ట్రంప్‌కు బిగ్‌ షాక్‌.. | No Kings protests On Trump policies At USA | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు బిగ్‌ షాక్‌.. అమెరికాలో హోరెత్తిన నిరసనలు

Oct 19 2025 7:16 AM | Updated on Oct 19 2025 8:54 AM

No Kings protests On Trump policies At USA

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ భారీ సంఖ్యలో అమెరికన్లు.. ‘నో కింగ్స్‌’ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఇక, అమెరికన్లకు మద్దతుగా లండన్‌ నుంచి వాషింగ్టన్‌ వరకు యూరప్‌ దేశాల్లోనూ వీరికి సపోర్టు లభించింది. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా గ్రేట్‌, సంస్కరణల పేరుతో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వీసాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, షట్‌డౌన్‌ వంటి నిర్ణయాల కారణంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో వందలాది ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు. ఆయన పాలనాతీరు, విధానాలపై అనేక దేశాలతోపాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై గతంలో కూడా నిరసనలు చేపట్టిన అమెరికన్లు తాజాగా మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ‌

‘నో కింగ్స్‌’ (No Kings protests) పేరుతో ఆందోళనలు జరుగుతున్నాయి. యాభై రాష్ట్రాల్లో దాదాపు 2500లకుపైగా ప్రదేశాల్లో నిరసనలు చేపట్టారు. పలు ఐరోపా దేశాల్లోనూ వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అమెరికా రాజధాని ప్రాంతం అంతటా నిరసనకారులు కవాతు చేశారు. ఉత్తర వర్జీనియాలో, వాషింగ్టన్ డీసీకి వెళ్లే దారిలో ఓవర్‌పాస్‌లపై నిరసనకారులు కవాతు చేస్తూ కనిపించారు. భారీ సంఖ్యలో ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు.

ట్రంప్‌ స్పందన..
మరోవైపు.. తాజా ఆందోళనలపై ట్రంప్‌ ఫాక్స్ బిజినెస్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. వారంతా నన్ను రాజు అని అంటున్నారు. కానీ, వారు చెబుతున్నట్లుగా తాను రాజును కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజా నిరసనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు. ఇక, అమెరికన్ల నిరసనలను వైట్‌హౌస్‌తో పాటు రిపబ్లికన్లు తోసిపుచ్చారు. ఈ ర్యాలీల్లో పాల్గొనేవారంతా అమెరికా రాజకీయాలకు దూరంగా ఉండేవారేనని.. ఇవి ‘హేట్‌ అమెరికా’ నిరసనలని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement