రీల్‌ చేస్తుండగా ఉరి బిగుసుకుని.. | uttar Pradesh woman dies in tragic accident | Sakshi
Sakshi News home page

రీల్‌ చేస్తుండగా ఉరి బిగుసుకుని..

Feb 9 2026 1:12 PM | Updated on Feb 9 2026 1:25 PM

uttar Pradesh woman dies in tragic accident

బాందా(యూపీ): సోషల్‌ మీడియాలో ఉరికి సంబంధించిన వీడియోల కోసం పదేపదే సెర్చ్‌ చేసిన ఓ మహిళ.. తానూ అలాంటి ఓ వీడియో తీసి పోస్ట్‌ చేయాలనుకుంది. ఇందుకోసం చీరను పైకప్పుకు కట్టి, మెడకు ఉరి బిగించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. తన నాలుగేళ్ల కూతురికి సెల్‌ఫోన్‌ ఇచ్చి, వీడియో స్టార్ట్‌ చేసి తగు సూచనలు చేసింది. చీరతో ఉరి వేసుకున్నుట్ల నటించడం మొదలుపెట్టింది. 

ఇంతలోనే అనుకోకుండా ఆమె కాలు జారి ఉరి బిగుసుకుంది. షూట్‌ చేస్తున్న చిన్నారి ఇదంతా నటనే అనుకుంది. కొద్ది సేపటికి తల్లి చీరకు వేలాడుతుండటంతో ఏడ్వడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారు వచ్చి, కిందికి దించారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మోహిని అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. యూపీలోని బాందా జిల్లా బబెరు పట్టణంలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement