలోనే లేదు. మమ్మల్ని బెదిరించాలని చూసేవారికి హెచ్చరిక. మా సైన్యం మీ అంతు చూస్తుంది. దుర్మార్గ దేశాల గుండెల్లో బాయ్నెట్లు గుచ్చుతుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు. మెక్సికో జెండాలున్యూయార్క్, డెన్వర్, షికాగో, ఆస్టిన్, లాస్ఏంజెలెస్ నగరాల్లో జనం ‘నో కింగ్స్’ బ్యానర్లు, మెక్సికో జెండాలు చేబూనారు. సియాటెల్‌లో జరిగిన అతిపెద్ద ర్యాలీలో 70 వేల మందికి పైగా పాల్గొన్నట్లు నిర్వాహకులు చెప్పారు. అట్లాంటా ర్యాలీకి 5 వేల మంది వచ్చారు. మిన్నెసొటాలో మాత్రం తగు కారణం లేకుండా నిరసనల్లో పాల్గొవద్దని గవర్నర్ టిమ్ వాల్జ్తోపాటు భద్రతాధికారులు ప్రజలను కోరారు. అయినా స్టేట్ కాపిటల్ భవన సముదాయం సహా పలుచోట్ల నిరసనలు జరిగాయి. నార్త్ కరొలినాలో ‘నో కింగ్స్. నో క్రౌన్స్. వియ్ విల్ నాట్ బౌ డౌన్’ అంటూ నినదించారు. ‘ట్రంప్ మస్ట్ గో నౌ’ అనే బ్యానర్‌ను ప్రదర్శించారు. -
LA Protests: వెనక్కి తగ్గిన ట్రంప్?
అమెరికావ్యాప్తంగా అక్రమ వలసదారుల కోసం కొనసాగుతున్న తనిఖీలు.. అరెస్టులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ విషయంలో కోర్టు పరోక్షంగా ప్రభుత్వ చర్యలకు మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ లాస్ ఏంజెల్స్ నిరసనలతోనే(LA Protests) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.అక్రమ వలసదారుల్ని గుర్తించి వెనక్కి పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో బలవంతపు తనిఖీలు, అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామంతో లాస్ ఏంజెల్స్‌లో ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. క్రమంగా అవి మిగతా ప్రాంతాలకు విస్తరించాయి. అయితే తాజాగా.. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో సోదాలను ఆపేయాలంటూ ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ICE)కి ఆదేశాలు వెళ్లాయి.ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించగా.. ముగ్గురు ఉన్నత అధికారులు సైతం ధృవీకరించారు. అంతకు ముందు.. ట్రంప్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘‘వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా త్వరలోనే ఓ ఉత్తర్వును జారీ చేస్తాను’’ అన్నారు. ఈ నేపథ్యంలో లాస్ఏంజెలెస్ ప్రాంతంలోని వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టరంట్లలో సోదాలు నిలిపివేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు ఐసీఈ అధికారులు గత శుక్రవారం లాస్ఏంజెల్స్లోని డౌన్టౌన్లో సోదాలు ప్రారంభించడంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. క్రమంగా దేశమంతటా విస్తరిస్తుండడంతో .. లాస్ఏంజెల్స్లో భారీస్థాయిలో నేషనల్ గార్డ్లను మోహరింపునకు ట్రంప్ ఆదేశించారు. దీంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులను అడ్డుకునేందుకు మరో 2వేల మంది నేషనల్ గార్డులను మోహరించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ చర్యలను కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్తోపాటు స్థానిక పోలీసు అధికారులు వ్యతిరేకించారు. గవిన్ దీనిపై ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అధ్యక్షుడి ఆదేశాలు చెల్లవని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అయితే.. ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును తొమ్మిదో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయానికి పరోక్షంగా మద్దతు పలికింది. కోర్టు నిర్ణయంతో నేషనల్ గార్డు సిబ్బందికి అడ్డంకి తొలగిపోగా.. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆపై ఈ నిర్ణయానికి తాత్కాలిక బ్రేక్ వేస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. -
లూటీ.. విధ్వంసం.. కర్ఫ్యూ
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో సరైన పత్రాలులేని వలసదారుల అరెస్ట్‌లతో మొదలైన ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. మంగళవారం రాత్రి ఆందోళనకారులు వేల సంఖ్యలో పాల్గొని తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంచేశారు. అయితే దీనిని అదునుగా చూసుకుని కొందరు దుండగులు ముసుగులు ధరించి లాస్ఏంజెలెస్ డౌన్టౌన్లో లూటీలకు తెరలేపారు. యాపిల్ ఐఫోన్ స్టోర్సహా పలు దుకాణాలపై దాడులు చేసి లూటీలు చేశారు. విలువైన వస్తువులను అందినకాడిని దోచుకెళ్లారు. ఉద్యమంవేళ యథేచ్ఛగా లూటీలు, విధ్వంసం జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుకాణ సముదాయాల నుంచి పారిపోతున్న ముసుగు ధరించిన దుండగులను అరెస్ట్‌చేశారు. పలువురు ఆందోళనకారులను సైతం అరెస్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. దుకాణాలను యువకులు లూటీలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గత నాలుగు రోజుల్లో మొత్తంగా 23 పెద్ద వ్యాపార సముదాయాలు లూటీకి గురయ్యాయని లాస్ ఏంజెలెస్ నగర మహిళా మేయర్ కరెన్ బాస్ చెప్పారు. నగరంలో తాత్కాలిక కర్ఫ్యూస్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటలదాకా పాక్షిక కర్ఫ్యూను విధిస్తున్నట్లు మేయర్ కరెన్ ప్రకటించారు. ప్రతిరోజూ ఇదే సమయానికి కర్ఫ్యూను అమలుచేయనున్నారు. ఇలా కొద్దిరోజులపాటు పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. లూటీలు, విధ్వంసానికి పాల్పడిన వారికి గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్లపర్వాన్ని మొదలెట్టారు. అడ్డొచ్చిన వారిపైకి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. డౌన్‌టౌన్ జిల్లాలోని ఆర్ట్స్ డిస్ట్రిక్, చైనా టౌన్, స్కిడ్ రో, ఫ్యాషన్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలుచేశారు. కర్ఫ్యూ మొదలయ్యాక కనీసం 200 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారని మేయర్ ప్రకటించారు. లాస్ఏంజెలెస్ 2,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా అత్యధిక లూటీలు, విధ్వంసం జరిగిన 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తామని నగర పోలీస్ చీఫ్ జిమ్ మెక్‌డోనెల్ చెప్పారు. నగరంలో మరింత ఉద్రిక్తంగా మారడానికి ట్రంప్ ‘నేషనల్ గార్డ్’ తరలింపు’ నిర్ణయమే కారణమని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆరోపించారు. సైనికఛత్రంలోకి నగరాన్ని ఇరికించి సమస్యను జటిలంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ట్రంప్ స్పందించారు. ‘‘ఆందోళనకారులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశానికి శత్రువుల్లా తయారయ్యారు. అల్లరిమూకల అరాచకత్వం ఇక ఎంతమాత్రం సాగనివ్వను. అవసరమైతే తిరుగుబాటు అణచివేత చట్టం,1807ను తీసుకొచ్చి యావత్ సైన్యాన్ని రాష్ట్రంలోకి దింపుతా. లాస్ ఏంజెలెస్‌లో ఇలాగే అల్లర్లు, ఆందోళనలు కొనసాగితే సిటీని రాష్ట్ర పాలన పరిధి నుంచి తప్పించి కేంద్రప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తా’’ అని శ్వేతసౌధంలో ట్రంప్ హెచ్చరించారు.కోర్టులో గవర్నర్‌కు చుక్కెదురున్యూయార్క్ గవర్నర్ అనుమతిలేకుండా అసా ధారణ అధికారాలతో లాస్ ఏంజెలెస్‌లోకి నేషనల్ గార్డ్, మెరైన్లను పంపుతూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం నిలుపుదలచేయాలన్న న్యూయార్క్ అటార్నీ అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. ఈ అంశాన్ని గురువారం మరోసారి పరిశీలిస్తామని శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టు జడ్జి చార్లెస్ బ్రేయర్ చెప్పారు. మరోవైపు భద్రతా బలగాల మోహరింపు మున్ముందు మరింత ఎక్కువగా ఉంటుందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. ఇప్పటికే నేషనల్‌గార్డ్, మెరైన్లను రప్పించినందుకు ఏకంగా రూ.1,146 కోట్లు ఖర్చయిందని ఆయన వెల్లడించారు. అక్రమవలసదారుల కోసం గాలింపు, అరెస్ట్ విధుల్లో ఉన్న ఫెడరల్ ఏజెంట్లు, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల రక్షణ, కేంద్రప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను మాత్రమే నేషనల్ గార్డ్లకు అప్పగించడంతో వాళ్లు ఆందోళనకారులను అరెస్ట్చేయట్లేదు. అరెస్ట్‌చేసే అధికారం వీళ్లకు లేదు. దీంతో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. ఈ సందర్భంగానే ముసుగు ధరించిన ఆగంతకులు లూటీలు చేయగలిగారు.ఇతర నగరాల్లో ఆందోళనలుకర్ఫ్యూతో లాస్ ఏంజెలెస్‌లో ఉద్రిక్తత రాత్రివేళ కాస్తంత తగ్గుముఖం పట్టినా ఇతర నగరాల్లో మాత్రం ఉధృతంగా కొనసాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో మొదలు సియాటెల్, న్యూయార్క్, షికాగో, డెన్వర్, శాంటా అనా, ఆస్టిన్, డాలస్, బోస్టన్, వాషింగ్టన్ డీసీదాకా చాలా ప్రధాన నగరాల్లో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కొనసా గిస్తున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు తక్కువ ప్రాణహాని ఉండే ఉపకరణాలనే వాడుతున్నారు. భాష్పవాయు గోళాలు, పెప్పర్ స్ప్రే, టేజర్, లాఠీలు, జల ఫిరంగులు, చెవులు చిల్లులు పడే శబ్దాలు వెదజల్లే పరికరాలు, రబ్బర్‌బుల్లెట్లు బీన్–బ్యాంగ్ రౌండ్లను ప్రయోగిస్తున్నారు.టిక్‌టాక్ స్టార్‌పై బహిష్కరణ వేటు16.24 కోట్ల మంది టిక్‌టాక్ ఫాలోవర్లు ఉన్న ప్రఖ్యాత ఇన్ఫ్లుయెన్సర్ ఖబీ లేబ్‌ను సైతం అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు దేశం నుంచి వెళ్లగొట్టారు. వీసా గడువు ముగిశాక సైతం అమెరికా ఉంటున్నందుకు ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయనే స్వయంగా అమెరికాను వీడారని వార్తలొ చ్చాయి. సెనెగల్– ఇటాలియన్ మూలాలున్న ఇతను చేసే టిక్‌టాక్ వీడియో లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతను యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసి డర్‌గా ఉన్నారు. మరోవైపు టెక్సాస్ రాష్ట్రంలోనూ నేషనల్ గార్డ్లను రప్పించామని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ చెప్పారు. -
సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. మంగళవారం ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు వినతిపత్రాలు సమర్పించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో స్త్రీలు, బాలికల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని మహిళలంతా నినదించారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఆంక్షల నడుమ పోటెత్తిన ర్యాలీలు గుంటూరులో నిరసన తెలిపేందుకు వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళలు బారికేడ్లను నెట్టుకుని వెళ్లి నిరసన తెలియజేశారు. లాడ్జి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మహిళా విభాగం అధికార ప్రతినిధి శ్రీదేవిరెడ్డి పాల్గొన్నారు. విజయవాడలో పోలీసులు అడుగడుగునా అడ్డుపడినా ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదాలు చేస్తూ మహిళలు అంబేడ్కర్ స్మృతి వనానికి తరలివెళ్లారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మహిళలపై అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ వినతిపత్రం సమర్పించారు. బాపట్లలో అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టి మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో భారీ ర్యాలీ జరిగింది. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు భారీఎత్తున నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిõÙకం చేసి వినతిపత్రం సమర్పించారు. భీమవరంలోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహిళలు భారీ నిరసన చేపట్టి గోకవరం బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలివచ్చి ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ కార్యక్రమం చేపట్టారు. ఒంగోలులో అంబేడ్కర్ భవన్ నుంచి ప్లకార్డులు పట్టుకుని మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ విశాఖపట్నంలో మహిళలు, వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనకాపల్లిలో మహిళలు రింగ్ రోడ్ నుంచి ర్యాలీగా రైల్వే జంక్షన్‌కు వెళ్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘రెడ్‌బుక్ పాలన పోవాలి.. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటూ వినతిపత్రం అందజేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మహిళలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.రాయలసీమ జిల్లాల్లో నిరసన గళం మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై అనంతపురం అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్లపై బైఠాయించారు. రాప్తాడు, హిందూపురంలో మహిళలు నిరసన తెలిపారు. కడప కోటిరెడ్డి సర్కిల్లో మహిళలకు రక్షణ కల్పించాలని మహిళలు నినదించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ర్యాలీ జరిపారు. కర్నూలులో నల్లబ్యాడ్జీలు ధరించి కొండారెడ్డి బురుజు నుంచి పాతబస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. మహిళలపై అఘాయిత్యాల విషయం కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. చిత్తూరు జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
లాస్ ఏంజెలెస్‌లో...ముదురుతున్న రగడ
పారామౌంట్(యూఎస్): అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వారిని పట్టుకునేందుకు ట్రంప్ సర్కార్ మొదలెట్టిన ఏరివేత కార్యక్రమం మరింత ఉద్రిక్తంగా మారింది. అక్రమ అరెస్ట్‌లను ఆపితే ఆందోళనలు తగ్గుముఖం పడతాయని, బలగాలను మొహరించి సమస్యను మరింత జఠిలతరం చేయొద్దని విపక్ష డెమొక్రటిక్ పాలిత నగరాల మేయర్లు మొత్తుకుంటున్నాసరే ట్రంప్ ప్రభుత్వం ‘నేషనల్ గార్డ్’ బలగాలను రంగంలోకి దింపింది. ఒక్క లాస్ ఏంజెలెస్ పరిధిలోనే ఏకంగా 2,000 మంది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ సభ్యులు మొహరించారు. దీంతో వీరికి దీటుగా వందలాది మంది ఆందోళనకారులు తమ నిరసనలను ఉధృతంచేశారు. రెండో రోజూ రోడ్లపై చేరి ఫెడరల ఏజెంట్లు, ఎఫ్‌బీఐ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పారామౌంట్ పట్టణంలోనూ.. లాస్ ఏంజెలెస్ సిటీ శివారులోని పారామౌంట్ పట్టణంలో హోంశాఖ వద్ద వందలాది మంది నిరసనకారులు గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. దీంతో వీళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు అత్యంత తీక్షణ కాంతిని వెదజల్లే ఫ్లాష్ బ్యాంగ్ గ్రనేడ్లను విసిరారు. రబ్బర్ బుల్లెట్లను షూట్‌చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. లాస్ ఏంజెలెస్‌లో పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపైకి పోలీసులు ఇలా భాష్పవాయు గోళాలు, పెప్పర్ బాల్స్, పొగ బాంబులను ప్రయోగించారు. పోలీసులు ప్రయాణిస్తున్న బోర్డర్ పెట్రోల్ వాహనాలపైకి ఆందోళనకారులు ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల రాకపోకలు స్తంభింపజేస్తూ వలసదారులు రోడ్లపై టైర్లను కాలి్చపడేశారు. ఇటీవలికాలంలో లాస్ ఏంజెలెస్ పరిధిలో 118 మంది వలసదారులు, ఐదుగురు నేరస్తులను అరెస్ట్‌చేసినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. సైన్యాన్ని దింపుతాం: రక్షణ మంత్రి హెచ్చరిక ‘అక్రమ వలసదారులు, నేరగాళ్లను పట్టుకునేందుకు ఫెడరల్ ఏజెంట్లు చేస్తున్న ముమ్మర గాలింపు చర్యలను ఆందోళనకారులు ఇలాగే అడ్డుకుంటే అనివార్యపరిస్థితుల్లో మేం సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. క్యాంప్ పెడల్టన్లోని మెరైన్లనూ రప్పిస్తాం’ అని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. మరోవైపు పారామౌంట్, కాంప్టన్ పట్టణాల్లో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఒక కారుకు నిప్పంటించారు. పారామౌంట్ బిజినెస్ పార్క్ వద్ద ఇమిగ్రేషన్ అధికారులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. బాణసంచా కాలుస్తూ, షాపింగ్ కార్ట్‌లను రోడ్లపై పడేశారు. బోర్డర్పెట్రోల్ వాహనశ్రేణిపై రాళ్లు రువ్వారు. లాస్ ఏంజెలెస్ ఫెడరల్ డిటెన్షన్ భవనం వద్ద సైతం గుమిగూడి అరెస్టయిన వాళ్లను విడుదలచేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వారిలో కొందరు పోలీసులు అరెస్ట్‌చేశారు. ‘‘వారెంట్ల ప్రకారం సైతం చాలా మంది అక్రమవలసదారులను ఆదివారం సైతం అరెస్ట్‌చేశాం. డ్యూటీ నిర్వహణకు అడ్డుపడిన డజన్లకొద్దీ జనాలనూ అరెస్ట్‌చేశాం’’ అని యూఎస్ అటార్నీ బిల్ ఈజీలీ ప్రకటించారు. అరెస్ట్ అయిన వారి ఫొటోలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. అక్రమ వలసదారుల ఏరివేత వేళ ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులకు ఎన్జీ బలగాలు తాత్కాలికంగా రక్షణగా ఉంటాయని ట్రంప్ చెప్పారు.నేషనల్ గార్డ్ రంగప్రవేశంపై అభ్యంతరాలు రాష్ట్రాల్లో శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్రాలే పరిష్కరించుకుంటాయి. కానీ ట్రంప్ ఇలా అధ్యక్షుడి అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్ గార్డ్‌ను రప్పించడంపై లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్, కాలిఫోరి్నయా గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ బలగాలపై గవర్నర్‌కే అధికారాలుంటాయి. కానీ టైటిల్ 10 అధికారాన్ని ఉపయోగించి నేషనల్ గార్డ్ బలగాలను ట్రంప్ రప్పించారు. గతంలో పౌరహక్కుల ఉద్యమం సమయంలోనూ దేశాధ్యక్షుడు ఈ టైటిల్10ను వాడి నేషనల్ గార్డ్ బలగాలను ఆయా ఉద్యమప్రాంతాలకు తరలించారు. గత అధ్యక్షులు ఐసన్‌హోవర్, జాన్ ఎఫ్.కెన్నడీ, జాన్సన్లూ ఈ నిబంధనను ప్రయోగించారు. 1967 డెట్రాయిట్ ఆందోళనలు, మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యానంతరం సైతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎన్జీ బలగాలను రప్పించారు. 1970 న్యూయార్క్ పోస్టల్ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆనాడు ఎన్జీ రంగంలోకి దిగింది. చివరిసారిగా 1992లో ఒక నల్లజాతీయుడిని నలుగురు శ్వేతజాతి పోలీసులు దారుణంగా కొట్టినప్పుడు లాస్ ఏంజెలెస్‌లో అల్లర్లు చెలరేగినప్పుడు ఎన్జీ బలగాలొచ్చాయి. -
పీఓకేలో నిరసనల హోరు
గిల్గిత్: ఆపరేషన్ సిందూర్‌తో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్‌కు స్థానిక వ్యాపారులు నిరసనల సెగ మరింత తగులుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిత్–బాల్టిస్టాన్‌లోని స్థానిక వ్యాపారులు తమ స్వప్రయోజనాలను పాక్ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆందోళన బాటపట్టారు. వీళ్లకు స్థానిక రాజకీయ పారీ్టల మద్దతు సైతం తోడవడంతో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. గత మూడు రోజులుగా స్థానిక సరకు ఎగమతి, దిగుమతిదారులు, చిరు వ్యాపారు లు ఆందోళన కొనసాగిస్తున్నారు. స్థానిక గుల్మార్ట్ నగర్లో వేలాది మంది వ్యాపారులు, స్థానికులు బైఠాయించి నిరసనకు దిగారు. చైనా, పాకిసాŠత్క్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ)లో కలికితురాయి వంటి కారాకోరమ్ జాతీయ రహదారిని గత మూడు రోజులుగా వ్యాపారులు దిగ్బంధించారు. దీంతో పాక్, చైనా మధ్య భారీ సరకు రవాణా వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళన కార్యక్రమాల్లో అధికార పీఎంఎల్(నవాజ్) పారీ్టకి చెందిన నేతలు సైతం పాల్గొన్నారు. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ(ఎఫ్బీఆర్) నిర్ణయాలు పూర్తి లోపభూయిష్టంగా ఉన్నాయని, కేవలం చైనాకు లబి్ధచేకూర్చేలా ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నారని సరకు ఎగుమతి, దిగుమతిదారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చైనా దోపిడీ విధానాలు పాకిస్తాన్‌ను ఆర్థికంగా హత్య చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాపారులకు తోడుగా హూంజా, సమీప పట్టణాల నుంచి వేలాదిగా విద్యావేత్తలు, పౌర సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 2023 అక్టోబర్‌లోనూ గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రజలు భారత్ అనుకూల ఉద్యమం చేశారు. భారత్‌లోని కార్గిల్‌ను కలిపే రోడ్డును మళ్లీ తెరవాలని, తద్వారా సరకు దిగుమతులకు అనుమతించి స్థానికంగా ద్రవ్యోల్బణాన్ని కిందకు దిగొచ్చేలా చేయాలని స్థానికులు ఉద్యమించారు. ‘సరిహద్దులు చెరిపేయండి, కార్గిల్ సరిహద్దును తెరవండి’’అంటూ ప్రముఖ కార్యకర్త షబ్బీర్ మయ్యార్ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగడడం తెల్సిందే. తర్వాత ఆయనను ఉగ్రవ్యతిరేక చట్టం కింద పాక్ సర్కార్ అరెస్ట్‌చేసింది. పరస్పర నిందారోపణలు గిల్గిత్–బాల్టిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉందని, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ(ఎఫ్బీఆర్) నిర్ణయాలతో తమకు సంబంధంలేదని పీఎంఎల్(నవాజ్) పార్టీ చెబుతోంది. ‘‘పీటీఐ పార్టీ విధానాల కారణంగా స్థానికంగా వ్యాపారం దెబ్బతింటోంది. ఎగుమతిదారులు, వ్యాపారులు, దుకాణదారులు, కారి్మకులు, కస్టమ్స్ క్లియరెన్స్ ఏజెంట్లు, హోటళ్లు, చిరువ్యాపారులు అందరూ ఆరు నెలలుగా తీవ్రంగా నష్టపోతున్నారు. స్థానిక ప్రభుత్వం ఏకంగా ఉగ్రవాదులకే క్షమాభిక్షలు పెట్టింది. కనీసం వ్యాపారులను పట్టించుకోరా?’’అని పీఎంఎల్(నవాజ్) పార్టీ నేత జావేద్ హుస్సేన్ ప్రశ్నించారు. హుస్సేన్ వ్యాఖ్యలను పీటీఐ పార్టీ నేతలు ఖండించారు. ‘‘ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ అనేది కేంద్రప్రభుత్వానికి సంబంధించిన విషయం, మా ప్రభుత్వంతో సంబంధం లేదు’’అని గిల్గిత్–బాల్టిస్తాన్ ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి మొహమ్మద్ అలీ ఖయీద్ చెప్పారు. ఇరు ప్రభుత్వాల నడుమ వ్యాపారులు ఆర్థిక చితికిపోతున్నారు. సరకుల కొరతతో ధరలు పెరిగి సామాన్యులు ఆరునెలలుగా అల్లాడిపోతున్నారు. కస్టమ్స్ క్లియరెన్సుతో.. సరిహద్దుల్లోని సోస్త్ డ్రై పోర్ట్ ద్వారా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు కస్టమ్స్ క్లియరెన్సు అనుమతులు ఇవ్వకపోవడంతో తాజాగా వ్యాపారులు నిరసనకు దిగారు. గత ఆరు నెలలుగా 257 కన్సైన్మెంట్లు ఇలా డ్రై పోర్ట్‌లోనే ఆగిపోయాయి. దీంతో కొంత సరకు పాడయింది. దీంతో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. ఇదిగాక మిగిలిన సరకుకు సైతం రోజువారీ నిల్వ చార్జీలు ఇతరత్రాలు మోపడంతో వ్యాపారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సరకుకు మోక్షం కల్గించేదాకా కారాకోరమ్ హైవేను తెరిచేదిలేదని వ్యాపారులు భీషి్మంచుకుని కూర్చున్నారు. నగర్, హూంజా, గిల్గిత్ ప్రాంతాలకు చెందిన గిల్గిత్–బాల్టిస్తాన్ దిగుమతి, ఎగుమతిదారుల సంఘం ఆధ్వర్యంలో పాక్–చైనా ట్రేడర్స్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది. హైవేపై రాకపోకలు ఆగిపోవడంతో ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ సరకు, ప్రయాణికుల వాహనాలు నిలిచిపోయాయి. -
అమాయక ప్రజలను బాబు మోసం చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, రౌడీలు.. పోలీసుల రాజ్యమే నడుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం వెన్నుపోటు దినం (Vennupotu Dinam) నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిపి ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలకు హామీ ఇచ్చి చంద్రబాబు వెన్నుపోటు(Chandrababu Vennupotu) పొడిచారు. అందుకే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిరసన చేపడతాం. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నష్టపోయారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన దోపిడీతో మొదలైంది. సూపర్ సిక్స్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయ్యింది. ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచింది.. .. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే సచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు. రేషన్ డోర్ డెలివరీ(Ration Door Delivery System) విధానాన్ని కూడా చంద్రబాబు తొలగించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. .. ఉచిత బస్సు, అమ్మకి వందనం అంటూ ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. రౌడీరాజ్యం , పోలీసు రాజ్యం నడుస్తోంది. విజయవాడలో శాతవాహన కళాశాల 5 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కబ్జా చేయడానికి చూస్తోంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్‌ను కిడ్నాప్ చేయడం దారుణం. అసలు బెజవాడ నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల విజయవాడ నగరంలో బుడమేరు వరదల్లో 12 డివిజన్లు నీట మునిగాయి అని మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి(Vijayawada Deputy Mayor Sailaja Reddy) మాట్లాడుతూ.. ‘‘జగన్‌ను ఒంటరిగా ఢీ కొనలేక మూడు పార్టీలు ముందుకు వచ్చాయి. చంద్రబాబు అమాయక ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఒక్క హామీ అమలు చేయలేదు. టీడీపీ మహానాడుతో ప్రజలకు ఏం ఉపయోగం లేదు. జగన్‌ను తిట్టేందుకు.. లోకేష్ ను పొగడ్తలతో ముంచేందుకే మహానాడు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు అని అన్నారామె. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.ఇదీ చదవండి: అలాంటి వారిని ఇలాగే శిక్షస్తారా?.. మేడమ్! -
బంగ్లాలో నిరసనల హోరు
ఢాకా: బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సర్కారుపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైన్యం నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్న సర్కారుకు ఇది రోకటిపోటుగా పరిణమించింది. పౌర సేవకుల సమ్మె నాలుగో రోజుకు చేరగా వేతన పెంపు డిమాండ్‌తో టీచర్లు కూడా నిరసన బాట పట్టారు.వారు వేల సంఖ్యలో నిరవధిక సమ్మెకు దిగారు. మే 5 నుంచి పాక్షికంగా పని చేస్తున్నవారు కూడా సోమవారం నుంచి పూర్తిగా విధులు నిలిపేశారు. దీనిపై యూనస్ సర్కారు మండిపడింది. ఆందోళనలను తక్షణం కట్టిపెట్టాలంటూ సోమవారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు మరింత మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విస్తరిస్తామని హెచ్చరించారు.రాజకీయ గందరగోళంకొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో పడిపోయింది. భారత్‌లో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో అశాంతి పెరిగింది. వచ్చే డిసెంబర్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ పట్టుబడుతుండగా 2026 జూన్‌కు ముందు కుదరదని సర్కారు అంటోంది.మరోవైపు కీలక సంస్కర ణలకు పార్టీలు మద్దతివ్వకపోవడంతో యూనస్ అలిగా రు. రాజీనామా చేస్తానని బెదిరించినా తర్వాత వెనక్కు తగ్గారు. అధికారాన్ని నిలుపుకోవడానికే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను ఆలస్యం చేస్తోందంటూ బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఢాకాలో భారీ నిరసనలకు దిగింది. దాంతో యూనస్‌కు మద్దతుగా ఆయన అనుయాయులు విద్యార్థుల సారథ్యంలో మే 24న మార్చ్ నిర్వహించారు. -
డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం
వాషింగ్టన్: అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మారుస్తానంటూ రెండోసారి అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అమెరికన్లకు ఎంతమాత్రం నచ్చడం లేదు. ట్రంప్ తీరును మెజార్టీ జనం తప్పుపడుతున్నారు. అమెరికాను నాశనం చేయొద్దని కోరుతున్నారు. అమెరికాలో రాచరికం లేదు, ట్రంప్ రాజు కాదు అంటూ జనం గొంతెత్తి నినదిస్తుండడం గమనార్హం. ట్రంప్‌కు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జనం వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వైట్‌హౌస్ ఎదుట, టెస్లా కార్యాలయాల వద్ద, నగరాల్లోని ప్రధాన సెంటర్లలో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. ట్రంప్ వ్యవహార శైలిపై ఆగ్రహం వెళ్లగక్కారు. చాలాచోట్ల ర్యాలీలు జరిగా యి. ఈ నిరసన ఉద్యమం ‘50501’గా పేరు పొందింది. ‘50 నిరసనలు, 50 రాష్ట్రాలు, ఒక ఉద్యమం’ అనేదే దీని అర్థం. సరిగ్గా 250 ఏళ్ల క్రితం అమె రికాలో ఇదే రోజు విప్లవ యుద్ధం ఆరంభమైంది. బ్రెగో గార్సియాను వెనక్కి రప్పించాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు విధించడానికి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి డిపార్ట్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) పేరిట ట్రంప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పట్ల అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శనివారం నాటి ప్రజాందోళనల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఎల్‌సాల్వెడార్ దేశానికి చెందిన బ్రెగో గార్సియా అనే వ్యక్తిని ప్రభుత్వం ఇటీవల బలవంతంగా స్వదేశానికి పంపించింది. ఈ ఉదంతాన్ని అమెరికన్లు తప్పుపట్టారు. గార్సియాను తిరిగి అమెరికాకు రప్పించాలని డిమాండ్ చేశారు. ట్రంప్‌ను ఎల్‌సాల్వెడార్‌కు తరిమేయాలంటూ కొందరు తేల్చిచెప్పారు. ప్రజల నిరసనలు చాలావరకు శాంతియుతంగానే జరిగాయి. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలియరాలేదు. ‘నో కింగ్స్’ అని రాసి ఉన్న ప్లకార్డులు జనం ప్రదర్శించారు. ట్రంప్ రాచరిక పోకడలు ప్రదర్శిస్తున్నారంటూ పరోక్షంగా మండిపడ్డారు. ట్రంప్ పనితీరుకు 45 శాతం సానుకూలత మొదటి త్రైమాసికంలో ట్రంప్ పనితీరు పట్ల ఇటీవల నిర్వహించిన గ్యాలప్ సర్వేలో 45 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. తొలిసారిగా ఆయన అధ్యక్షుడైనప్పుడు తొలి త్రైమాసికంలో ఆయన పనితీరుకు 41 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అంటే ఈసారి ప్రజాదరణ కొంత పెరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ, 1952 నుంచి 2020 దాకా అధ్యక్షులుగా పనిచేసిన నేతల తొలి త్రైమాసికం పనితీరుకు సగటున 60 శాతం జనామోదం లభించింది. అంటే వారితో పోలిస్తే ట్రంప్ వెనుకబడే ఉన్నారు. ఆయన జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు అప్రూవల్ రేటింగ్ 47 శాతంగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. అది ఇప్పుడు 43 శాతానికి పడిపోయింది. -
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
మహారాజు జ్ఞానేంద్రకు మద్దతుగా నేపాల్‌లో ఏదో ఒక ప్రాంతంలోఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఇవి నేపాల్‌లో ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్చ్ 28వ తేదీన ఇవి ఘర్షణ స్థాయికి చేరి ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేకమంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఇందుకు మహారాజు, ఆయన మద్దతుదారులు బాధ్యులని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు రాజు 8 లక్షల రూపాయల జరి మానా చెల్లించాలని కూడా ఆదేశించింది. దీన్ని ప్యాలెస్ఖండించింది. మరోవైపు ప్రభువు మద్దతుదారులంతా నిధులు సేకరించి సొమ్ము చెల్లించటానికి సిద్ధమవుతున్నారు.ఒకప్పుడు రాచరికాన్ని కాదనుకున్న నేపాలీ సమాజం ఇప్పుడు రాజుకు ఎందుకు మద్దతు పలుకుతోంది? ఇందుకు నేపాల్ పాలకుల తీరే కారణం. 2008లో నేపాల్‌లో రాచరికం రద్దయిన తర్వాత 17 ఏళ్ల కాలంలో 18 ప్రభుత్వాలు నేపాల్‌ను పాలించాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా సజావుగా పాలించిన రికార్డు లేదు. అవసరార్థం సర్దుబాట్లు చేసుకుని సంకీర్ణ ప్రభుత్వాలను నడిపారు. ఇప్పటి కేపీ ఓలి, షేర్ కుమార్ దుబా, ప్రచండ... ఇలా ప్రధానులంతా తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న వారే. రాజకీయ అస్థిరత ఒకవైపు, అవినీతి మరోవైపు నేపాల్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఉపాధి అవకాశాలు తగ్గి పోయాయి. యువత దేశాన్ని వదిలి ఉపాధి కోసం బయట దేశాలకు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజు మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. రాచరికాన్నిరద్దు చేయటం వల్ల నేపాల్ సార్వభౌమాత్వానికి దెబ్బ తగిలిందనీ, తిరిగి రాజు అధికారం చేపడితే ప్రపంచ దేశాల్లో నేపాల్ గుర్తింపు సంపాదిస్తుందని భావిస్తున్న వాళ్లు కొందరు ఉన్నారు. మరొక అంశం ‘హిందూత్వ’. నేపాల్‌ను హిందూ స్టేట్‌గా మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం తెరవెనక ప్రయత్నాలు సాగుతున్నాయి. మహరాజు జ్ఞానేంద్ర ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ కావటం, ఆయన ఫొటోలు నేపాల్ వీధుల్లో దర్శనం ఇవ్వటం వంటి ఇటీవల పరిణామాలు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. అల్లర్ల వెనక భారత్ ఉందని నేపాల్ ప్రభుత్వం ఆరోపించటానికి ఇది కూడా ఒక కారణమని మనం భావించవచ్చు. ఇప్పుడు చెలరేగుతున్న ఆందోళనలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయో తెలి యదు. నేపాల్‌లో ఆందో ళనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకత్వం వహిస్తున్నా, ఇందులో అసాంఘిక శక్తులతో పాటు చైనా పాత్రను కొట్టేయలేం. చాలా కాలంగా చైనా ఆధ్వ ర్యంలో నేపాల్‌లో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయి. దీనికి కమ్యూనిస్టు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. సరిహద్దులో ఆగడాలను చూసీ చూడకుండా వదిలేస్తోంది. భారత్‌తో సంబంధాలు దెబ్బ తిన్నప్పుడు రాజు జ్ఞానేంద్ర చైనాతో స్నేహంగా మసిలిన మాట నిజమే. అలాగని ఆయనకు ఇప్పుడుచైనా మద్దతుగా ఉంటుందని భావించలేం. నేపాల్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని యూఎస్, యూకే, ఇండి యాలు గుర్తిస్తున్నాయి. ప్రజాపాలన నుంచి రాచరికంలోకి మారినంత మాత్రాన నేపాల్ అభివృద్ధి ఫలాలను అందుకుంటుందని చెప్పలేం. రాజు అధికారంలోకి వస్తే అన్నీ సర్దుకుంటాయన్న భావన తార్కికంగా సమంజసంగా లేదు. మార్పు మంచిదే. అదీ అభివృద్ధికి తోవ చూపించినప్పుడే కదా? డా.పార్థసారథి చిరువోలు సీనియర్ జర్నలిస్ట్ -
కంచ గచ్చిబౌలి భూములు ఎవరూ కొనద్దు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ సర్కార్ తీరు దారుణంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు ముందుకు పోతున్నారు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో హెచ్‌సీయూ(HCU) భూముల ఆందోళనలపై కేటీఆర్ మాట్లాడారు. .. పేరుకే ప్రజా పాలన.. ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదు. హైదరాబాద్ భవిష్యత్తు కోసం విద్యార్థులు కొట్లాడుతున్నారు. విద్యార్థుల ఆందోళనను సర్కార్ పట్టించుకోవడం లేదు. ప్రజా పాలన అంటే విద్యార్థులపై దాడి చేయడమా?. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ ఎక్కడున్నారు?. ఫ్యూచర్ సిటీ కోసం 14 వేల ఎకరాల భూమి ఉండగా.. హెచ్‌సీయూలో ఉన్న ఆ 400 ఎకరాలే ఎందుకు?.ఆ 400 ఎకరాల భూముల్లోమూగజీవాలు కనిపించడం లేదా? అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు... ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తాం. కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూములు ఎవరూ కొనొద్దు. ఆ భూమి ఎవరు కొన్నా నష్టపోతారు. మేం అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలు తిరిగి తీసుకుంటాం. మేము వచ్చాక అతిపెద్ద ఎకోపార్క్ ఏర్పాటు చేస్తాం. అద్భుతంగా తీర్చిదిద్ది హెచ్‌సీయూకి కానుకగా ఇస్తాం’’ అని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవం చేపడితే.. అప్పుడు హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు. -
HCU వద్ద హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించ వద్దని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అది గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు.Hyderabad Central University witnessed police brutality.Students peacefully protesting against CM @revanth_anumula remarks calling HCU students “cunning foxes” and opposing a land grab near their campus were met with violence lathi charge, phones smashed, voices silenced.… pic.twitter.com/25oHPIGoXH— Harish Rao Thanneeru (@BRSHarish) March 30, 2025ఈ క్రమంలో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరుకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్ షీల్డ్‌తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.Save our university land from being auctioned for private entities. University is an intellectual power house,don't kill the progress of the Telangana. Save our land.@KTRBRS @BRSHarish @Krishank_BRS @dhanyarajendran @revathitweets @bainjal @CharanT16 @RahulGandhi @priyankagandhi pic.twitter.com/81zQ3APMVd— sree charan (@mscharan) March 30, 2025బట్టలు చిరిగినా వదలకుండా..పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను లాకెళ్లారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌లో పడేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. Mohabbat Ka Dukaan at HCU today. Kudos to @RahulGandhi & Congress sarkaar You have outdone yourselves pic.twitter.com/NPZOqG7Uoh— KTR (@KTRBRS) March 30, 2025 -
లండన్: నిరసనకారులకు దీదీ ఝలక్
లండన్: విదేశీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి నిరసన సెగ తాకింది. ఓ కాలేజ్ ఈవెంట్లో మమత ప్రసంగిస్తున్న టైంలో టీఎంసీ వ్యతిరేక నినాదాలతో అడ్డుపడ్డారు. అయితే వాళ్లకు అంతే ధీటుగా ఆమె సమాధానం ఇవ్వడంతో అక్కడి హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.గురువారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University)లోని కెల్లాగ్ కళాశాలలో బెంగాల్ పారిశ్రామికీరణ అంశంపై ఆమె ప్రసంగించారు. ఆ టైంలో కొందరు ఫ్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆమె ప్రసంగానికి అడ్డు పడ్డారు. ఆ ఫ్లకార్డుల మీద బెంగాల్ ఎన్నికల హింస, ఆర్జీకర్ ఘటన(RG Kar Incident), జాదవ్‌పూర్ యూనివర్సిటీ ఘటనలకు సంబంధించిన రాతలు ఉన్నాయి. మమత మాట్లాతున్న టైంలో.. టీఎంసీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు వాళ్లు. అయితే.. Mamata Banerjee faces protest at Oxford University, London during speech..SFI-UK held a demonstration in Kellogg College, Oxford against Mamata Banerjee's speech. #MamataBanerjee #UK #OxfordUniversity pic.twitter.com/uJinRxGhT2— Kapadia CP (@Ckant72) March 28, 2025వాళ్లకు ఆమె ధీటుగానే బదులిచ్చారు. ‘‘మీరేం చెప్పదల్చుకున్నారో గట్టిగా చెప్పండి. నాకేం వినిపించడం లేదు. మీరే చెప్పే ప్రతీది వినేందుకు నేను సిద్ధం. ఈ కేసు(ఆర్జీకర్ ఘటన) పెండింగ్‌లో ఉందని మీకు తెలుసా?. ప్రస్తుతం ఆ అంశం మా చేతుల్లో లేకుండా పోయింది. కేంద్రమే ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇది రాజకీయాలకు వేదిక కాదు. మీ రాజకీయాలు ఇక్కడ కాదు. దమ్ముంటే మా రాష్ట్రానికి వచ్చి నాతో రాజకీయం చేయండి’’ అని సవాల్ విసిరారామె. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా కంగుతిన్నారు. నిరసకారుల్లో ఓ విద్యార్థిని ఉద్దేశించి.. ‘‘చూడు తమ్ముడూ.. అబద్ధాలు చెప్పకు. నీ మీద నాకు సానుభూతి ఉంది. కాకుంటే ఇక్కడ రాజకీయాలు చేసే బదులు బెంగాల్‌కు వెళ్లి మీ పార్టీని బలోపేతం చేసుకోండి. అప్పుడే వాళ్లు మాతో తలపడగలరు’’ అని అన్నారామె. ఆ మాటలతో వాళ్లు మరింత రెచ్చిపోయారు. దీంతో ఆమె మరోసారి స్పందిచాల్సి వచ్చింది. ‘‘నన్ను అవమానించడం ద్వారా మీ విద్యా సంస్థను మీరే అగౌరవపర్చుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చింది దేశం తరఫున ప్రతినిధిగా. దయచేసి మీ దేశాన్ని మీరే అవమానించకండి.’’ అన్నారు. #Breaking: WB CM #MamataBanerjee’s speech at Kellogg College, University of Oxford interrupted by questions on Abhaya/RG Kar case. Mamata Banerjee says, “This matter is sub judice, this case is with the central government. Do not do politics here, this platform is not for… pic.twitter.com/fwPYYYHPsW— Pooja Mehta (@pooja_news) March 27, 2025మమత మాటలతో ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. ఆ టైంలో సభలో ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ.. ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రొత్సాహాం నన్ను మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చేలా చేసింది. దీదీ.. ఎవరినీ పట్టించుకోదు. దీదీ ఓ రాయల్ బెంగాల్ టైగర్. ఒకవేళ పట్టుకోవాలనుకుంటే.. పట్టుకోండి అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఆపై నిర్వాహకులు, అక్కడున్న ఆడియొన్స్ సూచన మేరకు నిరసనకారులు బయటకు వెళ్లిపోగా.. దీదీ ప్రసంగం కొనసాగింది. ఆ టైంలో వేదికపై క్రికెట్ దిగ్గజం సౌరబ్ గంగూలీ కూడా ఉన్నారు. চিত্ত যেথা ভয়শূন্য, উচ্চ যেথা শিরShe doesn’t flinch. She doesn’t falter. The more you heckle, the fiercer she roars. Smt. @MamataOfficial is a Royal Bengal Tiger!#DidiAtOxford pic.twitter.com/uqrck6sjFd— All India Trinamool Congress (@AITCofficial) March 27, 2025 -
పాలన చేతగాకే.. గొంతునొక్కుతున్నారు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాకనే అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కుతోందని మండిపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి.సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబోమ్మలతో ర్యాలీలు నిర్వహించి దహనం చేశాయి. జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి బయటికి పంపడం అప్రజాస్వామికమని.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతల గొంతు నొక్కేందుకు సీఎం రేవంత్ సస్పెన్షన్లను ఆయుధంగా మలుచుకున్నారని మండిపడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు చేయగా... పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. శాసనసభలో స్పీకర్‌ను అగౌరవపరిచే విధంగా జగదీశ్‌రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా... ప్రభుత్వం కక్షపూరితంగా, పథకం ప్రకారమే ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా చెప్పుకునేందుకు ఒక్క మంచి పనికూడా లేనందునే.. కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీని అడ్డాగా చేసుకుని అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశాయి. నకిరేకల్, దేవరకొండ, మునుగోడులలో రాస్తారోకోతో నిరసన తెలిపాయి. హుజూర్నగర్, మఠంపల్లి, నేరేడుచర్లలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, భీమారం, రామకృష్ణాపూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్‌లలో బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. కాగా.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంచిర్యాలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మణుగూరు, ఇల్లందు, మధిర తదితర చోట్ల తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు.ప్రజాకోర్టులో తేల్చుకుంటాం: కేటీఆర్పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ కేడర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతకానితనం బయటపడొద్దనే బీఆర్ఎస్ నాయకులపై కుట్రలు చేస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కితే ప్రజాకోర్టులో తేల్చుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు, హామీల అమల్లో మోసాన్ని ఇదే స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
బాబు నయవంచనపై తిరుగుబాటు 'యువత హోరు'
సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా తమను చదువులకు దూరం చేస్తున్న చంద్రబాబు సర్కారు కుట్రలపై విద్యార్థులు తిరగబడ్డారు. తమ బిడ్డల భవిష్యత్ కోసం తల్లితండ్రులు గర్జించారు. 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామని నమ్మించి నట్టేట ముంచడంపై యువత పిడికిలి బిగించింది. వైఎస్సార్సీపీ చేపట్టిన ‘యువత పోరు’కు మండుటెండలోనూ వెల్లువలా తరలివచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డగించి బెదిరింపులకు దిగినా వెరవలేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘యువత పోరు’ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు చేపట్టిన ప్రదర్శనలు, బైక్ ర్యాలీల్లో వేలాదిగా విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు కదం తొక్కారు. తక్షణమే గతేడాదికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద గతేడాదికి సంబంధించి కూటమి ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.3,200 కోట్లు.. ఈ ఏడాది ఇవ్వాల్సిన రూ.3,900 కలిపి మొత్తం రూ.7,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లే కేటాయించడంపై మండిపడ్డారు. పిల్లలను చదువులకు దూరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ.. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందకుండా చేయడమే కాకుండా వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన ‘యువత పోరు’ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక డీఎస్సీపై చేసిన తొలి సంతకమే మోసంగా మారిందని.. జాబ్ క్యాలెండర్ విడుదల లేదు.. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనే ఊడబెరుకుతున్నారంటూ ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి కోసం గతేడాది బడ్జెట్లో ఒక్క పైసా కేటాయించలేని.. ఈ ఏడాది బడ్జెట్లోనూ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు ర్యాలీల్లో నినదించారు. ఈమేరకు డిమాండ్లతో కూడిన పత్రాలను విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు కలెక్టర్లకు అందజేశారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా వేలాదిగా విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు ‘యువత పోరు’లో కదం తొక్కడం పది నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం పాలనపై పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతకు అద్దం పట్టిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 13న అన్నదాతలపై సమస్యలపై నిర్వహించిన రైతు పోరు.. డిసెంబర్ 27న కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన విద్యుత్ పోరు తరహాలోనే యువత పోరు గ్రాండ్ సక్సెస్ కావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. -
ఢిల్లీ అసెంబ్లీ గేట్ వద్ద ఆప్ ఎమ్మెల్యేల నిరసన
న్యూఢిల్లీ: ఆప్‌కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ సహా సస్పెండైన ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ అసెంబ్లీ గేట్ వద్దే ధర్నాకు దిగారు. వారంతా అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, గేటు వెలుపలే నిరసన చేపట్టారు. మంగళవారం అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగం సమయంలో ఆప్ సభ్యులు అంతరాయం కలిగించారు. సీఎం కార్యాలయంలో ఉన్న భగత్ సింగ్, అంబేడ్కర్ చిత్రపటాలను బీజేపీ ప్రభుత్వం తొలగించడంపై ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు ఆప్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలకుగాను సభలో ఉన్న 21 మందిని మూడు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ విజేంద్ర గుప్తా ప్రకటించారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. తిరిగి గురువారం అసెంబ్లీ ప్రారంభమవగానే ఆవరణలోకి వచ్చేందుకు ఆప్ ఎమ్మెల్యేలు ప్రయతి్నంచగా సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే వారిని అడ్డుకున్నారు. దీనిపై ఆతిశీ మండిపడ్డారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు హద్దే లేకుండా పోతోందన్నారు. అసెంబ్లీ గేటు వెలుపలే పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. అంబేడ్కర్ ఫొటోలున్న ప్లకార్డులను చేబూని ‘జై భీం, బీజేపీ నియంతృత్వం చెల్లదు’అంటూ కంజర వాయిస్తూ నినాదాలు చేశారు. ‘అసెంబ్లీలో జై భీం అని నినాదాలు చేసినందుకే మమ్మల్ని మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ రోజు, మమ్మల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. ఇది చాలా తప్పు. ప్రతిపక్షం గొంతు మీరెలా నొక్కుతారు? యావత్తూ ప్రతిపక్షాన్ని అసెంబ్లీకి దూరంగా ఎలా ఉంచుతారు?’అని ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ ప్రశ్నించారు.మాకు సమయమివ్వండి..: రాష్ట్రపతికి ఆప్ లేఖ శాసన సభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా అడ్డుకోవడంపై ఆప్‌నకు చెందిన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఆతిశీ గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. ‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, షహీద్ భగత్ సింగ్‌ల చిత్రపటాలను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించింది. ఈ చర్య ఈ ఇద్దరు మహనీయులకే కాదు, దళితులు, వెనుకబడిన, అణగారిన వర్గాల వారికీ అవమానం. ఈ చర్యను ఆప్ వ్యతిరేకించింది. అసెంబ్లీలో దీనిపై ప్రస్తావించేందుకు ప్రయత్నించిన ఆప్ ఎమ్మెల్యేలను స్పీకర్ మూడు రోజులపాటు అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారు’అని ఆ లేఖలో ఆతిశీ వివరించారు. ‘గురువారం, అసెంబ్లీ గేటు వద్ద భారీ బారికేడ్లు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం శాసనసభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వలేదు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులును శాసనసభలోకి రానివ్వకపోవడం అప్రజాస్వామికం. తీవ్రమైన ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని, 28వ తేదీన మీతో మాట్లాడేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వగలరు’అని అందులో కోరారు. -
రెండోరోజు టీటీడీ ఉద్యోగుల నిరసనలు.. ఐక్యవేదిక హెచ్చరిక ఇదే..
సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగుల నిరసన కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం ఎదుట ఉద్యోగులు మౌన నిరసన తెలుపుతున్నారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌ను బోర్డు నుంచి తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ ఉద్యోగి బాలాజీపై దురుసు ప్రవర్తనకు నిరసనగా ఉద్యోగులు మౌన నిరసనలు తెలుపుతున్నారు. 48 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా వారు రెండో రోజు నిరసనల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం ఎదుట నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు.. పాలకమండలి సభ్యుడు నరేష్‌ను తొలగించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని టీటీడీ ఉద్యోగుల ఐక్యవేదిక హెచ్చరికలు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందుకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
క్షమాపణలు చెప్పాల్సిందే.. టీటీడీ ఉద్యోగులు నిరసన
సాక్షి, తిరుపతి: టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ను తక్షణమే విధులు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అలాగే, బోర్డు సభ్యుడు నరేష్.. వెంటనే టీటీడీ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలనా భవనం లోపలికి మీడియాను సెక్యూరిటీ అనుమతించడం లేదు. పరిపాలన భవనం లోపల ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్నారు. పరిపాలన భవనం మెయిన్ రోడ్ గేట్ ముందు మీడియాను లోపలికి పంపించడం లేదు.ఇదిలా ఉండగా..తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్.అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
పుదుచ్చేరిలో తీవ్ర ఉద్రిక్తత.. స్కూల్ సీల్ చేసిన కలెక్టర్
కడలూరు: పుదుచ్చేరిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. బాలికపై ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనలకు దిగారు. పుదుచ్చేరి-కడలూరు రోడ్డుపైకి నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.వివరాల ప్రకారం.. తలవకుప్పంలో ఓ బాలికను ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో బాధితురాలు స్కూల్‌కు వెళ్లేందుకు భయంతో వణికిపోయింది. దీంతో, కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకున్నారు. టీచర్‌ను చితకబాదారు. పాఠశాలలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.#JUSTIN ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் பொதுமக்கள் தர்ம அடி கொடுத்து போலீசில் ஒப்படைத்தனர்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/3viBaLMA2j— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025అంతటితో ఆగకుండా.. పుదుచ్చేరి-కడలూరు రోడ్డును నిరసనకారులు బ్లాక్ చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో, పోలీసుల తీరుపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు నిరసనలను మరింత ఉధృతం చేశారు. పాఠశాల యాజమాన్యం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో దాదాపు నాలుగు గంటల ట్రాఫిక్ స్థంభించిపోయింది. అర్ధరాత్రి వరకు రోడ్లపైనే నిరసనలు తెలిపారు. #JUSTIN புதுச்சேரியில் ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை பள்ளியை அடித்து நொறுக்கிய போராட்டக்காரர்கள்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/yMVcvBXOKP— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025ఈ నేపథ్యంలో పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం, కలెక్టర్ కులోత్తుంగన్, సీనియర్ పోలీసు అధికారులు నిరసనకారులతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా పాఠశాలను సీల్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, రాత్రి జారీ చేసిన ఉత్తర్వులో పాఠశాలలో శనివారం జరగాల్సిన పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.புதுச்சேரியில் தவளக்குப்பம் அருகே, தனியார் பள்ளியில் மாணவிக்கு பாலியல் தொல்லை.மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் மீது வழக்கு பதியவில்லை என பெற்றோர் குற்றச்சாட்டு. @LGov_Puducherry pic.twitter.com/Zx9FHqQVqJ— Dhivya Marunthiah (@DhivCM) February 14, 2025 -
అనంత: నారాయణ కాలేజీ వద్ద ఉద్రికత్త
సాక్షి, అనంతపురం: నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాలు కాలేజీకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.అనంతపురం నారాయణ కాలేజీ వద్ద విద్యార్థులు సంఘాలు ఆందోళనలకు దిగాయి. మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేస్తున్నారు. కాగా, నారాయణ కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఇటీవల చరణ్ అనే విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం, విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు.. కొద్దిరోజుల క్రితమే నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ రూమ్‌లో అందరితో పాటు కూర్చున్న విద్యార్థి ఒక్కసారిగా లేచి వెళ్లి, చెప్పులు విప్పేసి కారిడార్ నుంచి కిందకు దూకేశాడు. దాంతో తరగతిలో ఉన్న లెక్చరర్‌తో పాటు విద్యార్థులంతా షాకయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చరణ్‌ను ఆసుపత్రికి తీసుకెళుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన కుమారుడు ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భోగి మంటలతో .. కూటమి సర్కార్‌పై వినూత్న నిరసన
విశాఖపట్నం/ విజయవాడ, సాక్షి: ఏపీలో ఇవాళ భోగి మంటలతో కూటమి సర్కార్‌కు నిరసన ఎదురైంది. ఇందులో భాగంగా.. స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. యాజమాన్యం ఇచ్చిన కార్మిక వ్యతిరేక సర్క్యులర్లను భోగి మంటల్లో వేసింది పోరాట కమిటీ.కూటమి ప్రభుత్వ తీరుకి నిరసనగా అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. విజయవాడలో భోగి పండుగ వేళ సీపీఎం వినూత్న నిరసనకు దిగింది. భోగిమంటల్లో కరెంట్ బిల్లులు వేసి తగలబెట్టింది. తక్షణమే ప్రజల పై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు , రాష్ట్రకార్యవర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, రాష్ట్ర నేత దోనేపూడి కాశీనాధ్ తదితరులు పాల్గొన్నారు. ‘‘విద్యుత్ బిల్లుల భారాలకు వ్యతిరేకంగా భోగి మంటల్లో బిల్లులను దహనం చేశాం. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి. విద్యుత్ భారాలు ప్రజల పై లేకుండా చూడాలి. డిస్కంలు అప్పులు పాలైతే ప్రజల నుంచి వసూళ్లు చేస్తారా?. .. ఈ సంక్రాంతి పండుగకు ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు ఇవ్వలేదు. P4 విధానం తెస్తున్నామని చంద్రబాబు గొప్పగా చెబుతున్నారు. P4 విధానం అంటే ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేయడమే. రాష్ట్రాన్ని సంపన్నం చేయడం కాదు.. సంపన్నులకు దోచి పెట్టడమే చంద్రబాబు విధానం. అనిల్ అంబానీ దివాలా తీసిన పారిశ్రామిక వేత్త. అటువంటి వారితో పెట్టుబడులు ఎలా పెట్టిస్తారు?. దివాలా తీసిన వారితో పెట్టుబడులు పెట్టించడమంటే రాష్ట్రాన్ని దివాలా తీయించడమే!. ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తే... మళ్లీ దోపిడీనే. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
కోతలే తప్ప చేతలు లేవు
సాక్షి. హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీది ప్రజాప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం. అది చేతల ప్రభుత్వం కాదు.. మాటలు, కోతల ప్రభుత్వం మాత్రమే’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ఇచి్చన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆ పార్టీ నాయకుల ఆర్థిక స్థితిలో మార్పు వచ్చిందే తప్ప ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. ఆశచూపి వెన్నుపోటు కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆశచూపి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రైతు లు, కూలీలు, కౌలు రైతుల డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉండగా.. మళ్లీ ఎందుకు దరఖాస్తులు అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘గతంలో దరఖాస్తులు తీసుకున్నారు..సర్వే చేశారు.. ఇప్పుడు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఎందుకు? రైతు భరోసా కింద ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు కూడా సంకెళ్లు వేసింది’అని విమ ర్శించారు. రైతులకు నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్లు నవంబర్ 30వ తేదీనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఆ డబ్బులు ఇంకా రైతు ల ఖాతాల్లో పడలేదని తెలిపారు.ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి రెండో వారంలో రైతుల సమస్యలు, హామీల అమలుపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల ఆఫీసర్లు, తహసీల్దార్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచినప్పుడు తమ ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రకటిస్తుందని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు కేంద్రం అండగా నిలుస్తుంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం దిల్ కుశ అతిథి గృహంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, సమగ్ర శిక్ష ప్రతినిధులు.. కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సమగ్ర శిక్ష కార్యక్రమ అమలుకు కేంద్రం తన వాటా కింద 60 శాతం నిధులు, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ఉద్యోగుల సంఘం నేతలు యాదగిరి, అనిల్ చారి తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందు కు సమగ్ర శిక్ష ఉద్యోగులు కృషి చేస్తున్నా, చాలీచాలని వేతనాల తో సతమతమవుతున్నామని వాపోయారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం ఇచ్చే 60 శాతం నిధుల వాటాను కొనసాగించాలని ఉద్యోగులు కిషన్‌రెడ్డిని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
చార్జీలపై సమరం నేడే
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో కరెంటు చార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి.. అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే రూ.15,485.36 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 27న (శుక్రవారం) కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా, ప్రజలకు తోడుగా నిలుస్తూ ఆందోళన చేపట్టాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. పెట్టుబడి సాయం అందక, కనీస మద్దతు ధర దక్కక, బీమా ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతకు అండగా నిలుస్తూ... రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరులో కర్షకులు కదం తొక్కారు. రైతుపోరు తరహాలోనే కరెంట్ చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టే ఆందోళనకు సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ పార్టీ జిల్లా అధ్యక్షులు.. ఆ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలతో కలిసి కరెంటు చార్జీల పెంపుపై కదనభేరి మోగిస్తూ పోస్టర్లను విడుదల చేశారు. ఆ పోస్టర్లను వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా గోడలకు అతికించి.. ప్రజలను చైతన్యవంతం చేశాయి. ఎన్నికల్లో కరెంటు చార్జీలను తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని.. జనవరి నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని మోపేందుకు సిద్ధమైన వైనాన్ని ప్రజలకు వివరించాయి. శీతాకాలంలోనూ కరెంటు బిల్లులు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని, రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇక చలికాలంలోనూ కరెంటు కోతలు విధిస్తుండటంతో దోమల బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు చార్జీల బాదుడు, కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తోడుగా నిలిచి తక్షణమే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధమైంది. విద్యుత్ శాఖకు సంబంధించిడిస్కంల సీఎండీ, ఎస్ఈ, డీఈఈ, ఏఈ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించి తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు.నిరంకుశత్వంపై పోరురాష్ట్రంలో పాలకులు అరాచకాలను ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ఎదిరించిన వారిని అంతమొందించేందుకు వెనుకాడటం లేదు. ఇదెక్కడి న్యాయమని అడిగితే ఇది మా రెడ్ బుక్ రాజ్యాంగమని చెబుతున్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియాలకు మళ్లీ రాష్ట్రంలో ఊపిరిపోసి, గంజాయి మత్తులో యువతని ముంచేస్తున్నారు. ఆడ బిడ్డలకు.. పసి పిల్లలకు రక్షణ లేకుండా అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు విద్యుత్ చార్జీలను భారీగా పెంచేసి రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు గత ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్‌ను సైతం దూరం చేస్తున్నారు. రూ.వేలల్లో బిల్లులు వేస్తూ రాక్షసుల్లా ప్రజల రక్తం తాగుతున్నారు. ఈ నిరంకుశ, దారుణ పాలనలో కష్టాల్లో ఉన్న ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతోంది. విద్యుత్ చార్జీలు పెంచబోమని, ఇంకా తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే రూ.15,485 కోట్ల భారం మోపారు. ఇందులో ఇప్పటికే రూ.6,072 కోట్లు వసూలును ప్రారంభించారు. వచ్చే నెల నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుతున్నారు. బడుగులపైనా బాదుడే..గతంలో టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు నెలకు 100 యూనిట్ల వరకూ మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక దీన్ని 200 యూనిట్లకు పెంచింది. తద్వారా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 22,31,549 మంది వినియోగదారులు అప్పట్లో అర్హత పొందారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వం 2018–19లో దీని కోసం రూ.235 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.637 కోట్లు ఖర్చు చేయడమే దీనికి నిదర్శనం. టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన ఎస్సీ, ఎస్టీల విద్యుత్తు వినియోగదారుల రాయితీ మొత్తం రూ.74.43 కోట్లను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ 200 యూనిట్లను ఎగ్గొడుతోంది. అర్హులకు పథకాన్ని దూరం చేస్తున్నారు. విద్యుత్‌పై చంద్రబాబుది ఎప్పుడూ ఒకే వైఖరి. ఇంధన రంగాన్ని ఆదాయ వనరుగానే చూడటం ఆయన నైజం. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడూ చార్జీల మోత మోగించారు. శ్లాబులు మార్చి, ఏమార్చి ప్రజలపై బిల్లుల భారం వేశారు. ఇదెక్కడి న్యాయమమని అడిగితే ఉమ్మడి రాష్ట్రంలో బషీర్‌బాగ్‌లో అమాయకులపై కాల్పులకు ఆదేశించి నిరంకుశంగా ప్రవర్తించారు. నిరసనకారులను గుర్రాలతో తొక్కించారు. ఇప్పుడు మళ్లీ అదే దారిలో ప్రజలపై చార్జీల పిడుగు వేస్తున్నారు.అదనపు భారాలు ఇలా..తాము వినియోగించిన యూనిట్లకు విధించే చార్జీలతో పాటు కూటమి ప్రభుత్వం అదనపు చార్జీలు కలపడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. వాడిన దానికి మించి విద్యుత్ బిల్లులు అదనంగా వసూలు చేస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని నవంబర్ నుంచి వినియోగదారులపై ప్రభుత్వం వేస్తోంది. ప్రతి యూనిట్‌కు సగటున రూ.1.27గా నిర్ణయించిన ఏపీఈఆర్సీ దీనిని 15 నెలల్లో వసూలు చేయాలని సూచించడంతో ప్రతి నెలా వినియోగదారులపై సర్దుబాటు భారం యూనిట్‌కు సగటున రూ.0.63 వేసి వసూలు చేస్తున్నారు. జనవరి నెల నుంచి ప్రజల మీద రూ.9,412.50 కోట్లతో ప్రభుత్వం మరో పిడుగు వేయనుంది. ఈ మొత్తం రానున్న 24 నెలలు వసూలు చేసుకోవాలని డిస్కంలకు ఏపీఈఆర్సీ సూచించింది. దీంతో జనవరి నుంచి విద్యుత్ వినియోగదారులపై యూనిట్‌కు రూ.1.08 చొప్పున అదనపు భారాలు పడనున్నాయి. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్ చార్జీలు పెంచడంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు ఈ బిల్లులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. వారికి అండగా వైఎస్సార్సీపీ నిలుస్తోంది. వేసిన అదనపు చార్జీలను ఉపసంహరించాలని, ఇకపై ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించనుంది.కరెంట్ బిల్లుల భారంతో యువకుడి ఆత్మహత్యాయత్నం» ఏలూరు జిల్లా గవరవరంలో ఉరి పోసుకున్న బాధితుడు» బిల్లు కట్టకపోవడంతో కనెక్షన్ తొలగించిన విద్యుత్తు సిబ్బంది» బాధితుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద మోహరించిన కూటమి పార్టీల నేతలుకొయ్యలగూడెం: షాక్ కొడుతున్న విద్యుత్తు బిల్లుల భారంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో చోటు చేసుకుంది. బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గవరవరం దళితవాడలో నివసిస్తున్న చాపల నాగేశ్వరరావు ఇంటికి విద్యుత్ బిల్లు రూ.2 వేలు వచ్చింది. ఇదివరకు నెలకు రూ.500 వచ్చేది. ఇప్పుడు ఒకేసారి అంత బిల్లు రావడంతో ఆయన కట్టలేకపోయాడు. దీంతో విద్యుత్ సిబ్బంది ఆయన ఇంటి సర్వీసు తొలగించారు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన నాగేశ్వరరావు తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు వెంటనే గుర్తించి తొలుత సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బాధితుడు చికిత్స పొందుతున్న జంగారెడ్డిగూడెంలోని ఆస్పత్రి వద్దకు రాత్రి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆస్పత్రి వద్దే మోహరించిన కూటమి నేతలు విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యత్నిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఎవరూ బాధితుడితో మాట్లాడకుండా ఆస్పత్రి వద్ద కాపలా కాస్తున్నారు. -
అమిత్ షా రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం/కవాడిగూడ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, వరంగల్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జిల్లా కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు అక్కడ కలెక్టర్‌ను కలిసి అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ వినతిపత్రాలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: భట్టి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలని భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మంలో ర్యాలీ అనంతరం భట్టి మాట్లాడుతూ.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. అందుకు అనుగుణంగా పాలన అందించకుంటే ఏ ప్రభుత్వా న్ని అయినా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తించదన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతోందంటే అందుకు రాజ్యాంగం, దాన్ని అందించిన అంబేడ్కరే కారణమని పేర్కొన్నారు. అలాంటి అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా కోరడం అందరి నైతిక హక్కు అని భట్టి చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బీజేపీ ముసుగు తొలగిపోయింది: టీపీసీసీ చీఫ్బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ ముసుగు తొలగిపోయిందన్నారు. రాజ్యాంగంపై నమ్మకమున్న ప్రతి పౌరునికి అమిత్ షా మాటలు బాధ కలిగించాయన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి అంబేడ్కర్‌పై ఎంత ద్వేషం ఉందో బయటపడిందని ఏఐసీసీ నేత కొప్పుల రాజు అన్నారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీగణేష్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్ ప్రవేశద్వారాల వద్ద ధర్నాలపై నిషేధం
న్యూఢిల్లీ: పార్లమెంట్ మకర ద్వారం వద్ద గురువారం అధికార, విపక్ష పారీ్టల సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట నేపథ్యంలో ఇలాంటివి పునరావృతంకాకుండా నివారించేందుకు లోక్‌సభ స్పీకర్ ఇకపై పార్లమెంట్ ప్రవేశద్వారాల వద్ద ధర్నాలపై నిషేధం విధించారు. ఎంపీలు, రాజకీయ నేతలు, విడివిడిగా, బృందంగా ఇకపై ఏవైపు గేట్ వద్ద కూడా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదని స్పీకర్ ఓం బిర్లా గురువారం కఠిన నియమాలను సూచించారు. -
‘అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ’..పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
సాక్షి,తాడేపల్లి:అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ నినాదంతో ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వెళ్లి వినతిపత్రాలు ఇస్తాం. వరి రైతులను ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడా. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు.ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకు కనీస మద్దతుధర దక్కడం లేదు.మంత్రి నాదెండ్ల ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందని చెప్పారు.ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామన్నారు. రెండు రోజులైనా రైతులు హాయ్ పెట్టినా..ఫోన్లు చేసినా ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.దళారులు ఎంటరైపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకంటే ఎక్కువకే ధాన్యాన్ని కొన్నాం.ఈ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. వానల భయంతో రైతులు ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.రైతులకు 20 వేలు ఇస్తామన్నారు కానీ నయాపైసా ఇవ్వలేదు. రైతుల వద్ద ధాన్యం కొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి’అని అంబటి డిమాండ్ చేశారు. -
పోటీ పరీక్షలపై ఆందోళన.. అభ్యర్థులపై లాఠీఛార్జ్
పట్నా:పబ్లిక్ సర్వీస్కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేసినందుకుగాను బీహార్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. ఈ విషయమై తాజాగా రాజధాని పట్నాలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం విమర్శలకు తావిస్తోంది.డిసెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే బీపీఎస్సీ ఈ పరీక్షలకు ఒక పూట-ఒక పేపర్ ఉండాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ‘అభ్యర్థులు ఎంత చెప్పినా వినకుండా బీపీఎస్సీ కార్యాలయం వైపునకు దూసుకెళ్లారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. అందుకే వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది’అని పోలీసు అధికారులు తెలిపారు.కాగా, ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారని, ఈ లాఠీఛార్జ్‌లో కొందరికి గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. అభ్యర్థులను చెదరగొట్టేందుకు తాము స్వల్ప లాఠీఛార్జ్ చేశామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఢిల్లీలో మళ్లీ కాల్పులు.. ఇద్దరి మృతి -
అభిశంసనలు.. ఆత్మహత్య... జైలు శిక్షలు!
దక్షిణ కొరియాలో తాజాగా ఎమర్జెన్సీ విధింపు తీవ్ర దుమారానికే దారితీసింది. విపక్షాల్లోని ఉత్తర కొరియా అనుకూల దేశద్రోహ శక్తుల ఏరివేత కోసమంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న నిర్ణయం దేశమంతటా అలజడి రేపింది. విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచీ దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలన్నీ కలిసి కొన్ని గంటల్లోనే పార్లమెంటు ఓటింగ్ ద్వారా మార్షల్ లాను ఎత్తేశాయి. దేశంపై సైనిక పాలనను రుద్దజూశారంటూ విపక్ష డెమొక్రటిక్ పార్టీ యూన్‌పై అభిశంసన తీర్మానమూ ప్రవేశపెట్టింది. దాంతో దేశం పెను రాజకీయ సంక్షోభంలో పడింది. అభిశంసనలు, జైలు, హత్యల వంటి మరకలు దక్షిణ కొరియా అధ్యక్ష చరిత్రలో పరిపాటే. నిజానికి ఆ దేశ రాజకీయ చరిత్రంతా తిరుగుబాట్లమయమే!విద్యార్థుల తిరుగుబాటు దక్షిణ కొరియా తొలి అధ్యక్షుడు సింగ్మన్ రీ 1960లో విద్యార్థుల భారీ తిరుగుబాటు దెబ్బకు రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటంతో యువతలో ఆయనపై ఆగ్రహం పెల్లుబుకింది. దిగిపోవ్సాఇందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. రాజీనామా అనంతరం రీ దేశ బహిష్కరణకు గురయ్యారు. హవాయికి వెళ్లిపోయి 1965లో మరణించేదాకా అక్కడే గడిపాల్సి వచి్చంది.సైనిక తిరుగుబాటు మరో అధ్యక్షుడు యున్ పో సన్ 1961లో సైనికాధికారి పార్క్ చుంగ్ హీ సైనిక తిరుగుబాటు వల్ల పదవీచ్యుతుడయ్యాడు. అయినా యున్‌కు కొంతకాలం పదవిలో కొనసాగేందుకు పార్క్ అనుమతించినా నెమ్మదిగా ప్రభుత్వాన్ని తన అ«దీనంలోకి తెచ్చుకున్నారు. తరవాత 1963 ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని యున్ స్థానంలో అధ్యక్షుడయ్యారు.రాజద్రోహం, జైలు గ్వాంగ్జు తిరుగుబాటును క్రూరంగా అణచివేసిన చున్ డూ హ్వాన్ 1987లో పదవి నుంచి వైదొలిగారు. భారీ నిరసనల ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. కొరియా యుద్ధ సమయంలో తన అనుచరుడు రోహ్ టే వూకు అధికారం అప్పగించారు. అనంతరం అవినీతి, హింసతో దేశం కుదేలైంది. దాంతో తిరుగుబాటు ఇతర నేరాల కింద చున్, రోహ్ రాజద్రోహం అభియోగాలను ఎదుర్కొన్నారు. చున్‌కు మరణశిక్ష విధించానా తరవాత జీవిత ఖైదుగా మార్చారు. రోహ్కు ఇరవై రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. రెండేళ్ల జైలు శిక్ష నంతరం ఇద్దరికీ 1998లో క్షమాభిక్ష లభించింది.అవినీతి, ఆత్మహత్య 2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఉన్న రో మూ హ్యూన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2009లో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంపన్న షూ తయారీదారు కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు విచారణలో ఉండగానే జీవితాన్ని అంతం చేసుకున్నారు. 15 ఏళ్ల జైలు శిక్ష 2008 నుంచి 2013 దాకా అధ్యక్షునిగా ఉన్న లీ మ్యూంగ్ బాక్కు అవినీతి కేసులో జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత కేసులో దోషిగా తేలిన సామ్సంగ్ సంస్థ చైర్మన్ నుంచి లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. దాంతో 2018లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 2022 డిసెంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు! అధ్యక్షురాలికి అభిశంసన, జైలు దక్షిణ కొరియా తొలి అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హై 2016లో అభిశంసన ఎదుర్కొన్నారు. తరవాత జైలు శిక్ష అనుభవించారు. ఆమె మాజీ నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె. 2013 నుంచి పదవిలో ఉన్నారు. సామ్సంగ్ వంటి సంస్థల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రహస్య పత్రాలను లీకేజీ, తనను విమర్శించే కళాకారులను బ్లాక్‌లిస్టులో పెట్టడం, వ్యతిరేకించిన అధికారులను తొలగించడం వంటి ఆరోపణలూ ఉన్నాయి. దాంతో 2017లో పార్క్ అభిశంసనకు గురయ్యారు. అభియోగాలు నిర్ధారణవడంతో 2021లో 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడ్డాయి. కానీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆమెకు క్షమాభిక్ష పెట్టారు. ఆ సమయంలో సియోల్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నది ప్రస్తుత అధ్యక్షుడు యూన్ కావడం విశేషం. పార్క్ తొలగింపు, జైలు శిక్ష విధింపులో ఆయనదే కీలక పాత్ర. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం(డిసెంబర్6) ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులు భారీగా నిరసనకు హాజరవనున్నారు.ఈ నిరసన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలను వారి ఇళ్ల వద్దే హౌస్ అరెస్టులు చేస్తున్నారు.పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కాగా, గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావు, పల్లారాజేశ్వర్రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కౌశిక్‌రెడ్డికి అర్ధరాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వగా హరీశ్‌రావు, పల్లారాజేశ్వర్రెడ్డిలను పోలీసులు సాయంత్రం విడుదల చేశారు. మాజీ మంత్రి హరీవ్‌రావు హౌస్ అరెస్టు..మాజీ మంత్రి హరీశ్‌రావును కోకాపటలోని తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ధర్నాలో పాల్గొనకుండా అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులపై హరీశ్‌రావు ఫైర్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించారు.ధర్నాకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యఎమ్మెల్సీ కవిత హౌస్ అరెస్ట్ ఎమ్మెల్సీ కవితన బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ధర్నాకు వెళ్లకుండా పోలీసులు కవితను అడ్డుకున్నారు. కవిత ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు.తెలంగాణభవన్‌కు చేరుకున్న కేటీఆర్.. భారీగా పోలీసులుబీఆర్ఎస్ హైదారబాద్ నగర ఎమ్మెల్యేలను, నేతలను ఇళ్లలో నుంచి బయటికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.మరోపక్క తెలంగాణభవన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు.తెలంగాణభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా తెలంగాణభవన్‌కు చేరుకుని ఇక్కడిక నుంచి ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు వెళ్లాల్సి ఉంది.కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హౌస్ అరెస్ట్..బీఆర్ఎస్ నిరసనకు వెళుతున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను శుక్రవారం ఉదయమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొంపల్లిలోని దండెమూడి ఎంక్లేవ్లోని కేపీ వివేకానంద్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు.కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం హౌస్ అరెస్ట్ఏం తప్పు చేశామని హౌస్ అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించిన మాధవరంప్రోటోకాల్ ప్రకారం అభివృధి కార్యక్రమాలకు పోలీసులను పిలిచానా స్పందించరుబీఆర్ఎస్ కార్పొరేటర్టు, నాయకులను మాత్రం హౌస్ అరెస్టు చేస్తారుఉదయాన్నే పోలీసులు ఇంటికి వచ్చి తమ పనులకు వెళ్లకుండా.. అడ్డుకోవడం దారుణంముషీరాబాద్, అంబర్‌పేట ఎమ్మెల్యేల నిర్బంధం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌లను క్వార్టర్స్‌లోనే నిర్బంధించిన పోలీసులు ఇదీ చదవండి: కౌశిక్‌రెడ్డి అరెస్టు..10 గంటల హైడ్రామా -
TG: దిలావర్పూర్లో మరోసారి ఉద్రిక్తత
సాక్షి,నిర్మల్‌జిల్లా: జిల్లాలోని దిలావర్పూర్లో బుధవారం(నవంబర్27) ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది. ఇక్కడ మంగళవారం జరిగిన ధర్నా సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేయడంపై గ్రామస్తులు బుధవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు.ఈ క్రమంలో శాంతిభద్రతలను కాపాడేందుకుగాను పోలీసులు గ్రామ ప్రజలను నిర్మల్- కళ్యాణ్ నేషనల్ హైవేపైకి రానివ్వలేదు. దీంతో పోలీసులను తరుముకుంటూ వారిపై రాళ్లదాడి చేస్తూ గ్రామస్తులు నేషనల్హైవేపైకి చేరుకున్నారు. పోలీసుల వాహనాలపైనా గ్రామస్తులు రాళ్లదాడి చేశారు. పరిస్థితి విషమించడంతో ఘటనాస్థలం నుంచి పోలీసులు తమ వాహనాలను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: నిర్మల్ పల్లెల్లో ఇథనాల్ మంట -
మణిపూర్‌లో మళ్లీ హింస, ఒకరు మృతి.. రంగంలోకి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రగులుతోంది. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా.. తాజాగా మళ్లీ హింస చెలరేగింది. కుకీలు, మైతీ తెగల మధ్య వైరంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మణిపూర్‌లోని లోయ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన నిరసనలు,. హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20యేళ్ల అతౌబా మృతిచెందాడు. బాబుపరా వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాబుపరా ప్రాంతంలో పలు పార్టీలకు చెందిన కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. జిరిబామ్ పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లోకి చొరబడిన ఆందోళనకారులు.. ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లి, ఆఫీసులను తగలబెట్టారు. దీంతో శాంతి భద్రతలకోసం భద్రతా దళాలు మోహరించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.చదవండి: బీజేపీలో చేరనున్న ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్మరోవైపు మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(సోమవారం) అధికారులతో సమావేశం కానున్నారు. హోం మంత్రిత్వ శాఖలోని ఈశాన్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా కుకీ మిలిటెంట్లు ఇటీవల జిరిబామ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో 11 మంది కుకీలు మృత్యువాతపడ్డారు. అనంతరం ఆరుగురు మైతీ వర్గానికి చెందిన వారిని మిలిటంట్లు బందీలుగా చేసి తీసుకెళ్లారు. వారి మృతదేహాలు లభ్యం కావడంతో జిరిబామ్ జిల్లాలో హింస చెలరేగింది. దీంతో దాదాపు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి కర్ఫ్యూ విధించారు అధికారులు. -
దీపావళి సంబరాల్లో ‘మాంసం, మద్యం’... స్టార్మర్ కార్యాలయం క్షమాపణలు
లండన్: దీపావళి సంబరాల్లో మాంసం, మద్యం చోటు చేసుకున్న ఉదంతంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం శుక్రవారం క్షమాపణలు తెలిపింది. దాన్ని అనుకోకుండా దొర్లిన తప్పిదంగా అభివర్ణించింది. ‘‘దీనిపై బ్రిటిష్ హిందూ సమాజం ఆందోళనలను అర్థం చేసుకోగలం. ఇకపై జరిగే సంబరాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని హామీ ఇచ్చింది. ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అక్టోబర్ 29న దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటిలో ప్రధాని ప్రధాని కియర్ స్టార్మర్ పాల్గొనడమే గాక దీపాలు వెలిగించారు. అయితే ఆ వేడుకల్లో మాంసం, మద్యం చోటుచేసుకోవడంపై హిందూ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డౌనింగ్ స్ట్రీట్ దీపావళి సంబరాలు హిందూ సమాజం విశ్వాసాలకు అనుగుణంగా జరగలేదంటూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ఇండియన్ ఎంపీ శివానీ రాజా గురువారం స్టార్మర్‌కు లేఖ కూడా రాశారు. ఇకముందు వాటినెలా జరపాలో వివరించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. -
‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు
వరదల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్పెయిన్‌లో లక్షలాది మంది రోడ్డెక్కారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ వాలెన్సియాలో శని, ఆదివారాల్లో ఆందోళనకు దిగారు. వాలెన్సియా రీజనల్ హెడ్ కార్లోస్ మజోన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. దాదాపు 1,30,000 మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాలెన్సియా సిటీ హాల్‌ను బురదతో నింపేశారు. కురీ్చలు, వస్తువులకు నిప్పు పెట్టారు. పలుచోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. వాలెన్సియా, పరిసర ప్రావిన్సుల్లో ఇటీవల కుండపోత వర్షాలకు వరద ముంచెత్తి 200 మందికి పైగా మరణించడం తెలిసిందే. 80 మందికి పైగా గల్లంతయ్యారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వీధులు బురద, శిథిలాల్లో కూరుకుపోయి ఉన్నాయి. స్పెయిన్ వాతావరణ సంస్థ అక్టోబర్ 25 నుంచే ఈ ప్రాంతానికి తుపాను హెచ్చరికలు జారీ చేసినా వరదలు మొదలయ్యే దాకా వాలెన్సియా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదు. వారి అలసత్వం వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని జనం మండిపడుతున్నారు. గత వారం పైపోర్టా పట్టణాన్ని సందర్శించిన స్పెయిన్ రాజు, రాణిపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అనంతరం ప్రధాని పెడ్రో సాంచెజ్‌పై గుడ్లు తదితరాలు విసిరి నిరసన తెలిపారు. – వాలెన్సియా -
కశ్మీర్ అసెంబ్లీలో ఆఖరి రోజూ ఆగని ఆందోళనలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఆఖరి రోజైన శుక్రవారం కూడా ఆందోళనల మధ్యే కొనసాగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చకు బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. గొడవకు దిగిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా.. జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను కేంద్రం త్వరలోనే ప్రారంభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంత హోదాతో పరిమిత అధికారాలతో అభివృద్ధిని, శాంతిభద్రతలను సాధించలేమని చెప్పారు. సమావేశాల సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షం నేత సునీల్ శర్మతోపాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఎన్సీ ఎమ్మెల్యే సజ్జాద్ షహీన్, మరొకరు హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ రథేర్ చెప్పారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
ఇజ్రాయెల్‌లో నిరసనలు
జెరుసలేం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్‌ను తొలగించడంతో అక్కడ నిరసనలు వెల్లువెత్తా యి. వీధుల్లోకొచ్చిన నిరసనకారులు ప్రధాని నెతన్యాహు రాజీనామా చేయాలని, కొత్త రక్షణ మంత్రి బందీ ఒప్పందానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెతన్యాహు దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. కొందరు ఆందోళనకారులు అయలోన్ హైవేపై నిప్పు పెట్టడంతో ఇరువైపులా రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్టోబర్ 7న హమాస్ బందీలుగా తీసుకున్న వ్యక్తుల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం కూడా గెలాంట్ను తొలగించడాన్ని ఖండించింది. తొలగింపును.. విడుదల ఒప్పందాన్ని పక్కకుపెట్టే ప్రయత్నాలకు కొనసాగింపుగా పేర్కొంది. రాబోయే రక్షణ మంత్రి యుద్ధం ముగింపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, అపహరణకు గురైన వారందరినీ తక్షణమే తిరిగి తీసుకురావడానికి సమగ్ర ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. రాజకీయ విభేదాలు... ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్ మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చే వివాదాస్పద ప్రణాళికలపై విభేదాలు రావడంతో నెతన్యాహు 2023 మార్చిలో తొలిసారిగా గాలెంట్‌ను తొలగించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో తిరి గి నియమించారు. ఈ సంఘటన ‘గాలెంట్ నైట్’ గా ప్రసిద్ధి చెందింది. అయితే గాజాకు యుద్ధానంత ర ప్రణాళిక సమస్యను పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలమైందని ఈ ఏడాది మేలో గాలెంట్ బ హిరంగ అసహనం వ్యక్తం చేశారు. గాజాలో పౌర, సైనిక పాలనను చేపట్టే యోచన ఇజ్రాయెల్‌కు లేదని నెతన్యాహు బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఇజ్రాయెల్ అల్ట్రా ఆర్థోడాక్స్ పౌరులను సైన్యంలో పనిచేయడం నుంచి మినహాయించే ప్రణాళికలపై గాలెంట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నెతన్యాహు స్పందిస్తూ ప్రత్యర్థి పాలస్తీనా గ్రూపులు హమాస్, ఫతాహ్లను ప్రస్తావిస్తూ.. హమస్తాన్ను ఫతాస్తాన్గా మార్చడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతల మధ్య విశ్వాస సంక్షోభం తొలగింపు దాకా దారితీసిందని నెతన్యాహు చెప్పారు. ఇటీవలి నెలల్లో ఆయనపై తన విశ్వాసం క్షీణించిందని, అతని స్థానంలో విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. ఇజ్రాయెల్ భద్రత నా జీవిత లక్ష్యం– గాలెంట్ కాగా, తొలగింపు అనంతరం గాలెంట్ స్పందించా రు. ఇజ్రాయెల్ భద్రత ఎప్పటికీ తన జీవిత లక్ష్యమ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు అంశాలపై విభేదాల కారణంగానే తనను పదవి నుంచి తొలగించినట్లు మంగళవారం రాత్రి పూర్తి ప్రకటన విడుదల చేశారు. సైనిక సేవకు మినహాయింపులు ఉండకూడదని, పాఠాలు నేర్చుకోవాలంటే జాతీయ విచారణ అవసరమని, బందీలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధంలో ఇజ్రా యెల్‌కు ప్రధాన మద్దతుదారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రోజునే గాలెంట్‌ను తొలగిచండం చర్చనీయాంశమైంది. నెతన్యాహు కంటే గాలెంట్కు వైట్ హౌస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ రక్షణకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ మంత్రి గాలెంట్ కీలక భాగస్వామిగా ఉన్నారని వైట్‌హౌ స్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు తెలిపా రు. సన్నిహిత భాగస్వాములుగా ఇజ్రాయెల్ తదుప రి రక్షణ మంత్రితో కలిసి పనిచేస్తామని చెప్పారు. -
రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరసన
-
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
గ్రూప్-1 ఆందోళనలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. శనివారం(అక్టోబర్19) సాయంత్రం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినపుడే జీవో నెంబర్ 29 ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1 నియామకాలు జరగలేదన్నారు. కొంత మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లు గ్రూప్ వన్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని హితవు పలికారు. కాగా గ్రూప్ వన్ రద్దు చేయాలని శనివారం ఉదయం గ్రూప్ వన్ అభ్యర్థులు హైదరాబాద్ అశోక్‌నగర్‌తో పాటు సచివాలయం వద్ద ఆందోళనలు చేశారు. వీరి ఆందోళనలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: గ్రూప్-1 రగడ..సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత -
మండపాలు వేదికగా నిరసనలు
నవరాత్రి ఉత్సవాలు అంటే.. బెంగాల్. బెంగాల్ అంటే నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈ సారి పండుగ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తరువాత.. దుర్గామాత మండపాలు సైతం నిరసనలను ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా బెంగాల్‌లోని దుర్గా పూజ మండపాల్లో దేవత నిలబడి ఉంటుంది. ఇరువైపులా వినాయకుడు, కార్తికేయుడు, దేవతలు లక్ష్మీ, సరస్వతులు ఉంటాయి. ఆమె పాదాల దగ్గర రాక్షసుడు ఉంటాడు. ఇంకొందరైతే మరికొంత విశాలంగా ఆలోచించి.. బుర్జ్ ఖలీఫా ప్రతీకనో, సుందర్బన్ అడవులనో ప్రతిబింబిస్తారు. ఇంకొందరు నీటి సంరక్షణ, ప్రపంచశాంతి వంటి సామాజిక సందేశాలను ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఇవేవీ జనాన్ని ఆకర్షించడం లేదు. చాలా మండపాలు నిరసన ప్రదర్శనలుగా మారాయి. వాటిని చూడటానికి కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. కోల్‌కతాలోని కంకుర్గచ్చిలో పూజ ఇతివృత్తంగా లజ్జ(õÙమ్)ను ఎంచుకున్నారు. దుర్గాదేవి కళ్లు మూసుకుని ఉండగా.. తెల్లని షీటుతో చుట్టిన ఒక మహిళ శరీరంపై ఓ సింహం నిఘా పెట్టింది. పక్కనే బాధిత కుటుంబాన్ని ప్రదర్శించారు. మంచంపై కూర్చున్న తల్లి, కుట్టు మిషన్ దగ్గర కూర్చున్న తండ్రి, గోడపై కుమార్తె ఫొటో ఉన్నాయి. మహిళల ఆధ్వర్యంలో నడిచే ఓ మండపం థీమ్ వివక్ష. ఈ సంవత్సరం వారు దుర్గా పూజను పండుగ అని కాకుండా ప్రతిజ్ఞ అని పిలుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని, అందులోని అధికరణలను నేపథ్యంగా తీసుకున్నారు. ఒక మహిళ న్యాయం చేయాలనే రెండు చేతులు పైకెత్తి శూన్యంలోకి సహాయం కోసం అరి్ధస్తోంది. ‘రాజ్యాంగం చెప్తున్నదేమిటి? వాస్తవానికి జరుగుతున్నదేమిటి?’అంటూ స్థానిక నటులు వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. మరోచోట దేవత శక్తిని.. నిరసనల్లోని కొవ్వొత్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని బాఘా జతిన్ మండపం... దుర్గా మాతను మరింత భయానకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వేడుకలు జరుపుకొనే ఉత్సాహం లేదని.. అందుకే డ్యాన్సులను రద్దు చేసుకున్నామని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దళిత సంఘాల కన్నెర్ర
సాక్షి నెట్వర్క్: ఎమ్మెల్యేలు కె.రఘురామకృష్ణరాజు, పంతం నానాజీ దురాగతాలపై దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. వారిద్దరి తీరుపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి తెగబడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నేతలు నినదించారు. విశాఖ ఎల్ఐసీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత హక్కుల పోరాట సమితి, భీమ్‌సేన, కేవీపీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రఘురామకృష్ణరాజు దురాగతాన్ని హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావును దూషించి దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుడి ఘటనపై స్పందించని కాకినాడ ఎస్పీ, కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని కోరారు. కాగా.. ఉండి ఎమ్మెల్యే రఘురామ తీరుపై పల్నాడు జిల్లా అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. రఘురామను శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నాయకుడు తోకల సూరిబాబు, మండల సీఐటీయు కార్యదర్శి బి.సూరిబాబు, వైఎస్సార్సీపీ కారి్మక విభాగం నాయకుడు దారా ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు అంబేడ్కర్‌ను అవమానపరిచిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు బాపట్ల జిల్లా రేపల్లెలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైభీమ్ యాక్సెస్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. తక్షణ చర్యలకు కార్పొరేటర్ల డిమాండ్ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్టరాజు, దళిత డాక్టర్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను, దళిత డాక్టర్‌ను అవమానించిన ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలను అడ్డుకునేందుకు జనసేన, టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారు వెనక్కి తగ్గలేదు.డీజీపీకి మెమోరాండం అంబేడ్కర్ ఫొటోతో ఫ్లెక్సీ చించేసి దళితుల్ని అవమానపర్చిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, దళిత ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు పీవీ రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ విజయవాడలో తెలిపారు. మంగళవారం డీజీపీని కలిసి ఈ మేరకు మెమోరాండం అందజేసినట్టు తెలిపారు. ఇద్దర్నీ అరెస్ట్ చేయాల్సిందే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. -
నిరసనలు కేంద్రం కుట్ర: మమత
కోల్‌కతా: వైద్యురాలి హత్యాచారంపై నిరసనల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. వామపక్షాలూ ఈ కుట్రలో భాగమయ్యాయన్నారు. సచివాలయం నబన్నాలో సోమవారం ఒక అధికారిక సమీక్షలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఉదంతంలో నెలరోజులుగా బెంగాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలి తల్లిదండ్రులకు తానెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని మమత అన్నారు. ఈమేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దుర్గాపూజ సమీపిస్తున్నందున నిరసనలు వీడి.. పండుగ ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలను కోరారు. ‘వైద్యురాలి కుటుంబానికి నేనెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదు. అభాండాలు వేస్తున్నారు. కూతురి జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టదలిస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుందని తల్లిదండ్రులకు చెప్పాను. ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు. నిరసనలు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్రే. కొన్ని వామపక్ష పార్టీలకు ఇందులో భాగస్వామ్యముంది. పొరుగుదేశంలో అస్థిరత చూసి.. ఇక్కడా అలాంటి ఆందోళనలు రేకెత్తించాలని కొందరు చూస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లు రెండు వేర్వేరు దేశాలని వారు మర్చిపోయారు’ అని మమత ధ్వజమెత్తారు. ఆందోళన నేపథ్యంలో కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, దుర్గాపూజ వేళ శాంతి భద్రతలపై పట్టున్న అధికారి అవసరం ఉందని దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. -
ర్యాలీలతో హోరెత్తిన కోల్‌కతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో వైద్యురాలి హత్యోదంతంపై కోల్‌కతా నగరంలో ఆదివారం మరోమారు నిరసనలు మిన్నంటాయి. విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు, కుమ్మరి కారి్మకులు, రిక్షావాలాలు... ఇలా వేర్వేరు రంగాలకు చెందిన వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు సైతం వీటిలో పాల్గొన్నారు. దోషులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. పలు ర్యాలీలో అమ్మాయిలు దుర్గా మాత వేషాల్లో పాల్గొన్నారు. ‘ఇంకెంత కాలం?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పశి్చమబెంగాల్‌లోని పలు పట్టణాల్లోనూ నిరసనలు కొనసాగాయి. మరోవైపు, వైద్యురాలి హత్యోదంతంపై రాష్ట్ర కేబినెట్‌ను అత్యవసరంగా సమావేశపరిచి చర్చించాలని మమత సర్కారును గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆదేశించారు. -
IMA: ‘న్యాయం కోర్టుకు వదిలేసి.. వెంటనే విధుల్లో చేరండి’
ఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు , వైద్య సిబ్బంది, మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే పశ్చిమబెంగాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తిరిగి విధుల్లో చేరాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది.‘ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ ఘటన దేశంలో ఉన్న ప్రతిఒక్కరి మనస్సును కదిలించింది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను దేశం తన కుమార్తెగా భావించింది. అయితే మొత్తం మెడికల్ కమ్యూనిటీ సుప్రీంకోర్టుకు ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. వెంటనే విధుల్లోకి చేరి.. వైద్యసేవలు ప్రారంభించండి. న్యాయం జరగటం గురించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వదిలేయండి. రోగుల సంరక్షణ, భద్రత వైద్య వృత్తి ప్రధాన విధి. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది. డాక్టర్ల రక్షణ కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్లు తమను నమ్మాలని.. వైద్యం నిలిపివేయవద్దని ఇప్పటికే సుప్రీం కోర్టు తెలియజేసింది’ అని లేఖలో పేర్కొంది.ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు.. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించి సాక్ష్యాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు, వైద్య సిబ్బందికి మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లు భారీగా నిరసనలు చేపట్టారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో దారుణం జరిగింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కలి్పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు రక్షణ కలి్పస్తామని హామీ ఇచ్చారు. నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచి్చ, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరొకడి కోసం గాలింపు ముమ్మరం చేశామని అస్సాం డీజీపీ జి.పి.సింగ్ చెప్పారు. ముష్కరుల ఆగడాలను అడ్డుకుంటాం బాలికపై అత్యాచారం గురించి తెలియగానే శుక్రవారం అస్సాం అట్టుడికిపోయింది. జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిçపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఘటన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అస్సాంలో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా రెచి్చపోతున్నారని, వారి ఆగడాలను కచి్చతంగా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గత రెండు నెలల్లో 23 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనసాగుతున్న వలసల వల్ల స్థానికులు మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్పారు. -
మాకేదీ రుణమాఫీ?
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ ప్రకటించిన తర్వాత కూడా తమకు రుణాలు మాఫీ కాలేదంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చాలాచోట్ల రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, జైనథ్, బోథ్, భీంపూర్ మండలాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. తలమడుగులో 500మందికి పైగా రైతులు సీఎం దిష్టిబొమ్మతో డప్పుచప్పుళ్ల మధ్య శవయాత్ర నిర్వహించారు. కర్మకాండ కుండలతోనే మహారాష్ట్ర బ్యాంకులోనికి వెళ్లారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. జైనథ్ మండలం గిమ్మలో రైతులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు. తర్వాత బ్యాంకు అధికారుల వినతిమేరకు తాళాలు తొలగించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌లో రైతు జక్కుల లచ్చన్న పంచాయతీ కార్యాలయం వద్ద విషగుళికలు తిని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడ ఉన్న మరో రైతు అడ్డుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.⇒ నిజామాబాద్ జిల్లా 63 నంబరు జాతీయ రహదారి వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్, మోర్తాడ్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు.⇒తమకు రుణమాఫీ కాలేదంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్ శాఖ ఇండియన్ బ్యాంక్‌ను ముట్టడించి రైతులు షట్టర్‌ను మూసివేశారు. తర్వాత అధికారులు, పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఈ నెల 20న రైతు వేదికలో చర్చిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఆ బ్యాంక్ పరిధిలోని ఆరు గ్రామాలకు సంబంధించి సుమారు 1,250 మంది రైతులకు ఖాతాలుండగా కేవలం 430 మందికే రుణమాఫీ జరిగిందన్నారు. ⇒ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్‌రోడ్డు వద్ద కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. రుణమాఫీ జాబితాలో తమ పేర్లులేవంటూ సుమారు 500 మంది రైతులు బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. ⇒ జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లోని రైతువేదికలో వ్యవసాయశాఖ, లీడ్ బ్యాంక్ అధికారులతో నిర్వహించిన రుణమాఫీ అవగాహన సమావేశం రసాభాసగా ముగిసింది. మూడో విడతలో కూడా తన పేరు లేకపోవడంతో ఏలేటి రాజారెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. ⇒ బౌరంపేట్లోని బ్యాంక్‌లో 632 మంది రైతులు రుణం పొందితే కేవలం 14 మందికే రుణమాఫీ అయ్యిందని, మిగతా రైతులకు ఎందుకు మాఫీ చేయలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.⇒ఖమ్మం రూరల్, కొనిజర్ల, వైరా, రఘునాథపాలెం తదితర మండలాల రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేపట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.రుణమాఫీ రూ.83తిమ్మాపూర్: కేవలం రూ.83 మాత్రమే రుణమాఫీ కావడంతో ఓ రైతు కంగుతిన్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతు వేల్పుల మల్లయ్యకు రూ.83 మాఫీ అయినట్టు మొబైల్‌కు సందేశం వచ్చింది. గత డిసెంబర్లో ఎల్ఎండీలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో రూ.1.50 లక్షల పంటరుణం తీసుకున్న మల్లయ్య మూడో విడతలో మాఫీ అవుతుందని సంతోషించాడు.కానీ.. రూ.83 రుణఖాతాలో జమ అయినట్లు ఇటీవల మెసేజ్ వచ్చింది. షాక్‌కు గురైన ఆయన శనివారం వ్యవసాయాధికారులను సంప్రదించగా, వారు బ్యాంకు స్టేట్మెంట్ తీసుకురావాలని సూచించారు. అయితే అప్పటికే బ్యాంక్ టైం అయిపోవడంతో చేసేదేమీలేక వెనుదిరిగాడు. మాఫీకి ప్రభుత్వం విధించిన నిబంధనలకు తాను అర్హుడినని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. -
బీజేపీ, సీపీఎం నేతలా నన్ను ప్రశ్నించేది: సీఎం మమత ఫైర్
బెంగాల్లో టీఎంసీలు నిరసనలు అప్డేట్స్.. 👉బెంగాల్లో సీపీఎం, బీజేపీ పార్టీలపై సీఎం మమత సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారని మమతా బెనర్జీ ఆరోపించారు.👉హత్యాచార ఘటనకు మమతా బెనర్జీ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మమత మాట్లాడుతూ..‘సీపీఎం, బీజేపీ కార్యకర్తలు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆస్పత్రిలోకి ప్రవేశించి అరాచకం సృష్టించారు. ఈ విషయం నాకు తెలుసు. సీపీఎం కార్యకర్తలు డీవైఎఫ్ఐ జెండాలతో, బీజేపీ కార్యకర్తలు జాతీయ పతాకాలు చేతిలో పట్టుకుని అరాచకానికి తెగబడ్డారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. జాతీయ పతాకాన్ని దుర్వినియోగం చేసిన వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు.#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, "I know that CPM and BJP vandalised RG Kar Medical College and Hospital...They went there at 12-1 am in the night, the video shows that CPM took the DYFI flag and BJP took the national flag. They have misused the national… pic.twitter.com/WzEPz1Q0CT— ANI (@ANI) August 16, 2024👉మణిపూర్ భగ్గుమన్నప్పుడు బీజేపీ, సీపీఎంలు ఎన్ని బృందాలను అక్కడికి పంపాయని ఆమె ప్రశ్నించారు. హథ్రాస్, ఉన్నావ్‌కు ఎన్ని బృందాలను ఈ పార్టీలు పంపాయని మమత నిలదీశారు. మణిపూర్, యూపీల్లో అరాచకాలు జరిగినప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. సీపీఎం, బీజేపీ తనను బెదిరించలేవని, ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే తాము ఇక్కడ వరకూ వచ్చామని పేర్కొన్నారు. 👉పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.👉కాగా, హత్యాచారం ఘటనను ఖండిస్తూ కోల్‌కతాలో సీఎం మమతా, టీఎంసీ నేతలు శుక్రవారం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు. #WATCH | West Bengal CM Mamata Banerjee holds a protest against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in Kolkata She is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/3wkc3V1aza— ANI (@ANI) August 16, 2024 #WATCH | West Bengal CM Mamata Banerjee takes out a rally against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in KolkataShe is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/z8rBxRuqGn— ANI (@ANI) August 16, 2024 -
సెబీ చీఫ్‌పై ఆరోపణలు: దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
ఢిల్లీ:అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఆమెను సెబీ ఛైర్ పర్సన్‌గా తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆమెను ఛైర్మన్ పదవి నుంచి తొలిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 22 దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు భైఠాయించి నిరసనలు తెలుపుతాం. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇన్ఛార్జ్లు, పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదానీ గ్రూప్, సెబీకి సంబంధించిన అతిపెద్ద కుంభకోణంపై చర్చించాం. అదానీ మెగా స్కామ్‌పై జేపీసీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.చదవండి: ముగిసిన ఏఐసీసీ మీటింగ్.. సెబీ, అదానీలే టార్గెట్ -
నిందితులెవరో తేల్చకుండా బెదిరింపులా?
సాక్షి, అమరావతి: రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం ఘటన కేసు దర్యాప్తులో విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించిన ఆగంతకులెవరో తేల్చకుండా.. ఆ సంఘటనను వక్రీకరించిన పత్రికలు, సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించడంపై విస్తుపోతున్నారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పి0చడం కాదా? అని నిలదీస్తున్నారు.విజయవాడ నడిబొడ్డున రాజ్‌భవన్, పోలీసు కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలోని అంబేడ్కర్ స్మృతివనంలో సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు ఈనెల 8న రాత్రి కొందరు దుండగులు తెగబడ్డారు. స్మృతివనంలో పనిచేస్తున్న సిబ్బందిని రాత్రి 9 గంటలకు అక్కడి నుంచి బయటకు పంపి లైట్లన్నీ ఆర్పేసి సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ సీఎం జగన్ పేరును ధ్వంసం చేశారు. ఈ ఘటన జరుగుతుండగానే మీడియా ప్రతినిధులు పోలీసు కమిషనర్‌కు తెలిపేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. స్మృతివనం వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులను చూసి ఆగంతకులు పారిపోయారు. లేదంటే అంబేడ్కర్ విగ్రహం విధ్వంసానికి గురయ్యేదని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యోన్మాదంపై ఆగ్రహజ్వాల.. సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని బాబా సాహెబ్ అంబేడ్కర్ నినదించి ఆగస్టు 8వతేదీ నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అదే రోజు విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై టీడీపీ మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడంపై ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు మండిపడుతున్నారు. అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటనలో నిందితులెవరో తేల్చాలని ఉద్యమిస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారని స్పష్టం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతో ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో అంబేడ్కర్ విగ్రహంపై దాడి జరిగినట్లు స్పష్టమవుతోందని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేసేందుకు తెగబడ్డ ఉన్మాదులెవరో తేల్చకుండా కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు వక్రీకరించి దు్రష్ఫచారం చేస్తూ సామాజిక వర్గాలు, దళిత సంఘాలను రెచ్చగొడుతూ వైషమ్యాలను సృష్టిస్తున్నాయని విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖరబాబు వ్యాఖ్యానించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.సీపీ గారూ.. సమాధానం చెబుతారా?» రాజ్‌భవన్, పోలీసు కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న స్మృతివనంలో లైట్లన్నీ ఆర్పేసి అంబేడ్కర్ విగ్రహంపై కొందరు ఆగంతకులు దాడి చేయడం భద్రతా వైఫల్యం కాదా? » అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేస్తున్నారనే సమాచారాన్ని మీడియా మీకు అందించడానికి ప్రయత్నించినప్పుడు మీరు అందుబాటులోకి రాలేదన్నది వాస్తవం కాదా? » మీడియా ప్రతినిధులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున స్మృతివనం వద్దకు చేరుకోవటాన్ని చూసే కదా ఆగంతకులు పారిపోయారు? ఆ తర్వాతే అక్కడికి పోలీసులు వచ్చారన్నది నిజం కాదా? » అంబేడ్కర్ స్మృతివనం చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. వాటి ఫుటేజీని బయటపెట్టి నిందితులెవరో ఎందుకు తేల్చరు? » సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కనుసన్నల్లో ఎంపిక చేసిన పచ్చమూకలే అంబేడ్కర్ విగ్రహంపై దాడికి తెగబడ్డాయన్న నిజం బయటపడుతుందనే సీసీ ఫుటేజీని బహిర్గతం చేయడం లేదా? ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది పోయి ఖూనీ చేసిన వారికి వత్తాసు పలకడం కాదా? » సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును అప్పటికే ధ్వంసం చేశారు. స్మతివనం వద్దకు మీడియా, అంబేడ్కర్ ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు చేరుకునే సరికి ఆగంతకులు పారిపోయారు. లేదంటే అంబేడ్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేసే వారన్నది వాస్తవం కాదా? » అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటనను బహిర్గతం చేయడం మీ దృష్టిలో వక్రీకరించడమా? అది సామాజిక వర్గాలను, దళిత సంఘాలను రెచ్చగొట్టి వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడమా?


