
ఢిల్లీ: లద్దాఖ్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో నలుగురు మృతిచెందగా, 50 మందికిపైగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. లేహ్ నగరంలో ఆందోళన కారులు బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. పెద్ద సంఖ్యలో యువత నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిరసనలపై కేంద్రం బ్యాన్ విధించింది. ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది.
హింస చెలరేగడంతో లద్దాఖ్ ఉద్యమకారుడు, విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన 15 రోజుల దీక్ష విరమించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయన దీక్షను ముగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నగరంలో ఆంక్షలు విధించారు. వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. ఇది ‘జెన్-జెడ్ విప్లవం’గా అభివర్ణించారు. లద్దాఖ్‌ను 6వ షెడ్యూల్ కింద చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రదర్శనలపై నిషేధం విధించిన ప్రభుత్వం.. శాంతి భద్రతల దృష్ట్యా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడే సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ముందుగా అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటనలు చేయరాదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను 2019 ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో.. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళనకారులు లేహ్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.
#WATCH | Leh, Ladakh: Security heightened in Leh amid a protest by the people of Ladakh demanding statehood and the inclusion of Ladakh under the Sixth Schedule pic.twitter.com/dBIYbVPMwo
— ANI (@ANI) September 24, 2025