ఆరావళి నిర్వచనంపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: పర్యావరణ సంబంధ అంశాల్లో మోదీ ప్రభుత్వం చెప్పేదానికి, చేసేదానికి పొంతనే లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆరావళి శ్రేణికి సంబంధించి పర్వ తాలపై కేంద్రం తాజాగా తీసుకువచ్చిన నిబంధనలతో 90% పర్వత ప్రాంతాలకు ఎటువంటి రక్షణ ఉండదని, మైనింగ్, రియల్ ఎస్టేట్ తదితర కార్యకలాపాలతో వాటి మనుగడే ప్రమాదంలో పడుతుంద ని తెలిపింది.
ఆరావళికి సంబంధించి మో దీ ప్రభుత్వం ఇచ్చిన తాజా నిర్వచనం నిపుణుల సూచనలకు విరుద్ధం, ప్రమాద కరమని పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గురువారం ఎక్స్‌లో ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ రక్షణ చట్టాలను బలహీనం చేయడం, కాలుష్య నిబంధనలను సడలించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంతో ప్రయత్నిస్తోందని ఆరో పించారు. మరోవైపు, తప్పుడు సమా చారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందంటూ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు.


